
ఎంత అప్రమత్తంగా ఉన్నా సైబర్ నేరగాళ్లు తమ చోర బుద్ధికి పని చెబుతూనే ఉంటారు. మరి అలాంటిది ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా భారీ మూల్యం చెల్లించక తప్పదు. తాజాగా ముంబైకి చెందిన ఓ మహిళ ఏకంగా రూ. 20 కోట్లు కోల్పోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. లక్కీ డ్రా తీసి గిఫ్ట్ ఇస్తాం..అంటే, ఫోన్ నెంబర్ ను ఇవ్వకండి , పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్.
దేశంలో సైబర్ మోసాలు పెరిగిపోతూనే ఉన్నాయి. సైబర్ మోసగాళ్ల వలలో పదవద్దని అధికారులు, పదే పదే హెచ్చరిస్తూ ఉన్నా సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల వ్యవహారాలు,పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తాశిల్దార్ కీలక సూచనలు చేశారు.
సరదాగా సినిమాకు వెళ్ళినపుడో, .పెట్రోల్ బంకులోనో సార్..మీ ఫోన్ నెంబర్ ఇస్తారా..లక్కీ డ్రా తీసి గిఫ్ట్ ఇస్తాం. అని చెప్పే వాళ్ల మాటలను నమ్మి మోసపోవద్దు. వాళ్లకి ఫోన్ నెంబర్లు ఇవ్వద్దు అని వినియోగదారుల వ్యవహారాలు,పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. ఇటీవల హైదారాబాద్ లో మాట్లాడుతూ.. కొన్ని వ్యాపార సంస్థలు తెలివిగా ,సార్వత్రిక ప్రదేశాల లో జనం వద్ద నుంచి ఫోన్ నెంబర్లను సేకరించి,ఆ తర్వాత మీ కు లక్కీ డ్రా లో గిఫ్ట్ వచ్చింది అంటూ పలు రకాల మోసాలకు పాల్పడే అవకాశం ఉందని రఘునందన్ హెచ్చరించారు.
చదవండి: 60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్ కమెంట్లు వైరల్
పెట్రోల్ బంకు యాజమాన్యాలు, సినిమా టాకీస్ ల వద్ద జనం జాగృతం గా ఉండి. తమ ఫొన్ నెంబర్ లను ఇవ్వకుండా జాగ్రత్త గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని రఘునందన్ సూచించారు. డెక్కన్ రిసార్ట్స్ అనే సంస్థ ఇలాగే వేలాది మంది నుంచి ఫోన్ నెంబర్లను సేకరించి వారినుంచి కోట్ల రూపాయలు దోచుకుని మోసం చేసిందన్నారు.ఈ మేరకు సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినా ఫలితం లేదని రఘునందన్ వివరించారు.
చదవండి: ఇన్నాళ్ళ బాధలు చాలు, రూ.5 కోట్ల సంగతి తేల్చండి : బాంబే హైకోర్టు
Comments
Please login to add a commentAdd a comment