DMart
-
ప్రముఖ మార్ట్‌లో 450 లీటర్ల కల్తీ నెయ్యి
వినియోగదారులు ఎక్కువగా ఆదరించే డీమార్ట్ స్టోర్‌లో భారీగా కల్తీ నెయ్యిని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రోవేదిక్ నెయ్యి నాణ్యతపై ఓ కస్టమర్ ఫిర్యాదు చేయడంతో జైపూర్ లోని డీమార్ట్ స్టోర్ లో 450 లీటర్ల కల్తీ నెయ్యిని రాజస్థాన్ ఫుడ్ సేఫ్టీ విభాగం స్వాధీనం చేసుకుంది.జైపూర్ లోని అన్ని దుకాణాలు, గోదాముల్లో ఉంచిన ప్రోవేదిక్ నెయ్యి, సరస్ నెయ్యి నిల్వలను నివేదించాలని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వాటిని విక్రయించవద్దని డీమార్ట్ ఏరియా సేల్స్ మేనేజర్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదేశించినట్లు ఎన్డీటీవీ నివేదిక పేర్కొంది.ప్రాథమిక విచారణలో మాలవీయ నగర్ లోని సూపర్ మార్కెట్ లో నిల్వ ఉంచిన సుమారు 450 లీటర్ల నెయ్యి కల్తీ అని తేలింది. సరస్ నెయ్యి క్వాలిటీ కంట్రోల్ మేనేజర్, అనలిస్ట్ నుంచి కల్తీ నాణ్యతను నిర్ధారించిన అధికారులు సుమారు 40 లీటర్ల నకిలీ సరస్ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నెయ్యిలో ఒకే బ్యాచ్ నంబర్, సిరీస్ ఉన్నట్లు గుర్తించారు. విశ్వకర్మ ఇండస్ట్రియల్ ఏరియాలోని కంపెనీ డిస్ట్రిబ్యూటర్ వద్ద కూడా నకిలీ సరస్ నెయ్యి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. -
HYD: డీమార్ట్‌లో ఫ్రీగా చాకెట్లు తింటూ ఇన్‌స్టా రీల్.. ఇలా బుక్కయ్యాడు
సాక్షి, హైదరాబాద్: డీమార్ట్.. ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. ప్రజల్లో ఎంతో ఆదరణ పొందిన రిటైల్ సూపర్‌మార్కెట్ ఇది. దాదాపు అన్ని నగరాల్లో దీని బ్రాంచ్‌లు ఉన్నాయి. ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాలు నెలవారి సరకులు ఇక్కడే కొంటుంటారు. ఇందులో ఉప్పు, పప్పూ నుంచి అన్ని రకాల వంట సామగ్రి, చాక్లెట్లు, బిస్కెట్లు, ఫర్నీచర్, స్టీల్ సామాను, దుస్తులు ఇలా ఏ వస్తువులైనా అందుబాటు ధరలకే లభిస్తాయి. అన్నీ ఒకేచోట ఉండటం వల్ల నిత్యం జనం తాకిడి ఎక్కువగానే ఉంటుంది. కొంతమంది డీమార్ట్‌లో చెయ్యకూడని పనులు చేస్తుంటారు. తమను ఎవరూ చూడటం లేదనుకొని అమ్మడానికి ఉంచిన వస్తువులను దొంగిలించడం, లేదా చాక్లెట్లను తినడం వంటివి చేస్తుంటారు. కానీ సీసీటీవీ ఫుటేజీలో మన ప్రవర్తన మొత్తం రికార్డవుతోంది. తాజాగా ఓ వ్యక్తి డీమార్ట్‌లో చేసిన దొంగతనం విచిత్రంగా బయటపడింది. ఇటీవల హనుమంతనాయక్ అనే యువకుడు స్నేహితులతో కలిసి షేక్‌పేట ప్రధాన రహదారిపై ఉన్న డీమార్ట్ సూపర్ మార్కెట్లోకి వెళ్లాడు. అక్క అమ్మడానికి పెట్టిన కొన్ని చాక్లెట్లను డబ్బులు చెల్లించకుండా తిన్నాడు. అంతేగాకుండా ‘బిల్లు చెల్లించకుండా ఫ్రీగా చాక్లెట్లు ఎలా తినాలో తెలుసా? అంటూ వీడియో తీశాడు. దీనిని ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు ఇతర సోషల్‌మీడియాల్లో పోస్టు చేశాడు. మంగళవారం ఈ వీడియోలను గుర్తించిన డీమార్ట్ షేక్‌పేట బ్రాంచ్ మేనేజర్ అర్జున్‌సింగ్ బుధవారం ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాక్లెట్లను దొంగిలించిన వహనుమంత్నాయక్తోపాటు అతడి స్నేహితులపై ఐపీసీ 420, 379 సెక్షన్లతోపాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
డీమార్ట్ లాభం అప్ క్యూ3లో రూ. 690 కోట్లు
న్యూఢిల్లీ: డీమార్ట్ స్టోర్ల రిటైల్ చైన్ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికం(క్యూ3)లో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో నికర లాభం 17 శాతం బలపడి రూ. 690 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 590 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతంపైగా పుంజుకుని రూ. 13,572 కోట్లను అధిగమించింది. గత క్యూ3లో రూ. 11,569 కోట్ల టర్నోవర్ సాధించింది. అయితే మొత్తం వ్యయాలు 17 శాతం పెరిగి రూ. 12,656 కోట్లను తాకాయి. డిసెంబర్ చివరికల్లా మొత్తం స్టోర్ల సంఖ్య 341కు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. హరీష్చంద్ర ఎం.భారుకాను స్వతంత్ర డైరెక్టర్‌గా బోర్డు ఎంపిక చేసినట్లు కంపెనీ తాజాగా పేర్కొంది. -
సెల్ఫ్‌మేడ్ ఎంట్రప్రెన్యూర్స్ 2023 లిస్ట్ విడుదల.. ఆయనే టాప్..
ధనవంతులుగా ఎదగాలంటే తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తులు ఉండాలనేది ఒకప్పటి విధానం. కానీ ప్రస్తుతం ప్రజలకు ఉపయోగపడే ఆలోచన ఉండి దాన్ని కార్యరూపం దాల్చేలా చేసి వారి మన్ననలు పొందితే అదే డబ్బు సంపాదిస్తోందని చాలా మంది నిరూపిస్తున్నారు. తామకు తాము ఎలాంటి ‘గాడ్‌ఫాదర్’ లేకుండా కుబేరులుగా ఎదుగుతున్నారు. తాజాగా దేశంలో ధనవంతులైన ‘సెల్ఫ్‌మేడ్ ఎంట్రప్రెన్యూర్స్’ లిస్ట్ విడుదలైంది. అందులో డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ అగ్రస్థానంలో నిలిచారు. పేటీఎం, బొమాటో, క్రెడ్, జెరోధా, స్విగ్గీ, ఫ్లిప్‌కార్ట్, రాజొర్పే వంటి స్టార్ట్అప్లు స్థాపించిన యువ వ్యాపారవేత్తలు ఈ జాబితాలో చోటు సంపాదించారు. ఐడీఎఫ్సీ ఫస్ట్ సంస్థ ‘ఐడీఎఫ్సీ ఫస్ట్ ప్రైవేట్ హురున్ ఇండియా టాప్ 200 సెల్ఫ్-మేడ్ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ది మిలీనియం 2023' లిస్ట్‌ను విడుదల చేసింది. అందులో డీమార్ట్ కంపెనీ అవెన్యూ సూపర్మార్ట్స్తో కలిసి రూ.2,38,188 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో దమానీ మొదటిస్థానంలో నిలిచారు. ఫ్లిప్‌కార్ట్(రూ.1,19,472 కోట్లు)కు చెందిన బిన్నీ-సచిన్ బన్సాల్, జొమాటో(రూ.86,835 కోట్లు) దీపిందర్ గోయల్, డ్రీమ్ 11(రూ. 66,542 కోట్లు)కు చెందిన భవిత్ షేత్ వరుసగా తరువాతి స్థానాల్లో ఉన్నారు. రోజర్‌పే వ్యవస్థాపకులు హర్షిల్ మాథుర్ & శశాంక్ కుమార్, మాక్స్ హెల్త్‌కేర్ ఇన్స్టిట్యూట్-అభయ్ సోయి, పేటీఎం-విజయ్ శేఖర్ శర్మ, క్రెడ్-కునాల్ షా, జెరోధా-నితిన్ కామత్ & నిఖిల్ కామత్‌లు ఈ లిస్ట్‌లో చోటు సంపాదించారు. ఈ లిస్ట్‌లో వయసు పైబడినవారిలో వరుసగా అశోక్ సూత(80)-హ్యాపీయెస్ట్ మైండ్స్, నరేష్ ట్రెహాన్-మెదంటా(77), అశ్విన్ దేశాయ్ (72)-ఏథర్స్, జైతీర్థరావు (71)-హోమ్‌ఫస్ట్ ఉన్నారు. ఇదీ చదవండి: ‘చైనాను చూసి నేర్చుకోండి’.. మరోసారి ఇన్ఫోసిస్ మూర్తి షాకింగ్ కామెంట్స్ మరోవైపు ధనవంతుల జాబితాలో అత్యంత పిన్న వయసు కలిగినవారిలో జెప్టోకు చెందిన కైవల్య వోహ్రా(21), భారత్‌పే-నక్రానీ (25), జు పీ-దిల్షేర్ మల్హి(27), సిద్ధాంత్ సౌరభ్(28), ఓయో-రితేష్ అగర్వాల్(29) ఉన్నారు. ఈ జాబితాలో చోటుసాధించిన మహిళల్లో అతి పిన్న వయస్కుల జాబితాలో మామఎర్త్కు చెందిన గజల్ అలఘ్ (35), విన్జో-సౌమ్య సింగ్ రాథోడ్ (36), ప్రిస్టిన్ కేర్-గరిమా సాహ్నీ(37) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. -
డీమార్ట్ ఉన్న ఏకైక మాల్ మాదే... ప్రతి వీకెండ్ ఈవెంట్స్ ఉంటాయి
-
డీమార్ట్ నికర లాభం హైజంప్
న్యూఢిల్లీ: రెండో త్రైమాసికంలో డీమార్ట్ స్టోర్ల నిర్వాహక కంపెనీ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 64 శాతంపైగా జంప్‌చేసి రూ. 686 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 418 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం దాదాపు 37 శాతం ఎగసి రూ. 10,638 కోట్లను అధిగమించింది. గత క్యూ2లో రూ. 7,789 కోట్ల టర్నోవర్ నమోదైంది. అయితే మొత్తం వ్యయాలు 37 శాతం పెరిగి రూ. 9,926 కోట్లను తాకాయి. స్టోర్ల సందర్శకుల సంఖ్య తగ్గినప్పటికీ సరుకు కొనుగోళ్ల(బాస్కెట్) విలువ పుంజుకున్నట్లు సంస్థ సీఈవో, ఎండీ నెవిల్లే నొరోన్హా పేర్కొన్నారు. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
డేట్స్ ప్యాకెట్లో పురుగులు.. కుషాయిగూడ డీ మార్ట్‌లో ఘటన
సాక్షి, హైదరాబాద్: డేట్స్ (కర్జూర) ప్యాకెట్లో పురుగులు రావడంతో అవాక్కైన వినియోగదారుడు అధికారులకు ఫిర్యాదు చేయడంతో తనిఖీలు చేపట్టిన అధికారులు నిర్వాహకులకు జరిమాన విధించిన సంఘటన శుక్రవారం కుషాయిగూడ డీ మార్ట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెలితే.. న్యూ వాసవి శివనగర్ కాలనీకి చెందిన చంద్రశేఖర్ శుక్రవారం డీ మార్ట్‌లో డేట్స్ ప్యాకెట్‌ను కొనుగోలు చేశారు. సరుకుల కొనుగోలు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా అతడి కుమారుడు డీ మార్ట్ ఆవరణలోనే తినేందుకు డేట్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి నోట్లో పెట్టుకోగా మూతిపై పురుగులు పారడాన్ని తండ్రి గమనించాడు. వెంటనే అప్రమత్తమైన అతను ప్యాకెట్‌ను చూడగా కుళ్లిపోయి ఉంది. దీంతో అవాకైన చంద్రశేఖర్ డీ మార్ట్ సిబ్బందిని నిలదీయడమేగాక అధికారులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఏఎంహెచ్ఓ డాక్టర్ స్వప్నారెడ్డి తన సిబ్బందితో కలిసి సరుకులను తనిఖీ చేశారు. పూర్తిగా కుల్లిపోయి, దుర్వాసన వెదజల్లుతున్న డేట్స్ ఫ్యాకెట్‌ను గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. గతంలో హెచ్చరికలు జారీ చేసినా తీరు మార్చుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఏఎంహెచ్ఓ డీ మార్ట్ నిర్వాహకులకు రూ.30 వేలు జరిమానా విధించారు. చదవండి: ఎంసెట్ స్టేట్ ర్యాంకర్ ప్రాణం తీసిన లోన్ యాప్ వేధింపులు -
డీమార్ట్ రాధాకిషన్ దమానీ హవా, సంపద ఎంత పెరిగిందో తెలిస్తే!
న్యూఢిల్లీ: పెట్టుబడిదారుడి నుండి వ్యాపారవేత్త వరకు ఎదిగిన డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ మరోసారి తన హవాను చాటుకున్నారు. ఐఎఫ్ఎల్ వెల్త్ భాగస్వామ్యంతో పరిశోధనా సంస్థ హురున్ ఇండియా విడుదల చేసిన ర్యాంకింగ్‌లో 12 మంది వ్యాపారవేత్తలు ట్రిలియనీర్లుగా అవతరించారు. ముఖ్యంగా ప్రముఖ పెట్టుబడిదారుడు అవెన్యూ సూపర్‌మార్కెట్ (డీమార్ట్) వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ సంపద ఏకంగా 280 శాతం లేదా 1,28,800 కోట్లు రూపాయలు పెరిగింది. ఇదీ చదవండి: Hurun India Rich List 2022: అదానీ రోజు సంపాదన ఎంతో తెలుసా? గత ఐదేళ్లలో డీమార్ట్ లాభాలతో దమానీ సంపద 1.75 లక్షల కోట్లకు పెరిగింది. తద్వారా హురున్ ఇండియా రిచెస్ట్ జాబితాలో ఐదో ప్లేస్‌లో నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే రెండు స్థానాలు పైకి ఎగబాగారు. దమానీ రోజువారీ సంపాదన 57 కోట్ల రూపాయలని ఈ నివేదిక తేల్చింది. అంటే గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 13 శాతం జంప్ చేసింది. ఈ జాబితాలో అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ టాప్‌లోఉండగా, రెండో ప్లేస్‌లో రిలయన్స్అధినేత ముఖేశ్ అంబానీ, మూడు, నాలుగు స్థానాల్లో సీరం అధినేత సైరస్ పూనావల్లా, శివ్ నాడార్ నిలిచారు. కిరాణామొదలు ఆహారం, దుస్తుల విక్రయంతో భారతదేశం అంతటా 200కు పైగా డీమార్ట్ స్టోర్లతో వినియోగదారులను బాగా ఆకట్టుకుంటోంది. డీమార్ట్ రిటైల్ స్టోర్ల విస్తరణ నేపథ్యంలో దమానీ సంపద వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. స్టాక్‌మార్కెట్ పెట్టుబడులతో వందల మిలియన్ల డాలర్లు సంపాదించిన దమానీ 2002లో డీమార్ట్ స్టోర్లను ప్రారంభించడం ద్వారా వ్యాపారవేత్తగా అవతరించిన సంగతి తెలిసిందే. -
DMart: డీమార్ట్ ఆకర్షణీయ ఫలితాలు.. మరింత పెరిగిన లాభాలు
న్యూఢిల్లీ: డీమార్ట్ స్టోర్ల నిర్వాహక దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం పలు రెట్లు ఎగసి రూ. 643 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 95 కోట్లు ఆర్జించింది. ఇందుకు భారీ రికవరీ, గతంలో అతి తక్కువగా నమోదైన లాభాలు కారణమయ్యాయి. మొత్తం ఆదాయం సైతం 94 శాతం జంప్‌చేసి రూ. 10,038 కోట్లను అధిగమించింది. గతేడాది క్యూ1లో రూ. 5,183 కోట్ల అమ్మకాలు మాత్రమే సాధించింది. అమ్మకాలలో భారీ రికవరీ నమోదైనప్పటికీ గత క్యూ1లో కోవిడ్–19 రెండో దశ ప్రభావంచూపడంతో ఫలితాలను పోల్చిచూడతగదని ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ సీఈవో, ఎండీ నెవిల్లే నొరోనా తెలియజేశారు. కాగా.. ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం వ్యయాలు 81 శాతం పెరిగి రూ. 9,192 కోట్లకు చేరాయి. మూడేళ్లలో 110 స్టోర్లు గత మూడేళ్లలో కంపెనీ 110 స్టోర్లను కొత్తగా ఏర్పాటు చేసినట్లు నెవిల్లే ప్రస్తావించారు. ఈ ఏడాది క్యూ1లో 10 స్టోర్లను తెరిచినట్లు వెల్లడించారు. కరోనా మహమ్మారి తదుపరి తొలిసారి ఎలాంటి అవాంతరాలూ ఎదురుకాని తొలి త్రైమాసికంగా క్యూ1ను పేర్కొన్నారు. ఈకామర్స్ బిజినెస్ 12 నగరాలకు విస్తరించినట్లు తెలియజేశారు. ఇకపై మరిన్ని నగరాలలో ఈకామర్స్ సేవలు విస్తరించనున్నట్లు తెలియజేశారు. -
డీ మార్ట్‌కి షాక్! ఇకపై అలా చేయొద్దంటూ హెచ్చరిక
కస్టమర్లతో వ్యవహరించే తీరులో డీ మార్ట్ యాజమాన్యం వైఖరి సరిగా లేదంటూ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కన్నెర్ర చేసింది. నిబంధనలకు విరుద్ధంగా కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేసినందుకు పరిహారం చెల్లించాలంటూ తేల్చి చెప్పింది. నలభై ఐదు రోజుల్లోగా ఈ పరిహారం అందివ్వకపోతే ఆలస్యానికి వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. దేశంలోనే నంబర్ వన్ రిటైల్ స్టోర్‌గా డీ మార్ట్ కస్టమర్లతో కిటకిటలాడుతూ ఉంటుంది. వస్తువులు కొనడం కంటే బిల్లింగ్ కౌంటర్ దగ్గరే ఎక్కువగా వేచి చూడాల్సినంత బిజీగా డీ మార్ట్ స్టోర్లు ఉంటాయి. అయితే బిల్లింగ్ పూర్తయిన తర్వాత సంచి లేకపోతే డీమార్ట్ వాళ్లే అక్కడ క్యారీ బ్యాగ్‌ను అందిస్తారు. ఇలా క్యారీ బ్యాగ్ అందించే విషయంలో చెలరేగిన వివాదంపై తాజాగా తీర్పును ప్రకటించింది వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్. నగరంలోని హైదర్‌గూడలో ఉన్న డీమార్ట్ స్టోరులో 2019 నర్సింహ మూర్తి అనే వ్యక్తి రూ.479 విలువైన వస్తువులు కొనుగోలు చేశారు. బిల్లింగ్ సమయంలో ఆ సామన్లు పట్టుకెళ్లేందుకు డీమార్ట్ లోగో ముద్రించి ఉన్న క్యారీ బ్యాగ్‌ను అందించారు. అయితే డీమార్ట్ లోగోతో ఉన్న క్యారీ బ్యాగుకు రూ.3.50 ఛార్జ్ చేస్తూ బిల్లులో దాన్ని చేర్చారు. క్యారీబ్యాగుకి రూ.3.50 ఛార్జ్ చేయడాన్ని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఎదుటకు తీసుకెళ్లాడు నర్సింహ మూర్తి. ఇరు వర్గాల వాదనలు విన్న వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ డీమార్ట్‌ను తప్పు పట్టింది. కస్టమర్లకు అందించే బ్యాగులకు ఛార్జ్ వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. కస్టమర్లకు బ్యాగులు అందించినందుకు ఛార్జ్ వసూలు చేయొద్దంటూ తేల్చి చెప్పింది. బాధితుడికి పరిహారంగా రూ.10,000 ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. నలభై ఐదు రోజుల్లోగా పరిహాం ఇవ్వకపోతే ఆలస్యం జరిగిన కాలానికి 18 శాతం వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుందని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీర్పు చెప్పింది. చదవండి: 'వాణిజ్య భవన్'ను ప్రారంభించిన ప్రధాని మోదీ! -
డీమార్ట్.. అదిరిపోయే లాభాలు
డీమార్ట్ స్టోర్ల రిటైల్ దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం స్వల్పంగా 3 శాతం బలపడి రూ. 427 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడా ది(2020–21) ఇదే కాలంలో రూ. 414 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం మరింత అధికం గా 19 శాతం వృద్ధితో రూ. 8,786 కోట్లను అధిగమించింది. మొత్తం వ్యయాలు 19 శాతం పెరిగి రూ. 8,210 కోట్లయ్యాయి. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి డీమార్ట్ నికర లాభం 36 శాతం జంప్‌చేసి రూ. 1,492 కోట్లను అధిగమించింది. 2020 –21లో రూ. 1,099 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 28 శాతం ఎగసి రూ. 30,976 కోట్లను తాకింది. కరోనా సవాళ్ల లోనూ క్యూ4లో పటిష్ట ఫలితాలు సాధించగలిగినట్లు కంపెనీ సీఈవో, ఎండీ నెవెల్లీ నోరోన్హా పేర్కొన్నారు. ఒడిదొడుకులను సమర్థవంతంగా ఎదుర్కోవడంతోపాటు స్వల్ప కాలానికి రికవరీ సాధించగలమన్న విశ్వాసం పెరిగినట్లు తెలియజేశారు. గతేడాది 50 అదనపు స్టోర్లను ఏర్పాటు చేయడం ద్వారా వీటి సంఖ్య 284కు చేరినట్లు వెల్లడించారు. చదవండి: స్టాక్ మార్కెట్లో హర్షద్ మెహతాని ఢీ కొట్టిన దమ్ము డీమార్ట్ దమానీదే -
సామాన్యుడినే కాదు..! డీమార్ట్నుకూడా వదల్లేదు..!
అధిక ద్రవ్యోల్భణ రేటుతో సామాన్యులే కాకుండా డీమార్ట్ కూడా కాస్త సతమతమైంది. డీమార్ట్ జోరుకు ద్రవ్యోల్భణం స్పీడ్ బ్రేకర్‌గా నిలిచింది. 2021 క్యూ3లో కంపెనీ తక్కువ లాభాలను గడించింది. ఆశించిన దాని కంటే..! రిటైల్ చైన్ డీమార్ట్ ఆపరేటర్ అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ (అక్టోబర్-డిసెంబర్) 2021 త్రైమాసికంలో ఊహించిన దాని కంటే తక్కువ లాభాలను నమోదు చేసింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం.. డిసెంబర్‌తో ముగిసిన క్యూ3లో కంపెనీ నికర లాభం వరుసగా 32శాతం పెరిగి రూ.552.53 కోట్లకు చేరుకుంది. క్యూ3లో డీమార్ట్ సుమారు రూ. 603 కోట్ల లాభాలను బ్లూమ్‌బర్గ్ అంచనా వేసింది. ఈ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం వ్యాపారాన్ని దెబ్బతీసిందని డీమార్ట్ యాజమాన్యం వెల్లడించింది. అయినప్పటీకి కంపెనీ మార్జిన్లకు అనుగుణంగా అంచనాలు కాస్త అటుఇటుగా ఉన్నాయని పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే..! 2020-21లో ఇదే కాలంలో లాభం రూ.446.05 కోట్లతో పోలిస్తే ఈసారి 23.62 శాతం పెరిగింది. ఇదే సమయంలో నిర్వహణ ఆదాయం రూ. 7542 కోట్ల నుంచి 22.22 శాతం పెరిగి రూ.9,217.76 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ.6977.88 కోట్ల నుంచి 21.72 శాతం పెరిగి రూ.8,493.55 కోట్లకు చేరాయి.ఇదే సమయంలో నికర లాభం కూడా రూ.686 కోట్ల నుంచి రూ.1086 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. అధిక ద్రవ్యోల్భణ ప్రభావాలు..! ద్రవ్యోల్భణం కంపెనీ అమ్మకాలపై ప్రభావం చూపినట్లు అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ నెవిల్లే నొరోన్హా అన్నారు. సాధారణ వస్తువులు, దుస్తుల వ్యాపారం స్థిరంగా ఉన్నాయని, అయితే నిత్యావసర వస్తువులు (ఎఫ్ఎమ్సీజీ) అమ్మకాలు నెమ్మదించాయని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో కొనుగోలుదారులు ఆయా వస్తువులను పొదుపుగా వాడుతున్నట్లు అభిప్రాయపడ్డారు. చదవండి: అప్పట్లో అందరి రాతలు ఆయన పెన్నులతోనే! ప్చ్.. ఆయన రాతే బాగోలేదు! -
నిబంధనలను ఉల్లంఘించినందుకు డీమార్ట్‌కు జరిమానా
హైదరాబాద్: నగరంలోని హైదర్‌నగర్‌లో గల డిమార్ట్ అవుట్ లెట్‌కు క్యారీ బ్యాగుల కోసం వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేసినందుకు వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(సీడీఆర్సీ) జరిమానా విధించింది. మే 2019లో 602 రూపాయల విలువైన కొనుగోళ్లు చేసిన తర్వాత క్యారీ బ్యాగ్ కోసం డిమార్ట్ తన నుంచి 3.50 రూపాయలు వసూలు చేసిందని ఆకాశ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే నిబందనల ప్రకారం.. క్యారీ బ్యాగులకు డబ్బులు వసూలు చేస్తే.. అలాంటి బ్యాగ్‌లపై కంపెనీకి చెందిన లోగోలు ఉండరాదు. లోగోలు ఉంటే ఆ బ్యాగులను ఉచితంగానే కస్టమర్లకు అందించాలి. అయితే, డిమార్ట్ లోగో ఉన్న క్యారీ బ్యాగ్‌కు రూ.3.50 వసూలు చేసింది. ఆకాశ్ కుమార్ పిటిషన్ విషయమలో ఇరు పక్షాల వాదనలను విన్న కమిషన్ ఆకాశ్ కుమార్ కి అనుకూలంగా తీర్పునిచ్చింది. క్యారీ బ్యాగ్‌పై లోగో ఉన్నందున డిమార్ట్ ఆ బ్యాగ్‌ను ఉచితంగానే ఇవ్వాల్సి ఉందని, కానీ వారు రూ.3.50 వసూలు చేశారు కాబట్టి ఆ మొత్తాన్ని వినియోగదారుడికి చెల్లించాలని కమిషన్ తీర్పు ఇచ్చింది. అలాగే ఆకాష్‌కు రూ.1,000 నష్టపరిహారం చెల్లించాలని సూచించింది. ఈ మొత్తాన్ని 45 రోజుల సమయం లోపల చెల్లించకపోతే 18 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది అని పేర్కొంది. అయితే డిమార్ట్‌కు ఇలా ఫైన్ పడడం ఇదేమీ కొత్త కాదు. గతంలో హైదర్‌గూడలోని అవుట్ లెట్‌కు కూడా ఇలాగే రూ.50వేల జరిమానా విధించారు. (చదవండి: రైతులకు ఎస్బీఐ తీపికబురు.. తక్కువ వడ్డీకే రుణాలు!) -
డీమార్ట్ దెబ్బకు బిలియనీర్ అయిపోయాడే...!
డీమార్ట్ ఆకాశమే హద్దుగా రాకెట్లా దూసుకుపోతుంది. కొద్ది రోజుల క్రితమే డీమార్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ. 3 ట్రిలియన్ క్లబ్‌లోకి జాయిన్ విషయం తెలిసిందే. డీమార్ట్ దూకుడుతో కంపెనీ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ వరల్డ్ రిచెస్ట్ -100 బిలియనీర్ క్లబ్‌లోకి చేరారు. తాజాగా డీమార్ట్ సీఈవో ఇగ్నేషియస్ నావిల్ నోరోన్హా బిలియనీర్‌గా అవతారమెత్తారు. కంపెనీ షేర్లు సోమవారం రోజున 10 శాతం పైగా పుంజుకోవడంతో నోరోన్హా బిలియనీర్‌గా మారారు. చదవండి: గూగుల్ బ్రౌజర్ వార్నింగ్.. కోట్ల మంది దూరం? గూగుల్‌కే కోలుకోలేని నష్టం! డీమార్ట్‌లో నోరోన్హా 2.02 శాతం వాటాను కల్గి ఉన్నారు. వాటి విలువ ఇప్పుడు రూ. 7,720 కోట్లకు చేరింది. ఇటీవలి కాలంలో ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం...ఇగ్నేషియస్ నావిల్ నోరోన్హా భారత్‌లో అత్యంత ధనవంతులైన ప్రొఫెషనల్ మేనేజర్‌గా నిలిచారు. డీమార్ట్‌లో చేరడానికి ముందు, నోరోన్హా ఫాస్ట్‌మూవింగ్ కన్యూసమర్ గూడ్స్(ఎఫ్ఎమ్సీజీ)దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్‌తో కలిసి పనిచేశారు. అవెన్యూ సూపర్‌మార్ట్స్ స్థాపించిన వెంటనే రాధాకిష్ణన్ దమాని 2004 లో నోరోన్హాను డీమార్ట్ సీఈవోగా నియమించారు. క్యూ-2 లో భారీ లాభాలు..! ఈ ఏడాది రెండో త్రైమాసికంలో డీమార్ట్ తన స్వతంత్ర ఆదాయంలో 46శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసి ₹ 7,649.64 కోట్లకు చేరుకుంది. గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక ప్రకారం..డీమార్ట్ వృద్ధి నివేదిక అంచనాల కంటే 5శాతం ఎక్కువ మేర లాభాలను గడించింది. చదవండి: స్మార్ట్‌ఫోన్ ఆధిపత్యానికి చెక్! చైనాను ఇరకాటంలో నెట్టేలా భారత్ నిర్ణయం -
డీమార్ట్ లాభం రెట్టింపు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2021–22) రెండో త్రైమాసికంలో డీమార్ట్ స్టోర్ల నిర్వాహక కంపెనీ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ2(జులై–సెపె్టంబర్)లో నికర లాభం రెట్టింపై దాదాపు రూ. 418 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 196 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 47 శాతం ఎగసి రూ.7,789 కోట్లను తాకింది. అయితే మొత్తం వ్యయాలు 44 శాతం పెరిగి రూ. 7,249 కోట్లయ్యాయి. స్టాండెలోన్ పద్ధతిన డీమార్ట్ ఆదాయం 47 శాతం జంప్‌చేసి రూ. 7,650 కోట్లకు చేరింది. ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెపె్టంబర్)లో మొత్తం ఆదాయం రూ. 9,189 కోట్ల నుంచి రూ. 12,972 కోట్లకు పురోగమించింది. -
డీమార్ట్ జోరు..! లాభాల్లో హోరు...!
దేశంలోని అతిపెద్ద రిటైల్ చైన్లలో ఒకటైన డీమార్ట్ 2021-22 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అదరగొట్టింది. క్యూ2లో డీమార్ట్ రూ. 7,650 కోట్ల ఆదాయాన్ని గడించింది . గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 46 శాతం అధిక లాభాలను ఆర్జించింది. గత ఏడాది క్యూ2లో రూ. 5,218 కోట్ల డీమార్ట్ సొంతం చేసుకుంది. డీమార్ట్ క్యూ 2 నికరలాభాల్లో కూడా అదే జోరును ప్రదర్శించింది. డీమార్ట్ సుమారు 113.2 శాతం మేర స్వతంత్ర నికర లాభాలను పొందింది. క్యూ 2లో సుమారు 448.90 కోట్లను ఆర్జించింది. గత ఏడాది రెండో త్రైమాసికంలో సుమారు 210.20 కోట్ల లాభాలను గడించింది. చదవండి: ఈ కంపెనీలు 60సెకన్లకు ఎంత సంపాదిస్తున్నాయో తెలుసా? FY22 ఆర్థిక సంవత్సర తొలి అర్ధభాగంలో డీమార్ట్ మొత్తం ఆదాయం రూ. 12,681 కోట్లుగా నమోదైంది. గత ఏడాది 9,051 కోట్ల ఆదాయాన్ని నమోదుచేసింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కరోనావైరస్ ప్రభావం బాగా కన్పించింది. సెకండ్‌వేవ్‌ను దృష్టిలో ఉంచుకొని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలను విధించాయి. ఏదేమైనా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు క్రమంగా లాక్డౌన్లను ఎత్తివేయడం, టీకా వేగాన్ని పెంచడంతో, రిటైల్ మార్కెట్లు వృద్ధిలో సానుకూల వేగాన్ని చూస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 2021 సెప్టెంబర్ 30 నాటికి మొత్తం డీమార్ట్ స్టోర్స్ సంఖ్య 246కు పెరిగాయి. చదవండి: మహీంద్రా థార్‌కు పోటీగా మారుతి నుంచి అదిరిపోయే కార్...! -
ఆకాశమే హద్దుగా డీమార్ట్ దూకుడు...!
ముంబై: రిటైల్ చైన్ సూపర్ మార్కెట్స్ డీ-మార్ట్స్ను నిర్వహిస్తోన్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ సోమవారం రోజున సరికొత్త రికార్డును నమోదుచేసింది. డీమార్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ ఏకంగా రూ. 3 ట్రిలియన్లకు (3 లక్షల కోట్లు) చేరుకుంది. ఈ అరుదైన ఘనతను సాధించిన 17 ఇండియన్ స్టాక్స్ లిస్టెడ్ కంపెనీగా నిలిచింది. ఈ ఏడాదిలో డీమార్ట్ షేర్లు ఇప్పటివరకు సుమారు షేర్లు 70% పైగా పెరిగాయి. చదవండి: ఒక్కసారి ఛార్జ్‌తో 1360 కిలోమీటర్ల ప్రయాణం..! బీఎస్ఈ స్టాక్ మార్కెట్లో సోమవారం రోజున డీమార్ట్ షేర్ విలువ రికార్డు స్థాయిలో గరిష్టంగా రూ. 4,837ను తాకింది. దీంతో డీ మార్ట్ మార్కెట్ క్యాప్ విలువ రూ. 3.11 ట్రిలియన్లకు చేరుకుంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి డీ మార్ట్ షేర్ విలువ 7 శాతం వృద్ధి చెంది రూ. 4716.50 వద్ద నిలిచింది. రిలయన్స్ ఇతర కంపెనీల సరసన..! రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐటిసి, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఒఎన్‌జిసి, విప్రో, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ఏషియన్ పెయింట్స్ కంపెనీల మార్కెట్ క్యాప్ మూడు ట్రిలియన్ డాలర్లకు చేరుకున్న క్లబ్లో ఇప్పుడు డీమార్ట్ కూడా చేరింది. క్యూ-2 లో భారీ లాభాలు..! ఈ ఏడాది రెండో త్రైమాసికంలో డీమార్ట్ తన స్వతంత్ర ఆదాయంలో 46శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసి ₹ 7,649.64 కోట్లకు చేరుకుంది. గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక ప్రకారం..డీమార్ట్ వృద్ధి నివేదిక అంచనాల కంటే 5శాతం ఎక్కువ మేర లాభాలను గడించింది. చదవండి: తొలి భారత ప్లేయర్‌గా రికార్డు సృష్టించనున్న దినేష్ కార్తీక్...! -
డీమార్ట్ దూకుడు..!
దేశంలోని అతిపెద్ద రిటైల్ చైన్లలో ఒకటైన డీమార్ట్ 2021-22 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అదరగొడుతుంది. క్యూ2లో డీమార్ట్ రూ. 7,650 కోట్ల ఆదాయాన్ని గడించింది . గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 46 శాతం అధికంగా లాభాలను ఆర్జించింది. గత ఏడాది క్యూ2లో రూ. 5,218 కోట్ల డీమార్ట్ సొంతం చేసుకుంది. రెండో త్రైమాసికంలో కార్యకలాపాల నుంచి వచ్చే సంపూర్ణ ఆదాయం కంపెనీ చట్టబద్ధమైన ఆడిటర్ల పరిమిత సమీక్షకు లోబడి ఉంటుందని డీమార్ట్ ఒక ఫైలింగ్‌లో తెలిపింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కరోనావైరస్ ప్రభావం బాగా కన్పించింది. సెకండ్‌వేవ్‌ను దృష్టిలో ఉంచుకొని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలను విధించాయి. ఏదేమైనా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు క్రమంగా లాక్డౌన్లను ఎత్తివేయడం, టీకా వేగాన్ని పెంచడంతో, రిటైల్ మార్కెట్లు వృద్ధిలో సానుకూల వేగాన్ని చూస్తున్నాయి. చదవండి: అతి తక్కువ ధరలోనే..భారత మార్కెట్లలోకి అమెరికన్ బ్రాండ్ టీవీలు..! దేశ వ్యాప్తంగా 2021 సెప్టెంబర్ 30 నాటికి మొత్తం డీమార్ట్ స్టోర్స్ సంఖ్య 246కు పెరిగింది. డీమార్ట్ షేర్లు రూ. 4242 వద్ద ముగిశాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు డీమార్ట్ షేర్లు 50శాతం పైగా పెరిగాయి. స్టాక్ మార్కెట్లో అద్బుతర్యాలీను డీమార్ట్ నమోదుచేస్తోంది. డీమార్ట్ యాజమాని రాధాకిషన్ ఎస్ దమాని ఇటీవలే టాప్ -100 ప్రపంచ బిలియనీర్స్ ఎలైట్ క్లబ్లో ప్రవేశించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం దమాని నికర ఆస్తుల విలువ 22.5 బిలియన్ డాలర్లతో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో 70 వ స్థానంలో కొనసాగుతున్నారు. చదవండి: ఇంధన ధరల పెంపుపై 9 నెలల్లో కేంద్రం చెప్పిన 9 కారణాలు..! -
డిగ్రీలో ఫెయిల్, నెమ్మదస్తుడు.. కానీ లక్ష కోట్లకు అధిపతి
దేశంలో అత్యంత సంపన్నమైన వ్యక్తి ఎవరి అడిగితే ముఖేశ్ అంబాని అని ఠక్కున చెప్పేస్తాం. మరి రెండో వ్యక్తి ఎవరని అడిగితే టాటా,బిర్లా, మహీంద్రా, అజీం, శివనాడర్, బజాజ్ ఇలా పేర్లు వెతుకుతాం. కానీ వీళ్లెవరు కాదు .ఈ రెండో సంపన్నుడి పేరు రాధకిషన్ దమాని. ఏ మాత్రం పబ్లిసిటీని ఇష్టపడని ఈ మనిషి, కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. కేవలం కామన్ సెన్స్‌ని పెట్టుబడిగా పెట్టి సుమారు లక్షా యాభై వేల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు. D Mart Founder Radhakishan Damani: రాధా కిషన్ దమానీ వ్యాపారమే జీవన విధానంగా బతికే మర్వాడీ కుటుంబంలో 1954న జన్మించాడు. రాజస్థాన్‌లోని బికనేర్లోనే ఆయన విద్యాభ్యాసం జరిగింది. ఆ తర్వాత ఆయన తండ్రి శివ కిషన్ దమానీ ముంబై స్టాక్ ఎక్సేంజీలో బ్రోకర్‌గా పని చేయడానికి కుదరడంతో ఆ కుటుంబం ముంబైకి మకాం మార్చింది. రాధా కిషన్‌కి గోపి కిషన్ అనే సోదరుడు కూడా ఉన్నాడు. అత్తెసరు మార్కులతోనే చదువు నెట్టుకొస్తూ.... ఎలాగొలా ముంబై యూనివర్సిటీలో బీకాంలో సీటు సాధించినా మొదటి ఏడాది తర్వాత కాలేజీకి వెళ్లనంటూ భీష్మించుకుని కూర్చున్నాడు. దీంతో ఇంట్లో వాళ్లు అతని చేత బాల్ బేరింగ్ బిజినెస్ పెట్టించారు. తండ్రితో కలిసి సోదరుడు గోపి దమానీ స్టాక్ మార్కెట్ బ్రోకరేజీ పనులు చూసుకునే వాళ్లు. ఆ ఘటనతో... ఇటు పెద్దగా చదువు కోకుండా అటు బిజినెస్‌లో చురుగ్గా వ్యవహరించని రాధా కిషన్‌పై తండ్రికి ఎప్పుడూ అనుమానమే. అయితే రాధా కిషన్‌కి 32 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు అకస్మాత్తుగా శివ్ దమానీ మరణించాడు. దీంతో తండ్రి స్థానంలో అయిష్టంగానే స్టాక్ మార్కెట్లోకి వచ్చాడు దమానీ కదలడు మెదలడు స్టాక్ మార్కెట్ అంటేనే గందరగోళం.. కొనేవాళ్లు, అమ్మేవాళ్లలతో హడావుడిగా ఉంటుంది. కానీ రాధకిషన్ దమానీ ఇందుకు విరుద్ధంగా నెమ్మదిగా ఉండేవాడు. అతని పేరేంటో కూడా తోటి బ్రోకర్లకి తెలిసేది కాదు. మార్కెట్లో అతను ప్రాతినిథ్యం వహించే జీఎస్ అనే బ్యాడ్జ్ అతని షర్ట్‌పై ఉంటే అదే పేరుతో జీఎస్ అనే ఎక్కువ మంది పిలిచేవారు. హడావుడి చేయకపోయినా అక్కడున్న వాళ్లని గమనిస్తూ మార్కెట్ పల్స్‌ని మాత్రం బాగా గమనించే వాడు. హర్షద్ మెహతాకు పోటీగా రాధ కిషన్ దమానీ స్టాక్ మార్కెట్లో కెరీర్ ప్రారంభించినప్పుడే మరో బిగ్బుల్, స్టాక్ మార్కెట్ స్కామర్ హర్షద్ మెహతా కూడా స్కాక్ మార్కెట్లో అడుగు పెట్టాడు. తెర వెనుక మంత్రాంగం నడుపుతూ మార్కెట్‌ను పైకి లేపడంలో హర్షద్‌కి పెట్టింది పేరు. అతనికి పోటీగా మార్కెట్లో నిలిచింది ట్రిపుల్ ఆర్‌లో రాధాకిషన్ దమానీ మూల స్థంభం. ఆ రోజుల్లో హర్షద్‌కి పోటీగా రాధా కిషన్, రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా, రాజ్ అనే ముగ్గురు ట్రిపుల్ ఆర్గా పోటీ ఇచ్చారు. అయితే వీళ్లపై ఎక్కువ సార్లు హర్షద్దే పై చేయి అయ్యింది. అయినా సరే పట్టు వదలకుండా పోటీలో నిలిచారంటే దానికి కారణం దమానీనే. అదే జరిగి ఉంటే ఓ కంపెనీ టైర్స్ షేర్ల విషయంలో హర్షద్ మెహెతా, ట్రిపుల్ ఆర్ల మధ్య పోటీ నెలకొంది. ఆ కంపెనీ షేర్లు పెరుగుతాయంటూ హర్షద్ బుల్ జోరు కొనసాగిస్తే, ఆ షేర్లు పడిపోతాయంటూ ట్రిపుల్ ఆర్ బేర్ వైపు నిల్చుంది. హర్షద్ ఎత్తులతో చాలా రోజుల పాటు ఆ కంపెనీ షేర్లు పడిపోలేదు. మరో వారం గడిస్తే ఇల్లు, వాకిలి అమ్మేసి నడి రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ట్రిపుల్ ఆర్ బృందానికి ఎదురైంది. అయితే హర్షద్ పాచికలు పారక కృత్రిమంగా పెంచిన ఆ కంపెనీ టైర్ల ధరలు పడిపోవడంతో దమానీ బృందం అప్పుల ఊబి నుంచి బయటపడ్డారు. ఆ తర్వాతి కొద్ది రోజులకే హర్షద్ స్కాం వెలుగు చూడటంతో పరిస్థితి మారిపోయింది. హడావుడి చేయకుండా నిదానంగా ఆలోచిస్తూ మార్కెట్ ఎత్తులు వేసే రాధా కిషన్ దమానీ వైఖరి ఆయన్ని మార్కెట్లో మరో ఎత్తుకి తీసుకెళ్లింది. పట్టిందల్లా బంగారమే 1992 నుంచి 1998 వరకు రాధి కిషన దమానీ కొనుగోలు చేసిన కంపెనీ షేర్ల విలువ బాగా పెరిగింది. వీఎస్టీ, హెచ్డీఎఫ్సీ, సుందరం ఫైనాన్స్ ఇలా అన్ని కంపెనీలు లాభాలను కళ్ల చూశాయి. బేర్ మార్కెట్‌ను అంచనా వేసి తక్కువ ధర షేర్లు కొన్ని లాంగ్‌టర్మ్‌లో భారీ లాభాలను పొందే వ్యూహం అమలు చేశాడు. పదేళ్లు తిరిగే సరికి వందల కోట్ల ఆస్తికి అధిపతి అయ్యాడు. అప్నా బజార్ తక్కువ ధరకే వస్తువులను భారతీయులు కొనుగోలు చేయాలనుకుంటారని, అందుక తగ్గట్టుగా తక్కువ ధరకే కిరాణా సామన్లు అందించే స్టోర్లుగా అప్నా బజార్ పేరుతో కోపరేటివ్ సూపర్ మార్కెట్ వ్యవస్థను 1998లో నెలకొల్పారు. అయితే ఇటు స్టాక్ మార్కెట్, అటు సూపర్ మార్కెట్ల మధ్య సమతూకం లేక అప్నా బజార్ నష్టాల పాలైంది. స్టాక్‌మార్కెట్‌కి గుడ్‌బై తొలి సారి బాల్‌బేరింగ్ వ్యాపారంలో వచ్చిన నష్టం దమానీని వేధిస్తూనే ఉంది. ఇప్పుడు కొత్తగా అప్నా బజార్లో నడవలేని స్థితికి చేరుకుంది. దీంతో దమానీలో పట్టుదల పెరిగింది. కోట్ల రూపాయల సంపద అందించిన స్టాక్ మార్కెట్‌కి 2000లో గుడ్‌బై చెప్పాడు. డీ మార్ట్ ముంబై నగర శివార్లలో పువై ప్రాంతంలో చవగ్గా స్థలం కొని ఏర్పాటు చేసి కిరాణ వస్తువుల నుంచి బట్టలు, ఎలక్ట్రానిక్స్, గ్రూమింగ్ వరకు అన్ని వస్తువులు ఓకే చోట దొరికేలా డీ మార్ట్ హైపర్ మార్కెట్‌ని ఏర్పాటు చేశాడు. ప్రతీ వస్తువుని ఎంఆర్పీ కంటే తక్కువ ధరకే అమ్మడం ప్రారంభించాడు. నెమ్మదిగా డీ మార్ట్ విజయ పరంపర మొదలైంది. ధనవంతుల జాబితాలో డీ మార్ట్ ప్రారంభించిన తర్వాత పదేళ్లు గడిచే సరికి స్టోర్ల సంఖ్య 1 నుంచి పదికి పెరిగింది. అయితే మా సిటీలో కూడా డీమార్ట్ ఉంటే బాగుండు అనుకునే వారి సంఖ్య లక్షల్లోకి చేరింది. అందుకు తగ్గట్టే మరో పదేళ్లు గడిచే సరికి డీమార్ట్ స్టోర్ల సంఖ్య దేశ వ్యాప్తంగా 220కి చేరుకుంది. డీ మార్ట్ పబ్లిక్ ఇష్యూకి 2017లో వెళ్లగా 145 శాతం అధిక ధర నమోదై రికార్డు సృష్టించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు. ఆగస్టు 19న ఆయన పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఐదు కంపెనీలు విపరీతమైన ఆదాయాన్ని సంపాదించి పెట్టాయి. దీంతో ఒక్కసారిగా ఆయన ఆదాయం 19.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇందులో 4.1 బిలియన్ డాలర్లు ఈ ఒక్క ఏడాదిలోనే ఆయన ఖాతాలో వచ్చి చేరింది. దీంతో ప్రపంచ కుబేరుల్లో ఆయన 97వ స్థానంలో నిలిచినట్టు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకటించింది. ఇండియాలో ముకేశ్ అంబానీ 57.9 బిలియన్ డాలర్లతో ప్రథమ స్థానంలో ఉంటే దమానీ 19.30 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నారు. విలువలే ఆధారంగా స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టినప్పటి నుంచి తెల్ల అంగీ తెల్ల ప్యాంటు మాత్రమే ఆయన ధరిస్తారు.దీంతో ఆయన్ని మిస్టర్ వైట్ అండ్ వైట్‌గా పిలుచుకుంటారు. 80వ దశకంలో స్టాక్ మార్కెట్లో హర్షద్‌మెహతా ఎత్తులకు మిగిలిన ఇన్వెస్టర్లు చిత్తైపోతుంటే తెగువతో నిలిచారు దమానీ. ఆ పోరులో సర్వం కోల్పేయే వరకు వచ్చినా ధైర్యం కోల్పోలేదు. అందువల్లే స్కాములు చేసిన హర్షద్ ఎలా పైకి ఎదిగాడో అలాగే నేలకరిస్తే.. నెమ్మదస్తుడిగా పేరున్న దమానీ టాటా బిర్లాలనే వెనక్కి నెట్టి అత్యంత ధనవంతుల జాబితాలో చోటు సంపాదించారు. ఇప్పటికీ అదే తీరు ముంబై స్టాక్ మార్కెట్లో బ్రోకర్‌గా అగుడు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అదే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు దమానీ. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, బయట పార్టీలకు వెళ్లడం, ఆఖరికి మార్కెట్ మీద సైతం కామెంట్ చేసేందుకు ఆయన ముందుకు రారు. ఎక్కడైనా విరాళాలు, సాయం అందించిన తనే పేరు రాయించడు, కనీసం మాట వరసకి కూడా చెప్పొదంటూ సాయం, విరాళం పొందిన వారిని రిక్వెస్ట్ చేస్తారు. ఇండియాలో రెండో అత్యంత ధనవంతుడిగా గుర్తింపు వచ్చిన సందర్భంలో ఆయన లేటెస్ట్ ఫోటోలు సైతం మీడియాకి లభించలేదంటే ఎంత లో ఫ్రొఫైల్ మెయింటైన్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు. - సాక్షి, వెబ్‌డెస్క్ ప్రత్యేకం చదవండి : BigBull: పెట్టుబడి ఐదు వేలు.. సంపాదన 34 వేల కోట్లు! -
డీమార్ట్, ప్యారడైజ్‌కు భారీ జరిమానా
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ లోని డీమార్ట్ షాపింగ్ మాల్, ప్యారడైజ్ రెస్టారెంట్లకు ఊహించని షాక్ తగిలింది. వినియోగ దారుల నుంచి క్యారీ బ్యాగుల కోసం ఆదనంగా చార్జీలు వసూలు చేస్తున్నందుకు తాజాగా వినియోగదారుల పోరమ్ జరిమానా విధించింది. హైదర్‌గూడ డీమార్ట్ బ్రాంచ్‌కు, సికింద్రాబాద్, బేగంపేట ప్యారడైజ్ రెస్టారెంట్లకు వినియోగదారుల ఫోరమ్ కోర్టు రూ.50 వేల చొప్పున జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాదు.. ఈ ఫిర్యాదు చేసిన వ్యక్తికి రూ. 4 వేల నష్ట పరిహారం, కోర్టు ఖర్చులు చెల్లించాలని వినియోగదారుల పోరమ్ తీర్పు చెప్పింది. కాగా, విజయ్ గోపాల్ అనే వ్యక్తి 2019లో సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి ఆహారాన్ని కొనుగోలు చేయగా క్యారీ బ్యాగ్స్ కోసం రూ.4.76 చార్జ్ చేశారు. 2019 జూన్‌లో హైదరాగూడ డీమార్ట్ నుంచి సామాగ్రి కోనుగొలు చేయగా అక్కడ కూడా క్యారీ బ్యాగ్ కోసం రూ. 3.75 వసూలు చేశారు. దీనిపై వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించాడు. దీంతో కమిషన్ తాజా తీర్పునిచ్చింది. చదవండి: Tokyo Paralympics 2021: భళా భవీనా: పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం ఖాయం -
డీమార్ట్ పేరిట ఘరానా మోసం, లింక్ ఓపెన్ చేశారో అంతే!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి సమయంలో సైబర్ మోసాలు గణనీయంగా పెరిగాయి. నకిలీ యాప్స్, క్లోన్ వెబ్సైట్ల పేరుతో సైబర్ నేరస్థులు అమాయక ప్రజలకు కుచ్చుటోపీ పెడుతున్నారు. వాట్సాప్‌లో కూడా నకిలీ వెబ్సైట్ల లింకుల బెడద ఎక్కువగానే ఉంది. సైబర్ నేరస్థులు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ అమాయక ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. ఈ సారి రిటైల్ సూపర్ మార్కెట్ల దిగ్గజం డీమార్ట్ రూపంలో సైబర్ నేరస్థులు విరుచుకుపడుతున్నారు. చదవండి: Ola Electric: మరో సంచలనానికి తెర తీయనున్న ఓలా ఎలక్ట్రిక్...! డీమార్ట్ సూపర్ మార్కెట్ తన 20 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉచితంగా బహుమతులు పంపిణీ చేస్తోందని పేర్కొంటూ ఒక లింక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ లింక్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ సైబరాబాద్ ట్విట్ తన ట్విట్లో పేర్కొంది. నకిలీ లింక్‌పై క్లిక్ చేసినప్పుడు, స్పిన్ వీల్ ఉన్న థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌కు ప్రజలు మళ్లీంచబడతారు. మీరు సుమారు రూ. 10,000 వరకు బహుమతి కార్డులను గెలుచుకోవడానికి స్పీన్ వీల్ తిప్పమని అడుగుతుంది. మీరు వీల్‌ను స్పిన్ చేసిన వెంటనే'ఉచిత బహుమతి'తో మరొక లింక్ ఓపెన్ అవుతోంది. గిఫ్ట్‌ను క్లెయిమ్ చేయడానికి 'ఉచిత బహుమతి' పోటీని ఇతర స్నేహితులతో పంచుకోవాలని మిమ్మల్ని అడుగుతుంది.ఆయా లింక్‌లను ఓపెన్ చేస్తే సైబర్‌నేరస్తులు ప్రజల బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు దోచేస్తున్నారని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. బీ అలర్ట్.. ఈ లింక్ ఓపెన్ చేయవద్దు.#DMart pic.twitter.com/x9XmqHzWqO — Economic Offences Wing Cyberabad (@EOWCyberabad) August 21, 2021 (చదవండి: Elon Musk-Jeff Bezos: ఎలన్ మస్క్‌కు పెద్ద దెబ్బే కొట్టిన జెఫ్‌బెజోస్...!) -
ప్రపంచ కుబేరులలో డీమార్ట్ బాస్
ముంబై: కరోనా టైంలో అన్నివర్గాలను ఆకర్షించి.. విపరీతంగా లాభాలు ఆర్జించింది డీమార్ట్ బ్రాండ్ సూపర్ మార్కెట్. తాజాగా ఈ స్టోర్ల ప్రమోటర్ రాధాకృష్ణన్ ఎస్.దమానీ తాజాగా ప్రపంచ సంపన్నుల జాబితాలో చేరారు. 19.2 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1.42 లక్షల కోట్లు) నెట్‌వర్త్‌ను సాధించడం ద్వారా బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో 98వ ర్యాంకులో నిలిచారు. వెరసి టాప్–100 గ్లోబల్ కుబేరుల్లో ఒకరిగా తొలిసారి ఆవిర్భవించారు. ప్రపంచ సంపన్నులపై రోజువారీ ర్యాంకింగ్‌లను ఈ ఇండెక్స్ ప్రకటిస్తుంటుంది. డీమార్ట్ రిటైల్ చైన్ నిర్వాహక సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌కు ప్రమోటర్ అయిన దమానీ.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ కూడా. దేశీ కుబేరులు: టాప్–100 గ్లోబల్ జాబితాలో దమానీ కంటే ముందు వరుసలో దేశీ దిగ్గజాలు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, విప్రో వ్యవస్థాపకులు అజీమ్ ప్రేమ్‌జీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గౌరవ చైర్మన్ శివ నాడార్, స్టీల్ టైకూన్ లక్ష్మీ మిట్టల్ సైతం నిలిచారు. కాగా.. డీమార్ట్ రిటైల్ స్టోర్ల విస్తరణ నేపథ్యంలో దమానీ సంపద వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. ముఖ్యంగా దాదాపు ప్రతీ ప్రొడక్టులు.. వాటిపై రీజనబుల్ డిస్కౌంట్ల ప్రకటన, ఎక్కువ ప్రొడక్టులతో వినియోగదారుల్ని ఆకర్షించడం, టౌన్లకు సైతం విస్తరించిన మార్ట్లు, ముఖ్యంగా కరోనా టైం నుంచి అన్ని వర్గాలను మార్ట్‌లకు రప్పించుకోవడం ద్వారా డీమార్ట్ వాల్యూను విపరీతంగా పెంచుకోగలిగారాయన. తద్వారా స్టాక్ మార్కెట్లలో మధ్య, చిన్నతరహా కంపెనీలలో అత్యధికంగా ఇన్వెస్ట్ చేసే దమానీ.. వేల్యూ ఇన్వెస్టర్‌గా గుర్తింపు పొందారు. పెట్టుబడులను దీర్ఘకాలంపాటు కొనసాగిస్తుంటారు. అయితే సంపద వృద్ధికి ప్రధానంగా ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ దోహదం చేసింది. దమానీకి అధిక వాటాలున్న లిస్టెడ్ కంపెనీలలో వీఎస్టీ ఇండస్ట్రీస్, ఇండియా సిమెంట్స్, సుందరం ఫైనాన్స్, ట్రెంట్‌లను పేర్కొనవచ్చు. డీమార్ట్ దూకుడు ఐపీవో ద్వారా 2017 మార్చిలో స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ షేరు రేసుగుర్రంలా పరుగు తీసింది. దీంతో రూ. 39,813 కోట్ల నుంచి ప్రారంభమైన కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (విలువ) తాజాగా రూ. 2.36 లక్షల కోట్లకు దూసుకెళ్లింది. ఇది ఆరు రెట్ల వృద్ధికాగా.. దమానీ, ఆయన కుటుంబ వాటా విలువ రూ. 32,870 కోట్ల నుంచి రూ. 1.77 లక్షల కోట్లకు జంప్ చేసింది. గత ఏడాది కాలంలోనే డీమార్ట్ షేరు 62 శాతం పురోగమించడం గమనించదగ్గ అంశం!. -
World Top 100 Billionaires: బిలియనీర్ల క్లబ్లో మరో భారతీయుడు
సాక్షి, వెబ్‌డెస్క్: ఇండియాలో వ్యాపారం పుంజుకుంటోంది. మన వ్యాపారవేత్తలు వందల కోట్ల ఆస్తులు సంపాదిస్తున్నారు. ప్రపంచ కుబేరుల సరసన నిలుస్తున్నారు. తాజాగా ఇండియా నుంచి మరోకరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన వంద మంది బిలియనీర్ల జాబితాలో చేరారు. 97వ స్థానం ఇండియల్ బిగ్‌బుల్‌గా పేరొందిన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు గురులాంటి వ్యక్తి రాధకిషన్ దమానీ. ఏన్నె ఏళ్లుగా ఆయన స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇటీవల ఆయన పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఐదు కంపెనీలు విపరీతమైన ఆదాయాన్ని సంపాదించి పెట్టాయి. దీంతో ఒక్కసారిగా ఆయన ఆదాయం 19.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇందులో 4.1 బిలియన్ డాలర్లు ఈ ఒక్క ఏడాదిలోనే ఆయన ఖాతాలో వచ్చి పడింది. దీంతో ప్రపంచ కుబేరుల్లో ఆయన 97వ స్థానంలో నిలిచినట్టు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకటించింది. డీమార్ట్ నుంచే రాధాకిషన్ దమానీకి అత్యధిక సంపద తెచ్చిపెట్టిన వ్యాపారంలో ప్రథమ స్థానంలో నిలిచింది డీమార్ట్. దమానీ ప్రధాన ప్రమోటర్‌గా ఉన్న డిమార్ట్ షేర్ల విలువ ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. డీమార్ట్‌లో రాధాకిషన్ దమానీకి 65.20 శాతం వాటా కలిగిని ఉన్నారు. డీమార్ట్ షేర్ వాల్యూ జనవరి 1న రూ.2,789 ఉండగా ఆగస్టు 17న ఏకంగా ఒక షేరు విలువ రూ.3,649కి చేరుకుంది. కేవలం ఎనిమిది నెలల్లో షేరు విలువ 31 శాతం పెరిగింది. దీంతో డీమార్ట్ ద్వారా దమానీ ఖాతాలో 1.54 లక్షల కోట్ల సంపద చేరింది. మిగిలినవి దమానీ సంపదలో డీమార్ట్ తర్వాత సుందర్ ఫైనాన్స్ నుంచి రూ.634 కోట్లు, ట్రెంట్గ్రూపు ద్వారా రూ.488 కోట్లు, బ్లూడార్ట్ ఎక్స్‌ప్రెస్ నుంచి రూ.230 కోట్లు, మెట్రో పోలిస్ హెల్త్‌కేర్ ద్వారా రూ. 229 కోట్ల సంపదను ఆయన కలిగి ఉన్నారు. చదవండి: ఏడుగురు మహిళలు..రూ.80 పెట్టుబడి కట్ చేస్తే రూ.1600 కోట్ల టర్నోవర్ -
మదనపల్లి ఇండస్ట్రియల్ పార్క్‌లో పేలుళ్ల కలకలం
సాక్షి, చిత్తూరు: మదనపల్లిలోని ఇండస్ట్రియల్ పార్కులో పేలుళ్ళు కలకలం సృష్టించాయి. భవన నిర్మాణం కోసం డీమార్ట్ సంస్థ నిర్వాహకులు డిటోనేటర్లను పేల్చారు. భారీగా పేలుడు సంభవించడమే గాక బండరాళ్లు ఆ పరిసరాల్లోని నివాస గృహాలపై పడ్డాయి. దీంతో పలు ఇళ్లు దెబ్బతినడంతో పాటు ఐదుగురికి గాయాలుకాగా, వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. డీమార్ట్ సంస్థపై స్థానికుల మండిపడుతున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు స్వీకరించిన పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. -
డిస్కౌంట్ల డీమార్ట్... లాభాలు ఎంతో తెలుసా ?
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) తొలి త్రైమాసికంలో డీమార్ట్ స్టోర్ల నిర్వాహక సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 95 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 40 కోట్లు మాత్రమే ఆర్జించింది. గతేడాది క్యూ1లో దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా అమ్మకాలు ప్రభావితమైన విషయాన్ని ఈ సందర్భంగా కంపెనీ ప్రస్తావించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 3,883 కోట్ల నుంచి రూ. 5,183 కోట్లకు జంప్‌చేసింది. మొత్తం వ్యయాలు రూ. 3,875 కోట్ల నుంచి రూ. 5,077 కోట్లకు పెరిగాయి. ఈ క్యూ1 ప్రారంభంలోనూ స్థానికంగా కఠిన లాక్డౌన్లు అమలైనప్పటికీ మూడు, నాలుగు వారాల తదుపరి ఆంక్షలు తొలగుతూ వచ్చినట్లు కంపెనీ తెలియజేసింది.