ముంబై: భారతదేశానికి నెలకు 100 బిలియన్ల యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలు నెరపే అవకాశం ఉందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ అస్బే పేర్కొన్నారు. ఆగస్ట్‌లో 2016లో ప్రారంభించిన తర్వాత ప్లాట్‌ఫారమ్ ద్వారా సాధించిన 10 బిలియన్ లావాదేవీల కంటే ఇది పది రెట్లు అధికమని పేర్కొన్నారు.
ప్రస్తుతం 350 మిలియన్ల యూపీఐ వినియోగదారులు ఉన్నారని, వ్యాపారులు వినియోగదారులలో వృద్ధి అవకాశం 3 రెట్లు ఎక్కువగా ఉందని చెప్పారు. యూపీఐ లావాదేవీలకు అన్ని వర్గాల నుంచి ప్రయత్నం జరిగితే 100 బిలియన్ లావాదేవీలకు చేసే సామర్థ్యం ఉందని ఇక్కడ జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫీస్ట్ కార్యక్రమంలో అన్నారు. 100 బిలియన్ లావాదేవీలకు చేరుకోడానికి లక్ష్యంగా పెట్టుకున్న తేదీని పేర్కొనడానికి నిరాకరించిన ఆయన, అయితే 2030 నాటికి భారతదేశం రోజుకు 2 బిలియన్ల లావాదేవీలను చూస్తుందని చెప్పారు. ప్రస్తుతం, గ్లోబల్ దిగ్గజం వీసా నెలకు 22.5 బిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేస్తోంది. దాని ప్రత్యర్థి మాస్టర్ కార్డ్ 11 బిలియన్లకు పైగా లావాదేవీలు చేస్తోంది.
పరిశ్రమ స్తబ్దత నుంచి అభివృద్ధి చెందుతున్న ధోరణికి మారితే క్రెడిట్ కార్డ్ వినియోగం పది రెట్లు వృద్ధి చెందుతుందని అస్బే చెప్పారు. అయితే బ్యాంకులు సరైన ప్లాట్‌ఫారమ్‌లను అందిస్తేనే అది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం క్రెడిట్ కార్డ్‌లలో కొనుగోలు, పూచీకత్తు వ్యయం చాలా ఎక్కువగా ఉందని, ఇది ఈ ఇన్‌స్ట్రమెంట్ విస్తరణకు విఘాతంగా ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment