గతేడాది 37 శాతం ప్లస్
రూ. 4.39 లక్షల కోట్లు
స్టాక్ మార్కెట్ల ర్యాలీ ఎఫెక్ట్
కొంతమేర పెట్టుబడుల విక్రయం ∙అయినప్పటికీ పెరిగిన విలువ బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్‌ఐసీ ఇండియా గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో పలు దిగ్గజ కంపెనీలలో గల వాటాలను కొంతమేర విక్రయించింది. ఇందుకు స్టాక్ మార్కెట్లు బుల్ వేవ్‌లో పరుగు తీస్తుండటం ప్రభావం చూపింది. అయినప్పటికీ గతేడాది ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ ఏకంగా 37 శాతంపైగా జంప్‌చేయడం విశేషం! వివరాలు చూద్దాం
స్టాక్ ఎక్సే్ఛంజీలకు దాఖలైన సమాచారం ప్రకారం ఎల్‌ఐసీ పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీలలో అత్యధిక పెట్టుబడులను కలిగి ఉంది. ఈ బాటలో టాటా, అదానీ గ్రూప్‌లలోనూ భారీగా ఇన్వెస్ట్ చేసింది. గత వారాంతానికల్లా దిగ్గజ కంపెనీలలో ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ రూ. 4.39 లక్షల కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2022–23)లో నమోదైన విలువతో పోలిస్తే ఇది 37.5 శాతం అధికం.
రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్‌లో పెట్టుబడులు 34 శాతం ఎగసి రూ. 1.5 లక్షల కోట్లకు చేరాయి. వీటిలో పెట్టుబడులను గతేడాది 6.37 శాతం నుంచి 6.17 శాతానికి తగ్గించుకుంది. ఇదేకాలంలో టాటా గ్రూప్ కంపెనీలలో వాటా 4.22 శాతం నుంచి 4.05 శాతానికి నీరసించింది. వీటి విలువ రూ. 1.29 లక్షల కోట్లు. ఇక అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసీ వాటా 4.27 శాతం నుంచి 3.76 శాతానికి దిగివచి్చంది. వీటి విలువ 49 శాతం దూసుకెళ్లి రూ. 64,414 కోట్లను తాకింది.
ఎన్‌ఎస్‌ఈలో బుధవారం ఎల్‌ఐసీ షేరు 1.5% బలపడి రూ. 1,048 వద్ద ముగిసింది. ఈ ధరలో ఎల్‌ఐసీ మార్కెట్ విలువ రూ. 6.62 లక్షల కోట్లను
అధిగమించింది.
ప్రభుత్వం సైతం
నిజానికి పబ్లిక్ ఇష్యూ ద్వారా ఎల్‌ఐసీ సైతం స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యింది. రూ. 1,050 సమీపంలో కదులుతోంది. కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 96.5 శాతం వాటా ఉంది. దీంతో ఎల్‌ఐసీలో మైనారిటీ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం భారీగా నిధులు సమకూర్చుకునేందుకు వీలుంది. వీటిని మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించుకోవచ్చని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లు రోజుకో సరికొత్త గరిష్టాన్ని అందుకుంటూ జోరు చూపుతున్నాయి. దీనికితోడు ఏడాది కాలంలో పలు ప్రభుత్వ రంగ కంపెనీల షేర్లు వేలంవెర్రిగా లాభాల పరుగు తీస్తున్నాయి. వెరసి ప్రభుత్వం వీటిలో కొంతమేర వాటాల విక్రయాన్ని చేపడితే.. సులభంగా బడ్జెట్ ప్రతిపాదిత డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలను చేరుకోవచ్చని నిపుణులు విశ్లేíÙస్తున్నారు.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment