న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనాను ఎదుర్కొనేందుకు పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు, క్రీడాకారులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు పెద్ద మొత్తంలో విరాళాలను ప్రకటిస్తూ తమవంతు సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో అవెన్యూ సూపర్ మార్ట్స్ రిటైల్ బ్రాండ్ డీమార్ట్ ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.155 కోట్లను విరాళంగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.100 కోట్లు, కరోనా ప్రభావిత రాష్ట్రాలకు రూ.55 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించింది. (ఆందోళన వద్దు)
దీని గురించి డీమార్ట్ ప్రమోటర్ రాధాకృష్ణన్ డామని మాట్లాడుతూ.. "భారత్‌తోపాటు ప్రపంచ దేశాలు ఇంతకుముందెన్నడూ లేని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ప్రజలను సంరక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు మేము పూర్తిగా మద్దతిస్తున్నాం. మన సమాజాన్ని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా తమవంతు కృషి చేయాల"ని పిలుపునిచ్చారు. కాగా డీమార్ట్ పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.100 కోట్లు ప్రకటించగా.. మహారాష్ట్ర, గుజరాత్‌లకు రూ.10 కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలకు రూ.5 కోట్లు, తమిళనాడు, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లకు రూ.2.5 కోట్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. (జనం చస్తుంటే ఈ వంటావార్పులేంటి: సానియా)
Comments
Please login to add a commentAdd a comment