fake websites
-
ఆన్లైన్ బుకింగ్‌పై అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరగ నున్న మహాకుంభమేళాకు వెళ్లాలనుకునే భక్తులందరూ ఆన్ లెన్ బుకింగ్‌లపై జాగ్రత్తగా వ్యవహరించాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) సూచించింది. ఆన్ లైన్లో హోటల్, ధర్మశాల, గెస్ట్‌హౌస్ బుకింగ్‌ల సమయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 45 రోజులపాటు జరిగే ఈ కుంభమేళాకు లక్షలాది మంది సందర్శకులు రాను న్నందున యాత్రికులను మోసం చేయడానికి సైబర్ నేరస్తులు నకిలీ వెబ్సైట్లు, లింక్‌లను సృష్టించే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఎలాంటి రిజర్వేషన్ లేకుండానే తగ్గింపు ధరలకే వసతిని అందిస్తామంటూ మోసగాళ్లు భక్తులను ఆకర్షిస్తారని.. హోటళ్లు, ధర్మశాల, టెంట్ సిటీలకు ముందస్తు చెల్లింపులను వసూలు చేయడానికి మోసపూరిత వెబ్సైట్లు, నకిలీ బుకింగ్ లింక్‌లను ఏర్పాటు చేసే అవకాశం ఉందని పేర్కొంది.టీజీసీఎస్బీ సూచనలు..⇒ అధికారిక మార్గాల్లోనే వసతిని బుక్ చేసుకోండి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ధ్రువీకరించబడిన సంప్రదింపు నంబర్లు, వెబ్సైట్లను ఉపయోగించండి. ఈ అధికారిక వెబ్సైట్ https://kumbh.gov.in/en/ Wheretostaylist అందుబాటులో ఉంది.⇒ అసాధారణంగా తక్కువ ధరలకు వసతిని అందించే తెలియని లింక్‌లు లేదా ప్రకటనలపై క్లిక్ చేయవద్దు.⇒ తెలియని ఖాతాలకు లేదా అనధికారిక బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ముందస్తు చెల్లింపులు చేయవద్దు.⇒ అధికారికంగా క్రాస్–చెక్ చేయడం లేదా రాష్ట్ర అధికారు లను నేరుగా సంప్రదించడం ద్వారా ఏదైనా వసతి లేదా సర్వీస్ ప్రొవైడర్ ప్రామాణికతను ధ్రువీకరించుకోండి.⇒ వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని ఆన్లైన్లో పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.⇒ ఒకవేళ మోసానికి గురైనట్లయితే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయడం ద్వారా లేదా www. cybercrime. gov. in లో అధికారిక సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌ను సందర్శించి ఫిర్యాదు చేయండి.⇒ సైబర్ భద్రతపై మరింత సమాచారం కోసం.. tgcsb.tspolice.gov.in ని సందర్శించండి. -
నకిలీ షాపింగ్ వెబ్సైట్లు.. తస్మాత్ జాగ్రత్త!
సునీల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఫార్మల్షాప్’ పేరుతో ఓ యాడ్ చూశాడు. ‘బ్రాండెడ్ దుస్తులు తక్కువ ధరకే అందిస్తున్నాం. ఈ ఆఫర్ లిమిడెట్ పీరియడ్ మాత్రమే. స్టాక్ అయిపోయిందంటే మాత్రం మీరు నష్టపోతారు. త్వరపడండి’ అంటూ ప్రకటన సారాంశం. వెంటనే సునీల్ లింక్‌పై క్లిక్ చేశాడు. తనుకు కావాల్సిన దుస్తులు సెలక్ట్ చేసుకున్నాడు. 10 రోజుల రిటర్న్ పాలసీ, క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం ఉండడంతో ఎలాంటి అనుమానం చెందకుండా ఆర్డర్ బుక్ చేశాడు. ఇంటికి డెలివరీ అయిన తన ఆర్డర్‌ను తీసుకుని డబ్బు చెల్లించాడు. తీరా ప్యాక్ ఓపెన్ చేసి చిరిగిన, క్వాలిటీ లేని దుస్తులు ఉన్నాయని గ్రహించాడు. వెంటనే లింక్‌పై క్లిక్ చేసి రిటర్న్ పెట్టేందుకు ప్రయత్నించాడు. కానీ అసలు ఆ ఆప్షన్ కనిపించలేదు. మెయిల్ చేసినా స్పందన కరవైంది. హెల్ప్‌లైన్ నంబర్ పనిచేయకపోవడంతో మోసపోయానని గ్రహించాడు.ఆన్లైన్ షాపింగ్ పెరుగుతుండడంతో ఇలాంటి మోసాలు ఎక్కువవుతున్నాయి. సైబర్ కేటుగాళ్లు నకిలీ వెబ్సైట్లు రూపొందించి ఆకర్షణీయ ఆఫర్లంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇస్తూ వాట్సప్‌కు లింక్‌లు పంపుతున్నారు. కస్టమర్లకు ఏమాత్రం అనుమానం రాకుండా వ్యవహరిస్తున్నారు. తీరా బుక్ చేస్తే నకిలీ ఉత్పత్తులను పంపి మోసిగిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో కింది జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.పాటించాల్సిన జాగ్రత్తలుఆన్లైన్ షాపింగ్ కోసం ప్రముఖ వెబ్సైట్లనే వినియోగించాలి.అధికారిక పోర్టల్స్, యాప్‌లను మాత్రమే వినియోగించాలి. ఎలాంటి లింక్‌లపై క్లిక్ చేయకూడదు.ప్రతి వెబ్సైట్లో ‘కాంటాక్ట్ అజ్’ అనే విభాగంలో సంస్థకు చెందిన చిరునామా, అధికారిక మెయిల్ చిరునామా వివరాలు ఉంటాయి. అవిలేని సంస్థ సేవలు వినియోగించకూడదు.కొన్ని సంస్థలు తప్పుడు చిరునామాను కూడా వెబ్సైట్లో ఉంచే ప్రమాదం ఉంది. ఆ అడ్రస్‌ను నెట్లో సెర్చ్ చేస్తే కార్పొరేట్ కార్యాలయం వివరాలు వస్తాయి. అలా ఒకసారి సరిచూసుకోవాలి.‘క్యాష్ ఆన్ డెలివరీ’ విధానంలోనే ఆర్డర్ బుక్ చేసుకోవడం మేలు. డెలివరీ బాయ్ ఆర్డర్ డెలివరీ అందించి దాన్ని ఓపెన్ చేసేలా చూసుకోవాలి.పార్శిల్ తెరిచేటప్పుడు కచ్చితంగా వీడియో రికార్డు చేయండి. ఇది మనకు ఆధారంగా ఉంటుంది.మోసం జరిగితే consumerhelpline.gov.in కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్ నంబర్ 1800-11-4000 (ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5:30 మధ్య) ఫోన్ చేయవచ్చు. -
ఫేక్ వెబ్సైట్లకు చెక్.. గూగుల్‌లో కొత్త ఫీచర్
Google Badges: మనకు ఏ సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్ చేసేస్తాం. అలా సెర్చ్ చేసేటప్పుడు ఒక్కోసారి ఫేక్ వెబ్సైట్ కూడా దర్శనమిస్తుంటాయి. తెలియనివారు వీటితో నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో యూజర్ల భద్రత కోసం గూగుల్ సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది.ఫేస్బుక్, వాట్సాప్, ‘ఎక్స్’ (ట్విటర్) వంటి వాటిలో ప్రసిద్ధమైన వెరిఫికేషన్ బ్యాడ్జ్‌లను గూగుల్ కూడా తీసుకొచ్చే పనిలో ఉంది. ఈ ఫీచర్ ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది. గూగుల్ సెర్చ్ ఫలితాల్లో ఇప్పటికే ఈ తేడాను చూడవచ్చు. అధికారిక మెటా, మైక్రోసాఫ్ట్, యాపిల్ వెబ్సైట్లకు లింక్‌ల పక్కన బ్లూ కలర్ వెరిఫైడ్ బ్యాడ్జ్ కనిపిస్తుంది.ప్రముఖ కంపెనీల అధికారిక ఖాతాలను గుర్తించేందుకు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్నట్లు గూగుల్ ప్రకటించింది. ధ్రువీకరణ చిహ్నాలు (Google Badges) ఇప్పుడు కొన్ని పరిశ్రమలలోని ప్రముఖ కంపెనీల వెబ్ అడ్రస్ పక్కన కనిపిస్తాయి. దీంతో ఫేక్ వెబ్సైట్లను యూజర్లు సులభంగా గుర్తించగలరు. ఇందుకోసం ఆటోమేటెడ్ సిస్టమ్స్‌ను ఉపయోగిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. -
ఆన్లైన్ ఆఫర్ల పేరిట బురిడీ!
సాక్షి, హైదరాబాద్: పండుగల ఆఫర్లు, గిఫ్ట్ కూపన్లు, ప్రత్యేక బహుమతుల పేరిట సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతు న్నారు. నిజమైన కంపెనీలను పోలినట్లుగా ఆన్లైన్ యాప్స్‌లో ప్రకటనలు గుప్పిస్తున్నారు. ‘మీకు సర్ఫ్రైజ్ గిప్ట్ వచ్చింది.. ఈ పండుగకు మా కంపెనీ తరఫున మీకు బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాం. మీరు ఈ కూపన్లోని నంబర్లను మేం చెప్పిన నంబర్‌కు ఎస్ఎంఎస్ చేయండి’ అంటూ మోసపూరితమైన మెసేజ్‌లను మొబైల్ ఫోన్లు, వాట్సాప్‌లకు పంపుతున్నారు. అందులో కొన్ని ఫిషింగ్ లింక్‌లను జత చేస్తున్నారు. ఇలాంటివి నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.ఈ లాజిక్ మిస్సవ్వొద్దు..షాపింగ్ చేయకుండానే ఉచితంగా ఏ కంపెనీ, ఏ షాపింగ్ మాల్ కూడా గిఫ్ట్ కూపన్ లేదా ఫ్రీ గిఫ్ట్ ఇవ్వదన్న విషయాన్ని మరిచిపోవద్దని చెబుతున్నారు. గతంలో ఎప్పుడో షాపింగ్ చేసిన దానికి ఇప్పుడు లక్కీ డ్రా వచ్చినా నమ్మకూడదంటున్నారు. వాట్సాప్‌లకు వచ్చే మెసేజ్‌లలోని అనుమానా స్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని.. ఒకవేళ పొరపాటున క్లిక్ చేస్తే వెంటనే ఫోన్లోకి మాల్వేర్ వైరస్ ఇన్స్టాల్ కావడంతోపాటు ఫోన్ సైబర్ నేరగాళ్ల అధీనంలోకి వెళ్తుందని హెచ్చరిస్తున్నారు.ఆఫర్ల పేరిట మోసాలకు అవకాశం ఇలా..⇒ ప్రముఖ ఈ–కామర్స్ వెబ్సైట్లను పోలినట్లుగా ఫేక్ వెబ్సైట్లు సృష్టించి మోసాలు. సోషల్ మీడియా వేదికల ద్వారా ఫేక్ ఆఫర్ మెసేజ్‌లు.⇒ ఫ్రీ గిప్ట్‌లు, లక్కీ డ్రాలో బహుమతులు గెల్చుకున్నట్లు ఫేక్ ఫోన్ కాల్స్‌తో, ఎస్ఎంఎస్లతో మోసాలు. ⇒ ఫిషింగ్ మెయిల్స్ పంపి అందులోని లింక్‌లపై క్లిక్ చేయాలని సూచనలు. ⇒ పండుగ సీజన్లో ఫ్రీ గిఫ్ట్‌ల కోసం తాము పంపే ఆన్లైన్ గేమ్స్ ఆడి పాయింట్స్ గెలవాలంటూ నకిలీ ఆన్లైన్ గేమ్స్ లింక్‌లతో సందేశాలు. -
శ్రీశైలం దేవస్థానం పేరుతో ఫేక్ వెబ్సైట్లు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలానికి వచ్చే భక్తులపై సైబర్ నేరగాళ్లు వల వేశారు. ఆన్లైన్లో గదుల బుకింగ్ కోసం వెతికేవారే టార్గెట్‌గా డూప్లికేట్ వెబ్సైట్లు సృష్టించి పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేస్తున్నారు. అచ్చం శ్రీశైలం దేవస్థానం అధికారక వెబ్‌సైట్‌ను పోలి ఉండే ఫేక్ వెబ్సైట్ సృష్టించారు. అందులో వివరాలు నింపగానే సంబంధిత భక్తులకు ఫోన్ చేసి.. “వసతి గది కోసం మీరు చేసుకున్న బుకింగ్ కన్ఫర్మ్ అయింది. మీరు వెంటనే మా ఫోన్ నంబర్‌కు ఫోన్ పే, గూగుల్ పే ఇతర యూపీఐ పేమెంట్ ఆప్షన్లతో డబ్బు చెల్లించండి. ఆ తర్వాత మీ గది బుకింగ్ డిటెయిల్స్ పంపిస్తాం’ అంటూ సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగుతారు. పేమెంట్ చేశాక ఫేక్ బుకింగ్ నంబర్లు పంపి మోసం చేస్తున్నారు. వాస్తవానికి వసతి గది కోసం దేవస్థానం కానీ, ఇక్కడి ప్రైవేట్ సత్రాలు, ఏపీ టూరిజం వారు కానీ పేమెంట్ కోసం ఫోన్ చేయరు. పేమెంట్ అంతా ఆన్లైన్ గేట్‌వే ద్వారానే జరుగుతుంది. శ్రీశైల క్షేత్రంలో ఆర్జితసేవ టికెట్లు, వసతి గదుల విషయంలో దళారులు అధికమయ్యారు. వారికి అడ్డుకట్ట వేసేందుకు దేవస్థానం ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ (మల్లన్న స్పర్శ దర్శనం) టికెట్లను వందశాతం ఆన్లైన్ చేసింది. అలాగే వసతి గదులను సైతం ఎక్కువ శాతం ఆన్లైన్ ద్వారానే కేటాయిస్తున్నారు. ఇదే ఆసరాగా సైబర్ నేరగాళ్లు భక్తులను మోసగిస్తున్నారు. ఏపీ టూరిజంకూ తప్పని బెడద భక్తుల సౌకర్యార్థం వీఐపీ కాటేజీలు, గణేశ సదన్, మల్లికార్జున సదన్, గంగా–గౌరీ సదన్, కుమార సదన్, పాతాళేశ్వరసదన్ తదితర పేర్లతో వసతి గదులను శ్రీశైల దేవస్థానం ఏర్పాటు చేసింది. వీటి బుకింగ్ విషయంలో భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు ఆన్లైన్ సదుపాయాన్ని కల్పించింది. సైబర్ నేరగాళ్లు ముఠాగా ఏర్పడి దేవస్థానం వసతి గదుల పేర్లతో సమానంగా నకిలీ వెబ్సైట్లు తయారుచేసి వాటి ద్వారా భక్తులను మోసం చేస్తున్నారు. కేవలం దేవస్థానానికి మాత్రమే కాకుండా శ్రీశైలంలో ఉన్న ఏపీ టూరిజం, శ్రీశైలంలోని ప్రైవేట్ సత్రాలకు సైతం ఫేక్ వెబ్సైట్ల బెడద తప్పడం లేదు. ఆయా సంస్థల పేరుతో నకిలీ వెబ్సైట్లు తయారు చేసి డబ్బు వసూలు చేస్తున్నారు. ఫేక్ వెబ్సైట్లను ఆశ్రయించి డబ్బు చెల్లించిన భక్తులు శ్రీశైలం వచ్చి సదరు సంస్థ రిసెప్షన్లో వారికి వచి్చన మెసేజ్‌ను చూపించగా అది ఫేక్ అని తేలిపోతుండటంతో లబోదిబో మంటున్నారు. ఆ తర్వాత గదులు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. సైబర్‌క్రైం పోలీసులు నకిలీ ఐడీలపై విచారణ చేయగా రాజస్థాన్, జైపూర్ వాటిని ఆపరేట్ చేస్తున్నట్లుగా గుర్తించారు. అసలైన వెబ్సైట్లను గుర్తించండిలా.. శ్రీశైల దేవస్థానం అధికారికంగా www.srisailadevasthanam.org (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.శ్రీశైలదేవస్థానం.ఓఆర్జీ) వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. ఈ వెబ్సైట్ ద్వారా ఆర్జితసేవలు, దర్శనం టికెట్లు, వసతి గదులు పొందవచ్చు. అలాగే aptemples.ap.gov.in (ఏపీటెంపుల్స్.ఏపీ.జీవోవీ.ఇన్) ద్వారా కూడా లాగిన్ అయి శ్రీశైల దేవస్థానం వెబ్సైట్లోకి వెళ్లి తమకు కావాల్సిన సేవలను, వసతి గదులను పొందవచ్చు.అలాగే srisailadevasthanam (శ్రీశైలదేవస్థానం) మొబైల్ యాప్‌ను ప్లే స్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకుని తద్వారా ఆయా సేవలను పొందవచ్చు. భక్తులు అప్రమత్తంగా ఉండాలి శ్రీశైల దేవస్థాన వెబ్సైట్లను పోలిన నకిలీ వెబ్సైట్ల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలి. కంప్యూటర్‌పై పరిజ్ఞానం ఉన్నవారు మాత్రమే స్వయంగా వసతి, ఆర్జిత సేవా టికెట్లను పొందాలి. కంప్యూటర్ పరిజ్ఞానం లేనివారు కంప్యూటర్ సెంటర్లను ఆశ్రయించి ఆయా సేవలను పొందితే ఫేక్ ఐడీల బారిన పడకుండా ఉండవచ్చు. – డి.పెద్దిరాజు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి -
చార్ధామ్ యాత్రపై సైబర్ నేరగాళ్ల కన్ను.. ఆటకట్టించిన పోలీసులు
చార్ధామ్ యాత్ర ప్రారంభమయ్యేందుకు ఇంకా కొద్ది రోజుల సమయమే ఉంది. ఇంతలో సైబర్ నేరగాళ్లు ఈ యాత్రపై కన్నువేశారు. గతంలో హెలీ సర్వీసుల బుకింగ్ పేరుతో యాత్రికులను మోసగించిన ఈ సైబర్ నేరగాళ్లు ఇప్పుడు హోటల్ బుకింగ్ పేరుతోనూ యాత్రికులను వంచించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.ఈ నేపధ్యంలో తాజాగా పోలీసులు హోటల్ బుకింగ్ పేరుతో సృష్టించిన ఏడు నకిలీ వెబ్సైట్లను, హెలీ సర్వీస్ బుకింగ్ కోసం సృష్టించిన 12 నకిలీ వెబ్సైట్లను మూసివేయించారు. ఏడాది కాలంలో పోలీసులు చార్ధామ్ యాత్రతో ముడిపడిన 83 నకిలీ వెబ్సైట్లను మూసివేయించారు. ఇటువంటి మోసాలను నివారించడానికి పోలీసు శాఖలోని ఇంటర్నెట్ మీడియా సెల్‌ను పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేశారు.ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)తో హెలీ సర్వీస్ బుకింగ్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రభుత్వ అధికారి ఆయుష్ అగర్వాల్ తెలిపారు. యాత్రికులు https://www.heliyatra.irctc.co.in/ ద్వారా చార్ధామ్ హెలీ సర్వీస్‌ను బుక్ చేసుకోవచ్చు. యాత్రికులెవరైనా నకిలీ వెబ్‌సైట్‌ను గుర్తించినప్పుడు డెహ్రాడూన్ ఎస్టీఎఫ్ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చు. లేదా 9456591505, 9412080875 మొబైల్ నంబర్లకు ఫోన్ చేసి, వివరాలు అందించవచ్చని అధికారులు తెలిపారు. -
ఆన్లైన్లో మ్యాంగోస్.. పండు కోసం క్లిక్ చేస్తే పైసలు పోతాయ్!
సాక్షి, హైదరాబాద్: మార్కెట్లో ఏ సీజన్ నడిచినా దానిని మోసాలకు వేదికగా మార్చుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. చివరకు మామిడి పళ్లను సైతం వదలడం లేదు. వేసవి అంటే మామిడి పళ్ల ప్రియులకు పండగే. తాజా తాజా వెరైటీలు రుచిచూడాలని తహతహలాడేవారు బోలెడుమంది. సరిగ్గా ఇదే బలహీనతను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే చాలు..మీ ఇంటికే తాజా మామిడి పళ్లు పంపుతామంటూ ఆన్లైన్లో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తున్నారు. అందులో నకిలీ వెబ్సైట్ లింకులు పెడుతున్నారు. అవి నమ్మి ఆన్లైన్లో పళ్లు ఆర్డర్ ఇచ్చేందుకు ప్రయతి్నస్తే అప్పుడు మోసానికి తెరతీస్తున్నారు. మొదట సగం డబ్బులు పేమెంట్ చేస్తేనే ఆర్డర్ పంపుతామని, మొత్తం డబ్బులు ముందే తమ ఖాతాకు పంపితే డిస్కౌంట్ ఆఫర్లు ఉంటాయని ఊరిస్తున్నారు. ఇది నమ్మి డబ్బులు పంపిన తర్వాత ఎదురు చూపులే తప్ప..పళ్లు రావడంలేదు. చివరికి తాము మోసపోయామన్న తత్వం బోధపడుతోంది మామిడి ప్రియులకు. ఆన్లైన్ మామిడిపళ్ల పేరుతో దేశవ్యాప్తంగా ఎన్నో నకిలీ వెబ్సైట్లు ఉన్నట్టు వెలుగులోకి వస్తున్నదని కేంద్ర హోం శాఖ పరిధిలో సైబర్ నేరాలపై అప్రమత్తంచేసే పోర్టల్ ‘సైబర్ దోస్త్’వెల్లడించింది. ఈ తరహాలో దేశవ్యాప్తంగా ఎక్కువ కేసులు నమోదవుతున్నందున ఆన్లైన్లో పళ్ల కొనుగోలులో జాగ్రత్త పడాలని అధికారులు సూచిస్తున్నారు. ఆర్డర్ చేసేముందే అది నిజమైన వెబ్‌సైటా లేక నకిలీదా అన్నది నిర్ధారించుకోవాలని చెబుతున్నారు. వీలైనంత వరకు ముందుగా డబ్బులు పంపకపోవడమే ఉత్తమమని వారు సూచిస్తున్నారు. ఒకవేళ మోసపోయినట్టు గుర్తిస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్లో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. -
నకిలీ వెబ్సైట్లు తొలగింపు
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలకు ప్రధాన వేదిక నకిలీ వెబ్సైట్లు, మొబైల్ అప్లికేషన్లే (యాప్స్). దీంతో వాటిని కూకటివేళ్లతో సహా తొలగించి తద్వారా సైబర్ నేరాలను పెకిలించేందుకు సైబరాబాద్ పోలీసులు పక్కా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. సైబరాబాద్‌లోని సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీఓఈ) ద్వారా నకిలీ వెబ్సైట్లు, యాప్‌లను గుర్తించి, ఎక్కడికక్కడే కట్టడి చేస్తున్నారు. ఇప్పటివరకు సీఓఈ ద్వారా వందకు పైగా ఫేక్ సైట్లను తొలగించారు. విదేశాల నుంచి కూడా.. విదేశాలతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్, ఉత్తరాఖండ్, కర్నాటక, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుంచి ఎక్కువగా సైబర్ నేరస్తులు నకిలీ వెబ్సైట్లు, కాల్ సెంటర్లు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నేరస్తులు నకిలీ యాప్‌లను అభివృద్ధి చేసి, ప్లే స్టోర్లలో అందుబాటులో ఉంచుతున్నారు. అవి నకిలీవని తెలియక చాలా మంది కస్టమర్లు వాటిని డౌన్లోడ్ చేసుకొని మోసపోతున్నారు. అందుకే పక్కా ఆధారాలతో నకిలీ సైట్లు, యాప్‌లను తయారు చేసే వారిని గుర్తించి, శిక్షలు పడేలా చేస్తున్నారు. ప్రతీ స్టేషన్లో సైబర్ వారియర్లు.. ప్రస్తుతం సైబర్ పోలీసు స్టేషన్‌తో పాటు ప్రతి శాంతి భద్రతల ఠాణాలోనూ ఇద్దరు సైబర్ వారియర్లు ఉన్నారు. వీరికి ఎస్ఐ నేతృత్వం వహిస్తారు. వీరికి సైబర్ నేరాల నియంత్రణపై శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రజలు తమ వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమాలలో పెట్టడం కూడా సైబర్ నేరస్తులకు అవకాశంగా మారుతోంది. అవగాహనే సైబర్ నేరాలకు నియంత్రణకు ప్రధాన అస్త్రం. అందుకే కమిషనరేట్ పరిధిలో నివాసిత సంఘాలు, కంపెనీలు, పరిశ్రమలు, విద్యా సంస్థలలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలలోనూ సైబర్ నేరాలపై షార్ట్ వీడియో, పోస్ట్‌లు చిత్రీకరించి ప్రచారం చేస్తున్నారు. -
మరో నకిలీ టీడీడీ వెబ్‌సైట్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
-
టీటీడీ పేరుతో నకిలీ వెబ్సైట్ల కలకలం.. 40 సైట్లపై ఫిర్యాదు
సాక్షి, తిరుమల: టీటీడీ పేరుతో నకిలీ వెబ్ సైట్ల మోసాలు కలకలం రేపుతున్నాయి. దర్శన టికెట్లు, గదులు కేటాయిస్తామంటూ నకిలీ వెబ్సైట్ల నిర్వాహకులు మోసాలకు పాల్పడుతున్నారు. 40 వెబ్ సైట్లపై పోలీసులకు టీటీడీ ఐటీ విభాగం తాజాగా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
తక్కువ రేట్లకే బ్రాండెడ్ వస్తువులు.. డబ్బు కట్టాక రివ్యూలు చూస్తే!
Hyderabad Fraud Shopping Website: బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫేస్బుక్ పేజీలో కళ్ల జోడు యాడ్ వచ్చింది. దానిపై ప్రముఖ కంపెనీ పేరు ఉండటంతో పాటు క్లియరెన్స్ సేల్ అని కనిపించడంతో ఆయన ముందుకు వెళ్లారు. మార్కెట్లో కనీసం రూ.10 వేలు ఖరీదు చేసే చలువ కళ్లజోడు కేవలం రూ.2 వేలకే అంటూ అందులో ఉంది. ఆ మొత్తం ఫోన్ పే ద్వారా చెల్లించిన ఆయన కొన్ని రోజులకు మోసపోయినట్లు గుర్తించారు. ఇటీవల కాలంలో అనేకమంది ఇలాంటి ఆన్లైన్ ప్రకటనల బారినపడి మోసపోతున్నారు. నష్టపోయేది చిన్న మొత్తాలు కావడంతో పోలీసుల వరకు వెళ్లకుండా మిన్నకుండిపోతున్నారు. ఇదే మోసగాళ్లకు కలిసి వచ్చే అంశంగా మారిపోయింది. నగరంలో ప్రతి రోజూ వందలాది మంది ఈ యాడ్స్ బారినపడుతున్నారని తెలుస్తోంది. క్లియరెన్స్ సేల్ పేరుతో... ఫేస్బుక్ సహా వివిధ సోషల్‌మీడియా సైట్ల ద్వారా నకిలీ కంపెనీలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. కళ్లజోళ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్లు, ఉడెన్ ఫర్నిచర్.. ఇలా అనేక ఉత్పత్తులకు సంబంధించి ఈ ప్రకటనలు కనిపిస్తున్నాయి. అత్యంత ఆకర్షణీయంగా ఉంటున్న ఆ ప్రకటనల్లో ఉత్పత్తుల ఫోటోలు అదే స్థాయిలో ఉంటున్నాయి. బహిరంగ మార్కెట్లో దొరికే వాటి కంటే ఆకట్టుకునేలా, అతి తక్కువ రేటుతో కనిపిస్తున్నాయి. ప్రతి దాంట్లోనూ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ సేల్స్, క్లియరెన్స్ సేల్ అంటూ మోసగాళ్లు పొందుపరుస్తున్నారు. వీటిని చూసిన ఎవరైనా తక్కువ ధరకు ఎందుకు విక్రయిస్తున్నారని అనుమానించట్లేదు. ‘పైన’ ఒకటి.. ‘అడ్రస్’ మరోటి.. ► ఈ ప్రకటనలు సైతం చూసే వారికి ఎలాంటి అనుమానం రాకుండా ఉంటున్నాయి. సదరు వెబ్ పేజీ తెరిచిన వెంటనే పైన ప్రముఖ కంపెనీల పేర్లు దర్శనమిస్తున్నాయి. మోసగాళ్లు ఎక్కువగా ఈ–కామర్స్ రంగంలో పేరెన్నికగన్న కంపెనీల పేర్లు, లోగోలు వాడుతున్నారు. ► ఆయా సైట్లలో షాపింగ్ చేయడానికి పొందు పరచాల్సిన ఫోన్ నంబర్, చిరునామా తదితరాలకు సంబంధించిన అంశాలన్నీ ఈ పేజీలోనూ ఉంటున్నాయి. ఆ పేజీలకు సంబంధించిన అడ్రస్ బార్లో మాత్రం ఆయా కంపెనీ అడ్రస్‌లు ఉండట్లేదు. ► సాధారణంగా ప్రముఖ కంపెనీల నుంచి ఆన్లైన్లో ఖరీదు చేస్తే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది. కొన్ని ప్రాంతాలు, ఉత్పత్తులకు మినహాయిస్తే మిగిలిన వాటికి ఇది కచ్చితంగా కనిపిస్తుంటుంది. ► బోగస్ వెబ్సైట్లలో మాత్రం ఈ అవకాశం ఉండదు. ఖరీదు చేసే వాళ్లు కచ్చితంగా అప్పటికప్పుడే గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐలు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బు చెల్లించిన తర్వాతే ఆర్డర్ ఖరారు అవుతోంది. చదవండి: ఆ శాఖలోనే అత్యధిక ఖాళీలు..హైదరాబాద్‌లోనే 25 వేల మందికిపైగా అభ్యర్థులు ‘మార్కెటింగ్ ఇంటెలిజెన్స్’ ఏమైనట్లు? ► బాధితులు నష్టపోయేది తక్కువ మొత్తాలే కావడంతో కనీసం 5 శాతం మందీ పోలీసు వరకు వచ్చి ఫిర్యాదు చేయట్లేదు. డబ్బు తిరిగి రాదు సరికదా ఠాణా చుట్టూ తిరగాల్సి వస్తుందని వారు భావిస్తుండటమే దీనికి కారణం. సైబర్ స్పేస్‌లో జరిగే ఈ తరహా మోసాలను ముందుగానే కనిపెట్టాల్సిన అవసరం ఉంది ► నానాటికీ పెరిగిపోతున్న సైబర్ నేరాలు, కేసుల దర్యాప్తులో తలమునకలై ఉంటున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పుడు ఈ విషయాలు పట్టించుకోవట్లేదు. ఫలితంగా మోసగాళ్లు అనునిత్యం అందినకాడికి దండుకుంటున్నారు. ► ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ టీమ్‌లను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. సైబర్ నేరాలకు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లేదా టోల్‌ఫ్రీ నంబర్ 1930 ద్వారా ఫిర్యాదు చేయాలని అధికారులు కోరుతున్నారు. డబ్బు కట్టాక రివ్యూలు చూస్తే... ► డబ్బు చెల్లించిన వినియోగదారులకు కన్ఫర్మేషన్ ఈ–మెయిల్స్, ఎస్సెమ్మెస్‌లు రావట్లేదు. మరోసారి ఆ పేజ్‌లోకి వెళ్లి తనిఖీ చేయాలని ప్రయత్నిస్తే గతంలో లావాదేవీలు చేసిన పేరుతో కనిపించట్లేదు. ► కొన్నిసార్లు యూపీఐ విధానంలో డబ్బు చెల్లించిన తర్వాత ఆయా సైట్లలోనే ఏదో సాంకేతిక పొరపాటు జరిగింది. మళ్లీ ప్రయత్నించండి’ అంటూ వస్తోంది. ► అప్పటికే చెల్లించిన డబ్బు మాత్రం వినియోగదారులకు తిరిగి రావట్లేదు. అతికష్టమ్మీద షాపింగ్ చేసిన పేజ్‌ను గుర్తించి, పరిశీలిస్తే మాత్రం రివ్యూల ద్వారా అసలు విషయం తెలుస్తోంది. వాటిలో వందల మంది తాము మోసపోయాంటూ రాస్తున్నారు. -
అక్రమ ఆఫర్లు.. ఇన్‌కం ట్యాక్స్ వార్నింగ్..
న్యూఢిల్లీ: అక్రమ పద్ధతిలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న ప్రకటనలను నమ్మవద్దంటూ ప్రజలను ఆదాయపన్ను శాఖ తాజాగా హెచ్చరించింది. ఉద్యోగార్థులు ఎస్ఎస్సీ లేదా సంబంధిత శాఖకు చెందిన అధికారిక వెబ్సైట్లను మాత్రమే విశ్వసించమంటూ సూచించింది. వీటిలో వెలువడే ఆఫర్లకు మాత్రమే స్పందించవలసిందిగా సలహా ఇచ్చింది. కొంతమంది మోసగాళ్లు ఉద్యోగాలు ఆశిస్తున్నవారికి తప్పుడు అవకాశాలు సృష్టిస్తున్నట్లు పేర్కొంది. నకిలీ అపాయింట్మెంట్ లేఖలు అందించే ఇలాంటి మోసగాళ్ల వలలో చిక్కుకోవద్దని ట్వీట్ ద్వారా హెచ్చరించింది. ఆదాయపన్ను(ఐటీ) శాఖలో ఉద్యోగాలంటూ కొంతమంది వంచిస్తున్నట్లు ప్రజలనుద్దేశించి జారీ చేసిన నోటీసులో పేర్కొంది. గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలన్నింటినీ ప్రత్యక్షంగా ఎస్ఎస్సీ ద్వారానే భర్తి చేస్తామని ఐటీ శాఖ స్పష్టం చేసింది. ఎస్ఎస్సీ వెబ్సైట్లో ఉద్యోగ సంబంధ నోటిఫికేషన్లు, ఫలితాలు తదితర వివరాలు అందుబాటులో ఉంటాయని తెలియజేసింది. -
డీమార్ట్ పేరిట ఘరానా మోసం, లింక్ ఓపెన్ చేశారో అంతే!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి సమయంలో సైబర్ మోసాలు గణనీయంగా పెరిగాయి. నకిలీ యాప్స్, క్లోన్ వెబ్సైట్ల పేరుతో సైబర్ నేరస్థులు అమాయక ప్రజలకు కుచ్చుటోపీ పెడుతున్నారు. వాట్సాప్‌లో కూడా నకిలీ వెబ్సైట్ల లింకుల బెడద ఎక్కువగానే ఉంది. సైబర్ నేరస్థులు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ అమాయక ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. ఈ సారి రిటైల్ సూపర్ మార్కెట్ల దిగ్గజం డీమార్ట్ రూపంలో సైబర్ నేరస్థులు విరుచుకుపడుతున్నారు. చదవండి: Ola Electric: మరో సంచలనానికి తెర తీయనున్న ఓలా ఎలక్ట్రిక్...! డీమార్ట్ సూపర్ మార్కెట్ తన 20 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉచితంగా బహుమతులు పంపిణీ చేస్తోందని పేర్కొంటూ ఒక లింక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ లింక్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ సైబరాబాద్ ట్విట్ తన ట్విట్లో పేర్కొంది. నకిలీ లింక్‌పై క్లిక్ చేసినప్పుడు, స్పిన్ వీల్ ఉన్న థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌కు ప్రజలు మళ్లీంచబడతారు. మీరు సుమారు రూ. 10,000 వరకు బహుమతి కార్డులను గెలుచుకోవడానికి స్పీన్ వీల్ తిప్పమని అడుగుతుంది. మీరు వీల్‌ను స్పిన్ చేసిన వెంటనే'ఉచిత బహుమతి'తో మరొక లింక్ ఓపెన్ అవుతోంది. గిఫ్ట్‌ను క్లెయిమ్ చేయడానికి 'ఉచిత బహుమతి' పోటీని ఇతర స్నేహితులతో పంచుకోవాలని మిమ్మల్ని అడుగుతుంది.ఆయా లింక్‌లను ఓపెన్ చేస్తే సైబర్‌నేరస్తులు ప్రజల బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు దోచేస్తున్నారని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. బీ అలర్ట్.. ఈ లింక్ ఓపెన్ చేయవద్దు.#DMart pic.twitter.com/x9XmqHzWqO — Economic Offences Wing Cyberabad (@EOWCyberabad) August 21, 2021 (చదవండి: Elon Musk-Jeff Bezos: ఎలన్ మస్క్‌కు పెద్ద దెబ్బే కొట్టిన జెఫ్‌బెజోస్...!) -
ఈ వెబ్సైట్ల జోలికి పోయారో అంతే సంగతులు..!
సాక్షి, హైదరాబాద్: గత కొంతకాలంగా సైబర్ మోసాలు భారీగా పెరిగాయి. కరోనా మహామ్మారి సమయంలో సైబర్ మోసాలు గణనీయంగా వృద్ధి చెందాయి. నకిలీ యాప్స్, వెబ్సైట్ల పేరుతో ప్రజలకు సైబర్ నేరస్తులు కుచ్చుటోపీ పెడుతున్నారు. ఆండ్రాయిడ్ స్మార్ఫోన్లలోకి నకిలీ వెబ్సైట్ల రూపంలో ప్రజలను దోచుకుంటున్నట్లు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ జింపెరియం కూడా నిర్థారించింది. తక్కువ ధరలకే పలు వస్తువులు వస్తాయనే లింక్‌లను సామాన్య ప్రజలకు సైబర్ నేరస్థులు ఎరగా వేస్తున్నారు. (చదవండి: తాలిబన్లు తెచ్చిన తంటాలు..భారత్‌లో వీటి ధరలు భారీగా పెరుగుతాయా...!) తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాల పట్ల జాగ్రత్త వహించాలని ప్రజలకు విన్నవించారు. తక్కువగా ధరలకే వస్తువులు వస్తున్నాయని చూపే వెబ్సైట్లను, ఇతర లింక్‌ల జోలికి వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డేబెట్, అమెజాన్93.కామ్, ఈబే19.కామ్, లక్కీబాల్, EZ ప్లాన్, సన్‌ఫ్యాక్టరీ.ETC వంటి నకిలీ వెబ్సైట్లు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. (చదవండి: మొబైల్ రీచార్జ్ టారిఫ్‌ల పెంపు తప్పనిసరి కానుందా..!) -
పుట్టగొడుగుల్లా ‘పాస్‌పోర్ట్ సైట్స్’
సాక్షి, హైదరాబాద్: పాస్‌పోర్ట్ పొందాలని, రెన్యువల్ చేసుకోవాలని భావించే వారిని టార్గెట్‌గా చేసుకుంటూ సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లను పెద్ద సంఖ్యలో రూపొందించారు. ప్రధానంగా పాస్‌పోర్టులను రెన్యువల్ చేయించుకోవడానికి వీటిని ఆశ్రయిస్తున్న నగరవాసులు మోసపోతున్నారు. ఈ తరహాకు చెందిన ఫిర్యాదులు రోజుకు ఒకటి చొప్పున వస్తున్నాయని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. తాజాగా జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యక్తి నకిలీ వెబ్సైట్ వల్లోపడి రూ.2999 నష్టపోయారు. ఆయన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాస్‌పోర్టులను పునరుద్ధరించుకోవాలని భావిస్తున్న నగరవాసులు నేరుగా రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయం అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయకుండా ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉండే పాస్‌పోర్ట్ విభాగానికి ప్రత్యేక వెబ్సైట్ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సర్వర్ ఆధారంగా పని చేస్తుండటంతో (www.passportindia.gov.in) అనే అడ్రస్‌తో పని చేస్తుంటుంది. పాస్‌పోర్ట్ రెన్యువల్ చేసుకోవాలని భావించే వారిని మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు (www.indianpassport.com), (www.indiapassport.ind.in), (passportindianonline.com),(onlinepassportservice.com) పేరుతో నకిలీ వెబ్‌సైట్స్ రూపొందించారు. పాస్‌పోర్ట్ కార్యాలయం వెబ్సైట్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఇవి కూడా కనిపిస్తున్నాయి. ఇవే నిజమైనవిగా భావిస్తున్న నగరవాసులు వాటిలోకి ప్రవేశిస్తే... కొన్నిసార్లు ఆయా సైట్లకు వేరే వాటికి డైరెక్ట్ చేస్తున్నాయి. ఆ సైట్స్ లోకి వెళ్తున్న బాధితులు తన పూర్తి వివరాలు పొందుపరచడంతో పాటు రుసుము చెల్లించేస్తున్నారు. ఆ తర్వాత స్లాట్ బుకింగ్ దగ్గరకు వచ్చేసరికి కొన్ని తేడాలు కనిపించడంతో బాధితులు ఆయా సైట్స్ నకిలీవిగా గుర్తించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి నకిలీ వెబ్సైట్ల కారణంగా 40 మంది మోసపోతే ఒక్కరే ఫిర్యాదు చేస్తుంటారని అధికారులు తెలిపారు. అత్యధికులు నష్టపోయింది తక్కువ మొత్తమే కదా అని వదిలేస్తున్నారన్నారు. ఇలాంటి నకిలీ వెబ్సైట్ల కారణంగా బాధితులు డబ్బు కోల్పోవడమే కాకుండా విలువైన వ్యక్తిగత డే టాను సైబర్ నేరగాళ్లకు అందిస్తున్నారని హెచ్చరిస్తున్నారు. ఈ నకిలీ వెబ్సైట్ల మూలాలు కనుక్కోవడానికి సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నారు. పాస్‌పోర్ట్ కోసం, రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్లు వెబ్సైట్లను పూర్తిగా సరిచూసుకున్నానే వివరాలు నింపడం, రుసుము చెల్లించడం చేయాలని సూచిస్తున్నారు. -
‘జేఈఈ మెయిన్’ పేరిట ఫేక్ వెబ్సైట్లు
సాక్షి, అమరావతి: జేఈఈ మెయిన్–2021 పేరిట ఫేక్ వెబ్సైట్లు హల్చల్ చేస్తున్నాయి. ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన పరీక్షలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు వీటి బారినపడి మోసపోతున్నారు. ఫేక్ వెబ్సైట్లను రూపొందించిన కేటుగాళ్లు.. వాటి ద్వారా వివిధ ఫీజుల పేరుతో డబ్బులు కొల్లగొడుతున్నారు. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి పలు ఫిర్యాదులందుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులను అప్రమత్తం చేస్తూ ఎన్టీఏ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. మోసపోయిన విద్యార్థులు ఆయా తప్పుడు వెబ్సైట్ల సమాచారం అందించారని పేర్కొంది. జేఈఈజీయూఐడీఈ.సీవో.ఐఎన్ ద్వారా విద్యార్థుల నుంచి దరఖాస్తు ఫీజు వసూలు చేస్తున్నట్టు ఎన్టీఏ గుర్తించింది. ఈ వెబ్సైట్లో ఈ మెయిల్ అడ్రస్ ‘ఐఎన్ఎఫ్ఓఎట్దరేట్జేఈఈజీయూఐడీఈ.సీవో.ఐఎన్’అని, మొబైల్ నంబర్ 93112 45307 అని పొందుపరిచారని, ఈ నంబర్ ద్వారా ఆయా విద్యార్థులకు ఫోన్లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్టు ఎన్టీఏ తెలిపింది. ఇవే కాకుండా మరికొన్ని ఫేక్ వెబ్సైట్ల ద్వారా కూడా విద్యార్థులను కేటుగాళ్లు మోసగిస్తున్నట్టు పేర్కొంది. ఇటువంటి యూఆర్ఎల్తో ఉండే వెబ్సైట్లు, ఈ–మెయిళ్లు, మొబైల్ నంబర్లతో ఎన్టీఏకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. తప్పుడు వెబ్సైట్లతో విద్యార్థులను మోసగిస్తున్న వారిపై ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొంది. ఇలాంటి వెబ్సైట్లపై స్థానిక పోలీస్స్టేషన్లలోనూ ఫిర్యాదు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సూచించింది. ఇదే అసలైంది.. ‘జేఈఈఎంఏఐఎన్.ఎన్టీఏ.ఎన్ఐసీ.ఐఎన్’ ద్వారా మాత్రమే ఎన్టీఏ అభ్యర్థుల నుంచి జేఈఈ మెయిన్–2021 ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఎన్టీఏ తెలిపింది. ఇదిలా ఉండగా జేఈఈ మెయిన్–2021 ఫిబ్రవరిలో నిర్వహించనున్న తొలి విడత పరీక్షలకు ఆన్లైన్ దరఖాస్తు గడువును ఈ నెల 23 వరకు పొడిగిస్తున్నట్టు ఎన్టీఏ ప్రకటించింది. 24వ తేదీ రాత్రి 11.50 గం. వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించొచ్చు. దరఖాస్తుల్లో వివరాల సవరణకు 27 నుంచి 30 వరకు గడువిచ్చింది. అడ్మిట్ కార్డులను వచ్చే నెల రెండో వారంలో అందుబాటులో ఉంచనున్నారు. -
ఏటీఎం మోసాలు అక్కడే ఎక్కువ
సాక్షి, న్యూఢిల్లీ: ఏటీఎం మోసాలలో దేశంలో ఢిల్లీ రెండవ స్థానంలో నిలిచింది. 2018–19లో నగరంలో లక్ష లేదా అంతకన్నా ఎక్కువ రూపాయలు గల్లంతైన ఏటీఎం మోసాల కేసులు 179 నమోదయ్యాయని రిజర్వ్ బ్యాంక్ ఆ‹ఫ్ ఇండియా(ఆర్బీఐ) డేటా తెలిపింది. నగరవాసులు ఈ మోసాలలో రూ.2.9 కోట్లు పోగొట్టుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 233 ఏటీఎం మోసాల కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర వాసులు ఏటీఎం మోసాలల్లో రూ.4.81 కోట్లు, తమిళనాడు వాసులు రూ.3.63 కోట్లు పోగొట్టుకున్నారు. 2017–18తో పోలిస్తే నగరంలో 2018–19లో ఏటీఎం మోసాలు పెరిగాయి. 2017–18లో 132 కేసులు జరిగాయి. ఈ మోసాల్లో రూ.2.8 కోట్లు గల్లంతయ్యాయి. ఢిల్లీలోనే కాక దేశం మొత్తం మీద కూడా ఏటీఎం మోసాలు 911 నుంచి 980 కి పెరిగాయి. అసోం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాల్లో ఏటీఎం మోసాల కేసులు నమోదయ్యాయి. ఈ మోసాల్లో ఢిల్లీలో గల్లంతైన డబ్బు 2017–18 లో ఉన్న రూ.65.3 కోట్ల నుంచి 2018–19లో రూ.21.4 కోట్లకు తగ్గింది. లక్ష రూపాయలకు పైగా గల్లంతైన కేసులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం వల్ల దేశంలో జరుగుతోన్న ఏటీఎం మోసాలన్నీ డేటాలో వెల్లడి కాలేదని సైబర్ నిపుణులు అంటున్నారు. ఈ కేసుల సంఖ్య చాలా ఎక్కువగా, గల్లంతైన సొమ్ము భారీ మొత్తంలో ఉంటుందని వారు అంటున్నారు. మోసగాళ్లు అనేక పద్ధతుల ద్వారా ఏటీఎంల ద్వారా వినియోదారుల బ్యాంకు ఖాతాలను దోచుకోవడానికి పథకాలు వేస్తున్నారని నిపుణులు చెప్పారు. సాధారణంగా మోసగాళ్లు ఏటీఎంలు లేదా పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లలో స్కిమ్మర్లను అమర్చి కార్డుల నుంచి డేటాను చోరీ చేస్తారని ఆ తరువాత ఈ డేటాను ఖాళీ కార్డులపై ఉంచి అక్రమ లావాదేవీలు జరుపుతారని వారు చెప్పారు. భద్రత సరిగ్గా లేని ఏటీఎంలను దోచుకునే అనేక మూఠాలను ఢిల్లీ పోలీసులు గుర్తించారు. అమాయకంగా కనబడే వినియోగదారులకు సహాయం చేస్తామన్న మిషతో కార్డులు మార్చి ఆ తరువాత ఏటీఎంల నుంచి వినియోగదారుల ఖాతాలను ఖాళీ చేస్తారని చెప్పారు. నకిలీ వెబ్సైట్లతో తస్మాత్ జాగ్రత్త.. ఆన్లైన్ మోసాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని బ్యాంకుల కస్టమర్ కేర్ ఏజెంట్లమని చెప్పి మోసగాళ్లు వినియోగదారుల నుంచి గోపనీయమైన సమాచారాన్ని సేకరించి మోసగిస్తుంటారు. కొందరు మరో అడుగుముందుకేసి బ్యాంకుల నకిలీ వెబ్సైట్లను కూడా తెరిచారు. వినియోగదారులు ఇంటర్నెట్ గాలించి ఈ వెబ్సైట్లలో పేర్కొన్న బూటకపు కస్టమర్ కేçర్ నంబర్లను సంప్రదించినప్పుడు వారిని మోసగిస్తుంటారు. నేరగాళ్లు రోజురోజుకు ఆధునిక టెక్నాలజీలను ఉపయోగిస్తూ కొత్త కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతుండగా, ఢిల్లీ పోలీసు సైబర్ క్రైమ్ ప్రివన్షెన్ అవేర్నెస్ అండ్ డిటెక్షన్ సెంటర్ సుక్షితులైన సిబ్బంది కొరత వంటి అనేక సమస్యలతో సతమతమవుతంది. ఈ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పోలీస్ శాఖ కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. -
జియో ల్యాపీ రూ.599కే.. ఈ లింక్ చూశారా?
డిజిటల్ మార్కెటింగ్, ఈ– కామర్స్ మార్కెట్ల పుణ్యమా అని షాపులకు వెళ్లకుండానే మనకు కావాల్సిన వస్తువులను నేరుగా ఇంటి వద్దకే తెప్పించుకునే వెసులుబాటుతో ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. నాణేనికి ఇది ఒకవైపు మాత్రమే. నిజానికి ఆన్లైన్లో మనం చూసే వెబ్సైట్లలో చాలా వరకు నకిలీవి పుట్టుకొస్తున్నాయి. ఇంటర్నెట్ బ్రౌసింగ్ ప్రారంభించగానే మీకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్ అందిస్తాం. చౌకగా ల్యాబ్‌టాప్ పంపిస్తామనే ప్రకటనలు కనిపిస్తుంటాయి. ఈ ప్రాసెస్‌లో మీరు చేయాల్సింది ఒక్కటే మీ డిటైల్స్‌తో కూడిన ఫామ్‌ను పూరించి తమకు అందించడమే తరువాయి. వారం రోజుల్లో సెలక్ట్ చేసుకున్న ప్రొడక్ట్ మీ ఇంటికి పంపిస్తామనే ప్రకటనలతో అమాయకుల డబ్బులు కాజేసి బురిడీ కొట్టిస్తున్నాయి కొన్ని వెబ్సైట్లు. సాక్షి, హైదరాబాద్: తెలియని వ్యక్తికి ఏ కంపెనీ ఉచితంగా గిఫ్టూ ఇవ్వదు. కానీ కొందరు ఇదేం పట్టించుకోక సదరు కంపెనీకి తమ వ్యక్తిగత డాటాను చేరవేస్తారు. ఇలా సంబంధిత వ్యక్తి వివరాలను తీసుకుని రెండు రోజుల్లో ప్రాసెస్ జరుగుతుందని నమ్మించి.. ఆ తర్వాత మీ ప్రొడక్ట్ రెడీగా ఉంది కానీ కస్టమ్స్ చార్జీలు పంపించండని చెబుతారు. ప్రొడక్ట్ విలువను బట్టి కస్టమ్స్ చార్జీలను నిర్ణయిస్తామంటారు. వినియోగదారుడు పూర్తిగా నమ్మితే గాని ఖాతా వివరాలను షేర్ చేయరు. ఖాతా వివరాలను పంపిన తర్వాత మీ ప్రొడక్ట్ వ్యాల్యూ లక్ష రూపాయలు అని, మీరు కేవలం పదిశాతం పన్ను చెల్లిస్తే సరిపోతుందని చెబుతారు. సదరు వ్యక్తి డిపాజిట్ చేసిన తర్వాత నుంచి వినియోగదారునికి ఎటువంటి రిప్లై ఇన్ఫర్మేషన్ లభించదు. సదరు వినియోగదారుడు తాను మోసపోయానని తెలిసేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇలా ట్రాన్స్ఫర్ అవుతున్న మొత్తం ఒక్కోసారి లక్షల్లో కూడా ఉండటం గమనార్హం. ‘ఆయుష్మాన్ భారత్’ పేరుతో ఆన్లైన్ ఫ్రాడ్.. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆయుష్మాన్ భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య బీమాను ప్రవేశపెట్టిన విషయం విదితమే. దీనిపై ఇప్పటికే అనేక నకిలీ వెబ్సైట్లు పుట్టుకొచ్చాయి. ఆయుష్మాన్ భారత్ అధికారిక వెబ్సైట్ httpr://www.abnhpm.gov.in/ని పోలి ఉండేలా నకిలీ వెబ్సైట్లు డిజైనింగ్‌తో సహా రూపొందించారు. ఆయా నకిలీ వెబ్సైట్లలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫొటోలు పెట్టడంతో పాటు.. రూ.1000 నుంచి రూ. 2000 ప్రీమియం చెల్లించడం ద్వారా ఈ ప్రయోజనాలు పొందవచ్చు అంటూ జనాలను మోసం చేసే మెసేజ్ పొందుపరిచారు. అంతేకాదు, ‘పేదలకు చేరేలా ఈ మెసేజ్ అందరికీ షేర్ చేయమని’ వినియోగదారులను నకిలీ వెబ్సైట్లు ట్రాప్ చేస్తున్నాయి. తెలిసీ తెలియక చాలామంది అమాయకులు వారు కోరిన మొత్తాన్ని చెల్లించి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. గిజ్చ్టిట్చ ppలో కూడా ఆయుష్మాన్ భారత్ పేరిట నకిలీ వెబ్సైట్లు విస్తృతంగా సర్కులేట్ అవుతున్నాయి. ఒకవేళ ఏదైనా మీ దృష్టికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దు. ఇతరులకు షేర్ చేయవద్దు. డబ్బులు వసూలు చేస్తే అది నకిలీదే.. ‘ఆయుష్మాన్ భారత్’ పేరిట ఉచితంగా హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన పనిలేదు. ఒకవేళ ఏదైనా వెబ్సైట్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం డబ్బులు వసూలు చేస్తున్నట్లయితే దాన్ని కచ్చితంగా నకిలీ వెబ్‌సైట్‌గా ప్రజలు పరిగణించాలి. కొన్ని సైట్లు డబ్బులు ఏమీ అడగకుండానే ప్రజల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయని ఆయుష్మాన్ భారత్ సీఈఓ ఇందు భూషణ్ వెల్లడించారు. ఈ స్కీమ్‌కు సంబంధించి కేవలం 1455 నంబర్ మాత్రమే ఉందని, ఇతర నంబర్లను నమ్మవద్దని ఆయన హెచ్చరించారు. జియో ల్యాపీ రూ.599కే.. ఈ లింక్ చూశారా..? ఇలాంటిదే మరో ఫేక్ వెబ్సైట్ ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. అదే జియో వెబ్సైట్ ఆన్లైన్. చిత్రంలో కనిపిస్తున్న వెబ్‌సైట్‌ను చూశారు కదా. ఈ వెబ్సైట్లోకి వెళితే జియోకి సంబంధించిన వస్తువులన్నీ తక్కువ ధరకే అందుబాటులోకి ఉన్నాయని చెబుతోంది. ఇంత తక్కువ ధరకు సాధ్యమేనా..? రూ.24,999 విలువైన జియో ల్యాప్‌టాప్‌ను కేవలం రూ.599కే అందించడం సాధ్యమా. విచిత్రమేమిటంటే అసలు జియోలో ల్యాప్‌టాప్ ఇప్పటి వరకు మార్కెట్లోకే రాలేదు. ఇది నకిలీదని.. మరి అత్యంత తక్కువ ధరకి వాళ్లు ఎలా విక్రయిస్తారన్న సందేహం మనకు తప్పకుండా రావాలి. ఇవే కాకుండా ఈ తరహా దోపిడీ చేసే నకిలీ వెబ్సైట్లకు చెందిన పలు యాడ్స్ ఇప్పుడు ఫేస్బుక్లో కోకొల్లలుగా దర్శనమిస్తున్నాయి. అందుకే ఏమరుపాటుగా ఉండటం మన బాధ్యత. తస్మాత్ జాగ్రత్త. -
సూపర్‌స్టార్ అభిమానుల ఆందోళన
సాక్షి, చెన్నై: తమిళనాడులో సమూలమైన మార్పులు తీసుకువస్తానని ఉత్సాహంగా ముందుకు వచ్చిన సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఆదిలోనే కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. సభ్యులుగా చేరేందుకు ఆయన ప్రారంభించిన వెబ్సైట్లకు అదనంగా బోగస్ వెబ్సైట్లు ఇంటర్నెట్లో దర్శనమివ్వడం రజనీ అభిమానుల్లో ఆందోళనను పెంచుతోంది. ఈ క్రమంలో రజనీకాంత్ పేరుతో అభిమాన సంఘాలు కొత్త వాట్సాప్ గ్రూపును గురువారం ప్రారంభించాయి. గత ఏడాది మే నెలలో ఐదురోజులు, డిసెంబరులో ఆరురోజులపాటూ అభిమానులను కలుసుకున్న రజనీకాంత్ గతేడాది చివరిరోజైన డిసెంబర్ 31న వేలాది మంది అభిమానుల సమక్షంలో ‘అరసియల్‌కు వరుదు ఉరుది’ (రాజకీయాల్లోకి రావడం ఖాయం) అంటూ ప్రకటించి హర్షధ్వానాలు అందుకున్నారు. తాను స్థాపించబోయే పార్టీలో చేరదలుచుకున్న వారు, వ్యవస్థలో మార్పును కోరుకునేవారు తమ వెబ్సైట్ ద్వారా పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా రజనీకాంత్ మరుసటి రోజున పిలుపునిచ్చారు. ఈ మేరకు www.rajinimandram.org అనే వెబ్‌సైట్‌ను ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ వెబ్సైట్ ద్వారా సుమారు 50 లక్షల మంది సభ్యులుగా చేరినట్లు తెలుస్తోంది. ఇంకా చాలా మంది సభ్యత్వం కోసం తహతహలాడుతున్నారు. ఇదిలా ఉండగా రజనీ పేరుతో మూడు బోగస్ వెబ్సైట్లు కూడా ప్రారంభం కావడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. తలైవర్ మన్రం, రజనీ మంత్రం, కేస్ తమిళనాడు పేరుతో భోగస్ వెబ్సైట్లు దర్శనమిస్తున్నాయి. బోగస్ వెబ్సైట్లు అసలైన అభిమానులను, రజనీ మద్ధతుదారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగా ప్రజలను, అభిమానులను నేరుగా కలుసుకుని దరఖాస్తు పత్రాల ద్వారా సభ్యత్వ నమోదు చేయడం మంచిదని సంఘాల నేతలు ఆలోచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 వేల రిజిష్ట్రర్డు, 30వేల రిజిష్టరు కాని అభిమాన సంఘాలు లెక్కన మొత్తం 50 వేలు ఉన్నాయి. ఈ అభిమాన సంఘాల ద్వారా సభ్యత్వం నమోదు చేయాలని భావిస్తున్నారు. కాగా, రజనీకాంత్ పేరుతో అభిమాన సంఘాలు కొత్త వాట్సాప్ గ్రూపును గురువారం ప్రారంభించాయి. ఆర్ఎమ్ వీరప్పన్‌తో భేటీ పార్టీ పెట్టే ముందు రాజకీయ పెద్దలను కలుసుకునే పనిలో ఉన్న రజనీకాంత్ గురువారం మాజీ మంత్రి, ఎంజీఆర్ కళగ అధ్యక్షులు ఆర్ఎమ్ వీరప్పన్‌తో రజనీ భేటీ అయ్యారు. తనతో భాషా వంటి సూపర్‌హిట్ మూవీ నిర్మించిన వీరప్పన్‌ను చెన్నై వళ్లువర్‌కోట్టంలోని ఆయన ఇంటికి వెళ్లి కలుసుకున్న రజనీ ఆయనతో సుమారు గంటపాటూ ముచ్చటించారు. మలేషియాలో జరిగే సినిమా ఫెస్టివల్లో పాల్గొనేందుకు గురువారం రజనీకాంత్ మలేషియా వెళ్లారు. -
తిరుమల టికెట్లలో నకిలీల దందా
సాక్షి, అమరావతి: విజయవాడలోని వేణుగోపాలరావు తన కుటుంబంతో కలసి ఈ నెల 5న తిరుమలకు వెళ్లాలని నిశ్చయించుకుని నెల ముందుగానే ఆన్లైన్లో దర్శనం టికెట్లు కొన్నారు. అయితే, వారు తిరుమల వెళ్లాక ఆ టికెట్లు చెల్లుబాటు కాలేదు. దీనిపై వారు టీటీడీ అధికారులను ప్రశ్నించగా.. వారు చెప్పిన సమాధానంతో అవాక్కయ్యారు. కారణం.. వారు టికెట్లు బుక్ చేసింది అధికారిక టీటీడీ వెబ్సైట్లో కాదు, అదే పోలికలతో ఉండే నకిలీ వెబ్సైట్లో. దీంతో ఆ టికెట్లు చెల్లుబాటుకాక ఆ కుటుంబం నానా ఇబ్బందులు పడుతూ శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుని ఇంటికి చేరింది. ఇది ఒక్క వేణుగోపాలరావు సమస్య మాత్రమే కాదు. రోజూ వంద లాది మంది భక్తులు నకిలీ వెబ్సైట్ల బారిన పడుతున్నారు. దర్శన టిక్కెట్ రూ.300: తెలియక నకిలీ వెబ్సైట్ల బారినపడుతున్న భక్తుల నుంచి ఆ వెబ్సైట్ల యాజమా న్యాలు భారీగా నగదు గుంజుతున్నాయి. శ్రీఘ్ర దర్శన టికెట్ ధర రూ.300 ఉండగా, సర్వీసు కాస్ట్ పేరుతో రూ.200 అదనంగా కలిపి ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున నకిలీ దర్శన టిక్కెట్లకు ఆ వెబ్సైట్లు భక్తుల నుంచి వసూలు చేస్తున్నాయి. భక్తులు స్వామి దర్శన టికెట్ కోసం ఇంటర్నెట్లో సెర్చ్ మొదలుపెట్టగానే టీటీడీ అధికారిక వెబ్సైట్ కంటే ముందు ఈ నకిలీ వెబ్సైట్లు ప్రత్యక్షమవుతున్నాయి. ఈ సైట్లలో నగదు చెల్లించిన తర్వాత 24 గంటల నుంచి 48 గంటల మధ్య భక్తులు పేర్కొన్న ఈమెయిల్ ఐడీకి నకిలీ దర్శన టికెట్లు మెయిల్ చేస్తారు. ఆన్లైన్లో నకిలీ వెబ్సైట్లు ఇబ్బడిముబ్బడిగా దర్శనమిస్తున్నా టీటీడీ విజిలెన్స్ విభాగం వీటిపై దృష్టి పెట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మా దృష్టికి వచ్చింది ఆన్లైన్లో శ్రీవారి దర్శన టికెట్ల కొనుగోలుకు సంబం ధించి నకిలీ వెబ్సైట్లు ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. ఆన్లైన్లో టికెట్ కొనుగోలు సమయంలో నకిలీ వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేసిన స్వామివారి దర్శన టికెట్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. కొన్ని నకిలీ వెబ్సైట్లపై టీటీడీ విజిలెన్స్ విభాగం చర్యలు తీసుకుంది. నకిలీల పట్ల చర్యలు తీసుకుంటున్నాం. –రవికృష్ణ, టీటీడీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ తిరుమలలో హోటళ్ల మూసివేతకు ఆదేశం సాక్షి, తిరుమల: తిరుమలలోని పెద్ద, జనతా హోటళ్లు మూసివే యాలని టీటీడీ శనివారం నోటీ సులిచ్చింది. అద్దె బకాయిలు, జరిమానా చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. టెండర్ నిబంధనల ప్రకారం ఆహార పదార్థాలు నిర్ణీత ధరల కంటే అధిక ధరకు విక్రయించటం, దేవస్థానం నిబంధనలు పాటిం చకపోవడంతో తిరుమలలోని హోటళ్లపై హైకోర్ట్‌లో పిల్ దాఖ లైంది. దీంతో టీటీడీ అధికా రులు తిరుమలలోని 8 పెద్ద హోటళ్లు, మరో 13 చిన్న జనతా హోటళ్లకు ఒక్కోనెల అద్దెను జరి మానాగా విధించి ఆ మొత్తాన్ని వారి ఈఎండీ నుంచీ రికవరీ చేసి నోటీసులు ఇచ్చారు. వ్యవధిలో నే బకాయిలు చెల్లిస్తామని నిర్వా హకులు విజ్ఞప్తి చేసినా టీటీడీ నోటీసులు జారీ చేసింది. -
ఫ్రీ ఎల్పీజీ స్కీమ్ వెబ్సైట్లతో జాగ్రత్త!
న్యూఢిల్లీ : ఉచిత ఎల్పీజీ స్కీమ్ పై వచ్చే నకిలీ వెబ్ సైట్లతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు ఆయిల్ మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీచేసింది. నకిలీ పోర్టల్స్ నుంచి వస్తున్న డీలర్స్ ప్రకటనలకు స్పందించవద్దని ప్రధాన మంత్రి ఉజ్వల యోజన సూచించింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజనతో లింక్ అయి, చాలా వెబ్ సైట్లు ఈ మధ్యన నకిలీవి పుట్టుకొచ్చాయని గుర్తించినట్టు పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ తెలిపింది. తమ అధికారిక వెబ్ సైట్ www.pmujjwalayojana.com ఇదేనని ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ అధికారిక వెబ్ సైట్ లో ఉచితంగా దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకోవచ్చని, ఇంగ్లీష్, హిందీల్లో ఇవి లభ్యమవుతాయని పేర్కొంది. కొత్త ఎల్పీజీ కనెక్షన్ కోసం ఈ దరఖాస్తులను నింపాల్సి ఉంటుందని తెలిపింది. www.ujwalayojana.org వెబ్ సైట్లో ఆర్జీజీఎల్వీ యోజన కింద ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ షిప్ ను ప్రభుత్వం నియమించినట్టు ప్రకటన వస్తుందని, కానీ ఎలాంటి ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ షిప్ ను పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ నియమించలేదని, ఇది అసలు అథారైజ్డ్ సంస్థ కాదే కాదని స్పష్టీకరించింది. దీని నుంచి వచ్చే ఎలాంటి ప్రకటనలను నమ్మవద్దని సూచించింది. నకిలీ వెబ్ సైట్లతో అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించింది. -
‘ఆన్లైన్’తో ప్రమాదమూ ఉంది!
-
‘ఆన్లైన్’తో ప్రమాదమూ ఉంది!
- ‘సైబర్ భద్రత-నగదు రహితం’పై సదస్సులో డీజీపీ అనురాగ్‌శర్మ -‘క్యాష్ లెస్’తో సౌకర్యంతోపాటు సమస్యలు కూడా.. - సమాచారంపై సైబర్ నేరగాళ్లు, టైస్టుల దాడులకు అవకాశం - సైబర్ నేరాల దర్యాప్తులో పోలీసులు నైపుణ్యం పెంచుకోవాలి సాక్షి, హైదరాబాద్: ‘‘ఇది ఇంటర్నెట్ యుగం. ఇంటర్నెట్తో ఎన్ని ప్రయోజనాలున్నాయో అంతే ముప్పు పొంచి ఉంది. సైబర్ నేరగాళ్లు ఎంతో నైపుణ్యంతో టెక్నాలజీని వాడుకుంటూ నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రహిత లావాదేవీ లను ప్రోత్సహిస్తున్నారుు. భారీగా ప్రజలు నగదు రహిత లావాదేవీలకు మళ్లినప్పుడు తప్పకుండా మోసాలూ జరుగుతారుు. ‘క్యాష్ లెస్’తో కొత్త దారుల్లో నేరగాళ్లు విజృంభి స్తారు. రాబోయే రోజుల్లో హ్యాకర్లు, సైబర్ నేర గాళ్లు, టైస్టులు పేట్రేగిపోయే ప్రమాద ముంది..’’అని డీజీపీ అనురాగ్‌శర్మ హెచ్చరిం చారు. భవిష్యత్ పోలీసింగ్ ఇదేనని, సైబర్ నేరాల ఫిర్యాదులు వచ్చినప్పుడు ఎలా దర్యా ప్తు జరపాలన్న అంశంపై పోలీసులు సిద్ధమై ఉండాలని సూచించారు. ‘సైబర్ భద్ర త-నగదు రహిత లావాదేవీలు’ అంశంపై మంగళవారం నేర పరిశోధక విభాగం (సీఐ డీ) నిర్వహించిన సదస్సులో డీజీపీ మాట్లాడారు. సైబర్ నేరాల దర్యాప్తు కోసం ప్రతి జిల్లాలో సైబర్ క్రైం విభాగం, ల్యాబ్‌ను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఎన్నో మార్గాల్లో దోపిడీ.. సైబర్ నేరస్తులు టెక్నాలజీతో కొత్త పుంతలు తొక్కుతున్నారని డీజీపీ హెచ్చరించారు. ‘‘బ్యాంకుల పేరుతో నకిలీ వెబ్సైట్లు సృష్టించి ఖాతాదారుల యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను తస్కరిస్తున్నారు. బ్యాంకు అధికారుల పేరుతో ఖాతాదారులకు ఫోన్ చేసి వారి యూజర్ ఐడీ, పాస్వర్డ్లు తెలుసుకుని మోసగిస్తున్నారు. అందమైన అమ్మారుుల ఫొటోలు, వీడియోలతో సామాజిక మాధ్యమాల ద్వారా ఎరవేసి గాలం (ఫిషింగ్) వేసి వ్యక్తుల బలహీ నత ఆధారంగా కావాల్సిన సమాచారాన్ని రాబట్టుకుంటున్నారు. ఇలా హ్యాకింగ్, ఫిషిం గ్ల ద్వారా తస్కరించిన సమాచారాన్ని ఇతరులకు అమ్ముకోవడం లేదా బ్యాంకింగ్ నేరా లు, ఆర్థిక మోసాలకు పాల్పడడం వంటివి జరుగుతున్నారుు.’’అని డీజీపీ వివరించారు. మేధోపరమైన సమాచారాన్ని సైతం దొంగి లిస్తున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం.. సైబర్ నేరాలను, నేరస్తులను గుర్తించడం.. ఈ రెండే పోలీసుల ముందు ఉన్న కర్తవ్యమని తెలిపారు. ఆర్థిక లావా దేవీలకు సంబంధించిన సైబర్ నేరాలపై ఫిర్యాదు వస్తే నిందితులెవరు, ఎలా తస్కరిం చారన్న అంశాలను గుర్తించడంలో పోలీసులు నైపుణ్యం సాధించాలని పేర్కొన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేం దుకు సీఐడీ రూపొందించిన ప్రచార పోస్టర్లను ఈ సందర్భంగా డీజీపీ ఆవిష్కరించారు. కార్యక్రమానికి భారీగా హాజరైన పోలీసు అధికారులకు ‘సైబర్ భద్ర త’పై ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణులు అనూజ్ అగర్వాల్, రంగాచారి, జతిన్ జైన్లు అవగాహన కల్పించారు. ఆర్మీ డేటాను ‘స్మాష్’ చేసిన పాకిస్తానీ హ్యాకర్లు! ‘స్మాష్’అనే ఓ మొబైల్ అప్లికేషన్ (యాప్) ద్వారా వేల మంది భారతీయుల సెల్ఫోన్ల నుంచి కాంటాక్టు నంబర్లు, ఆడియో, వీడి యో ఫైళ్లు, ఇతర సమాచారాన్ని పాకిస్తానీ హ్యాకర్లు తస్కరించారని ఇండియా ఇన్ఫోసెక్ కన్సార్షియం వ్యవస్థాపకుడు, ఎథికల్ హ్యాకర్ జతిన్‌జైన్ సదస్సులో వెల్లడించారు. స్మార్ట్ఫోన్లలో ఉండే సమా చారాన్ని శాశ్వతంగా తొలగించేందుకు ఉద్దేశించిన ఈ యాప్‌ను చాలా మంది పోలీసు, సైనిక అధికారులు వినియోగించారని.. ఈ యాప్ ద్వారా తొలగించిన సమాచారం వెలికితీయడం చాలా కష్టమని చెప్పారు. అరుుతే ఈ యాప్‌ను డీకోడ్ చేస్తే దాని సర్వర్ పాకిస్తాన్లో ఉన్నట్లు గుర్తించామని.. ఆ సర్వర్‌లో మన దేశం నుంచి తస్కరించిన 44 వేల ఆడియోలు, 70 వేల వీడియో ఫైళ్లు, 60 వేల కాంటాక్టు నంబర్లను నిక్షిప్తం చేసినట్లు గుర్తించామని తెలిపారు. సరి హద్దుల్లో పనిచేసే పోలీసు, సైనికుల సమాచారం అందులో లభిం చిందని వెల్లడించారు. ఇలా తస్కరించిన సమాచారంతోనే పాక్ ముష్కరులు పఠాన్‌కోట్, ఉడీ ఉగ్ర దాడులకు పాల్పడ్డారని అభి ప్రాయపడ్డారు. ఆ దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల వద్ద లభించిన జీపీఎస్ పరికరాలూ ఈ విషయాన్ని బలపరుస్తున్నాయని తెలిపారు. ఒక వ్యక్తి సెల్‌ఫోన్ ఆధారంగా అతని గురించి అన్ని విషయాలూ తెలుసుకోవచ్చని, అతని కదలికలు పసిగట్టవచ్చని స్పష్టం చేశారు. మన చుట్టూ ఉన్నవారిలో ఏ ఒక్కరైనా మాల్వేర్ యాప్ వాడినా.. మన సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించగలరని చెప్పారు. అందువల్ల భద్రత లేని యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవద్దన్నారు. పాస్వర్డ్లు తరచూ మార్చుకోవాలి ‘‘ఈ రోజుల్లో పాస్‌వర్డ్‌లను ఊహించడం సులువుగా మారింది. స్పెషల్ క్యారెక్టర్లతో పాస్‌వర్డ్‌లను సెట్ చేసు కోవాలి. తరచూ మార్చుకుంటూ ఉండాలి. షాపింగ్ మాల్స్‌లో కార్డులను వినియోగించిన తర్వాత వెంటనే పాస్ వర్డ్ మార్చుకోవడం మంచిది..’’ - అనూజ్ అగర్వాల్, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు