శబరిమలలో రూ. ₹6.12 కోట్లతో స్పెషాలిటీ ఆస్పత్రి | Kerala to Build ₹6.12 Crore Specialty Hospital at Neelakkal Ahead of Sabarimala Season | Sakshi
Sakshi News home page

యాత్రికులు, నివాసితుల సౌకర్యార్థం రూ. ₹6.12 కోట్లతో స్పెషాలిటీ ఆస్పత్రి

Nov 4 2025 12:48 PM | Updated on Nov 4 2025 1:03 PM

Specialty hospital to come up at Nilackal for Sabarimala pilgrims

శబరిమల యాత్రా కాలం ప్రారంభానికి ముందే నీలక్కల్‌లో రూ.6.12 కోట్లతో అధునాతన స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు కేరళ ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. ఈ ఆసుపత్రిని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు(TDB) కేటాయించిన స్థలంలో నిర్మించనున్నారు. మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. 

ఈ సౌకర్యం నివాసితులకు, ఆలయాన్ని సందర్శించే లక్షలాది యాత్రికులకు ఉపయోగపడుతుందని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. నిజానికి ఈ ఆస్పత్రి ఏర్పాటు శబరిమల యాత్రికుల శ్రేయస్సుని నిర్థారించడంలో ప్రభుత్వ నిబద్దతను ప్రతిబింబిస్తుందని మంత్రి వీణా జార్జ్‌ పేర్కొన్నారు. 

సుమారు పదివేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు ఔట్ పేషెంట్ గదులు, అత్యవసర విభాగం, ఐసియు,నర్సుల స్టేషన్ , ఇసిజి గది, ఫార్మసీ వంటివి ఉంటాయన్నారు. మొదటి అంతస్థులో ఎక్స్‌రే, బహుళ ఆపరేటింగ్‌ స్క్రభ్‌ స్టేషన్‌ తదితరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నీలక్కల్ బేస్ క్యాంప్‌కు రోడ్డు మార్గంలో వచ్చే యాత్రికులకు అత్యవసర,సాధారణ వైద్య సహాయాన్ని ఈ ఆస్పత్రి గణనీయంగా బలోపేతం చేస్తుందని మంత్రి వీణా జార్జ్‌ అన్నారు. నీలక్కల్‌ ఆలయ సమపంలోనే ఈ ఈ ఆస్పత్రి నిర్మాణ ప్రారంభోత్సవం జరగునుంది. 

దీనికి ఎమ్మెల్యే ప్రమోద్ నారాయణ్ , ఎంపీ ఆంటో ఆంటోనీ , డిప్యూటీ స్పీకర్ చిత్తయం గోపకుమార్ , జిల్లా పంచాయతీ అధ్యక్షుడు జార్జ్ అబ్రహం , టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తదితరులు హాజరు కానున్నారు. కాగా, నవంబర్‌ 16 నుంచి ప్రారంభమయ్యే రెండు నెలల వార్షిక తీర్థయాత్ర కాలంలో భారతదేశం, విదేశాల నుంచి వేలాది భక్తులు శబరిమలను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు.

(చదవండి: Chithira Thirunal Balarama Varma: 'చిత్తర అట్టవిశేషం'..!మాలధారులు సందర్శనం కంటే ముందు..!)


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement