మహాయుతి గెలుపుపై సామ్నా
లక్కీ డ్రాలో గెలిచారని విమర్శ
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి బంపర్ లక్కీ డ్రాలో గెలిచిందని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) పత్రిక సామ్నా విమర్శించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లు ఉంటే ఏదైనా సాధ్యమే నని పేర్కొంది. సామ్నా ఎడిటో రియల్‌లో ఈ మేరకు ధ్వజమెత్తింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల భారత్‌లో చాలావేగంగా ఓట్ల లెక్కింపు పూర్తయిందని, అమెరికాలో ఇది చాలా ఆలస్యమైందని పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై సామ్నా స్పందిస్తూ భారత్‌లో ఈవీఎంల పనితీరుతో సామాన్యులూ నిర్ఘాంతపోయారని పేర్కొంది.
అంతేకాకుండా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని ఎలాన్ మస్క్ స్వయంగా కొన్ని నెలల కిందట చెప్పిన విషయాన్ని ప్రస్తావించింది. మొత్తం 288 సీట్లలో మహాయుతి బంపర్ లక్కీ డ్రాలో ఏకంగా 230 సీట్లను ఎలా నెగ్గగలిగింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికితే అవన్నీ ఈవీఎంల దగ్గరే ఆగిపోతున్నాయని వ్యాఖ్యానించింది. ఏకంగా 95 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య తేడాలున్నాయని పేర్కొంది. అలాగే బ్యాటరీలు పూర్తి చార్జింగ్‌తో ఉండటం ఈవీఎంలపై పలు అనుమానాలను రేకెత్తిస్తోందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment