Fifth rank
-
స్మృతి మంధాన ఐదో ర్యాంక్ యథాతథం
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మహిళల టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. తాజా ర్యాంకింగ్స్‌లో భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన 729 రేటింగ్ పాయింట్లతో ఐదో ర్యాంక్‌లో కొనసాగుతోంది. భారత కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మూడు స్థానాలు ఎగబాకి 12వ ర్యాంక్‌లో.. షఫాలీ వర్మ రెండు స్థానాలు పురోగతి సాధించి 15వ ర్యాంక్‌లో ఉన్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో దీప్తి శర్మ 738 పాయింట్లతో మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. రాధా యాదవ్ ఎనిమిది స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌కు చేరుకుంది. -
సంస్కరణల మద్దతుతో దూసుకుపోతున్న భారత్
న్యూఢిల్లీ: భారత్ చేపట్టిన చరిత్రాత్మక సంస్కరణల ఫలాలతో 2014 నాటికి అంతర్జాతీయంగా 10వ స్థానంలో ఉన్న భారత్, ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్టు బ్రోకరేజీ సంస్థ బెర్న్‌స్టీన్ తెలిపింది. జీఎస్టీ, మౌలిక సదుపాయాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించడాన్ని ప్రస్తావించింది. ఈ మేరకు భారత్ ఆర్థిక వ్యవస్థపై బెర్న్‌స్టీన్ ఓ నివేదికను సోమవారం విడుదల చేసింది. ప్రధాని మోదీ సారథ్యంలో దశాబ్దం అంటూ టైటిల్ పెట్టింది. ద్రవ్యోల్బణం కట్టడి, అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడం, డిజిటైజేషన్, కరోనా సమయంలో తీసుకున్న వివేకవంతమైన చర్యలు, చమురు ధరలు నియంత్రణలో ఉండడం సానుకూలించినట్టు పేర్కొంది. ‘‘కొందరికి అదృష్టం రాత్రికి రాత్రే వరిస్తుంది. కానీ, చాలా మందికి ఎన్నో ఏళ్ల కృషితోనే ఇది సాధ్యపడుతుంది. భారత్ స్టోరీ ఇలాంటిదే. బలమైన పునాది నిర్మాణానికి దశాబ్దానికి పైనే సమయం పట్టినప్పటికీ మరింత నమ్మకమైనదిగా భారత్ ఆర్థిక వ్యవస్థ అవతరించింది’’ అని ప్రశంసించింది. కొన్ని విభాగాల్లో గొప్ప ఫలితాలు మోదీ నాయకత్వంలో భారత్ కొన్ని విభాగాల్లో అద్భుతమైన పురోగతి సాధించినట్టు బెర్న్‌స్టీన్ నివేదిక తెలిపింది. డిజిటైజేషన్, ఆర్థిక వ్యవస్థను సంఘటితంగా మార్చడం, తయారీ రంగంలోకి పెట్టుబడులు ఆకర్షించేందుకు మెరుగైన విధాన వాతావరణం, మౌలిక రంగంపై వ్యయాలను పెంచడాన్ని ప్రస్తావించింది. గడిచిన దశాబ్ద కాలంలో ఆర్థిక వృద్ధి స్తబ్దుగా ఉన్నప్పటికీ, బలమైన పునాదులు పడ్డాయని, నూతన సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థ బలపడినట్టు వివరించింది. సానుకూల వృద్ధి చక్రానికి అవసరమైన పునాదులు పడినట్టు చెబుతూ, ఇక్కడి నుంచి దిగువవైపు రిస్‌్కలు చాలా పరిమితమని అభిప్రాయపడింది. 5.7 శాతం చొప్పున ‘‘భారత్ జీడీపీ 2014 నుంచి 5.7 శాతం వార్షిక కాంపౌండెడ్ వృద్ధిని చూసింది. కోవిడ్ కాలాన్ని మినహాయించి చూస్తే వృద్ధి 6.7 శాతంగా ఉంటుంది. యూపీఏ హయాంలో ఉన్న 7.6 శాతానికంటే కొంచెం తక్కువ. కాకపోతే అప్పట్లో బేస్ కనిష్టంగా ఉండడం వల్ల అంత వృద్ధి సాధ్యపడింది’’అని బెర్న్‌స్టీన్ తెలిపింది. తీవ్ర సమస్యల్లో కూరుకుపోయిన సంస్థలు, బలహీన ఆర్థిక వ్యవస్థ వారసత్వంగా మోదీ సర్కారుకు వచ్చినట్టు గుర్తు చేసింది. మోదీ హయాంలో భారత్ పదో స్థానం నుంచి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగా, తలసరి ఆదాయం విషయంలో 147వ ర్యాంకు నుంచి 127వ ర్యాంకుకు మెరుగుపడినట్టు ఈ నివేదిక తెలిపింది. వ్యాపార నిర్వహణ మరింత సులభతరంగా మారినట్టు పేర్కొంది. అంతకుముందు సర్కారు కాలంలో చేసిన తప్పులను సరిచేస్తూ, భారత్ మౌలిక సదుపాయాలపై పెద్ద ఎత్తున ఖర్చు చేయడం మంచి ఫలితాలనిచ్చినట్టు విశ్లేíÙంచింది. డిజిటైజేషన్, అందరికీ ఆర్థిక సేవల విషయంలో భారత్ మంచి పురోగతి సాధించినట్టు తెలిపింది. బ్యాంక్ ఖాతాలు కలిగిన వ్యక్తులు 2011 నాటికి 35 శాతంగా ఉంటే, 2021 నాటికి 77 శాతానికి పెరిగారని, జన్‌ధన్ ఖాతాలే 50 కోట్లుగా ఉండడాన్ని ప్రస్తావించింది. ‘‘పలు పథకాల సబ్సిడీలకు ఆధార్‌ను వినియోగించడం ద్వారా మధ్యవర్తులు, జాప్యాన్ని సర్కారు నివారించింది. యూపీఐ ఎంతో ప్రగతి సాధించింది. ఓఎన్డీసీ ఏర్పాటుకు కావాల్సిన నమ్మకాన్ని కలిగించింది’’అని నివేదిక వెల్లడించింది. వీటిల్లో మెరుగుపడాలి భారత్ కొన్ని అంశాల్లో ఇంకా పురోగతి సాధించాల్సి ఉందని బెర్న్‌స్టీన్ నివేదిక అభిప్రాయపడింది. మానవాభివృద్ధి సూచీలో 2016 నుంచి క్షీణిస్తున్నట్టు పేర్కొంది. కరోనా కాలంలో పాఠశాల సమయం తగ్గిపోవడాన్ని ప్రస్తావించింది. మహిళా అక్షరాస్యత విషయంలో పెద్దగా మార్పు లేదని, అవినీతి నిర్మూలనలో ఇంకా మెరుగుపడాల్సి ఉందని పేర్కొంది. లింగనిష్పత్తి సెకండరీ స్కూల్ స్థాయిలో క్షీణించినట్టు తెలిపింది. -
జులన్... ఐదో ర్యాంక్‌తో ముగింపు
గతవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత మహిళల జట్టు పేస్ బౌలర్ జులన్ గోస్వామి తన కెరీర్‌ను ఐదో ర్యాంక్‌తో ముగించింది. మంగళవారం విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌లో 39 ఏళ్ల జులన్ బౌలర్ల విభాగంలో 698 పాయింట్లతో తన ఐదో ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఐదో ర్యాంక్‌లో... స్మృతి మంధాన ఆరో ర్యాంక్‌లో నిలిచారు. -
డీమార్ట్ రాధాకిషన్ దమానీ హవా, సంపద ఎంత పెరిగిందో తెలిస్తే!
న్యూఢిల్లీ: పెట్టుబడిదారుడి నుండి వ్యాపారవేత్త వరకు ఎదిగిన డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ మరోసారి తన హవాను చాటుకున్నారు. ఐఎఫ్ఎల్ వెల్త్ భాగస్వామ్యంతో పరిశోధనా సంస్థ హురున్ ఇండియా విడుదల చేసిన ర్యాంకింగ్‌లో 12 మంది వ్యాపారవేత్తలు ట్రిలియనీర్లుగా అవతరించారు. ముఖ్యంగా ప్రముఖ పెట్టుబడిదారుడు అవెన్యూ సూపర్‌మార్కెట్ (డీమార్ట్) వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ సంపద ఏకంగా 280 శాతం లేదా 1,28,800 కోట్లు రూపాయలు పెరిగింది. ఇదీ చదవండి: Hurun India Rich List 2022: అదానీ రోజు సంపాదన ఎంతో తెలుసా? గత ఐదేళ్లలో డీమార్ట్ లాభాలతో దమానీ సంపద 1.75 లక్షల కోట్లకు పెరిగింది. తద్వారా హురున్ ఇండియా రిచెస్ట్ జాబితాలో ఐదో ప్లేస్‌లో నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే రెండు స్థానాలు పైకి ఎగబాగారు. దమానీ రోజువారీ సంపాదన 57 కోట్ల రూపాయలని ఈ నివేదిక తేల్చింది. అంటే గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 13 శాతం జంప్ చేసింది. ఈ జాబితాలో అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ టాప్‌లోఉండగా, రెండో ప్లేస్‌లో రిలయన్స్అధినేత ముఖేశ్ అంబానీ, మూడు, నాలుగు స్థానాల్లో సీరం అధినేత సైరస్ పూనావల్లా, శివ్ నాడార్ నిలిచారు. కిరాణామొదలు ఆహారం, దుస్తుల విక్రయంతో భారతదేశం అంతటా 200కు పైగా డీమార్ట్ స్టోర్లతో వినియోగదారులను బాగా ఆకట్టుకుంటోంది. డీమార్ట్ రిటైల్ స్టోర్ల విస్తరణ నేపథ్యంలో దమానీ సంపద వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. స్టాక్‌మార్కెట్ పెట్టుబడులతో వందల మిలియన్ల డాలర్లు సంపాదించిన దమానీ 2002లో డీమార్ట్ స్టోర్లను ప్రారంభించడం ద్వారా వ్యాపారవేత్తగా అవతరించిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్‌కు ఐదో ర్యాంక్
సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ నిర్వహించిన ఈజ్ ఆఫ్ లివింగ్ /లివబిలిటీ ఇండెక్స్–2018లో హైదరాబాద్‌కు జాతీయ స్థాయిలో 27వ స్థానంలభించింది. కేంద్రమంత్రి హరిదీప్‌సింగ్‌పురి సోమవారం విడుదల చేసిన సూచి మేరకు హైదరాబాద్ జాతీయస్థాయిలో 27వ స్థానంలో నిలవగా..40 లక్షల పైగా జనాభా కలిగిననగరాల్లో ఐదో స్థానంలో నిలిచింది. గత రెండు సంవత్సరాలుగా వివిధ ఇండెక్స్‌ల్లో.. సర్వేల్లో.. స్వచ్ఛ అంశాల్లో మెరుగైన స్థానాల్లో నిలిచిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నివాసయోగ్య నగరంగానూ పెద్దనగరాల్లో ఐదో స్థానంలో నిలిచింది. 40లక్షల పైచిలుకు జనాభా నగరాల్లో గ్రేటర్ ముంబై మొదటి స్థానంలో నిలవగా, రెండోస్థానంలో చెన్నయ్, మూడోస్థానంలో సూరత్, నాలుగో స్థానంలో అహ్మదాబాద్‌లు నిలిచాయి. మౌలిక, సామాజిక, ఆర్థిక, సంస్థాగత సూచికలను పరిగణనలోకి తీసుకొని వీటిని ప్రకటించారు. సుపరిపాలన, విద్య, ఆరోగ్యం, ప్రజల రక్షణ, భద్రత, ఆర్థిక, ఉపాధి, గృహనిర్మాణం, సంస్కృతి, బహిరంగ ఖాలీ ప్రదేశాలు, మిక్స్డ్ లాండ్ యూజ్, విద్యుత్, రవాణా, తాగునీటి సరఫరా, ఘనవ్యర్థాల నిర్వహణ, వ్యర్థజలాల నిర్వహణ, కాలుష్యం, తదితర కేటగిరీల్లో సర్వే నిర్వహించి, సమాచారం సేకరించి ఈ ర్యాంకులు ప్రకటించారు. సుపరిపాలన, సంస్థాగత సూచికల్లో హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచి తన ప్రాధాన్యతను చాటుకుంది. విద్యుత్ సరఫరాలో ఆరో స్థానంలో, బహిరంగ ఖాలీ ప్రదేశాలకు సంబంధించి 14వ స్థానంలో నిలిచింది. మిగతా అంశాల్లో 20కన్నా ఎక్కువ స్థానాల్లో ఉంది. ప్రభుత్వ మార్గదర్శనంతో.. నివాసయోగ్య నగరంగా , ప్రజల జీవనప్రమాణాలు పెరిగేందుకు ప్రభుత్వం చేపడుతున్న వివిధ చర్యలతోనే ఇది సాధ్యమైందని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు, వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎస్సార్డీపీలో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతుండటాన్ని ఈసందర్భంగా ప్రస్తావించారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు పలు చర్యలు చేపట్టామన్నారు. పెద్దనగరాల్లో హైదరాబాద్ మొదటి ఐదు స్థానాల్లో నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ చేపట్టిన బహిరంగంగా చెత్త వేసే ప్రాంతాల తొలగింపు, ఈ ఆఫీస్ నిర్వహణ, ఈజ్‌ఆఫ్‌డూయింగ్ బిజినెస్ తదితరమైనవి ఇందుకు ఉపకరించాయన్నారు. గత సంవత్సరం కేంద్ర ఆర్థిక శాఖ పట్టణ స్థానిక సంస్థలపై నిర్వహించిన సర్వేలో హైదరాబాద్‌కు మొదటిస్థానం లభించడం తెలిసిందే. జవాబుదారీతనం, పౌరసేవల్లో సాంకేతికత తదితర అంశాల్లో అప్పుడు టాప్‌గా నిలిచింది. -
మెడిసిన్.. మెరిక : స్టేట్ ఐదో ర్యాంకు
ఎంసెట్ పరీక్ష రోజే ఈ అమ్మాయికి విపరీతమైన జ్వరం.... నీరసంతో నడిచేందుకు కూడా కష్టపడుతోంది. వెంటనే కళాశాల యాజమాన్యం ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించి.. అక్కడి నుండి నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లిందా అమ్మాయి. లక్ష్య సాధనపైనే గురిపెట్టిన ఆ విద్యార్థిని జ్వరాన్ని లెక్కచేయకుండా ఎంసెట్ పరీక్ష రాసింది. బాటనీలో 35.6 మార్కులు, జువాలజీలో 35.6, ఫిజిక్స్‌లో 31.8 మార్కులు, కెమిస్ట్రీలో 40 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ఐదో ర్యాంకు సొంతం చేసుకుంది. తన మెడిసిన్ భవితకు బాటలు వేసుకుంది. ఆ అమ్మాయే కదిరికి చెందిన షేక్ జానుభీ రఫియా కుల్సుమ్. కదిరి: పట్టణంలోని వలీసాబ్‌రోడ్‌లో ఓ చిన్న వీధి. అక్కడ ఎస్జే రియాజ్ అనే మంచాల వ్యాపారి నివాసం ఉంటున్నాడు. ఈయన చదివింది పదో తరగతి వరకే. బైపాస్ రోడ్లో ఎంఎస్ లాడ్జి పక్కన మంచాలు అల్లి అక్కడే దుకాణంలో అమ్ముకుంటుంటాడు. రోజుకు సరాసరిన రూ.300 రావడం కూడా కష్టమే. ఆయన భార్య కౌసర్ గృహిణి. ఆమె 8వ తరగతి వరకు చదువుకుంది. వీరికి కూతురు రఫియా కుల్సమ్, కుమారుడు రిజ్వాన్ సంతానం. రిజ్వాన్ పట్టణంలోని వాల్మీకి పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. కూతురు రఫియా కుల్సమ్ విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ చదివింది. బుధవారం విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి(బైపీసీ)లో 5వ ర్యాంకు సాధించి జిల్లాలో టాపర్‌గా నిలిచింది. మొత్తం 160 మార్కులకు గాను 143 మార్కులు సాధించింది. ఇంటర్ లోనూ 1000కి 982 మార్కులు సాధించింది. పేదరికాన్ని లెక్క చేయక రఫియాను విజయవాడలో ఇంటర్ చదివించడం కోసం ఏడాదికి రూ. లక్ష చొప్పున రెండేళ్లకు రూ. 2 లక్షలు ఖర్చు చేసింది ఆ పేద కుటుంబం. ఇందుకోసం రియాజ్ అన్నదమ్ములందరూ తమ వంతు సహకారం అందించారు. నాన్న పడుతున్న కష్టాన్ని కళ్లారా చూసిన రఫియా కూడా చదువుల్లో ఎప్పుడూ టాపర్‌గా ఉండేది. పట్టణంలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో 7వ తరగతి చదివేసమయంలో తన ప్రతిభతో అక్కడి ఉపాధ్యాయులను ఆకట్టుకుంది. అందుకే వారు ‘‘రఫియాను బాగా చదువుతుంది..బాగా చదివించండి..ఏమైనా ఆర్థికంగా ఇబ్బందులొస్తే మమ్మల్ని సంప్రదించండి’’ అని చెప్పారు. దీంతో ఆనందపడిపోయిన రిజాజ్ ఎంత కష్టమైనా కూతురును బాగా చదివించాలని నిర్ణయించుకున్నారు. పట్టణంలోని వాల్మీకి పాఠశాలలో 8 నుండి 10వ తరగతి వరకు చదివిన రఫియా.. పదో తరగతిలో 10కి 10 పాయింట్లు సాధించింది. తల్లిదండ్రుల కష్టం నిరంతరం గుర్తు చేసుకుంటూ శ్రద్ధగా చదువుకుంది. నేడు స్టేట్ టాపర్‌గా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంటోంది. -
అందాల నగరి.. స్వచ్ఛ సొగసరి
⇒స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విశాఖకు మూడో ర్యాంకు ⇒దేశంలో 500 నగరాలతో పోటీపడి విజయం ⇒గత ఏడాది కంటే మెరుగుపడిన ర్యాంకు ⇒ఢిల్లీలో కేంద్ర అవార్డు స్వీకరించిన కమిషనర్, కలెక్టర్ విశాఖపట్నం : అందాల నగరి విశాఖ మరో అవార్డును సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా 500 నగరాలతో పోటీపడి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మూడో ర్యాంకు సాధించింది. గత ఏడాది సాధించిన ఐదో ర్యాంకును అధిగమించడం ద్వారా తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 500 నగరాల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా నగరాలకు ర్యాంకులు ప్రకటించారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత జనవరి 7 నుంచి 9వ తేదీ వరకూ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే జరిగింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక కేంద్ర బృందం ఈ సర్వే నిర్వహించింది. గత ఏడాది 75 నగరాలతో పోటీ పడి జాతీయ స్థాయిలో ఐదో ర్యాంకు సాధించిన జీవీఎంసీని ఈసారి అంతకంటే మెరుగైన ర్యాంకులో నిలపాలని కమిషనర్ హరినారాయణన్ తీవ్రంగా ప్రయత్నించారు. అన్ని విభాగాల అధికారులు, సిబ్బందిని నిరంతరం ప్రోత్సహిస్తూ కార్యోన్ముఖులను చేసి విజయం సాధించారు. గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయు డు నుంచి జీవీఎంసీ ప్రత్యేకాధికారి అయిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, కమిషనర్ హరినారాయణన్ ఈ అవార్డును అందుకున్నారు. చేపట్టిన చర్యలివి.. స్వచ్ఛ సర్వేక్షణ్ పథకంలో భాగంగా నగరంలో లక్ష జనాభాకు సరిపోయేలా 138 సామూహిక మరుగుదొడ్డు నిర్మించారు. మరో 55 సామూహిక మరుగుదొడ్లను ఆధునికీకరించారు. ఆరు రైతు బజార్లలో వర్మీ కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేశారు. మోడల్ కాలనీల్లో తడి–పొడి చెత్త విభజన, సేకరణ చేపట్టారు. బీచ్ రోడ్డు, జాతీయ రహదారి, బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో టాయిలెట్లు నిర్మించి, గోడలకు రంగులు వేశారు. వ్యాపార కూడళ్లలో చెత్త వేయడానికి డస్ట్‌బిన్స్, డంపర్‌బిన్స్ ఏర్పాటు చేశారు. ఈ లెర్నింగ్ ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సు, స్వచ్ఛత యాప్ ఉపయోగించడంలో దేశంలోనే మొదటి స్ధానంలో జీవీఎంసీ నిలిచింది. సమష్టి కృషితోనే మెరుగైన ర్యాంకు: కమిషనర్ జీవీఎంసీకి చెందిన అందరు అధికారులు, సిబ్బంది.. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికుల సమష్టి కృషితోనే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మూడవ ర్యాంకు సాధించగలిగామని జీవీఎంసీ కమిషనర్ హరినా రామణన్ అన్నారు. అవార్డు అందుకున్న అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ విజయంలో భాగస్వాములైన అందరికీ అభినందనలు తెలిపారు. నగర ప్రజల సహకారం కూడా మరువలేనిదని.. మరిన్ని విజయాలు సాధించడానికి ఈ అవార్డు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.కాగా హరినారాయణన్ ఢిల్లీ నుంచి నేరుగా న్యూయార్క్‌లో జరిగే స్మార్ట్‌సిటీల సమావేశంలో పాల్గొనేందుకు వెళుతున్నారు. పరిశీలించిన అంశాలు ర్యాంకుల ప్రకటనకు కొన్ని నిర్దిష్ట అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. వాటిపై ఆన్లైన్లో ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. అవేంటంటే.. సమాచార, విద్యా వ్యవస్థ భవనాల నిర్మాణం తాగునీటి సరఫరా స్వచ్ఛభారత్ మిషన్ మరుగుదొడ్ల నిర్మాణం సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్ -
ముంబై వెళ్లారో.. ఇక అంతే!
ఏదైనా మంచి ఉద్యోగం ఆఫర్ ఉందని ముంబై వెళ్లాలనుకుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే అక్కడ బతకడం అంటే పొగగొట్టంలో కాపురం ఉన్నట్లేనట. ప్రపంచంలో కాలుష్యం బాగా ఎక్కువగా ఉన్న నగరాల జాబితాలోంచి ఢిల్లీ తప్పుకొందని సంతోషపడుతుంటే.. ఆ జాబితాలోకి ముంబై వచ్చిచేరింది. అత్యంత కలుషిత మెగాసిటీలలో ముంబై ఐదోస్థానాన్ని ఆక్రమించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) తెలిపింది. పీఎం 10 స్థాయిని బట్టి చూస్తే ఈ విషయం తెలుస్తోంది. డబ్ల్యుహెచ్ఓ పర్యవేక్షిస్తున్న 122 భారతీయ నగరాలలో పీఎం 2.5 స్థాయిలో అయితే 39వ స్థానంలో ముంబై ఉంది. నవీ ముంబై 36వ స్థానంలోను, థానె 87వ స్థానంలోను ఉన్నాయి. మహారాష్ట్ర పీసీబీ సియాన్, బాంద్రా ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన కాలుష్య పర్యవేక్షణ కేంద్రాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారు. డబ్ల్యుహెచ్ఓ ప్రమాణాల ప్రకారం పీఎం 10 స్థాయి క్యూబిక్ మీటరుకు 20 మైక్రోగ్రాముల వరకు ఉండొచ్చు. కానీ ముంబైలో మాత్రం సగటున 117 మైక్రోగ్రాములు ఉంది. అయితే 2014 నాటి స్థాయి 136 మైక్రోగ్రాముల కంటే మాత్రం కొంతవరకు పరిస్థితి మెరుగైనట్లే చెప్పుకోవాలి. వాహనాల సంఖ్య గణనీయంగా పెరగడంతో కాలుష్యం బాగా పెరుగుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిగత వాహనాల సంఖ్యమీద పరిమితి లేకపోవడం.. ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో వాహనాల కొనుగోళ్లు పెరగడం కారణంగానే కాలుష్యం కూడా పెరుగుతోందంటున్నారు. -
దేశీయ పర్యాటకుల సందర్శనలో ఏపీకి ఐదో ర్యాంకు
న్యూఢిల్లీ: దేశీయ పర్యాటకుల సందర్శనలో ఆంధ్రప్రదేశ్ 5వ ర్యాంకులో నిలవగా, తెలంగాణకు 6వ ర్యాంకు దక్కింది. 2014లో ఆంధ్రప్రదేశ్‌ను దేశీయ పర్యాటకులు 93.3 మిలియన్లు మంది సందర్శించగా, 72.4 మిలియన్ల మంది తెలంగాణను సందర్శించారు. తమిళనాడు (327 మిలియన్లు ) ప్రధమ స్థానంలో నిలవగా, ఉత్తరప్రదేశ్ (182.8 మిలియన్లు) ద్వితీయ స్థానంలో నిలిచింది. కర్ణాటక, మహారాష్ట్రలు 3, 4 స్థానాల్లో నిలవగా విభజనతో ఏపీ, తెలంగాణ ఐదు ఆరు స్థానాల్లో నిలిచాయి. విదేశీ పర్యాటకుల సందర్శనలో టాప్ టెన్ రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణకు చోటు దక్కలేదు. విదేశీ పర్యాటకులు 4.66 మిలియన్లు మంది తమిళనాడును సందర్శించగా, మహారాష్ట్రను 4.39 మిలియన్ల మంది సందర్శించినట్టు కేంద్రా పర్యాటక మంత్రిత్వశాఖ వెల్లడించింది.