
తిరువనంతపురం: చాలా మంది భారతీయులు యూఏఈ వంటి అరబ్ దేశాలకు వలస వెళ్తుంటారు. అక్కడ లాటరీలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ ఎదురవుతూనే ఉన్నాయి. వందల్లో వెచ్చించి కొనుగోలు చేయగా.. కోట్ల రూపాయల లాటరీలు తగిలిన సందర్భాలు ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి అదృష్టమే కేరళకు చెందిన శ్రీజు(39) అనే వ్యక్తిని వరించింది. యూఏఈలో ఉంటున్న ఇతనికి రూ.45 కోట్ల లాటరీ తగిలింది.
'గత 11 ఏళ్లుగా యూఈఏలో పనిచేస్తున్నాను. ఆయిల్ గ్యాస్ పరిశ్రమలో కంట్రోల్ రూం ఆపరేటర్‌గా పనిచేస్తున్నాను. మంచి ఇళ్లు కొనుక్కుని , కేరళకు తిరిగిరావాలని అనుకున్నాను. కానీ లాటరీ రూపంలో నా దశ తిరిగింది. ఏకంగా రూ.45 కోట్ల లాటరీ తగలడం నమ్మశక్యంగా లేదు. అంతా అయోమయంగా ఉంది. చాలా సంతోషంగా కూడా ఉంది. నా కుటుంబ సభ్యులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.' అని శ్రీజు తెలిపారు.
శ్రీజూకి మాత్రమే కాదు.. గతంలో చాలా మంది భారతీయులు యూఏఈ డ్రాల్లో పెద్ద మొత్తాల్లో డబ్బులు సాధించారు. గత శనివారం, యూఏఈలోని మరో కేరళ వ్యక్తి శరత్ శివదాసన్ ఎమిరేట్స్ డ్రా ఫాస్ట్5లో సుమారు రూ. 11 లక్షలు గెలుచుకున్నాడు. ముంబయికి చెందిన మరో వ్యక్తి మనోజ్ భావ్సర్ కూడా రూ.16 లక్షల లాటరీ గెలుచుకున్నాడు.
ఇదీ చదవండి: కాంగ్రెస్ Vs బీజేపీ: చిన్న పార్టీలతోనే పెద్ద చిక్కు!
Comments
Please login to add a commentAdd a comment