చార్‌ధామ్ యాత్ర ప్రారంభమయ్యేందుకు ఇంకా కొద్ది రోజుల సమయమే ఉంది. ఇంతలో సైబర్ నేరగాళ్లు ఈ యాత్రపై కన్నువేశారు. గతంలో హెలీ సర్వీసుల బుకింగ్ పేరుతో యాత్రికులను మోసగించిన ఈ సైబర్ నేరగాళ్లు ఇప్పుడు హోటల్ బుకింగ్ పేరుతోనూ యాత్రికులను వంచించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఈ నేపధ్యంలో తాజాగా పోలీసులు హోటల్ బుకింగ్ పేరుతో సృష్టించిన ఏడు నకిలీ వెబ్‌సైట్‌లను, హెలీ సర్వీస్ బుకింగ్ కోసం సృష్టించిన 12 నకిలీ వెబ్‌సైట్‌లను మూసివేయించారు. ఏడాది కాలంలో పోలీసులు చార్‌ధామ్ యాత్రతో ముడిపడిన 83 నకిలీ వెబ్‌సైట్‌లను మూసివేయించారు. ఇటువంటి మోసాలను నివారించడానికి పోలీసు శాఖలోని ఇంటర్నెట్ మీడియా సెల్‌ను పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేశారు.
ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ)తో హెలీ సర్వీస్ బుకింగ్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రభుత్వ అధికారి ఆయుష్ అగర్వాల్ తెలిపారు. యాత్రికులు https://www.heliyatra.irctc.co.in/ ద్వారా చార్‌ధామ్ హెలీ సర్వీస్‌ను బుక్ చేసుకోవచ్చు. యాత్రికులెవరైనా నకిలీ వెబ్‌సైట్‌ను గుర్తించినప్పుడు డెహ్రాడూన్ ఎస్‌టీఎఫ్ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చు. లేదా 9456591505, 9412080875 మొబైల్ నంబర్లకు ఫోన్ చేసి, వివరాలు అందించవచ్చని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment