పండుగల వేళ సైబర్ మోసాలకు తెరతీస్తున్న నేరగాళ్లు
మెసేజ్‌లలోని ఫిషింగ్ లింక్‌లను తెరవొద్దంటున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: పండుగల ఆఫర్లు, గిఫ్ట్ కూపన్లు, ప్రత్యేక బహుమతుల పేరిట సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతు న్నారు. నిజమైన కంపెనీలను పోలినట్లుగా ఆన్‌లైన్ యాప్స్‌లో ప్రకటనలు గుప్పిస్తున్నారు. ‘మీకు సర్‌ఫ్రైజ్ గిప్ట్ వచ్చింది.. ఈ పండుగకు మా కంపెనీ తరఫున మీకు బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాం. మీరు ఈ కూపన్‌లోని నంబర్లను మేం చెప్పిన నంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేయండి’ అంటూ మోసపూరితమైన మెసేజ్‌లను మొబైల్ ఫోన్లు, వాట్సాప్‌లకు పంపుతున్నారు. అందులో కొన్ని ఫిషింగ్ లింక్‌లను జత చేస్తున్నారు. ఇలాంటివి నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
ఈ లాజిక్ మిస్సవ్వొద్దు..
షాపింగ్ చేయకుండానే ఉచితంగా ఏ కంపెనీ, ఏ షాపింగ్ మాల్ కూడా గిఫ్ట్ కూపన్ లేదా ఫ్రీ గిఫ్ట్ ఇవ్వదన్న విషయాన్ని మరిచిపోవద్దని చెబుతున్నారు. గతంలో ఎప్పుడో షాపింగ్ చేసిన దానికి ఇప్పుడు లక్కీ డ్రా వచ్చినా నమ్మకూడదంటున్నారు. వాట్సాప్‌లకు వచ్చే మెసేజ్‌లలోని అనుమానా స్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని.. ఒకవేళ పొరపాటున క్లిక్ చేస్తే వెంటనే ఫోన్‌లోకి మాల్‌వేర్ వైరస్ ఇన్‌స్టాల్ కావడంతోపాటు ఫోన్ సైబర్ నేరగాళ్ల అధీనంలోకి వెళ్తుందని హెచ్చరిస్తున్నారు.
ఆఫర్ల పేరిట మోసాలకు అవకాశం ఇలా..
⇒ ప్రముఖ ఈ–కామర్స్ వెబ్‌సైట్లను పోలినట్లుగా ఫేక్ వెబ్‌సైట్లు సృష్టించి మోసాలు. సోషల్ మీడియా వేదికల ద్వారా ఫేక్ ఆఫర్ మెసేజ్‌లు.
⇒ ఫ్రీ గిప్ట్‌లు, లక్కీ డ్రాలో బహుమతులు గెల్చుకున్నట్లు ఫేక్ ఫోన్ కాల్స్‌తో, ఎస్‌ఎంఎస్‌లతో మోసాలు.
⇒ ఫిషింగ్ మెయిల్స్ పంపి అందులోని లింక్‌లపై క్లిక్ చేయాలని సూచనలు.
⇒ పండుగ సీజన్‌లో ఫ్రీ గిఫ్ట్‌ల కోసం తాము పంపే ఆన్‌లైన్ గేమ్స్ ఆడి పాయింట్స్ గెలవాలంటూ నకిలీ ఆన్‌లైన్ గేమ్స్ లింక్‌లతో సందేశాలు.
Comments
Please login to add a commentAdd a comment