chardham yathra
-
‘చార్ధామ్’ మార్గంలో విషాదం.. ఇప్పటివరకూ 14 మంది మృతి
చార్ ధామ్ యాత్ర మే 10న ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ధామ్‌లలో భక్తుల రద్దీ నెలకొంది. లక్షలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. అయితే ఈ యాత్రలో పలు విషాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి.చార్ధామ్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి గంగోత్రి-యమునోత్రి ధామ్‌లో ఇప్పటివరకు మొత్తం 14 మంది భక్తులు మృతి చెందారు. తాజాగా యమునోత్రి యాత్రలో గుజరాత్, మహారాష్ట్రకు చెందిన మరో ఇద్దరు భక్తులు మరణించినట్లు తెలుస్తోంది. ఈ మరణాలన్నీ గుండె పోటు కారణంగానే సంభవించాయనే సమాచారం అందుతోంది.మరోవైపు చార్ ధామ్ యాత్రకు సంబంధించిన ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం పలువురు వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో వారు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదారు రోజులుగా వేచి చూస్తున్నా తమ యాత్రకు రిజిస్ట్రేషన్ జరగడం లేదని వారు వాపోతున్నారు. -
తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం
పవిత్ర చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఆరునెలల తర్వాత కేదార్నాథ్ క్షేత్ర ద్వారాలు తెరుచుకున్నాయి. తొలిరోజే దాదాపు 16వేలమంది భక్తులు పరమేశ్వరుడిని దర్శించుకున్నారు. కేదార్నాథ్తోపాటే గంగోత్రి, యమునోత్రిలోనూ భక్తుల దర్శనాలు ఆరంభమయ్యాయి.దేవభూమి ఉత్తరాఖండ్ హరహర మహాదేవ్ నామస్మరణతో మారుమోగింది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన ప్రసిద్ధ కేదార్నాథ్ ఆలయం తెరుచుకుంది. అక్షయ తృతీయనాడు.. భజనలు, సంకీర్తనల మధ్య క్షేత్ర ద్వారాలు తెరిచారు అధికారులు. దాదాపు 40 క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. హెలికాఫ్టర్ల నుంచి పూల వర్షం కురిపించారు.కేదార్నాథ్ తలుపులు తెరుచుకోవడంతో.. పవిత్ర చార్ధామ్ యాత్ర మొదలైంది. ఆరునెలలపాటు మూసి ఉన్న ద్వారాలు తెరుచుకునే సమయంలో.. దేవాలయ ప్రాంగణం జై కేదార్ నినాదాలతో మారుమోగింది. దాదాపు 16 వేలమంది భక్తులు తొలిరోజు కేదారీశ్వరుని దర్శనానికి వచ్చారు. వేలాదిమంది భక్తులతోపాటు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి.. సతీసమేతంగా కేదారనాథుడిని దర్శించుకున్నారు. తొలి పూజలో పాల్గొన్నారు.కేదార్నాథ్, బద్రినాథ్, గంగోత్రి, యమునోత్రి క్షేత్రాలను కలిపి చార్ధామ్ యాత్రగా పిలుస్తారు. కేదారధామంతోపాటే గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలు భక్తుల కోసం తెరుచుకున్నాయి. పరమపవిత్రంగా భావించే చార్ధామ్ యాత్ర గంగోత్రి దర్శనంతో ప్రారంభమవుతుంది. గంగోత్రి, యమునోత్రి తర్వాత కేదారనాథుని దర్శించుకుంటారు భక్తులు. చివరగా బద్రినాథ్ ధామం చేరుకుని యాత్రను ముగిస్తారు. భూమిపై వైకుంఠంగా పరిగణించే బద్రీనాథ్ క్షేత్ర ద్వారాలు ఈనెల 12న ఉదయం 6 గంటలకు తెరుచుకోనున్నాయి.ఏటా లక్షలమంది భక్తులు చార్ధామ్ యాత్రకు తరలివస్తుంటారు. గతేడాది రికార్డు స్థాయిలో 55 లక్షలమంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. ఈసారి యాత్ర ప్రారంభం నాటికే 22.15 లక్షల మంది భక్తులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరగనుంది. మరోవైపు ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చార్ధామ్ యాత్రకు పటిష్ట ఏర్పాట్లు చేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. -
చార్ధామ్ యాత్రపై సైబర్ నేరగాళ్ల కన్ను.. ఆటకట్టించిన పోలీసులు
చార్ధామ్ యాత్ర ప్రారంభమయ్యేందుకు ఇంకా కొద్ది రోజుల సమయమే ఉంది. ఇంతలో సైబర్ నేరగాళ్లు ఈ యాత్రపై కన్నువేశారు. గతంలో హెలీ సర్వీసుల బుకింగ్ పేరుతో యాత్రికులను మోసగించిన ఈ సైబర్ నేరగాళ్లు ఇప్పుడు హోటల్ బుకింగ్ పేరుతోనూ యాత్రికులను వంచించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.ఈ నేపధ్యంలో తాజాగా పోలీసులు హోటల్ బుకింగ్ పేరుతో సృష్టించిన ఏడు నకిలీ వెబ్సైట్లను, హెలీ సర్వీస్ బుకింగ్ కోసం సృష్టించిన 12 నకిలీ వెబ్సైట్లను మూసివేయించారు. ఏడాది కాలంలో పోలీసులు చార్ధామ్ యాత్రతో ముడిపడిన 83 నకిలీ వెబ్సైట్లను మూసివేయించారు. ఇటువంటి మోసాలను నివారించడానికి పోలీసు శాఖలోని ఇంటర్నెట్ మీడియా సెల్‌ను పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేశారు.ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)తో హెలీ సర్వీస్ బుకింగ్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రభుత్వ అధికారి ఆయుష్ అగర్వాల్ తెలిపారు. యాత్రికులు https://www.heliyatra.irctc.co.in/ ద్వారా చార్ధామ్ హెలీ సర్వీస్‌ను బుక్ చేసుకోవచ్చు. యాత్రికులెవరైనా నకిలీ వెబ్‌సైట్‌ను గుర్తించినప్పుడు డెహ్రాడూన్ ఎస్టీఎఫ్ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చు. లేదా 9456591505, 9412080875 మొబైల్ నంబర్లకు ఫోన్ చేసి, వివరాలు అందించవచ్చని అధికారులు తెలిపారు. -
ప్రత్యేక హెలికాప్టర్లో సమంత తీర్థయాత్రలు..ఫోటోలు వైరల్
నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత వరుసగా విహార యాత్రలు చేస్తున్నారు. ఇటీవల తన బెస్ట్ ఫ్రెండ్ శిల్పారెడ్డితో డెహ్రాడూన్ వెళ్లిన సమంత.. తాజాగా హిమాలయాల సమీపంలో ఉన్న పవిత్ర దైవ క్షేత్రాలను దర్శించుకున్నారు. యమునోత్రి నుంచి మొదలైన యాత్ర గంగోత్రి మీదుగా కేదార్నాథ్, బద్రీనాథ్ వరకు సాగింది. అందులో భాగంగా ఆమె ప్రత్యేక హెలికాప్టర్లో ఛార్ ధామ్ యాత్ర చేశారు. తాజాగా ఆమె ఆధ్యాత్మిక యాత్ర ముగించుకొని తిరుగు ప్రయాణం అయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక హెలికాప్టర్ ముందు దిగిన ఫోటోని ఆమె సోషల్ మీడియా షేర్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ ఫోటో వైరల్‌గా మారింది. ఇక సినిమా విషయాలకొస్తే.. ఇప్పటికే ఆమె గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం మూవీ షూటింగ్‌ని కంప్లిట్ చేసుకుంది. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ సినిమా నటిస్తోంది. దీంతో పాటు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. మరోవైపు షారుఖ్ ఖాన్, అట్లీ కాంబోలో తెరకెక్కబోతున్న చిత్రంలోనూ సమంత హీరోయిన్గా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
బెస్ట్‌ఫ్రెండ్‌తో కలిసి తీర్థయాత్రలకు వెళ్లిన సమంత
Samantha Spiritual Trip With friend Shilpa Reddy: నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత వరుస ప్రాజెక్టులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో ఈ సినిమాల రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. దీంతో ఇప్పుడున్న సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సామ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా తన బెస్ట్‌ఫ్రెండ్, డిజైనర్ శిల్పారెడ్డితో కలసి పుణ్యక్షేత్రాలను దర్శిస్తుంది. ప్రస్తుతం ఆమె ఉత్తరాఖండ్‌లోని చార్ధామ్ యాత్రకు వెళ్లింది. దీనికి సంబంధించిన ఫోటోలను శిల్పారెడ్డి తన ఇన్‌స్టా స్టేటస్‌లో షేర్ చేసుకుంది. చార్ధామ్ యాత్ర.. బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్ అంటూ సామ్‌తో దిగిన ఫోటోలను పంచుకుంది. నాగ చైతన్యతో విడిపోయిన అనంతరం సామ్ మానసికంగా కుంగిపోయినట్లు ఆమె సన్నిహితులు తెలిపారు. ఆ బాధలోంచి బయట పడేందుకు సమంత ఎక్కువగా తన బెస్ట్ ఫ్రెండ్స్‌తో సమయాన్ని గడుపుతున్నట్లు తెలుస్తుంది. View this post on Instagram A post shared by SHILPA REDDY (@shilpareddy.official) -
చార్ధామ్ యాత్రపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
రాంచి: చార్ధామ్ యాత్రపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో చార్ధామ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ ఏడాది కేవలం నాలుగు దేవాలయాల అర్చకులు మాత్రమే పూజలు, ఇతర సంప్రదాయబద్ధమైన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ వెల్లడించారు. మే 14 నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది.. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ ప్రాంతంలో చార్ధామ్ దేవాలయాలు ఉన్నాయి. బదరీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రిలను చార్ధామ్ అంటారు. కాగా కరోనా సెకండ్ వేవ్ వణికిస్తున్న సమయంలో కూడా కుంభమేళాను కొనసాగించింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. కుంభమేళా కారణంగా రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోయాయి. దీంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా గురువారం ప్రత్యేకంగా సమావేశమై చార్ధామ్ యాత్రను రద్దు చేయాలని నిర్ణయించింది. మరోవైపు ఉత్తరాఖండ్‌లో కరోనా కోవిడ్ మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. సిబ్బంది కొరతతో ఉత్తరాఖండ్ ఉక్కిరిబిక్కిరవుతోంది. డెహ్రాడూన్, హల్ద్వానీ, హరిద్వార్‌లో టెస్టులు పెంచాలని హైకోర్టు ఆదేశించింది. రోజుకు 30-50 వేల కరోనా టెస్టులు చేయాలని హైకోర్టు పేర్కొంది. అలాగే 2,500 మంది రిజిస్టర్ డెంటిస్టుల సేవలను వినియోగించుకోవాలని సూచించింది. హోం ఐసోలేషన్‌లోని వారికి తగిన వైద్య సేవలు కల్పించాలని తెలిపింది. చదవండి: కొనసాగుతున్న కరోనా ఉధృతి, రికార్డు స్థాయిలో కేసులు -
చార్ధామ్ యాత్రకు వెళ్లి ..
సాక్షి, కోడుమూరు(కర్నూలు) : చార్ధామ్ యాత్రకు వెళ్లిన కోడుమూరు పట్టణానికి చెందిన ఓ మహిళా భక్తురాలు గుండెపోటుతో మృతిచెందిన ఘటన ఈనెల 27న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని యమునోత్రిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. కోడుమూరుకు చెందిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి రామచంద్రుడు భార్య ధర్మాంబ (65) నాలుగు రోజుల క్రితం చార్ధామ్ యాత్రకు బంధువులతో కలిసి వెళ్లింది. యాత్రలో భాగంగా ఈనెల 27న ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి ఆలయంలో దర్శనం నిమిత్తం క్యూలో నిలబడిన ధర్మాంబ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలింది. గమనించిన బంధువులు అక్కడే ఉన్న వైద్యుడిని సంప్రదించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. ధర్మాంబ మృతదేహాన్ని కోడుమూరుకు తీసుకొచ్చేందుకు వైఎస్సార్సీపీ కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ జిల్లా అధికారులు, ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులతో మాట్లాడారు. శనివారం విమానంలో హైదరాబాద్‌కు, అక్కడి నుంచి రోడ్డుమార్గంలో కోడుమూరుకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకున్నారు. మృతురాలికి భర్తతో పాటు, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
ఉత్తరాదిని వణికిస్తున్న భారీ వర్షాలు
న్యూఢిల్లీ/చండీగఢ్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తరాదిని అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల ప్రభావంతో వరద పోటెత్తి కొండచరియలు విరిగిపడటంతో హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, హరియాణా రాష్ట్రాల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షాల దెబ్బకు వాగులు, వంకలన్నీ ఏకమై ప్రవహిస్తూ ఉండటంతో పంజాబ్ ప్రభుత్వం రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది. అలాగే జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో వర్షాల తీవ్రత దృష్ట్యా మంగళవారం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. బద్రినాథ్, కేదర్నాథ్, యమునోత్రికి వెళ్లే రహదారులపై కొండచరియలు విరిగిపడటంతో చార్ధామ్ యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు. దేశరాజధాని ఢిల్లీలో రోడ్లన్నీ జలమయం కావడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించి వానహదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో బియాస్ నదికి భారీగా వరద పోటెత్తడంతో చాలా ఇళ్లతో పాటు మనాలీలోని ఓ పర్యాటకుల బస్సు కొట్టుకుపోయిందని ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి గోవింద్‌సింగ్ ఠాకూర్ తెలిపారు. కాంగ్రా, కులూ, ఛంబా జిల్లాలో ఐదుగురు చనిపోయారన్నారు. ఇక జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవసమాధి అయ్యారు. బియాస్ నదికి భారీగా వరద పోటెత్తుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అధికారుల్ని ఆదేశించారు. -
ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు
నిలిచిన చార్ధామ్ యాత్ర డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో మంగళవారం సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చార్ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. వరణుడి దెబ్బకు కేదార్నాథ్ యాత్రలో కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి. దీంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు, ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగి భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.