ముంబై: నీతి ఆయోగ్ డిజిటల్ చెల్లింపులకు ఉద్దేశించిన లక్కీడ్రా పథకాల విజేతలకు భారత జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్‌పీసీఐ) రూ.54.90 కోట్ల నగదు బహుమతులను పంపిణీ చేసింది. లక్కీ గ్రాహక్ యోజన, డిజిధన్ వ్యాపార్ యోజనల కింద విజేతలైన 3.42 లక్షల మంది వినియోగదారులు, వ్యాపారులకు ఈ మొత్తాన్ని పంపిణీ చేసినట్లు సంస్థ తెలిపింది.
డిసెంబర్ 25న ప్రారంభమైన ఈ పథకాలు ఏప్రిల్ 14 వరకు అమల్లో ఉంటాయి. 15 వేల మంది రోజువారీ విజేతలకు రూ.1.5 కోట్లు, దీనికి అదనంగా వారానికి 14వేల విజేతలకు రూ.8.3 కోట్లు ఇవ్వనున్నట్లు ఎన్‌పీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలు ఎక్కువ మంది విజేతలున్న రాష్ట్రాలుగా నిలిచాయి.
‘నీతి’ లక్కీ డ్రా విజేతలకు రూ.54.90 కోట్లు
Published Mon, Jan 16 2017 5:15 PM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM
Advertisement
Advertisement