రామాయంపేట (మెదక్): 'లక్కీ డ్రాలో మీ సెల్ నెంబర్‌కు బంగారం వచ్చింది' అంటూ కాల్ చేసి ఓ యువకుడిని మోసం చేశారు ఆన్‌లైన్ కేటుగాళ్లు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన ఓబాజ భూపాల్‌కు ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేశారు. మీ సెల్ నెంబర్‌కు లక్కీ డ్రాలో రూ. 6 వేల విలువైన బంగారం తగిలిందని చెప్పారు.
కేవలం పోస్టల్ చార్జీలు రూ.640 చెల్లిస్తే సరిపోతుందని.. పార్శిల్ కవరు వచ్చిన తరువాతనే డబ్బులు చెల్లించాలని చెప్పగా భూపాల్ అంగీకరించాడు. నాలుగైదు రోజుల అనంతరం పార్శిల్ రాగా భూపాల్ డబ్బు చెల్లించి విప్పి చూడగా అందులో 20 రూపాయల విలువ చేసే పూసల దండ మాత్రమే ఉంది. దీంతో భాదితుడు అవాక్కయ్యాడు. కాగా ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక ఎస్‌ఐ నాగార్జునగౌడ్ తెలిపారు.
లక్కీ డ్రాలో బంగారం వచ్చిందంటూ..
Published Fri, Feb 19 2016 5:54 PM | Last Updated on Sun, Sep 3 2017 5:58 PM
Advertisement
Advertisement