
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. సైబర్ మోసాలు, సైబర్ నేరగాళ్లు విపరీతంగా పెరిగిపోతున్నారు. ఫేక్ యాప్స్, ఫేక్ మెసేజ్‌లతో ప్రజలను దోచేస్తున్నారు. ఇలాంటి మోసాల భారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది.ఇందులో భాగంగానే మొబైల్ ఫోన్లలో కాలర్ ట్యూన్ ద్వారా హెచ్చరిస్తోంది. తాజాగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తన పాలసీదారులకు, కస్టమర్లకు హెచ్చరిక నోటీసు జారీ చేసింది.
''లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పేరుతో మోసపూరిత మొబైల్ అప్లికేషన్లు చెలామణి అవుతున్నాయని మా దృష్టికి వచ్చింది" అని పేర్కొంటూ ఎల్ఐసీ పరిస్థితిని స్పష్టం చేసింది. ఫేక్ యాప్స్ నమ్మితే.. మోసపోతారని సంస్థ వెల్లడించింది. అంతే కాకుండా మీ వ్యక్తిగత సమాచారం.. ఆర్థిక లావాదేవీలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్పింది.
పాలసీదారులు, కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలి. మీ లావాదేవీలు అధికారిక మార్గాల ద్వారా మాత్రమే పూర్తయ్యేలా చూసుకోవాలని ఎల్ఐసీ పేర్కొంది. సేవల కోసం అధికారిక వెబ్‌సైట్ లేదా డిజిటల్ యాప్ వంటి వాటితో పాటు వారి వెబ్‌సైట్‌లో జాబితా చేసిన.. ఇతర చెల్లింపు గేట్‌వేలను మాత్రమే ఉపయోగించాలి. ఇతర ఫేక్ యాప్స్ ఉపయోగించి చెల్లింపు చేస్తే.. దానికి సంస్థ బాధ్యత వహించదని స్పష్టం చేసింది.
1956లో ప్రారంభమైన ఎల్ఐసీ.. ప్రభుత్వ మద్దతుతో కూడిన కార్పొరేషన్ సంస్థ. ఇది రక్షణ, పొదుపు, పెట్టుబడి కోసం అందించే పాలసీలతో సహా విస్తృత శ్రేణి జీవిత బీమా అందిస్తుంది. అకాల మరణం లేదా వైకల్యం సంభవించినప్పుడు వ్యక్తులు & కుటుంబాలకు ఆర్థిక భద్రత, మద్దతును అందించడం మాత్రమే కాకుండా దీర్ఘకాలికంగా పొదుపు, సంపద సృష్టిని ప్రోత్సహించడం ఎల్ఐసీ ప్రధాన ఉద్దేశ్యం.
ఇదీ చదవండి: మీ కూతురి బంగారు భవిష్యత్తు కోసం: ఇవి బెస్ట్ స్కీమ్స్..
ప్రస్తుతం ఎల్ఐసీ.. ఏజెంట్లు, శాఖలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లతో పెద్ద నెట్‌వర్క్ కలిగి ఉంది. ఇది భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన.. విస్తృతంగా గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థలలో ఒకటిగా నిలిచింది. ఇందులో చాలామంది పెట్టుబడులు లేదా ఇన్సూరెన్స్ వంటివి చేశారు.
Public caution notice for our policyholders and customers#LIC #CautionNotice pic.twitter.com/GEyLcxdGGK
— LIC India Forever (@LICIndiaForever) February 4, 2025
Comments
Please login to add a commentAdd a comment