ONDC
-
ఓఎన్డీసీపై యూటీఐ మ్యూచువల్ ఫండ్స్
ముంబై: ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) నెట్‌వర్క్‌పై యూటీఐ మ్యూచువల్ ఫండ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఫైనాన్షియల్ టెక్నాలజీ భాగస్వామి ‘సైబ్రిల్లా’ సహకారంతో ఓఎన్డీసీ నెట్‌వర్క్‌తో అనుసంధానమైనట్టు యూటీఐ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. ఆర్థిక సేవల విస్తృతి, పెట్టుబడుల సాధనాల అందుబాటును పెంచడానికి ఇది తోడ్పడుతుందని పేర్కొంది.ఓఎన్డీసీ నెట్‌వర్క్‌తో అనుసంధానం కావడం ద్వారా మరింత మంది ఇన్వెస్టర్లకు తమ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు యూటీఐ ఎఎంసీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వినయ్ లకోటియా తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకూ, ముఖ్యంగా టైర్–2, 3 పట్టణ వాసులకు ఓఎన్డీసీ ద్వారా తన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల సేవలను చేరువ చేయాలన్న లక్ష్యంతో యూటీఐ మ్యూచువల్ ఫండ్స్ ఉంది. -
సెబీ కొత్త ప్రతిపాదన.. రీట్, ఇన్విట్లలో మరిన్ని పెట్టుబడులు!
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)లలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల పరిమితిని పెంచే ప్రతిపాదనను సెబీ ముందుకు తీసుకొచ్చింది. ఈ నిర్ణయం అమలైతే అప్పుడు రీట్, ఇన్విట్లలో మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది.తద్వారా వీటిల్లో లిక్విడిటీ మరింత మెరుగుపడనుంది. ప్రస్తుతం ఒక ఫండ్ ఎన్ఏవీలో గరిష్టంగా 10 శాతం మేరే రీట్, ఇన్విట్లలో పెట్టుబడులకు అనుమతి ఉంది. ఇప్పుడు దీన్ని ఈక్విటీ, హైబ్రిడ్ ఫండ్స్‌కు 20 శాతానికి ప్రతిపాదించింది. మే 11 వరకు ఈ ప్రతిపాదనలపై అభిప్రాయాలను తెలియజేయాలని సెబీ కోరింది. ఓఎన్డీసీ నెట్‌వర్క్‌లోకి యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ఫండ్స్లో పెట్టుబడులను సులభతరం చేసే దిశగా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)లో చేరినట్లు యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ వెల్లడించింది. దీనితో అంతగా ఆర్థిక సేవలు అందుబాటులో లేని, మారుమూల ప్రాంతాల్లోని వారు కూడా సరళతరంగా, తక్కువ వ్యయాలతో తమ ఫండ్ స్కీముల్లో ఇన్వెస్ట్ చేయడానికి వీలవుతుందని సంస్థ ఎండీ బి. గోప్‌కుమార్ తెలిపారు. తమ ప్లాట్‌ఫాంలో యాక్సిస్ ఎంఎఫ్ చేరడమనేది అందరికీ ఆర్థిక సాధనాలను అందుబాటులోకి తేవాలన్న లక్ష్య సాకారానికి తోడ్పడుతుందని ఓఎన్డీసీ ఎండీ టి. కోషి చెప్పారు. -
డిజిటల్ కామర్స్‌లో విప్లవం.. విస్తరిస్తున్న ఓఎన్డీసీ
చిన్న వ్యాపారాల కోసం డిజిటల్ కామర్స్‌ను (Digital Commerce) అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రారంభించిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) విస్తరిస్తోంది. ఈ ప్లాట్ఫామ్లో ఇప్పటివరకు 7 లక్షలకుపైగా విక్రేతలు, సర్వీస్ ప్రొవైడర్లు నమోదయినట్లు కేంద్రం వెల్లడించింది.2021లో ప్రభుత్వం చొరవతో ఓఎన్డీసీ ప్రారంభమైంది. చిన్న రిటైలర్లు తమ వ్యాపారాన్ని ఆన్లైన్లో విస్తరించుకోవడానికి ఓఎన్డీసీ దోహదపడుతుంది. ఈ–కామర్స్ (e-Commerce) రంగంలో పెద్ద సంస్థల ఆధిపత్యాన్ని ఈ ప్లాట్‌ఫామ్ తగ్గిస్తుంది. అన్ని రకాల ఈ–కామర్స్ కోసం ఓపెన్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు దీని లక్ష్యం. లాభాపేక్షలేకుండా ఇది సేవలను అందిస్తోంది.విక్రేతలు, లాజిస్టిక్స్ ప్రొవైడర్లు, లేదా పేమెంట్ గేట్‌వే ఆపరేటర్లు స్వచ్ఛందంగా అనుసరించాల్సిన ప్రమాణాలను ఇందులో పొందుపరచడం జరిగింది. ఓఎన్డీసీ చిన్న వ్యాపారాలను బలోపేతం చేయడంలో అలాగే ఈ–కామర్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఓఎన్డీసీ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు.గత మూడు సంవత్సరాల్లో ఓఎన్డీసీ చిన్న వ్యాపారాలకు విస్తృత స్థాయి వేదికను కల్పించినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు. ఓఎన్డీసీ ఇప్పటి వరకూ 200 నెట్వర్క్ భాగస్వామ్యులతో 150 మిలియన్ల లావాదేవీలు పూర్తి చేసింది.ఓఎన్డీసీ అనేది ఈ-కామర్స్‌కు యూపీఐ లాంటిది. ఆన్లైన్ పేమెంట్స్‌లో యూపీఐ ఒక సంచలనం. అలాగే ఈ-కామర్స్‌లోనూ ఓఎన్డీసీ విప్లవం తీసుకురానుంది. ఇది ఈజీ యాక్సెస్ ట్రేడింగ్ యాప్ సిస్టమ్ అన్నమాట. చిన్న వ్యాపారాలను ప్రొత్సహించడం, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్‌లకు ఇది చెక్ పెట్టనుంది. ఈ-కామర్స్ సాధారంగా రెండు పద్ధతుల్లో పని చేస్తుంది. ఒకటి ఇన్వెంటరీ మోడల్, రెండోది మార్కెట్ ప్లేస్ మోడల్. ఇన్వెంటరీ మోడల్ అంటే ఉత్పత్తిదారుల నుంచి నేరుగా వస్తువులను కొని కస్టమర్లకు అమ్ముతారు. మార్కెట్ ప్లేస్ మోడల్ అంటే ఇండిపెండెంట్ బయ్యర్లు, సెల్లర్లు ఉంటారు. వీటిని వెబ్సైట్, మెుబైల్ యాప్ ద్వారా కనెక్ట్ చేస్తారు. -
మరో బిజినెస్‌లోకి అదానీ గ్రూప్.. గూగుల్, అంబానీకి చెక్ పెట్టేనా?
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో ఊహించని విధంగా వృద్ది సాధిస్తోన్న ఈ-కామర్స్,పేమెంట్స్ విభాగంలో అడుగుపెట్టనుంది. దీంతో అదే రంగంలో మార్కెట్‌ను శాసిస్తున్న టెక్ దిగ్గజం గూగుల్, మరో దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి గట్టి పోటీ ఇవ్వనుందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది.ఇప్పటికే అందుకు కావాల్సిన లైసెన్స్ కోసం అప్లయి చేసినట్లు సమాచారం. ఆ లైసెన్స్ యూపీఐ వంటి చెల్లింపులతో పాటు, కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు అదానీ గ్రూప్ ప్రతినిధులు పలు బ్యాంక్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆ చర్చలు చివరి దశకు వచ్చాయని తెలుస్తోంది.జాతీయ మీడియా కథనాల ప్రకారం..తన సేవలు వినియోగదారులకు మరింత చేరువయ్యేలా అదానీ గ్రూప్ ప్రభుత్వ ఈ-కామర్స్ ఫ్లాట్ ఫాం ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) చర్చలు జరుపుతోంది.చర్చలు సఫలమైందే అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ వన్ యాప్‌లో ఓఎన్డీసీ వినియోగదారులకు సేవలు అందుతాయి. ఓఎన్డీసీలో ఏదైనా కొనుగోలు చేసిన యూజర్లు అదానీ వన్ ద్వారా పలు ఆఫర్లు పొందవచ్చు. ఇప్పటికే ఈ యాప్ యూజర్లకు హోటల్, ఫ్లైట్ రిజర్వేషన్‌తో సహా ఇతర ట్రావెల్ సంబంధిత సేవల్ని వినియోగించడం ద్వారా ప్రత్యేక డిస్కౌంట్లు పొందవచ్చు