దేశంలో డిజిటల్ చెల్లింపులకు కీలకంగా ఉన్న యూపీఐ సేవలను యూఏఈకి విస్తరిస్తున్నట్లు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) తెలిపింది. యూఏఈలో నివసిస్తున్న భారతీయులు, ప్రయాణికులకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడుతాయని ఎన్‌పీసీఐ పేర్కొంది.
ఈ సందర్భంగా ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ సీఈఓ రితేష్ శుక్లా మాట్లాడుతూ..‘ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ మిడిల్ ఈస్ట్(మధ్యప్రాచ్య దేశాలు), ఆఫ్రికాలోని డిజిటల్ కామర్స్‌లో సేవలందిస్తున్న ‘నెట్‌వర్క్ ఇంటర్నేషనల్’తో భాగస్వామ్యం కలిగి ఉంది. కాబట్టి యూఏఈలో యూపీఐ సేవలందించే ప్రక్రియ సులువైంది. యూఏఈలోని భారతీయులు, ప్రయాణికులు, టూరిస్టులు పాయింట్-ఆఫ్-సేల్ (పీఓఎస్) టెర్మినల్స్‌లో క్యూఆర్ కోడ్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. 2024లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య 98 లక్షలుగా ఉంటుందని అంచనా. అందులో యూఏఈ ద్వారానే 52.9 లక్షల మంది రాకపోకలు జరిపే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులకు ఈ సేవలు ప్రారంభించాం’ అని తెలిపారు.
ఇదీ చదవండి: యాపిల్‌కు ఓపెన్‌ఏఐ బోర్డులో స్థానం..!
ఎన్‌పీసీఐ ఇప్పటికే నేపాల్, శ్రీలంక, మారిషస్, సింగపూర్, ఫ్రాన్స్, భూటాన్‌లలో ఈ యూపీఐ సేవలను ఆమోదించింది.
Comments
Please login to add a commentAdd a comment