Gangotri
-
రేపటి నుంచి కేదార్నాథ్ ఆలయం మూసివేత
చార్‌ధామ్‌గా ప్రసిద్ది చెందిన హిందూ పుణ్యక్షేత్రాలైన గంగోత్రి, యుమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల తలుపులు మూతపడనున్నాయి. చలికాలం రావడంతో అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నాలుగు ఆలయాలను ఆరు నెలలపాటు మూసివేయానున్నారు. ఆ తర్వాత మళ్లీ వేసవికాలంలో చార్ధామ్ యాత్ర కొనసాగుతుంది.కాగా ఈ ఏడాది మే 10వ తేదీన ప్రారంభం అయిన చార్ధామ్ యాత్ర ముగింపు దశకు చేరుకోగా.. ఈ నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులను శనివారం మధ్యాహ్నం 12.14 గంటలకు మూసివేశారు. చార్‌ధామ్‌లో కీలకమైన కేదార్నాథ్ ఆలయాన్ని ఈ నెల 3వ తేదీన ఉదయం 8.30 గంటలకు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు యమునోత్రి ధామ్ తలుపులు మూసివేసేందుకు కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇక విష్ణువు కొలువైన బద్రీనాథ్ ధామ్‌ను నవంబర్ 17వ తేదీన రాత్రి 9.07 గంటలకు మూసివేయనున్నారు. -
నేడు గంగోత్రి.. రేపు యమునోత్రి మూసివేత
డెహ్రాడూన్: భక్తిశ్రద్ధలతో కొనసాగున్న చార్ధామ్ యాత్ర ముగింపు దశకు చేరుకుంటోంది. శీతాకాలం రాకతో నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులను ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 12.14 గంటలకు మూసివేయనున్నారు. అనంతరం ముఖ్బాలోని గంగా ఆలయంలో గంగోత్రి మాత దర్శనం కొనసాగుతుంది. ఇదేవిధంగా ఆదివారం మధ్యాహ్నం 12.05 గంటలకు యమునోత్రి ధామ్ తలుపులు మూసివేయనున్నారు.దీపోత్సవంతో గంగోత్రి ధామం తలుపులు మూసివేసే ప్రక్రియను ప్రారంభించినట్లు పంచ గంగోత్రి ఆలయ కమిటీ కార్యదర్శి సురేష్ సెమ్వాల్ తెలిపారు. అనంతరం గంగామాత ఉత్సవ విగ్రహంతో డోలి యాత్ర నిర్వహిస్తూ శీతాకాలపు విడిదికి తీసుకువస్తామని చెప్పారు. మరోవైపు యమునోత్రి ధామ్ తలుపులు మూసివేసేందుకు సన్నాహాలు కూడా ప్రారంభించారు. ఆదివారం యమునోత్రి ధామ్ మూసివేసిన తర్వాత, యమునా తల్లి ఉత్సవ విగ్రహాన్ని ఖర్సాలీలోని ఆలయానికి తీసుకువస్తారు. ఈ యాత్రా కాలంలో శుక్రవారం సాయంత్రం వరకు 15 లక్షల 21 వేల 752 మంది యాత్రికులు ఈ రెండు ధామాలను సందర్శించుకున్నారు.ఇది కూడా చదవండి: మొబైల్ డేటా ట్రాఫిక్.. అగ్రగామిగా జియో -
విరిగిపడిన కొండచరియలు.. గంగోత్రి హైవే బంద్
ఉత్తరాఖండ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్లు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కొండచరియలు విరిగిపడుతూ జనాలను భయకంపితులను చేస్తున్నాయి. తాజాగా ఉత్తరకాశీలోని గంగోత్రి జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో రహదారిని మూసివేశారు.దీంతో ఉత్తరకాశీలోని మనేరి, భట్వాడిల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బార్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) బృందం ఈ హైవేపై పడిన రాళ్లు, శిధిలాలను తొలగించేపని చేపట్టింది. వీలైనంత త్వరగా రహదారిని క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని అల్మోరా, బాగేశ్వర్, చమోలీ, చంపావత్, గర్వాల్, హరిద్వార్, నైనిటాల్, పిథోరాఘర్, రుద్రప్రయాగ్, తెహ్రీ గర్వాల్, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాల్లో ఆదివారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఉత్తరాఖండ్‌లోని పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున కేదార్‌నాథ్‌లోని గౌరీకుండ్ సమీపంలో రాళ్లు పడడంతో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. దీనికిముందు జూలై ప్రారంభంలో బద్రీనాథ్ మార్గంలో కొండచరియలు విరిగిపడిన ఉదంతాలు చోటుచేసుకున్నాయి. దీంతో అప్పట్లో బద్రీనాథ్ మార్గాన్ని కూడా మూసివేశారు. అయితే బీఆర్ఓ బృందం శిధిలాలు, రాళ్లను తొలగించడంతో ఆ రహదారిని తిరిగి తెరిచారు. गंगोत्री नेशनल हाईवे भूस्खलन के कारण बंद, रास्ते से मलबा हटाने में जुटी BRO की टीम#Gangotri | #NationalHighway | #Landslide | #Uttarakhand pic.twitter.com/GmtrvQ72iF— NDTV India (@ndtvindia) July 21, 2024 -
‘చార్ధామ్’ మార్గంలో విషాదం.. ఇప్పటివరకూ 14 మంది మృతి
చార్ ధామ్ యాత్ర మే 10న ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ధామ్‌లలో భక్తుల రద్దీ నెలకొంది. లక్షలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. అయితే ఈ యాత్రలో పలు విషాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి.చార్ధామ్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి గంగోత్రి-యమునోత్రి ధామ్‌లో ఇప్పటివరకు మొత్తం 14 మంది భక్తులు మృతి చెందారు. తాజాగా యమునోత్రి యాత్రలో గుజరాత్, మహారాష్ట్రకు చెందిన మరో ఇద్దరు భక్తులు మరణించినట్లు తెలుస్తోంది. ఈ మరణాలన్నీ గుండె పోటు కారణంగానే సంభవించాయనే సమాచారం అందుతోంది.మరోవైపు చార్ ధామ్ యాత్రకు సంబంధించిన ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం పలువురు వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో వారు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదారు రోజులుగా వేచి చూస్తున్నా తమ యాత్రకు రిజిస్ట్రేషన్ జరగడం లేదని వారు వాపోతున్నారు. -
అవమానాలు భరించి వెండితెరపై సత్తా చాటిన అల్లు అర్జున్
తాత స్టార్ కమెడియన్ (రామలింగయ్య), మామయ్య స్టార్ హీరో (చిరంజీవి), నాన్న స్టార్ ప్రొడ్యూసర్ (అల్లు అరవింద్).. ఈ నేపథ్యంతో అల్లు అర్జున్ తెరంగేట్రం చేశారు. అది ఎంట్రీ వరకు మాత్రమే ఉపయోగపడిందేమోగానీ స్టార్.. స్టైలిష్‌స్టార్‌ని చేసేందుకు మాత్రం కాదు. హీరో అంటే ప్రధానంగా ఉండాల్సింది ఏంటి..? మంచి లుక్స్..పర్సనాలటీ,కిల్లింగ్ స్మైల్ ఇలా కొన్ని తప్పక ఉండాల్సిందే. కానీ ఇవేమీ లేకుండా తన బ్యాంక్‌గ్రౌండ్‌తో ఎంట్రీ ఇస్తే ఏం చేస్తాం కొద్దిరోజులకు పక్కన పెట్టేస్తాం. కానీ ప్రేక్షకులకు అల్లు అర్జున్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. గంగోత్రి సినిమా సమయంలో వీడు హీరో ఏంటిరా అనే స్టేజీ నుంచి ఆర్య సినిమాతో వీడురా హీరో అని స్థాయికి చేరాడు. వీడికి స్టైల్ అంటే తెలుసా..? అని హేళన చేసిన వారికి స్టైలిష్ స్టార్ అనే గుర్తింపుతో సమాధానం ఇచ్చాడు. నటన రాదు అనేవారికి జాతీయ అవార్డు అందుకున్న ఏకైక హీరోగా తెలుగు సినిమా చరిత్రలో నిలిచాడు. గంగోత్రితో అవమానం ఎదుర్కొన్న బన్నీ 2003లో వచ్చిన తన తొలి చిత్రం 'గంగోత్రి'ని చూసిన వారందరూ ఆ వెంటనే వచ్చిన 'ఆర్య'ను చూసి ఆశ్చర్యపోయారు. తొలి చిత్రంలో సింహాద్రిగా కనిపించిన ఆ కుర్రాడేనా..? ఈ ఆర్య అంటూ తెలుగు సినీ ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయారు. అంతలా బన్నీ కష్టపడ్డాడు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో అనే గుర్తింపు నుంచి అల్లు హీరో అనే ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇదంతా రాత్రికి రాత్రే జరిగిపోలేదు.. దీని వెనుక అతని 20 ఏళ్ల కష్టం ఉంది. తన 20 ఏళ్ల సినీ జీవితంలో వేదం,రుద్రమదేవి, వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించాడు. ఆర్య సినిమా విడుదల తర్వాత బన్నీని అభిమానించే వారి సంఖ్య ఇతర రాష్ట్రాలకు కూడా పాకింది. మలయాళంలో ఆయనకు ఉన్నంత ఫ్యాన్స్ అక్కడి హీరోలకు కూడా ఉండరనే చెప్పవచ్చు. అందుకే అతన్ని మల్లు అర్జున్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ప్రాంతం,భాష ఎలాంటి సంబంధం లేని తనకోసం వాళ్లందరూ చూపించే ప్రేమకు ఆయన మురిసిపోయాడు. అందుకే ఆయన ఒకసారి ఫ్యాన్స్‌ను ఉద్దేశించి కన్నవాళ్ల ప్రేమ ఎలాంటిదో అభిమానుల ప్రేమ కూడా అలాంటిదేనని చెప్పి దానిని పాటిస్తున్నాడు. అభిమానులనూ తన కుటుంబ సభ్యుల్లాగే భావిస్తారాయన. ఇప్పటికీ ఫ్యాన్స్ అని ఆయన ఇంటికి వెళ్తే అక్కడున్నవారు భోజనం పెట్టి పంపుతారు. 'ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు. నాకు మాత్రం ఆర్మీ ఉంటుంది. నేను సంపాదించుకున్న అతిపెద్ద ఆస్తి నా అభిమానులే’ అని ఆయన చాలాసార్లు చెప్పాడు. అల్లు అర్జున్‌లో ఇవన్నీ ప్రత్యేకం ► సౌత్ ఇండియాలో సిక్స్‌ప్యాక్ ట్రెండ్‌ను దేశముదురు సినిమాతో ట్రెండ్ సెట్ చేసింది అల్లు అర్జునే ► ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్లకుపైగా ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న సౌత్ ఇండియా స్టార్‌గా అర్జున్ గుర్తింపు పొందాడు. ► 'రుద్రమదేవి' సినిమాకు కొన్ని ఇబ్బందులు ఎదురు అయ్యాయని తెలుసుకున్న అర్జున్ దానికి తనలాంటి స్టార్ అవసరమనుకున్నాడు. ఆ సినిమా కోసం ఎలాంటి పారితోషికం తీసుకోకుండా గోనగన్నారెడ్డి పాత్రతో మెప్పించాడు. ► పాలకొల్లులోని 'పంచారామ' క్షేత్రంలో గోశాల ఏర్పాటుకు ఎవరూ అడగకుండానే రూ.18 లక్షలు విరాళం ఇచ్చాడు. గోశాలలోని ఆవులకు నిరంతరం అవసరమయ్యే ఖర్చును ఆయనే చెల్లిస్తానన్నాడు. ► వేదం సినిమాలో మంచు మనోజ్‌తో కలిసి నటించి నవతరం నాయకులలో మల్టీస్టారర్ చిత్రాల సంస్కృతిని మళ్లీ తెరపైకి తీసుకొచ్చాడు. ► ఎవరో బాలీవుడ్ జనాలు తన బాడీ,లుక్ మీద చేసిన కామెంట్‌ను సీరియస్ తీసుకొని ప్రత్యేకంగా జిమ్నాస్టిక్స్ శిక్షణ తీసుకొని సరికొత్త లుక్‌లో ఆర్యలో కనిపించి ఆ సినిమాకు నంది అవార్డు అందుకున్నాడు. ► కేరళలో మమ్ముట్టి, మోహన్ లాల్ తర్వాత అర్జున్‌కే ఎక్కువ అభిమానులు. పరాయి రాష్ట్రంలో ఏ హీరోకు ఇలాంటి ఆదరణ లేదు. ► పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ ఎంటర్టైన్ కేటగిరిలో ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డు గెలిచిన మొదటి సౌత్ హీరోగా రికార్డు సృష్టించాడు. ► ఫ్యాన్స్ కోసం ఒకరోజును ఆయన కేటాయిస్తారు. ప్రతి గురువారం తన ఫ్యాన్స్ డైరెక్ట్‌గా ఆయన ఇంటి వద్దకు వెళ్లి బన్నీతో ఫోటోలు దిగుతుంటారు. ఒక్కోసారి షూటింగ్ పనుల మీద ఇతర ప్రాంతాలకు ఆయన వెళ్లినప్పుడు ఆ అవకాశం ఉండదు. ► పుష్ప సినిమా కోసం భుజం ఒకవైపు ఉంచి నటిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని తెలిసి కూడా కథ నచ్చడంతో రెడీ అనేశాడు. సినిమా పూర్తి అయిన తర్వాత ఆయన భుజానికి స్వల్ప శస్త్రచికిత్స జరిగింది. ► 2021లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'పుష్ప' రూ. 365 కోట్లతో రికార్డు సృష్టించింది. -
డబుల్ సెంచరీ కొట్టిన టమాట.. కిలో ఏకంగా రూ. 250.. ఎక్కడంటే
ఎన్నడూ లేనంతగా కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఏదీ కొందామన్న అగ్గిలాగ మండుతున్నాయి. ప్రధానంగా టమాటా ధర దడపుట్టిస్తోంది. సాధారణంగా రూ. 20, 30 కిలో ఉండే టమాట ఇప్పుడు సామన్యుడికి అందని ద్రాక్షగా మారింది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే సెంచరీ దాటి టామాట మరింత పరుగులు పెడుతోంది. మరి కొన్ని చోట్ల ఏకంగా డబుల్ సెంచరీ కొట్టేసింది. పెరిగిన ధరలతో ప్రజలు లబోదిబోమంటుంటో.. పలు చోట్ల ప్రభుత్వాలే సబ్సిడీ రేట్లలో టమాటాలను సరఫరా చేస్తున్నాయి. ఇక ఉత్తర భారతదేశంలో టమాట ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఉత్తరఖాండ్ రాష్ట్రం గంగోత్రి ధామ్‌లో కిలో టమాట రూ. 250 పలుకుతోంది. ఉత్తరకాశీ జిల్లాలో కిలో రూ. 180 నుండి 200 వరకు ఉంది. యమునోత్రిలో కిలో టమాట రూ. 200 నుంచి 250 వరకు చేరింది. ఈ ప్రాంతంలో ఒక్కసారిగా టమాటా రేట్లు పెరిగిపోయాయని.. కూరగాయల విక్రయదారుడు తెలిపారు. ఇటీవల తీవ్రల ఎండలు, అకాల వర్షాల కారణంగా ఉత్పత్తి తగ్గడంతో ధరలు పెరిగిపోయాయని అధికారులు చెబుతున్నారు. చదవండి: కొండెక్కిన ధరలు.. తోట నుంచి రూ. 2.5 లక్షల టమాట చోరీ అదే విధంగా కోల్కతాలోరూ.152, ఢిల్లీలో రూ.120, బెంగుళూరులో రూ. 120గా ఉంది. చెన్నైలో రూ.100 నుంచి 130 పలుకుతుండటంతో స్థానిక రేషన్ షాపుల ద్వారా టమాట రూ. 60కే కిలో చొప్పున అందిస్తున్నారు. ఇక అత్యల్పంగా రాజస్థాన్‌లోని చురులో రూ.31గా ఉన్నది. ఇతర కూరగాయలు కూడా ధరల విషయంలో తామేమీ తీసిపోలేదని అల్లం, వంకాయటమాటాతో పోటీపడుతున్నాయి. కూరగాయల ఉత్పత్తిదారుల కమిటీ ప్రకారం కిలో అల్లం ధరం రూ.250 దాటగా, వంకాయ రూ.100 చేరింది. ఇతర కూరగాయల ధరలు కూడా గత పది రోజుల్లో 20 నుంచి 60 శాతం మధ్య పెరిగాయని అధికారులు తెలిపారు. దీంతో కూరగాయలు కొనలేక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
చార్ధామ్ యాత్ర ప్రారంభం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఆరు నెలల అనంతరం తిరిగి తెరుచుకోవడంతో చార్ధామ్ యాత్ర మొదలైంది. గంగోత్రి ఆలయ తలుపులను శనివారం మధ్యాహ్నం 12.35 గంటలకు, యమునోత్రి గుడిని 12.41 గంటలకు ఆలయ కమిటీ సభ్యులు తెరిచారు. ఈ సందర్భంగా గంగోత్రి ఆలయంలో, యమునా దేవత శీతాకాల నివాసమైన ఖర్సాలీలో కూడా ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి పూజలు చేశారు. అనంతరం యమునా దేవిని అందంగా అలంకరించిన పల్లకీలో ఊరేగింపుగా యమునోత్రికి తీసుకువచ్చారు. చార్ధామ్ యాత్రకు ఇప్పటికే 16 లక్షల మంది యాత్రికులు పేర్లను నమోదు చేసుకున్నారు. ఈనెల 25న కేదార్నాథ్, 27న బదరీనాథ్ ఆలయాలు తిరిగి తెరుచుకోనున్నాయి. హిమాలయాల్లోని ఈ నాలుగు పుణ్యక్షేత్రాల్లో రోజువారీ భక్తుల సందర్శనపై పరిమితం విధించాలన్న ప్రతిపాదనను విరమించుకున్నట్లు సీఎం ధామి ప్రకటించారు. -
గంగోత్రి టూ పుష్ప.. 20 ఏళ్ల ప్రస్థానంపై బన్నీ ట్వీట్ వైరల్
బన్నీ, ఐకాన్ స్టార్, స్టైలిష్ స్టార్ ఇలా ఏ పేరుతో పిలిచినా అన్నీ అతనే. టాలీవుడ్లో రెండు దశాబ్దాల పాటు దూసుకెళ్తోన్న హీరో అల్లు అర్జున్. టాలీవుడ్ ఇండస్ట్రీలో గంగోత్రి సినిమాతో కెరీర్ ప్రారంభించి.. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు స్టెలిష్ స్టార్ అల్లు అర్జున్. బన్నీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పటికీ ఈ రోజుతో 20 ఏళ్లు పూర్తయింది. ప్రతి సినిమాలో తనదైన నటనతో మెప్పించారు బన్నీ. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.ఈ సందర్భంగా తన అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ చేశాడు. అల్లు అర్జున్ తన ట్వీట్లో రాస్తూ.. 'నేటితో నేను చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నా. ఈ ప్రయాణంలో నన్ను అందరూ అభిమానించారు. మీరందరూ నాపై చూపించిన ప్రేమకు ప్రత్యేక ధన్యవాదాలు. టాలీవుడ్ ఇండస్ట్రీకి వారందరికీ నేను రుణపడి ఉంటాను. నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం ప్రేక్షకులు, అభిమానుల ప్రేమే కారణం.' అంటూ పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు బన్నీకి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఐకాన్ స్టార్ అంటూ ట్రెండింగ్ చేస్తున్నారు. బన్నీ 20 ఏళ్ల సినీ ప్రస్థానం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఆర్య సినిమా అల్లు అర్జున్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఓ కొత్త ప్రేమ కథను అందులో చూపించారు దర్శకుడు సుకుమార్. ఆ తరువాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం బన్నీ. ఈ సినిమా కూడా మంచి కమర్షియల్ హిట్ అయింది. ఆ తర్వాత "హ్యాపీ" సినిమాతో అలరించాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన "దేశముదురు" అల్లు అర్జున్ కొత్త క్యారెక్టర్‌ను పరిచయం చేసింది. ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్గా వచ్చిన దేశముదురు సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఆ తరువాత వచ్చిన పరుగు, వేదం, రుద్రమదేవి వంటి సినిమాలలో నటించారు అల్లు అర్జున్. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, ఇద్దరమ్మాయిలతో, రేసుగుర్రం, సరైనోడు లాంటి వరుస హిట్ సినిమాలతో దూసుకొచ్చారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన "పుష్ప" మూవీ ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకొచ్చింది. త్వరలోనే పుష్ప-2 సినిమాతో మరోసారి అభిమానులను అలరించబోతున్నారు మన ఐకాన్ స్టార్. Today, I complete 20 years in the film industry. I am extremely blessed & have been showered with love . I am grateful to all my people from the industry . I am what I am bcoz of the love of the audience, admirers & fans . Gratitude forever 🙏🏽 — Allu Arjun (@alluarjun) March 28, 2023 -
గంగోత్రికి ముందు బన్నీని అడగలేదు.. చరణ్‌ను అడిగారు: నాగబాబు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప మూవీతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. అల్లు-మెగా వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బన్నీ తనదైన నటనతో ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. తెలుగులోనే కాదు సౌత్ ఇండస్ట్రీల్లో సైతం విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. యలయాళంలో బన్నీని మల్లు అర్జున్‌గా ఫ్యాన్స్ పిలుచుకుంటారనే విషయం తెలిసిందే. అలా ఇతర భాషల్లో సైతం స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ గంగోత్రి చిత్రంతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. చదవండి: శ్రీరామ చంద్ర అసహనం.. ఫ్లైట్ మిస్ అయ్యిందంటూ కేసీఆర్‌కు ఫిర్యాదు తొలి చిత్రంతోనే హీరోగా సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇందులో బన్నీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే అంతగా గుర్తింపు తెచ్చిపెట్టిన ఈ సినిమాకు బన్నీ మొదటి చాయిస్ కాదంటూ అసక్తికర విషయం చెప్పాడు మెగా బ్రదర్ నాగబాబు. రీసెంట్గా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన ఆయన ఈ సందర్భంగా మెగా హీరోల గురించి ప్రస్తావించారు. తమ ఫ్యామిలీ నుంచి ఇంత మంది హీరోలు వస్తారనుకోలేదన్నారు. ‘అన్నయ్య(మెగాస్టార్ చిరంజీవి)ను స్ఫూర్తిగా తీసుకునే మేం ఇండస్ట్రీకి వచ్చాం. ఆయన హీరో అయ్యారు. నన్ను నిర్మాతగా మార్చారు. అలా అన్నయ్య హీరోగా ఎదిగే క్రమంలో ఆయనకు వచ్చిన పేరు ప్రఖ్యాతలను చూసి పిల్లలంతా ఇన్‌స్పైయిర్ అయ్యారు. చదవండి: త్వరలోనే వరుణ్ తేజ్ పెళ్లి.. భార్యతో కలిసి వేరు కాపురం! ఇండస్ట్రీలో అయితే ఎలా అన్నయ్య స్పూర్తితో బయటి వాళ్లు హీరోలు అయ్యారో. అలాగే ఇంట్లో పిల్లలు కూడా ఆయన ఇన్స్పిరేషన్తో హీరోలు అయ్యారు. అలా అయిన వాళ్లలో బన్నీ కూడా ఒకడు. బన్నీ ఫస్ట్ గంగోత్రి ఆఫర్ వచ్చింది. కానీ నిజానికి గంగోత్రి ఆఫర్ ఫస్ట్ చరణ్ బాబు(రామ్ చరణ్)కు వచ్చింది. చరణ్ బాబుని అడిగినప్పుడు అన్నయ్య వద్దు అన్నాడు. చరణ్‌కి ఇంకా ఇంకాస్త మెచ్యూరిటీ రావాలి. యాక్టింగ్ లో ట్రైనింగ్ కావాలి. ఆ క్యారెక్టర్ బన్నీ అయితే బాగుంటాడు. తనని చేయమన్నాడు. అలా బన్నీ గంగోత్రి ఆఫర్ వచ్చింది. అలానే అనుకోకుండానే అందరికి ఆఫర్లు వచ్చాయి, హీరోలు అయ్యారు’’ అంటూ నాగబాబు చెప్పుకొచ్చాడు. -
ఆ సినిమా రీమేక్ నేను చేయాల్సింది: భరత్
‘టాలీవుడ్లో అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం. గంగోత్రి నుంచి ఆయన జర్నీని చూస్తున్నాను. ఆ సినిమా నాకు చాలా ఇష్టం. అప్పట్లో ఆ సినిమా తమిళ రీమేక్ నేను చేయాల్సింది.కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను’అని తమిళ హీరో భరత్ అన్నారు. బాయ్స్, ప్రేమిస్తే, యువసేన సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చేరువైన ఆయన...చాలా కాలం తర్వాత తెలుగు సినిమా ‘హంట్’లో కీలక పాత్ర పోషించారు. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకం పై ప్రముఖ నిర్మా త వి. ఆనం ద ప్రసాద్ నిర్మిం చారు. మహేష్ దర్శకత్వం వహిం చారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుం ది. ఈ సందర్భంగా భరత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘తమిళ సినిమాలతో బిజీగా ఉండడం వల్ల తెలుగు చిత్రాలపై దృష్టిపెట్టలేదు. దర్శకుడు మహేష్ వచ్చి ఈ స్క్రిప్ట్ చెప్పడంతో, కథ నచ్చి దాదాపు పన్నెండేళ్ల తర్వాత తెలుగులో మూవీ చేశా. ఇందులో ఆర్యన్ దేవ్ అనే ఐపీఎస్ ఆఫీసర్ గా నటించా. నేను తమిళంలో పోలీసుగా నటించిన కాళిదాసు మూవీ నచ్చి డైరెక్టర్ మహేష్ ఈ రోల్ ఇచ్చాడు. 'హంట్'లో యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్, ఫ్రెండ్ షిప్ అన్నీ ఉంటాయి. ఈ సినిమా తెలుగులోనూ నా మార్కెట్ కి హెల్ప్ అవుతుందన్న నమ్మకం ఉంది’ అన్నారు. -
‘గంగోత్రి’లోని ‘వల్లంకి పిట్ట’పాప ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుందో తెలుసా?
చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి.. హీరోయిన్గా ఎదిగినవారు టాలీవుడ్లో చాలానే ఉన్నారు. శ్రీదేవి, రాశి, మీనా, రోజా, లయ.. ఇలా ఎందరో బాల తారలుగా వచ్చి హీరోయిన్స్‌గా తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోగలిగారు. వీరిలో కొంత మంది స్టార్ హీరోయిన్స్ కూడా అయ్యారు. తాజాగా మరో చైల్డ్ ఆర్టిస్టు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆమే కావ్య కల్యాణ్‌రామ్. కావ్య అంటే ఎవరికి తెలియకపోవచ్చు.. కాని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తొలిచిత్రం ‘గంగోత్రి’లోని ‘వల్లంకి పిట్ట.. వల్లంకి పిట్ట’ పాటని గుర్తు చేస్తే టక్కున ఆ పాటలోని చిన్నారి పాప గుర్తొస్తుంది. ఆ పాపే కావ్య. అక్షరాలా తెలుగు అమ్మాయి. హైదరాబాద్‌కి చెందిన కావ్య కల్యాణ్ రామ్ ‘గంగోత్రి’సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలకృష్ణ ‘విజయేంద్రవర్మ’, చిరంజీవి ‘ఠాగూర్’ నాగార్జున ‘స్నేహమంటే ఇదేరా’ పవన్ కల్యాణ్ ‘బాలు’తదితర సినిమాల్లో నటించింది. దాదాపు 16 చిత్రాల్లో బాలనటిగా నటనతో మెప్పించింది. ఆ తర్వాత చదువుపై శ్రద్దపెట్టి, సినిమాలకు దూరమైంది. 2019లో ‘లా’ పట్టాపుచ్చుకుంది. తాజాగా ‘వల్లంకి పిట్ట’ హీరోయిన్గా ‘మసూద’ సినిమాలో నటించింది. హారర్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం(నవంబర్ 18) విడుదలైంది. ఇందులో కావ్య నటనను మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రంతో పాటు వారాహి క్రియేషన్స్ నిర్మిస్తున్న ‘ఉస్తాద్’లో కూడా కావ్య హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ భామ హీరోయిన్గా రాణించాలనుకుంటుందట. అందుకే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) -
‘వల్లంకి పిట్టా’ బేబీ ఇప్పుడెలా ఉందో చూశారా?
కావ్య కల్యాణ్‌రామ్ తెలుసా మీకు? ఆమె ఎవరు అంటారా? సరే, అల్లు అర్జున్ ఫస్ట్ మూవీ గంగోత్రిలోని ‘వల్లంకి పిట్టా వల్లంకి పిట్టా మెల్లంగ రమ్మంటా’వీడియో సాంగ్‌ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అందులో ఓ బుడ్డి పాప క్యూట్, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. ఆ బుడ్డి పాప పేరే కావ్య కల్యాణ్‌రామ్. బాలనటిగా పలు సినిమాల్లో నటించిన ‘గంగోత్రి బేబీ’ ప్రస్తుతం ఎలా ఉంది? ఏం చేస్తుందో తెలుసా? హైదరాబాద్‌కి చెందిన కావ్య కల్యాణ్ రామ్ ‘గంగోత్రి’సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలకృష్ణ ‘విజయేంద్రవర్మ’, చిరంజీవి ‘ఠాగూర్’ నాగార్జున ‘స్నేహమంటే ఇదేరా’ పవన్ కల్యాణ్ ‘బాలు’తదితర సినిమాల్లో నటించింది. ఆ తర్వాత చదువుపై శ్రద్దపెట్టి, సినిమాలకు దూరమైంది. 2019లో ‘లా’ పట్టాపుచ్చుకుంది. గతేడాది ‘మసూద’ అనే సినిమాతోనే కావ్య హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ భామ హీరోయిన్గా రాణించాలనుకుంటుందట. అందుకే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ప్రస్తుతం కావ్య లుక్స్.. మంచి హీరోయిన్ కి ఎగ్జాక్ట్ గా స్యూట్ అయ్యేలా ఉంది. హాట్ బేబీగా మారిన క్యూట్ బేబీ కావ్యకు మంచి ఆఫర్లు వచ్చి స్టార్ హీరోయిన్గా రాణించాలని ఆశిద్దాం. View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) -
బన్నీ ఫ్రెండ్‌గా ‘గంగోత్రి’లో చాన్స్, పరువు పోతుందని చేయనన్నాను..
యంగ్ డైరెక్టర్ బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర ‘బలుపు’, ‘జై లవకుశ’, ‘వెంకీమామ’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్‌ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల బాబీ ఓ ఛానల్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తనకు అల్లు అర్జున్ తొలి చిత్రం ‘గంగోత్రి’ మూవీలో నటించే చాన్స్ వచ్చినట్లు చెప్పాడు. అయితే పరువు పోతుందని ఆ మూవీలో నటించడానికి ఒప్పుకోలేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాబీ మాట్లాడుతూ.. ‘గుంటూరులో చిరంజీవి అభిమాన సంఘం అధ్యుక్షుడిగా ఉన్న సమయంలో రైటర్ చిన్ని కృష్ణ తనని కలిసి హైదరబాద్‌కు వచ్చినప్పుడు కలవమని చెప్పారు. అలా ఓ సారి హైదరబాద్‌కు వచ్చి ఆయనను కలిశాను. వెంటనే ఆయన నన్ను రఘవేంద్ర రావు దగ్గరికి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత కాసేపు నన్ను గమనించిన ఆయన గంగోత్రిలో అల్లు అర్జున్ ఫ్రెండ్‌గా నటించే అవకాశం ఇచ్చారు. అయితే ఈ సినిమాలో నిక్కర్ వేసుకోవాలని నా కోలతలు తీసుకోమ్మంటూ అసిస్టెంట్ డైరెక్టర్‌కు చెప్పారు. అయితే అలా నిక్కరులో కనిపిస్తే గుంటూరులో నా పరువు పోతుందని భయపడి వెంటనే నేను చేయనని చెప్పాను. మరీ ఏం చేస్తావని చిన్ని కృష్ణ అడిగారు. వెంటనే నేను కథలు రాస్తానని చెప్పాను. దీంతో గంగోత్రికి కొన్ని సన్నివేశాలు రాసే అవకాశం ఇచ్చారు. అలా నేను రాసిన సన్నివేశాలు రాఘవేంద్రరావు నచ్చి సినిమాలో పెట్టుకున్నారు. అలా రచయిత, డైరెక్టర్‌ను అయ్యాను’ అంటూ బాబీ చెప్పుకొచ్చాడు. -
అచ్చ తెలుగు అమ్మాయిని
కావ్య... ఈ పేరు బహుశా ఎవరికీ తెలియకపోచ్చు. కానీ అల్లు అర్జున్ మొదటి సినిమా ‘గంగోత్రి’లోని ‘వల్లంకి పిట్ట.. వల్లంకి పిట్ట...’ పాటని గుర్తు చేస్తే టక్కున ఆ పాటలోని చిన్నారి పాప గుర్తొస్తుంది. ఆ పాపే కావ్య. ఇప్పుడు తను హీరోయిన్ కాబోతోంది. తెలుగమ్మాయి అయిన కావ్య పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ – ‘‘బాలు, అడవిరాముడు, అందమైన మనసులో, విజయేంద్రవర్మ’తో పాటు ఇంకా చాలా సినిమాల్లో బాలనటిగా చేశాను. పుణెలోని ఓ కాలేజీలో లా పూర్తి చేసి, ఇప్పుడు సినిమా వైపు దృష్టి పెట్టాను. తెలుగుతో పాటు తమిళ, మళయాళ సినిమాలకు కూడా ఆడిష¯Œ ్స చేస్తున్నాను. నిజానికి లాక్ డౌన్‌కి ముందుగానే ట్రయిల్స్ స్టార్ట్ చేశాను. లాక్ డౌన్ రాకుండా ఉంటే ఓ ప్రాజెక్ట్ ఓకే అయ్యేది. నేను తెలుగు అమ్మాయిని కావడం అడ్వాంటేజ్‌గా ఫీలవుతున్నాను. మన తెలుగు కల్చర్, నేటివిటీ అనేది హిందీ హీరోయిన్ల కన్నా తెలుగు అమ్మాయిలకే అర్థమవుతుంది. రియాలిటీకి దగ్గరగా ఉండే, ఇంట్రెస్టింగ్ , ఛాలెంజింగ్ పాత్రలంటే ఇష్టం. ఓటీటీలో డిఫరెంట్ సబ్జెక్ట్స్ వస్తున్నాయి. అలాంటి అవకాశం నాకు వచ్చి, పాత్ర ఆసక్తిగా అనిపిస్తే చేస్తాను’’ అని చెప్పారు. -
హిమాలయాల్లో తెలుగు స్వామీజీ
అన్వేషణ మనిషిని ఎటువైపు తీసుకెళుతుందో చెప్పలేం. జీవితపరమార్థాన్ని వెతుక్కుంటూ నెల్లూరు నుంచి బయల్దేరిన సుందరరాముడు హిమాలయాల చెంతకు చేరితే, గంగోత్రిని దర్శించుకునేందుకు వెళ్లిన ఒక హైదరాబాద్ యాత్రికుడికి సుందర రాముడు సాక్షాత్కరించారు! సముద్రమట్టానికి 10,200 అడుగుల ఎత్తున ఉంటుంది గంగోత్రి. అటువంటి దేవభూమిలో అడుగిడి గంగామాతను సందర్శించిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలను చూద్దామని నేనూ నా మిత్రుడు బయలుదేరాం. గంగానదికి కుడి పక్కనున్న మాతాదీ ఆలయాన్ని చూసిన తర్వాత ఎడమ వైపుకు వెళ్లాం. సెలయేళ్లు, రకరకాల పుష్పాలు.. అవి దాటి కొంచెం ముందుకు పోతే ప్రకృతి రమణీయతకు మారుపేరా అన్నట్టున్న తపోవనం. విశాలమైన ఆ ఆవరణలో ఓ మూల నీరెండ పడుతోంది. అక్కడ ఓ రుషి పుంగవుడు మంచంపై విశ్రమించి ఉన్నారు. లోపలికి వెళ్లి స్వామి వారికి నమస్కరించాం. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం అని అనగానే ఏ ఊరి నుంచి అన్నారు స్వామి. ఆశ్చర్యపోతూ ఉబ్బితబ్బిబ్బయ్యాం. ముందు తపోవనం ఆర్ట్ గ్యాలరీని చూసి రండి తర్వాత మాట్లాడదామన్నారు. అలా తెలిసింది ఆయన తెలుగువారని, గత ఆరేడు దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నారని! తపోవనమే ఆశ్రమం ఈ తపోవనమే మన తెలుగువారైన స్వామీ సుందరానంద ఆవాసం. ఎక్కడో నెల్లూరు జిల్లాలో పుట్టి గురుపరంపరను వెతుక్కుంటూ భారతీయ ఆధ్యాత్మిక ఆత్మను పట్టి బంధించే (తన కెమెరాతో) దిశగా బయలుదేరి ఉత్తరాఖండ్‌లోని నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రిని అంతిమ గమ్యంగా ఎంచుకున్నారాయన. హిమాలయాలను ఔపాశన పట్టి ఎక్కడెక్కడి రహస్యాలను ఒడిసిపట్టి సుమారు 35 ఏళ్ల పాటు గంగోత్రిలోనే నివసించిన మహాపండితులు, సన్యాసీ, కీర్తిశేషులు స్వామీ తపోవన్ మహారాజ్ శిష్యుడు స్వామి సుందరానంద. 47 ఏళ్ల కిందట గురువు నుంచి సన్యాసం స్వీకరించిన సుందరానంద ప్రస్తుతం గంగోత్రిలో తపోవన్ (హిరణ్యగర్భ ఆర్ట్ గ్యాలరీ) ని నిర్వహిస్తున్నారు. కట్టుబట్టలతో వచ్చేశారు సుందరానంద స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కలిగిరి మండలం అనంతపురం. మద్దు పెంచమ్మ, వెంకటసుబ్బయ్య దంపతుల ఐదుగురి సంతానంలో నడిపివారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు సుందర రాముడు. సంతానం తప్ప సంపద లేని కుటుంబం. ఏదో సాధించాలన్న తపన. చుట్టూ ప్రపంచాన్ని చూస్తే ఏదో తెలియని వెలితి. «ఇంట్లో ఎవరికీ చెప్పాపెట్టకుండా కట్టుబట్టలతో ఊరి నుంచి వచ్చేసి బెజవాడ చేరాడు. ఏమి చేయాలో తెలియలేదు. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న న్యూ వెల్కమ్ హోటల్లో సర్వరుగా చేరారు. కడుపు నింపుకోవడానికి ఆ పని సరిపోయినా తన తృష్ణను తీర్చలేకపోయింది. నేతాజీని కలుద్దామని.. సుందర రాముడు బెజవాడ హోటల్లో పని చేస్తున్నప్పుడే రెండో ప్రపంచ యుద్ధ వార్తలు తెలుస్తుండేవి. హోరాహోరా యుద్ధం నడుస్తున్నప్పుడు ఈ హోటల్లో పనేమిటంటూ– విప్లవ వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన అజాద్ హింద్ ఫౌజ్‌లో చేరేందుకు కోల్‌కతాకు బయలుదేరాడు. సుందరరాముడు కోల్‌కతాకు వెళ్లేటప్పటికే రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. బోస్ విమాన ప్రమాదంలో చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఉసూరుమన్న సుందరరాముడు సన్యాసం స్వీకరించి తపస్సు చేసుకుందామని నిర్ణయించుకుని గురువును వెతుక్కుంటూ హిమాలయాలకు బయలుదేరారు. ‘‘1948–49లలో హిమాలయపర్వత సానువులకు వచ్చా. 1950–54 మధ్య కాలంలో ఐదారు సార్లు హిమాలయాలను ఎక్కిదిగా.చీలిక పీలికలయిన దుస్తులే ఈ భౌతికకాయాన్నీ, పవిత్ర ఆత్మను కప్పి ఉంచేవి’’ అని చెప్పారు స్వామీజీ. ఆయన పక్కనే పాతకాలం నాటి ఓ కెమెరా కనిపిస్తుంది. దాని గురించి అడిగినప్పుడు స్వామీజీ మందస్మితులయ్యారు. ‘‘అదో పెద్ద కథలే.. ఓసారి హిమాలయ పర్వతారోహణ సమయంలో కెమెరా ఉంటే బాగుండేదనిపించింది. దేవమార్గాన్ని బంధించాలనిపించింది. అప్పుడు డెహ్రడూన్‌లోని శివానంద ఆర్ట్ స్టూడియో వారిని అడిగి రూ.25లకు ఆస్ట్రేలియాకు చెందిన బాక్స్ కెమెరాను కొనుక్కున్నా. అలా నా భుజం మీదకు చేరిన కెమెరాను ఇప్పటివరకు ఎన్నడూ వీడలేదు. ఇప్పుడు నా వయస్సు 92 ఏళ్లు. 60 ఏళ్లకు పైబడి నా చేతిలో ఈ కెమెరా ఉంది’’ అన్నారు సుందరానంద. తాను తీసిన చిత్రాలతో– హిమాలయన్ త్రూ ద లెస్సెన్స్ ఆఫ్ సాధు – అనే పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఈ పుస్తకం ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. 1962లో ఓసారి ఊరికెళ్లా.. ‘‘అప్పటికే సన్యాసం స్వీకరించా. తపోవన్ స్వాముల వారిది కేరళ. ఆయన అనుమతి మేరకు దేశపర్యటనలో భాగంగా 1962లో ఓసారి మా స్వగ్రామం అనంతపురం వెళ్లా. హిమాలయాల్లో తపస్సు చేసి వచ్చానని ఊరు ఊరంతా వచ్చి ఊరేగింపు చేశారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ వెళ్లలేదు. ఇప్పుడు నాకు తన, మన అనేదే తెలియదు. అందరూ నా వాళ్లే. మా అప్పచెల్లెళ్లు ఎక్కడున్నారో కూడా తెలియదు’’ అంటారు స్వామీ సుందరానంద. – సీవీఎస్ రఘునాథరావు ప్రధానులు సందర్శించారు గంగోత్రి నదికి కుడి వైపున ఆలయం ఉంటే ఎడమ వైపున తపోవన్ హిరణ్య గర్భ ఆర్ట్ గ్యాలరీ ఉంటుం ది. పూర్తిగా చెక్కతో నిర్మాణం. ఐదంతస్తులు. ఒక్కో అంతస్తులో ఒక్కో విభాగానికి చెందిన ఫొటోలను ఏర్పాటు చేశారు. ఎవరెస్ట్ పర్వతారోహకుడు టెన్సింగ్ నార్కే మొదలు మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, వాజపేయి వరకు ఎందరెందరో ఈ తపోవన్ను సందర్శించారు. పై అంతస్తులో ధ్యానమందిరం ఉంటుంది. యోగాభ్యాసంలో 360కి పైగా విన్యాసాలు ఉంటాయని, తన జన్మభూమి విశ్వంలో కీర్తిప్రతిష్టలు పొందాలన్నదే తెలుగు ప్రజలకు తానిచ్చే సందేశమన్నారు స్వామీజీ. -
శివుడి ప్రీతి కోసం కావడి వ్రతం
కావడి వ్రతం ఎన్ని వందల ఏళ్ల క్రితం మొదలైంది అనడానికి సరైన ఆధారాలు లేవు. తల్లిదండ్రులను కావడిలో పెట్టుకుని పుణ్యక్షేత్రాలకు తిరిగిన శ్రావణ కుమారుడు వారిని హరిద్వార్‌లో పుణ్యస్నానం చేయించి తిరిగి వస్తూ ఘటంలో గంగాజలం తెచ్చుకున్నాడట. అలా ఈ ఆచారం మొదలైందని అంటారు. ఉత్తరాదిన శ్రావణ మాసం జూలై ద్వితీయార్థం నుంచే మొదలైపోతుంది. శ్రావణ మాసం రాగానే ‘హరిద్వార్’, ‘గోముఖి’, ‘గంగోత్రి’ వంటి పుణ్యక్షేత్రాలు ‘కన్వరీయల’తో కిటకిటలాడతాయి. ‘కన్వరీయులు’ శివ భక్తులు. వీరు శ్రావణ మాసంలో గంగా నదీ తీరంలో ఉన్న పుణ్యక్షేత్రాలను చేరుకుని అక్కడి గంగాజలాలను కావడిలో నింపుకుని చుట్టుపక్కల ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు చేరుకుని ఆ జలాలతో శివుని అభిషేకం నిర్వహించడం ద్వారా వ్రతాన్ని ముగిస్తారు. తమ సొంత ఊరి వరకూ చేరుకుని ఊళ్లోని శివుని గుడిలో అభిషేకం ముగిస్తారు. ‘కన్వర్ యాత్ర’, ‘కావడి యాత్ర’గా పేరుగడించిన ఈ యాత్ర ప్రస్తుతం ఆచరణలో ఉంది. కొందరు భక్తులు శ్రావణ మాసంతో మొదలుపెట్టి శివరాత్రి మధ్యకాలంలో ఎప్పుడైనా కావడి యాత్రను చేస్తారు. కాని ఎక్కువగా శ్రావణమాసంలోనే ఈ వ్రతం ఆచరించడం పరిపాటి. శివుడికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం శివునికి ఇష్టమైన మాసం అనీ ఈ మాసంలోనే శివుడు పార్వతిని పరిగ్రహించాడని భక్తుల నమ్మకం. అందువల్ల ఉత్తరాదిన ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హర్యాణా, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు హరిద్వార్‌కు లేదా గంగానది పరివాహక పుణ్యక్షేత్రానికి చేరుకుంటారు. అక్కడ కాషాయ వస్త్ర ధారణ చేస్తారు. ఆ తర్వాత ఒక కావడి బద్దకు ఇరువైపులా స్టీలు, ఇత్తడి, లేదా ప్లాస్టిక్ ఘటాలను కట్టుకుని వాటిలో గంగాజలం నింపుకుంటారు. ఈ వ్రతం పూర్తయ్యేవరకు కావడి పవిత్రమైనది. దానిని భుజాన మోస్తూ బోసి పాదాలకు దగ్గరిలోని ప్రసిద్ధ శైవ క్షేత్రానికి గానీ, లేదా తమ సొంత ప్రాంతంలోని శైవ క్షేత్రానికి గాని చేరుకుంటారు. తీసుకొచ్చిన గంగాజలంతో శివుడికి అభిషేకం జరిపిస్తారు. ఈ వ్రతాన్ని ఒక్కరుగా చేస్తారు. లేదా బృందాలుగా చేస్తారు. ఈ కావళ్లలో రకాలు ఉన్నాయి. ‘వ్యక్తి కావళ్లు’, ‘వాహన కావళ్లు’ అనే విభజనలు ఉన్నాయి. వ్యక్తి కావళ్లు పట్టిన వాళ్లు దారి మధ్యలో కావడిని దించవచ్చు. విశ్రాంతి, కాలకృత్యాలకు విరామం తీసుకోవచ్చు. కాని కొన్ని రకాల కావడి వ్రతంలో కావడిని కిందకు దించకూడదు. అందువల్ల ఆరుమంది సభ్యుల బృందం మార్చుకొని మార్చుకొని కావడి మోస్తూ గమ్యం చేరుకుంటుంది. ఎప్పుడు మొదలైంది కావడి వ్రతం ఎన్ని వందల ఏళ్ల క్రితం మొదలైంది అనడానికి సరైన ఆధారాలు లేవు. తల్లిదండ్రులను కావడిలో పెట్టుకుని పుణ్యక్షేత్రాలకు తిరిగిన శ్రావణ కుమారుడు వారిని హరిద్వార్‌లో పుణ్యస్నానం చేయించి తిరిగి వస్తూ ఘటంలో గంగాజలం తెచ్చుకున్నాడట. అలా ఈ ఆచారం మొదలైందని అంటారు. కాని పరశురాముడు ఈ ఆచారాన్ని మొదలెట్టాడని అనేవారు కూడా ఉన్నారు. పురాణ ఉదాహరణ తీసుకుంటే క్షీరసాగర మథనంలో వెలువడ్డ హాలాహలాన్ని శివుడు కంఠాన నిలిపాక ఆయన కంఠం నీలంగా మారింది. దాంతో పాటు ఒక సన్నటి శిఖ ఆ హాలాహలం నుంచి రేగి శివుడిని ఇబ్బంది పెట్టసాగింది. ఇది తెలిసిన దేవతలు గంగానదికి వెళ్లి గంగాజలాన్ని తెచ్చి ఆయనకు అభిషేకం జరిపించారు. అలా చేయడం వల్ల ఆ శిఖ చల్లబడి శివుడికి సౌకర్యం కలుగుతుందని భావించారు. అప్పుడు అలా మొదలైన ఆచారం ఇప్పటికీ కొనసాగుతుందని భక్తులు నమ్ముతారు. కాలకూట విషాన్ని గొంతులో మోస్తున్న శివుడిని చల్లబరిచే ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆ బోళా శంకరుడు ప్రసన్నమై భక్తుల కోర్కెలు నెరవేరస్తాడని భావిస్తారు. చాలా పెద్ద ఉత్సవం కావడి వ్రత సమయంలో ఉత్తరాఖండ్, బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు వ్రతబద్ధులు అయిన కన్వరీయుల సౌకర్యం కోసం మార్గమధ్యంలో ఎన్నో ఏర్పాట్లు చేస్తాయి. వారికి ఆహారం ఉచితంగా ఇవ్వబడుతుంది. తాత్కాలిక విశ్రాంతి కేంద్రాలు ఉంటాయి. కావడి నేల మీద పెట్టకుండా ఉండేందుకు ప్రత్యేకమైన స్టాండ్లు కూడా అందుబాటులోకి తెస్తారు. అలహాబాద్, వారణాసి, దియోఘర్ (జార్ఘండ్), సట్లజ్గంజ్ (బీహార్) వంటి క్షేత్రాలలో కూడా కన్వరీయులు దీక్ష బూనడం ఈ శ్రావణ మాసంలో కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనవైపు అయ్యప్ప దీక్షతో సమానంగా ఉత్తరాదిన కావడి దీక్ష ఆచరణలో ఉంది. -
ఈ పూజలు ఎవరి కోసం?
‘నాకు దైవ భక్తి ఎక్కువ. వీలు కుదురినప్పుడల్లా పుణ్యక్షేత్రాలకు వెళుతుంటాను’ అని చాలా సందర్భాల్లో పేర్కొన్నారు అనుష్క. ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ టెంపుల్‌ను సందర్శించారామె. అక్కడ కొన్ని ప్రత్యేక పూజలు కూడా చేయించారు అనుష్క. కేదార్‌నాథ్‌తో పాటు గంగోత్రి, బద్రీనాథ్ కూడా సందర్శించనున్నారట. సన్నిహితుల కోసం మొక్కుకుని గుడికి వెళుతుంటానని అనుష్క ఈ మధ్య ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. గుడికి వెళ్లి తన కోసం తాను ఎప్పుడూ ఏమీ కోరుకోనని కూడా అన్నారు. మరి.. ఇప్పుడు ఎవరి కోసం గుడికి వెళ్లారో? లేక జస్ట్ ఖాళీ దొరికింది కాబట్టి పీస్‌ఫుల్‌గా ఉంటుందని వెళ్లారో? -
గంగోత్రిలో మిర్యాలగూడవాసి మృతి
మిర్యాలగూడ టౌన్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం హౌసింగ్‌బోర్డుకు చెందిన బొమ్మిడి నరహరి(22) ఉత్తరకాశీ లోని గంగోత్రి నదిలో పడి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా పాలేరు సమీపంలోని నాయ కన్ గూడేనికి చెందిన బొమ్మిడి మల్లయ్య బతుకుదెరువు నిమిత్తం కుటుంబ సభ్యు లతో కలసి మిర్యాలగూడకు వచ్చాడు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల రాంరెడ్డి పార్కు సమీపంలో ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు. అతని కుమారుడు నరహరి డెహ్రాడూన్‌లోని డీఎస్బీ వర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ చదువుతూ.. అక్కడే హాస్టల్లో ఉంటున్నాడు. తన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా నరహరి ఉత్తరకాశీలోని గంగోత్రి విహార యాత్రకు వెళ్లాడు. దైవ దర్శనం నిమిత్తం పక్కనే ఉన్న నదిలోకి స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాద వశాత్తు కాలుజారి నదిలో పడి మృతి చెందాడు. మృత దేహాన్ని వెలికితీశారు. విషయం తెలుసుకున్న నరహరి కుటుంబ సభ్యులు ఉత్తరకాశీకి బయలుదేరి వెళ్లారు. కొడుకును అధికారిగా చూడాలని.. మల్లయ్య.. ఏపీలోని గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని విజయ ఆగ్రో కెమికల్స్ డీలర్‌గా పనిచేస్తున్నాడు. నరహరి చిన్నప్పటి నుంచి చదువులో మేటి. మల్లయ్యకు తన కొడుకును అగ్రికల్చర్ అధికారిగా చూడాలన్న కోరికతోనే డెహ్రాడూన్‌కు పంపించాడు. చేతికి అందివచ్చిన కొడుకు ఇలా అవుతాడని అనుకోలేదంటూ నరహరి తల్లిదండ్రులు మల్లయ్య, లక్ష్మి, సోదరి సారికలు కన్నీటి పర్యంతమయ్యారు. -
గంగోత్రిలో పాలమూరు జిల్లా యాత్రికులు క్షేమం
న్యూఢిల్లీ : చార్ధామ్ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 150మంది యాత్రికులు క్షేమంగా ఉన్నారు. వారంతా గంగోత్రిలో ఉన్నట్లు సమాచారం అందింది. కమ్మగిరి స్వామి నేతృత్వంలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు చార్ధాయ్ యాత్రకు వెళ్లారు. తామంతా క్షేమంగా ఉన్నట్లు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. మరోవైపు ఉత్తరాఖండ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రుద్రప్రయాగ, చమోలీ జిల్లాల్లో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. చార్ధాయ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు అష్టకష్టాలు పడుతున్నారు. శుక్రవారం కేదార్‌లోయ, హేమ్‌కుంద్ సాహిబ్, బద్రీనాథ్ ప్రాంతాల నుంచి హెలీకాప్టర్ల ద్వారా 900 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
భారీ వర్షాలతో చార్ ధామ్ యాత్రకు బ్రేక్
లక్నో/డెహ్రాడూన్: భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్రలకు బ్రేక్ పడింది. వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడుతుండటంతోపాటు దిగువ ప్రాంతాల్లో వరదలు వస్తున్న నేపథ్యంలో చార్ ధామ్ యాత్రికుల ప్రయాణాలను గురువారం ఎక్కడికక్కడ నిలిపేశారు. బద్రీనాథ్, కేదర్నాథ్, యమునోత్రి, గంగోత్రిలను కలిపి చార్ ధామ్ అంటారనే విషయం తెలిసిందే. ప్రతి ఏడాది ఈ నాలుగు ప్రాంతాల్లోని దైవాలను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇప్పటికే చమోలీ జిల్లాలో భారీ వర్షాలు వస్తున్న నేపథ్యంలో బద్రీనాథ్ క్షేత్రానికి బయలు దేరిన దాదాపు పదివేల మంది ఎక్కడికక్కడ నిలిచిపోయారు. గత పన్నెండుగంటలుగా ఏమాత్రం తెరపునివ్వకుండా వర్షం కురుస్తుందని, అది తగ్గిన తర్వాత తిరిగి యాత్రలకు అనుమతిస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. అప్పటివరకు యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించింది. -
మంచుకొండలలో...భక్తిధామాలు
మంచు దుప్పటి కప్పుకున్న హిమగిరులు భానుని కిరణాల స్పర్శతో మేలుకునే వేళ... వడివడిగా ఉరకలెత్తే నదీ నదాలు కొండల మీదుగా దుమికే వేళ... ఆ లోయలలోని సౌందర్యాలను కనుల నిండుగా నింపుకోవాల్సిందే! భక్తికి, ముక్తికి సోపానమయ్యే హరిహరాదుల ఆలయ సందర్శన వేళ... అడుగడుగునా ఆధ్యాత్మికత సౌరభాలు ప్రతి మదినీ తాకుతున్న వేళ... ఆ ఆనందాన్ని మది నిండుగా నింపుకోవాల్సిందే! చార్ధామ్... జీవిత కాలంలో ఒక్కసారైనా చేసితీరాలని ప్రతి హిందువూ కోరుకునే యాత్ర. హిమాలయ పర్వత శ్రేణులలో వెలసిన గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బదరీనాథ్‌లను దర్శించుకొని, తరించాలని తపించే యాత్ర. వెళ్లే మార్గం సంక్లిష్టమైనదైనా ప్రకృతి సోయగాలలో ప్రశాంతతను పొందాలని ఆకాక్షించే యాత్ర. మే నెల నుంచి నవంబర్ వరకు అనుమతించే ఈ యాత్రకు కిందటి నెలలోనే సింహద్వారాలను తెరిచింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. వైశాఖమాసం శుక్లపక్షం అక్షయ తృతీయ రోజున గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలను తెరిచారు. మరో రెండు ప్రసిద్ధ దేవస్థానాలైన కేదార్నాథ్, బదరీనాథ్‌లను కూడా కిందటి నెల 4, 5 తేదీల్లో తెరిచి, పూజలు నిర్వహించారు. అధికారులు, పోలీసుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నిరుడు ప్రకృతి విపత్తు మూలంగా చార్ధామ్ యాత్ర పర్యాటకులకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఆ విషాదం నుంచి తేరుకొని, తిరిగి యథావిధిగా యాత్రకు ముమ్మర ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. స్వచ్ఛంద సంస్థలు సైతం యాత్రికులకు సౌకర్యాల కోసం కృషి చేస్తున్నాయి. గత ఏడాది విపత్తు ఎలా జరిగింది? ప్రభుత్వం ప్రస్తుతం ఎలాంటి చర్యలు చేపట్టింది? అనే ఉత్సుకతతోనూ, ప్రకృతి రామణీయకతను ఎద నిండా నింపుకోవడానికి వేల సంఖ్యలో ఈ యాత్రకు సిద్ధం అవుతున్నారు. ఇలాంటి సమయంలో ఈ నాలుగు ధామాల గురించిన సమాచారం తప్పక తెలుసుకోవాలి. ఉత్తరకాశీ నుంచి ఈ యాత్ర యమునోత్రితో ప్రారంభమై గంగోత్రి, కేదార్నాథ్ మీదుగా వెళ్లి బదరీనాథ్తో పూర్తవుతుంది. చాలామంది హరిద్వార్‌తో ఈ యాత్రను ప్రారంభిస్తారు. మన రాష్ట్రం నుంచి చార్ధామ్ యాత్రకు వెళ్లాలనుకునేవారు ఢిల్లీ నుంచి లేదా రిషీకేశ్ నుంచి బయల్దేరవచ్చు. ఇందుకు పర్యాటకరంగం ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తోంది. ప్రైవేటు టూరిస్టులు కూడా తమ సర్వీసులను నడుపుతున్నారు. ముందుగా యమునోత్రి.. ఉత్తరాఖండ్ గర్హ్వాల్లో ఉన్న యమునోత్రికి డెహ్రాడూన్ మీదుగా వెళ్లాలి. యమునోత్రి సముద్రమట్టానికి 3164 మీటర్ల ఎత్తులో ఉంది. ఉత్తరకాశికి 30 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయం మరో 7 కి.మీ దూరంలో ఉందనగా జానకీ చట్టి అనే ప్రాంతం దగ్గర వాహనాలు నిలుపుతారు. ఇక్కడ నుంచి కాలినడకన లేదా గుర్రం మీద లేదా డోలీలో గానీ వెళ్లాల్సి ఉంటుంది. ఉష్ణం, చలితో కూడిన మధ్యస్థమైన వాతావరణం ఇక్కడ ప్రత్యేకత. యమునోత్రి నుంచి 130 కి.మీ ప్రయాణిస్తే గంగోత్రి చేరుకోవచ్చు. తదుపరి గంగోత్రి... గంగోత్రి సముద్రమట్టానికి 3,200 మీటర్ల ఎత్తులో హిమాలయ పర్వతాల మధ్యన ఉంటుంది. ఇక్కడ గంగను హిమనీనదంగా పిలుస్తారు. ఇక్కడ గంగమ్మ తల్లి దర్శనం చేసుకొని17 కి.మీ దూరం కాలినడకన వెళ్తే గోముఖం ఉంటుంది. ఇక్కడే గంగామాతను భగీరథిగా పేర్కొంటారు. ఇక్కడ నుంచి అలకనందా నదితో కలిసిన చోటు నుంచి గంగానదిగా పిలుస్తారు. జ్యోతిర్లంగం... కేదార్నాథ్ ఉత్తరకాశీ నుంచి తెహ్రీ డ్యామ్ మీదుగా గౌరీకుండ్‌కు చేరుకొని, అక్కడి నుంచి 14 కి.మీ దూరం కాలినడకన, గుర్రం లేదా డోలీలో కేదార్నాథ్ చేరుకోవచ్చు. శివుడి పన్నెండో జ్యోతిర్లంగం ఉన్న మందిరమే కేదార్నాథ్. హిమాలయ పర్వత శ్రేణులలో సముద్రమట్టానికి 3,584 మీటర్ల ఎత్తులో మూడు కొండల మధ్య వెలసింది ఈ ఆలయం. మూడు కొండల నుంచి మూడు నదులు కిందికి వచ్చి కలిసిపోయి ఒకే నదిగా మారిపోయే దృశ్యం చూపరులను ఇట్టే కట్టిపడేస్తుంది. మందాకినీ నది ఒడ్డున వెలసిన కేదార్నాథ్ ఆలయం అత్యంత చీకటిగా ఉంటుంది. దీపం వెలుగులోనే శివుడి దర్శనం లభిస్తుంది. ఈ ఆలయంలో పాండవులతో పాటు ద్రౌపది విగ్రహం కూడా ఉంది. కేదార్నాథ్ దగ్గర దాదాపు వెయ్యి మంది యాత్రికులు ఇక్కడ ఉండేలా ఏర్పాట్లు చేశారు. లించోలిలో హెలిప్యాడ్‌తో పాటు బేస్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. కేదార్నాథ్ నుంచి 75 కి.మీ కిందకు దిగి, అక్కడ నుంచి బద్రీనాథ్ ఆలయం చేరుకోవడానికి హిమాలయాల పైకి వెళ్లాలి. రేగుపండు... బదరీనాథ్... కేదార్నాథ్ నుంచి బదరీనాథ్ ఆలయానికి 203 కి.మీ దూరం ఉంటుంది. ఆదిశంకరాచార్యులచే స్థాపించబడి అభివృద్ధి చెందిన వైష్ణవ దేవాలయం ఇది. సముద్రమట్టానికి 3,415 మీటర్ల ఎత్తులో ఉంటుంది. బదరీ అంటే రేగుపండు. నాథ్ అంటే దేవుడు. ఇక్కడ రేగుపండ్లు విస్తారంగా పండటం వల్ల ఇక్కడ వెలసిన దేవునికి బదరీనాథుడు అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ క్షేత్రంలో అన్ని తీర్థాల సమస్త దేవతలు నివసిస్తారని హిందువుల నమ్మకం. చైనా, టిబెట్ సరిహద్దులకు కొద్ది కిలోమీటర్ల దూరంలో అలకనందా నది ఒడ్డున, గఢ్వాల్ కొండలలో కేదార్‌నాథ్‌కు రెండు రోజుల ప్రయాణ దూరంలో ఉంది బదరీనాథ్ ఆలయం. హిందువుల ప్రధాన పుణ్యక్షేత్రాలైన చార్ధామ్లలో ఇది మొదటిది. బదరీనాథ్ మార్గంలో హిమాలయాల మధ్య ఓ అందమైన పూలవనం ఉంది. దీన్నే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటారు. జోషీ మఠ్, అలకనందా నదిపై జలవిద్యుత్ కేంద్రం చూడదగ్గ ప్రదేశాలు. పటిష్ఠమైన భద్రత మధ్య ప్రయాణం పది డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత హిమాలయపర్వత శ్రేణులలో నమోదవుతుంది. యాత్ర మధ్యలో ఒక్కోసారి కొన్ని గంటల పాటు ప్రయాణానికి వీలుపడదు. అకస్మాత్తుగా అనారోగ్యసమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఉత్తరాఖండ్ ప్రభుత్వ యంత్రాంగం ఈసారి పటిష్టమైన చర్యలను చేపట్టింది. ప్రయాణికుల అనారోగ్య సమస్యలను తీర్చడానికి మార్గమధ్యంలో ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేసింది. బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ ద్వారా భక్తుల వివరాలను నమోదు చేస్తున్నారు. వాతావరణ హెచ్చరికలు వారికి ఎప్పటికప్పుడు సెల్ఫోన్ల ద్వారా సమాచారం అందేలా జాగ్రత్తలు తీసుకున్నది. ఇటీవల యాత్ర మొదలైన రెండు రోజులకే మంచు చరియలు విరిగిపడి కొన్ని రోజులు యాత్రను నిలిపివేయాల్సి వచ్చింది. వెంటనే మరిన్ని రక్షణ చర్యలను తీసుకొని యాత్రను పునరుద్ధరించారు. చార్ధామ్ యాత్రను సఫలం చేయడానికి గౌరీకుండ్, కాశీపూర్, రుద్రపూర్, భవాలీ, నైనిటాల్, హల్ద్వానీ డివిజన్లలో వందలాది మంది గాంగ్మెన్లు, కూలీలు రేయింబవళ్లు పనిచేస్తున్నారు. శ్రామికులతో పాటు రోలర్, టిప్పర్ మిషన్లను ఉపయోగిస్తున్నారు. కేదార్నాథ్ యాత్రకు వెళ్లేదారిలో స్వచ్చంద సంస్థలు వెయ్యిమంది యాత్రికులకు సరిపడా భోజనవసతి కల్పించడానికి ముందుకు వచ్చాయి. హిమాలయ ప్రాంతాల్లో వర్షం, మంచు కురియడం వల్ల ఎప్పుడైనా రోడ్లకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నందున అధికారులు, యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. వెంట ఇవి తప్పనిసరి యాత్రికులు తమ వెంట అవసరమైన మందులు, బ్లాంకెట్స్, స్వెటర్, మంకీ క్యాప్, మఫ్లర్, శాలువా, రెయిన్‌కోట్, స్పోర్ట్ షూస్, టార్చ్‌లైట్.. తీసుకెళ్లాలి. - సాక్షి విహారి టూరు ప్యాకేజీ వివరాలు... స్వర్గధామంగా పేర్కొనే చార్ధామ్ యాత్రకు మన రాష్ట్రం నుంచి వెళ్లే యాత్రికులు ఢిల్లీ, రిషీకేష్ నుంచి బయల్దేరవచ్చు. ఇందుకోసం పర్యాటకరంగం టూర్‌ప్యాకేజీలను అందిస్తోంది. రిషీకేష్ నుంచి యమునోత్రి -గంగోత్రి- కేదార్నాథ్ - బద్రీనాథ్ వెళ్లి... తిరిగి రిషీకేష్ చేరుకోవడానికి 10 రోజుల యాత్రకు... మే-జూన్ వరకు గాను ఒక్కొక్కరికి పెద్దలకు రూ.16280/-, పిల్లలకు రూ.15600/-, వృద్ధులకు రూ.15260/- చెల్లించాల్సి ఉంటుంది. జూలై - నవంబర్ యాత్రకు పెద్దలకు రూ.14670/-, పిల్లలకు రూ.14050/-, వృద్ధులకు రూ.13750/- చెల్లించాలి. మరిన్ని వివరాలకు: బాలయోగి పర్యాటక భవన్, బేగంపేట్, హైదరాబాద్, ఫోన్ నెంబర్: 040-23409945, 23400254, మొబైల్ నెం: 09493982645, email: gmvnhyderabad@gmail.com లలో సంప్రదించవచ్చు. ప్రకృతి రామణీయకత... వేసవిలో ఈ యాత్ర ప్రారంభమవుతుంది కనుక వేడికి హిమపాతం తగ్గుముఖం పడుతుంది. దీంతో కొండలు, లోయలు, చెట్లు, నదులు, ప్రవాహాలు.. అడుగడుగునా మనల్ని ఆహ్లాదంలో ముంచెత్తుతాయి. ప్రకృతి ప్రేమికులు ఈ యాత్రను ఎంతగానో ఆనందించవచ్చు. ఇందుకోసమే ఎందరో విదేశీయాత్రికులు ప్రతియేటా చార్ధామ్ యాత్రకు వస్తుంటారు.