పన్ను చెల్లించండి బంగారం గెలవండి | Gram panchayat promises gold to taxpayers through lucky draw | Sakshi
Sakshi News home page

పన్ను చెల్లించండి బంగారం గెలవండి

Published Mon, Dec 23 2019 2:59 AM | Last Updated on Mon, Dec 23 2019 2:59 AM

Gram panchayat promises gold to taxpayers through lucky draw - Sakshi

ముంబై: పన్ను రాబడి పెంచుకోవడానికి మహారాష్ట్రలోని ఓ గ్రామం వినూత్న ప్రయోగం చేపట్టింది. వచ్చే సంవత్సరం మార్చి 15 లోపు గ్రామపంచాయతీ పన్ను బకాయిలు చెల్లిస్తే వారిని లక్కీడ్రాకు ఎంపిక చేస్తామని, లక్కీడ్రాలో వారు బంగారం గెలుపొందవచ్చని ప్రకటించింది. సంగ్లీ జిల్లా కడేగావ్‌ తాలూకాలోని వాంగీ అనే గ్రామపంచాయతీ ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. పన్ను బకాయిలను నిర్ణీత గడువులోగా చెల్లించిన వారి పేర్లతో లక్కీడ్రా తీస్తామని, లక్కీడ్రాలో తొలి రెండు స్థానాల్లో వచ్చినవారు 5 గ్రాములు, 3 గ్రాముల బంగారపు ఉంగరాలు, మూడో స్థానంలో నిలిచిన వారు 2 గ్రాముల బంగారు నాణెం గెలుచుకుంటారని తెలిపింది. ఈ పథకానికి మంచి స్పందన వస్తోందని వాంగీ గ్రామ సర్పంచ్‌ విజయ్‌ హన్మానే తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement