న్యూఢిల్లీ : చార్‌ధామ్ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న మహబూబ్నగర్ జిల్లాకు చెందిన 150మంది యాత్రికులు క్షేమంగా ఉన్నారు. వారంతా గంగోత్రిలో ఉన్నట్లు సమాచారం అందింది. కమ్మగిరి స్వామి నేతృత్వంలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు చార్ధాయ్ యాత్రకు వెళ్లారు. తామంతా క్షేమంగా ఉన్నట్లు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు.
మరోవైపు ఉత్తరాఖండ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రుద్రప్రయాగ, చమోలీ జిల్లాల్లో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. చార్‌ధాయ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు అష్టకష్టాలు పడుతున్నారు. శుక్రవారం కేదార్‌లోయ, హేమ్‌కుంద్ సాహిబ్, బద్రీనాథ్ ప్రాంతాల నుంచి హెలీకాప్టర్ల ద్వారా 900 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
గంగోత్రిలో పాలమూరు జిల్లా యాత్రికులు క్షేమం
Published Sat, Jun 27 2015 1:07 PM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM
Advertisement