సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి సమయంలో సైబర్ మోసాలు గణనీయంగా పెరిగాయి. నకిలీ యాప్స్, క్లోన్ వెబ్‌సైట్ల పేరుతో సైబర్ నేరస్థులు అమాయక ప్రజలకు కుచ్చుటోపీ పెడుతున్నారు. వాట్సాప్‌లో కూడా నకిలీ వెబ్‌సైట్ల లింకుల బెడద ఎక్కువగానే ఉంది. సైబర్ నేరస్థులు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ అమాయక ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. ఈ సారి రిటైల్ సూపర్ మార్కెట్ల దిగ్గజం డీమార్ట్ రూపంలో సైబర్ నేరస్థులు విరుచుకుపడుతున్నారు.
చదవండి: Ola Electric: మరో సంచలనానికి తెర తీయనున్న ఓలా ఎలక్ట్రిక్...!
డీమార్ట్ సూపర్ మార్కెట్ తన 20 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉచితంగా బహుమతులు పంపిణీ చేస్తోందని పేర్కొంటూ ఒక లింక్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ లింక్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ సైబరాబాద్ ట్విట్ తన ట్విట్‌లో పేర్కొంది. నకిలీ లింక్‌పై క్లిక్ చేసినప్పుడు, స్పిన్ వీల్ ఉన్న థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌కు ప్రజలు మళ్లీంచబడతారు. మీరు సుమారు రూ. 10,000 వరకు బహుమతి కార్డులను గెలుచుకోవడానికి స్పీన్ వీల్ తిప్పమని అడుగుతుంది.
మీరు వీల్‌ను స్పిన్ చేసిన వెంటనే'ఉచిత బహుమతి'తో మరొక లింక్ ఓపెన్ అవుతోంది. గిఫ్ట్‌ను క్లెయిమ్ చేయడానికి 'ఉచిత బహుమతి' పోటీని ఇతర స్నేహితులతో పంచుకోవాలని మిమ్మల్ని అడుగుతుంది.ఆయా లింక్‌లను ఓపెన్ చేస్తే సైబర్‌నేరస్తులు ప్రజల బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు దోచేస్తున్నారని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు.
బీ అలర్ట్.. ఈ లింక్ ఓపెన్ చేయవద్దు.#DMart pic.twitter.com/x9XmqHzWqO
— Economic Offences Wing Cyberabad (@EOWCyberabad) August 21, 2021
(చదవండి: Elon Musk-Jeff Bezos: ఎలన్ మస్క్‌కు పెద్ద దెబ్బే కొట్టిన జెఫ్‌బెజోస్...!)
Comments
Please login to add a commentAdd a comment