
న్యూఢిల్లీ: పెట్టుబడిదారుడి నుండి వ్యాపారవేత్త వరకు ఎదిగిన డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ మరోసారి తన హవాను చాటుకున్నారు. ఐఎఫ్‌ఎల్ వెల్త్ భాగస్వామ్యంతో పరిశోధనా సంస్థ హురున్ ఇండియా విడుదల చేసిన ర్యాంకింగ్‌లో 12 మంది వ్యాపారవేత్తలు ట్రిలియనీర్లుగా అవతరించారు. ముఖ్యంగా ప్రముఖ పెట్టుబడిదారుడు అవెన్యూ సూపర్‌మార్కెట్ (డీమార్ట్) వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ సంపద ఏకంగా 280 శాతం లేదా 1,28,800 కోట్లు రూపాయలు పెరిగింది.
ఇదీ చదవండి: Hurun India Rich List 2022: అదానీ రోజు సంపాదన ఎంతో తెలుసా?
గత ఐదేళ్లలో డీమార్ట్ లాభాలతో దమానీ సంపద 1.75 లక్షల కోట్లకు పెరిగింది. తద్వారా హురున్ ఇండియా రిచెస్ట్ జాబితాలో ఐదో ప్లేస్‌లో నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే రెండు స్థానాలు పైకి ఎగబాగారు. దమానీ రోజువారీ సంపాదన 57 కోట్ల రూపాయలని ఈ నివేదిక తేల్చింది. అంటే గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 13 శాతం జంప్ చేసింది. ఈ జాబితాలో అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ టాప్‌లోఉండగా, రెండో ప్లేస్‌లో రిలయన్స్‌అధినేత ముఖేశ్ అంబానీ, మూడు, నాలుగు స్థానాల్లో సీరం అధినేత సైరస్ పూనావల్లా, శివ్ నాడార్ నిలిచారు.
కిరాణామొదలు ఆహారం, దుస్తుల విక్రయంతో భారతదేశం అంతటా 200కు పైగా డీమార్ట్ స్టోర్లతో వినియోగదారులను బాగా ఆకట్టుకుంటోంది. డీమార్ట్ రిటైల్ స్టోర్ల విస్తరణ నేపథ్యంలో దమానీ సంపద వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. స్టాక్‌మార్కెట్ పెట్టుబడులతో వందల మిలియన్ల డాలర్లు సంపాదించిన దమానీ 2002లో డీమార్ట్ స్టోర్‌లను ప్రారంభించడం ద్వారా వ్యాపారవేత్తగా అవతరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment