చిన్న వ్యాపారాల కోసం డిజిటల్ కామర్స్‌ను (Digital Commerce) అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రారంభించిన ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) విస్తరిస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో ఇప్పటివరకు 7 లక్షలకుపైగా విక్రేతలు, సర్వీస్ ప్రొవైడర్లు నమోదయినట్లు కేంద్రం వెల్లడించింది.
2021లో ప్రభుత్వం చొరవతో ఓఎన్‌డీసీ ప్రారంభమైంది. చిన్న రిటైలర్లు తమ వ్యాపారాన్ని ఆన్‌లైన్‌లో విస్తరించుకోవడానికి ఓఎన్‌డీసీ దోహదపడుతుంది. ఈ–కామర్స్ (e-Commerce) రంగంలో పెద్ద సంస్థల ఆధిపత్యాన్ని ఈ ప్లాట్‌ఫామ్ తగ్గిస్తుంది. అన్ని రకాల ఈ–కామర్స్ కోసం ఓపెన్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు దీని లక్ష్యం. లాభాపేక్షలేకుండా ఇది సేవలను అందిస్తోంది.
విక్రేతలు, లాజిస్టిక్స్ ప్రొవైడర్లు, లేదా పేమెంట్ గేట్‌వే ఆపరేటర్లు స్వచ్ఛందంగా అనుసరించాల్సిన ప్రమాణాలను ఇందులో పొందుపరచడం జరిగింది. ఓఎన్‌డీసీ చిన్న వ్యాపారాలను బలోపేతం చేయడంలో అలాగే ఈ–కామర్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఓఎన్‌డీసీ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు.
గత మూడు సంవత్సరాల్లో ఓఎన్‌డీసీ చిన్న వ్యాపారాలకు విస్తృత స్థాయి వేదికను కల్పించినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు. ఓఎన్‌డీసీ ఇప్పటి వరకూ 200 నెట్‌వర్క్ భాగస్వామ్యులతో 150 మిలియన్ల లావాదేవీలు పూర్తి చేసింది.
ఓఎన్‌డీసీ అనేది ఈ-కామర్స్‌కు యూపీఐ లాంటిది. ఆన్‌లైన్ పేమెంట్స్‌లో యూపీఐ ఒక సంచలనం. అలాగే ఈ-కామర్స్‌లోనూ ఓఎన్‌డీసీ విప్లవం తీసుకురానుంది. ఇది ఈజీ యాక్సెస్ ట్రేడింగ్ యాప్ సిస్టమ్ అన్నమాట. చిన్న వ్యాపారాలను ప్రొత్సహించడం, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్‌లకు ఇది చెక్ పెట్టనుంది. ఈ-కామర్స్ సాధారంగా రెండు పద్ధతుల్లో పని చేస్తుంది. ఒకటి ఇన్వెంటరీ మోడల్, రెండోది మార్కెట్ ప్లేస్ మోడల్. ఇన్వెంటరీ మోడల్ అంటే ఉత్పత్తిదారుల నుంచి నేరుగా వస్తువులను కొని కస్టమర్లకు అమ్ముతారు. మార్కెట్ ప్లేస్ మోడల్ అంటే ఇండిపెండెంట్ బయ్యర్లు, సెల్లర్లు ఉంటారు. వీటిని వెబ్‌సైట్, మెుబైల్ యాప్ ద్వారా కనెక్ట్ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment