
ప్రతీకాత్మక చిత్రం
వినియోగదారులు ఎక్కువగా ఆదరించే డీమార్ట్ స్టోర్‌లో భారీగా కల్తీ నెయ్యిని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రోవేదిక్ నెయ్యి నాణ్యతపై ఓ కస్టమర్ ఫిర్యాదు చేయడంతో జైపూర్ లోని డీమార్ట్ స్టోర్ లో 450 లీటర్ల కల్తీ నెయ్యిని రాజస్థాన్ ఫుడ్ సేఫ్టీ విభాగం స్వాధీనం చేసుకుంది.
జైపూర్ లోని అన్ని దుకాణాలు, గోదాముల్లో ఉంచిన ప్రోవేదిక్ నెయ్యి, సరస్ నెయ్యి నిల్వలను నివేదించాలని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వాటిని విక్రయించవద్దని డీమార్ట్ ఏరియా సేల్స్ మేనేజర్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదేశించినట్లు ఎన్‌డీటీవీ నివేదిక పేర్కొంది.
ప్రాథమిక విచారణలో మాలవీయ నగర్ లోని సూపర్ మార్కెట్ లో నిల్వ ఉంచిన సుమారు 450 లీటర్ల నెయ్యి కల్తీ అని తేలింది. సరస్ నెయ్యి క్వాలిటీ కంట్రోల్ మేనేజర్, అనలిస్ట్ నుంచి కల్తీ నాణ్యతను నిర్ధారించిన అధికారులు సుమారు 40 లీటర్ల నకిలీ సరస్ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నెయ్యిలో ఒకే బ్యాచ్ నంబర్, సిరీస్ ఉన్నట్లు గుర్తించారు. విశ్వకర్మ ఇండస్ట్రియల్ ఏరియాలోని కంపెనీ డిస్ట్రిబ్యూటర్ వద్ద కూడా నకిలీ సరస్ నెయ్యి ప్యాకెట్లు లభ్యమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment