ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీలు భారీ ఆదరణను నోచుకున్నాయి. ఈ ఏడాదిలో క్రిప్టోకరెన్సీల మార్కెట్ విలువ కూడా గణనీయంగా పెరిగింది. పలు కొత్త క్రిప్టోకరెన్సీలు కూడా పుట్టుకొచ్చాయి. 2021లో క్రిప్టోలపై ఎంత ఆదరణను నోచుకుందంటే రగ్ పుల్స్(సైబర్ నేరస్తులు) సింపుల్‌గా లక్షలాది మంది ఇన్వెస్టర్లను నమ్మించి గొంతుకోశారు. ఈ ఏడాదిలో సుమారు అనేక స్కామ్‌ల ద్వారా రగ్ పుల్స్ ఏకంగా 7.7 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 58,697 కోట్లు)ను కాజేశారని డిజిటల్ కరెన్సీ పరిశోధన సంస్థ చైనాలిసిస్ వెల్లడిచింది.
చదవండి: ఇది నిజమా? జూదాన్ని చట్టబద్ధం చేస్తే భారీ ఆదాయం!
గత ఏడాదితో పోలిస్తే అధికం..!
నకిలీ క్రిప్టో టోకెన్లను సృష్టించి ఆయా ఇన్వెస్టర్ల నుంచి భారీ మొత్తంలో లాగేశారు రగ్‌పుల్స్. గత ఏడాదితో పోలిస్తే క్రిప్టో స్కామ్స్ 2021లో 81 శాతం మేర పెరిగాయని చైనాలిసిన్ పేర్కొంది. నకిలీ క్రిప్టోకరెన్సీలతో పలు ఇన్వెస్టర్లకు భారీ దెబ్బ తగలడంతో డిజిటల్ కరెన్సీలపై పెట్టుబడి పెట్టేందుకు ఒక్కింతా జంకుతున్నారని చైనాలిసిస్ వెల్లడించింది.
స్క్విడ్ గేమ్ పేరుతో ఇన్వెస్టర్లకు కుచ్చు టోపి..!
ఈ ఏడాది నవంబర్‌లో వచ్చిన స్క్విడ్‌గేమ్ ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణను నోచుకుంది. స్క్విడ్ గేమ్ నుంచి ప్రేరణ పొందిన రగ్‌పుల్స్ స్క్విడ్‌గేమ్ అనే క్రిప్టో టోకెన్‌ను ప్రవేశపెట్టారు. ఈ టోకెన్‌పై ఇన్వెస్టర్లు ఏగబడ్డారు. అదును చూసుకొని రాత్రికి రాత్రే ఈ క్రిప్టోకరెన్సీ కనుమరుగైంది. ఈ టోకెన్‌తో సుమారు దాదాపు $3.3 మిలియన్లు (దాదాపు రూ. 22 కోట్లు)ను కాజేశారు.
అసలు ఎవరీ రగ్‌పుల్స్..?
రగ్ పుల్స్ సింపుల్‌గా చెప్పలాంటే..క్రిప్టో కరెన్సీలకు సంబంధించిన సైబర్ నేరస్తులు. వీరు హైటెక్ ఘరానా మోసగాళ్లు. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోపై వస్తోన్న ఆదరణను క్యాష్ చేసుకునే వారు. వీరు హైటెక్ డెవలపర్లు, డిజిటల్ కరెన్సీలో పలు టోకెన్లను సృష్టించి...వాటిపై ఇన్వెస్టర్లకు నమ్మకం కలిగేలా చేసి అదును చూసుకొని ఇన్వెస్టర్లు పెట్టిన మొత్తం పెట్టుబడిని క్షణాల్లో ఉడ్చేశారు. సాధారణంగా వికేంద్రీకృత ఫైనాన్స్ (DeFi)లో రగ్ పుల్స్ ఎక్కువగా కనిపిస్తారు.
చదవండి: 20 కోట్ల సార్లు కాల్స్..! 6 లక్షల 64 వేల మందికి నరకం చూపించిన ఒకే ఒక్క నెంబర్..!
Comments
Please login to add a commentAdd a comment