beware
-
పాలసీదారులకు ఎల్ఐసీ హెచ్చరిక
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. సైబర్ మోసాలు, సైబర్ నేరగాళ్లు విపరీతంగా పెరిగిపోతున్నారు. ఫేక్ యాప్స్, ఫేక్ మెసేజ్‌లతో ప్రజలను దోచేస్తున్నారు. ఇలాంటి మోసాల భారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది.ఇందులో భాగంగానే మొబైల్ ఫోన్లలో కాలర్ ట్యూన్ ద్వారా హెచ్చరిస్తోంది. తాజాగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తన పాలసీదారులకు, కస్టమర్లకు హెచ్చరిక నోటీసు జారీ చేసింది.''లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పేరుతో మోసపూరిత మొబైల్ అప్లికేషన్లు చెలామణి అవుతున్నాయని మా దృష్టికి వచ్చింది" అని పేర్కొంటూ ఎల్ఐసీ పరిస్థితిని స్పష్టం చేసింది. ఫేక్ యాప్స్ నమ్మితే.. మోసపోతారని సంస్థ వెల్లడించింది. అంతే కాకుండా మీ వ్యక్తిగత సమాచారం.. ఆర్థిక లావాదేవీలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్పింది.పాలసీదారులు, కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలి. మీ లావాదేవీలు అధికారిక మార్గాల ద్వారా మాత్రమే పూర్తయ్యేలా చూసుకోవాలని ఎల్ఐసీ పేర్కొంది. సేవల కోసం అధికారిక వెబ్సైట్ లేదా డిజిటల్ యాప్ వంటి వాటితో పాటు వారి వెబ్సైట్లో జాబితా చేసిన.. ఇతర చెల్లింపు గేట్వేలను మాత్రమే ఉపయోగించాలి. ఇతర ఫేక్ యాప్స్ ఉపయోగించి చెల్లింపు చేస్తే.. దానికి సంస్థ బాధ్యత వహించదని స్పష్టం చేసింది.1956లో ప్రారంభమైన ఎల్ఐసీ.. ప్రభుత్వ మద్దతుతో కూడిన కార్పొరేషన్ సంస్థ. ఇది రక్షణ, పొదుపు, పెట్టుబడి కోసం అందించే పాలసీలతో సహా విస్తృత శ్రేణి జీవిత బీమా అందిస్తుంది. అకాల మరణం లేదా వైకల్యం సంభవించినప్పుడు వ్యక్తులు & కుటుంబాలకు ఆర్థిక భద్రత, మద్దతును అందించడం మాత్రమే కాకుండా దీర్ఘకాలికంగా పొదుపు, సంపద సృష్టిని ప్రోత్సహించడం ఎల్ఐసీ ప్రధాన ఉద్దేశ్యం.ఇదీ చదవండి: మీ కూతురి బంగారు భవిష్యత్తు కోసం: ఇవి బెస్ట్ స్కీమ్స్..ప్రస్తుతం ఎల్ఐసీ.. ఏజెంట్లు, శాఖలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లతో పెద్ద నెట్వర్క్ కలిగి ఉంది. ఇది భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన.. విస్తృతంగా గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థలలో ఒకటిగా నిలిచింది. ఇందులో చాలామంది పెట్టుబడులు లేదా ఇన్సూరెన్స్ వంటివి చేశారు.Public caution notice for our policyholders and customers#LIC #CautionNotice pic.twitter.com/GEyLcxdGGK— LIC India Forever (@LICIndiaForever) February 4, 2025 -
మోసపూరిత ప్రకటనలతో జాగ్రత్త: ఎల్ఐసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తమ సంస్థ పేరుతో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న మోసపూరిత ప్రకటనల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) హెచ్చ రించింది.‘కంపెనీ సమ్మతి లేకుండా మా సీనియర్ అధికారి, మాజీ అధికారుల ఫొటోలు, లోగో, బ్రాండ్ పేరును దురి్వనియోగం చేయడం ద్వారా నిర్దిష్ట వ్యక్తులు/సంస్థలు వివిధ సామాజిక మాధ్యమాల్లో మోసపూరిత ప్రకటనల్లో అనధికార పద్ధతిలో నిమగ్నమై ఉన్నాయని మా దృష్టికి వచి్చంది. పాలసీదారులు, ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలి. అటువంటి మోసపూరిత ప్రకటనల యూ ఆర్ఎల్ లింక్‌లను ఎల్ఐసీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో నివేదించండి’ అని ఎల్ఐసీ కోరింది. -
సైబర్ క్రైమ్ @ 5
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు ప్రధానంగా ఐదు రకాల నేర పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది నమోదైన నేరాల్లో 16శాతం సైబర్ నేరాలే ఉన్నాయి. ఇటీవల తెలంగాణ పోలీస్ వార్షిక నివేదికలో ఈ వివరాలు పొందుపరించారు. జాతీయ స్థాయిలో నమోదవుతున్న సైబర్‌నేరాల్లో తెలంగాణలోనే 2.5 శాతం మేర ఉన్నాయి. ఈ సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సైబర్‌నేరగాళ్లవిగా గుర్తించిన మొత్తం 28,610 సిమ్‌కార్డులనుపోలీసులు బ్లాక్ చేశారు. సైబర్‌నేరగాళ్లకు సంబంధించిన 58446 క్రైం లింక్‌లను తెలంగాణ పోలీసులు ఇతర రాష్ట్రాల పోలీసులతో పంచుకున్నారు. దీంతో ఒకే తరహా మోసాలు పలు రాష్ట్రాల్లో చేస్తున్న సైబర్‌నేరగాళ్ల గుర్తింపులో ఇది కీలకంగా మారింది. ఫెడ్ఎక్స్ కొరియర్ సైబర్‌నేరగాళ్లు ఫెడ్ఎక్స్ ఉద్యోగుల పేరిట, పోలీసులు, కస్టమ్స్ అధికారుల పేరిట ముందుగా ఫేక్ ఫోన్‌కాల్స్ చేస్తారు. మీ పేరిట వచ్చిన పార్సిల్లో డ్రగ్స్, ఇతర అనుమతి లేని పదార్థాలు ఉన్నాయని, మీపై కేసులు నమోదు చేయకుండా ఉండేందుకు డబ్బు ఇవ్వాలని అమాయకులను డిమాండ్ చేస్తారు. ఇలాంటి ఫేక్‌కాల్స్‌కు స్పందించకూడదు. మెసేజ్‌లలో ఉండే లింక్‌లపై కూడా క్లిక్ చేయవద్దు. అడ్వర్టయిజ్మెంట్ పోర్టల్ ఆన్లైన్లో పలు రకాల వస్తువుల సేల్స్, ఆఫర్ల పేరిట ఇచ్చే యాడ్స్‌లో మోసపూరితమైనవి ఉంటాయన్నది గ్రహించాలి. ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లను ప్రస్తావించి సైబర్ నేరగాళ్లు ఈ తరహా మోసాలు చేస్తున్నారు. అధికారిక వెబ్సైట్లలో మాత్రమే వివరాలు తెలుసుకోవాలి. మోసపూరిత లింక్‌లపై క్లిక్ చేయవద్దు. బిజినెస్‌లో పెట్టుబడుల పేరిట తక్కువ పెట్టుబడి, అతి తక్కువ సమయంలోనే అత్యధిక లాభాలు అని ఊదరగొడుతున్నారంటే అది మోసపూరితమైనదే అని అనుమానించాలి. అసాధారణమైన హామీలు ఇస్తున్నారంటే వెంటనే వివరాలు తప్పక పరిశీలించాలి. ఎక్కువగా రియల్ఎస్టేట్లో పెట్టుబడులు, క్రిప్టోకరెన్సీ సంబంధిత పెట్టుబడులు, పిరమిడ్ స్కీంలు, మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలు ఈ తరహావే. ఆన్లైన్ లోన్లు ఆర్థిక అవసరాలే బలహీనతగా ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండానే ఆన్లైన్లో రుణాలు ఇస్తామంటూ మోసం చేస్తారు. వ్యక్తిగత, బ్యాంకు వివరాలు తీసుకొని ఆర్థిక మోసాలు ఒక తరహావి అయితే, ఆన్లైన్ యాప్‌లలో రుణాలు ఇచ్చి తర్వాత అత్యధిక వడ్డీల కోసం వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు ఉంటున్నాయి. వీలైనంత వరకు ఆన్లైన్ రుణ యాప్‌ల జోలికి వెళ్లవద్దు. ఆర్బీఐ అనుమతి ఉందా లేదా అని తప్పకచూడాలి. క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాల సేకరణ బ్యాంకు అధికారులుగా చెబుతూ కేవైసీ అప్డేషన్, మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు బ్లాక్ అయ్యిందంటూ.. సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేసి మోసాలకు పాల్పడతారు. మన నుంచే బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు తెలుసుకొని ఆన్లైన్లో డబ్బు కొల్లగొడతారు. బ్యాంకు అధికారులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఖాతాదారులకు ఫోన్ చేసి వివరాలు అడగరనేది అందరూ గుర్తించాలి. -
ఉద్యోగం ఎర వేస్తారు...క్లిక్ చేస్తే ఊడ్చేస్తారు
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక అవసరాలను బలహీనతగా చేసుకుని కొంతమంది సైబర్‌నేరాలకు పాల్పడుతున్నారు. వాటిల్లో ఆకర్షణీ యమైన వేతనం, తక్కువ శ్రమ అంటూ ఇంటర్నె ట్లో ఆన్లైన్ జాబ్స్ పేరిట ఇచ్చే ఉద్యోగ నోటిఫికే షన్లు ఒకటి. ఆన్లైన్ జాబ్స్ పేరిట ఇచ్చే ఉద్యోగ ప్రకటనలతో ఎంతోమందిని ఆకర్షించి వారి నుంచి తెలివిగా డబ్బులు గుంజడం, ఆపై కనిపించకుండా తప్పుకోవడం ఇటీవల సాధారణమైపోయింది. అటువంటి ఊదరగొట్టే ఉద్యోగ ప్రకటనల వెనుక మోసం దాగి ఉన్నట్లు గ్రహించాలని సైబర్ భద్రత నిపుణులు సూచిస్తున్నారు. భారీగా ఆదాయం అంటూ ప్రకటనలు ఇస్తున్నారంటే దాని వెనుక సైబర్ నేరగాళ్లు మన వ్యక్తి గత, బ్యాంకు సమాచారం కోసం మాటు వేసి ఉన్నారని పసిగట్టాలని సైబర్ భద్రత నిపుణులు చెబుతున్నా రు. ఎక్కువగా ఉద్యోగావకాశాల కోసం, ఆన్లైన్ జాబ్స్ కోసం ఇంటర్నెట్లో వెదికేవారిని సైతం సైబ ర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసు కుంటున్నట్లు సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరి స్తున్నారు. ఉద్యోగం పేరిట మెయిల్స్ లేదా మొబైల్స్‌కు లింక్స్ పంపిస్తా రని, వాటిని ఏమాత్రం క్లిక్ చేసినా మన సమాచార మంతా వారు తెలుసుకుని అకౌంట్లలోని డబ్బుల్ని ఊడ్చేస్తారని చెబుతున్నారు. అయితే కొద్దిపాటి జాగ్రత్తలతో సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండటం పెద్ద కష్టమేమీ కాదని వారు సూచిస్తున్నారు. ఇవీ సూచనలు.. ► ఆన్లైన్ జాబ్ ఆఫర్లో మనం చేసే పనికి సాధారణం కంటే ఎక్కువ లబ్ధి వచ్చేలా, అత్యధిక సంపాదన ఉండేలా సమాచారం ఉంటే అది మోసమని గ్రహించాలి. ► ఆన్లైన్ ఉద్యోగాల పేరిట వచ్చే ఈమెయిల్స్‌లో అక్షర దోషాలు ఉన్నా, ఎలాంటి ఫోన్ నంబర్లు లేకుండా ఉన్నా కచ్చితంగా అది మోసపూరితమైన లింక్ అని పసిగట్టాలి. ► ఆన్లైన్ ఇంటర్వ్యూలు చేస్తామంటూ వచ్చే సందేశాలను నమ్మవద్దు. ► ఆన్లైన్ జాబ్ ఇవ్వాలంటే వ్యక్తిగత సమాచారంతోపాటు పాన్, ఆధార్ కార్డు, బ్యాంకు వివరాలు షేర్ చేయాలని కోరుతున్నారంటే అది మోసమని గ్రహించాలి. ► ఆన్లైన్లో జాబ్ ఇస్తామని ప్రకటనల రూపంలో వచ్చే వెబ్‌లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవద్దు. -
నిలువునా ముంచిన ముఠా టార్గెట్ ఇక్కడ యువతే..!
-
ఆన్లైన్ బ్యాకింగ్‌లో ఈ సూచనలు కచ్చితం..! లేకపోతే అంతే సంగతులు..!
‘రెండు గంటల్లో రూ.10,000 రుణం మీ ఖాతాలో జమ.. కొన్ని ప్రాథమిక వివరాలు సమర్పిస్తే చాలు..’ ఒకరోజు బాలాజీ (30) మొబైల్‌కి వచ్చిన సందేశం ఇది. ఒక ఇన్స్టంట్ లోన్ యాప్ ఈ సందేశాన్ని పంపింది. దీంతో స్నాప్ఇట్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు. ఇన్స్టాల్ సమయంలో ఎటువంటి యాక్సెస్‌కు అనుమతులు ఇవ్వలేదు. కానీ, ఒక గంట తర్వాత వచ్చిన మెస్సేజ్ చూసి బాలాజీ కలవరానికి గురయ్యాడు. బ్యాంకు ఖాతా నుంచి రూ.లక్ష డెబిట్ అయినట్టు వచ్చిన సందేశం అది. వెంటనే తన బ్యాంకు ఖాతాలు అన్నింటినీ బాలాజీ బ్లాక్ చేసేశాడు. ‘సేవ్‌దెమ్ ఇండియా ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద దర్యాప్తు సంస్థను సంప్రదించాడు. బాలాజీ స్పాన్ఇట్ యాప్‌ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నాడు కానీ, అందులోకి లాగిన్ అవ్వలేదు. కాంటాక్ట్‌లు, కెమెరా లేదా గ్యాలరీ ఎటువంటి యాక్సెస్‌కు అనుమతి కూడా ఇవ్వలేదు. కానీ, హ్యాకర్లు బాలాజీ ఫోన్లోకి యాప్ సాయంతో 59మాల్వేర్లు పంపించి తమ పని అంతా చక్కబెట్టేసుకున్నట్టు దర్యాప్తులో తేలింది. మాల్వేర్ల సాయంతో ఫోన్‌కు ఓటీపీలు పంపడమే కాకుండా, వాటితో లావాదేవీ నిర్వహించుకున్నారు. ఇలాంటి పరిస్థితి ఎవరికైనా రావచ్చు. పర్సనల్ ఫైనాన్స్ (వ్యక్తిగత ఆర్థిక అంశాలు, లావాదేవీల నిర్వహణ) నేడు డిజిటల్‌గా మారి.. స్టాక్ ట్రేడింగ్ నుంచి, మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్, బ్యాంకు లావాదేవీలు, యూపీఐ చెల్లింపులు అన్నింటికీ ఫోన్ ఆధారంగా మారినందున.. హ్యాక్‌కు గురైతే ఎంతటి నష్టమైనా ఎదురుకావచ్చు. ఈ విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. సైబర్‌క్రైమ్ నేరాలు ఏటా భారీగా నమోదవుతున్నాయి. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ తాజా గణాంకాల ప్రకారం సైబర్‌నేరాల పరంగా భారత్ స్థానం 10. డిజిటల్ యుగం కారణంగా సాధారణ జీవనం యాప్‌లపైనే ఎక్కువగా ఆధారపడుతున్న తీరు సైబర్ నేరాలకు వరంగా మారుతోంది. సైబర్ దాడులకు ఎక్కువగా ప్రభావితమవుతున్నది అమెరికానేనని ఎస్పీఈకాప్స్ డేటా స్పష్టం చేస్తోంది. అగ్రరాజ్యం అని చెప్పుకుంటున్న అమెరికాకు కూడా సైబర్ దాడుల సమస్య తప్పడం లేదు. మన దేశంలోనూ గత కొన్ని సంవత్సరాల్లో, ముఖ్యంగా గతేడాది కరోనా వచ్చిన తర్వాత నుంచి సైబర్ నేరాలు మరింత పెరిగాయి. వ్యక్తిగత ఆర్థిక డేటాను కొట్టేసిన తర్వాత హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టేయడం ద్వారా బిట్కాయిన్లను పోగేసుకుంటున్నారు. వ్యక్తుల ప్రొఫైల్స్ వివరాలు, పేరు, సామాజిక భద్రతా సంఖ్య, పుట్టిన తేదీ, బ్యాంకు ఖాతా నంబర్ ఇలాంటి వివరాలను 8–30 డాలర్ల మధ్య అమ్మేస్తున్నారు. డేటా విషయంలో అజాగ్రత్త పనికిరాదు.. ఈ డేటాను వారు ఎలా సంపాదిస్తున్నారు? అన్న సందేహం రావచ్చు. సిండికేట్ మోసం లేదా టెక్నాలజీ ఆధారిత మోసం రూపంలో ఈ సమాచారాన్ని వారు పొందుతున్నారు. కొన్ని రకాల దరఖాస్తులతోపాటు పాన్, ఆధార్ వివరాలు తీసుకోవడం సర్వసాధారణం. ఫైనాన్షియల్ కంపెనీ లేదా టెలికం కంపెనీ ఎగ్జిక్యూటివ్‌కు వాట్సాప్ వేదికగా ఈ డాక్యుమెంట్లను కూడా షేర్ చేస్తుంటాం. కానీ, అందరూ కాకపోయినా కొందరు ఈ సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం లేకపోలేదు. కొన్ని సందర్భాల్లో మనం పంచుకున్న వ్యక్తుల ఫోన్ హ్యాక్‌కు గురికావడం ద్వారా కూడా మన సున్నిత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. ఇలా సంపాదించిన ఇతరుల డాక్యుమెంట్లతో రుణాలు తీసుకుంటున్న ఘటనలు ఎన్నో కనిపిస్తున్నాయి. రుణాలిచ్చే సంస్థలకు ఎక్కువ ఆందోళన కలిగించే అంశం ఇదేనంటారు ఎర్లీశాలరీ సీఈవో అక్షయ్ మెహరోత్రా. టెక్నాలజీ సాయంతో చేసే మోసాల్లో.. సిస్టమ్ ద్వారా కస్టమర్ ప్రొఫైల్‌ను చోరీ చేసి.. మాల్వేర్ను చొప్పించేందుకు అదే పనిగా నేరస్థులు ప్రయత్నిస్తుంటారు. ‘‘స్థానిక హైపర్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో కస్టమర్లు తమ వివరాలను పొందుపరుస్తుంటారు. ఆ ప్లాట్‌ఫామ్‌లపై 10,000 మంది యూజర్లు కూడా ఉండరు. క్యాష్‌బ్యాక్ కోసం వివరాలను వెల్లడించి మోసాల బారిన పడుతున్నారు’’ అని మెహరోత్రా వివరించారు. పాస్‌వర్డ్‌ను కొందరు తరచుగా మార్చుకుంటూ ఉండరు. గుర్తుండదన్న ఆలోచనే వారితో అలా చేయిస్తుంది. దీనికితోడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం, టెక్నాలజీ మోసాలపై అవగాహన లేకపోవడంతో సైబర్ నేరాలకు నష్టపోవాల్సి వస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా చోరీ చేసిన డేటాను డార్క్‌నెట్ (డార్క్‌వెబ్)లో లేదంటే హ్యాకర్ ఫోరమ్‌లలో అమ్మేసుకోవడం నేరస్థులకు వ్యాపారంగా మారిపోయింది. క్రెడిట్‌కార్డ్ నంబర్లు, ఆన్లైన్ బ్యాంకింగ్ యూజర్‌నేమ్, పాస్వర్డ్లు, సామాజిక మాధ్యమాల్లో ఖాతాల లాగిన్ వివరాలను డార్క్ నెట్ ఫోరమ్‌లలో చాలా చౌకగా విక్రయించేస్తున్నారు. ఫోర్జరీ చేసిన పాస్‌పోర్ట్‌లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆటో ఇన్సూరెన్స్‌లను కూడా అమ్మకానికి ఉంచుతున్నారు. ఆన్లైన్ బ్యాంకింగ్ లాగిన్ వివరాలు డార్క్‌వెబ్‌లో సగటున 35 డాలర్లు పలుకుతోంది. విలువైన డేటాను విక్రయించడం ద్వారా లావాదేవీలను బిట్కాయిన్లలో చేస్తున్నారు. బిట్కాయిన్ల లావాదేవీలన్నీ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారితం. అధికారిక వ్యవస్థల ట్రాకింగ్‌కు దూరంగా ఉన్న సాధనం ఇదొక్కటే. 2020లో నమోదైన సైబర్ నేరాల్లో ఫిషింగ్ దాడులు కూడా ఒకటి. మీ డేటాకు రక్షణ ఇలా.. ఆన్లైన్లో ఎన్నో రకాల ఖాతాలను నిర్వహించడం నేటి జీవనంలో భాగం. కొందరు సులభంగా గుర్తుంటుందని అన్నింటికీ ఒక్కటే పాస్‌వర్డ్‌ను నిర్వహిస్తుంటారు. సైబర్ భద్రత పరంగా ఇదే అతిపెద్ద రిస్క్ అని తేలింది. కనుక ప్రతీ ఖాతాకు వేర్వేరు పాస్‌వర్డ్‌ను నిర్వహించడం ఎంతో అవసరం. పాస్వర్డ్ మేనేజర్‌ను వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ర్యాండమ్‌గా, బలమైన పాస్‌వర్డ్‌లను పాస్వర్డ్ మేనేజర్ ఇస్తుంటుంది. అలాగే, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను పాస్వర్డ్ మేనేజర్ సాయంతో ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేకాదు క్రమం తప్పకుండా డిజిటల్ సెక్యూరిటీ ఎలా ఉందన్నదీ స్కాన్ కూడా చేస్తుంది. టు ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే.. పాస్‌వర్డ్‌తో లాగిన్ తర్వాత మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తేనే పూర్తి స్థాయి లాగిన్‌కు వీలు కల్పించేది. దీన్ని వినియోగించుకోవడం సురక్షితం. ఎక్కువ యాక్సెస్‌కు అనుమతులు అడిగే యాప్‌ల విషయంలోనూ జాగ్రత్త. మొబైల్లో ఇన్స్టాల్ సమయంలో చాలా యాప్‌లు.. కెమెరా, గ్యాలరీ, కాంటాక్ట్‌లు, మెస్సేజ్‌ల యాక్సెస్‌ను (వాటిల్లోకి ప్రవేశించి సమాచారాన్ని పొందేఅనుమతి) అడుగుతుంటాయి. దీంతో వ్యక్తిగత డేటా మూడో పక్షానికి వెళ్లే ప్రమాదం కల్పించినట్టే. అందుకే ప్రతీ యాప్‌నకు సంబంధించి సెట్టింగ్స్‌లోకి వెళ్లి పర్మిషన్స్‌ను పరిశీలించుకుంటూ ఉండాలి. అవసరమైన అనుమతులనే ఇవ్వాలి. మనం అనుమతులు ఇవ్వకపోయినా కొన్ని యాప్‌లు ఆటోమేటిక్‌గా ఆ పని చేస్తుంటాయి. కనుక అంతగా అవసరం లేని యాప్‌లకు దూరంగా ఉండడం మంచిది. సోషల్ మీడియాలో పంచుకునే సమాచారం విషయంలో కచ్చితంగా వ్యవహరించాలి. నియంత్రణల పరిధుల్లో లేకుండా సామాజిక మాధ్యమ వేదికలు పనిచేస్తున్నాయి. కనుక వాటిపై విలువైన, సున్నితమైన సమాచారం పంచుకోకుండా ఉండడమే శ్రేయస్కరం. మీ ఆర్థిక వివరాలు (క్రెడిట్‌కార్డ్, డెబిట్‌కార్డ్, బ్యాంకు ఖాతా వివరాలు) లీక్ అయినట్టు గుర్తించినా, సందేహం వచ్చినా వెంటనే బ్యాంకుకు తెలియజేయాలి. ఎక్కువ మంది క్రెడిట్‌కార్డు హోల్డర్లు తమకు నెలవారీగా వచ్చే స్టేట్మెంట్లోని లావాదేవీల వివరాలను తెరచి చూడరు. చెల్లించి ఊరుకుంటుంటారు. కానీ, ప్రతీ లావాదేవీని పరిశీలించుకోవాలి. మోసపూరిత లావాదేవీలను గుర్తిస్తే వెంటనే క్రెడిట్ కార్డు కంపెనీకి ఫిర్యాదు చేయాలి. ఏడాదికోసారి అయినా క్రెడిట్రిపోర్ట్లను పరిశీలించుకోవాలి. ఎందుకంటే మీ వ్యక్తిగత వివరాలు, కేవైసీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ పత్రాల సాయంతో వేరొకరు రుణాలు తీసుకుని ఉంటే క్రెడిట్ రిపోర్ట్‌ల రూపంలో వెలుగులోకి వస్తాయి. మీ ప్రమేయం లేని రుణ ఖాతాలను గుర్తిస్తే వెంటనే అన్ని చానళ్ల వద్దా (క్రెడిట్ బ్యూరో, కార్డు కంపెనీ, పోలీస్ స్టేషన్, రుణదాత తదితర) ఫిర్యాదు దాఖలు చేయాలి. గాలం ఎలా? కేవైసీ వివరాలు కోరడం, మోసపూరిత క్యాష్ బ్యాక్‌లు ఆఫర్ చేయడం, డిజిటల్ వ్యాలెట్ మోసాలు, ఫిషింగ్, క్యూఆర్‌కోడ్స్, యూపీఐ ఫిషింగ్, లాటరీ మోసాలు, సోషల్ మీడియా స్కామ్‌లు ఇలా ఎన్నో రూపాల్లో నేరస్థులు అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. అన్ని బ్యాంకులకు సంబంధించి సుమారు 5లక్షల క్రెడిట్‌కార్డుల వివరాలను డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టిన ఘటనను ఇటీవల ఓ నివేదిక ప్రస్తావించింది. 2017లో సైబర్ దాడుల వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థకు 18.5 బిలియన్ డాలర్ల (రూ.1.39లక్షల కోట్లు) నష్టం వాటిల్లిందని అంచనా. ‘‘ముంబై పోలీసులు అందించిన గణాంకాలను పరిశీలిస్తే.. సైబర్ నేరాల్లో కేవలం 10 శాతాన్ని వారు పరిష్కరించగలుగుతున్నారు. కనుక భారతీయులు ఆన్లైన్ లావాదేవీలు, ఆర్థిక అంశాల విషయంలో ఎంతో అప్రమత్తంగా, జాగ్రత్తగా వ్యవహరించాలి’’ అని సైబర్ సెక్యూరిటీ క్లస్టర్–హెచ్ఎస్సీ, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ బీవీ ప్రెసిడెంట్, సీఈవో అయిన జాకి ఖురేషి పేర్కొన్నారు. డార్క్ వెబ్ దీన్నే డార్క్ నెట్ అని కూడా అంటారు. అంటే ఇంటర్నెట్ ప్రపంచం. డార్క్‌నెట్‌లోని సైట్లలోకి వెళ్లాలంటే అందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ అవసరం. టార్ (ది ఆనియన్ రూటర్) ఇటువంటిదే. ఇది గుర్తు తెలియని బ్రౌజర్. ఈ సాఫ్ట్వేర్ సాయంతో యూజర్లు డార్క్నెట్లోకి ప్రవేశించి ఎవరూ గుర్తించకుండా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో అంచల ఎన్క్రిప్షన్ (గుప్తత) ఉంటుంది. దీంతో చట్టవిరుద్ధమై ఉత్పత్తులు, సేవల క్రయ విక్రయాలకు ఇది అడ్డాగా మారింది. టార్ నెట్వర్క్ ద్వారా యాక్సెస్ చేసుకునే పోర్టళ్లు డాట్‌కామ్, డాట్ నెట్, డాట్ ఓఆర్జీ బదులుగా.. డాట్ ఆనియన్ అని ఉంటాయి. అసలు డార్క్‌వెబ్ కాన్సెప్ట్ అన్నది చట్టవిరుద్ధమైన కార్యకలాపాల దృష్టితో వచ్చింది కాదు. ప్రజావేగులు, జర్నలిస్ట్‌లు, సామాజిక కార్యకర్తలు, దర్యాప్తు ఏజెన్సీలు ఇతరుల దృష్టిలో పడకుండా కీలక సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు దీన్ని వేదికగా ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వాల నియంత్రణలు, నిఘా సంస్థల కళ్లలో పడకుండా ఈ వేదిక ఉపయోగపడుతుంది. కానీ, అక్రమార్కులకు సైతం ఇది వరంగా మారింది. డార్క్‌వెబ్‌లో సుమారు 5 లక్షల మంది యూజర్లున్నారు. ఏటా 3,20,000 లావాదేవీలు నమోదవుతున్నాయి. ఈ మార్కెట్ పరిమాణం ఎంతన్నది కచ్చితంగా తెలియదు. కానీ, ఇటీవలి ఓ అధ్యయనం ప్రకారం 2026 నాటికి సుమారు 840 మిలియన్డాలర్లుగా (రూ.6,300 కోట్లు) ఉంటుందని అంచనా. ఇవీ వాస్తవాలు.. 65,000 యూఆర్ఎల్లు డాట్ ఆనియన్ ఎక్స్‌టెన్షన్‌తో టార్ నెట్‌వర్క్‌పై అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ సామాజిక మాధ్యమ వెబ్సైట్లు, సెర్చ్‌ఇంజన్లు సైతం ఆనియన్ వెర్షన్లను నిర్వహిస్తున్నాయి. 20 లక్షలకు పైగా యూజర్లు టార్ నెట్‌వర్క్‌తో అనుసంధానమై ఉన్నారు. ప్రతీ 39 సెకండ్లకు హ్యాకర్ల దాడి నమోదవుతోంది. గత మూడేళ్లలో డార్క్‌వెబ్‌పై కార్యకలాపాలు మూడింతలయ్యాయి. 59 శాతం ఇక్కడ విక్రయిస్తున్నది చట్టవిరుద్ధ డ్రగ్స్, కెమికల్సే. 2020లో 2200 రికార్డులు డార్క్‌వెబ్‌లో అమ్మకానికి వచ్చాయి. ఫార్చ్యూన్ 1000 కంపెనీలకు సంబంధించి 25.9 మిలియన్ ఖాతాలు, 543 మిలియన్ల ఉద్యోగుల వివరాలు డార్క్‌నెట్‌లో అందుబాటులో ఉన్నాయి. 3,50,000 ఆర్థిక లావాదేవీల సున్నిత సమాచారం ఎప్పటికప్పుడు డార్క్‌వెబ్ చేరుతోంది. ఎక్కువగా ప్రభావితమవుతోంది బ్యాంకింగ్ రంగమే. సమాచారం లీక్ అయ్యే బాధిత దేశాల్లో భారత్ కూడా ఒకటి. 2.9 కోట్ల భారత ఉద్యోగార్థుల వివరాలు డార్క్వెబ్ను చేరాయి. 35 లక్షల మంది భారతీయ యూజర్ల వ్యక్తిగత వివరాలు (8.2 టెరాబైట్స్) డార్క్‌నెట్‌లో విక్రయానికి పెట్టారు. అలాగే, 70 లక్షల మంది భారతీయుల డెబిట్, క్రెడిట్‌కార్డుల వివరాలు కూడా నేరస్థుల చేతుల్లోకి వెళ్లాయి. గతంలో ఎయిర్ ఇండియాకు సంబంధించి 45 లక్షల మంది ప్రయాణికుల వివరాలు లీక్ అయ్యాయి. 2021లో స్టాక్‌బ్రోకింగ్ కంపెనీ అప్‌స్టాక్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌పై కేవైసీ వివరాలు లీక్ అయ్యాయి. డామినోస్ యూజర్లకు సంబంధించి 10 లక్షల క్రెడిట్ కార్డుల వివరాలు కూడా లీక్ అయ్యాయి. ఎస్బీఐకి చెందిన 30 లక్షల ఖాతాదారుల వివరాలు కూడా గతంలో హ్యాక్‌కు గురయ్యాయి. -
గ్యాస్ సిలిండర్ పేలుళ్లు : జాగ్రత్తలు తీసుకోండిలా..
సాక్షి, సిటీబ్యూరో: వంట గ్యాస్ వినియోగించడంలో నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాలపై అవగాహన లోపం, గ్యాస్ లీకేజీలపై ఏమరుపాటు కారణంగా భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వస్తోంది. ప్రధాన ఆయిల్ కంపెనీలు భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేయడం, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు అత్యవసర సేవల నిమిత్తం టెక్నికల్ సిబ్బందిని నియమించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఎజెన్సీల వద్ద గ్యాస్ లీకేజీ, ఇతరత్రా వినియోగదారుల కాల్స్ కుప్పలు తెప్పలుగా పెండింగ్‌లో పడిపోతున్నాయి. డెలివరీ బాయ్స్ రిపేరు సిబ్బందిగా అవతారమెత్తి ప్రైవేటు టెక్నీషియన్స్ కంటే అదనంగా సర్వీస్ చార్జీలు వసూలు చేయడం పరిపాటిగా తయారైంది. ఒకవైపు ఆయిల్ కంపెనీల నిర్లక్ష్యం, మరోవైపు వినియోగదారుల తప్పిదాలు వంటింట్లో విస్ఫోటనాలకు దారి తీస్తున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 11లోని ఒక గుడిసెలో గురువారం గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి గుడిసె దగ్ధమైంది. ఇంట్లో ఎవరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఓల్డ్‌బోయిన్‌పల్లి ఈద్గా సమీపంలోని రామకష్ణ పాఠశాల వద్ద ఒక ఇంట్లో రెండు రోజుల క్రితం గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు తీవ్రగాయాల పాలయ్యారు. మంటల ధాటికి ఇళ్లల్లోని ఫర్నిచర్సహా ఇతర వస్తువులు కాలిబూడిదయ్యాయి. ఈ రెండు సంఘటనలను బట్టిచూస్తే వంటింట్లో వంట గ్యాస్ విస్ఫోటంగా తయారైంది. పరీక్షలో నిర్లక్ష్యం... ► వంట గ్యాస్ సిలిండర్ పరీక్షల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. సిలిండర్ జీవిత కాలపరిమితి పదేళ్లు. ఆ తర్వాత తిరిగి పరిశీలించి సిలిండర్ ప్రమాణాల ను బట్టి మరో ఐదేళ్లు రీఫిల్లింగ్ చేయడమా? లేదా తుప్పు కింద పడేయడం చేయాల్సి ఉంటుంది. ► రీఫిల్లింగ్ జరిగే ప్రతిసారి సిలిండర్ రీఫిల్ బాడీ ఇతరత్రా వాటిని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ, ఆయిల్ కంపెనీలు టెర్మినల్‌కు వచ్చిన సిలిండర్‌ను మొక్కుబడి పరిశీలనతో రీఫిల్లింగ్ చేసి సరఫరా చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సిలిండర్ పై డ్యూడేట్... ► వంట గ్యాస్ సిలిండర్ భద్రత ప్రమాణాలను కాలపరిమితి (డ్యూ డేట్) బట్టి గుర్తించవచ్చు. ► సిలిండర్‌పై త్రైమాసాకానికి ఒక కేటగిరిగా అక్షరాలు డ్యూ డేట్‌గా ఉంటాయి. అక్షరంతో పాటు అంకె అంటే కాలపరిమితి గడువు సంవత్సరం కూడా ఉంటుంది. ► ఉదాహరణకు సిలిండర్ పై ఏ-21 బీ-21, సీ-21, డీ-21 అనే అక్షరాలు ఉంటాయి. ఏ-అంటే జనవరి నుంచి మార్చి వరకు, బీ అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు, సీ అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు, డీ అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు పరిగణించాలి. పక్కన ఉన్న అంకెను సంవత్సరంగా గుర్తించాలి. ఇవీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ♦సిలిండర్ డోర్ డెలివరీ కాగానే సీల్ కరెక్టుగా ఉందా, లేదా చూసుకోవాలి. సిలిండర్ కాలపరిమితి పరిశీలించాలి. ♦సీల్ తీయగానే ఓపెన్ రింగ్ కట్ అయినా...గ్యాస్ వాసన వచ్చినా తిరిగి సిలిండర్ వెనక్కి పంపాలి. రెగ్యులేటర్, బర్నర్‌ను ఎప్పటి కప్పుడు తనిఖీ చేసుకోవాలి. రెండేళ్లకు ఒకసారి స్టవ్‌ను మార్చు కోవాలి. ♦ వంట గ్యాస్ స్టౌ వినియోగించని సమయంలో రెగ్యులేటర్‌ను ఆఫ్ చేయాలి. రాత్రి పూట తప్పనిసరిగా రెగ్యులేటర్ ఆఫ్‌లో ఉంచాలి. ♦వంట గది తలుపుల కింద కనీసం ఒక అంగుళం ఖాళీగా ఉండే విధంగా చూడాలి. ♦ గ్యాస్ లీకేజీ జరిగినప్పుడు తప్పనిసరిగా వాసన వస్తుంది. అలాంటి సమయంలో ఎలాంటి ఏమరుపాటు పనికి రాదు. ♦ విద్యుత్ స్విచ్‌లు ముట్టుకోవడం, అగ్గిపుల్ల వెలిగించడం చేయకూడదు. విద్యుత్ స్విచ్‌లు ఆన్ చేయడం, ఆఫ్ చేయడం చేయవద్దు. స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తే వచ్చే చిన్నపాటి స్పార్క్(మెరుపు) ప్రమాదానికి దారితీస్తోంది. ♦ గ్యాస్ వాసన పసిగట్టగానే తక్షణం వంటింటి తలుపులు, కిటికీలు బార్లా తెరిచి గ్యాస్‌ను బయటకు పంపే ప్రయత్నం చేయాలి. ♦ ఆ తర్వాత గ్యాస్ లీక్ అవుతున్నట్లు గుర్తిస్తే సిలిండర్‌ను బయటికి తీసుకెళ్లి బహిరంగ ప్రదేశంలో సేఫ్టీ పిన్ బిగించి ఉంచాలి. ♦ సిలిండర్ కంటే ఎత్తులో స్టవ్ ఉండాలి. సిలిండర్‌ను నిలువుగానే పెట్టాలి. ♦ వంట గదిలో ఫ్రిజ్ పెట్టవద్దు. అందులో ఉండే థర్మోస్టాట్ వల్ల ఆటో కటాఫ్ అవుతోంది. గ్యాస్ లీకైన సమయంలో ఇటువంటి ప్రమాదానికి దారితీస్తోంది. గుడిసెలో పేలిన సిలిండర్లు బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం. 11లోని ఉదయ్‌నగర్ బస్తీలో గురువారం ఉదయం తాళం వేసిన గుడిసెలో ప్రమాదవశాత్తు సిలిండర్లు పేలడంతో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.... ఉదయ్‌నగర్ బస్తీలో సావిత్రి అనే మహిళ తన ఇంటిపై గుడిసెలు వేసి అద్దెకిచ్చింది. గోపాల్–మంగమ్మ దంపతులు ఓ గుడిసెలో, నర్సింహ అనే వ్యక్తి మరో గుడిసెలో నివాసం ఉంటున్నారు. గురువారం ఉదయం వారు గుడిసెకు తాళం వేసి పనికి వెళ్లిపోయారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఓ గుడిసెలో ప్రమాదవశాత్తు రెండు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. ఈ ఘటనలో ఇంటి యజమాని సావిత్రికి స్వల్ప గాయాలయ్యాయి. మరో గుడిసెలో ఉన్న సిలిండర్ పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా అప్పటికే గుడిసెలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో రూ. లక్ష నగదు కాలిపోయినట్లు మంగమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. కళ్లముందే డబ్బు, సామగ్రి, నిత్యావసర సరుకులు అగ్నికి ఆహుతి కావడంతో బాధితులు బోరున విలపించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పబ్జి ఓ డెత్ గేమ్..
-
గోల్డ్ స్కీమ్స్‌తో జాగ్రత్త!
బంగారు వర్తకులు ఆఫర్ చేసే బంగారం పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా...? ఏడాది పాటు పొదుపు చేయడం వల్ల ఒక నెల మొత్తం బోనస్‌గా లభించడం, ఎటువంటి తరుగు లేకుండా నగలు కొనుగోలుకు అవకాశం కల్పించే ఆఫర్లు ఆకర్షిస్తున్నాయా..? కానీ, జ్యుయలర్స్ ఆఫర్ చేసే సేవింగ్స్ పథకాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలన్నది నిపుణుల సూచన. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో అనుమతి లేని డిపాజిట్ పథకాలను నిషేధిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. వాస్తవానికి అనుమతి లేని అన్ని పథకాలకు ఇది వర్తిస్తుందని భావించారు. జ్యుయలరీ సంస్థల పథకాలకు కూడా బ్రేక్ పడుతుందనుకున్నప్పటికీ... అవి మాత్రం ఇంతకుముందు మాదిరే నిధులను సమీకరిస్తూనే ఉన్నాయి. కాకపోతే చట్టంలో ఉన్న చిన్న వెసులుబాటును అనుకూలంగా మలచుకుని జ్యూయలరీ సంస్థలు తమ పొదుపు పథకాలను కేవలం పదకొండు నెలల కాలానికే పరిమితం చేస్తున్నాయి. చట్టానికి అతీతంగా జ్యుయలరీ సంస్థలు వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. కంపెనీల చట్టం 2014... బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు మినహా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించే ఇతర సంస్థలకు షరతులు విధించింది. 365 రోజులకు మించిన కాలానికి డిపాజిట్లు తీసుకునే రిజిస్టర్డ్ సంస్థలు అన్నీ కూడా కచ్చితంగా తిరిగి చెల్లించే సామర్థ్యంపై రేటింగ్ తీసుకోవడంతోపాటు, డిపాజిట్ ఇన్సూరెన్స్‌ను కూడా తీసుకోవాలి. పైగా డిపాజిట్‌పై వడ్డీని ఎన్‌బీఎఫ్‌సీల కంటే ఎక్కువ ఆఫర్ చేయరాదు. కానీ, జ్యుయలరీ సంస్థలు మాత్రం గతంలో 12, 24, 36 నెలల పథకాలను నిర్వహించగా, చట్టంలోని నిబంధనలు కఠినతరం కావడంతో తమ పథకాల కాల వ్యవధిని 11 నెలలకు కుదించుకున్నాయి. సంస్థ బిచాణా ఎత్తేస్తే? ఆభరణాల సంస్థలు వినియోగదారులను మోసం చేసిన ఘటనలు కూడా లేకపోలేదు. ఇందుకు నిదర్శనం తమిళనాడుకు చెందిన నాదెళ్ల సంపత్ జ్యుయలరీ సంస్థ వ్యవహారమే. తమిళనాడులో బంగారు ఆభరణాల మార్కెట్లో మంచి పేరున్న సంస్థ. 75 ఏళ్లకు పైగా కార్యకలాపాల్లో ఉన్న సంస్థ. కానీ 2017 అక్టోబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఆభరణాల దుకాణాలను ఆర్థిక సమస్యల కారణంగా ఈ సంస్థ మూసేసింది. ఖాతాల్లో అవకతవకలు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టడం వెలుగు చూశాయి. నాదెళ్ల బంగారు పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన వారు ఉసూరుమనక తప్పలేదు. కంపెనీ 2018 మే నెలలో దివాలా పిటిషన్ వేసింది. ఈ తరహా పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారికి ఈ సంఘటన ఓ హెచ్చరిక వంటిది. బంగారు ఆభరణాల సంస్థ దివాలా పిటిషన్ దాఖలు చేస్తే, ఆస్తులను విక్రయించగా వచ్చిన మొత్తం నుంచి ఖర్చులు పోను, ఉద్యోగులకు వేతన బకాయిలు చెల్లిస్తారు. మిగిలి ఉంటే సెక్యూర్డ్ రుణదాతలకు చెల్లింపులు చేస్తారు. ఆ తర్వాత అన్సెక్యూర్డ్ రుణదాతల వంతు వస్తుంది. బంగారం పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారు అన్సెక్యూర్డ్ ఆపరేషనల్ క్రెడిటర్ల కిందకు వస్తారని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. కనుక కస్టమర్ల వంతు ఆఖరు అవుతుంది. లొసుగులు.. అనుమతి లేని డిపాజిట్ పథకాల నిషేధ ఆర్డినెన్స్... డిపాజిట్‌కు నిర్వచనం ఇచ్చింది. అడ్వాన్స్ రూపంలో తీసుకోవడం లేదా రుణం, తిరిగి నగదు లేదా సేవ రూపంలో ఇస్తానన్న హామీతో తీసుకునే మొత్తాన్ని డిపాజిట్‌గా పేర్కొంది. ఎవరు డిపాజిట్ తీసుకున్నారన్నది ఇక్కడ అంశం కాదు. వ్యక్తి లేదా యాజమాన్య సంస్థ, భాగస్వామ్య సంస్థ, కోపరేటివ్ సొసైటీ లేదా ట్రస్ట్ అయినా కావచ్చు. కనుక జ్యుయలర్స్ నిర్వహించే పథకాలు ఈ చట్టం పరిధిలోకే వస్తాయంటున్నారు కొందరు. అయితే, కొన్ని మినహాయింపులు ఉన్నాయి. బంధువుల నుంచి రుణాల రూపంలో తీసుకోవడం, వ్యాపార సరుకుల సరఫరా కోసం అడ్వాన్స్ రూపంలో తీసుకోవడానికి డిపాజిట్ నిర్వచనం నుంచి మినహాయింపు ఉంది. భవిష్యత్తులో ఆభరణాల కొనుగోలు సాధనాలుగా తాము బంగారం పొదుపు పథకాలను విక్రయిస్తున్నట్టు జ్యుయలరీ వర్తకులు సమర్థించుకుంటున్నారు. కనుక దీన్ని ముందస్తు వాణిజ్యంగా చూడాలని పేర్కొంటున్నాయి. డిపాజిట్లు కాదు... ‘‘జ్యుయలర్ల పొదుపు పథకాలకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకురాలేదు. జ్యుయలర్స్ సమీకరించే నిధులు కేవలం ముందస్తు వాణిజ్య రూపంలోనే. దీన్ని డిపాజిట్‌గా చూడరాదు. ఈ పథకాల కింద కస్టమర్లకు తగ్గింపులు, బహుమానాలు ఆఫర్ చేయవచ్చా, స్పష్టం చేయాలని కోరుతూ కేంద్ర వాణిజ్య శాఖకు లేఖ రాశాం’’ అని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ అనంత పద్మనాభన్ తెలిపారు. నిపుణుల అభిప్రాయాలు వేరు అయితే, బంగారం డిపాజిట్ పథకాలు అనుమతి లేని డిపాజిట్ పథకాల నిషేధ ఆర్డినెన్స్ పరిధిలోకి వస్తాయా అన్న దానిపై అస్పష్టత నెలకొందని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ముందస్తు వాణిజ్యం పేరుతో తప్పించుకోవడం కుదరదని మరో నిపుణుడు పేర్కొన్నారు. ‘‘ఓ కస్టమర్ కొన్ని నెలల పాటు నగదు ఉంచి, చివర్లో ఏది కొనుగోలు చేయాలన్నది నిర్ణయించుకోవచ్చు. లేదా ఆ డబ్బులను వెనక్కి తీసుకోవచ్చు. అన్ని నెలల పాటు అతడు చెల్లించినది డిపాజిట్‌కు భిన్నమేమీ కాదు. వస్తువులకు ముందస్తుగా చెల్లించడం అంటే... మా అభిప్రాయం ప్రకారం ఆ సరుకులు ఏంటన్నది ముందే గుర్తించాల్సి ఉంటుంది. ఏదన్నది గుర్తించకుండా ముందుగానే అడ్వాన్స్‌గా ఎవరూ చెల్లించరు. కనుక ఈ తరహా పథకాలను నిషేధించాలి’’ అని వినోద్ కొతారి అండ్ కంపెనీ సీనియర్ అసోసియేట్ సీఎస్ శిఖా బన్సాల్ అభిప్రాయపడ్డారు. ఎవరి నియంత్రణ? బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ లేదా కంపెనీల చట్టం కింద నమోదైన ఓ కంపెనీ, మ్యూచువల్ ఫండ్ పథకాల్లో డిపాజిట్ చేసి చేతులు కాల్చుకుంటే... సంబంధిత నియంత్రణ సంస్థలు ఆర్బీఐ, కార్పొరేట్ శాఖ, సెబీ ఫిర్యాదుల పరిష్కార బాధ్యత చూస్తాయి. బంగారం పొదుపు పథకాల విషయానికొస్తే వీటిని నియంత్రించే సంస్థ లేదు. చాలా వరకు ఈ జ్యుయలరీ సంస్థలు కంపెనీలుగా రిజిస్టర్డ్ అయినవి కావు. కనుక కార్పొరేట్ వ్యవహారాల శాఖ జోక్యం చేసుకోదు. ఈ తరహా అనియంత్రిత డిపాజిట్ పథకాలకు సంబంధించి సమస్య ఎదురైతే పోలీసులకు ఫిర్యాదు చేయడం తప్ప పరిష్కారం లేదు. కనుక పరిష్కారానికి సమయం తీసుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. -
‘మీ టూ’తో పురుషుల్లో మార్పు!
లైంగిక వేధింపులపై ఉద్యమంలా ప్రారంభమైన ‘మీటూ’.. స్త్రీల పట్ల పురుష వైఖరిలో మార్పుకి కారణమైందా? పురుషులు జాగ్రత్త పడేలా చేసిందా? అంటే దేశంలోని పట్టణ ప్రాంతాలకు చెందిన ప్రతి ఇద్దరిలో ఒకరు అవునని చెప్పగా.. తాము తోటి మహిళా ఉద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని ప్రతి ముగ్గురిలో ఒకరు అంగీకరించారు. విధులు నిర్వహించిన ప్రాంతాల్లో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను సినీ, మీడియా రంగ ప్రముఖులు పలువురు ఇటీవల ‘మీటూ’ ఆన్లైన్ ఉద్యమం ద్వారా వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలోనే పురుషుల ప్రవర్తనలో ఏదైనా మార్పు వచ్చిందా? అని ‘యు గవ్ ఇండియా’ అనే సంస్థ ఈ నెల 16 నుంచి 22 వరకు ఓ సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాలకు చెందిన వెయ్యి మంది స్త్రీ, పురుషుల నుంచి 21 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టింది. వీరిలో పురుషులు 51 శాతం కాగా, మహిళలు 49 శాతం మంది. సర్వేలో తేలిన ప్రధానాంశాలు.. ► ‘మీటూ’ ఉద్యమం ప్రభావంతో ప్రతి ఇద్దరు పురుషుల్లో ఒకరు తాము స్త్రీలతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ జాగ్రత్తగా ఉంటున్నామన్నారు. మీటూ భయంతో సహోద్యోగులైన స్త్రీలతో వ్యవహరించేటప్పుడు కేవలం పనికి సంబంధించిన విషయాలకు మాత్రమే పరిమితమవుతున్నామంటూ ప్రతి ముగ్గురు పురుషుల్లో ఒకరు అంగీకరించారు. అదేవిధంగా పురుషుల్లో మూడోవంతు మంది కార్యాలయాల్లో తమ టీంలోకి మహిళలను తీసుకునే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నామని చెప్పారు. అయితే ‘మీటూ’ ఉద్యమానికి కొంత మంది సానుకూలంగా ఉన్నప్పటికీ స్త్రీల ఉద్యోగ జీవితాల్లో కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా తలెత్తుతున్నట్టు సర్వే తేల్చింది. ► పట్టణాల్లో నివసించేవారిలో 76 శాతం మంది లైంగిక వేధింపులను తీవ్రమైన సమస్యగా భావిస్తున్నారు. మహిళల్లో అత్యధికంగా 87 శాతం మంది లైంగిక వేధింపులు తీవ్రంగా ఉన్నాయని తెలపగా, పురుషుల్లో 66 శాతం మంది మాత్రమే ఈ సమస్య తీవ్రంగా ఉందన్నారు. యువతరం (18–39 ఏళ్ల వారు) లైంగిక వేధింపులను తీవ్రమైందిగా భావిస్తుండగా 40 ఏళ్ల వయస్సు వారు మాత్రం అంత తీవ్రమైన సమస్యగా అనుకోవడం లేదు. యువతరంలో 83 శాతం మంది ‘మీటూ’ని సీరియస్‌గా భావిస్తుండగా, 40 ఏళ్ల వారిలో 63 శాతం మంది ఈ అభిప్రాయాన్ని వ్యతిరేకించారు. ► సర్వేలో ఎక్కువ మంది తమ అంగీకారం లేకుండా తాకడం, అసభ్య చిత్రాలూ, మెసేజ్‌లూ పంపించడం లైంగిక వేధింపుగానే భావిస్తామన్నారు. ► బాలీవుడ్లో లైంగిక వేధింపులు ఎక్కువ. ఆ తరువాతి స్థానం రాజకీయాలదే. ► దాదాపు 43 శాతం మంది తమకు లైంగిక వేధింపుల బాధితులెవరో తెలుసునని పేర్కొనగా, 36 శాతం మంది నిందితులెవరో తెలుసుని చెప్పారు. -
తస్మాత్ జాగ్రత్త..
విజయనగరం టౌన్ : వేసవి వచ్చిందంటే చాలు చాలామంది చల్లని గాలి కోసం ఇంటి బయట, డాబాలపై పడుకుంటారు. దీన్ని అదునుగా చేసుకుని దొంగలు తమ చేతులకు పని చెబుతుంటారు. ప్రధానంగా వేసవిలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయి. దొంగతనాలను నివారించాలంటే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులు చెబుతున్నారు. సాధారణ దొంగలతో పాటు ఇతర రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ ప్రాంతాలకు చెందిన పలువురు వ్యాపారాల పేరుతో జిల్లాకు వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరంతా పగలు ఇళ్లను పరిశీలించి రాత్రులు దొంగతనాలు చేస్తుంటారు. ప్రధానంగా పట్టణ శివారు ప్రాంతాలు, ఇళ్లకు తాళం వేసిన ఇళ్లు, మహిళలున్న ఇళ్లనే టార్గెట్ చేస్తుంటారు. వీరితో పాటు పార్థి గ్యాంగ్ విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, తదితర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం. దొంగతనాలకు పాల్పడే విధానాలు అర్ధరాత్రి ఒంటరిగా వెళ్లే వారిపై దాడి చేసి నగలు దోచుకోవడం.. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో ఇళ్లల్లో మూకుమ్మడి దొంగతనాలు చేస్తారు. శరీరానికి ఒండ్రు మట్టి లేదా నూనె రాసుకుని మరీ ఇళ్లలోకి ప్రవేశిస్తారు. పట్టుకోవాలన్నా అంత సులువుగా దొరకరు. పగలు బిచ్చగాళ్లు లేదా కూలీలుగా నటిస్తూ తాళం వేసి ఉన్న ఇళ్లల్లో రాత్రులు దొంగతనాలకు పాల్పడతారు. కిటికీలు, తలుపులను బలవంతంగా తెరవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఆ సమయంలో ఎవరైనా ఎదురు తిరిగితే వారిపై దాడి కూడా చేస్తారు.వీరి వద్ద కత్తులు, రాడ్లు, తుపాకులు కూడా ఉంటాయి. వీరు ఆలయాలను కూడా టార్గెట్ చేస్తారు. ఇతర రాష్ట్రాల తెగలు ఫాసే పార్థి అనే తెగకు చెందిన వారు మహరాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో ఎక్కువగా దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఇటీవల కాలంలో చిత్తూరు పోలీసులు వివిధ కాలనీల్లోని సీసీ పుటేజీలు పరిశీలించగా పార్థి గ్యాంగ్‌కు సంబంధించిన కదలికలు లభ్యమయ్యాయి. దీంతో అప్రమత్తమైన చిత్తూరు సీసీఎస్ పోలీసులు గ్యాంగ్‌ను పట్టుకునేందుకు గాలింపు మొదలు పెట్టారు. ఈ తెగకు చెందిన వారు 1999 నుంచి ఉత్తరఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో దోపీడీలు చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి ప్రజలు అప్రమత్తంగా ఉన్నప్పుడే దొంగతనాలకు చెక్ పెట్టవచ్చు. ఉత్తరాంధ్రలో పార్థి, తెడ్డి గ్యాంగ్‌ల సంచరిస్తున్నట్లు అనుమానాలున్నాయి. దువ్వెనలు, ఫ్యాన్సీ వస్తువులు అమ్ముతున్నట్లు వచ్చి ఇళ్లను పరిశీలిస్తుంటారు. దొంగతనాల నివారణకు పోలీస్ శాఖ లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టిమ్‌ను ప్రవేశపెట్టింది. ప్రజలెవరైనా ఊళ్లు వెళితే సమీప పోలీస్ స్టేషన్లో తెలియజేయాలి. అపరిచిత వ్యక్తులు కనబడితే 100కు సమాచారం ఇవ్వాలి. –ఏఎస్ చక్రవర్తి, సీసీఎస్ డీఎస్పీ, విజయనగరం -
ప్లాస్టిక్ బియ్యం కలకలం
-
'వాట్సాప్ వైరస్' : భద్రతా ఏజెన్సీల హై అలర్ట్
న్యూఢిల్లీ: ఇన్ స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ పై కేంద్ర భద్రతా ఏజన్సీలు హై అలర్ట్ జారీ చేశాయి. దేశంలో రెండు సంచలనాత్మక వైరస్ ఫైల్స్ భారీగా షేర్ అవుతున్నాయని అప్రమత్తంగా ఉండాలని రక్షణ, భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. ఎన్డీఏ,(నేషనల్ డిఫెన్స్ అకాడమీ), ఎన్ఐఎ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) పేరుతో హానికరమైన ఈ ఫైల్స్ షేర్ అవుతున్నాయని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. . ఈ మేరకు డిసెంబర్ 30న అప్రమత్తంగా ఉండాల్సిందిగా రక్షణ మరియు భద్రతా సంస్థలకు అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా డిఫెన్స్ , సెక్యూరిటీ పారామిలీటరీ, పోలీస్ విభాగంలోని సిబ్బంది (స్త్రీ,పురుషులను) టార్గెట్ చేస్తూ ఈ అనుమానాస్పద ఫైల్స్ సర్క్యులేట్ అవుతున్నాయని భద్రా ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. ప్రధానంగా ఎక్స్ ఎల్ ఫార్మాట్ లో ఉన్న ఫైల్ లో హానికరమైన వైరస్ ను జోడించినట్టు అధికారులు భావిస్తున్నారు. దీని ద్వారా యూజర్ల వ్యక్తిగత సమాచారంతోపాటు బ్యాంకింగ్ డేటాను హాక్ చేయొచ్చని తెలిపారు. వినియోగదారుల ఫోన్ మరియు డేటాపై దాడిచేసే ఈ వైరస్ మెసేజ్ ల ద్వారా బ్యాంకింగ్ పాస్ వర్డ్స్, పిన్ తదితర వివరాలు హ్యాక్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ హానికరమైన ఫైల్స్ ఎంఎస్ వర్డ్' లేదా ' పీడీఎఫ్ ఫార్మాట్లలో కూడా ఉండే అవకాశాలు లేకపోలేదని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. దేశీయంగా అంతర్జాతీయ బాగా పాపులర్ సంస్థలు ఎన్ ఐల, ఎన్ డీఏ ఈ పేరుతో ఈ సందేశాలు చలామణి అవుతున్నట్టు, దీంతో యూజర్లు వీటికి తొందరగా ఆకర్షితమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇలాంటి సందేశాలను స్వీకరించిన సిబ్బంది వెంటనే సంబంధిత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాలకు రిపోర్ట్ చేయాలని కోరుతున్నారు. -
సెల్ఫీతో బహుపరాక్
ప్రముఖులని సెల్ఫీలు ఎలా బోల్తా కొట్టించగలవో చెప్పే ఒక ఘటన ఆ మధ్య పాకిస్తాన్లో జరిగింది. ముఫ్తి అబ్దుల్ కావి పాకిస్తాన్‌కు చెందిన అత్యున్నత ధార్మిక పీఠం రయిత్ ఇ హిలాల్ సభ్యుడు. ఆయనతో కలసి వివాదాస్పద మోడల్ ఖాందిల్ బలోచ్ తీసు కున్న మూడు సెల్ఫీలు ఫేస్బుక్ పేజీలలో కనిపించ డంతో అబ్దుల్ కావి జాతకమే మారిపోయింది. ఇంతకీ ఆ ఫొటోతో పాటు కనిపించిన చిత్రాలు, వినిపించిన మాటలు బలోచ్‌కు కావి మంచి మాటలు చెప్పాడనే అనిపిస్తున్నాయి. మోడలింగ్ వదిలిపెట్టి, వివాదాల నుంచి బయటపడి ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలని ఆయన ఆ మోడల్‌కి ఉపదేశించారు. కానీ ఇది చాలామందికి నచ్చలేదు. దీనితో ఆయనను పీఠం నుంచి సస్పెండ్ చేశారు. తన పార్టీ తేహ్రీక్ ఇన్సాఫ్ సభ్యత్వం నుంచి కూడా ఇమ్రాన్‌ఖాన్ ఆ మత పెద్దను సస్పెండ్ చేశారు. ఆమె ఎన్నో విన్నపాలు చేసుకుంటే, ఒక హోటల్లో కలుసుకోవడానికి తాను అనుమతించానని కావి డాన్న్యూస్కి చెప్పారు. కావి అంత మంచి విషయాలేమీ చెప్పలేదంటోందామె. -
బస్టాండ్, రైల్వే స్టేషన్లలో సెల్ చార్జింగ్ పెడుతున్నారా?
బయట ప్రాంతాలకు వెళ్లినప్పుడు మీకు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తదితర పబ్లిక్ ప్రదేశాల్లో ఉండే చార్జర్లతో మీ మొబైల్ ను చార్జ్ చేసుకునే అలవాటు ఉందా? ఉంటే, ఇక ముందు అలా చేయకండి. చార్జింగ్ పెట్టిన ఫోన్ల లో నుంచి సమాచారాన్ని తస్కరించే మొబైల్ చార్జర్లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. ఇవి మీ సమాచారాన్ని తస్కరిస్తున్నాయన్న విషయం కూడా మీకు తెలియదంటే నమ్మండి.. వీటిని ఎంత జాగ్రత్తగా తయారు చేశారో..! సమాచారం ఎలా దొంగతనానికి గురవుతుంది మామూలు చార్జర్ల మాదిరి కాకుండా ఇలాంటి చార్జర్లలో ఒక ప్రత్యేకమైన సర్క్యూట్ ను అమర్చుతారు. ఒకసారి ఫోన్ ను ఈ చార్జర్ తో చార్జింగ్ పెట్టిన తర్వాత సర్క్యూట్ యాక్టివేట్ అయ్యి ఫోన్ ను యూఎస్బీ ఓటీజీ మోడ్ లోకి తీసుకెళ్లిపోతుంది. ఈ తరహా మోడ్ యాక్టివేట్ అవగానే సమాచారాన్ని తస్కరించాలనుకునే వ్యక్తి ఇంటర్ నెట్ ద్వారా లేదా రేడియో ఫ్రీక్వెన్సీసిగ్నల్స్ ద్వారా ఫోన్ లోని డేటాను కాపీ చేసుకుంటారు. ఈ ప్రక్రియ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నా జరుగుతుందంటే ఎంత పకడ్బందీగా హ్యాకర్లు ఈ వ్యవస్థను రూపొందించారో ఆలోచించండి. ఈ విధంగా పనిచేసే ఈ డివైజ్ పేరు 'మీమ్' దీనిని మొబైల్స్ నుంచి డేటాను ట్రాన్స్ ఫర్ చేయడానికి, చార్జింగ్, బిల్ట్ ఇన్ స్టోరేజ్ తదితరాలను రూపొందించారు. కొత్తగా స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసి ఉపయోగించుకునే వారి సౌకర్యార్ధం వీటిని మార్కెట్ లోకి ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 16, 32 జీబీల వేరింయట్లలో ఆన్ లైన్ లో లభ్యం అవుతోంది. -
తమిళనాడు, బెంగాల్ ముఠాలు దిగాయి జాగ్రత్త!
విజయనగరం: తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన దొంగల ముఠాలు ఉత్తరాంధ్ర జిల్లాలలో తిరుగుతున్నట్లు విజయనగరం జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రావెల్ హెచ్చరించారు. ఈ ముఠా సభ్యులు బ్యాంకుల ప్రజల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. చిల్లర నోట్లతో ప్రజల దృష్టి మరల్చి, పెద్ద మొత్తంని దోచేస్తుంటారన్నారు. వీరు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలలో చోరీలకు పాల్పడినట్లు వివరించారు. బ్యాంకుల వద్ద అజ్ఞాత వ్యక్తుల సాయం తీసుకోవద్దని ఎస్పీ సలహా ఇచ్చారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో 9440795915 వాట్సప్ నెంబర్‌ను అందుబాటులో ఉంచినట్లు ఎస్పీ తెలిపారు. కాలేజీలలో, ఆర్టీసీ బస్సులలో ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడినా, మహిళలను వేధింపులకు గురిచేసినా ఈ నెంబర్‌కు మెసేజ్ పంపితే వెంటనే స్పందిస్తామని ఆయన చెప్పారు. -
మానసిక ఒత్తిడితో జాగ్రత్త!
-
బయటకు వెళ్లే మహిళల్లారా జాగ్రత్త!
ఆధునిక పరిజ్ఞానం ఎంత అందుబాటులోకి వస్తే ప్రమాదకరమైన పరిస్థితులు కూడా అదే స్థాయిలో ఎందురవుతుంటాయి. అణువును కనిపెట్టిన తరువాత అణువిద్యుత్‌ను తయారు చేస్తున్నారు. అణుబాంబులను కూడా తయారు చేస్తున్నారు. మంచి అయినా, చెడు అయినా ఒక ఆధుని వస్తువుని మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అలాగే సిసి (క్లోజ్డ్ సర్యూట్) కెమెరాలు సక్రమమైన రీతిలో ఉపయోగిస్తే, అవి దొంగలను, నేరస్తులను పట్టిస్తాయి. కాని కొందరు వాటిని దుర్వినియోగం చేయడం వల్ల మహిళలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కెమెరాలు విస్తృతంగా వినియోగంలోకి వచ్చిన తరువాత మహిళలు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఎక్కడపడితే అక్కడ రహస్య కెమెరాలు అమరుస్తున్నారు. పబ్లిక్ ప్రదేశాలలో పెడితే మంచిదే. కానీ కొంతమంది కామాంధులు బాత్రూముల్లో, ట్రయల్ రూముల్లో, షాపింగ్ మాల్స్‌లో, హాటళ్లలో ఇటువంటి కెమెరాలు పెట్టి యువతులు, మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు. బెంగళూరులోని ఒక వస్త్ర దుకాణంలో యజమానులు నీచానికి ఒడిగట్టారు. ట్రయల్ రూములో కెమెరా అమర్చారు. ఈనెల 7న ఆ షాపుకు వెళ్లిన ఓ మహిళ ఆ విషయం కనుగొంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగప్రవేశం చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. అతి తక్కువ ధరకే సిసి కెమెరాలు అందుబాటులోకి రావడంతో చాలా మంది ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. మహిళలు దుస్తులు మార్చుకునేటప్పుడు, స్నానాలు చేసేటప్పుడు రహస్య కెమెరాల ద్వారా వీడియోలు తీస్తున్నారు. ఆ తరువాత వారికి వాటిని చూపించి బెదిరిస్తున్నారు. వారిని శారీరకంగా లొంగదీసుకుంటున్నారు. ఎక్కువగా యువతులను నానా రకాలుగా హింసిస్తున్నారు. వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇటువంటి వారి చేతిలో చిక్కుకున్న అనేక మంది యువతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. మహిళలు బయటకు వెళితే ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్న నేపధ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఏర్పడింది. షాపింగ్ మాల్స్, హోటల్స్, టైలరింగ్ షాపులు, బ్యూటీపార్లర్లు.....కు వెళ్లినప్పుడు మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రయల్ రూమ్స్‌ను, బాత్రూములను జాగ్రత్తగా పరిశీలించిన తరువాతే వాటిని వినియోగించుకోవాలి. రహస్య కెమెరాలు అమర్చినట్లు ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు తెలియజేయడం మంచిది. -
తల తిరగడం సమస్యతో బాధపడుతున్నారా?
జాగ్రత్త తల తిరగడం అనే సమస్య దాదాపు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో అనుభవంలోకి వచ్చి ఉంటుంది. తల తిరగడానికి వర్టిగో, స్వల్ప తలనొప్పి, తల బరువు వంటి అనేక కారణాలుంటాయి. కారణం ఏదైనా సరే, తల తిరుగుతున్నప్పుడు వెంటనే ఏం చేయాలో చూద్దాం. తల తిరుగుతున్నట్లు అనిపించగానే ఉన్న చోటనే కూర్చోవాలి. కొంచెం నెమ్మదించిన తర్వాత తలను వలయాకారంగా తిప్పుతూ వ్యాయామం (నెక్ ఎక్సర్సైజ్) చేయాలి. ఈ వ్యాయామం ఎలాగంటే... తలను సవ్యదిశలో మూడుసార్లు, అపసవ్య దిశలో మూడుసార్లు తిప్పాలి. కళ్లను కూడా సవ్యదిశలో, అపసవ్య దిశలో తిప్పాలి. ఇలా నాలుగైదు సార్లు చేసిన తర్వాత కళ్లను అరచేతులతో (వెలుతురు కళ్ల మీద ప్రసరించకుండా) ఒక నిమిషం పాటు మూసుకోవాలి. వాహనాన్ని నడుపుతున్నప్పుడు తల తిరిగినట్లనిపిస్తే తక్షణమే వాహనాన్ని పక్కకు తీసుకుని ఆపేయాలి. ఆ తర్వాత పైన చెప్పిన వ్యాయామాన్ని చేసి నెమ్మదించిన తర్వాత తిరిగి వాహనాన్ని నడపవచ్చు. తిరగడం తీవ్రంగా ఉంటే ఎవరినైనా సహాయానికి పిలుచుకుని డాక్టరును సంప్రదించాలి. తల తిరిగే సమస్య ఉన్నట్లుండి ఎప్పుడైనా కనిపించవచ్చు. కాబట్టి ఒకసారి ఈ లక్షణం అనుభవంలోకి వచ్చిన మధ్యవయస్కులు వ్యాయామం కోసం నడిచేటప్పుడు వాకింగ్ స్టిక్‌ను దగ్గరుంచుకోవాలి. తల తిరిగినప్పుడు కాఫీ, ఆల్కహాలు తీసుకోకూడదు. ఇవి పరిస్థితిని మరింత విషమింపచేస్తాయి. -
జాలర్లూ...జాగ్రత్త!
సాక్షి, చెన్నై: చేపల వేటకు వె ళ్లొద్దని జాలర్లకు వాతావరణ కేంద్రం సూచించింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడే అవకాశం ఉందని హెచ్చరించింది. పంబన్, కడలూరు, పుదుచ్చేరి హార్బర్లలో మంగళవారం ఒకటో ప్రమాద హెచ్చరికను ఎగుర వేశారు. చెన్నైకు ఆగ్నేయంగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారడంతో నాలుగు రోజులుగా ఉత్తరాది జిల్లాల్లో భారీ వర్షం పడిన విషయం తెలిసిందే. అయితే, బంగాళా ఖాతంలో ఏర్పడిన మరో ద్రోణి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇది మరింతగా బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని ప్రకటించింది. దీంతో సముద్ర తీర జిల్లాల్లోని ప్రజల్ని అప్రమత్తం చేసే పనిలో అధికారులు పడ్డారు. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని సేకరిస్తూ, అందుకు తగ్గ ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎగిసిపడుతున్న కెరటాలు: వాయుగుండం ప్రభావంతో బుధవా రం నుంచి దక్షిణాది జిల్లాల్లో మోస్తారుగాను, సముద్ర తీర జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. సముద్రంలో కెరటాలు క్రమంగా ఎగసిపడుతూ వస్తున్నాయి. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించడంతో జాలర్లను సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. సముద్రంలో వేటకు వెళ్లిన వాళ్లు బుధవారం సాయంత్రంలోపు తిరిగి వచ్చేయాలని సూచిస్తున్నారు. ఒడ్డున ఉండే పడవల్ని భద్ర పరచుకోవాలని కోరుతున్నారు. అలలు ఉవ్వెత్తున ఎగసి పడటంతో పాటుగా ఈదురు గాలుల ప్రభావం అధికంగా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం పంబన్, కడలూరు, పుదుచ్చేరి హార్బర్లలో ఒకటో ప్రమాద హెచ్చరికను ఎగుర వేశారు. కరుణించని ఈశాన్యం ఈశాన్య రుతు పవనాల ప్రభావం రాష్ట్రం మీద అంతంత మాత్రంగానే ఉంది. గత ఏడాది కంటే పరిస్థితి అధ్వానంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. గత నెల ఈశాన్య రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ ప్రభావంతో గతంలో కంటే 29 శాతం తక్కువగా వర్షాలు పడ్డాయని వాతావరణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, బంగాళా ఖాతంలో తరచూ ఏర్పడ్డ ద్రోణి ప్రభావంతో నెల రోజులుగా వర్షాలు అధికంగా పడ్డాయని చెబుతున్నారు. -
పేర్ల నమోదులో జాగ్రత్త వహించండి
గుంటూరుసిటీ, న్యూస్‌లైన్ :జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతుల పేర్లు నమోదు చేయడంలో జాగ్రత్తలు వహించాలని జిల్లా ప్రత్యేక అధికారి బి.వెంకటేశం అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో వరద నష్టంపై వివిధ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హత కలిగిన ఏ రైతు నుంచీ జాబితాలో తనపేరు నమోదు కాలేదన్న ఫిర్యాదు రాకూడదన్నారు. ఎటువంటి ఒత్తిడులకు లొంగరాదన్నారు. అధికారులు గ్రామాలకు వెళ్లి పంట, గృహాలు కోల్పోయిన వారి జాబితా తయారు చేయాలన్నారు. వారం రోజుల్లో జాబితా అందిస్తే దానిపై ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో చర్చించి నివేదిక కేంద్ర ప్రభుత్వానికి పంపుతామన్నారు. జాబితాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలి.. జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదలకు జిల్లాలో 16 నుంచి 18 మండలాల్లో తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోందన్నారు. ఈ కారణంగా పంటలు, గృహాలు, పశువులు కోల్పోయిన రైతుల బాధితుల వివరాలు సక్రమంగా నమోదు చేయాలన్నారు. జాబితాను గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. ముంపు ప్రాంతాలలో పారిశుధ్యాన్ని పకడ్బందీగా చేపట్టాలని, కాచి చల్లార్చిన నీటిని తాగడం, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి విషయాలపై స్వయం సహాయక సంఘాలు, అంగన్వాడీ కార్యకర్తల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వారంకంటే ఎక్కువగా నీటిలో ఉన్న గృహాలకు చెందిన కుటుంబాలకు దుస్తులు, వంట పాత్రల కొనుగోలుకు ప్రభుత్వం రూ. 5వేలు ఆర్థిక సహాయం అందిస్తుందని చెప్పారు. 5వ తేదీ లోపు చేనేత, మత్య్సకారుల జాబితా కూడా సిద్ధం చేయాలన్నారు. ఇటీవల రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి పెదనందిపాడు పర్యటనకు వచ్చిన సమయంలో గైర్హాజరైన ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఈవోపీఆర్డీ, వీఆర్వోలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లు.. నవంబరు 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవవం సందర్బంగా స్థానిక పోలీస్ పేరేడ్ గ్రౌండ్స్‌లో వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల సవ రణ కార్యక్రమానికి సంబంధించి స్వీకరించిన క్లెయింలు, అభ్యంతరాలను ఈనెలాఖరులోగా పరిష్కరించాలని సూచించారు. నవంబరు 1వ తేదీ నుంచి ఓటర్ల సవరణ ప్రత్యేక కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్, డిఆర్వో కె.నాగబాబు, గుంటూరు, తెనాలి, నరసరావుపేట ఆర్డీవోలు బి.రామమూర్తి, ఎస్.శ్రీనివాసమూర్తి, శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. వరదలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందాలంటే పంట సాగు చేస్తున్న రైతు పేరు మాత్రమే నమోదు చేయాలని కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన అధికారులతో మాట్లాడారు. ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చూసుకోవాలన్నారు. వచ్చేనెల 14 నుంచి 19వ తేదీ వరకూ 7వ విడత భూపంపిణీ కార్యక్రమాన్ని చేపట్ట వలసి ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.