ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో ఊహించని విధంగా వృద్ది సాధిస్తోన్న ఈ-కామర్స్,పేమెంట్స్ విభాగంలో అడుగుపెట్టనుంది. దీంతో అదే రంగంలో మార్కెట్‌ను శాసిస్తున్న టెక్ దిగ్గజం గూగుల్, మరో దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి గట్టి పోటీ ఇవ్వనుందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది.
ఇప్పటికే అందుకు కావాల్సిన లైసెన్స్ కోసం అప్లయి చేసినట్లు సమాచారం. ఆ లైసెన్స్ యూపీఐ వంటి చెల్లింపులతో పాటు, కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు అదానీ గ్రూప్ ప్రతినిధులు పలు బ్యాంక్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆ చర్చలు చివరి దశకు వచ్చాయని తెలుస్తోంది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం..తన సేవలు వినియోగదారులకు మరింత చేరువయ్యేలా అదానీ గ్రూప్ ప్రభుత్వ ఈ-కామర్స్ ఫ్లాట్ ఫాం ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ) చర్చలు జరుపుతోంది.
చర్చలు సఫలమైందే అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ వన్ యాప్‌లో ఓఎన్‌డీసీ వినియోగదారులకు సేవలు అందుతాయి. ఓఎన్‌డీసీలో ఏదైనా కొనుగోలు చేసిన యూజర్లు అదానీ వన్ ద్వారా పలు ఆఫర్లు పొందవచ్చు.
ఇప్పటికే ఈ యాప్ యూజర్లకు హోటల్, ఫ్లైట్ రిజర్వేషన్‌తో సహా ఇతర ట్రావెల్ సంబంధిత సేవల్ని వినియోగించడం ద్వారా ప్రత్యేక డిస్కౌంట్‌లు పొందవచ్చు
Comments
Please login to add a commentAdd a comment