చార్ ధామ్ యాత్ర మే 10న ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ధామ్‌లలో భక్తుల రద్దీ నెలకొంది. లక్షలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. అయితే ఈ యాత్రలో పలు విషాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి.
చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి గంగోత్రి-యమునోత్రి ధామ్‌లో ఇప్పటివరకు మొత్తం 14 మంది భక్తులు మృతి చెందారు. తాజాగా యమునోత్రి యాత్రలో గుజరాత్, మహారాష్ట్రకు చెందిన మరో ఇద్దరు భక్తులు మరణించినట్లు తెలుస్తోంది. ఈ మరణాలన్నీ గుండె పోటు కారణంగానే సంభవించాయనే సమాచారం అందుతోంది.
మరోవైపు చార్ ధామ్ యాత్రకు సంబంధించిన ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం పలువురు వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో వారు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదారు రోజులుగా వేచి చూస్తున్నా తమ యాత్రకు రిజిస్ట్రేషన్ జరగడం లేదని వారు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment