lucky draw
-
బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై డిస్కౌంట్
హైదరాబాద్: ప్రముఖ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెల్లరీ సంస్థ భీమా జ్యువెల్స్ ‘అద్భుతమైన ఫిబ్రవరి’ ఆఫర్ ప్రకటించింది. బంగారు, వెండి ఆభరణాల తయారీ చార్జీలపై 70% డిస్కౌంట్ అందిస్తుంది. వజ్రాభరణాలపై క్యారెట్‌కు రూ.7,000 తగ్గింపుతో పాటు ప్రతి క్యారెట్‌తో ఒక గ్రాము బంగారు నాణెం ఉచితంగా పొందవచ్చు. ప్రతి వారం నిర్వహించే ‘గ్రాండ్ వీక్లీ లక్కీ డ్రా’ ద్వారా 20 మంది కస్టమర్లు అప్రిలియా స్కూటర్ గెలుచుకోవచ్చు. స్క్రాచ్ అండ్ విన్ క్యాష్ ఆఫర్లో భాగంగా ప్రతి గ్రాముకు రూ.150 వరకు క్యాష్ బ్యాక్ గెలుచుకోవచ్చు. ఇప్పటికే మొదలైన ‘అద్భుతమైన ఆఫర్’ ఫిబ్రవరి 28 వరకు అందుబాటులో ఉంటుందని, కస్టమర్లు సది్వనియోగం చేసుకోవాలని కంపెనీ తెలిపింది. -
ఈవీఎంలు ఉంటే ఏదైనా సాధ్యమే!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి బంపర్ లక్కీ డ్రాలో గెలిచిందని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) పత్రిక సామ్నా విమర్శించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లు ఉంటే ఏదైనా సాధ్యమే నని పేర్కొంది. సామ్నా ఎడిటో రియల్‌లో ఈ మేరకు ధ్వజమెత్తింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల భారత్‌లో చాలావేగంగా ఓట్ల లెక్కింపు పూర్తయిందని, అమెరికాలో ఇది చాలా ఆలస్యమైందని పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై సామ్నా స్పందిస్తూ భారత్‌లో ఈవీఎంల పనితీరుతో సామాన్యులూ నిర్ఘాంతపోయారని పేర్కొంది. అంతేకాకుండా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని ఎలాన్ మస్క్ స్వయంగా కొన్ని నెలల కిందట చెప్పిన విషయాన్ని ప్రస్తావించింది. మొత్తం 288 సీట్లలో మహాయుతి బంపర్ లక్కీ డ్రాలో ఏకంగా 230 సీట్లను ఎలా నెగ్గగలిగింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికితే అవన్నీ ఈవీఎంల దగ్గరే ఆగిపోతున్నాయని వ్యాఖ్యానించింది. ఏకంగా 95 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య తేడాలున్నాయని పేర్కొంది. అలాగే బ్యాటరీలు పూర్తి చార్జింగ్‌తో ఉండటం ఈవీఎంలపై పలు అనుమానాలను రేకెత్తిస్తోందని తెలిపింది. -
కర్నూలులో కొనసాగుతున్న మద్యం షాపుల లాటరీ
-
ఏపీలో కాసేపట్లో మద్యం షాపుల లైసెన్సులకు లాటరీ
-
ఆన్లైన్ ఆఫర్ల పేరిట బురిడీ!
సాక్షి, హైదరాబాద్: పండుగల ఆఫర్లు, గిఫ్ట్ కూపన్లు, ప్రత్యేక బహుమతుల పేరిట సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతు న్నారు. నిజమైన కంపెనీలను పోలినట్లుగా ఆన్లైన్ యాప్స్‌లో ప్రకటనలు గుప్పిస్తున్నారు. ‘మీకు సర్ఫ్రైజ్ గిప్ట్ వచ్చింది.. ఈ పండుగకు మా కంపెనీ తరఫున మీకు బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాం. మీరు ఈ కూపన్లోని నంబర్లను మేం చెప్పిన నంబర్‌కు ఎస్ఎంఎస్ చేయండి’ అంటూ మోసపూరితమైన మెసేజ్‌లను మొబైల్ ఫోన్లు, వాట్సాప్‌లకు పంపుతున్నారు. అందులో కొన్ని ఫిషింగ్ లింక్‌లను జత చేస్తున్నారు. ఇలాంటివి నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.ఈ లాజిక్ మిస్సవ్వొద్దు..షాపింగ్ చేయకుండానే ఉచితంగా ఏ కంపెనీ, ఏ షాపింగ్ మాల్ కూడా గిఫ్ట్ కూపన్ లేదా ఫ్రీ గిఫ్ట్ ఇవ్వదన్న విషయాన్ని మరిచిపోవద్దని చెబుతున్నారు. గతంలో ఎప్పుడో షాపింగ్ చేసిన దానికి ఇప్పుడు లక్కీ డ్రా వచ్చినా నమ్మకూడదంటున్నారు. వాట్సాప్‌లకు వచ్చే మెసేజ్‌లలోని అనుమానా స్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని.. ఒకవేళ పొరపాటున క్లిక్ చేస్తే వెంటనే ఫోన్లోకి మాల్వేర్ వైరస్ ఇన్స్టాల్ కావడంతోపాటు ఫోన్ సైబర్ నేరగాళ్ల అధీనంలోకి వెళ్తుందని హెచ్చరిస్తున్నారు.ఆఫర్ల పేరిట మోసాలకు అవకాశం ఇలా..⇒ ప్రముఖ ఈ–కామర్స్ వెబ్సైట్లను పోలినట్లుగా ఫేక్ వెబ్సైట్లు సృష్టించి మోసాలు. సోషల్ మీడియా వేదికల ద్వారా ఫేక్ ఆఫర్ మెసేజ్‌లు.⇒ ఫ్రీ గిప్ట్‌లు, లక్కీ డ్రాలో బహుమతులు గెల్చుకున్నట్లు ఫేక్ ఫోన్ కాల్స్‌తో, ఎస్ఎంఎస్లతో మోసాలు. ⇒ ఫిషింగ్ మెయిల్స్ పంపి అందులోని లింక్‌లపై క్లిక్ చేయాలని సూచనలు. ⇒ పండుగ సీజన్లో ఫ్రీ గిఫ్ట్‌ల కోసం తాము పంపే ఆన్లైన్ గేమ్స్ ఆడి పాయింట్స్ గెలవాలంటూ నకిలీ ఆన్లైన్ గేమ్స్ లింక్‌లతో సందేశాలు. -
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
లక్కీ డ్రాలో బహుమతులు గెలుచుకోవచ్చంటే సామాన్యుల కాలు కదలకుండా ఉంటుందా..? మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లోక్‌సభ స్థానంలో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు ఇలాంటి ఆఫరే ఇస్తున్నారు. మూడో దశలో భాగంగా ఈ నెల 7న భోపాల్‌లో పోలింగ్ జరుగుతోంది. ఆ రోజున ఓటేసే వారి పేర్లనుంచి ప్రతి మూడు గంటలకు ఒకసారి లక్కీ డ్రా తీయనున్నారు. విజేతలకు వజ్రపు ఉంగరాలు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు తదితర కానుకలిస్తారట! ‘‘నియోజకవర్గవ్యాప్తంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉదయం 10, మధ్యాహ్నం 3, సాయంత్రం 6 గంటలకు లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులిస్తం. పోలింగ్ మర్నాడు మెగా డ్రా తీసి విజేతలకు మరింత పెద్ద బహమతులిస్తాం’’అని జిల్లా ఎన్నికల అధికారి కౌసలేంద్ర విక్రమ్ సింగ్ ప్రకటించారు. ఓటింగ్ పెంచేందుకే.. మధ్యప్రదేశ్‌లో ఇప్పటిదాకా జరిగిన రెండు దశల్లో పోలింగ్ 2019తో పోలిస్తే సగటున 8.5 శాతం తగ్గింది. 2019లో భోపాల్‌లో 65.7 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి ఎండలు విపరీతంగా ఉన్నందున ఓటర్లు పెద్దగా ఇల్లు కదలకపోవచ్చన్న ఆందోళనలున్నాయి. దీంతో ఎలాగైనా ఓటింగ్‌ను పెంచాలని ఈసీ కృత నిశ్చయంతో ఉంది. భోపాల్ నియోజకవర్గంలో 3,097 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి బూత్ వద్ద ఒక బీఎల్వో, వలంటీర్‌ను లక్కీ డ్రా కోసం నియమించారు. ఓటేశాక అక్కడి కూపన్ బుక్‌లెట్‌లో పేరు, మొబైల్ నంబర్ రాసి రసీదు తీసుకోవాలి. బహమతుల ఖర్చును కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కంపెనీలు భరిస్తున్నాయి. మెగా డ్రా కోసం డైమండ్ ఉంగరాలు, ల్యాప్‌టాప్‌లు, ఫ్రిజ్‌లు ఎనిమిది డిన్నర్ సెట్లు, రెండు మొబైల్ ఫోన్లు రెడీగా ఉన్నాయి. దీంతోపాటు ప్రతి పోలింగ్ కేంద్రంలో తొలి ఓటర్ను గౌరవించేందుకు ప్రత్యేకంగా ఏదైనా చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘బెంగళూరు గోల్డ్ షాపింగ్ ఫెస్టివల్’లో మెరిసిన జీఆర్టీ కస్టమర్లు
బెంగళూరు: అతిపెద్ద గోల్డ్ షాపింగ్ పండుగ ‘బెంగళూరు గోల్డ్ షాపింగ్ ఫెస్టివల్’లో జీఆర్టీ జ్యువెలర్స్ కస్టమర్లు మెరిశారు. పండుగ సీజన్లో ‘జ్యుయెలర్స్ ఆసోసియేషన్ బెంగళూర్’ నిర్వహించిన బంపర్ ప్రైజ్, లక్కీ డ్రా పోటీల్లో 177 మంది జీఆర్టీ జ్యువెలర్స్ కస్టమర్లు 20 గ్రాముల బంగారం నాణేల నుంచి 1 కేజీ వెండి వరకూ బహుమతులు గెలుపొందినట్లు కంపెనీ తెలిపింది. విజేతలందకీ జీఆర్టీ జ్యువెలర్స్ సంస్థ ఎండీలు జీఆర్ ఆనంద్ అనంతపద్మనాభన్, జీఆర్ రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు. -
లాటరీలో రూ.45 కోట్లు గెలుచుకున్న కేరళవాసి
తిరువనంతపురం: చాలా మంది భారతీయులు యూఏఈ వంటి అరబ్ దేశాలకు వలస వెళ్తుంటారు. అక్కడ లాటరీలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ ఎదురవుతూనే ఉన్నాయి. వందల్లో వెచ్చించి కొనుగోలు చేయగా.. కోట్ల రూపాయల లాటరీలు తగిలిన సందర్భాలు ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి అదృష్టమే కేరళకు చెందిన శ్రీజు(39) అనే వ్యక్తిని వరించింది. యూఏఈలో ఉంటున్న ఇతనికి రూ.45 కోట్ల లాటరీ తగిలింది. 'గత 11 ఏళ్లుగా యూఈఏలో పనిచేస్తున్నాను. ఆయిల్ గ్యాస్ పరిశ్రమలో కంట్రోల్ రూం ఆపరేటర్‌గా పనిచేస్తున్నాను. మంచి ఇళ్లు కొనుక్కుని , కేరళకు తిరిగిరావాలని అనుకున్నాను. కానీ లాటరీ రూపంలో నా దశ తిరిగింది. ఏకంగా రూ.45 కోట్ల లాటరీ తగలడం నమ్మశక్యంగా లేదు. అంతా అయోమయంగా ఉంది. చాలా సంతోషంగా కూడా ఉంది. నా కుటుంబ సభ్యులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.' అని శ్రీజు తెలిపారు. శ్రీజూకి మాత్రమే కాదు.. గతంలో చాలా మంది భారతీయులు యూఏఈ డ్రాల్లో పెద్ద మొత్తాల్లో డబ్బులు సాధించారు. గత శనివారం, యూఏఈలోని మరో కేరళ వ్యక్తి శరత్ శివదాసన్ ఎమిరేట్స్ డ్రా ఫాస్ట్5లో సుమారు రూ. 11 లక్షలు గెలుచుకున్నాడు. ముంబయికి చెందిన మరో వ్యక్తి మనోజ్ భావ్సర్ కూడా రూ.16 లక్షల లాటరీ గెలుచుకున్నాడు. ఇదీ చదవండి: కాంగ్రెస్ Vs బీజేపీ: చిన్న పార్టీలతోనే పెద్ద చిక్కు! -
‘జీఎస్టీ లక్కీ డ్రా’ షురూ.. రెడీగా రూ. 30 కోట్లు!
GST reward scheme: జీఎస్టీ లక్కీ డ్రా 'మేరా బిల్ మేరా అధికార్'(Mera Bill Mera Adhikar) పథకం ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో శుక్రవారం (సెప్టెంబర్ 1) ప్రారంభమైంది. కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రివార్డ్ స్కీమ్ కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 30 కోట్ల కార్పస్‌ను కేటాయించాయి. ‘మేరా బిల్ మేరా అధికార్’ మొబైల్ యాప్‌ను ఇప్పటివరకు 50,000 మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారని హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా తెలిపారు. రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ 'మేరా బిల్ మేరా అధికార్' జీఎస్టీ లక్కీ డ్రాను ఆరు రాష్ట్రాల్లో పైలట్ ప్రాతిపదికన ప్రారంభిస్తున్నామని, ప్రైజ్ మనీని కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా సమానంగా జమచేస్తాయని తెలిపారు. ఇదీ చదవండి: High Profit Farming Business: ఈ గడ్డి సాగుతో రూ. లక్షల రాబడి.. పెట్టుబడీ తక్కువే! అస్సాం, గుజరాత్, హర్యానా రాష్ట్రాలు, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, డామన్ & డయ్యూ కేంద్ర పాలిత ప్రాంతాల్లో సెప్టెంబర్ 1న ప్రయోగాత్మకంగా మేరా బిల్ మేరా అధికార్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతి నెలా 810 లక్కీ డ్రాలు ఉంటాయి. అలాగే ప్రతి త్రైమాసికంలో రెండు బంపర్ లక్కీ డ్రాలు నిర్వహిస్తారు. నెలవారీ డ్రాలలో ఒక్కో విజేతకు రూ.10,000 చొప్పున 800 మందికి అందిస్తారు. రూ. 10 లక్షల బహుమతితో 10 డ్రాలు ఉంటాయి. ఇక ప్రతి త్రైమాసికంలో రెండు బంపర్ డ్రాలలో ఒక్కో విజేతకు రూ.1 కోటి ఉంటుంది. -
TSRTC: రాఖీ స్పెషల్.. మహిళా ప్రయాణికులకు బంపరాఫర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో యువతులు, మహిళలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) గుడ్‌న్యూస్ చెప్పింది. రాఖీ పౌర్ణమికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు బంపరాఫర్ ప్రకటించింది. ఆడపడుచుల కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించాలని పేర్కొంది. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన మహిళలకు ఆకర్షణీయమైన రూ.5.50 లక్షల విలువగల బహుమతులు అందించి.. వారి పట్ల సంస్థకున్న గౌరవభావాన్ని ప్రకటించనుంది. ప్రతి రీజియన్ పరిధిలో ముగ్గురికి చొప్పున మొత్తం 33 మందికి బహుమతులను ఇవ్వనుంది. ప్రతీ రిజయన్‌లో లక్కీ డ్రా.. వివరాల ప్రకారం.. ఈ నెల 30, 31 తేదిల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్‌ను రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌లలో వేయాలి. ఆ డ్రాప్ బాక్స్‌లను ఒక చోటికి చేర్చి.. ప్రతీ రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి ముగ్గురి చొప్పున విజేతలను అధికారులు ఎంపికచేస్తారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులను అందజేస్తారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్వట్టర్ వేదికగా..‘మహిళలకు రాఖీ పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైంది. అత్యంత పవిత్రంగా ఈ పండుగను వారు జరుపుకుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి మరీ తమ సోదరులకు వారు రాఖీలు కడుతుంటారు. సోదరసోదరీమణుల ఆత్మీయత, అనురాగాలతో కూడిన ఈ పండుగ నాడు.. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు లక్కీ డ్రా నిర్వహించాలని సంస్థ నిర్ణయించింది. ఈ నెల 30, 31 తేదిల్లో సంస్థ బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. టికెట్ వెనకాల పేరు, ఫోన్ నంబర్ రాసి డ్రాప్ బాక్స్ లలో వాటిని వేయాలి. ప్రతి బస్టాండ్, ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో డ్రాప్ బాక్స్ లను సంస్థ ఏర్పాటు చేసింది. మహిళా ప్రయాణికులందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొని విలువైన బహుమతులను గెలుచుకోవాలని సంస్థ కోరుతోంది. సెప్టెంబర్ 9లోగా లక్కీ డ్రాలు నిర్వహించి.. విజేతలకు బహుమతులను అందజేయడం జరుగుతుంది’ అని తెలిపారు. రాఖీ పౌర్ణమికి తమ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు #TSRTC శుభవార్త చెప్పింది. ఆడపడుచుల కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన మహిళలకు ఆకర్షణీయమైన రూ.5.50 లక్షల విలువగల బహుమతులు అందించి.. వారి పట్ల సంస్థకున్న గౌరవభావాన్ని… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) August 29, 2023 ఈ రాఖీ పౌర్ణమి లక్కీ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని వారు సూచించారు. ఇది కూడా చదవండి: అందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారు: ఎమ్మెల్యే సీతక్క -
బిల్ తీసుకుంటే చాలు..కోటి రూపాయలు మీవే!
Mera Bill Mera Adhikar: అన్ని కొనుగోళ్లకు ఇన్వాయిస్లు, బిల్లులు అడిగే సంస్కృతిని ప్రోత్సహించేలాకేంద్రం కొత్త పథకాన్ని తీసు కొస్తోంది రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రభుత్వం 'మేరా బిల్ మేరా అధికార్' పేరుతో 'ఇన్వాయిస్ప్రోత్సాహక పథకాన్ని' ప్రారంభిస్తోంది. ఇందుకోసం వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రతి త్రైమాసికంలో లక్కీడ్రా నిర్వహించి, రూ.1 కోటి చొప్పున రెండు బంపర్ బహుమతులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వినియోగదారులు తాము జరిపే కొనుగోళ్లన్నింటికీ విక్రయదార్ల నుంచి రశీదును అడగడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో 'మేరా బిల్ మేరా అధికార్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. సెప్టెంబరు 1 నుంచి 12 నెలల కాలానికి ప్రయోగాత్మక పద్ధతిలో (పైలట్ ప్రాజెక్ట్) ఈ స్కీం షురూ కానుంది. ఆర్థిక శాఖ అందించిన వివరాల ప్రకారం ప్రతీ నెలా లక్కీ డ్రాలో 800 జీఎస్టీ రశీదులను ఎంపిక చేస్తారు. వీరికి రూ.10,000 చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వనుంది. లక్కీడ్రాలో ఎంపిక చేసిన మరో 10 రశీదులకు రూ.10 లక్షల చొప్పున బహుమతి అందిస్తుంది. అయితే ప్రతి మూడు నెలలకు ఒకసారి బంపర్ డ్రా ఉంటుంది. ఇందుకోసం గత మూడు నెలల నుంచి బంపర్ డ్రా నెలలో 5వ తేదీ వరకు అప్లోడ్ చేసిన రశీదుల నుంచి విజేతను ఎంపిక చేస్తారు. ఈ పథకం ప్రారంభంలో అసోం గుజరాత్ , హరియాణా, పుదుచ్చేరి, దాద్రా అండ్ నగర్ హవేలీ మరియు డామన్ & డయ్యూ కేంద్రపాలిత ప్రాంతాలలో పైలట్‌గా లాంచ్ కానుంది. డ్రా అర్హతలు, నిబంధనలు ♦ జీఎస్టీ రిజిస్టర్డ్ సప్లయ్దారులనుంచి వినియోగదార్లు తీసుకున్న రశీదులను మాత్రమే డ్రాకు పరిగణనలోకి తీసుకుంటారు. ♦ జీఎస్టీ గుర్తింపు సంఖ్య, రిసీట్ నెం, డేట్, విలువ, ప్రాంతం తదితర వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. ♦ డ్రాలో విజేతగా ఎంపికైన కస్టమర్లు, ఈ సమాచారం అందిన తేదీ నుంచి 30 రోజుల్లోగా యాప్ లేదా వెబ్‌పోర్టల్‌లో పాన్, ఆధార్, బ్యాంకు అకౌంట్ లాంటి వివరాలివ్వాలి. ♦ ఒక నెలలో గరిష్ఠంగా ఒక వ్యక్తి 25 రశీదులను అప్లోడ్ చేయవచ్చు ♦ లక్కీ డ్రాకు అర్హత పొందాలంటే రశీదు విలువ కనీసం రూ.200 ♦ బీ2సీ రశీదులన్నింటినీ నెల 5వ తేదీ(అంతుకుముందు నెలలోని బిల్లులను)లోపు అప్లోడ్ చేస్తేనే నెలవారీ డ్రాకి అర్హత ♦వీటిని 'మేరా బిల్ మేరా అధికార్' మొబైల్ అప్లికేషన్లోను, 'వెబ్ డాట్ మేరాబిల్డాట్జీఎస్టీ డాట్ జీవోవీడాట్ఇన్ అనే వెబ్‌పోర్టల్‌లోనూ అప్లోడ్ చేయాలి. -
తెలంగాణలో మొదలైన మద్యం దుకాణాల లక్కీ డ్రా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల లక్కీ డ్రా ప్రక్రియ అంబర్పేట్ రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో మొదలైంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ లక్కీ డ్రా కార్యక్రమం కొనసాగుతోంది. లక్కీ డ్రా జరుగుతున్న సెంటర్లో మద్యం వ్యాపారులు భారీ సంఖ్యలో పోటెత్తారు. పాసులు జారీ చేసిన వారికి మాత్రమే లోపలికి అనుమతించనున్నారు అధికారులు. గత కొన్ని రోజులుగా జరిగిన మద్యం షాపు దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో లక్కీ డ్రా ఆధారంగా వారికీ షాపులు కేటాయించనుంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 2620 మద్యం దుకాణాలకు కొనసాగుతున్న లక్కీ డ్రా అంబర్పేట్ రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో జరుగుతోంది. ఇక ఈ లక్కీ డ్రా నిర్వహిస్తున్న ప్రాంతాల్లో భారీగా వాహనాల ప్రవాహం ఉంటుందని ముందే అనుమానించిన ట్రాఫిక్ శాఖ ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. లక్కీ డ్రా సమయంలో ఎటువంటి ఉద్రిక్తత చోటు చేసుకోకుండా భారీగా అభండారట ఏర్పాటు చేశారు. ఈ ప్రాంగణంలోకి దరఖాస్తుదారుని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు అధికారులు. ఇది కూడా చదవండి: తెలంగాణలో ఇతర ఆసరా పింఛన్లూ పెంపు? -
జీఎస్టీ బిల్లు ఉంటే చాలు.. రూ.కోటి వరకూ నగదు బహుమతులు
GST reward scheme: చాలా కాలంగా ఎదురుచూస్తున్న 'మేరా బిల్ మేరా అధికార్' పథకాన్ని కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది. దీని ద్వారా ఏదైనా కొనుగోలుకు సంబంధించిన జీఎస్టీ ఇన్‌వాయిస్‌ని మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేసి రివార్డ్ పొందవచ్చు. ఇన్వాయిస్ ప్రోత్సాహక పథకం కింద రిటైలర్ లేదా హోల్‌సేల్ వ్యాపారి నుంచి తీసుకున్న ఇన్వాయిస్ను యాప్‌లో అప్లోడ్ చేసినవారికి నెలవారీగా, త్రైమాసికంవారీగా లక్కీ డ్రా తీసి రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటి వరకూ నగదు బహుమతులు ఇవ్వనున్నట్లుగా సంబంధిత అధికారులు పీటీఐ వార్తా సంస్థతో పేర్కన్నారు. 'మేరా బిల్ మేరా అధికార్' మొబైల్ యాప్ ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ యాప్‌లో అప్లోడ్ చేసే ఇన్వాయిస్లో విక్రేతకు సంబంధించిన జీఎస్టీఐఎన్, ఇన్వాయిస్ నంబర్, చెల్లించిన మొత్తం, పన్ను మొత్తం వివరాలు ఉండాలి. ఒక వ్యక్తి ఒక నెలలో గరిష్టంగా 25 ఇన్వాయిస్లను యాప్‌లో అప్లోడ్ చేయవచ్చు. అయితే ఈ ఇన్వాయిస్ కనీసం రూ. 200 కొనుగోలు విలువను కలిగి ఉండాలి. ప్రతి నెలా లక్కీ డ్రాలు కంప్యూటరైజ్డ్ లక్కీ డ్రాల ద్వారా విజేతలను నిర్ణయిస్తారు. ప్రతి నెలా 500కు పైగా లక్కీ డ్రాలు నిర్వహిస్తారు. ప్రైజ్ మనీ రూ.లక్షల్లో ఉంటుంది. అలాగే త్రైమాసానికి రెండు చొప్పున లక్కీ డ్రాలు తీస్తారు. ఇక్కడ రూ. 1 కోటి వరకూ నగదు బహుమతి ఉంటుంది. ఈ పథకం తుది దశకు చేరుకుందని, ఈ నెలలోనే దీన్ని ప్రారంభించవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. జీఎస్టీ ఎగవేతను అరికట్టడానికి , వార్షిక టర్నోవర్ రూ. 5 కోట్లకు మించిన సంస్థలకు ప్రభుత్వం ఇప్పటికే ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్‌ని తప్పనిసరి చేసింది. 'మేరా బిల్ మేరా అధికార్' స్కీమ్ బీ2సీ కస్టమర్ల విషయంలో కూడా ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ అంగీకరిస్తుంది. తద్వారా కొనుగోలుదారు లక్కీ డ్రాలో పాల్గొనేందుకు అర్హత పొందవచ్చు. ఇదీ చదవండి: Revised I-T rules: ఉద్యోగులకు గుడ్‌న్యూస్: ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనల్లో మార్పులు.. భారీగా పన్ను ఆదా! -
బంపర్ ఆఫర్! ఏడాది వేతనంతో కూడిన సెలవు! ఎక్కడ?
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సమయంలో వర్క్‌ఫ్రం హోం విధానానికి అలవాటు పడిన ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు వెళ్లాలంటే అయ్యో... అని నిట్టూరిస్తున్న పరిస్థితి. అలాంటిది ఒక ఉద్యోగికి 365 రోజులు పెయిడ్ లీవ్ ఇస్తే.. వావ్.. అది కదా బంపర్ఆఫర్ అంటే. చైనాలోని ఒక ఉద్యోగి ఇలాంటి జాక్‌పాట్ తగిలింది. ఏకంగా ఏడాది పాటు వేతనంతో కూడిన లీవ్ లభించింది. ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే, ఎలాంటి విధులు నిర్వహించకుండానే అతనికి నెలనెలా జీతం పొందే అవకాశం లభించింది. నమ్మలేకపోతున్నారా? ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న ఈ స్టోరీ చదవాల్సిందే. (రాధిక మర్చంట్, ఫ్రెండ్ ఒర్రీ: ఈ టీషర్ట్, షార్ట్ విలువ తెలిస్తే షాకవుతారు) స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించిన ప్రకారం చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రం షెన్జెన్ పట్టణంలోని పేరు వెల్లడించని కంపెనీ తమ ఉద్యోగి ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది. కరోనా కారణంగా మూడేళ్ల తర్వాత ఇటీవల వార్షిక విందును ఏర్పాటు చేసింది. సంస్థలో పనిచేసే ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం కల్పించాలని భావించింది. వారిలో నైతిక స్థైర్యాన్ని పెంపొందించే ఆనోచన తోవిందులో లక్కీ డ్రాను నిర్వహించింది. ఈ డ్రా గెలుచుకున్న వారికి అధిక వేతనం, ఇతర బహుమతులతో పాటు ఏడాది పాటు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించింది. (సల్మాన్ ఖాన్ మూవీ బూస్ట్: ఏకంగా 21 వేల కోట్లకు ఎగబాకిన బిజినెస్‌మేన్) పెనాల్టీ కార్డులు కూడా ఈ డ్రాలో జోడించింది. అంటే పార్టీలో వెయిటర్‌గా వ్యవహరించడం లేదా ఇంట్లో తయారు చేసిన ప్రత్యేకమై ఒక రకంగా భయంకరమైన పానీయం తాగడం లాంటివి కూడా ఉన్నాయి. అయితే వీటన్నింటిని తోసి రాజని మేనేజర్ స్థాయి ఉద్యోగి ఒకరు 365 రోజుల సెలవుతో కూడిన బంపర్‌ప్రైజ్ గెల్చుకోవడంతో ఎగిరి గంతేశాడు. అతడు దీనికి సంబంధించిన చెక్ పట్టుకుని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. (ఇదీ చదవండి: అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) 男子在公司年会抽到“365天带薪休假”奖项 pic.twitter.com/aOaSxgBAtO — The Scarlet Flower (@niaoniaoqingya2) April 12, 2023 మరోవైపు కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగి చెన్ మాట్లాడుతూ ఈ సెలవును నగదుగా మార్చుకోవాలనుకుంటున్నారా లేదా ఆనందించాలనుకుంటున్నారా అనేది నిర్ణయించడానికి విజేతతో కంపెనీ చర్చలు జరుపుతుందని పేర్కొన్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
భీమ జ్యువెల్స్ మెగా బంపర్ డ్రా: గిప్ట్గా సిట్రోయెన్ కార్లు
హైదరాబాద్: భీమ జ్యువెల్స్ 98వ వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహించిన బంపర్ లక్కీ డ్రా విజేతలకు బహుమతులు అందజేసింది. సోమాజీగూడకు చెందిన రామ సుబ్బమ్మ, విపుల్ సిట్రోయెన్ కార్లను గెలుచుకున్నారు. భీమ సూపర్ సర్ప్రైజ్లో భాగంగా కస్టమర్లకు బంగారం, వెండి, వజ్రాల కొనుగోలుపై భారీ తగ్గింపు ఇచ్చింది. బంగారం, వెండి నాణేలతో పాటు ఇతర బహుమతులు కూడా అందజేసింది. ప్రతి దుకాణానికి సిట్రోయెన్ కారు ఇచ్చింది. ఈవెంట్లో లక్కీ విజేతలను ప్రకటించడం మరపురాని అనుభవమని కంపెనీ రీజినల్ బిజినెస్ హెడ్ రఘురామ్ రావు తెలిపారు. వ్యాపారవేత్త షేక్ అబ్దుల్ వాజీద్, బిల్డర్ కనకరాజు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. భీమ జ్యువెల్స్ ఈ ఏడాది అక్టోబర్ 14 నుంచి నవంబర్ 13 వరకు నెలరోజుల పాటు ఘనంగా వార్షికోత్సవాలను నిర్వహించింది. -
‘పై’ ఎలక్ట్రానిక్స్ లక్కీడ్రాలో బహుమతుల బొనాంజా
గత ఏడాది డిసెంబర్ 5న ప్రముఖ రిటైల్ దిగ్గజం పై ఇంటర్నేషన్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(Pai International Electronics Ltd) నిర్వహించిన మెగా ఫెస్టివల్ సేల్ లక్కీ డ్రాలో హైదరాబాద్‌కు చెందిన బాబీ అనే వ్యక్తి మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఏ కారును గెలుచుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను పై సంస్థ యూట్యూబ్‌లో ప్రసారం చేసింది. 2021 గాను దసరా, దీపావళి నేపథ్యంలో రూ. 2 వేలు కంటే ఎక్కువ విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేసే వారికి డిజిటల్ కూపన్లను పై ఇంటర్నేషనల్ అందించింది. ఈ సేల్‌లో బాబీ రూ. 8000 విలువైన సేల్ ఫోన్‌ను కొనుగోలు చేసి కారును గెల్చుకున్నాడు. కస్టమర్ల కోసం ప్రతియేడాది నాలుగు సార్లు, ప్రతి పండుగ సీజన్లో లక్కీ విజేతలకు నగదు బహుమతులను అందిస్తోంది. గత 20 సంవత్సరాలలో,..320 కార్లు, 320 బైక్‌లు, రూ. 22.5 కోట్ల విలువైన ఉచిత షాపింగ్, రూ. 7.3 కోట్ల గోల్డ్ రివార్డ్, రూ. 2.65 కోట్ల విలువైన నగదు బహుమతులు, అలాగే 64.56 కోట్ల విలువైన పై లాయల్టీ పాయింట్లను అందించింది. Pai International Electronics Ltd రిటైల్ సంస్థ మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫర్నీచర్ కోసం ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌గా నిలుస్తోంది. కస్టమర్ల కోసం అనేక రకాల సేల్స్‌ను అందుబాటులోకి తెస్తోంది. అంతేకాకుండా కస్టమర్లకు అదనంగా లక్కీడ్రాలు, బహుమతులను ఉచితంగా అందిస్తోంది. పండుగ సీజన్ నేపథ్యంలో కస్టమర్లు విలువైన బహుమతులను ప్రకటించింది. వాటితో పాటుగా కస్టమర్లు 15 కోట్ల వరకు పైగా లాయల్టీ పాయింట్లను గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. హ్యుందాయ్ ఆరా వంటి కార్లు, అలాగే ఎల్ఈడీ స్మార్ట్ టీవీలను గెలుచుకునే అవకాశం కూడా ఉంది. కస్టమర్లకు అదనంగా గిఫ్ట్‌కార్డులను, రివార్డులను కూడా ప్రకటిస్తుంది. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో పై ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ విస్తరించి ఉంది. ఇది సుమారు 87 లార్జ్ స్కేల్ మల్టీ బ్రాండ్ అవుట్లెట్లతో పాటుగా దాదాపు 121 మొబైల్ ఫోన్ అవుట్లెట్లతో, 15 ఫర్నిచర్ షాపులను కలిగి ఉంది. కోవిడ్-19 నేపథ్యంలో ఆన్లైన్ పోర్టల్ ద్వారా కస్టమర్లకు షాపింగ్ అనుభవాన్ని అందిస్తోంది. పై ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక సేవలను కూడా చేస్తోంది పై ఇంటర్నేషనల్. పర్యావరణ పరిరక్షణ నుంచి నిరుపేద వృద్ధులకు, విద్యార్థులకు తన వంతు సహాకారాన్ని అందిస్తోంది. (అడ్వటోరియల్) -
సబ్బు కొంటే.. స్కూటీ ఉచితం.. ఆశకు పోతే ‘ఖర్చు’ అయిపోతారు జాగ్రత్త!
సాక్షి,చిత్తూరు అర్బన్: పది రూపాయలకు ఏమొస్తుందని అడిగితే టీ కూడా రాదంటారు. కానీ రూ.10 ఇస్తే మూడు ఎక్స్ఎల్ సబ్బులతోపాటు స్కూటీ, బంగారు గొలుసు కూడా వస్తుందని మభ్యపెట్టి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. డబ్బులు పోగొట్టుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. చిత్తూరు టూటౌన్ పోలీసులు గురువారం ఈ తరహా ఘటనలపై రెండు కేసులు నమోదుచేశారు. ఎస్ఐ మల్లికార్జున కథనం మేరకు.. గతనెల 21న చిత్తూరు నగరంలోని పెద్ద దళితవాడకులో టైలరింగ్ చేస్తూ జీవనం సాగించే నవీన ఇంటి వద్దకు ఇద్దరు వ్యక్తులు వెళ్లారు. రూ.10 ఇస్తే బట్టలు ఉతికే మూడు సబ్బులు ఇస్తామని, ఓ సబ్బులో లక్కీ కాయిన్ ఉంటుందని.. దీనికి బహుమతి ఇస్తామని చెప్పారు. నవీన రూ.10తో మూడు సబ్బులు కొంటే అందులో ఓ లక్కీ కాయిన్ వచ్చింది. రూ.5500 వేలు విలువచేసే కుక్కర్, కడాయి, హాట్‌బాక్స్, వెజిటేబుల్ కట్టర్, కడాయిను రూ.3700కు ఇస్తామని చెప్పడంతో అంతమొత్తం చెల్లించి నవీన ఆ వస్తువులను తీసుకుంది. ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్న వ్యక్తులు వెళ్లిపోయారు. తక్కువ ధరకే విలువైన వస్తువులు రావడంతో యువతి తెగ ఆనందపడిపోయింది. మూడు రోజుల తరువాత ఓ వ్యక్తి ఫోన్ చేసి తాము సబ్బులు విక్రయించినవారిమేనని చెప్పి, మళ్లీ లక్కీడిప్ తీస్తే రూ.లక్ష విలువ చేసే స్కూటీ, ఓ బంగారు గొలుసు వచ్చిందన్నాడు. దీనికిగానూ రూ.27,700 చెల్లించాలని చెప్పడంతో నిందితులు చెప్పిన బ్యాంకు ఖాతాలో ఆ మొత్తం నవీన జమచేసింది. తరువాత నిందితులు సెల్ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేశారు. ఇదేతరహాలో గతనెల 22న లెనిన్ నగర్‌కు చెందిన దిలీప్‌ను మోసం చేసి రూ.18,650 బ్యాంకు ఖాతాలో వేయించుకున్నారు. దీనిపై ఎవరికైనా చెబితే పురువుపోతుందని బాధితులు మొదట్లో భావించినా, తనలా ఎవరూ మోసపోకూడదని పోలీసులను ఆశ్రయించారు. రెండు ఘటనలపై కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బంపర్ ఆఫర్....వ్యాక్సిన్ తీసుకో..బహుమతి పట్టు
చంద్రపూర్: కరోనా వ్యాక్సిన్లు ప్రజలందరూ తీసుకునేలా ప్రోత్సహించే నిమిత్తం మహారాష్ట్రలోని చంద్రపూర్ మునిసిపల్ కార్పొరేషన్ టీకా బంపర్ లక్కీ డ్రాను ప్రకటించింది. పైగా ఈ లక్కీ డ్రాలో ఎల్ఈడీలు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు నుండి వాషింగ్ మెషీన్ల వరకు మంచి ఆకర్షణీయమైన బహుమతులను గెలుచుకోవచ్చు అని తెలిపింది. అంతేకాదు నవంబర్ 12 నుంచి 24 వరకు సమీపంలోని వ్యాక్సిన్ సెంటర్ల వద్ద వ్యాక్సిన్లు తీసుకున్నవాళ్లకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని చంద్రపూర్ మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది. (చదవండి: విమానాలకు రన్‌వేగా..) ఈ మేరకు మేయర్ రాఖీ సంజయ్ కంచర్లవార్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో పౌరులకు ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించడంతోనే ఈ లక్కీ డ్రా ప్రకటించినట్లు స్పష్టం చేసింది. ఈ క్రమంలో పౌర కమీషనర్ రాజేష్ మోహితే కూడా ఇతర అధికారులను, ప్రజలను తమ సమీపంలోని సివిక్-రన్ ఇనాక్యులేషన్ సెంటర్‌కు వెళ్లి వ్యాక్సిన్లు వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఇప్పటివరకు నగరంలో అర్హులైన వ్యక్తుల సంఖ్యతో పోలిస్తే వ్యాక్సిన్లు తీసుకున్నవారి సంఖ్య ఇంకా తక్కువగానే ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పైగా పౌరసరఫరాల శాఖ ఆరోగ్య విభాగం సుమారు 21 కేంద్రాల్లో టీకాలు వేసే సౌకర్యాలను ఏర్పాటు చేసిందన్నారు. క్రయ విక్రయలు చేసేవాళ్లు, ఉద్యోగస్తులు, అధికారులు, ప్రజలతో నిత్యం సంప్రదింపులు చేసే వాళ్లు, తదితరులు కనీసం ఒక్కడోస్ అయిన తీసుకుంటేనే నగరంలోని మార్కెట్లోకి అనుమతిస్తామని లేకుంటే అనుమతించేదే లేదని మోహితే చెప్పారు. అంతేకాక ప్రభుత్వ ఆదేశాల మేరకు నూరుశాతం వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని సాధించే దిశగా తాము ఈ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. (చదవండి: సూప్ నచ్చకపోతే మరీ అలా చేస్తావా!) -
లక్కీ డ్రా.. రాత్రికి రాత్రే రూ.7.45 కోట్లు జాక్‌పాట్
దుబాయ్: లక్కీడ్రాలు కొంతమందికి కలిసివస్తాయి. ఒక లాటరీ టికెట్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరులనైన వార్తలను మనం ఇప్పటికే చాలా చూసి ఉంటాం. తాజాగా భారత్‌కు చెందిన ప్రైవేట్ నౌకలో ఉద్యోగిగా పనిచేస్తున్న గణేష్ షిండేకు కూడా ఇలాంటి అదృష్టమే వరిచింది. వివరాలు.. మహారాష్ట్రలోని థానేకు చెందిన 36 ఏళ్ల గణేశ్ బ్రెజిల్‌కు చెందిన ఒక ప్రైవేటు నౌకసంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగంలో భాగంగా అతడు దుబాయ్, రియో డీ జనెయిరోల మధ్య రాకపోకలు సాగించేవాడు. అయితే గత రెండు సంవత్సరాలుగా గణేష్ దుబాయ్ లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నాడు. కాగా గత జూన్ 16న దుబాయ్‌లో మిలీనియం మిలియనీర్ అండ్ ఫైనస్ట్ సర్ప్రైజ్ నుంచి ఒక లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశాడు. తాజాగా గురువారం లాటరీ టికెట్లను విడుదల చేయగా గణేష్‌కు జాక్‌పాట్ తగిలింది. 1 మిలియన్ యునైటెడ్ స్టేట్స డాలర్స్( ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.7.45 కోట్లు) దక్కించుకున్నాడు. ఇదే విషయమై గణేష్ స్పందించాడు.'' నాకు లాటరీ తగలిందనే విషయాన్ని ఇప్పటికి నమ్మలేకపోతున్నా. లాటరీలో వచ్చిన డబ్బుతో కొత్త కారు, కొత్త ప్లాటు కొంటాను. పిల్లల చదువు కోసం కొంత డబ్బులు దాచుకుంటాను.ఇది చాలా గొప్ప అవకాశం. దుబాయ్ డ్యూటీ ఫ్రీకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను దుబాయ్ నగరాన్ని ప్రేమిస్తున్నాను. త్వరలోనే దుబాయ్‌ను సందర్శించాలని అనుకుంటున్నాను. ఇంకా చాలా కోరికలున్నాయి.'' అంటూ చెప్పుకొచ్చాడు. -
కారు డ్రైవర్‌కు రూ.40 కోట్ల జాక్‌పాట్; కానీ ట్విస్ట్ ఏంటంటే
అబుదాబి: 37 ఏళ్ల రెంజిత్ సోమరాజన్ 2008లో కేరళ నుంచి అబుదాబికి వెళ్లి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 12 ఏళ్లలో ఎప్పుడు కలిసిరాని అదృష్టం ఒక్కరాత్రిలోనే వరించింది. లక్కీడ్రాలో ఏకంగా 20 మిలియన్ దిర్హామ్( భారత కరెన్సీలో దాదాపు రూ. 40 కోట్లు) దక్కించుకున్నాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ 40 కోట్ల రూపాయలను రెంజిత్‌తో పాటు మరో తొమ్మిదిమంది పంచుకోవాల్సి ఉంది. ఎందుకంటే రెంజిత్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన మరో తొమ్మిది మంది కూడా లక్కీడ్రాలో డబ్బును గెలుచుకున్నారు. ఈ విషయాన్ని ఖలీజ్‌టైమ్స్ పత్రిక శనివారం వెల్లడించింది.ఇక తన వాటా కింద సోమరాజన్‌కు ఎంతలేదన్న దాదాపు 4 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన చూసుకుంటే మూడేళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్న సోమరాజన్‌కు పంట పండినట్లే. ఇదే విషయమై రెంజిత్ సోమరాజన్ స్పందిస్తూ.. '' నాకు ఇంత జాక్‌పాట్ తగులుతుందని ఊహించలేదు. 2008లో ఇండియా నుంచి దుబాయ్‌కు వచ్చాను. అప్పటినుంచి బతుకుదెరువు కోసం డ్రైవర్‌గా మారాను. గతేడాది ఒక కంపెనీ డ్రైవర్ కమ్ సేల్స్‌మన్‌గా పనిచేశాను. ఆ సమయంలో నేను సరైన సేల్స్ చేయని కారణంగా నా జీతంలో కోత విధించేవారు. అది నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. అప్పటినుంచి లాటరీ టికెట్లు కొనుగోలు చేయడం ప్రారంభించాను. అలా పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందని మిగతా వ్యక్తులతో కలిసి ''రెండు కొంటే ఒక లాటరీ టికెట్ ఉచితం'' ఆఫర్‌ను కనుక్కున్నా. ఆ తొమ్మిది మంది నుంచి 100 దిర్హామ్‌లు వసూలు చేసి జూన్ 29న టికెట్‌ను కొనుగోలు చేశాను. నా ఒక్కడి పేరుతో తీస్తే అదృష్టం లేదని.. అందుకే మరో తొమ్మిది మందిని జత చేశాను. ఇవాళ నా పంట పండింది. నా వాటా తీసుకొని మిగతాది మావాళ్లకు ఇచ్చేస్తాను. ఎందుకంటే వారు నాపై నమ్మకం ఉంచి లాటరీ టికెట్‌కు డబ్బులు అందించారు''. అని చెప్పుకొచ్చాడు. -
నిజామాబాద్‌లో భారీ మోసం.. రూ. 5 కోట్ల టోకరా
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్‌లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. లక్కీ డ్రా పేరుతో 5 కోట్ల రూపాయలు సేకరించి ఉడాయించారు నిర్వాహకులు. దీంతో బాధితులు పోలీసులకు ఆశ్రయించారు. వివరాలు... లక్కీ డ్రా పేరుతో 3 వేల మందిలో ఒక్కొక్కరి వద్ద నుంచి నిర్వాహకులు రూ. వెయ్యి రూపాయల చొప్పున 16 నెలలు వసూలు చేశారు. డ్రా గెలుపొందిన వారికి డబుల్ బెడ్రూం ఇల్లు, భూములు, గృహవసరాల వస్తువులు, వాహనాలు, బంగారం ఇస్తామని నమ్మబలికారు. ఈ క్రమంలో లక్కీ డ్రా లో వచ్చిన వస్తువులు ఇవ్వాలని మొదటి గ్రూప్ సభ్యుల నుంచి ఒత్తిడి రావడంతో బోర్డు తిప్పేశారు. మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. కాగా జిల్లా కేంద్రంలోనే 30 వరకు లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఈ మోసం వెనుక కొంతమంది ‘‘పెద్ద మనుషులు’’ ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
అమెజాన్ డైలీ క్విజ్; అదృష్టం హాయ్ చెబితే..
అమెజాన్‌లోకి వెళితే... విక్రమార్కుడి భుజం మీద వేలాడుతున్న బేతాళుడి గొంతు నుంచి ‘ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయావో’ లాంటి గట్టి వార్నింగ్ వినిపించదు. తల వెయ్యివక్కలు అయ్యే ప్రసక్తే లేదు. కానీ... కనిపించే ప్రశ్నలకు కచ్చితంగా కచ్చితమైన సమాధానం చెప్పాలనే గట్టి పట్టుదల మాత్రం పెరుగుతుంది. వెయ్యిదారులు వెదికి అయినా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలనిపిస్తుంది. పదండీ... ఒకసారి అమెజాన్ డైలీ క్విజ్‌లోకి వెళ్లొద్దాం... అడిగేవారికి చెప్పేవారు లోకువ కాదు ఇప్పుడు.. చెప్పాలంటే లోకజ్ఞానులు, బహుమతి అందుకునే విజేతలు. బాలీవుడ్ నుంచి సీఫుడ్ వరకు, జానీవాకర్ నుంచి జాన్అబ్రహం వరకు.. రకరకాల ప్రశ్నలకు జవాబులు చెబితే సమాధానం చెప్పిన సంతృప్తి మాత్రమే కాదు అదృష్టం హాయ్ చెబితే మంచి మంచి బహుమతులు కూడా ఆన్లైన్ క్విజ్‌లలో సొంతం చేసుకోవచ్చు. కాస్త సరదా కోసమో, ప్రచార వ్యూహంలో భాగంగానో అమెరికన్ ఇ–కామర్స్ కంపెనీ అమెజాన్ ‘డైలీ క్విజ్’ ప్రారంభించింది. ఇది ఎంత క్లిక్ అయిందంటే రకరకాల సైట్లతో పాటు కొన్ని పత్రికలు కూడా ‘అమెజాన్ క్విజ్ ఆన్సర్లు ఇవే’ అంటూ ఎప్పటికప్పుడు సమాధానాలు ఇస్తున్నాయి. ఎలా వెళ్లాలి? స్టెప్ 1 గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి అమెజాన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. స్టెప్ 2 హోమ్‌పేజీలోకి వచ్చిన తరువాత: అమెజాన్ యాప్–ఆఫర్స్–క్లిక్ ఆన్ అమెజాన్ క్విజ్ 8ఎయం టు 12 పీఎం. స్టెప్ 3 అమెజాన్ క్విజ్ బ్యానర్లో ‘స్టార్ట్’ బటన్ నొక్కడంతో క్విజ్ మొదలవుతుంది. స్టెప్ 4 ఇక్కడ కనిపించే అయిదు ప్రశ్నలకు కరెక్ట్‌గా సమాధానం ఇస్తే ‘అమెజాన్ క్విజ్ విన్నర్స్ లక్కీ డ్రా’కు ఎంపిక అవుతారు. స్టెప్ 5 ప్రకటన తేదీలో విజేతల జాబితా ఇవ్వబడుతుంది. ఐఫోన్, సోనీ పోర్టబుల్ పార్టీ సిస్టం, ఫాజిల్ స్మార్ట్‌వాచ్, శాంసంగ్ గెలాక్సీ నోట్... కొన్నిసార్లు ఇలా ఆకర్షణీయమైన బహుమతులు ఉంటాయి. గత నెలల విజేతల పేర్ల జాబితా కూడా చూడవచ్చు. ‘అమెజాన్ క్విజ్‌లో మీరు ఎందుకు గెలవలేకపోయారు?’లాంటి వీడియోలు కూడా యూట్యూబ్‌లో ఎక్కుగానే కనిపిస్తాయి. అయితే మొదట్లో గిఫ్ట్ కోసమే అమెజాన్ క్విజ్‌లోకి ప్రవేశించినా ఆ తరువాత మాత్రం అదొక ముఖ్య విషయం కాని పరిస్థితి వస్తుంది. డైలీ పజిల్ సాల్వ్ చేయడంలాగే ఇదొక దినచర్యగా మారుతుంది చాలామందికి. అమెజాన్ మాత్రమే కాదు ఇండియన్ ఇ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లాంటి సంస్థలు కూడా ఆన్లైన్ ‘క్విజ్’ కాంటెస్ట్‌లు నిర్వహిస్తున్నాయి. మరోవైపు క్విజ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (క్యూఎఫ్ఐ)లాంటి సంస్థలు కాలానికి తగ్గట్టు జూమ్, డిస్కార్డ్ (ఇన్స్టంట్ మెసేజింగ్ అండ్ డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫామ్)లలో క్విజ్ కాంటెస్ట్‌లు నిర్వహిస్తున్నాయి. ‘మనకేం తెలుస్తుందిలే...అనుకొని ఒకప్పుడు క్విజ్ అనే మాట వినబడగానే దూరంగా జరిగేవారు. కాని ఆన్లైన్ స్పేస్‌లో మాత్రం దీనికి అనూహ్యమైన ఆదరణ ఉంది. లైవ్ క్విజ్‌లలో జవాబు ఇవ్వడానికి ఏ ఆధారం ఉండదు. ఆన్లైన్లో మాత్రం గూగుల్‌లాంటి వాటిపై ఆధారపడే వెసులుబాటు ఉంటుంది’ అంటున్నారు క్యూఎఫ్ఐ సెక్రెటరీ జయకాంతన్. సరే, ఏదో ఒకటి. మొత్తానికైతే దూరంగా ఉండే వాళ్లు సైతం క్విజ్ కాంటెస్ట్‌ల వైపు ఆకర్షితులు కావడం శుభసూచన. ఆన్లైన్ క్విజ్‌తో ప్రయోజనాలు 1 మైండ్ ఫిట్‌గా ఉంటుంది 2 ఔట్ ఆఫ్ బాక్స్ ఆలోచిస్తాం. 3 టైమ్మెనేజ్మెంట్ తెలుస్తుంది 4 జ్ఞాపకశక్తికి ఎక్సర్‌సైజ్‌లా ఉపకరిస్తుంది. 5 క్వశ్చన్ బ్యాంకు తయారుచేసుకోవచ్చు. పోటీ పరీక్షలకు ఇది ఉపయోగపడుతుంది. చదవండి: వాట్సాప్ లో సరికొత్త ఫీచర్! టిక్‌టాక్ తో ఇన్‌స్టాగ్రామ్‌కు కొత్త చిక్కులు -
జాక్‌పాట్ అంటే నీదే తమ్ముడు
షార్జా : కొందరికి వద్దన్నా అదృష్టం నక్కలాగా అతుక్కుపోతుందంటారు. ఏదో సరదాకు కొన్న లాటరీ టికెట్ ద్వారా అంత పెద్ద మొత్తం వస్తుందని బహుశా అతను కూడా ఊహించి ఉండడు. లాటరీలో నీకు కోట్లు తగిలాయరా అని మొదటిసారి వచ్చి చెప్పినప్పుడు అతను నమ్మలేదు.. తీరా అది నిజమేనని తెలిశాక అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. విషయం ఆ నోటా ఈ నోటా తెలిసి... 'జాక్‌పాట్ అంటే నీదే తమ్ముడు' అంటూ కామెంట్ చేశారు. ఇక అసలు విషయానికి వస్తే.. పంజాబ్‌కు చెందిన గుర్ప్రీత్ సింగ్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం యూఏఈ వెళ్లాడు. షార్జాలో ఐటీ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్న ఆయన.. ఆగస్ట్ 12న అబుదాబిలో బిగ్ టికెట్ రాఫెల్ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశాడు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 3న లక్కీ డ్రా నిర్వాహకులు డ్రా తీయగా.. గుర్ప్రీత్ సింగ్ 10 మిలియన్ దిర్హామ్స్( భారత కరెన్సీలో రూ.19.90కోట్లు) గెలుచుకున్నాడు. ( చదవండి : ప్లీజ్.. బోన్‌లెస్ చికెన్ పేరును మార్చండి) దీనిపై గురుప్రీత్ సంతోషం వ్యక్తం చేస్తూ.. ' లాటరీలో నేను కోట్ల రూపాయలు గెలుచుకున్నా అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. అదృష్టం అంటే ఏంటో ఇప్పుడు తెలిసింది. లక్కీ డ్రాలో గెలుచుకున్న డబ్బులతో యూఏఈలో ఓ ఇల్లు కొనుగోలు చేస్తా. నా తల్లిదండ్రులంటే నాకు చెప్పలేనంత ఇష్టం.. ఈ డబ్బులతో వారిని యూఏఈకి తీసుకొస్తా'నంటూ చెప్పుకొచ్చాడు.(చదవండి : విమర్శకుల నోళ్లుమూయించాం : రష్యా) -
స్కీం పేరిట మోసం!
విజయనగరం,వేపాడ: వారం వారం కొంత మొత్తం కడితే గృహోపకరణాలు ఇస్తామంటూ ఆకర్షిస్తూ మహిళలను మోసం చేసిన మరో స్కీం బాగోతం వెలుగులోకి వచ్చింది. తొలుత డబ్బులు కట్టిన వారికి చిన్నచిన్న వస్తువులు ఇచ్చి నమ్మించి తరువాత పెద్ద మొత్తంలో వసూలు చేసి చేతులెత్తేసిన వైనం బయటపడింది. బాధితులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రమైన వేపాడ, వల్లంపూడి గ్రామాల్లోకి ఏడు వారాల కిందట శ్రీసిద్ధి వినాయక ఈజీ ఇన్స్టాల్మెంట్ స్కీం పేరిట గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మహిళలను మోసపుచ్చారు. మొత్తం 19 వారాలు స్కీం ఉంటుందని మొదటి వారం రూ.30, రెండో వారం రూ.50, మూడో వారం రూ.100 ఇలా వారానికి రూ.50లు పెంచుకుంటూ ఏడు వారాలు, ఎనిమిదో వారం నుంచి వారానికొక రూపాయి చొప్పులు పెంచుకుతూ 17వ వారం వరకు, 18, 19 వారాల్లో రూ.పది పెంచి రూ.320, 330 కట్టాలంటూ... ఇందులో 201 మంది సభ్యులు ఉంటారని స్కీం లబ్ధిదారులను ఆకర్షించి కార్డులు అందజేశారు. ప్రతీ వారం డ్రా తీసి విజేతలకు దుప్పట్లు మొదటి వారం ఇచ్చారని, రెండో వారం నుంచి బహుమతులు ఇవ్వడానికి కరోనా అడ్డంకిగా మారిందని నమ్మబలికారు. ఇలా ఏడు వారాలు నమ్మించి డబ్బులు కట్టించుకుని ఏడో వారంలో అదనపు సొమ్ము కడితే వస్తువులు ఇంటికి తెచ్చి ఇస్తామంటూ నమ్మబలికి పలువురి నుంచి రూ.2వేల నుంచి నాలుగు వేల వరకు కార్డుకు అదనంగా వసూలు చేశారని వల్లంపూడిలోని యాతపేటకు చెందిన బాధితులు శెట్టి ఈశ్వరమ్మ, శెట్టి సత్యవతి, కక్కల భవానీ, కక్కల భారతి, గొర్లె ఈశ్వరమ్మ, కక్కర రమణమ్మ, శెట్టి వెంకటరమణ తదితరులు తెలిపారు. ఆగస్టు 1న సొమ్ము తీసుకువెళ్లిన వ్యక్తులు ఎనిమిదో తేదీకి వస్తామని చెప్పి రాకపోవడంతో 15వ తేదీన ఫోన్లు చేస్తే పలకపోవడంతో తామంతా మోసపోయినట్టు గుర్తించి లబోదిబోమంటున్నారు. స్కీం కార్డుపై ప్రొ.గౌరీశంకర్, హౌసింగ్‌బోర్డు కాలనీ, డోర్ నంబరు 16 – 20 – ఇ/ఏ అని రబ్బరు స్టాంప్ తప్ప ఊరు పేరు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు కట్టించుకున్న వారు పలువురు కొత్తవలస, ఎస్.కోట అని చెప్పారని తెలిపారు. పోలీసులను ఆశ్రయించనున్నట్టు చెప్పారు. అదనంగా 20వేలు కట్టాం.. మా ఇంట్లో ఐదు కార్డులు కట్టాం. ఏడు వారాల తరువాత వస్తువులిస్తామంటే అదనంగా రూ.20వేలు కట్టాను. తీరా ఇప్పుడు కనిపించకుండా పోయారు. మాతో పాటు చాలా మంది ఉన్నారు. ఫోన్ నంబరుకు చేస్తుంటే అందుబాటులో లేదని చెబుతోంది. – శెట్టి వెంకటరమణ, వల్లంపూడి వస్తువు సమకూర్చుకుందామని.. స్కీం డబ్బులు కట్టి మోసపోయా.. స్కీం కాకుండా అదనంగా రూ.800 కట్టాను. మా తోటికోడలు భారతి డబుల్‌కాట్ మంచం కోసం అదనంగా రూ.నాలుగు వేలు కట్టింది. మోసం చేశారు. – కక్కల భవానీ, వల్లంపూడి -
లక్కీ డ్రా అంటే 2.08 లక్షలు చెల్లించేశాడు..
కాకినాడ రూరల్: లక్కీ డ్రా ద్వారా రూ.25 లక్షలు గెలుచుకున్నారంటూ వాట్సాప్ కాల్ రావడంతో.. రూ.2.08 లక్షలు ఫోన్ పే ద్వారా చెల్లించిన ఒక ప్రైవేట్ ఉపాధ్యాయుడు సర్పవరం పోలీసులను ఆశ్రయించాడు. లక్కీ డ్రా రాలేదని ఆన్లైన్ మోసానికి గురయ్యానని అతడు ఆలస్యంగా గుర్తించాడు. సీఐ గోవిందరాజు బుధవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. గుడారిగుంట శ్రీసాయి 40 బిల్డింగ్స్ శ్రీ వాసవి కుటీర్ వద్ద నివాసం ఉంటున్న లంక రవికుమార్ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. జూన్ 29న ఉదయం 10 గంటలకు 70779 97542 నంబర్ నుంచి ఆకాశ వర్మ పేరుతో ఆయనకు వాట్సాప్ కాల్ వచ్చింది. లక్కీ డ్రాలో రూ.25 లక్షలు గెలుచుకున్నారని, రిజిస్ట్రేషన్‌కు రూ.8 వేలు, మీడియాకు ఇన్కమ్ ట్యాక్స్‌కు రూ.2 లక్షలు చెల్లించాలని నమ్మబలికాడు. దీంతో రెండు వారాల్లో దఫాదఫాలుగా రూ.2.08 లక్షలు ఫోన్ పే ద్వారా చెల్లించారు. తరువాత రాణాప్రతాప్‌సింగ్ అనే పేరుతో రవికుమార్‌కు ఫోన్ చేసి ఇన్సురెన్స్ కోసం మరో రూ.65 వేలు చెల్లించాలని కోరడంతో అనుమానం వచ్చి స్నేహితులకు చెప్పాడు. చివరికి మంగళవారం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడికి న్యాయం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. -
స్కీంపేరిట ఘరానా మోసం
సిరిసిల్ల: కామారెడ్డి జిల్లాకేంద్రంగా ఏడాదిగా స్కీమ్‌ల పేరిట సాగించిన వ్యాపార లావాదేవీలు ఘరానా మోసంగా మారింది. ఒక్కసారి రూ.30వేలు చెల్లిస్తే.. పదినెలలపాటు నెలకు రూ.10 వేల చొప్పున ఇస్తామని నమ్మబలికిన ఆ సంస్థ ఇప్పుడు బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట, కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్ మండలాల్లో పలువురు మహిళలు, యువకులు ఈ స్కీంలో చేరి మోసపోయిన ఘటన వెలుగు చూసింది. చైన్‌లింకుల్లో బాధితులు జిల్లాలోని పలు గ్రామాల్లో కిరాణ దుకాణాలను ఓపెన్ చేసిన బీర్షాబా అనే సంస్థ చైన్‌లింకులో సభ్యులను చేర్పించింది. ఒక్క సారి డబ్బులు రూ.30వేలు కడితే చాలు పదినెలలపాటు నెలకు రూ.10వేలు జీతం వచ్చినట్లుగా రూ.లక్ష వరకు వస్తాయని ఆశ చూపించారు. ఒకరిని చూసి మరొకరు అప్పులు చేసి బీర్షాబా సంస్థలో పెట్టుబడి పెట్టారు. డబ్బులు చెల్లించిన వారికి ఆ సంస్థ తరఫున పాస్‌బుక్ జారీ చేశారు. గ్రామాల్లో కిరాణ దుకాణాలు ఉండడంతో నమ్మకంగా డబ్బులు చెల్లించారు. ఒక్కరితో రూ.30వేలు కట్టిస్తే రూ.5వేలు కమీషన్ ఇచ్చారు. అత్యాశతో డబ్బులు కట్టించిన ఏజెంట్లు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఐదు మండలాల్లో బాధితులు జిల్లాలోని ఐదు మండలాల్లో అధికంగా బాధితులు ఉన్నారు. గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, వీర్నపల్లి, ముస్తాబాద్ మండలాల్లో సుమారు రెండు వేల మంది బీర్షాబా సంస్థలో డబ్బులు కట్టిన వారు ఉన్నారు. ఒక్కోక్కరు రూ.30వేల చొప్పున చెల్లించడంతో జిల్లాలో రూ.6 కోట్ల మేరకు ఆ సంస్థ మోసానికి పాల్పడినట్లు సమాచారం. కామారెడ్డిలోని ఆ సంస్థ ఆఫీస్‌ను పోలీసులు సీజ్ చేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించంతో బీర్షాబా ఆఫీస్ కంప్యూటర్లను, రికార్డులను సీజ్ చేశారు. నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు ఉండడం విశేషం. గ్రామాల్లో మధ్యవర్తిగా ఉండి డబ్బులు కట్టించిన ఏజెంట్లను బాధ్యులను చేస్తున్నారు. బాధితులు ఏజెంట్లపై ఒత్తిడిపెంచారు. పల్లెల్లో కూలీనాలీ చేసే వారు, బీడీ కార్మికులు బీర్షాబాలో డబ్బులు చెల్లించి లబోదిబోమంటున్నారు. ఆశకుపోయి మోసపోయామని ఆందోళన చెందుతున్నారు. -
రైల్వే ఉద్యోగి అరెస్ట్
ఎమ్మిగనూరురూరల్: మంత్లీ మనీ స్కీం పేరుతో రూ.లక్షల్లో టోకరా పెట్టిన రైల్వే ఉద్యోగిని ఎమ్మిగనూరు పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుడి వివరాలను స్థానిక రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఆదోని డీఎస్పీ కేఎస్ వినోద్‌కుమార్ విలేకరులకు వెల్లడించారు. మండల పరిధిలోని వెంకటగిరి గ్రామానికి చెందిన నెమ్మరాళ్ల చిన్న మునెప్ప కుమారుడు ఉరుకుందు ఆదోని రైల్వే స్టేషన్లో ట్రాక్‌మెన్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అంతకుముందు కర్నూల్లో విధులు నిర్వహించే సమయంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో షేర్ మార్కెట్లో డబ్బు పెట్టడంతో కాస్త లాభం వచ్చింది. దీంతో అతని ఆశ మరింత పెరిగింది. ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుని కొత్త స్కీంకు తెర లేపాడు. తాను పని చేసేరైల్వే సంస్థలోనే మంత్లీ మనీ స్కీం ఉందని, ఈ స్కీంలో డబ్బు పెడితే రూ.100కి నెలకు రూ.5ల చొప్పున వడ్డీ వస్తుందని సొంత బామ్మర్దులకు(భార్య సోదరులు), బంధువులకు నచ్చజెప్పాడు. ఒకరికి తెలియకుండా మరొకరికి మాయ మాటలు చెప్పి తన ఖాతాకు లక్షల్లో డబ్బు జమ చేయించుకున్నాడు. మొదట మూడు నెలలు రూ.5 చొప్పున వడ్డీ సక్రమంగా ఇవ్వడంతో నమ్మకం కుదిరి బాధితులు అప్పు తెచ్చి మరీ అతని చేతిలో పెట్టారు. ఈ ఏడాది జనవరి నుంచి వడ్డీ చెల్లించడం మానేశాడు. అడిగినప్పుడల్లా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేయడంతో గట్టిగా నిలదీశారు. తన వద్ద డబ్బు లేదని, ఒత్తిడి చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో బాధితులు(బామ్మర్దులు) కోట ఉమారాజు, కోట జయరాముడు, కోట వీరాంజనేయులు, కోటా గోపాలకృష్ణ, అదే గ్రామానికి చెందిన పరందామ గత నెల29న రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆదోని రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఉరుకుందును అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు తమ విచారణలో రూ.47 లక్షలకు సంబంధించిన బాధితులు తమను కలిశారని, దర్యాప్తు కొనసాగుతుందని, ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే ఫిర్యాదు చేయాలని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ మహేశ్వరరెడ్డి, ఎస్ఐ రామసుబ్బయ్య పాల్గొన్నారు. -
సైబర్ యుగంలో స్వాహాల పర్వం
సాక్షి, సిటీబ్యూరో : నగరంలో రోజు రోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. లక్షల రూపాయలు పోగొట్టుకున్న బాధితులు పోలీసులు ఆశ్రయిస్తున్నారు. సోమవారం ఐదుగురు బాధితులు వేర్వేరుగా ఆశ్రయించారు. వీరిలో నలుగురు వ్యక్తులు, ఓ సంస్థ ఉంది. వీటి ఆధారంగా కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. ►ఖైరతాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాము రాజ్ ఫౌండేషన్ నుంచి మాట్లాడుతున్నామంటూ అవతలి వ్యక్తులు చెప్పారు. తాము నిర్వహించిన లక్కీ డ్రాలో రూ.7 లక్షలు మీకు వచ్చాయని ఎర వేశారు. దీనికి నగర యువకుడు ఆసక్తి చూపడంతో ఆ డబ్బు పొందడానికి ముందుగా తమ ఫౌండేషన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆపై ఇన్‌కమ్‌ట్యాక్స్, జీఎస్టీ, ఇతర పన్నుల పేరుతో రూ.7 లక్షలు కాజేశారు. చివరకు తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ►ఓఎల్ఎక్స్లో ఉద్యోగ ప్రకటన చూసిన మోహన్ అనే యువకుడు అందులో ఉన్న నెంబర్‌కు సంప్రదించాడు. కోరిన ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఎర వేసిన అవతలి వ్యక్తులు ముందుగా తమ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. దీనికి మోహన్ అంగీకరించడంతో సెక్యూరిటీ డిపాజిట్ సహా వివిధ పేర్లతో రూ.1.04 లక్షలు కాజేశారు. ►నగరంలోని ఓ ప్రాంతంలో రాఘవేంద్ర టిఫిన్స్ నిర్వహించే కృష్ణమూర్తికి ఇటీవల ఫోన్ వచ్చింది. శంషాబాద్‌లో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో (ఐఓసీ) పని చేసే వారికి అల్పాహారం సరఫరా చేసే కాంట్రాక్ట్ ఇప్పిస్తామంటూ చెప్పారు. దీనికి సంబంధించిన టెండర్‌కు ఈఎండీ చెల్లించాలంటూ రూ.78 వేలు స్వాహా చేశారు. ఆ తర్వాత నేరగాళ్ళు తమ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ►ఫేస్‌బుక్‌లోని మార్కెట్ ప్లేస్‌లో సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనం విక్రయ ప్రకటన చూసిన లంగర్‌హౌస్‌కు చెందిన వ్యక్తి స్పందించాడు. అందులో ఉన్న నెంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడాడు. వారి మాటల వల్లో పడి ఆన్లైన్లో రూ.58 వేలు చెల్లించి మోసపోయి సైబర్ కాప్స్‌కు ఫిర్యాదు చేశాడు. ►కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ–కామర్స్ సైట్ ట్రేడ్ ఇండియా.కామ్‌లో నాట్కో ఫార్మసీ ఉత్పత్తులు విక్రయిస్తున్నట్లు ప్రకటన పొందుపరిచారు. అందులో ఈ సంస్థ ఉప్పత్తి చేయని అబెమాక్సిల్బీ మందునూ జోడించారు. అయితే వాస్తవానికి ఈ ఔషధాన్ని ఎలీలిల్లీ కంపెనీ తయారు చేస్తుంది. దీనిపై అన్ని హక్కులు కేవలం ఈ సంస్థకు మాత్రమే ఉన్నాయి. ట్రేడ్ ఇండియా.కామ్‌లో ఈ ప్రకటన చూసిన అమెరికన్ సంస్థ నాట్కోపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ న్యాయస్థానం నుంచి నాట్కో సంస్థకు నోటీసులు రావడంతో కంగుతిని వివరాలు ఆరా తీసింది. దీంతో విషయం తెలిసి ఆ వెబ్సైట్లో ఉన్న ప్రకటనకు, తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆ ప్రకటనను ఎవరు పోస్ట్ చేశారో గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులపై కేసులు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతికంగా దర్యాప్తు చేపట్టారు. -
పన్ను చెల్లించండి బంగారం గెలవండి
ముంబై: పన్ను రాబడి పెంచుకోవడానికి మహారాష్ట్రలోని ఓ గ్రామం వినూత్న ప్రయోగం చేపట్టింది. వచ్చే సంవత్సరం మార్చి 15 లోపు గ్రామపంచాయతీ పన్ను బకాయిలు చెల్లిస్తే వారిని లక్కీడ్రాకు ఎంపిక చేస్తామని, లక్కీడ్రాలో వారు బంగారం గెలుపొందవచ్చని ప్రకటించింది. సంగ్లీ జిల్లా కడేగావ్ తాలూకాలోని వాంగీ అనే గ్రామపంచాయతీ ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. పన్ను బకాయిలను నిర్ణీత గడువులోగా చెల్లించిన వారి పేర్లతో లక్కీడ్రా తీస్తామని, లక్కీడ్రాలో తొలి రెండు స్థానాల్లో వచ్చినవారు 5 గ్రాములు, 3 గ్రాముల బంగారపు ఉంగరాలు, మూడో స్థానంలో నిలిచిన వారు 2 గ్రాముల బంగారు నాణెం గెలుచుకుంటారని తెలిపింది. ఈ పథకానికి మంచి స్పందన వస్తోందని వాంగీ గ్రామ సర్పంచ్ విజయ్ హన్మానే తెలిపారు. -
ఇదో ‘కిస్మత్’ డ్రా!
సాక్షి, కరీంనగర్: ‘ఇదో లక్కీ స్కీం. నెలకు రూ.1000 చొప్పున 3వేల మంది సభ్యులతో స్కీం. 16 నెలలపాటు ఈ స్కీం కొనసాగుతుంది. ప్రతి నెల 8న డ్రా తీస్తారు. డ్రాలో క్విడ్ కారుతోపాటు ఫ్రిజ్‌లు, బైక్‌లు, స్కూటర్లు, టీవీలు మొదలుకొని బంగారు ఆభరణాల వరకు విజేతలు దక్కించుకోవచ్చు. ’ ఇదీ కరీంనగర్లో జనం ‘కిస్మత్’ మీద కొంతమంది కలిసి ఆడుతున్న లక్కీ డ్రా ఆట. నెలకు వెయ్యి రూపాయలు కడితే 16 నెలల్లో ఏదో ఓ బహుమతి తప్పనిసరి అనే హామీతో... అదృష్టం బాగుంటే కారు, మూడు తులాల బంగారం, బుల్లెట్ బైక్ వంటివి కూడా పొందవచ్చు అనే ప్రచారంతో అమాయకులను టార్గెట్ చేస్తూ సాగిస్తున్న దందా శుక్రవారం ‘సాక్షి’ దృష్టికి వచ్చింది. పెద్దపల్లి రోడ్డులోని ఎస్ఎస్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఇప్పటికే సభ్యులుగా చేరిన వ్యక్తులతో శుక్రవారం సమావేశం పెట్టి తొలి లక్కీ డ్రా తీశారు. 2021 ఫిబ్రవరి 8న ఆఖరి 16వ లక్కీ డ్రా వరకు నెలకు వెయ్యి చొప్పున చెల్లించిన 3వేల మందికి బహుమతులు అందజేయనున్నట్లు ‘కిస్మత్’వాలాలు తయారు చేయించిన బ్రోచర్లో పేర్కొన్నారు. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా కలిగిన ఈ ‘కిస్మత్’ గురించి సంబంధిత పోలీసులకు కూడా తెలియకపోవడం గమనార్హం. నెలకు రూ.1000 పేరిట దిగువ తరగతి టార్గెట్ రూ.1000 చొప్పున 16 నెలలు చెల్లించేందుకు ఉద్ధేశించిన ఈ స్కీంలో ప్రతి నెల డ్రా తీస్తామని ‘కిస్మత్’ సంస్థ ప్రచురించిన బ్రోచర్లో పేర్కొన్నారు. హుస్సేనీపురా అడ్రస్‌తో ఉన్న ఈ కిస్మత్ కార్యాలయానికి సంబంధించి ముగ్గురు వ్యక్తుల పేర్లు, ఫోన్ నెంబర్లు కూడా ఈ బ్రోచర్ మీద పొందుపర్చారు. ఇటీవలే ప్రారంభించినట్లుగా భావిస్తున్న ఈ స్కీంకు సంబంధించి మొదటి నెల డ్రా శుక్రవారం తీశారు. ఈ డ్రాలో మొదటి బహుమతి కింద యాక్టివా 5జీ వాహనంతోపాటు ఓరియంట్ ఐరన్, ప్యూర్ఇట్ వాటర్ ఫిల్టర్, 32 అంగుళాల ఐవా టీవీ, హయర్ 190 లీటర్ల ఫ్రిడ్జి, డానిక్స్ వాషింగ్ మిషన్, హాయర్ ఓవెన్, గ్యాస్ స్టవ్, బజాజ్ మిక్సర్ గ్రైండర్ ఇస్తున్నట్టు బ్రోచర్లో పేర్కొన్నారు. అలాగే 2 నుంచి 8 వరకు ప్రైజులను పేర్కొన్నారు. శుక్రవారం డ్రాలో ఎవరికి ఎన్ని ప్రైజులు ఇచ్చారో తెలియదు. వచ్చే నెల 8న మళ్లీ లక్కీ డ్రా ఉంటుంది. ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. అదే సమయంలో సభ్యులను తమ ‘టార్గెట్’కు అనుగుణంగా చేర్చుకుంటూనే ఉంటారు. నెలకు 3వేల మంది ...రూ.30 లక్షల వసూలు లక్కీడ్రా పేరుతో నెలకు 3 వేల మంది నుంచి వెయి రూపాయల చొప్పున వసూలు చేస్తే నెలకు రూ.30 లక్షలు వసూలు అవుతున్నాయి. నెలకు తీసే డ్రాలో మాత్రం వస్తువుల విలువ రెండు లక్షలు దాటని పరిస్థితి ఉంది. మొదటి నెల పేర్కొన్న వస్తువుల విలువ రూ.3 లక్షలు కూడా దాటదు. మిగతా డబ్బులు జమ అయినట్టే. రెండో నెలలో మొదటి నెల బహుమతులు పొందిన 8 మందిని తొలగించినా... రూ.30 లక్షలకు ఓ 8వేల రూపాయలే తక్కువ. ఇలా 16 నెలలకు మొత్తం రూ.4.50 కోట్ల వరకు వసూలవుతున్నాయి. చివరి 16వ నెలలో కారు, ఫ్రీజ్, టీవీ మొదటి బహుమతిగా పేర్కొంటూ... అప్పటి వరకు బహుమతులు రాని వారికి 400 మందికి సాంసంగ్ 32 జీబీ స్మార్ట్ ఫోన్, 600 మందికి హాయర్ వాషింగ్ మిషన్లు, 199 మందికి చెవి రింగులు, 658 మందికి ఐవా 32 అంగులాల టీవీలు, 200 మందికి ఫ్రిజ్‌లు ఇస్తున్నట్లు బ్రోచర్లో పేర్కొన్నారు. నిజాయితీగా లక్కీ డ్రాలో అందరికీ చెప్పినట్లు బహుమతులు ఇచ్చినా 16 నెలల వరకు ఇచ్చే వస్తువుల విలువ కనీసం రూ.కోటి దాటే పరిస్థితి లేదని తెలుస్తోంది. ప్రజల నమ్మకాన్ని పెట్టుబడిగా కోట్లు కొల్లగొట్టేందుకు కొందరు వ్యక్తులు వేసిన ఈ ప్రణాళిక ఎంత మేరకు పనిచేస్తుందో చూడాలి. మధ్యలో ఒక నెల ఎగ్గొట్టినా... అవుట్ ఈ బ్రోచర్‌ను పరిశీలించి ‘వెనుక పేర్కొన్న ఒక వ్యక్తికి ‘సాక్షి’ ప్రతినిధి ఫోన్ చేయగా, తొలి డ్రా శుక్రవారమే ముగిసినట్లు చెప్పాడు. ఇంకా కొందరు సభ్యులుగా చేరేందుకు అవకాశం ఉందని, రూ.1000 చెల్లించి చేరవచ్చని తెలిపాడు. ఆరు నెలలు చెల్లించిన తరువాత డబ్బులు లేక మిగతా కిస్తీలు కట్టకపోతే ఎలా అని ప్రశ్నిస్తే... కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వబోమని, జప్తు అయినట్టేనని స్పష్టం చేశాడు. అందరికీ బహుమతులు ఇస్తామని, చిన్నవి, పెద్దవి అంటే ‘కిస్మత్’ను బట్టేనని తెలిపాడు. లక్కీ డ్రాలు నిషేధం అదృష్టం పేరుతో ప్రజలను మోసం చేసే లక్కీ డ్రా స్కీమ్‌లను ప్రభుత్వం నిషేధించింది. ఇలాంటి స్కీంలలో ఎవరూ చేరకూడదు. నిర్వాహకులపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం. లక్కీడ్రా స్కీమ్‌లను ప్రజలు నమ్మి మోసపోవద్దు. స్కీమ్ కట్టాలని ఎవరైనా సంప్రదిస్తే వెంటనే మాకు సమచారం అందించాలి. – త్రీటౌన్ సీఐ విజ్ఞాన్‌రావు -
ఆబ్కారీ బోణీ రూ.80.26 కోట్లు
సాక్షి, కరీంనగర్ : నూతన ఎక్సైజ్ పాలసీ అమలులోకి రాకముందే ఆబ్కారీ శాఖ గణమైన బోణీ కొట్టింది. 2019–21 కింద రెండేళ్ల కాలానికి మద్యం దుకాణాల(ఏ–4 షాప్స్) నిర్వహణకు దరఖాస్తులు ఆహ్వానించగా, ఉమ్మడి జిల్లాలోని 266 దుకాణాలకు ఏకంగా 4,013 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు రుసుం రూపంలోనే ఎక్సైజ్ శాఖ ఏకంగా రూ.80.26 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఉమ్మడి జిల్లాలో ఒక్కో దుకాణానికి సగటున 15.01 దరఖాస్తులు అందగా, జగిత్యాల జిల్లాలో పోటీపడ్డ వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మద్యం దుకాణాలు ఏర్పాటుకు వ్యాపారులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. 2019–21 సంవత్సరాల కోసం(రెండేళ్ల పాటు) మద్యం దుకాణాల లైసెన్స్ కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉమ్మడి జిల్లాలో దరఖాస్తు చేసుకు న్నారు. దరఖాస్తుల దాఖలుకు బుధవారంతో గడువు ముగియగా, అర్ధరాత్రి వరకు దరఖాస్తులను స్వీకరించారు. శుక్రవారం ఆయా జిల్లా కేంద్రాల్లో దరఖాస్తుదారులకు లక్కీ డ్రా ద్వారా దుకాణాలను కేటాయిస్తారు. అదృష్టం కలిసి రాకపోతే దరఖాస్తుకు వెచ్చించిన రూ.2లక్షలు తిరిగిరావు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 266 మద్యం దుకాణాల ఏర్పాటుకు అవకాశం ఉండగా, ఎన్నడూ లేని విధంగా 4,013 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే సగటున ఒక్కో దుకాణానికి 15 మంది చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. జగిత్యాల, కరీంనగర్‌తో పోలిస్తే పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లల్లో పోటీ కొంత తక్కువగా ఉంది. వీరిలో 480 మంది మహిళలు కావడం గమనార్హం. ఒక్కో దరఖాస్తుకు నాన్ రిఫండబుల్(తిరిగి చెల్లించని) రుసుం రూ.2 లక్షలు కాగా, ఈ దరఖాస్తుల ద్వారా ఆబ్కారీ శాఖకు వచ్చిన ఆదాయం రూ.80.26 కోట్లు. ఈసారి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మద్యం వ్యాపారులు కూడా తెలంగాణలో దుకాణాలు దక్కించుకునేందుకు స్థానికుల భాగస్వామ్యంతో దరఖాస్తు చేయించినట్లు తెలిసింది. ఈ తరహాలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఏపీకి చెందిన వారు స్థానికుల భాగస్వామ్యంతో దరఖాస్తులు అందజేశారు. దీంతో దరఖాస్తుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. అదే సమయంలో జిల్లాకు చెందిన వ్యాపారులు ఐదుగురు అంతకన్నా ఎక్కువ మంది రింగ్ అయి, డిమాండ్ ఉన్న షాపులకు దరఖాస్తులు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ఒక్కో షాపు కోసం సగటున 15 మంది దరఖాస్తు చేయడంతో 266 షాపులకు గాను ఎక్సైజ్ శాఖకు ఏకంగా రూ.80.26 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ దరఖాస్తుల్లో సగానికి పైగా చివరిరోజైన బుధవారం నాడు దరఖాస్తు చేసుకున్నవే. జగిత్యాలలో సగటున 20 దరఖాస్తులు మద్యం దుకాణాలకు దరఖాస్తులు చేసుకోవడంలో కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో తీవ్ర పోటీ నెలకొంది. కరీంనగర్ జిల్లాలో 87 షాపులు ఉండగా, వీటిని దక్కించుకునేందుకు 1346 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో షాపు కోసం సగటున 15.5 దరఖాస్తులు వచ్చాయి. ఇక్కడ మహిళా దరఖాస్తుదారులే 170 మంది ఉండడం విశేషం. ఈ ఒక్క జిల్లా నుంచే దరఖాస్తులను విక్రయించడం ద్వారా రూ.26.92 కోట్లు ఆబ్కారీ శాఖకు ఆదాయం సమకూరింది. ఇక జగిత్యాల జిల్లాలో 64 దుకాణాలే ఉండగా, 1285 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే సగటున ఒక దుకాణానికి 20 దరఖాస్తులు వచ్చాయి. ఈ జిల్లాలో దరఖాస్తుల ద్వారా ఎక్సైజ్ శాఖకు రూ.25.70 కోట్లు ఆదాయం సమకూరింది. 161 మంది మహిళలు అదృష్టాన్ని నమ్ముకోవడం గమనార్హం. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట మద్యం దుకాణం కోసం ఏకంగా 48 మంది దరఖాస్తులు దాఖలు చేశారు. కరీంనగర్ జిల్లాలో మానకొండూరు మండలం 48వ దుకాణానికి 41 దరఖాస్తులు అందాయి. కరీంనగర్ పట్టణంలో లైసెన్స్ ఫీజు ఎక్కువగా ఉండడం, ఇక్కడ పాతుకుపోయిన ఒకటి రెండు దుకాణాలతో పోటీ పడి విక్రయాలు జరపలేమని పలువురు వ్యాపారులు ఆదాయం అధికంగా ఉండే ఇతర ప్రాంతాల్లో దరఖాస్తులు చేసుకున్నారు. అంచనాలు తప్పిన పెద్దపల్లి మద్యం విక్రయాల్లో పెద్దపల్లి జిల్లా ముందంజలో ఉంటుంది. సింగరేణి కాలరీస్ నెలవై ఉన్న రామగుడం కార్పొరేషన్ , పెద్దపల్లి జిల్లా కేంద్రాలతోపాటు రాష్ట్ర, జిల్లాల సరిహద్దు ప్రాంతాలు కూడా ఈ జిల్లాలో అధికం. గోదావరి ఖని కోల్‌బెల్ట్ ఏరియాలోనే రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరుగుతాయి. ఈ కొత్త లైసెన్సుల కోసం దరఖాస్తులు మాత్రం సింగరేణి కోల్‌బెల్ట్ నుంచి తక్కువగా రావడం గమనార్హం. దీనిని బట్టి ఇక్కడి వ్యాపారులు రింగ్ అయి పరస్పర ఒప్పందంతో కలిసి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం మద్యం దుకాణాలు నడుపుతున్న వ్యాపారులే సిండికేట్ అయి దరఖాస్తులు దాఖలు చేసినట్లు తెలిసింది. ఒక్కో దుకాణానికి రెండు లేదా మూడు మాత్రమే దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ జిల్లాలో ఓదెల మండలం పొత్కపల్లి, ఎలిగేడ్ మండల కేంద్రం దుకాణాలకు మాత్రమే 28 మంది చొప్పున దరఖాస్తు చేసుకోగా, గర్రెపల్లి దుకాణానికి 27 మంది పోటీ పడ్డారు. జిల్లాలో 61 మంది మహిళలు మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోగా, సుల్తానాబాద్ సర్కిల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోనే 34 మంది పోటీ మహిళలు పోటీ పడడం విశేషం. సిరిసిల్లలో 41 దుకాణాలకు 648 దరఖాస్తులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 41 దుకాణాలకు గాను 648 దరఖాస్తులు అందాయి. వీటిలో 88 మంది మహిళా దరఖాస్తుదారులు ఉన్నారు. కాగా ఈ దరఖాస్తుదారుల ద్వారా ఎక్సైజ్ శాఖకు 12.96 కోట్లు ఆదాయంగా సమకూరనుంది. సిరిసిల్లలోని 6వ నెంబర్ దుకాణానికి అత్యధికంగా 36 మంది దరఖాస్తు చేసుకోగా రుద్రంగి మండలంలోని మానాల మద్యం దుకాణానికి అత్యల్పంగా కేవలం 2 దరఖాస్తులు వచ్చాయి. నేడు లక్కీ డ్రా ద్వారా కేటాయింపులు ఎక్సైజ్ శాఖకు జిల్లాల వారీగా వచ్చిన సీల్డ్ దరఖాస్తులను శుక్రవారం ఆయా జిల్లా కేంద్రాలలో తెరవనున్నారు. జిల్లా కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ సమక్షంలో దుకాణాల వారీగా విభజించి, లక్కీ డ్రా ద్వారా కేటాయింపులు జరపనున్నారు. ఈ మేరకు ఎంపిక చేసిన ఆడిటోరియాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
'మద్యం' లక్కు ఎవరిదో ?
సాక్షి, ఆదిలాబాద్ : ఒక్కొక్క మద్యం దుకాణం కోసం పదుల సంఖ్యలో దరఖాస్తులు.. షాపు మాత్రం దక్కేది ఒక్కరికే. లక్కీడ్రాలో ఎవరికి మద్యం షాపు దక్కుతుందో నేడు తేలిపోనుంది. బుధవారంతో కొత్త మద్యం పాలసీ దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కాగా, శుక్రవారం ఈ టెండర్లకు సంబంధించి లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జనార్దన్‌రెడ్డి గార్డెన్స్‌లో ఉదయం 10 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. కలెక్టర్ సమక్షంలో.. కలెక్టర్ దివ్యదేవరాజన్ సమక్షంలో ఈ లక్కీడ్రా ప్రక్రియ చేపట్టనున్నారు. డీపీఈఓ రవీందర్‌రాజు, సీఐలు, ఎస్సైలు, ఎక్సైజ్ సిబ్బంది ఇందులో పాల్గొననున్నారు. జిల్లాలో 31 మద్యం దుకాణాల కోసం 528 దరఖాస్తులు వచ్చాయి. సంఖ్య నంబర్ పరంగా మొదటి షాపు నుంచి చివరి షాపు వరకు ఈ లక్కీడ్రా కొనసాగుతుంది. ఇందుకోసం ఎక్సైజ్ శాఖాధికారులు జనార్ధన్ రెడ్డి గార్డెన్స్‌లో ఏర్పాట్లు చేశారు. దరఖాస్తుదారు తప్పనిసరి.. ఈ టెండర్లలో దరఖాస్తుదారు తప్పనిసరి పాల్గొనాలి. లేనిపక్షంలో అతని దరఖాస్తును డిస్క్వాలిఫై చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా రూ.5లక్షల ఫెనా ల్టీ విధించనున్నట్లు పేర్కొంటున్నారు. తద్వారా లక్కీడ్రా సమయంలో దరఖాస్తుదారు లేనిపక్షంలో అతని పేరును తొలగిస్తారు. ఇదిలా ఉంటే లక్కీడ్రాలో షాపు దక్కిన వ్యక్తి వార్షిక అద్దె పరంగా రెండు సంవత్సరాలది కలిపి 8 విడతల్లో చెల్లించాల్సి ఉండగా, మొదటి విడత 1/8వ వంతు అప్పుడే చెల్లించాల్సి ఉంటుంది. దీని కోసం ఇదే ప్రాంగణంలో బ్యాంక్ కౌంటర్ ఏర్పాటు చేశారు. లక్కీడ్రా రోజే 31 దుకాణా లకు సంబంధించి రెండేళ్ల లైసెన్స్ ఫీజులో 1/8వ వంతు శుక్రవారమే వసూలు కానుంది. ఆదాయం భళా.. జిల్లాలో దరఖాస్తు ఫీజు ద్వారా రూ.10.56 కోట్ల ఆదాయం రాగా, రెండేళ్ల లైసెన్స్ ఫీజు ద్వారా 31 షాపులకు మొత్తంగా 8 విడతల్లో కలిపి రూ.35.30 కోట్ల రాబడి రానుంది. 2017–19 పాలసీలో దరఖాస్తుల ద్వారా రూ.5.59 కోట్లు, లైసెన్స్ ఫీజు ద్వారా రూ.26.60 కోట్లు రాబడి సమకూరింది. తాజా పాలసీలో దరఖాస్తు ఫీజు ఆదాయం రెట్టింపు కాగా, లైసెన్స్ ఫీజు రాబడి రూ.8.70 కోట్లు అదనంగా సమకూరుతుంది. ఈ విధంగా ఈ కొత్త పాలసీలో ప్రభుత్వానికి ఆదాయం బాగా నే వచ్చింది. మొత్తం మీద 2019–21 మద్యం పాలసీలో బోణి అదిరింది. ఇదిలా ఉంటే గత రెండేళ్లలో లిక్కర్ అమ్మకాల ద్వారా ఎస్సైజ్ ఆదాయాన్ని పరిశీలిస్తే.. 2017–18 సంవత్సరంలో రూ.226.26 కోట్లు, 2018–19లో రూ.241.32 కోట్లు సమకూరింది. -
బిగ్ ‘సి’ దసరావళి తొలి డ్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ బిగ్ ‘సి’ దసరావళి తొలి లక్కీ డ్రా విజేతలను ప్రకటించింది. సంస్థ ఫౌండర్ ఎం.బాలు చౌదరి, డైరెక్టర్లు స్వప్న కుమార్, బాలాజీ రెడ్డి ఈ వివరాలను బుధవారం వెల్లడించారు. మొత్తం 20 మందిని లక్కీ డ్రాలో ఎంపిక చేశారు. వీరిలో 10 మందికి మారుతీ ఆల్టో 800 కార్లు, 10 మందికి బజాజ్ ప్లాటినా బైక్‌లను బహుమతిగా అందిస్తారు. అక్టోబరు 29 వరకు ఉండే ఈ ఆఫర్ కింద మొత్తం 30 మారుతి ఆల్టో కార్లు, 30 బజాజ్ ప్లాటినా బైక్‌లను కస్టమర్లు గెలుచుకోవచ్చు. అలాగే 10% హెచ్డీఎఫ్సీ క్యాష్ బ్యాక్, సులభ వాయిదాల్లో మొబైల్ కొన్నవారికి ఒక ఈఎంఐ ఉచితం, 30% పేటీఎం క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చు. ప్రతి మొబైల్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతి ఉంది. -
మాల్లో మజా..
-
కారు కొంటే.. హోండా బంపర్ ఆఫర్
సాక్షి,న్యూఢిల్లీ: సెప్టెంబర్ 1నుంచి కార్ల ధరలు పెరిగాయని అందోళన పడుతున్నవారికి ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా పండుగ కానుక అందిస్తోంది. హోండా కారు కొనుగోలు చేసిన వినియోగదారులకు నెలవారీ విలువైన బహుమతులతోపాటు, ఒక బంపర్ ఆఫర్ ఉంటుందని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హోండా షోరూంలలో ప్రమోషనల్ ఆఫర్‌గా తీసుకొచ్చిన ఈ ఆఫర్లో లక్కీ డ్రా గెలిచిన కస్టమర్లకు ఉచితంగా విదేశీ ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. తమ మోడల్ కార్లు అన్నింటిపైనా ఈ ఆఫర్ వర్తింస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వార్షికోత్సవ వేడుకల సందర్భంగా భారతదేశంలో ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఈ ఆఫర్‌ను వెల్లడించింది. ది గ్రేట్ హోండా ఫెస్ట్ పేరుతో ప్రకటించిన ఆఫర్లో నెలవారీ డిస్కౌంట్లు, ఆఫర్లకు తోడుగా మరో గ్రాండ్ ప్రైజ్‌ను కూడా అందిచనున్నామని తెలిపింది. ఇందులో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన కస్టమర్‌కు లండన్, పారిస్ టూర్ ఆఫర్ అందిస్తోంది. సెప్టెంబర్ 1నుంచి నవంబరు7, 2018 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కారును కొనుగోలు చేసిన అనంతరం హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ వెబ్సైట్ www.hondacarindia.లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. నిర్దేశిత కాలంలో బిల్లింగ్, డాక్యుమెంటేషన్ తదితర అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసిన కస్టమర్లు ఈ ఆఫర్ పొందేందుకు అర్హులు. బ్రియో జాజ్, అమేజ్, డబ్యలువీఆర్-వీ, సిటీ, బీఆర్-వి ఎస్యూవీ , సీఆర్-వి, అకార్డ్ హైబ్రిడ్ సహా అన్ని హోండా కార్ల కొనుగోళ్లపై ఆ ఆఫర్ వర్తిస్తుంది. -
డ్రాలో కారు వచ్చిందని బురిడీ
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ) : ఆన్లైన్ లక్కీ డ్రాలో కారు వచ్చిందంటూ ఓ మహిళ నుంచి పలు దఫాలుగా రూ. 4.49 లక్షలు బ్యాంక్‌లలో జమ చేయించుకున్న ఘటన కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలికి రెండు నెలలుగా కారు ఇవ్వకుండా ఇంకా డబ్బులు చెల్లించాలని నిందితులు నిత్యం ఫోన్లు చేసి మాట్లాడుతుండటంతో ఎట్టకేలకు విషయం పోలీసులకు చేరింది. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జక్కంపూడి కాలనీలో జరిగింది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాలనీలోని బ్లాక్ నెం 272 టీఎఫ్–1లో సత్యవరపు విజయ, మల్లేశ్వరరావు దంపతులు నివాసం ఉంటున్నారు. విజయ కుమారుడు వినోద్‌కుమార్ కు మే 15న ఆన్లైన్లో కారు వచ్చిందంటూ ఫోన్ రావడంతో ఆ కుటుంబానికి అనందానికి అవధులు లేకుండా పోయ్యాయి. కారు రోడ్డు టాక్స్ మీరే చెల్లించాలని చెప్పడంతో తొలుత రూ.12,800 చెల్లించారు. కారు పంపకుండా క్యాష్ ప్రైజ్‌గా కూడా తీసుకోవచ్చునని నమ్మించారు. దీంతో వారు మరో మారు ఫోన్ చేసి టాక్స్ మొత్తం మీరే చెల్లించాలని చెప్పగా రూ.25,600 ఆన్లైన్ అకౌంట్లో చెల్లించారు. అదే నెల మరోసారి ఫోన్ చేయడంతో రూ. 51,200 చెల్లించారు. మీ ప్రైజ్ మనీ రెట్టింపు బ్యాంక్‌లో డబ్బులు పడతాయని ఆశగా ఎదురు చూస్తున్న వారికి మరోసారి సదరు కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది. మీకు కంపెనీ ఇచ్చే ప్రైజ్‌మనీ రెట్టింపు అయిందని, ఒకటి రెండు రోజులలో మీ అకౌంట్లో నగదు వేస్తామని చెప్పి మరి కొన్ని వివరాలను తీసుకున్నారు. ఆ తర్వాత జూన్ 1న రూ. 1,13,600, 6న మరో రూ. 40 వేలు, 25న మరో రూ. 1.09,600 చెల్లించారు. ఇక అంతటితో ఆగకుండా గత నెల 27న రూ. 20 వేలు, ఈ నెల 23న మరో రూ. 50 వేలు వేశారు. ఈ నెల 23వ తేదీ ఫోన్ చేసిన వ్యక్తి తన పేరు రాఘవేంద్రగా చెప్పి మరో రూ. 26,100 చెల్లిస్తే డబ్బులు గంటలో మీ అకౌంట్లో వేస్తామని చెప్పారు. ఆ డబ్బులు వేయకపోవడంతో ఇంకా ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం రూ. 4.49 లక్షల నగదును పలు బ్యాంకుల్లో ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఘటనపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తిరుపతిరావు పేర్కొన్నారు. -
నమ్మించి..నట్టేట ముంచారు
కుషాయిగూడ : లక్కీ డ్రా పేరుతో తమను మోసం చేశారని ఆరోపిస్తూ బాధితులు రాధిక చౌరస్తా లోని పూజ సిల్క్స్ ఎదుట ఆందోళన దిగిన సంఘటన శుక్రవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెలితే.. పదేళ్లుగా రాధిక చౌరస్తాలో పూజ సిల్క్స్ అండ్ జ్యూవెలర్స్ పేరుతో బట్టలు, నగల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గత కొంత కాలంగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు వెండి ఆభరణాలపై లక్కీ డ్రా పథకాన్ని ప్రవేశ పెట్టారు. వినియోగదారులు ప్రతి నెల రూ. 100 నుంచి రూ.వెయ్యి వరకు చెల్లించేలా పలు స్కీంలను ఏర్పాటు చేశారు. ప్రతి నెల డ్రాలో గెలుపొందిన వారు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. వారికి స్కీంను బట్టి బహుమతి అందజేస్తారు. వివిధ స్కీంలలో సమారు 5 వేల మందికి పైగా వినియోగదారులు రూ.కోటికి పైగా డబ్బులు చెల్లించారు. అయితే ఇటీవల భాగస్వాముల మధ్య విబేధాల కారణంగా షాపు సక్రమంగా తెరవక పోగా, వెండి ఆభరణాలను షో రూంలోంచి తీసివేశారు. దీంతో అనుమానం వచ్చిన ఏజెంట్లు షాపు నిర్వాహకులను నిలదీయగమేగాక డబ్బులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేశారు. దీంతో కొందరికి డబ్బులు తిరిగి ఇచ్చినట్లు తెలియడంతో శుక్రవారం పెద్ద సంఖ్యలో మహిళలు షాపు వద్దకు చేరుకున్నారు. అయితే షాపు తెరవక పోవడంతో అక్కడే బైఠాయించి న్యా యం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కుషాయిగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. షోరూం యజమానులతో చర్చించగా, ఇప్పటికే దాదాపు రూ.60 లక్షలు చెల్లించాలమని, మరో రూ.40 లక్షల చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొద్దిరోజుల్లోనే అందరి డబ్బులు చెల్లిస్తామని చెప్పగా బాధితులు నిరాకరించారు. దీంతో వారికి రావాల్సిన డబ్బులకు బదులుగా షోరూంలో బట్టలు, వస్తువులు ఇచ్చేలా అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. -
మాటలు కలిపి.. మాయ చేసి..
ఏడాది క్రితం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ముదాంగల్లీలో ఓ ఇంటిముందు కూర్చున్న దంపతుల వద్దకు వచ్చిన ఓ అపరిచిత వ్యక్తి ఆమెతో మాటలు కలిపాడు. మీరు సెల్‌ఫోన్ రీచార్జీ చేసుకుంటే మీ పేరిట లాటరీ తగిలింది, మా ఆఫీసుకు వస్తే సంతకాలు చేసి లాటరీ లో గెలుచుకున్న స్కూటీ తీసుకెళ్లవచ్చని నమ్మించాడు. పేదవారికే బహుమతులు వర్తిస్తాయని, మెడలోని బంగారం ఇంట్లో పెటి రమ్మన్నాడు. ఇంట్లోనే కదా పెట్టేది అ నుకున్నారు. చెప్పినట్టే చేశారు. భార్యాభర్తలిద్దరూ ఆ వ్యక్తితో కలిసి బైక్‌పై బయలుదేరారు. ఇప్పుడే వస్తానంటూ దారి మధ్యలో వారిని దింపిన దుండగుడు నేరుగా వా రి ఇంటికే వెళ్లాడు. దాచిన బంగారు గొలుసును తెమ్మంటున్నారని వారి కూతురితో చెప్పి బంగారం తీసుకుని ఉడాయించాడు. బాధితులు లబోదిబోమన్నారు. అంతకు వారం రోజుల ముందే దేవునిపల్లిలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. భారతి అనే మహిళకు లక్కీడ్రాలో బహుమతి గెల్చుకున్నావని మాయమాటలు చెప్పిన ఓ దుండగుడు బైక్‌పై తీసుకెళ్లాడు. మత్తుమందు చల్లి మెడలోని బంగారం గొలుసు లాక్కున్నాడు. కామారెడ్డి క్రైం:పైన పేర్కొన్న సంఘటనలు ఉమ్మడి జిల్లాలోని నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ తదితర ప్రాంతాల్లో గతంలో చాలానే వెలుగుచూశాయి. సరిగ్గా ఏడాది గడిచింది. మళ్లీ జిల్లాలో ఇదే తరహాలో మోసాలు మొదలయ్యాయి. ఐదురోజుల క్రితం బాన్సువాడ డివిజన్ పరిధిలో ఒకేరోజు రెండుచోట్ల ఇలాంటి మోసాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. మాటమాట కలిపి నట్టేట ముంచుతారు. అపరిచితులతో మాట్లాడకపోవడమే మంచిదని కొందరు అంటున్నారు. నిఘా పెరగాల్సిందే.. ఇలాంటి మోసాలపై ప్రజల్లో అవగాహన లేదు. అంతేకాకుండా పోలీసుల నిఘా సైతం తగ్గినట్లు తెలుస్తోం ది. జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఇంకా చాలా చోట్ల కెమెరాల ఏర్పాటు అవసరం ఉంది. ఏడాది క్రితం కామారెడ్డిలో దేవునిపల్లి భారతి మెడలోంచి గొలుసును చోరీ చేసిన దుండగులు మాయమాటలతో ఆమెను తన బైక్‌పై ఎక్కించుకుని బస్టాండ్ ప్రాంతంలో తిరిగాడు. అప్పట్లో బస్టాండ్ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలు ఏ ఒక్కటి పనిచేయక కేసు పరిశోధనలో అడ్డంకులు తలెత్తాయి. సీసీ కెమెరా ల ఏర్పాటు ఎంత ముఖ్యమో వాటి నిర్వహణ కూడా అంతే ముఖ్యమని అధికారులు గుర్తించారు. అయినా చాలాచోట్ల సీసీ కెమెరాల నిర్వహణ అధ్వానంగానే ఉం ది. అపరిచిత వ్యక్తులపై పోలీసుల నిఘా సైతం అం తంతమాత్రంగానే ఉందనే విమర్శలు ఉన్నాయి. నేరా ల నియంత్రణకు పోలీసు నిఘా పెంచాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు. ప్రధానంగా మహిళలే లక్ష్యం తరుచూ చోటు చేసుకుంటున్న ఇలాంటి సంఘటనలను చూస్తే దుండగులు అమాయకులనే టార్గెట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఐదు రోజుల క్రితం బాన్సువాడ వచ్చిన దండుగులు ఓ మహిళతో మాట లు కలిపాడు. మీ భర్త బహుమతి గెల్చుకున్నాడని షోరూంకు తనతో రమ్మన్నాడని నమ్మించాడు. బం గారం ఇంట్లో పెట్టించాడు. వెంట తీసుకెళ్లి మధ్యలో వదిలేసి వారి ఇంటికే వచ్చి బంగారం ఎత్తుకెళ్లాడు. వర్ని మండలం ఆపందిఫారంలోనూ ఇలాగే మోసగించారు. సుభద్ర దేవి–దేవిదాస్ దంపతుల ఇంటికి వచ్చిన ఓ అపరిచిత వ్యక్తి మీరు మూడు తులాల బంగారం, ఓ స్కూటీని లాటరీలో గెల్చుకున్నారని నమ్మించాడు. తనతో వస్తే ఇప్పిస్తానని తీసుకువెళ్లి మధ్యలో వదిలేశాడు. తిరిగి వారింటికే వచ్చి వారి కోడలు సుమలతతో మీ అత్త బంగారు గొలుసు తెమ్మని పంపిందని మాయమాటలు చెప్పాడు. ఆమె మెడలోని రెండున్నర తులాల గొలుసు తీసుకుని పరారయ్యాడు. పోలీసులు విచారణ జరుపుతున్నా రు. అయినా గ్రామీ, పట్టణ ప్రాంతాల్లోని ఎంతో మంది ప్రజకుల ఇలాంటి నేరాలపై ఇప్పటికే సరైన అవగాహన లేదు. ప్రతి ఏటా వేసవికాలంలోనే ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. లక్కిడ్రా, స్కీంల పేరిట జరుగుతున్న మోసాలపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడే వ్యక్తులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అపరిచితుల మాటలు నమ్మొద్దు. లాటరీ తగిలిందని చెప్పి చోరీలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టాం. కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. నేరాలను కట్టడి చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం. –శ్రీధర్‌కుమార్, ఎస్‌హెచ్‌వో, కామారెడ్డి -
త్వరగా చేరితే బహుమతులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు కొత్త తరహా విద్యా వ్యాపారానికి తెర తీశాయి. తమ స్కూల్లో ముందుగా చేరితే లక్కీ డ్రా తీసి బహుమతులు ఇస్తామని నోటీసు బోర్డుల్లో పెట్టాయి. ఇప్పటికే చదువుతున్న విద్యార్థులు పైతరగతుల్లో నిర్ణీత తేదీలోగా చేరినా, కొత్త వారు చేరినా బహుమతులు ఇస్తామని ఎరవేస్తున్నాయి. కిండర్ గార్టెన్ నుంచి ఐదో తరగతి వరకు 5 బహుమతులు, 6 నుంచి పదో తరగతి వరకు 6 బహుమతులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి ఇస్తామంటూ నోటీసు బోర్డుల్లో పెట్టారు. ఈ నెల 22 లోగా విద్యార్థులు తమ అడ్మిషన్‌ను పైతరగతులకు రెన్యువల్ చేసుకోవాలని హయత్‌నగర్‌లో ఓ పాఠశాల ఈ బోర్డు పెట్టింది. అయినా విద్యాశాఖకు ఇవేమీ పట్టడం లేదు. -
లక్కీ డ్రా పేరుతో టోకరా
కర్నూలు, సి.బెళగల్: లక్కీ డ్రా పేరుతో ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు మోసగించారు. బాధితుడి వివరాల మేరకు.. కంబదహాల్ గ్రామానికి చెందిన ఉప్పర రాముడు కుమారుడు ఉప్పర గోవిందు సెల్‌ఫోన్‌కు గత వారం గుర్తుతెలియని వ్యక్తులు 9711153027 నంబర్ నుంచి ఫోన్ చేశారు. మీ సెల్ నంబర్‌కు లక్కీ డ్రాలో రూ.15 వేల విలువ చేసే సెల్‌ఫోన్, బూట్లు తగిలాయని రూ.4500 చెల్లిస్తే చాలని నమ్మించారు. దీంతో సదరు యువకుడు ఆర్డర్ చేశాడు. గురువారం పోస్టల్ ద్వారా పార్శిల్ రాగా రూ.4500 చెల్లించి తీసుకున్నాడు. అయితే అందులో కేవలం రూ.500 విలువచేసే బూట్లు మాత్రమే కనిపించాయి. బాధితుడు తాను ఆర్డర్ చేసిన సెల్‌నంబర్‌కు ఫోన్ చేయగా తాము ఇచ్చేది ఇంతేనని, ఎవరికి చెప్పకుంటావో చెప్పుకో పో అంటూ గుర్తు తెలియని వ్యక్తి దబాయించాడు. చివరకు బాధితుడు తనకు జరిగిన మోసంపై ఎస్ఐ శ్రీనివాసులకు ఫిర్యాదు చేశాడు. -
‘సాక్షి’ పండుగలో మీలోనూ ఓ లక్షాధికారి
ఎస్వీఎన్కాలనీ (గుంటూరు) : నవ్యాంధ్ర రాజధాని గుంటూరులో ‘సాక్షి’ పండుగ సంబరాలు కొనుగోలుదారులకు లక్షలాది రూపాయల కాసుల వర్షం కురిపిస్తోంది. ఆహ్లాదభరిత వాతావరణంలో పెద్ద సంఖ్యలో కస్టమర్ల సందడి నడుమ నగరంలోని ఇన్నర్ రింగు రోడ్డులో ఉన్న విజయ్ డిజిటల్స్ షోరూంలో గురువారం ‘సాక్షి’ పండుగ సంబరాలు నాల్గవ రోజు లక్కీ డ్రా విజేతలను ప్రకటించారు. మూడో రోజు డ్రాలో రూ.లక్ష నగదు గెలుపొందిన విజేత కల్వకొల్లు దుర్గాబాబు నాల్గవ రోజు నాటి లక్కీ విజేతను డ్రా తీసి ఎంపిక చేశాడు. ఈ డ్రాలో సరిపూడి సుజికి కస్టమర్ వి.నరేష్‌సాయి విజేతగా నిలిచి రూ.లక్ష నగదు బహుమతిని గెలుపొందారు. విజయ్ డిజిటల్స్ చైర్మన్ జవ్వాది గంగాధర్, సంస్థ డైరెక్టర్ రాహుల్, మేనేజర్ దొప్పలపూడి దుర్గాప్రసాద్, పలువురు కస్టమర్లు డ్రా తీసి ఐదు కన్సొలేషన్ బహుమతులకు విజేతలను ఎంపిక చేశారు. ఎంతో పారదర్శకంగా, ఆద్యంతం ఉత్సాహభరితంగా నిర్వహిస్తున్న ఈ డ్రాపై కస్టమర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన గుంటూరులో మొదటిసారిగా చేపట్టిన ‘సాక్షి’ పండుగ సం బరాలకు కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన వస్తోందని విజయ్ డిజిటల్స్ ఇన్నర్ రింగు రోడ్డు షోరూం మేనేజర్ దొప్పలపూడి దుర్గాప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘సాక్షి’ మీ డియా గ్రూప్ గుంటూరులో తొలిసారిగా చేపట్టిన సాక్షి పండుగ సంబరాలు కొనుగోలుదారుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతోందన్నారు. విజేత ఎంపికకు విచ్చేసిన దుర్గాబాబు మాట్లాడుతూ మధ్య తరగతి ప్రజలకు ‘సాక్షి’ లక్కీ డిప్ ఒక వరమని చెప్పారు. సెల్‌ఫోన్ కొనుగోలుతో లక్కీ డిప్ ద్వారా లక్షాధికారి అయ్యే అవకాశం రావడం తన జీవితంలో మర్చిపోలేని మధురానుభూతిని నింపిందన్నారు. ఈ కార్యక్రమంలో ‘సాక్షి’ యాడ్స్ రీజినల్ మేనేజర్ వెంకటరెడ్డి, యాడ్స్ మేనేజర్ చిత్తరంజన్ తదితరులు పాల్గొన్నారు. ఈనెల 24న ప్రారంభమైన ‘సాక్షి’ పండుగ సంబ రాలు జనవరి 7వ తేదీ వరకు కొనసాగుతాయని ఈ సందర్భంగా ‘సాక్షి’ రీజినల్ మేనేజర్ వెంకటరెడ్డి వెల్లడించారు. పండుగ సంబరాలకు టీవీ పార్టనర్‌గా ‘సాక్షి’ టీవీ, రేడియో పార్టనర్‌గా రెడ్ ఎఫ్ఎం వారు వ్యవహరిస్తున్నారు. నాలుగో రోజు డ్రా విజేతలు వీరే.. సరిపూడి సుజుకి కస్టమర్ వి.నరేష్‌సాయి బంపర్ బహుమతి రూ.లక్ష నగదును గెలుపొందారు. మొదటి కన్సొలేషన్ బహుమతిని అశోక్ (రాయల్ సెల్యూలర్), రెండో కన్సొలేషన్ టి.కల్పన (విజయ్ డిజిటల్స్), మూడో కన్సొలేషన్ కె.పార్ధసారథి (విజేత సూపర్ మార్కెట్), నాలుగో కన్సొలేషన్ డేవిడ్ (విజయ్ డిజిటల్స్), ఐదో కన్సొలేషన్ ఆయేషా (కార్పొరేట్ వెంచర్స్) గెలుపొందారు. జీవితంలో మర్చిపోలేని రోజు నేను వ్యవసాయం చేస్తుంటాను. నా సెల్‌ఫోన్ చోరీకి గురవడంతో కొత్తది కొనేందుకు ఆప్షన్స్ మొబైల్స్‌కు వెళ్లాను. నచ్చిన మోడల్ కొన్నాక సిబ్బంది ‘సాక్షి’ పండుగ సంబరాలు కూపన్లు మూడు ఇచ్చారు. వాటిని పూర్తి చేసి డ్రాప్ బాక్స్‌లో వేశాను. బుధవారం షోరూం నుంచి ‘సాక్షి’ డీజీఎం రంగనాథ్ ఫోన్ చేసి రూ.లక్ష నగదు బహుమతి గెలుపొందారని చెప్పారు. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాను. జీవితంలో మర్చిపోలేని రోజు. వ్యవసాయంలో నష్టం చవిచూస్తున్న నాకు ఈ నగదు ఎంతో ఉపయోగపడుతుంది. – కల్వకొల్లు దుర్గాబాబు, జొన్నలగడ్డ, మూడో రోజు రూ.లక్ష విజేత కస్టమర్ల నుంచి విశేష ఆదరణ మొదటిసారిగా గుంటూరులో ప్రవేశపెట్టిన ‘సాక్షి’ పండుగ సంబరాల్లో మేమూ భాగస్వాములం కావడం కొత్త అనుభూతిని ఇస్తోంది. షోరూంలో నిర్వహించిన డ్రా ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోంది. మా స్టోర్‌లో ప్రముఖ బ్రాండ్లకు సంబంధించి ఆధునిక టెక్నాలజీ ఎలక్ట్రానిక్ గృహోపకరాలు అందుబాటులో ఉంటున్నాయి. కస్టమర్లు కూప న్ను తీసుకుని ఆసక్తిగా పూర్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంతో వారిలో ఆసక్తిని పెంచడంతోపాటు సేల్స్ పెరుగుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నాం. – దొప్పలపూడి దుర్గాప్రసాద్, మేనేజర్, విజయ్ డిజిటల్స్ -
‘భీమ్’తో బుక్ చెయ్... రిఫండ్ కొట్టెయ్
న్యూఢిల్లీ: ప్రజలు భీమ్ యాప్ లేదా యూపీఐ ద్వారా టికెట్లు బుక్ చేసుకునేలా ప్రోత్సహించడానికి రైల్వే శాఖ నెలవారీ లక్కీ డ్రా పథకాన్ని ప్రారంభించింది. ఇందులో విజేతలుగా నిలిచే ఐదుగురికి మొత్తం ప్రయాణ చార్జీలను తిరిగి చెల్లిస్తారు. భీమ్ యాప్ లేదా ఠీఠీఠీ.జీటఛ్టిఛి.ఛిౌ.జీn వెబ్సైట్లో యూపీఐ ద్వారా రైలు టికెట్లు బుక్ చేసుకునే వారి కోసం ఐఆర్సీటీసీ ఈ పథకాన్ని గత నెలలో ప్రవేశపెట్టింది. ఇది ఆరు నెలలు అమల్లో ఉంటుంది. ప్రతి నెల మొదటి వారంలో కంప్యూటరైజ్డ్ డ్రా ద్వారా అంతకు ముందు నెలకు సంబంధించిన ఐదుగురు విజేతలను ప్రకటిస్తారు. ప్రయాణికుడు తాను ప్రయాణించిన నెలలోనే ఈ పథకం కింద లక్కీ డ్రాకు అర్హుడు. -
ఎయిర్ టెల్ లక్కీ డ్రాలోమట్టి ముద్ద
ప్రకాశం , దర్శి రూరల్: పట్టణంలోని క్రిస్టియన్ కాలనీకి చెందిన పండూరి శంకర్ అనే వ్యక్తికి పది రోజుల క్రితం ఓ ఫోన్ వచ్చింది. మీకు ఎయిర్ టెల్ లక్కీ డ్రాలో సామ్సంగ్ జె–7 మొబైల్ తగిలిందని చెప్పారు. తనకే ఎందుకు వచ్చిందని ప్రశ్నించగా మీరు ఎయిర్టెల్ నంబర్‌ను పదేళ్ల నుంచి వాడుతున్నారని, అందుకే అవకాశం వచ్చిందని చెప్పకొచ్చారు. ఆ సెల్ బయట మార్కెట్లో రూ.16 వేలు ఉందని, డ్రాలో వచ్చినందున మీకు రూ.4 వేలకే ఇస్తున్నామని నమ్మించారు. పదే పదే ఫోన్ చేసి విసుగు వచ్చేలా మాట్లాడటంతో సరే పంపించండన్నాడు. శంకర్ చిరునామాను ఫోన్లో అడిగి తెలుసుకుని వెంటనే వారు ఓ బాక్స్‌ను పోస్టులో పంపారు. ఆ వెంటనే మళ్లీ ఫోన్ చేసి పోస్టాఫీస్‌కు వెళ్లి రూ. 4 వేలు చెల్లించి సెల్ తీసుకోవాలని చెప్పారు. బుధవారం శంకర్ పోస్టాఫీస్‌కు వెళ్లి రూ.4 వేలు చెల్లించి పార్శిల్ తీసి చూడగా అందులో మట్టిముద్ద, నాలుగు రేకు బొమ్మలు కనిపించాయి. బాధితుడు వచ్చిన నంబర్‌కు తిరిగి కాల్ చేయగా పని చేయలేదు. మరో నంబర్ నుంచి కాల్ చేయగా దాన్నీ కట్ చేసి బ్లాక్ లిస్టులో పెట్టాడు. మళ్లీ మరొక నంబర్‌తో ఫోన్ చెయ్యగా మీకు వచ్చిన పార్శిల్‌ను వీడియో తీసి పంపాలని చెప్పి ఆ తర్వాత స్విచ్చాప్ చేసుకున్నాడు. పార్శిలో ఎక్కడి నుంచి వచ్చిందో పరిశీలించగా స్మార్ట్ గెలాక్సీ, 10బై10, విలేజ్ బేగంపూర్, ఢిల్లీ..అని ఉంది. -
ఘనంగా సాక్షి డుగ సంబరాలు
-
ఘనంగా సాక్షి పండుగ సంబరాలు
-
లక్కీ డ్రా వచ్చిందని.. ఆన్లైన్ మోసం..
బ్యాంక్ ఖాతాలో రూ.65,200 వేసిన బాధితుడు చిట్యాల (నకిరేకల్) : దేవుడి పేరు చెప్పి ఆన్లైన్ మోసానికి పాల్పడిన చేసిన ఘటనపై బుధవారం చిట్యాల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చోటుచేసినట్టు ఎస్ఐ బాల్గోపాల్ తెలిపారు. వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లి మండలం నెమ్మాని గ్రామానికి చెందిన బూరుగు లక్ష్మయ్యకు ఈ నెల రెండో వారంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ చేసిన వ్యక్తి తాను శ్రీకాళహస్తి దేవాలయంలో అర్చకుడిగా పనిచేస్తానని.. మీరు రూ.5200 చెల్లిస్తే మీ పేరున ఆలయంలో అన్నదానం చేస్తామని, మీకు మంచి జరిగేలా మూడు వస్తువులను పంపిస్తామని తెలిపాడు. దీంతో లక్ష్మయ్య ఈ నెల 17వ తేదిన చిట్యాలలోని ఆంధ్రా బ్యాంక్ ద్వారా రూ.5200లను ఆ గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ నంబర్‌కు ఆన్లైన్లో పంపిచారు. అనంతరం పార్సిల్లో లక్ష్మయ్యకు మూడు వస్తువులు వచ్చాయి. వాటితో పాటు మరో పేపర్లో మీకు రూ.5.70 లక్షల లక్కీ డ్రా తగిలిందని పేర్కొన్నారు. ఇందుకుగాను మీరు రూ.60 వేలు చెల్లిస్తే డ్రాలో వచ్చిన డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్‌కు పంపిస్తామని తెలిపారు. దీంతో ఈనెల 19వ తేదిన లక్ష్మయ్య చిట్యాలలోని ఆంధ్రా బ్యాంక్ ద్వారా రూ.50 వేలు, ఎస్ బీహెచ్ ద్వారా రూ.10 వేలను పంపారు. అయినప్పటికీ లక్కీ డ్రాలో వస్తాయనుకున్న డబ్బులో అకౌంట్లో జమకాలేదు. దీంతో లక్ష్మయ్య తన కు కాల్ వచ్చిన సెల్ నంబర్లకు ఫోన్ చేయగా స్విచాఫ్ వస్తుండడంతో మోసపోయానని గుర్తిం చి చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
అదృష్టం ఉంటేనే ఆ గురుకులాల్లో ప్రవేశాలు!
► నేడు లక్కీ డ్రా ద్వారా మైనారిటీ గురుకులాల్లో విద్యార్థుల ఎంపిక ► హైదరాబాద్ మినహా 30 జిల్లాల్లో అడ్మిషన్ల ప్రక్రియ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి విద్యార్థులు అదృష్టం పరీక్షించుకోవాల్సిందే. 2017–18 విద్యా సంవత్సరానికి మైనారిటీ గురుకుల పాఠశాల్లో 5, 6, 7 తరగతుల్లో లక్కీ డ్రా ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనుంది. హైదరాబాద్ జిల్లాలోని 31 పాఠశాలలు మినహా మిగిలిన 30 జిల్లాల్లో 170 పాఠశాలల్లో ప్రవేశానికి గురువారం లక్కీ డ్రా ద్వారా విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. మొత్తం 201 గురుకులాల్లోని 5, 6, 7 తరగతుల్లో 35 వేల సీట్లు ఉండగా ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా సుమారు 85 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో దరఖాస్తులు చేసుకునే గడువు ఈ నెల 15 వరకు ఉండటంతో 19వ తేదిన లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టెమ్రీస్) ప్రకటించింది. మొత్తం 210 పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నూతనంగా ప్రారంభిస్తున్న 118 గురుకుల పాఠశాల్లో ఐదు, ఆరు, ఏడు తరగతుల్లో, గతేడాది ప్రారంభించిన 71 పాఠశాలలతోపాటు విద్యాశాఖ నుంచి బదిలీ అయిన 12 పాఠశాలల్లో కేవలం 5వ తరగతిలో మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. లక్కీ డ్రా అనంతరం విద్యార్థుల జాబితాను ప్రకటించి అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగించనున్నారు. మొత్తం సీట్లలో మైనారిటీలైన ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలకు 75 శాతం, మైనారిటీయేతరులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ/ఈబీసీలకు 25 శాతం ప్రాతిపదికన ప్రవేశం కల్పించనున్నారు. లక్కీ డ్రాలో తల్లిదండ్రులు పాల్గొనాలి మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ఐదు, ఆరు, ఏడు తరగతుల్లో ప్రవేశానికి గురువారం నిర్వహించే లక్కీ డ్రా లో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనాలని రాష్ట్ర మైనారిటీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బి.షఫీ ఉల్లా కోరారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా నాణ్యమైన మాంటిస్సోరి విద్యా బోధన, వసతులు అందిస్తున్నామన్నారు. బాలికలకు గట్టి భద్రత కల్పిస్తున్నామన్నారు. -
లక్కీ డ్రా గెల్చుకున్నారంటూ ఘరానా దోపిడీ
కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో ఘరానా దోపిడీ జరిగింది. ముదాంగల్లిలో నివాసముంటున్న లక్ష్మి, లింగం భార్యాభర్తలు. మంగళవారం మధ్యాహ్నం పల్సర్ బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి మొబైల్ ఫోన్‌ను రీచార్జి చేయడం ద్వారా మీ మొబైల్ నంబర్‌కు లక్కీ డ్రాలో స్కూటీ గెల్చుకున్నారని వారిని బురిడీ కొట్టించాడు. స్కూటీ తీసుకోవాలంటే తమ ఆఫీసుకి వచ్చి సంతకాలు పెట్టాలని చెప్పాడు. ఆఫీసుకు వచ్చేటప్పుడు బంగారు ఆభరణాలు తీసేసి రావాలన్నాడు. పేదవారిలా కనిపిస్తేనే బండి ఇస్తారని నమ్మబలికాడు. భార్యాభర్తలకు మొదట అనుమానం వచ్చినా డబ్బులేం అడగకపోవడంతో బంగారు ఆభరణాలను ఇంట్లో ఉన్న కూతురికి ఇచ్చి అతనితో పాటు బయలుదేరారు. బంగారు ఆభరణాలను లింగం కుమారై దాచడం పల్సర్‌పై వచ్చిన వ్యక్తి గమనించాడు. లింగం దంపతులను కొంతదూరం బైక్‌పై తీసుకెళ్లిన తర్వాత మీలాగే ఇంకొకరికి కూడా లక్కీ డ్రాలో బహుమతి వచ్చిందని వారిని కూడా తీసుకువస్తానని చెప్పాడు. అక్కడే వారిద్దరినీ ఉండమని చెప్పి లింగం వాళ్ల ఇంటికే వెళ్లాడు. మీ అమ్మ ఫోటోలు దిగాలి..ఇంట్లో దాచిన బంగారు ఆభరణాలు తీసుకురమ్మని చెప్పింది అని లక్ష్మి కూతురికి మాయమాటలు చెప్పాడు. మా అమ్మ వస్తేనే ఆభరణాలు ఇస్తానని చిన్నారి చెప్పటంతో బలవంతంగా ఇంట్లో దూరి ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. సదరు వ్యక్తి తిరిగి రాకపోవడంతో భార్యాభర్తలు ఇంటికి వచ్చేశారు. ఇంటి నుంచి ఆభరణాలను ఎత్తుకుపోయాడని తెలుసుకుని నిర్ఘాంతపోయారు. వెంటనే కామారెడ్డి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘నీతి’ లక్కీ డ్రా విజేతలకు రూ.54.90 కోట్లు
ముంబై: నీతి ఆయోగ్ డిజిటల్ చెల్లింపులకు ఉద్దేశించిన లక్కీడ్రా పథకాల విజేతలకు భారత జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్పీసీఐ) రూ.54.90 కోట్ల నగదు బహుమతులను పంపిణీ చేసింది. లక్కీ గ్రాహక్ యోజన, డిజిధన్ వ్యాపార్ యోజనల కింద విజేతలైన 3.42 లక్షల మంది వినియోగదారులు, వ్యాపారులకు ఈ మొత్తాన్ని పంపిణీ చేసినట్లు సంస్థ తెలిపింది. డిసెంబర్ 25న ప్రారంభమైన ఈ పథకాలు ఏప్రిల్ 14 వరకు అమల్లో ఉంటాయి. 15 వేల మంది రోజువారీ విజేతలకు రూ.1.5 కోట్లు, దీనికి అదనంగా వారానికి 14వేల విజేతలకు రూ.8.3 కోట్లు ఇవ్వనున్నట్లు ఎన్పీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలు ఎక్కువ మంది విజేతలున్న రాష్ట్రాలుగా నిలిచాయి. -
లక్కీ డ్రా నిర్వాహకులు అరెస్టు
- లక్కీ డ్రా పేరుతో రూ. 1300 ప్రకారం వసూలు - 3500 మంది నుంచి రూ. 45.50 లక్షలు - అదుపులోకి తీసుకున్న పోలీసులు మంత్రాలయం రూరల్: ‘రూ. 1300 చెల్లించి టికెట్ కొనుక్కోండి... తగిలితే మంచి బహుమతి వస్తుంది.. లేకపోయినా ఆ విలువకు తగ్గట్టు ఏదో ఒక వస్తువు అందిస్తాం’ అంటూ కొందరు.. జనానికి ఆశ చూపించి లక్కి డ్రా పేరుతో వసూళ్లకు పాల్పడ్డారు. ఇలా 3500 మంది నుంచి 45.50 లక్షలు వసూలు చేశారు. ఒప్పందం ప్రకారం ఈ నెల 9వతేదీన కోసిగి చౌడేశ్వరి దేవాలయం వద్ద డిప్పు వేయాల్సి ఉండగా ఇదిగో.. అదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. చివరకు వారిపై అనుమానం పెరగడంతో కోసిగికి చెందిన కొందరు నిలదీయగా మంత్రాలయం వైష్ణవి పాఠశాల వద్ద ఆదివారం డిప్పు తీస్తుండగా మంత్రాలయం ఎస్ఐ శ్రీనివాసనాయక్ అదుపులోకి తీసుకున్నారు. సీఐ నాగేశ్వరరావు ఎస్ఐలు రాజారెడ్డి, శ్రీనివాసనాయక్, భానుమూర్తి , స్పెషల్ పార్టీ సిబ్బందితో వైష్ణవి స్కూల్ దగ్గరకు చేరుకుని లక్కీ డ్రా నిర్వాహకులైన మంత్రాలయం మండలం సూగూరుకు చెందిన జె.చంద్రశేఖర్, కోసిగికి చెందిన ఎస్.రత్నయ్య, పి.రాఘవేంద్ర, సుభాన్సాహెచ్ను అరెస్టు చేశారు. అయితే వారిని అరెస్టు చేస్తే తాము చెల్లించిన డబ్బు ఎలా అంటూ జనం అక్కడకు దూసుకురావడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. అనుమతి లేకుండా లక్కీడ్రా నిర్వహిస్తున్న వారిపై చీటింగ్ కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. అనుమతి తీసుకున్నట్లు చెప్పారు: లక్ష్మన్న, పెద్దకడబూరు మూడు నెలల క్రితం మా ఊరికి వచ్చి లక్కి డ్రా గురించి చెప్పారు. అనుమతులు కూడా తీసుకున్నట్లు చెప్పడంతో రూ. 1300 ప్రకారం చెల్లించి టికెట్లు కొనుగోలు చేశాం. డిప్పు కోసం ఇప్పటికే రెండు సార్లు ప్రదేశాలను మార్చారు. ఆదివారం మంత్రాలయంలో డ్రా తీస్తున్నట్లు తెలియడంతో ఇక్కడి వచ్చాం. చివరికి ఇదంతా మోసమని తెలిసింది. మాకు న్యాయం చేయాలి: కమ్మరి వీరేష్, మాధవరం ఏవో మాయ మాటలు చెప్పడంతో టికెట్ కొనుక్కొని రూ. 1300 చెల్లించాం. ఇప్పుడు మోసమని తెలిసింది కనుక ఆర్గనైజర్ల దగ్గరి నుంచి మాకు డబ్బులు ఇప్పించాలి. -
లక్కీ డ్రాలో అనంతవాసికి ‘ఆడీకారు’
అనంతపురం రూరల్ : హైదరాబాద్‌లోని ఫోరం మాల్లో శనివారం రాత్రి తీసిన లక్కి డ్రాలో అనంతపురం రూరల్ మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన పుల్లలరేవు నమ్రతను అదృష్టం వరించింది. లక్కీడ్రాలో రూ.33 లక్షల విలువ చేసే ఆడీ కారు తగిలింది. దీపావళి పండుగను పురస్కరించు కొని ఫోరం మాల్ నిర్వహకులు ప్రతి రూ.5 వేలు కొనుగోలుపై గిఫ్ట్ కూపన్లు అందజేశారు. రూ. 15 వేలు విలువ చేసే టీవీని కొనుగోలు చేసిన నమ్రతాకు లక్కీడ్రాలో ఆడీ కారును సొంతం చేసుకుంది. ఆడీ కారును తన తండ్రికి బహుమతిగా అందజేస్తానని నమ్రత తెలిపింది. -
మీ ఫోన్ నంబర్ లక్కీడ్రాలో గెలిచిందని..
కడ్తాల్ : 'మీ సెల్ నెంబర్ లక్కీడ్రాలో గెలిచిందని, రూ.16వేల సెల్‌ఫోన్‌ను రూ.3500కు ఇస్తాం' అని నమ్మించి హరికృష్ణ అనే యువకుడిని మోసం చేశారు. ఈ ఘటన కడ్తాల్ మండలంలోని కర్కల్‌పహడ్ పంచాయితీ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుడు హరికృష్ణ తెలిపిన ప్రకారం.. పదిహేను రోజుల కిందట గుర్తుతెలియని వ్యక్తికి చెందిన సెల్ ఫోన్ నెంబర్ల నుండి, తనకు కాల్ వచ్చిందని చెప్పాడు. తాము నిర్వహించిన లక్కీడ్రాలో మీ సెల్ నెంబర్ గెలుపొందిందని, రూ. 16వేల విలువ గల శాంసంగ్ జే7 ఫోన్‌ను కేవలం రూ.3500కే పార్శీలు ద్వారా పోస్టులో అందిస్తామని నమ్మబలికారు. హరికష్ణ తన పూర్తి చిరునామా, వివరాలు ఆ అజ్ఞాత వ్యక్తికి తెలిపి డబ్బులు చెల్లించాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పార్శీలు వచ్చిందని సమాచారం రావడంతో కడ్తాల్ పోస్టాఫీస్‌కు వచ్చి డబ్బులు చెల్లించి పార్శీలు తీసుకున్నాడు. అది తెరిచి చూడగా.. సెల్‌ఫోన్ బదులుగా పూజ సామాగ్రి, లక్ష్మీదేవి విగ్రహం, ఓ పల్లెం, మెడల్ లాంటివి కనిపించడంతో షాక్ తిన్నాడు. తాను మోసానికి గురైనట్లు గమనించి స్థానిక పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరుతూ వారికి ఫిర్యాదు చేశాడు. తనతా మరెవరూ మోసపోవద్దని.. అపరిచిత కాల్స్‌పైన నిఘా ఉంచాలని, అనుమానం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాధితుడు హరికృష్ణ అవేదనతో చెప్పాడు. -
లక్కీ డ్రా పేరుతో ఫోన్ కాల్
ఫోన్‌కు బదులు దేవుడి వస్తువులు నార్తురాజుపాళెం (కొడవలూరు) : లక్కీ డ్రాలో బహుమతి గెలుపొందారని ఫోన్ కాల్‌తో ఎర వేసి రూ.4 వేలు కాజేసిన ఉదంతం నార్తురాజుపాళెంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఉయ్యాల మధుసూదన్‌రావుకు పది రోజుల క్రితం 85108 52576 నంబరు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాము ఢిల్లీలోని శ్యామ్‌సంగ్ కేర్ నుంచి మాట్లాడుతున్నామని, పూర్తి వివరాలు ఇస్తే పోస్టల్ ద్వారా రూ.15 వేలు విలువైన శ్యామ్‌సంగ్ జే–7 ఫోన్ పంపుతామని తెలిపారు. పార్శిల్ అందాక వారికి రూ.4 వేలు చెల్లించవచ్చని సూచించారు. పోస్టుద్వారా మధుసూదన్‌రావుకు ఒక పార్శిల్ రావడంతో డబ్బులు చెల్లించి తీసుకుని ఇంటికి వచ్చి ఆనందంగా తెరిచారు. అందులో బంగారు రంగు పూత వేసిన చిన్నచిన్న దేవుడి వస్తువులు ఉన్నాయి. తాను మోసపోయినట్లు గ్రహించి పోలీసుల దృష్టికి తీసుకుపోయారు. -
స్మార్ట్‌ఫోన్ పేరుతో బురిడీ
శింగనమల : ‘‘మీఫోన్ నంబరు లక్కీ డ్రీలో ఎంపికైంది. మీకు స్యామ్సంగ్ స్మార్ట్‌ఫోన్ ,రెండు గ్రాముల బంగారం, కూపన్, వవీడియోకాన్ వాషింగ్ మిషన్ తగిలాయి. మీ అడ్రసు చెబితే మీకు పంపిస్తాం’’ అని నమ్మబలుకుతూ ఆ స్థానంలో వేరే వస్తువులను పోస్టాఫీసుకు పంపించి అమాయకులను లూఠీ చేస్తోంది హ్యాపీ లైవ్ కేర్. శింగనమల మండలంలో ఐదుగురు ఈ సంస్థ బారిన పడి డబ్బులు పొగొట్టుకోవడంతో వారు లబోదిబోమంటున్నారు. శింగనమలకు చెందిన ఆటో డ్రైవరు ఆంజినేయులు, రైతు షెక్షావలిలకు 9966030751, 9391549692 నెంబర్ల నుంచి కాల్స్ వచ్చాయి. మీ ఫోన్ నంబరు లక్కీడ్రాలో గెలుపొందిందని, మీకు 7 వస్తువులు పంపుతామని అడ్రసు తీసుకున్నారు. సెల్‌ఫోన్ అనడంతో వీళ్లు కూడా అడ్రసులు ఇచ్చారు. వారి పేర్ల మీద పోస్టాఫీసులకు బాక్స్‌లు పంపించారు. ముందుగా రూ.3350 చెల్లిస్తేనే బాక్స్‌లు మీకు అందుతాయని సిబ్బంది చెప్పడంతో ఆ డబ్బు చెల్లించా తీసుకున్నారు. తీరా బాక్స్‌లను ఓపెన్ చేసి చూస్తే అందులో చార్జర్, ఫేస్ క్రీంలు ఉండటంతో అవాక్కయారు. గతంలో వచ్చిన ఫోన్ నంబర్లుకు ఫోన్‌చేస్తే బాక్స్‌లు మారాయని, మేనేజరు లేడని సమాధానం రావడం, లేకుంటే కాల్ కట్ చేయడం వంటికి జరగడంతో తాము మోసపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాక్స్‌లపై హ్యాపీ లైఫ్ కేర్, 5, 18వ తూర్పు రోడ్డు , గాంధీనగర్, కాట్పాడి, వేలూరు,తమిళనాడు అనే అడ్రసు ఉంది. -
సైబర్ నేరగాళ్ల ‘డబుల్ ధమాకా’!
► లక్కీ డ్రా పేరుతో కొంత మొత్తం స్వాహా ► అది తిరిగి ఇస్తామంటూ మరికొంత కాజేత ► నిందితుడిని అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ కాప్స్ సాక్షి, సిటీబ్యూరో: ఈ–మెయిల్స్, ఎస్సెమ్మెస్, ఫోన్‌కాల్సే పెట్టుబడిగా రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు నానాటికీ తెలివి మీరుతున్నారు. లక్కీ డ్రాల పేరుతో కొందరు అందినకాడికి దండుకొని టోకరా వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి భిన్నంగా ‘డబుల్ ధమాకా’ ఇస్తున్నారు మరికొందరు సైబర్ క్రిమినల్స్. మొదట కొంత డబ్బు దండకోవడం, దాన్ని తిరిగి ఇస్తామంటూ మరికొంత కాజేస్తున్న ఘరానా నేరగాడిని సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసినట్లు డీసీపీ అవినాష్ మహంతి సోమవారం వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సందీప్ సహోతా ఆ రాష్ట్రంలోని వైశాలి ప్రాంతంలో స్థిరపడ్డాడు. పెరల్ పార్క్ సమీపంలో సాండ్స్ ఇన్ఫోసిస్టమ్స్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి కొత్త మోసానికి తెరలేపాడు. ‘లక్కీ’లోనూ వెరైటీ... వివిధ మార్గాల్లో సెల్‌ఫోన్ వినియోగదారుల డేటా సేకరించే ఇతగాడు లక్కీ డ్రా పేరుతో ఫోన్లు చేస్తుంటాడు. సాధారణంగా ఈ తరహాలో ఫోన్లు చేసే నేరగాళ్లు లక్కీ డ్రా తలిగిలిందని, దాన్ని పొండానికి పన్నులు చెల్లించాలని చెప్పి కాజేస్తుంటారు. అయితే సందీప్ రూటే సెపరేటు. వినియోగదారులకు ఫోన్ చేసి ఆన్లైన్లో సాండ్స్ షాపింగ్ హబ్.కామ్ పేరుతో వెబ్సైట్ నిర్వహిస్తున్నామని చెప్తాడు. లక్కీ డ్రాలో మీ నెంబర్ ఎంపికైందంటూనే... ఎలాంటి పన్నుల మాట ఎత్తడు. ‘లక్కీ’ అయిన నేపథ్యంలో మా వెబ్సైట్లో ఉండే ఎలక్ట్రానిక్ వస్తువుల్ని 60 నుంచి 70 శాతం డిస్కౌంట్‌కు ఇస్తామంటాడు. ఎలాంటి వడ్డీ లేకుండా నెలసరి వాయిదాలకూ అవకాశం అంటూ నమ్మబలుకుతాడు. దీంతో కొందరు వినియోగదాడులు అతడి బుట్టలో పడతారు. సందీప్ ఇదే పంథాలో దేశ వ్యాప్తంగా మోసాలు చేస్తున్నాడు. రెండు దఫాల్లో అందినంత... నగరంలోని బేగంబజార్ ప్రాంతానికి చెందిన ధర్మేంద్ర తివారీకి కాల్ చేసిన సందీప్ ఇదే పంథాలో ఎర వేశాడు. తివారీ ఆసక్తి చూపడంతో డెబిట్‌కార్డ్ వివరాలు తెలపాలని కోరి రూ.13,999 అప్పటికప్పుడే కాజేశాడు. కొద్దిసేపటికి మళ్లీ కాల్ చేసిన సందీప్... మొదటి బుకింగ్ రద్దు చేసి, నగదు తిరిగి జమ చేస్తామన్నాడు. దీనికోసం మీ సెల్ ఫోన్‌కు వచ్చే వన్ టైమ్ పాస్వర్డ్ చెప్పాలనడంతో ఆయన అలానే చేశారు. దీంతో రెండోసారి ఏకంగా రూ.54,996 కాజేశాడు. మోసపోయినట్లు గుర్తించిన తివారీ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీపీ కేసీఎస్ రఘువీర్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ దర్యాప్తు చేసి నిందితుడు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించి అక్కడకు వెళ్లి అరెస్టు చేశారు. ఇతడి నుంచి రూ.1.5 లక్షల నగదు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. సందీప్‌ను పీటీ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు. -
లక్కీ డ్రా పేరిట లక్షల్లో టోకరా
హైదరాబాద్ : లక్కీ డ్రాలో భారీగా నగదు గెలుచుకున్నారంటూ అమాయకుల నుంచి లక్షల్లో దండుకుంటున్న ఇద్దరు నేరగాళ్లను నగర పోలీసులు ఘజియాబాద్ నుంచి ట్రాన్సిట్ వారెంట్‌పై శనివారం నగరానికి తీసుకొచ్చారు. సీసీఎస్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్ డీసీపీ అవినాశ్ మహంతి కథనం ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌కు చెందిన రోహిత్ శర్మ అలియాస్ రాహుల్ అలియాస్ చావ్లా, న్యూఢిల్లీకి చెందిన మయాంక్ గుప్తా అలియాస్ వికాస్ మిట్టల్ అలియాస్ సమీర్ గుప్తా ముఠాగా ఏర్పడ్డారు. ఇద్దరూ కలిసి వివిధ ఏజన్సీల నుంచి కొందరు వినియోగదారుల డేటా సేకరించి పెట్టుకుంటారు. ఆ తర్వాత వారికి కాల్ చేసి భారీ నగదుతో కూడిన లక్కీ డ్రా గెలుచుకున్నారని మాటలతో బురిడీ కొట్టిస్తారు. అయితే ఆ డబ్బు తీసుకోవాలనుకుంటే ఇన్‌కం ట్యాక్స్, ప్రాసెసింగ్ ఫీజు, ట్యాక్స్ చార్జ్‌ల కోసం కొంత డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని నమ్మిస్తారు. ఇది నమ్మిన కొంతమంది అమాయకులు వారిచ్చిన బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమచేస్తారు. కోటి రూపాయల ఆశ చూపి లక్షల్లో దండుకుంటారు. ఇలానే గతేడాది నవంబర్ ఒకటో తేదీన పంజాగుట్టకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఎల్లయ్యకు డిసెంబర్లో హోం షిప్పింగ్ -18 సంస్థ నుంచి ఫోన్‌కాల్ చేసి టీవీ గిఫ్ట్‌గా గెలుచుకున్నారని చెప్పారు. మరో వారం తర్వాత ఫోన్ చేసి రూ. 5.64 లక్షలు గెలుచుకున్నారని నమ్మించారు. అప్పటి నుంచి అతని నుంచి పలుదఫాలుగా తమ ఖాతాల్లో రూ.4,15,800 జమ చేయించుకున్నారు. ఆ తర్వాత నుంచి వాళ్లు ఫోన్లో అందుబాటులో లేకపోవటంతో మోసం గ్రహించిన ఎల్లయ్య మే 30న సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడిచ్చిన బ్యాంక్ ఖాతాల ఆధారంగా ఘజియాబాద్‌కు వెళ్లి నిందితులను ట్రాన్సిట్ వారెంట్‌పై నగరానికి తీసుకొచ్చారు. -
లక్కీ డ్రా పేరుతో రూ.5 లక్షలకు టోకరా
హైదరాబాద్ : లక్కీ డ్రాలో బహుమతి తగిలిందని ఫోన్లు చేస్తూ అమాయకులకు ఎరవేసి అందినకాడికి దండుకుంటున్న పశ్చిమ బెంగాల్ వాసిని సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ అవినాష్ మహంతి వెల్లడించిన వివరాల ప్రకారం.. నగరంలోని సత్తార్‌బాగ్‌కు చెందిన జమీలా బేగంకు 00923040019476, 00923366994426, 00923066379229 నంబర్ల నుంచి ఇటీవల కొందరు వ్యక్తులు ఫోన్ చేశారు. తాము రంజేష్, బాలాజీ, ప్రతాప్‌సింగ్, శిరీష్ పాండేలుగా పరిచయం చేసుకున్నారు. ఎయిర్టెల్ లక్కీ డ్రాలో ఆమె ఫోన్ నంబర్ ఎంపికైందని, రూ.25 లక్షలు బహుమతిగా వచ్చాయని చెప్పారు. జమీలా బేగం వారి మాటలను న మ్మింది. వారు చెప్పినట్లుగా ప్రాసెసింగ్ ఫీజులు, పన్నులు, ఇతర చార్జీల పేరుతో రూ.5 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఆపై వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ సాంకేతిక ఆధారాలను బట్టి కోల్‌కతాకు చెందిన చరణ్‌జిత్ దాస్ నిందితుడిగా గుర్తించారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం దాస్‌ను అరెస్టు చేసి పీటీ వారెంట్‌పై శుక్రవారం హైదరాబాద్‌కు తీసుకువచ్చింది. -
రూ.50 పన్నుకడితే.. బంపర్ ఆఫర్
హైదరాబాద్: జీహెచ్ఎంసీ లక్కీ డ్రా ఆఫర్లో భాగంగా రూ. 50 ఆస్తిపన్ను బకాయి చెల్లించిన ఓ పౌరుడికి లక్ష రూపాయల బంపర్ ప్రైజ్ వరించింది. మల్కాజిగిరి సర్కిల్లోని నేరెడ్మెట్ కాకతీయనగర్‌కు చెందిన జి. బాపిరెడ్డి రూ.100 రూపాయల పన్నుకు గాను మొదటి విడత బకాయి కింద రూ. 50 చెల్లించారు. మే నెల 29, 30,31 తేదీల్లో ఆస్తిపన్ను చెల్లించిన వారికి బుధవారం సాయంత్రం లక్కీడ్రా నిర్వహించారు. ఇందులో బంపర్ ప్రైజ్ కింద లక్ష రూపాయల బహుమతికి బాపిరెడ్డి ఎంపికయ్యారు. మొదటి బహుమతి రూ. 50 వేలు సైతం రూ. 101 చెల్లించిన ఆబిడ్స్ కు చెందిన పి. ఆశకు దక్కింది. రెండో బహుమతిగా రూ. 25 వేల వంతున గెలుచుకున్న ఇద్దరిలో చార్మినార్ సర్కిల్ కు చెందిన ఎం. సునీత, ఖైరతాబాద్ (సర్కిల్ 10ఎ) ఎల్లారెడ్డిగూడకు చెందిన ఓ వ్యక్తి ఉన్నారు. రూ.10 వేల చొప్పున మూడో బహుమతి ఐదుగురికి, రూ. 5 వేల చొప్పున నాలుగో బహుమతి పది మందికి, రూ. 2 వేల చొప్పున కన్సొలేషన్ బహుమతులు వందమందికి గాను ఆన్లైన్లో ర్యాండమైజేషన్ ద్వారా డ్రా తీశారు. మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కమిషనర్ డా.జనార్దన్‌రెడ్డిలు ల క్కీడ్రాలో విజేతల పేర్లు ప్రకటించారు. వారం వారం లక్కీ డ్రా వార్షిక సంవత్సరం ఆరంభంలోనే మొత్తం ఆస్తిపన్ను చెల్లించే అలవాటును పెంపొందించేందుకు గాను జూన్ నెలలో వారం వారం లక్కీ డ్రా నిర్వహించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. జూన్ 1 నుంచి 7వ తేదీ లోగా ఆస్తిపన్ను చెల్లించిన వారికి 8వ తేదీన లక్కీ డ్రా నిర్వహించనున్నారు. డ్రా ద్వారా బంపర్ బహుమతిగా లక్షరూపాయలతో పాటు 25,000 , 12,500, 5000, 1000 రూపాయల చొప్పున బహుమతులందజేయనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. . -
లక్కీడ్రాలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చింది!
బంజారాహిల్స్ : లక్కీడ్రాలో ఎంపిక అయ్యారని, మొబైల్ ఫోన్ పంపిస్తున్నామంటూ బురిడీ కొట్టించి అల్లం వెల్లుల్లి పేస్టును అంటగట్టిన ఉదంతం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఫిలింనగర్‌లోని అపోలో ఆస్పత్రి వద్ద ఆటో నడుపుతూ జీవనం సాగించే రాజు అనే యువకుడికి వారం క్రితం తెలియని నెంబరు నుంచి ఫోన్ వచ్చింది. హిమాలయ హెర్బల్ ఆయుర్వేదిక్ కంపెనీ ప్రతినిధినంటూ ఓ వ్యక్తి అతనితో మాట్లాడాడు. సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిర్వహించిన లక్కీడ్రాలో రాజు ఫోన్ నంబర్ సెలక్ట్ అయిందని, బహుమతిగా ఒక మొబైల్ ఫోన్ పంపుతున్నామని చెప్పాడు. అడ్రస్ అడిగి తీసుకున్నాడు. పార్శిల్ వచ్చిన తర్వాత రూ. 2625 చెల్లిస్తే సరిపోతుందని తెలిపాడు. శుక్రవారం నాడు రాజుకు పోస్టాఫీస్ నుంచి పార్శిల్ వచ్చింది. చెప్పినట్టే రూ.2625 చెల్లించి పార్శిల్ తీసుకున్నాడు. దానిని ఓపెన్ చేసి చూడగా అల్లం వెల్లుల్లి పేస్టుతో పాటు పనికిరాని సామగ్రి కనిపించింది. దీంతో మోసపోయినట్లు గ్రహించిన రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
లక్కీ డ్రాలో బంగారం వచ్చిందంటూ..
రామాయంపేట (మెదక్): 'లక్కీ డ్రాలో మీ సెల్ నెంబర్‌కు బంగారం వచ్చింది' అంటూ కాల్ చేసి ఓ యువకుడిని మోసం చేశారు ఆన్లైన్ కేటుగాళ్లు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన ఓబాజ భూపాల్‌కు ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేశారు. మీ సెల్ నెంబర్‌కు లక్కీ డ్రాలో రూ. 6 వేల విలువైన బంగారం తగిలిందని చెప్పారు. కేవలం పోస్టల్ చార్జీలు రూ.640 చెల్లిస్తే సరిపోతుందని.. పార్శిల్ కవరు వచ్చిన తరువాతనే డబ్బులు చెల్లించాలని చెప్పగా భూపాల్ అంగీకరించాడు. నాలుగైదు రోజుల అనంతరం పార్శిల్ రాగా భూపాల్ డబ్బు చెల్లించి విప్పి చూడగా అందులో 20 రూపాయల విలువ చేసే పూసల దండ మాత్రమే ఉంది. దీంతో భాదితుడు అవాక్కయ్యాడు. కాగా ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక ఎస్ఐ నాగార్జునగౌడ్ తెలిపారు. -
అదృష్టం వరించింది..
- 27 దుకాణాలకు సింగిల్ దరఖాస్తులు - రాత్రి వరకు సాగిన లక్కీడ్రా - బినామీలతో టెండర్లు వేసిన వైనం - ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలి - కలెక్టర్ జగన్మోహన్ ఆదిలాబాద్ క్రైం : ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూసిన వారిలో అదృష్టవంతులు ఎవరనేది వెల్లడైంది. జిల్లాలోని 158 మద్యం దుకాణాలకు నిర్వహించిన టెండర్ల విజేతలను బుధవారం ప్రకటించారు. ఆదిలాబాద్‌లోని జనార్దన్‌రెడ్డి గార్డెన్స్‌లో మద్యం దుకాణాలకు లక్కీ డ్రా నిర్వహించారు. ఈ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. లక్కీ డ్రాను ప్రారంభించిన అనంతరం కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ మద్యం టెండర్ల ప్రక్రియల్లో ప్రభుత్వానికి సహకరించి ఆదాయం పెంచేందుకు కృషి చేయాలని అన్నారు. టెండర్‌దారులు సిండికేట్, మామూళ్ల పద్ధతిని రూపుమాపి మద్యం దుకాణాల ద్వారా ఆదాయం సమకూర్చాలని చెప్పారు. జిల్లాలో కల్తీ విక్రయాలు జరగకుండా నిరోధించాలని పేర్కొన్నారు. కల్తీ కల్లు వల్ల ప్రజల ప్రాణాలకే ముప్పు ఉందని, దీనిపై అధికారులు దృష్టి సారించి కల్తీ కల్లు విక్రయాలు జరగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం సంయుక్త కలెక్టర్ సుందర్ అబ్నార్ టోకెన్ నెంబర్ తీసి మొదటి లక్కీ విజేతను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శివరాజ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు అనిత, శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా 62 దరఖాస్తులు వచ్చిన బెజ్జూర్ మద్యం దుకాణం లక్కీ డ్రాలో కాగజ్‌నగర్‌కు చెందిన బి.ప్రకాశ్‌కు దక్కింది. ఆదిలాబాద్ పట్టణంలో అత్యధికంగా దరఖాస్తులు వచ్చిన షాప్ నెంబర్-2ను సోనాలకు చెందిన సి.భోజారెడ్డి దక్కించుకున్నారు. ఈ దుకాణానికి 47 దరఖాస్తులు రాగా స్థానికేతరుడిని అదృష్టం వరించింది. పట్టణంలోని షాప్-1 అల్లూరి నాగార్జునరెడ్డి, షాప్-3 అల్లూరి రమేశ్‌రెడ్డి, షాప్-4 మనోహర్‌రావు, షాప్-5 కొరటాల రమేశ్, షాప్-6 మంజూల దక్కించుకున్నారు. బేలలోని షాప్-7 మెదక్ జిల్లా సంగారెడ్డికి చెందిన నవీన్‌రెడ్డి సొంతం చేసుకున్నారు. ఆదిలాబాద్ యూనిట్ పరిధిలో 8, మంచిర్యాల యూనిట్ పరిధిలో 19 సింగిల్ దరఖాస్తులు వచ్చాయి. దుకాణాలు దక్కించుకున్న వారి నుంచి 1/6 వంతుగా ఫీజు తీసుకున్నారు. బినామీల జోరు జిల్లా వ్యాప్తంగా 156 మద్యం దుకాణాలకు 1,541 దరఖాస్తులు వచ్చాయి. కొంతమంది వ్యాపారులు ఒక్కొక్కరు ఐదు నుంచి పది వరకు దరఖాస్తులు వేసినట్లు తెలుస్తోంది. బినామీ పేర్లపై టెండర్ వేసి దుకాణాలు దక్కించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో మద్యం దుకాణం దక్కించుకున్న వారే ఈసారి కూడా ఎలాగైనా దక్కించుకుకోవాలనే ఉద్దేశంతో తన అనుచరులతోపాటు, ఇతర ప్రాంతాల్లో ఉన్న బంధువులతో కూడా టెండర్ వేసినట్లు తెలుస్తోంది. కొంతమంది వ్యాపారులు ముందే సిండికేట్‌గా ఏర్పడి పది మంది కలిసి ఒకే దుకాణానికి దరఖాస్తు వేసుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ దుకాణానికి 20 దరఖాస్తులు రాగా అందులో బినామీ పేర్లతో వేసిన వ్యాపారులకు కాకుండా.. ఒకే ఒక్క దరఖాస్తు చేసుకున్న టెండర్‌దారుడికి దుకాణం దక్కినట్లు సమాచారం. అధికార పార్టీ నాయకులతోపాటు ఇతర పార్టీల రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు సిండికేట్ వ్యవహారానికి తెరలేపినట్లు తెలుస్తోంది. మద్యం దుకాణాలు దక్కించుకున్న వారితో రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. -
లాటరీ పేరుతో మోసం
దహెగాం : లక్కీ డ్రాపేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేసిన సంఘటన దహెగాం మండలంలోని కేస్లాపూర్లో వెలుగుచూసిది. స్కీం నిర్వాహకుల చేతిలో మోసపోయినట్లు గ్రహించిన కేస్లాపూర్ గ్రామస్తులు పలువురు సోమవారం పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం ప్రకారం... మండలంలోని బీబ్రా గ్రామానికి చెందిన పాషా కొద్దిరోజుల క్రితం లక్కీ స్కీం నిర్వహించాడు. పలు గ్రామాల్లో ఏజెంట్లను నియమించాడు. ప్రతీ వారం రూ.100 వంతున 20 వారాలు చెల్లించాలని, వారవారం నిర్వహించే డ్రాలో మోటార్‌సైకిల్, రిఫ్రిజిరేటర్, ఎల్సీడీ టీవీ లాంటి విలువైన బహుమతులు అందజేస్తామని చెప్పాడు. సుమారు 2 వేల మందిని సభ్యులుగా చేర్చుకున్నాడు. 20 వారాలు వాయిదా కట్టినా ఎలాంటి వస్తువులు అందజేయకపోవడంతో డబ్బులు చెల్లించిన వారు స్కీం నిర్వాహకుడితోపాటు ఏజెంట్లను పలుమార్లు అడిగారు. అడిగిన ప్రతిసారీ ఇవ్వాళ, రేపు అంటూ కాలం వెల్లదీస్తుండడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేస్లాపూర్‌కు చెందిన బొడ్డు రాంచందర్, చునార్కర్ మల్లయ్య, తదితరులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై పోలీసులను సంప్రదించగా.. తమకెలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొనడం గమనార్హం. -
లక్కున్న వారికే కిక్కు..!
కర్నూలు : లక్కున్న వారికే కిక్కు దక్కింది. జిల్లా పరిషత్ సమావేశ భవనంలో నిర్వహించిన లక్కీ డ్రాలో మద్యం వ్యాపారులు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి దగ్గరుండి లక్కీ డ్రాను ప్రారంభించారు. ఎక్సైజ్ ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ హేమంత్‌నాగరాజు, సూపరింటెండెంట్లు సుర్జీత్ సింగ్, హనుమంతరావుతో పాటు ఏజేసీ అశోక్‌కుమార్, డీఆర్ఓ వేణుగోపాల్ రెడ్డి టెండర్ల ప్రక్రియను కొనసాగించారు. దరఖాస్తులు చేసుకున్న వారు శనివారం ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో జిల్లా పరిషత్ వద్దకు చేరుకున్నారు. పోలీసులు మెటల్ డిటెక్టర్ ద్వారా తనిఖీలు నిర్వహించి పాస్ ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా కర్నూలు డీఎస్పీ మనోహర్‌రావు పర్యవేక్షణలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ రాత్రి పొద్దు పోయే వరకు కొనసాగింది. జిల్లాలో 194 మద్యం దుకాణాలకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించగా 180 దుకాణాలకు 1801 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో 28 మద్యం దుకాణాలకు సింగిల్ దరఖాస్తులు నమోదయ్యాయి. మరో ఏడు మద్యం దుకాణాలకు రెండేసి దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మూడు దరఖాస్తులు వచ్చిన దుకాణాలు ఏడు ఉన్నాయి. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రతి దుకాణానికి ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 180 మద్యం దుకాణాల ద్వారా లెసైన్స్ ఫీజు, దరఖాస్తు రుసుం, పర్మిట్ రూం ఫీజు కలిపి మొత్తం ఎక్సైజ్ శాఖకు ఈ ఏడాది రూ. 73.6 కోట్లు ఆదాయం సమకూరింది. లక్కీ డిప్లో దుకాణాలు దక్కించుకున్న వెంటనే డబ్బు చెల్లించేందుకు ప్రత్యేకంగా బ్యాంకు కౌంటర్‌ను పక్కనే అధికారులు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది 42 మంది మహిళలు పోటీ పడి తొమ్మిది మంది దుకాణాలు దక్కించుకున్నారు. మద్యం వ్యాపారంతో సంబంధం లేని వారికి కర్నూలు, కోడుమూరుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో లక్కీ డిప్ ద్వారా దుకాణాలు దక్కాయి. వాటిని పాత వ్యాపారులే నిర్వహించేందుకు గుడ్‌విల్ పద్ధతిలో బేర సారాలు సాగుతున్నాయి. జిల్లాలోని సంత జూటూరు దుకాణానికి అత్యధికంగా 41 దరఖాస్తులు దాఖలు చేసి వ్యాపారులు పోటీ పడ్డారు. అదే గ్రామానికి చెందిన శంకర్‌రెడ్డిని అదృష్టం వరించింది. రెండో స్థానంలో రుద్రవరం దుకాణానికి 40 దరఖాస్తులు దాఖలయ్యాయి. కర్నూలులో నాల్గవ నంబర్ దుకాణానికి 34 మంది దరఖాస్తు చేసి పోటీ పడ్డారు. 14 దుకాణాలకు మళ్లీ టెండర్లు... జిల్లాలో గతేడాదితో పోలిస్తే దరఖాస్తులు రాని దుకాణాల సంఖ్య తగ్గింది. గతేడాది 20 దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఈ ఏడాది 14 దుకాణాలకు మాత్రమే దరఖాస్తులు రాలేదు. దరఖాస్తులు రాని దుకాణాల విషయంలో వ్యాపారులు సిండికేట్ అయి ఉండవచ్చునని తెలుస్తోంది. వాటికి త్వరలో టెండర్లు నిర్వహిస్తామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ప్రకటించారు. చర్చనీయాంశంగా మారిన హోలోగ్రామ్ బిల్లింగ్... మద్యం వ్యాపారులు హోలోగ్రామ్ బిల్లింగ్ విధానం తప్పనిసరిగా అమలు చేయాలని నిబంధన విధించారు. ఈ విధానం అమలుకు అవసరమైన పరికరాలను సమకూర్చుకున్న తర్వాతనే మద్యం స్టాకు ఇస్తారు. ప్రతి సీసాపై ఒక స్టిక్కర్‌ను అతికిస్తారు. ఫలితంగా ఆయా మద్యం బాటిళ్లు బెల్టు దుకాణాలకు వెళ్లినా, కలుషితం జరిగినా వెంటనే ఆయా బాటిళ్లు ఎక్కడ విక్రయించారన్న విషయం సునాయాసంగా తెలుస్తోంది -
ముగిసిన లక్కీడ్రా..
మద్యం దుకాణాల కోసం పోటీపడ్డ మహిళలు మొదటి దఫా లెసైన్స్ ఫీజు రూపంలో రూ.104.33 కోట్లు దరఖాస్తులు రాని వాటికి మరో అవకాశం జిల్లాలోని మద్యం దుకాణాల కేటారుుంపు కోసం సోమవారం లక్కీ డ్రా నిర్వహించారు. 291 దుకాణాలకు 1,924 దరఖాస్తులు రాగా.. ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ మొదటి లక్కీడ్రా తీసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు వ్యాపారులు ఉత్సాహంగా పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మహిళలు సైతం మద్యం దుకాణాలు దక్కించుకోవడానికి పోటీపడ్డారు. కరీంనగర్ క్రైం : జిల్లాలో 304 మద్యం దుకాణాలుండగా.. వీటిలో కరీంనగర్ యూనిట్లో 113 మద్యం దుకాణాలు, జగిత్యాల యూనిట్లో 102, గోదావరిఖని యూనిట్లో 89 దుకాణాన్నాయి. వీటికి ఈ నెల 16న నోటిఫికేషన్ జారీచేయగా.. 21న సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఒక్క దుకాణానికి దరఖాస్తు చేసుకోవడానికి రూ.25 వేలుగా ధర నిర్ణయించారు. 291 దుకాణాలకు 1,924 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 59దుకాణాలకు సింగిల్ టెండర్లు దాఖలు కాగా.. అత్యధికంగా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో ఉన్న షాప్‌కు 40, మంథనిలోని షాప్ నంబర్ 210కి 38 దరఖాస్తులు వచ్చాయి. గతేడాది 4395 దరఖాస్తులు రాగా.. ఈసారి అందులో సగం కూడా రాలేదు. కరీంనగర్ యూనిట్లో పరిధిలో 113 దుకాణాలకుగాను 107 దుకాణాలకు 583 దరఖాస్తులు రాగా.. వీటిలో 28దుకాణాలకు సింగిల్ టెండర్లు వచ్చాయి. జగిత్యాల యూనిట్ పరిధిలో 102దుకాణాలకు 101 దుకాణాలకు 701 దరఖాస్తులు వచ్చాయి. రాయికల్ మండలం ఇటిక్యాల దుకాణానికి ఒక్క దరఖాస్తు రాలేదు. వీటిలో 15 దుకాణాలకు సింగిల్ దరఖాస్తులు వచ్చాయి. గోదావరిఖని యూనిట్లో 89దుకాణాలుండగా.. వాటిలో 83దుకాణాలకు 640 దరఖాస్తులు రాగా.. వీటిలో 16 దుకాణాలకు సింగిల్ దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులు రాని దుకాణాలివే.. జిల్లా వ్యాప్తంగా 304 దుకాణాలకు గాను 291దుకాణాలకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. కరీంనగర్ యూనిట్ పరిధిలో జమ్మికుంటలో మూడు, కమలాపూర్‌లో అంబాల, హుజూరాబాద్ మండలం కందుగులపల్లి, హుజూరాబాద్ ఒకదానికి దరఖాస్తులు రాలేదు. జగిత్యాల యూనిట్ పరిధిలో రాయికల్ మండలంలోని ఇటిక్యాల దుకాణానికి, గోదావరిఖని పరిధిలో గోదావరిఖనిలో ఒకటి, గోదావరిఖని-2 టౌన్ పరిధిలో రెండు, పెద్దపల్లిలో రెండు, సుల్తానాబాద్‌లో ఒక దుకాణానికి టెండర్లు దాఖలుకాలేదు. దరఖాస్తులు రాని దుకాణాలకు ఈ నెల 26న మళ్లీ అవకాశముందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. పోటీపడ్డ మహిళలు... మద్యం దుకాణాలు దక్కించుకోవడానికి మహిళలు సైతం పోటీపడ్డారు. కరీంనగర్ యూనిట్లో 19 మంది మహిళలు దరఖాస్తులు చేయగా.. అందులో ఇద్దరు మద్యం దుకాణాలు దక్కించుకున్నారు. జగిత్యాల యూనిట్ పరిధిలో 16 మంది మహిళలు దరఖాస్తులు చేయగా.. ఇద్దరిని అదృష్టం వరించింది. భారీ ఏర్పాట్లు గతేడాది లక్కీడ్రా నిర్వహణ సందర్భంగా ఏర్పాట్లు సరిగా చేయకపోవడంతో దరఖాస్తుదారులు, అధికారులు ఇబ్బందులుపడ్డారు. గతానుభవాలు దృష్టిలో పెట్టుకుని ఈసారి భారీగా ఏర్పాట్లుచేశారు. ఆయా యూనిట్ల పరిధిలో దరఖాస్తుదారులకు ముందే సమయం నిర్ణయించడంతో ఇబ్బందులు తప్పారుు. దీంతో త్వరగా లక్కీడ్రా పూర్తయింది. మొదట సింగిల్ టెండర్లు ఉన్న వారిని పిలిచి షాపులు కేటాయించారు. అనంతరం రెండు టెండర్లు, మూడు టెండర్లు... ఇలా వరుసగా యూనిట్ ప్రకారం పిలిచి లక్కీడ్రా నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ శివకుమార్, ఎక్సైజ్ డీసీ వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు హాజరయ్యూరు. రూ.104.33 కోట్ల ఆదాయం జిల్లా వ్యాప్తంగా 291 దుకాణాలు దరఖాస్తులు దక్కించుకోవడంతో మొదటి దఫా చెల్లించే లెసైన్స్ రూపంలో ఎక్సైజ్‌శాఖకు రూ.104.33కోట్ల ఆదాయం సమకూరింది. లెసైన్స్ ఫీజులో ఒక వంతు భాగం వ్యాపారులు చెల్లించారు. దీంతో భారీగా ఆదాయం సమకూరింది. -
ఇక కిక్కే కిక్కు..
- లక్కీ విజేతలు ఖరారు.. - 149 షాపులకు 974 దరఖాస్తులు - 25 దుకాణాల వైపు చూడని వ్యాపారులు - సింగిల్ టెండర్లపై 35 దుకాణాలు - రాత్రి వరకూ కొనసాగిన లక్కీ డ్రా ఆదిలాబాద్ క్రైం : జిల్లాలోని 174 మద్యం దుకాణాలకు నిర్వహించిన టెండర్ల విజేతలను ప్రకటించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పి.జనార్దన్‌రెడ్డి గార్డెన్లో జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ ఎస్ఎస్ రాజ్ లక్కీడ్రా ప్రారంభించగా.. ప్రక్రియ రాత్రి వరకూ కొనసాగింది. టెండర్ దారులతో సందడి నెలకొంది. ఆదిలాబాద్ ఏఎస్పీ జోయల్‌డేవిస్, టూటౌన్ సీఐ నారాయణ భద్రతను పర్యవేక్షించారు. జిల్లాలోని 174 గాను 149 దుకాణాలకు అధికారులు టెండర్లు ఖరారు చేశారు. నూతన మద్యం పాలసీ ద్వారా మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించేందుకు ప్రభుత్వం ఈనెల 16 నుంచి దరఖాస్తులు స్వకరించింది. మొత్తం 174 దుకాణాలకు 974 దరఖాస్తులు దాఖలయ్యాయి. 25 దుకాణాల కోసం ఎవరూ ముందుకు రాలేదు. 149 దుకాణాల్లో 35 దుకాణాలకు ఒక్కో దరఖాస్తు రాగా 114 దుకాణాలకు పోటాపోటీగా టెండర్లు వేశారు. ఇదిలా ఉంటే.. మొదటి నుంచీ మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న వారికి కాకుండా కొత్తవారిని ఈసారి అదృష్టం వరించింది. బెజ్జూర్‌లోని మద్యం దుకాణానికి అత్యధికంగా 44 దరఖాస్తులు రాగా.. ఆదిలాబాద్‌లోని ఎన్టీఆర్ చౌక్‌లోని దుకాణానికి 42 వచ్చాయి. ఆదిలాబాద్ బస్టాండ్ వద్ద ఉన్న దుకాణానికి 32, ధస్నాపూర్లోని మద్యం దుకాణానికి 24 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 42 దరఖాస్తులు వచ్చిన ఎన్టీఆర్ చౌక్‌లోని మద్యం దుకాణాన్ని లాటరీ ద్వారా సుధావిలాస్రెడ్డి దక్కించుకున్నారు. జిల్లాలోనే అత్యధికంగా 44 దరఖాస్తులు వచ్చిన బెజ్జూరు దుకాణాన్ని సంతోష్జైస్వాల్ చేజిక్కించుకున్నారు. సింగిల్ టెండర్లు దక్కించుకున్న మహిళలు.. జిల్లాలోని 35 దుకాణాలకు సింగిల్ టెండర్లు దాఖలయ్యాయి. ఇందులో ఇద్దరు మహిళలకు అవకాశం దక్కింది. ఇచ్చోడ గెజిట్ నెం.57 షాపును ఎ.పార్వతి, ఆసిఫాబాద్ ఎక్స్‌రోడ్ గెజిట్ నెం.65 షాపును జాదవ్ విమలాబాయిలకు కేటాయించారు. టెండర్‌దారుల ఆందోళన కాగా.. లక్కీ డ్రా ప్రారంభమైన తర్వాత టెండర్‌దారులు ఆందోళనకు దిగారు. టెండర్ దక్కించుకున్న వారందరూ 1/3 వంతు డబ్బులు కట్టాలని అధికారులు ప్రకటించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి నిబంధనలు చెప్పలేదని, ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బులు కట్టాలని చెప్పడమేంటని ప్రశ్నించారు. ఎంతో దూరం నుంచి వచ్చిన తాము వెంట డబ్బు తెచ్చుకోలేదని చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. డబ్బులు తప్పనిసరిగా కట్టాల్సిందేనని తేల్చడంతో టెండర్‌దారులు ఇబ్బందులు పడ్డారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శివరాజ్, ఆదిలాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.అనిత, మంచిర్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
నేడు తెలంగాణలో మద్యం షాపుల లక్కి డ్రా
-
బహు‘మతులు’ పోతున్నాయ్..!!
రాయవరం, న్యూస్‌లైన్ :‘కంగ్రాట్స్.. మీ సెల్ నంబర్ మేము తీసిన లక్కీ డ్రాలో రూ.3.50 కోట్లు గెలుపొందింది. మీ పేరు, చిరునామా, మొబైల్ నంబర్, వృత్తి వివరాలు మాకు ఈ మెయిల్ చేయండి.’ ఇది ఒక సెల్‌ఫోన్ వినియోగదారుడికి వచ్చిన ఎస్ఎంఎస్. ‘వావ్.. మీరు కోకా-కోలా ప్రోమో ఇండియా/లండన్ నుంచి లక్ష పౌండ్లను గెల్చుకున్నారు. మీ వివరాలను ఈ మెయిల్ చేయండి.’ ఇది మరొక వినియోగదారుడికి వచ్చిన ఎస్ఎంఎస్. ఇలా రోజూ సెల్‌ఫోన్ వినియోగదారులకు ఏవేవో బహుమతులంటూ ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. ఆ మాయలో పడితే అంతే.. బహుమతుల పేరుతో వస్తున్న మెసేజ్‌లకు ఆకర్షితులైతే చేతి చమురు వదుల్చుకోవలసిందే. మనం ఫోన్ చేసినా..మెసేజ్ ఇచ్చినా.. మెయిల్ పంపినా.. వెంటనే ‘మీ బ్యాంకు ఖాతా నంబర్ తెలపండి. మీరు గెలుపొందిన సొమ్మును ఆ ఖాతాలో వేస్తాం’ అంటూ మరో మెసేజ్ వస్తుంది. అలాగే రూ. పదివేలు ప్రోసెసింగ్ చార్జీలుగా చెల్లించండంటూ మెసేజ్ పెడుతున్నారు. రూ. కోట్లు వస్తుంటే, రూ. 10వేలు ఇస్తే పోయేదేమిటని భావించి కొందరు సొమ్ము చెల్లించి మోసపోతున్నారు. ఇలా పలువురు వినియోగదారులకు నిత్యం మెసేజ్‌లు వస్తున్నాయి. తార్కికంగా ఆలోచించే వారు ఇది మోసమని గ్రహించి ఊరుకుంటున్నారు. కొందరు మాత్రం ఏదో ఆశతో ముందుకెళ్లి చేతిచమురు వదిలించుకుంటున్నారు. డబ్బు పోగొట్టుకున్న వారు బయటకు తెలిస్తే పరువు పోతుందని మిన్నకుండిపోతున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ‘వెంకటేష్ ఎవరు? నటుడా? లేక క్రికెటరా? మీ సమాధానం పంపించి మేమిచ్చే బహుమతి అందుకోండి.’ ‘జుట్టు రాలుతోందా? కంప్యూటర్ ద్వారా తక్కువ ఖర్చుతో నయం చేసుకోండి. ఈ నంబరుకు ఫోన్ చేయండి.’ ‘మీకు మీ జీవిత భాగస్వామితో ఎంత శాతం ప్రేమానుబంధం ఉందో తెలుసుకోవాలనుకుంటున్నా రా? అయితే మీ భాగస్వామి పేరు టైపు చేసి ఈ నంబరుకు ఎస్ఎంఎస్ చేయండి.’ ... ఇలా ఒకటీ రెండూ కాదు.. పలు రకాల ఎస్ఎంఎ స్లు వినియోగదారులకు వస్తున్నాయి. అలసి ఇంటికి వచ్చి భోజనం చేసేటపుడో, నిద్రకు ఉపక్రమించేటపుడో ఇవి వస్తున్నాయి. కొన్ని ఎస్ఎంఎస్లకు స్పందిస్తే సెల్ బ్యాలెన్స్ మటుమాయం అవుతోంది. బీమా కంపెనీలూ అంతే.. ప్రైవేటు బీమా కంపెనీలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. ‘హలో..ప్రసాద్‌గారూ ఈ రోజు 20 మంది లక్కీడీప్ విజేతలను ఎంపిక చేశాం. అందులో మీ సెల్ నంబర్ ఉంది. మీరు రాజమండ్రి వస్తే బహుమతి పట్టుకువెళ్లవచ్చు. అంటూ బీమా కంపెనీలు మెసేజ్‌లు పంపుతున్నాయి. తెలివైన వాళ్లు మేము ఏమైనా డబ్బు చెల్లించాలా? అని అడిగితే మేము ఒక బాండ్ ఇస్తాం. ప్రీమియం చెల్లిస్తే చాలని సమాధానం వస్తుంది. అలా అడగని అమాయకులు, నిరక్షరాస్యులు రాజమండ్రి, కాకినాడ వంటి నగరాలకు వెళ్లి డబ్బు నష్టపోతున్నారు. ఇది బీమా పాలసీలపెంపు కోసం ఇచ్చిన మెసేజ్ అని అక్కడికి వెళ్లాకే అర్థం అవుతోంది. మాచవరం లో ఒక కూలీకి ఇలాగే ఫోన్ రాగా రూ.వెయ్యి అప్పు చేసి రాజమండ్రి వెళ్లాడు. తీరా అక్కడ బీమా ప్రీమియం చెల్లించాలని చెప్పడంతో ఉసూరంటూ వెనుదిరిగాడు. మోసపోవద్దు.. లక్షలు, కోట్లు గెలుపొందారంటూ వచ్చే బోగస్ మెసేజ్‌లను నమ్మి మోసపోవద్దు. ఎవరికి వారు ప్రాక్టికల్‌గా ఆలోచించుకోవాలి. - గొలుగూరి వరలక్ష్మి, టెలికామ్ సలహా మండలి సభ్యురాలు, రాయవరం. అనవసర ఎస్ఎంఎస్లతో ఇబ్బందులు పడే వినియోగదారులు 1909 నంబరుకు డయల్ చేసి వాటిని నిలుపుదల చేసుకోవచ్చు. - ఎం.శివప్రసాద్‌రాజు, ఎస్డీఈ, బీఎస్ఎన్ఎల్ కార్యాలయం, రాజమండ్రి. -
లక్కీ డ్రా ద్వారా ఎంపీటీసీ అభ్యర్థి ఎంపిక
జఫర్‌గఢ్, న్యూస్‌లైన్ : ఎంపీటీసీ పదవికి పోటీ ఉండకూడదనే ఉద్దేశంతో గ్రామస్తులు లక్కీ డ్రా ద్వారా అభ్యర్థిని ఎంపిక చేశారు. జఫర్‌గఢ్ మండలంలోని తిమ్మంపేట, తమ్మడపల్లి(ఐ) గ్రామాలకు కలిపి ఒక్క ఎంపీటీసీ స్థానం ఉంది. అయితే ఇందులో తమ్మడపల్లి(ఐ) గ్రామం కంటే తిమ్మంపేటలోనే ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో తిమ్మంపేట గ్రా మం నుంచి వివిధ పార్టీలకు చెందిన ఐదుగురు అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఇందులో టీఆర్ఎస్ నుంచి మల్లం శ్రీనివాస్, టీఆర్ఎస్ రెబల్‌గా అబ్బరబోయిన నాగరాజు, బీజేపీ నుంచి ముస్కు వెంకన్న, టీడీపీ నుంచి అరే నాగయ్య, సీపీఎం తరపున ము స్కు కుమార్‌లు పోటీ చేస్తున్నారు. కాగా, తమ్మడపల్లి (ఐ) గ్రామం నుంచి కాంగ్రెస్ తరపున వాసం సత్యనారాయణ ఒక్కరే పోటీ చేస్తున్నారు. అయితే తమ గ్రామంలో ఎక్కువగా ఓటర్లు ఉన్నారని, ఎంపీటీసీ పదవి తమకే రావాలని గ్రామ పెద్దలు భావించారు. ఈ మేరకు అభ్యర్థులతో వారు లక్కీ డ్రా ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో గురువారం కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని పార్టీల నాయకులు, గ్రామపెద్ద లు తిమ్మంపేట నుంచి ఎంపీటీసీ స్థానానిక పోటీచేస్తున్న అభ్యర్థులను పిలిపించారు. లక్కీ డ్రా ద్వారా పేరును ఎంపిక చేస్తామని, డ్రాలో వచ్చిన పేరు వచ్చి న అభ్యర్థే బరిలో ఉండాలని వారికి సూచించారు. దీనికి అభ్యర్థులందరూ అంగీకరించడంతో పెద్దలు డ్రా తీశారు. డ్రాలో టీఆర్ఎస్ అభ్యర్థి మల్లం శ్రీనివా స్ ఎంపిక కావడంతో మిగతా వారు పోటీ నుంచి తప్పుకున్నారు. ఇతర అభ్యర్థులకు ఇప్పటివరకు అ యిన ఖర్చులను టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ ద్వారా గ్రామ పెద్దలు చెల్లించారు. డ్రాలో ఎంపికైన శ్రీనివాస్‌కే తిమ్మంపేట గ్రామస్తులందరూ ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. -
నమ్మితే అంతే!
సాక్షి, కడప: అరుణ్‌ప్రసాద్ సెల్‌ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ఓ ప్రముఖ కంపెనీ నిర్వహించిన లక్కీడ్రాలో రూ. 70వేలు తగిలిందని, ట్యాక్స్ రూపంలో రూ. 8వేలు డిపాజిట్ చేస్తే మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని అందులో ఉంటుంది. లక్కీడ్రా...70వేల రూపాయలు...ఆశతో రూ. 8వేలు అరుణ్‌ప్రసాద్ ఓ ఖాతాలో జమ చేశాడు. నెలలు గడుస్తున్నాయి.. ఇప్పటి వరకూ రూ. 70వేలు ఊసేలేదు. ఇది ఇప్పటి వరకూ జరుగుతూ వస్తున్న సెల్ మోసాలు. తాజాగా వారం రోజుల కిందట లక్ష్మిరెడ్డి మోపూరి అనే ఎన్ఆర్ఐ ఈ మెయిల్‌కు ఓ లెటరు వచ్చింది. 2009-12 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి లక్ష్మిరెడ్డి ఖాతాలో రూ. 5లక్షలు జమ కావాల్సి ఉందని, రూ. 12,362 చెల్లిస్తే మొత్తం సొమ్మును బ్యాంక్‌ఖాతాలో జమ చేసేందుకు ఆర్బీఐ గవర్నర్ రాజన్ నిర్ణయం తీసుకున్నట్లు ఓ లెటర్ వచ్చింది. దీంతో లెటర్లో ఉన్న మెయిల్‌కు లక్ష్మిరెడ్డి రూ. 12,362 చెల్లించారు. అయితే ఇప్పటి వరకూ రూ. 5లక్షల ఊసే లేదు. తాజాగా జరుగుతున్న ఆన్లైన్ మోసాలకు ఇదొక ఉదాహరణ. ఆన్లైన్ మోసాలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. లక్కీడ్రా తగిలిందని, ఫలానా అడ్రస్‌కు రావాలని చెప్పడం, అక్కడకు పోతే వారి కంపెనీకి సంబంధించిన ఇన్సూరెన్స్ వివరాలపై గంటపాటు కౌన్సెలింగ్ ఇచ్చి బిజినెస్ చేసుకోవడం కడప, ప్రొద్దుటూరులో జరుగుతోంది. అలాగే లక్కీడ్రాలో డబ్బులు తగిలినట్లు మెసేజ్‌లు రావడం, బాధితులు మోసపోయిన సంఘటనలు ఇటీవల బోలెడు జరుగుతున్నాయి. ఆర్థిక వ్యవహారాలు, లక్కీడ్రాల గురించి అవగాహన లేనివాళ్లు మోసపోవడం సహజం. అయితే నిత్యం ఫారిన్ కరెన్సీ ట్రాన్స్ఫర్లు చేస్తూ, సైబర్ నేరాలపై పూర్తి అవగాహన ఉండే ఎన్ఆర్ఐలే మోసపోతుంటే.., మోసం చేసేవాళ్లు పక్కాగా ఎలా నమ్మించి నట్టేట ముంచుతున్నారో ఇట్టే తెలుస్తుంది. ఆర్బీఐ పేరుతో దగా: ఇటీవల ఓ ఎన్ఆర్ఐ ఈ మెయిల్‌కు ఓ లెటరు వచ్చింది. అలాంటి ఇలాంటి లెటరు కాదు. ఏకంగా ఆర్బీఐ లోగో ఉన్న లెటర్ ప్యాడ్. ఆర్బీఐ అడ్రస్. ఆర్బీఐ కోఆర్డినేటర్ పేరు, రిజిస్ట్రేషన్ కోడ్ చూస్తే నిజంగా ఆర్బీఐ నుంచి లెటర్ వచ్చిందని ఎవరైనా నమ్మాల్సిందే! డీసీఎం(డిపార్ట్మెంట్ ఆఫ్ కరెన్సీ మేనేజ్మెంట్) సన్సద్బాద్ మార్గ్, న్యూఢిల్లీ అడ్రస్‌తో, ఆర్బీఐ ఫారిన్ఫండ్స్ ట్రాన్స్ఫర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ ఏంజిలినా డిసౌజా పేరుతో లెటరు వచ్చింది. దాని సారాంశం ఇలా ఉంది. ‘2009 నుంచి 2012 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆర్బీఐ ఖాతాదారుల జాబితా ఫైలును సమీక్షించారు.. లాటరీ, అన్‌పెయిడ్, అన్ డెలివరీ ఫండ్స్, పేమెంట్స్ ఫైలు(ఫైల్ నెంబర్:ఆర్బీఐ/ఐడీ1033/09)ను పరిశీలిచించారు.. అందులో మీకు రూ. 5లక్షలు ఆర్బీఐ చెల్లించాల్సి ఉంది. దీనికి సంబధించి 2013 జనవరి 2న ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, సెనెట్ట్యాక్స్ ఆర్థిక వ్యవహారాల కమిటీతో ముంబయి బ్రాంచ్‌లో సమావేశమయ్యారు.. ఇప్పటి వరకూ ఆర్బీఐ నుంచి చెల్లించాల్సిన దీర్ఘకాలిక పెండింగ్ మొత్తాలను వారివారి ఖాతాల్లోకి జమ చేయాలని రాజన్ నిర్ణయం తీసుకున్నారు.. అయితే ఆ మొత్తాలను సంబంధించిన ట్యాక్స్‌ను మాత్రం ఖాతాదారులే చెల్లించాలి.. ఈ ట్యాక్స్‌ను రెండువారాల్లోపు చెల్లించి డబ్బు అందిందా లేదా? అనేది ఆర్బీఐ అధికారులతో నిర్ధారించుకోవాలి. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ౌజ్ఛీ.2టఛజీఃౌఠౌౌ్టజు.ఛిౌఝను సంప్రదించాలి.. ఇలా చెల్లించకపోతే మీకు రావాల్సిన రూ. 5లక్షల చెల్లింపులు నిలిచిపోతాయి.. దీనికి పూర్తి బాధ్యత మీరే వహించాలి.. ఆర్బీఐకి ఎలాంటి సంబంధం ఉండదు.’’ అని ఉంది. ఈ మొత్తం లెటరు ఆర్బీఐ ఫారిన్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ మేడమ్ ఏంజిలినా డిసౌజా పేరుతో వచ్చింది. ఇంత పక్కాగా లెటర్ వచ్చిన తర్వాత ఎవరైనా ట్యాక్స్ మొత్తాన్ని చెల్లించాలనుకుంటారు. డబ్బు చెల్లించిన తర్వాత ఎలాంటి మొత్తం బాధితుల ఖాతాల్లో జమ కాదు. ఇలాంటి మోసాలు ఇటీవల అధికంగా జరుగుతున్నాయి. సెల్ఫోన్లు, ఈ మెయిల్స్కువచ్చే మెసేజ్‌లు, లెటర్లతో అవి నిజమోకావో తెలుసుకోకుండా భారీగా డబ్బు వస్తుందనే ఆశతో చాలామంది కొద్దిమొత్తాన్ని చెల్లించి బలవుతున్నారు. ఇలాంటి సైబర్ నేరాలపై ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండి, మెసేజ్‌లు వచ్చిన వెంటనే పోలీసులను సంప్రదించి డబ్బులు చెల్లించాల్సిన ఖాతా నెంబర్లు, అడ్రస్‌లపై బాధితులు ఫిర్యాదు చేయాలి. అప్పుడే వాస్తవంగా డబ్బు వస్తుందా.. లేక మోసమా.. అనేది తేలుతుంది.