assembly election results
-
అనుమానాలను నివృత్తి చేస్తాం..రండి!
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రతీ దశలోనూ పారదర్శకంగా జరిగాయని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) స్పష్టం చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్, కౌంటింగ్ సమయంలో అవకతవకలు జరిగాయని, ఆధారాలు చూపేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కాంగ్రెస్ రాసిన లేఖకు ఈసీ స్పందించింది. అనుమానాల నివృత్తి కోసం డిసెంబర్ 3న ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందాన్ని ఈసీ ఆహ్వానించింది. ఎన్నికల ప్రక్రియ ప్రతి దశలోనూ కాంగ్రెస్‌తోపాటు అన్ని రాజకీయ పార్టీ అభ్యర్థులు/ఏజెంట్ల ప్రమేయం ఉందని వివరించింది. ఓటింగ్ సరళిపై ఎలాంటి అనుమానాలకు అక్కర్లేదని, పోలింగ్ బూత్‌ల వారీగా అభ్యర్థులందరికీ ఆ డేటాను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచామని నొక్కి చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న చట్టపరమైన ఆందోళనలను, అనుమానాలను పరిశీలించి రాతపూర్వకంగా బదులిస్తామని ఈసీ స్పష్టం చేసింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు మహాయుతి కూటమిలోని బీజేపీ 132, శివసేన (షిండే) 57, ఎన్సీపీ (అజిత్) 41 సీట్లు సాధించగా, మహా వికాస్ అఘాడీ పక్షాలైన కాంగ్రెస్‌కు 16, శివసేన (ఉద్ధవ్)కు 20, ఎన్సీపీ (శరద్) పార్టీకి 10 స్థానాలు దక్కడం తెలిసిందే. -
ఈవీఎంలు ఉంటే ఏదైనా సాధ్యమే!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి బంపర్ లక్కీ డ్రాలో గెలిచిందని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) పత్రిక సామ్నా విమర్శించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లు ఉంటే ఏదైనా సాధ్యమే నని పేర్కొంది. సామ్నా ఎడిటో రియల్‌లో ఈ మేరకు ధ్వజమెత్తింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల భారత్‌లో చాలావేగంగా ఓట్ల లెక్కింపు పూర్తయిందని, అమెరికాలో ఇది చాలా ఆలస్యమైందని పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై సామ్నా స్పందిస్తూ భారత్‌లో ఈవీఎంల పనితీరుతో సామాన్యులూ నిర్ఘాంతపోయారని పేర్కొంది. అంతేకాకుండా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని ఎలాన్ మస్క్ స్వయంగా కొన్ని నెలల కిందట చెప్పిన విషయాన్ని ప్రస్తావించింది. మొత్తం 288 సీట్లలో మహాయుతి బంపర్ లక్కీ డ్రాలో ఏకంగా 230 సీట్లను ఎలా నెగ్గగలిగింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికితే అవన్నీ ఈవీఎంల దగ్గరే ఆగిపోతున్నాయని వ్యాఖ్యానించింది. ఏకంగా 95 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య తేడాలున్నాయని పేర్కొంది. అలాగే బ్యాటరీలు పూర్తి చార్జింగ్‌తో ఉండటం ఈవీఎంలపై పలు అనుమానాలను రేకెత్తిస్తోందని తెలిపింది. -
రెండోరోజూ మహా ర్యాలీ!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రాతినిధ్యం వహించిన మహాయుతి కూటమి ఆఖండ విజయంతో బుల్ రెండోరోజూ రంకెలేసింది. సెన్సెక్స్ 993 పాయింట్లు పెరిగి 80 వేల స్థాయిపైన 80,110 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 315 పాయింట్లు లాభపడి 24 వేల స్థాయిపైన 24,221 వద్ద నిలిచింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 1,076 పాయింట్లు బలపడి 80,193 వద్ద, నిఫ్టీ 346 పాయింట్లు ఎగసి 24,253 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశలో సెన్సెక్స్ 1,356 పాయింట్లు ఎగసి 80,473 వద్ద, నిఫ్టీ 445 పాయింట్లు దూసుకెళ్లి 24,352 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 12 పైసలు బలపడి 84.29 స్థాయి వద్ద స్థిరపడింది. అమెరికా ఆర్థికమంత్రిగా అంతర్జాతీయ ఇన్వెస్టర్, మార్కెట్‌కు అనుకూల ‘స్కాట్ బెసెంట్’ను ట్రంప్ నామినేట్ చేయడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. ఆసియాలో చైనా, హాంగ్‌కాంగ్, సింగపూర్ మినహా అన్ని దేశాల సూచీలు 1.50% ర్యాలీ చేశాయి. యూరప్ మార్కెట్లు అరశాతం లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు ఒకశాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. → సెన్సెక్స్ సూచీలో 30కి 26 షేర్లూ లాభాలతో ముగిశాయి. అత్యధికంగా ఎల్అండ్టీ, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 4 – 2.50% లాభపడ్డాయి. బీఎస్ఈలో రంగాల వారీగా ఇండ్రస్టియల్, ఆయిల్‌అండ్‌గ్యాస్ 3%, ఇంధన 2.50%, రియల్టీ, బ్యాంకెక్స్, ఫైనాన్షియల్ సరీ్వసెస్ 2%, ఫార్మా సూచీలు ఒకశాతం లాభపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2% నుంచి ఒకటిన్నర శాతం పెరిగాయి. → అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు మిశ్రమంగా స్పందించాయి. ఈ గ్రూప్‌లో పదింటికిగానూ అయిదు కంపెనీల షేర్లు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్ 2.55%, ఏసీసీ 2.54%, అదానీ ఎంటర్ప్రైజెస్ 1.26%, అదానీ విల్మార్ 2%, అంబుజా సిమెంట్స్ 1% లాభపడ్డాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 8%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 4%, అదానీ పవర్ 3%, ఎన్డీటీవీ 2%, అదానీ టోటల్ గ్యాస్ 1.50% నష్టపోయాయి. → బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో చోటు దక్కించుకోవడంతో జొమాటో కంపెనీ షేరు 3.58% పెరిగి రూ.274 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 7.62% ఎగసి రూ.284 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇదే సూచీలో స్థానం కోల్పోయిన జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేరు 2.5% నష్టపోయి రూ. 953 వద్ద ముగిసింది. గడిచిన రెండు రోజుల్లో సెన్సెక్స్ 2,954 పాయింట్లు(4%) ర్యాలీ చేయడంతో రూ.14.20 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.439.58 లక్షల కోట్ల (5.22 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది. సోమవారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ.6.11 లక్షల కోట్లు ఆర్జించారు. -
జార్ఖండ్ మళ్లీ ఇండియా కూటమిదే !
-
అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారు
-
కొంత మోదం.. కొంత ఖేదం
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టికి కొంత నిరాశం, కొంత ఉపశమనం కలిగించాయి. మహారాష్ట్రలో కూటమి పక్షాలతో కలిసి అధికార బీజేపీ కూటమికి ఓటమి రుచి చూపిద్దామన్న కసితో పనిచేసిన కాంగ్రెస్‌కు ఫలితాలు ఊహించని షాక్ ఇచ్ఛాయి. సీట్ల పంపకాల్లో తప్పిదాలు, ఓట్ల బదిలీ జరగకపోవడం, పార్టీ ఇచ్చిన గ్యారంటీలను ప్రజలు పెద్దగా నమ్మకపోవడం ఘోర పరాజయానికి దారితీశాయి. జార్ఖండ్‌లో మాత్రం తన బలాన్ని నిలుపుకోవడం, కూటమి పార్టితో కలిసి తిరిగి అధికారంలోకి రావడం కాంగ్రెస్‌కు ఊపిరినిచ్చింది. మహారాష్ట్రలో ఊహించని దెబ్బ ఆరు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ అద్భుత ప్రదర్శన కనబరించింది. మొత్తం 48 పార్లమెంట్ స్థానాలకు గానూ 30 స్థానాలను కైవసం చేసుకుంది. ఇందులో కాంగ్రెస్ 16.12 శాతం ఓట్లను రాబట్టుకొని 13 స్థానాలను గెలుచుకుంది. మిత్రపక్షాలైన శివసేన (ఉద్ధవ్) 9, ఎన్సీపీ(శరద్ పవార్) 8 స్థానాలు దక్కించుకున్నాయి. కానీ, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ కేవలం 15 సీట్లకే పరిమితమైంది. తన ఓట్ల శాతాన్ని సైతం కోల్పోయి కేవలం 12 శాతం ఓట్లకు పరిమితమైంది. 2019 ఎన్నికల్లో 147 సీట్లలో పోటీ చేసి 44 సీట్లు రాబట్టుకున్న కాంగ్రెస్ ప్రస్తుత ఎన్నికల్లో 101 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ తన పేలవ ప్రదర్శనతో 15 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం తమకు బలమైన ఓటు బ్యాంకు కలిగిన ఉన్న నియోజకవర్గాలను మిత్రపక్షాలకు వదిలేయడమేనని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మిత్రపక్షాలకు కేటాయించిన స్థానాలపై కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీలో అగ్రనేత రాహుల్‌గాంధీ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ విజయావకాశాలను, సీట్లను తగ్గించేలా నియోజకవర్గాల ఎంపిక జరిగిందని ఆరోపించారు. దీనికి తోడు 75 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి పోటీపడ్డాయి. ఆయా స్థానాల్లో 65కి పైగా స్థానాలను బీజేపీ గెలుచుకుంది. హిందువుల ఓట్ల ప్రాబల్యంతోపాటు గరిష్ట సంఖ్యలో మరాఠాలు బీజేపీకి జైకొట్టడంతో కాంగ్రెస్‌కు పరాజయం ఎదరయ్యింది. జార్ఖండ్‌తో దక్కిన పరువు జార్ఖండ్‌లోనూ ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌పోల్స్ చెప్పినప్పటికీ కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి నెగ్గింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తన పూర్వవైభవాన్ని నిలబెట్టుకుంది. గత ఎన్నికల్లో 31 స్థానాల్లో పోటీచేసి 16 సీట్లు గెలిచిన ఆ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో 30 స్థానాల్లో పోటీచేసి 16 స్థానాలు దక్కించుకుంది. జేఎంఎం 41 స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ నుంచి పూర్తి సహకారం అందడంతో జేఎంఎం గెలుచుకున్న స్థానాలు 30 నుంచి 34కి పెరిగాయి. పొత్తులపై ముందునుంచే అవగాహన ఉండడం, జార్ఖండ్‌లో రాహుల్ గాంధీ విస్తృతంగా పర్యటించడం ఇండియా కూటమికి కలిసొచ్చింది. ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో 9 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, మిత్రపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ 2 స్థానాలు గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్ పోటీ చేయలేదు. కాంగ్రెస్ నుంచి సరైన మద్దతు లేకపోవడంతో మరో 2 స్థానాలు గెలిచే అవకాశమున్నా ఎస్పీ తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయింది. పశి్చమ బెంగాల్లో ఉప ఎన్నికలు జరిగిన 6 స్థానాల్లోనూ మిత్రపక్షమైన తృణముల్ కాంగ్రెస్ గెలిచింది. ఈ ఎన్నికల్లో పొత్తు లేకపోవడంతో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి ఓటమి చవిచూసింది. పంజాబ్‌లోనూ నాలుగు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టితో పొత్తు లేకపోవడంతో కాంగ్రెస్ ఒక స్థానంలో నెగ్గింది. మూడు స్థానాల్లో ఆప్ గెలుపొందింది. రాజస్తాన్‌లో 7 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించగా, బీజేపీ, దాని మిత్రపక్షాలు ఆరింటిని గెలుచుకున్నాయి. కర్ణాటకలో 3 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, అన్నింటినీ కాంగ్రెస్ సొంతం చేసుకుంది. మరోవైపు వయనాడ్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ విజయం పట్ల కాంగ్రెస్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, న్యూఢిల్లీ -
మహా రాజకీయాల్లో అనూహ్య ఫలితాలు
-
మహారాష్ట్ర ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ VS రియల్ ఫలితాలు
-
ఒకసారి ఇండియా కూటమి.. ఒకసారి NDA కూటమి
-
ఉత్కంఠ రేపుతున్న ప్రజాతీర్పు..
-
Watch Live: మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలపై ఉత్కంఠ
-
నేడే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. వయనాడ్‌లో తేలనున్న ప్రియాంక గాంధీ భవితవ్యం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
కాసేపట్లో ప్రారంభం కానున్న మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ
-
నేడే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు
ముంబై/రాంచీ: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో హో రాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమరంలో విజేతలెవరో నేడు తేలిపోనుంది. రెండు రాష్ట్రాల్లో శనివారం ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. అలాగే 13 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగిన 46 అసెంబ్లీ స్థానా ల్లోనూ ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. సాక్షి.కామ్ ఈ ప్రజా తీర్పును.. ఎప్పటికప్పటి ఫలితాలను మీకు ప్రత్యేకంగా అందించబోతోంది.నాందేడ్ లోక్‌సభ స్థానంతోపాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్‌లో లోక్‌సభ స్థానానికి సైతం ఉప ఎన్నిక నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ పడిన రాహుల్ సోదరి ప్రియాంకాగాంధీ వాద్రా భవితవ్యం మరికొన్ని గంటల్లో తేటతెల్లం కానుంది. మహారాష్ట్ర, జార్ఖండ్‌తోపాటు ఉప ఎన్నికలు జరిగిన అసెంబ్లీ స్థానాలు, నాందేడ్, వయనాడ్ లోక్‌సభ స్థానాల్లో శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. మహారాష్ట్రలో మొత్తం 288 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 288 అసెంబ్లీ స్థానాలుండగా, 4,136 మంది అభ్యర్థులు పోటీ చేశారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మరోసారి మహాయుతి ప్రభుత్వమే ఏర్పాటయ్యే అవకాశం ఉందని సర్వేలు అంచనా వేసిన సంగతి తెలిసిందే. జార్ఖండ్‌లో 1,211 మంది పోటీ మొత్తం 81 శాసనసభ స్థానాలున్న జార్ఖండ్‌లో ఈసారి 1,211 మంది పోటీ చేశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మధ్య అసలైన పోటీ నెలకొంది. జార్ఖండ్‌లో మరోసారి అధికారంలోకి వస్తామని ఇండియా కూటమి ధీమా వ్యక్తం చేస్తుండగా, విజయం తమదేనని ఎన్డీయే నేతలు తేల్చిచెబుతున్నారు. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్డీయేవైపే మొగ్గుచూపాయి. మహారాష్ట్రలో ఎంవీఏ ముందు జాగ్రత్త మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించిన తమ అభ్యర్థులందరినీ వెంటనే ముంబైలో శిబిరానికి తరలించాలని మహా వికాస్ అఘాడీ నిర్ణయించింది. తమ ఎమ్మెల్యేలపై బీజేపీ కూటమి వల విసిరే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తగా వారిని శిబిరానికి తరలించాలని నిర్ణయించినట్లు శివసేన(యూబీటీ) అగ్రనేత సంజయ్ రౌత్ శుక్రవారం వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి కనీసం 160 సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు. గెలిచే అవకాశం ఉన్న స్వతంత్ర అభ్యర్థులు ఇప్పటికే తమకు మద్దతు ప్రకటించారని తెలిపారు. -
జార్ఖండ్‌లో హోరాహోరీ
గిరిజన రాష్ట్రం జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోరు పరాకాష్టకు చేరుతోంది. ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార జేఎంఎం, కాంగ్రెస్ సంకీర్ణం ప్రయతి్నస్తోంది. ఆ కూటమిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించి జార్ఖండ్‌లో కాషాయ జెండా ఎగరేసేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో పాటు ఇతర నేతల అవినీతినే ప్రధాన ఎజెండాగా మలచుకుని ప్రజల్లోకి వెళ్తోంది. అయితే పుంఖానుపుంఖాలుగా ప్రకటించిన సంక్షేమ పథకాలే తమను మరోసారి గట్టెక్కిస్తాయని అ«ధికార కూటమి విశ్వసిస్తోంది. రాష్ట్రంలో నవంబర్ 13, 20ల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఫలితాలు 23న వెల్లడవుతాయి. ఇటీవలి హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి నేపథ్యంలో జార్ఖండ్‌లో విజయం కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమికి ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో జేఎంఎం–కాంగ్రెస్, బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటముల బలాబలాలను ఓసారి పరిశీలిస్తే... బీజేపీ దూకుడు మంత్రం దూకుడైన ప్రచారమే మంత్రంగా జార్ఖండ్ ప్రచార పర్వంలో బీజేపీ దూసుకెళ్తోంది. ఎప్పట్లాగే ప్రధాని మోదీ కరిజ్మాపైనే పార్టీ ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. ఆయనతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ తదితర నేతలు కూడా రాష్ట్రంలో కాలికి బలపం పట్టుకుని తిరుగుతున్నారు. పలు అంశాలపై ఎప్పటికప్పుడు ప్రశ్నలు సంధిస్తూ ప్రజలను ఆలోచింపజేయడమే గాక అధికార కూటమిని ఇరుకున పెట్టేందుకు ప్రయతి్నస్తున్నారు. 2014లో బీజేపీ 31.8 శాతం ఓట్లతో 37 అసెంబ్లీ స్థానాలు ఒడిసిపట్టి విజయం సాధించింది. 2019లో ఓట్ల శాతం 33.8కి పెరిగినా 25 స్థానాలకే పరిమితమై అధికారం కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎక్కడా చిన్న అవకాశం కూడా వదలరాదని పార్టీ అధిష్టానం పట్టుదలగా ఉంది. ⇒ బంగ్లాదేశ్ నుంచి జార్ఖండ్‌లోకి చొరబాట్లపై బీజేపీ ప్రధానంగా దృష్టి పెట్టింది. వారివల్ల స్థానికుల అవకాశాలన్నింటికీ భారీగా గండి పడుతుందని జోరుగా ప్రచారం చేస్తోంది. ⇒ సీఎం హేమంత్‌తో పాటు జేఎంఎం, కాంగ్రెస్ నేతల్లో పలువురిపై ఈడీ, సీబీఐ దాడులను ప్రచారంలో పదేపదే ప్రస్తావిస్తోంది. ⇒ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలకు భద్రత లేదని ఆరోపిస్తోంది. ⇒ మోదీ సర్కారు అభివృద్ధి నినాదాన్ని వల్లెవేస్తోంది. డబుల్ ఇంజిన్ సర్కారుతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేతలు ప్రచారం చేస్తున్నారు. ⇒ గత కొద్ది నెలల్లో జార్ఖండ్‌లో వేలాది కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. పార్టీలో వలసల జోష్: గిరిజనుల్లో గట్టి ఆదరణ ఉన్న మాజీ సీఎం చంపయ్ సోరెన్ జేఎంఎంను వీడి బీజేపీలో చేరడం కమలనాథులకు మరింత ఊపునిచి్చంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏకైక ఎంపీ గీతా కోరా కూడా అదే బాట పట్టారు. అంతేగాక సీతా సోరెన్, అమిత్ కుమార్ యాదవ్, కమలేశ్ సింగ్ రూపంలో ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ జేఎంఎం సంక్షేమ మంత్రంఅధికార జేంఎంఎ, కాంగ్రెస్ కూటమి రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలకు తెర తీసింది. ⇒ మయ్యా సమ్మాన్ యోజన పేరిట 18–50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఏటా నేరుగా రూ.12 వేల నుంచి రూ.30 వేల దాకా ఆర్థిక సాయం అందిస్తోంది. ⇒ ఆప్కీ యోజనా, ఆప్కీ సర్కార్, ఆప్కే ద్వార్, అబువా ఆవాస్, సార్వత్రిక పెన్షన్‌కు తోడు ఆహార భద్రత, క్రీడలు–విద్యా పథకాలను అమలు చేస్తోంది. ⇒ గిరిజన సెంటిమెంట్‌కు ఇవన్నీ తోడై తమను మరోసారి విజయ తీరాలకు చేరుస్తాయని నమ్ముతోంది. కల్పన ఫ్యాక్టర్ సీఎం హేమంత్ సోరెన్ కల్పన ప్రచార సభలకు లభిస్తున్న భారీ ఆదరణ కమలనాథుల్లో గుబులు రేపుతోంది. భర్తపై బీజేపీ చేస్తున్న అవినీతి ఆరోపణలను ఆమె గట్టిగా తిప్పికొడుతున్నారు. ఇటీవల జేఎంఎంలో చేరి ఉప ఎన్నికలో గండే అసెంబ్లీ స్థానం నుంచి భారీ మెజారిటీతో నెగ్గడం అధికార కూటమిలో జోష్ పెంచింది.గిరిజన సీట్లే నిర్ణాయకంజార్ఖండ్లో ఏకంగా 28 ఎస్టీ రిజర్వుడు స్థానాలున్నాయి. మొత్తం సీట్లలో ఇవి మూడో వంతు కంటే అధికం! అధికార, విపక్ష కూటముల భాగ్యరేఖలను ఇవే నిర్దేశించనున్నాయి. ⇒ ఈ నేపథ్యంలో గిరిజనుడైన తనను మోదీ ప్రభుత్వం వేధిస్తోందంటూ హేమంత్ చేస్తున్న ప్రచారం ఎక్కడ తమ పుట్టి ముంచుతుందోనన్న భయాందోళనలు బీజేపీలో లేకపోలేదు. ⇒ అధికార కూటమి గిరిజన సెంటిమెంట్‌ను గట్టిగా నమ్ముకుంది. ⇒ గిరిజనులు పాటించే సర్నాను ప్రత్యేక మతంగా గుర్తించాలంటూ జేఎంఎం, కాంగ్రెస్ సర్కారు ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. ఇరు కూటముల్లోనూ లుకలుకలు అధికార, విపక్ష కూటములు రెండూ ఇంటి పోరుతో సతమతమవుతుండటం విశేషం. ముఖ్యంగా బీజేపీని నేతల విభేదాలు బాగా కలవరపెడుతున్నాయి. ముఖ్య నేతల మధ్య సమన్వయం బాగా కొరవడిందంటూ వార్తలు వస్తున్నాయి. అధికార కూటమిలోనూ లుకలుకలు లేకపోలేదు. పలువురు కాంగ్రెస్, జేఎంఎం ఎమ్మెల్యేల సిగపట్ల వివాదం ఎన్నోసార్లు హస్తిన దాకా వెళ్లింది. చాలా అసెంబ్లీ స్థానాల్లో సమన్వయంతో కలిసి పని చేసేందుకు కూడా ఇష్టపడనంతగా ఇరు పార్టీల ముఖ్య నేతల మధ్య విభేదాలు పొడసూపాయి. -
హరియాణా శాసనసభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి బీజేపీ జయకేతనం... 90 స్థానాలకు గాను 48 స్థానాల్లో విజయం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
కాశ్మీర్ లో కూటమి కింగ్.. ఖాతా తెరిచిన ఆమ్ ఆద్మీ పార్టీ
-
ఎన్నికల ఫలితాలు.. హర్యానా, జమ్మూలో ఓడిన ప్రముఖులు వీరే
జమ్ముకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారవ్వడంతో.. పార్టీలు కంగుతున్నాయి. హర్యానా పోరులో బీజేపీ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది.90 స్థానాలకు గానూ 48 చోట్ల విజయ కేతనం ఎగురవేసి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది.. ఇక హర్యానా ఫలితాలు హస్తానికి తీవ్ర నిరాశపరిచాయి. ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పక్కా అంటూ ధీమా మీదున్న కాంగ్రెస్ కేవలం 37 స్థానాలకే పరిమితమైంది.అటు జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ - కాంగ్రెస్ కూటమికి ఓటర్లు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. మెజార్టీ ఫిగర్‌ను దాటి 49 స్థానాలను గెలుచుకుంది. దీంతో ఎన్సీ నేత ఓమర్ అబ్దుల్లా జమ్ముకశ్మీర్ సీఎంగా అవతరించనున్నారు. బీజేపీ 29 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే రెండు రాష్ట్రాల్లోనూ పలువురు ప్రముఖ నేతలకు ఫలితాలు షాక్ ఇచ్చాయి. పార్టీ చీఫ్‌లు, మాజీ సీఎంలు ఓటమిని చవిచూశారు.. వారిలోహర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్హర్యానా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాన్ హోడల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పరాజయం పాలయ్యారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన భాన్.. బీజేపీ అభ్యర్థి హరీందర్ సింగ్ చేతిలో 2,500 ఓట్ల తేడాతో ఓడిపోయారు, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో హోడల్ సీటును గెలుచుకున్న ఆయనతే 2019 ఎన్నికల్లో బీజేపీకి చెందిన జగదీష్ నాయర్ చేతిలో ఓడిపోయారు. ఇక 2022 నుంచి హర్యానా కాంగ్రెస్ చీఫ్‌గా పనిచేస్తున్నారు.అభయ్ చౌతాలాఐఎన్ఎల్డీకి చెందిన అభయ్ చౌతాలా ఎల్లినాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి భరత్ సింగ్ బెనివాల్ చేతిలో 15,000 ఓట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూశారు.అనురాగ్ ధండాకలయత్ నుంచి బరిలోకి దిగిన ఆప్ సీనియర్ నేత, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనురాగ్ ధండా ఓటమి చెందారు. కలయత్ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగిన ధండా.. ఏడోస్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్‌కు చెందిన వికాస్ సహారన్ గెలుపొందారు.దుష్యంత్ చౌతాలాజననాయక్ జనతాపార్టీ నాయకుడు దుష్యంత్ చౌతాలా భారీ ఓటమిని ఎదుర్కొన్నారు. ఉచానా కలాన్ నుంచి బరిలో దిగిన దుష్యంత్ చౌతాలా .. ఐదో స్థానానికి పరిమితయ్యారు. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి దేవేందర్ చతర్ భుజ్ 32 ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఐఏఎస్ అధికారి బ్రిజేంద్ర సింగ్‌పై విజయం సాధించారు.దిగ్విజయ్ సింగ్ చౌతాలాననాయక్ జనతాపార్టీ మరో నేత దిగ్విజయ్ సింగ్ చౌతాలా దబ్వాలి నియోజకవర్గం నుంచి ఓటమిని చవిచూశారు. తన దూరపు బంధువు ఆదిత్య దేవి లాల్ చేతిలో ఓడిపోయారు. కాగా దిగ్విజయ్, ఆదిత్య ఇద్దరూ హర్యానా మాజీ ముఖ్యమంత్రి దేవి లాల్‌తో బంధుత్వం కలిగి ఉన్నారు. వీరు భారతదేశ ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు.గెలిచిన ప్రముఖులుహర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ ఘన విజయం సాధించారు. లాడ్వా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగిన సైనీ.. సమీప కాంగ్రెస్ అభ్యర్థి మేవా సింగ్ సింగ్రోహాపై గెలుపొందారు.హర్యానా మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడా విజయం సాధించారు. గర్హి సంప్లా-కిలోయ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిపి మంజుపై 71, 465 ఓట్ల తేడాతో గెలుపొందారు.స్వతంత్ర అభ్యర్థి, భారతదేశపు అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్ హిసార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆమె బీజేపీకి చెందిన కమల్ గుప్తా, కాంగ్రెస్ అభ్యర్థి రామ్ నివాస్ రారాపై 18,941 ఓట్ల తేడాతో విజయం సాధించారు. జిందాల్ కుటుంబానికి చెందిన 74 ఏళ్ల మాతృమూర్తి.. మూడోసారి హిసార్‌లో గెలిచారు, గతంలో 2005, 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. భారత రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన వినేశ్ ఫొగట్ హర్యానా ఎన్నికల్లో విజయం సాధించారు. జులానా నియోజవర్గంలో తమ ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్‌పై 5763 ఓట్ల తేడాతో వినేశ్ పైచేయి సాధించారు.జమ్ము కశ్మీర్- ఓటమి చెందిన నాయకులుఇల్తిజా ముఫ్తీపీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా ముఫ్తీఓటమి పాలయ్యారు. శ్రీగుఫ్వారా – బిజ్బెహరా నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అభ్యర్థి బషీర్ అహ్మద్ చేతిలో ఓటమి చవిచూశారు. ఈ మేరకు తన ఓటమిని ఇల్తిజా అంగీకరించారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. తన గెలుపు కోసం కష్టపడిన పీడీపీ కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.బీజేపీ చీఫ్ రవీందర్ రైనానౌషేరా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాష్ట్ర బీజేపీచీఫ్ రవీందర్ రైనా ఓటమి చెందారు. నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్ధి సురీందర్ చౌదరి చేతిలో 7, 819ఓట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఈసీ ప్రకారం.. చౌదరికి 35,069 ఓట్లు రాగా, రైనాకు 27,250 ఓట్లు వచ్చాయి.పార్లమెంటుపై దాడి కేసులో దోషిగా ఉన్న అఫ్జల్ గురు సోదరుడైన స్వతంత్ర అభ్యర్థి ఐజాజ్ అహ్మద్ గురూ ఉత్తర కాశ్మీర్‌లోని సోపోర్ నియోజకవర్గంలో 26,846 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడి నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి ఇర్షాద్ రసూల్ కర్ విజయం సాధించారు.జమ్మూకశ్మీర్ అప్నీ పార్టీ అధినేత సయ్యద్ అల్తాఫ్ బుఖారీ శ్రీనగర్‌లోని చన్నపోరా నియోజకవర్గంలో నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి ముస్తాక్ గురూ చేతిలో ఓడిపోయారు.జమ్ముకశ్మీర్‌లోని రియాసి నుంచి బీజేపీ నేత కుల్దీప్ రాజ్ దూబే 18815 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాంగ్రెస్‌కు చెందిన ముంతాజ్ అహ్మద్‌ను ఓడించాడు.ఇక జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఓమర్ అబ్దుల్లా తాను పోటీ చేసిన గందర్ బాల్, బుద్గాం స్థానాల్లో విజయం సాధించారు. -
జమ్ముకశ్మీర్ ఫలితాలు.. బీజేపీ చీఫ్ ఓటమి
పదేళ్ల తర్వాత జరిగిన జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి దూసుకుపోతుంది. మ్యాజిక్ ఫిగర్‌కు కావాల్సిన మెజార్జీకి(45)మించి 49 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో కేంద్రపాలిత ప్రాంతంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు లాంఛనంగా మారింది.ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో బీజేపీ 29 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. నౌషేరా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాష్ట్ర బీజేపీచీఫ్ రవీందర్ రైనా ఓటమి చెందారు. నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్ధి సురీందర్ చౌదరి చేతిలో 7, 819ఓట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఈసీ ప్రకారం.. చౌదరికి 35,069 ఓట్లు రాగా, రైనాకు 27,250 ఓట్లు వచ్చాయి.కాగా జమ్ముకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. హంగ్ ప్రభుత్వమే ఏర్పాటు అవుతుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ వాటికి భిన్నంగా ఫలితాల్లో కాంగ్రెస్- ఎన్సీ కూటమి ఆధిక్యంలో దూసుకెళ్లింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు దక్కించుకుంది. దీంతో బుద్గామ్‌లో గెలుపొందిన ఒమర్ అబ్దుల్లానే సీఎంగా బాధ్యతలు చేపడతారని ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దులా పేర్కొన్నారు. -
రౌండ్ రౌండ్ కు మారుతున్న ఫలితాలు...
-
Watch Live: హర్యానా, జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలు
-
బీజేపీ వెనుకంజకు అసలు కారణం ఇవే.. రుద్రరాజు కీలక వ్యాఖ్యలు
-
ఒడిశాలో 24 ఏళ్ల తర్వాత మారనున్న ప్రభుత్వం
ఒడిశాలో అధికార బీజూ జనతాదళ్ (బీజేడీ)కి ఎదురు దెబ్బ తగిలింది. 24 ఏళ్ల తర్వాత తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. తాజాగా విడుదలైన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతుంది. మధ్నాహ్యం 4.50 గంటల సమయానికి ఒడిశాలో మొత్తం 147 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 80 స్థానాల్లో, బీజూ జనతదాళ్ 52, కాంగ్రెస్ 15 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతున్నాయి. తాజా అసెంబ్లీ ఫలితాలతో బీజేపీ అధికారం చేపట్టడం అనివార్యమైంది.లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 400 పై చీలూకు స్థానాల్లో విజయం సాధించాలే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ 137 స్థానాల్లో గెలుపొందగా 158 స్థానాల్లో ఆదిక్యంలో కొనసాగుతుండగా.. ఒడిశా లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఊహించని ఫలితాల్ని రాబట్టింది. 21 లోక్‌సభ స్థానాలకు బీజేపీ 19 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతుండగా.. బీజూ జనతాదళ్, కాంగ్రెస్‌లు చెరోస్థానంలో లీడింగ్‌లో ఉన్నాయి.ఒడిశా బీజేపీ సీఎం ఎవరంటే?ఒడిశా బీజేపీ ముఖ్యమంత్రిగా ఎవరిని నియమిస్తుందనే అంశంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమల్.. పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కథనాల ఆధారంగా.. ఒడిశా సీఎం రేసులో నలుగురు అభ్యర్ధులు ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో బీజేపీ కేంద్ర మాజీ మంత్రి, సిట్టింగ్ ఎంపీ జువల్ ఓరం, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బైజయంత్ పాండా,బీజేపీ నేత ధర్మేంద్ర ప్రధాన్‌లు ఉన్నారు. అయితే ఈ నలుగురు ఒడిశా లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో లీడింగ్‌లో ఉన్నారు. పట్నాయక్ ఆశలు అడియాశలుతాజాగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో 24 ఏళ్లగా ఒడిశా సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ ఆశలు అడియాశలయ్యాయి. ఒడిశా సీఎంగా నవీన్ పట్నాయక్ 23 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. అయితే ఐదోసారి అధికార పీఠాన్ని అధిష్టించి.. సిక్కిం మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న (సీఎంగా 24 ఏళ్ల 165 రోజుల) రికార్డును అధిగమించాలన్న నవీన్ పట్నాయక్ ఆకాంక్ష కలగానే మిగిలింది. -
Sikkim: ఎస్కేఎం శాసనసభాపక్ష నేతగా తమాంగ్
గ్యాంగ్‌టక్: సిక్కిం క్రాంతికారీ మోర్చా(ఎస్కేఎం) శాసనసభా పక్ష నేతగా ప్రేమ్ సింగ్ తమాంగ్ ఎన్నికయ్యారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో ఆ పార్టీ అసెంబ్లీలోని 32 సీట్లకు గాను 31 సీట్లను కైవసం చేసుకోవడం తెల్సిందే. ఆదివారం రాత్రి సీఎం తమాంగ్ అధికార నివాసంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశానికి మొత్తం 31 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎస్కేఎం సెక్రటరీ జనరల్ అరుణ్ ఉప్రెటి శాసనసభా పక్ష నేతగా తమాంగ్ పేరును ప్రతిపాదించగా ఎమ్మెల్యే సోనమ్ లామా బలపరిచారు. అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి తమాంగ్ గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. -
ఒడిశాలో హోరాహోరీ
భువనేశ్వర్: 147 స్థానాలున్న ఒడిశా శాసనసభ ఎన్నికల్లో ఈసారి హోరాహోరీ పోరు తప్పదని ఇండియా టుడే–యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. విపక్ష బీజేపీకి 62 నుంచి 80 స్థానాలు లభించే అవకాశం ఉందని, అధికార బిజూ జనతాదళ్(బీజేడీ)కి సైతం 62 నుంచి 80 స్థానాలే దక్కే వీలుందని అంచనా వేసింది. దీన్నిబట్టి చూస్తే ఒడిశాలో బీజేపీ అధికారం దక్కించుకొనేందుకు ఆస్కారం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఒకవేళ బీజేడీకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే ముఖ్యమంత్రి నవీన్ పటా్నయక్ రాజకీయ ప్రస్థానం దాదాపు ముగిసినట్లే అని చెప్పొచ్చు. ఆయన ఐదుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. నవీన్ పట్నాయక్ ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒడిశాలో కాంగ్రెస్ 5 నుంచి 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొనే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. బీజేపీ ఓట్ల శాతం 42 శాతానికి పెరుగుతుందని, బీజేడీ ఓట్ల శాతం 42 శాతం పడిపోతుందని, కాంగ్రెస్‌కు 12 శాతం ఓట్లు లభించే అవకాశం ఉందని తెలియజేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ 112 సీట్లు, బీజేపీ 23, కాంగ్రెస్ 9 సీట్లు గెలుచుకున్నాయి. 21 లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి ఏకంగా 18–20 వస్తాయని ఇండియా టుడే అంచనా వేసింది! -
సిక్కింలో ఎస్కేఎం
గాంగ్టక్: సిక్కిం శాసనసభ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్కేఎం) సంచలన విజయం నమోదు చేసింది. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో 32 స్థానాలకు గాను ఏకంగా 31 తన ఖాతాలో వేసుకుంది. వరుసగా రెండోసారి అధికారం దక్కించుకుంది. ఎస్కేఎం అధినేత, ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్ ఈ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీకి దిగి రెండింటా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో 17 సీట్లు గెలుచుకున్న ఎస్కేఎం ఈసారి క్లీన్‌స్వీప్ చేయడం విశేషం. పోలైన మొత్తం ఓట్లలో 58.28 శాతం సాధించింది! 2019 దాకా 25 ఏళ్ల పాటు అప్రతిహతంగా రాష్ట్రాన్ని పాలించిన విపక్ష సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్) ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. ఎస్డీఎఫ్ అధ్యక్షుడు, మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ అనూహ్య ఓటమి చవిచూశారు. బీజేపీ, కాంగ్రెస్ అయితే ఖాతాయే తెరవలేదు! 31 సీట్లలో పోటీ చేసిన బీజేపీకి కేవలం 5.18 శాతం ఓట్లు లభించాయి. కాంగ్రెస్‌కైతే 0.32 శాతం ఓట్లే వచ్చాయి. భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెపె్టన్, ఎస్డీఎఫ్ ఉపాధ్యక్షుడు బైచుంగ్ భూటియా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే దిల్లీరామ్ థాపా కూడా ఓటమి చవిచూశారు. నామ్చీ జిల్లా బర్ఫుంగ్ నుంచి పోటీ చేసిన భూటియా ఎస్కేఎం అభ్యర్థి డోర్జీ భూటియా చేతిలో ఓటమి చవిచూశారు. డోర్జీకి 8,358 ఓట్లు, భూటియాకు 4,012 ఓట్లు లభించాయి. అసెంబ్లీ ఎన్నికల ముందే భూటియా ఎస్డీఎఫ్లో చేరారు.మోదీ అభినందనలు ఎస్‌కేఎంకు, సీఎం తమాంగ్కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి పని చేస్తామన్నారు. బీజేపీకి ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రధానికి తమాంగ్ కృతజ్ఞతలు తెలిపారు.టీచర్ నుంచి సీఎం దాకా తమాంగ్ ఆసక్తికర ప్రస్థానం ప్రేమ్‌సింగ్ తమాంగ్. సిక్కింలో ఎస్కేఎం క్లీన్‌స్వీప్ వెనుక ఉన్న శక్తి. 56 ఏళ్ల తమాంగ్ వ్యక్తిగత చరిష్మాతోపాటు పరిపాలనాదక్షుడిగా ఆయనకున్న పేరు, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు ఈ ఘన విజయానికి కారణమయ్యాయి. తమాంగ్ 1968 ఫిబ్రవరి 5న జన్మించారు. తల్లిదండ్రులు కాలూసింగ్ తమాంగ్, ధన్మాయ తమాంగ్. పశి్చమబెంగాల్‌లోని డార్జీలింగ్లో కాలేజీ విద్య పూర్తిచేశారు. 1990లో ప్రభుత్వ ఉపాధ్యయుడిగా ఉద్యోగంలో చేరారు. మూడేళ్ల తర్వాత రాజీనామా చేసి ఎస్డీఎఫ్లో చేరారు. 15 ఏళ్లపాటు మంత్రిగా చేశారు. 2009లో నాటి సీఎం పవన్ కుమార్ చామ్లింగ్‌తో విభేదించి ఎస్డీఎఫ్ నుంచి బయటకొచ్చారు. 2013లో ఎస్కేఎం ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికల్లో పార్టీ 10 సీట్లు సాధించింది. అవినీతికి కేసుల్లో అరెస్టయిన తమాంగ్ ఏడాదిపాటు జైల్లో ఉండి 2017లో బయటికొచ్చారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 17 సీట్లు గెలిచి రెండేళ్లకే సీఎం అయ్యారు. అనంతరం పార్టీని మరింత పటిష్టపరిచారు. -
అరుణాచల్‌లో బీజేపీ
ఈటానగర్: అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించింది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. 60 స్థానాలకు గాను ఏకంగా 46 చోట్ల కాషాయ జెండా రెపరెపలాడింది. 10 స్థానాలు ముందే ఏకగ్రీవంగా బీజేపీ సొంతం కావడంతో ఏప్రిల్ 19న మిగతా 50 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది. బీజేపీ 36 సీట్లు గెలుచుకోగా నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) 5, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 3, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) 2 స్థానాలు నెగ్గాయి. కాంగ్రెస్ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నెగ్గారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41 సీట్లు సాధించగా ఈసారి మరో ఐదు పెరగడం విశేషం. ఏకగ్రీవంగా నెగ్గిన వారిలో సీఎం పెమా ఖండూ కూడా ఉన్నారు. అభివృద్ధి రాజకీయాలకు పట్టం: మోదీ అరుణాచల్ ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. బీజేపీకి మరోసారి విజయం కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రగతి కోసం మరింత ఉత్సాహంగా, నూతన శక్తితో పని చేస్తామంటూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘అభివృద్ధి రాజకీయాలకు ప్రజలు పట్టం కట్టారు. పార్టీ కార్యకర్తల అలుపెరుగని కృషితోనే ఈ విజయం సాధ్యమైంది’’ అని అన్నారు. సంగీతాభిమాని...అరుణాచల్‌లో బీజేపీని వరుసగా మూడోసారి గెలుపు బాటన నడిపిన నాయకుడిగా పెమా ఖండూ పేరు మార్మోగిపోతోంది. క్రీడలు, సంగీతం పట్ల అమితాసక్తి ఉన్న ఆయన రాష్ట్రంలో తిరుగులేని నేతగా ఎదిగారు. 2000లో కాంగ్రెస్‌లో చేరిన ఖండూ తండ్రి డోర్జీ ఖండూ ప్రాతినిధ్యం వహించిన ముక్తో అసెంబ్లీ స్థానం నుంచి ఉప ఎన్నికలో గెలిచారు. నబామ్ తుకీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. 2016 జనవరిలో రాష్ట్రపతి పాలన అనంతరం బీజేపీ మద్దతిచి్చన కల్హోపుల్ ప్రభుత్వంలో మరోసారి మంత్రి అయ్యారు. సుప్రీంకోర్టు జోక్యంతో తుకీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చింది. తుకీ రాజీనామాతో 2016లో ఖండూ 37 ఏళ్ల వయసులో తొలిసారి సీఎం అయ్యారు. తర్వాత బీజేపీలో చేరారు. 2019లో రెండోసారి సీఎం అయి ఐదేళ్లూ కొనసాగారు. తాజాగా మరోసారి విజయం దక్కించుకున్నారు. బౌద్ధ మతస్థుడైన పెమా ఖండూ మోన్పా గిరిజన తెగకు చెందినవారు. తండ్రి డోర్జీ 2011లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. -
Election Commission of India: నేడే అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఫలితాలు
ఈటానగర్/గ్యాంగ్‌టక్: సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆదివారం ఉదయం ఆరు గంటల కల్లా ఓట్ల లెక్కింపు మొదలయ్యేలా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. 60 స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పటికే 10 చోట్ల బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. మిగిలిన 50 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో ఈవీఎంలలో నిక్షిప్తమైన 133 మంది అభ్యర్థుల భవితవ్యం నేటితో తేలనుంది. తక్కువ స్థానాలు కావడంతో ఆదివారం మధ్యాహ్నంకల్లా తుది ఫలితాలు వెల్లడికానున్నాయని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ) పవన్‌కుమార్ సైన్ శనివారం చెప్పారు. సిక్కింలోనూ.. సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. మరోసారి అధికారం చేపట్టాలని అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్కేఎం) ఉవ్విళ్లూరుతుండగా ఎలాగైనా విజయం సాధించాలని సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్(ఎస్డీఎఫ్), బీజేపీ, కాంగ్రెస్, సిటిజెన్ యాక్షన్ పారీ్ట–సిక్కిం ఆశపడుతున్నాయి. ఈసారి ఏప్రిల్ 19న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 146 మంది అభ్యర్థులు ఈసారి పోటీపడ్డారు. -
మధ్యాహ్నం 2 గంటలకే 111 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాల వెల్లడి
సాక్షి, అమరావతి: వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపారు. సత్వరమే ఫలితాల ప్రకటనకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 175 శాసన సభ నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్ల లోపు లెక్కింపు జరుగుతుందని, వీటి ఫలితాలు మధ్యాహ్నం 2 గంటల్లోపే ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. 61 నియోజకవర్గాల్లో 21 నుండి 24 రౌండ్లు లెక్కింపు జరుగుతుందని, వీటి ఫలితాలు సాయంత్రం 4 గంటల్లోపు వస్తాయన్నారు. మిగిలిన 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు పైబడి ఓట్ల లెక్కింపు జరుగుతుందని, సాయంత్రం 6.00 గంటల్లోపు వీటి ఫలితాలు రావొచ్చని వివరించారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు టేబుళ్లను పెంచి సకాలంలో పూర్తి చేస్తామన్నారు. రాత్రి 8 – 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ బుధవారం రాష్ట్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సమీక్షించారు. లెక్కింపు ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలు, శాంతిభద్రతల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో కౌంటింగ్‌కు చేపట్టిన ఏర్పాట్లను సీఈవో మీనా వివరించారు. ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు జరిగిన జిల్లాల్లో ఓట్ల లెక్కింపు రోజు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 144 సెక్షన్ అమలుతో పాటు ఆ జిల్లాల్లో సీనియర్ అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. డిజీపీతో పాటు తాను కూడా పల్నాడు జిల్లాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించామని, అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. ఓట్ల లెక్కింపులో లోపాలు జరగకూడదు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనలో ఎటువంటి లోపాలు, జాప్యం జరగడానికి వీల్లేదని, అందుకోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, త్వరితగతిన కచ్చితమైన ఫలితాలను ప్రకటించాలని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ రాష్ట్ర అధికారులకు చెప్పారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపును విజయవంతంగా పూర్తి చేయాలని అన్ని నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలకు సూచించారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం–21 సీ, 21ఈలను అదే రోజు ఫ్లైట్‌లో ఈసీకి పంపాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థులు, ఏజెంట్లు ఎటువంటి అవాంతరాలు కలిగించకుండా లెక్కింపు ప్రక్రియపై వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల్లో కూలీల విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులను ఎవ్వరినీ అందుకు వినియోగించొద్దని చెప్పారు. గుర్తింపు కార్డులు ఉన్నవారినే లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. ఎన్నికల అనంతరం పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు జరిగినందున, ఈ జిల్లా అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఓట్ల లెక్కింపు రోజు ఎటువంటి ఘటనలకు తావు లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్, అడిషనల్ డీజీ ఎస్ బాగ్చీ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలను, సీపీలను అప్రమ్తతం చేశామని, శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లు, త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాల ప్రకటనకు చేపడుతున్న చర్యలు, శాంతి భద్రతల పరిరక్షణకు చేస్తున్న బందోబస్తు ఏర్పాట్లను ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు నితీష్ వ్యాస్‌కు వివరించారు. ఈ సమావేశంలో అదనపు సీఈవో హరేంధిర ప్రసాద్, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు తదితరులు వారి నియోజకవర్గాల నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. -
TS: గులాబీ బాస్ గ్రాండ్ రీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి, ఆ వెంటనే తుంటి ఎముకకు సర్జరీతో కొంతకాలంగా ఇంటికే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ త్వరలో గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 17న తన పుట్టినరోజును పురస్కరించుకుని గులాబీ బాస్ మళ్లీ జనం మధ్యకు రానున్నారు. పుట్టినరోజు నాడే కేసీఆర్ హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ స్టేట్ ఆఫీస్ తెలంగాణ భవన్‌కు రానున్నారని సమాచారం. బాస్ రీ ఎంట్రీ అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. పుట్టినరోజు నాడు కేసీఆర్ తిరిగి తెలంగాణ భవన్‌కు రానుండటంతో భారీ ఎత్తున స్వాగత సన్నాహాలకు పార్టీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. బాస్‌కు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రాండ్ రీ ఎంట్రీ తర్వాత తొలుత సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌కు కేసీఆర్ భారీ కాన్వాయ్‌తో వెళ్లనున్నారు. అక్కడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్‌తో సమావేశమవుతారు. ఆ తర్వాత నుంచి హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్, గజ్వేల్ క్యాంప్ ఆఫీసు వేదికగా కేసీఆర్ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. తాను త్వరలో అందుబాటులో ఉంటానని కేసీఆర్ ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలకు ఫోన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న లోక్‌సభ ఎన్నికలకు ముందే వరంగల్‌లో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ నేతల సిద్ధమవుతున్నారు. ఇటీవల వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ నేతలతో సమీక్ష సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ చీఫ్ కేసీఆర్ రీ ఎంట్రీపై హింట్ ఇచ్చారు. త్వరలో కేసీఆర్ తెలంగాణభవన్‌లో అందుబాటులో ఉంటారని చెప్పారు. ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యటనకు కూడా వెళ్తారని వెల్లడించారు. తుంటి ఎముకకు సర్జరీ కారణంగా ప్రస్తుత అసెంబ్లీ తొలి సమావేశాలకు రాలేకపోయిన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఇప్పటివరకు నోరు విప్పలేదు. దీంతో రీ ఎంట్రీలో కొత్త ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో అనే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. ఇదీచదవండి.. మేమూ రామ భక్తులమే : మంత్రి ఉత్తమ్ -
సుపరిపాలనకు మారుపేరు బీజేపీ
న్యూఢిల్లీ: సుపరిపాలనకు బీజేపీ ఒక పర్యాయపదంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. గత కొన్ని దశాబ్దాల అసెంబ్లీ ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే ప్రజలు బీజేపీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తేటతెల్లం అవుతోందని అన్నారు. అధికారాన్ని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్, ఇతర పారీ్టల కంటే బీజేపీ రికార్డు చాలా మెరుగ్గా ఉన్నట్లు గుర్తుచేశారు. గురువారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇటీవల మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది ఏ ఒక్కరి ఘనత కాదని, బృంద స్ఫూర్తితో అందరూ కలిసి పనిచేయడం వల్లే చక్కటి ఫలితాలు వచ్చాయని అన్నారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో గెలిచామని, తెలంగాణ, మిజోరం రాష్ట్రల్లో బీజేపీ బలం పెరిగిందని పేర్కొన్నారు. సామాన్య ప్రజలతో వారికి సులువుగా అర్థమయ్యే భాషలోనే సంభాíÙంచాలని బీజేపీ నేతలకు, కార్యకర్తలకు మోదీ సూచించారు. ఉదాహరణకు ‘మోదీజీ కీ గ్యారంటీ’ బదులు ‘మోదీ కీ గ్యారంటీ’ అనాలని చెప్పారు. ఇదిగో మా సక్సెస్ రేటు కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు 40 సార్లు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొందని, కానీ, ఏడుసార్లు మాత్రమే గెలిచిందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. కాంగ్రెస్ సక్సెస్ రేటు 18 శాతంగా ఉందన్నారు. బీజేపీ 39 సార్లు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొని 22 సార్లు నెగ్గిందని ఉద్ఘాటించారు. బీజేపీ సక్సెస్ రేటు 56 శాతమని వివరించారు. ఈ విషయంలో కాంగ్రెస్ కంటే ప్రాంతీయ పారీ్టలే మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. ప్రాంతీయ పారీ్టలు 36 సార్లు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొని, 18 సార్లు గెలిచాయని, 50 శాతం సక్సెస్ రేటు సాధించాయని వెల్లడించారు. దీన్నిబట్టి చూస్తే అధికారం అప్పగించే విషయంలో ప్రజలు బీజేపీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలను సమర్థవంతంగా నడిపించే శక్తి బీజేపీకి ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. తమ పార్టీ ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకత లేదని, సానుకూలత ఉందని వివరించారు. పారీ్టలో తాను ఒక సాధారణ కార్యకర్తను మాత్రమేనని చెప్పారు. ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’లో పాల్గొనండి తన దృష్టిలో దేశంలో పేదలు, యువత, మహిళలు, రైతులు అనే నాలుగు పెద్ద కులాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఆయా కులాల సంక్షేమం కోసం కృషి చేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడానికి ఉద్దేశించిన ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’లో పాల్గొనాలని పార్లమెంట్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పనితీరు పట్ల తమ కార్యకర్తలు సంతోషంగా ఉన్నారని బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
ఆ లోక్‌సభ సెగ్మెంట్లలో మిశ్రమ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా చూస్తే..అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆయా రాజకీయపార్టీలకు మిశ్రమ స్పందన మిగిల్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 9 ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్కు నాలుగు లోక్‌సభ సెగ్మెంట్లలో కనీస ప్రాతినిధ్యమే దక్కలేదు. కాంగ్రెస్ పార్టీకి సైతం రాజధాని పరిధిలోని 3 లోక్‌సభ సెగ్మెంట్లలో గెలవలేకపోయింది. నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ కేవలం ఆదిలాబాద్‌లోనే నాలుగు అసెంబ్లీ సీట్లతో పూర్తి ఆధిపత్యాన్ని చాటుకుంది. నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్ లోక్‌సభ స్థానాల పరిధిలో గుడ్డిలో మెల్లగా ఒకటి రెండు సీట్లతో ఉనికిని చాటుకుంది. బీఆర్ఎస్ నాలుగు చోట్ల జీరో... మూడు చోట్ల ఒక్కో స్థానమే 39 అసెంబ్లీ సెగ్మెంట్లలో సీట్లు గెలిచి బలమైన ప్రతిపక్షంగా అవతరించిన బీఆర్ఎస్కు లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా చూస్తే...నాలుగు చోట్ల ప్రాతినిధ్యం దక్కలేదు. పెద్దపల్లి, మహబూబ్‌నగర్, ఖమ్మంలతోపాటు హైదరాబాద్ లోక్‌సభ స్థానాల్లోని 28 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు. హైదరాబాద్ లోక్‌సభ పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎంఐఎం, గోషామహల్లో బీజేపీ గెలిచింది. ఇక పెద్దపల్లి, మహబూబ్‌నగర్, ఖమ్మంలోని 21 స్థానాల్లో కాంగ్రెస్‌కు ఎదురే లేకుండా పోయింది. భువనగిరి ఎంపీ పరిధిలో కేవలం జనగామలో మాత్రమే టీఆర్ఎస్ గెలవగా, మిగతా ఆరు స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్లాయి. వరంగల్ లోక్‌సభ పరిధిలోని స్టేషన్ ఘన్పూర్, నల్లగొండలో సూర్యాపేట, మహబూబాబాద్‌లో భద్రాచలం సీట్లు మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకోగా, మిగతా ఆరేసి సీట్లను కాంగ్రెస్ సొంతం చేసుకోవడం గమనార్హం. కాంగ్రెస్ రాజధానిలో హస్తవాసి బాగాలేదు ముఖ్యమంత్రి రేసులో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి దేశంలోనే అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గాల్లో ఒకటి. ఈ లోక్‌సభ స్థానం నుంచి రేవంత్‌రెడ్డి 2019 ఎన్నికల్లో 13వేల స్వల్ప తేడాతో విజయం సాధించారు. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి పరిధిలోని ఏడు సెగ్మెంట్లలోనూ బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎంపీగా ఉన్న హైదరాబాద్‌లో కూడా కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు. మెదక్ లోక్‌సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో మెదక్‌లో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందగా, మిగతా ఆరుచోట్ల బీఆర్ఎస్ విజయ కేతనం ఎగురవేసింది. బీజేపీ నలుగురు ఎంపీలున్నా నిరాశే బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు లోక్సభసీట్లలోనూ నిరాశే మిగిలింది. కేవలం ఆదిలాబాద్ ఎంపీ పరిధిలోనే బీజేపీ మెరుగైన స్థానాలు సాధించింది. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ సోయం బాపూరావు బోథ్ అసెంబ్లీ నుంచి ఓడిపోయినా, ఆదిలాబాద్, నిర్మల్, సిర్పూరు, ముథోల్‌లలో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ఒకింత ఓదార్పు. మరో ఎంపీ సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని ఏడు సీట్లలో నాలుగు కాంగ్రెస్, మూడు బీఆర్ఎస్ గెలుచుకుంది. సంజయ్ పోటీ చేసిన కరీంనగర్, సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహించిన హుజూరాబాద్‌లలో బీఆర్ఎస్ గెలుపొందడం విశేషం. మరో ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్‌లో ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్‌లలో మాత్రమే బీజేపీ విజయం సాధించింది. సిట్టింగ్ ఎంపీ అర్వింద్ పోటీ చేసిన కోరుట్లలో ఆయనే ఓడిపోయారు. ఇక కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించగా, నాంపల్లిలో ఎంఐఎం స్వల్ప తేడాతో కాంగ్రెస్‌పై విజయం సాధించింది. -
Five States Assembly Elections 2023: 12 రాష్ట్రాల్లో అధికార పీఠంపై కమలం
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రశంసనీయమైన ఫలితాలు సాధించింది. మూడు కీలక రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకుంది. మధ్యప్రదేశ్‌లో అధికారం నిలబెట్టుకోగా, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో సులువుగా నెగ్గింది. దీంతో దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా అధికారం చేపట్టినట్లయ్యింది. ఉత్తరాఖండ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, గోవా, అస్సాం, త్రిపుర, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌లో ఇప్పటికే బీజేపీ ప్రభుత్వాలున్నాయి. ఇక మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వాలు కొలువుదీరడం లాంఛనమే. అలాగే మహారాష్ట్ర, మేఘాలయా, నాగాలాడ్, సిక్కిం ప్రభుత్వాల్లో బీజేపీ భాగస్వామిగా కొనసాగుతోంది. అక్కడ మిత్రపక్షాలతో కలిసి అధికారం పంచుకుంటోంది. దేశంలో రెండో అతిపెద్ద జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తాజా ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లను కోల్పోయింది. తెలంగాణలో విజయం సాధించింది. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఇప్పటికే సొంతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. ఇప్పుడు తెలంగాణ సైతం ఆ పార్టీ ఖాతాలోకి చేరింది. అంటే మొత్తం మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సొంతంగా అధికారంలోకి ఉన్నట్లు లెక్క. బిహార్, జార్ఖండ్ ప్రభుత్వాల్లో కాంగ్రెస్ భాగస్వామిగా ఉంది. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి మిత్రపక్షంగా వ్యవహరిస్తోంది. ఇక్కడ ప్రభుత్వంలో భాగస్వామి కాదు. మరో జాతీయ పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) ఢిల్లీ, పంజాబ్‌లో పూర్తి మెజారీ్టతో అధికారంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ నుంచి రెండు రాష్ట్రాలు చేజారిపోవడంతో ఇక ఉత్తర భారతదేశంలో ‘ఆప్’ అతిపెద్ద ప్రతిపక్షంగా అవతరించిందని ఆ పార్టీ నేత జాస్మిన్ షా తెలిపారు. 2024లో లోక్‌సభ సాధారణ ఎన్నికలతోపాటు సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. -
విజయశాంతికి ధన్యవాదాలు
-
మూడు రాష్ట్రాల్లో కమలం హవా..
► దేశంలో నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లో కమలం వికసించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ భారీ స్థాయిలో విజయం సాధించింది. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంది. మధ్యప్రదేశ్‌లో 230 సీట్లకుగాను బీజేపీ 163 సీట్లను సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 66 సీట్లకు పరిమితమైంది. ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు. We bow to the Janta Janardan. The results in Chhattisgarh, Madhya Pradesh and Rajasthan indicate that the people of India are firmly with politics of good governance and development, which the @BJP4India stands for. I thank the people of these states for their unwavering… — Narendra Modi (@narendramodi) December 3, 2023 "Idea of 'sabka saath, sabka vikas' has won today": PM Modi at BJP central office after party's victory in three states Read @ANI Story | https://t.co/arpnxbvkYU#PMModi #BJP #AssemblyElections2023 pic.twitter.com/y7wVer9ms6 — ANI Digital (@ani_digital) December 3, 2023 ► రాజస్థాన్‌లో 199 సీట్లకు గాను బీజేపీ 115 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 69 సీట్లను మాత్రమే గెలిచింది. ఇతరులు మరో 15 సీట్లను సొంతం చేసుకున్నారు. అటు ఛత్తీస్‌గఢ్‌లోనూ అంతే.. మొత్తం 90 సీట్లకు గాను బీజేపీ 54 సీట్లను సాధించింది. కాంగ్రెస్ 35కే పరిమితమైంది. ఇతరులు 1 సీటును సాధించారు. తెలంగాణలో కాంగ్రెస్ 65 స్థానాల్లో విజయం సాధించింది. బీఆర్ఎస్ 39 సీట్లలో బీజేపీ 8, ఎంఐఎం 7 స్థానాల్లో అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. #WATCH | Madhya Pradesh CM Shivraj Singh Chouhan receives his winning certificates from the Election Officer, in Bhopal.#MadhyaPradeshElection2023 pic.twitter.com/LKfDoclduy — ANI (@ANI) December 3, 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీగా పోటీ సాగుతోంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్‌తో దూసుకుపోతుంది. ఇప్పటివరకు బీజేపీ 73 స్థానాల్లో లీడింగ్. కాంగ్రెస్ 28 స్థానాల్లో ముందంజలో ఉంది. రాజస్థాన్‌లో 86 స్థానాల్లో లీడ్‌లో బీజేపీ ఉంది. కాంగ్రెస్ 64, సీపీఎం 2, ఇతరులు 11 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మొదటి రౌండ్ కౌంటింగ్‌లో కాంగ్రెస్ 15, బీజేపీ 13 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అంబికాపూర్ స్థానంలో ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి టిఎస్ సింగ్ డియో ముందంజలో ఉండగా, పటాన్ నియోజకవర్గంలో సీఎం భూపేష్ బఘేల్ వెనుకంజలో ఉన్నారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ ఓట్ల లెక్కింపుతో మొదలైంది. 11 గంటలకల్లా ఫలితాల సరళిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో బీజేపీ నెగ్గవచ్చని, ఛత్తీస్‌గఢ్, తెలంగాణల్లో కాంగ్రెస్ గెలుస్తుందనే ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు ఉన్నాయి. ఐదో రాష్ట్రమైన మిజోరంలో ఓట్ల లెక్కింపు సోమవారానికి వాయిదా పడింది. వీటిని కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న నేపథ్యంలో ఫలితాలపై దేశవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మూడుచోట్ల ముఖాముఖి మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోరు సాగింది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, మిగతా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. గత మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని మట్టికరిపించిన కాంగ్రెస్, అదే ఊపులో తాజా ఎన్నికల్లో మరిన్ని రాష్ట్రాల్లో పాగా వేస్తానని ఆశాభావంతో ఉంది. ఈసారి రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లు తమ వశమవుతాయని బీజేపీ భావిస్తోంది. ఈసారి మధ్యప్రదేశ్‌లో బీజేపీకి బాగా మొగ్గుందని, రాజస్తాన్‌లో ఆ పార్టీ ముందంజలో ఉందని గురువారం వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పేర్కొన్నాయి. ఛత్తీస్‌గఢ్‌తో పాటు తెలంగాణలో కాంగ్రెస్‌కే విజయావకాశాలున్నట్టు తేల్చాయి. హోరాహోరీ పోటీ నేపథ్యంలో హంగ్ వచ్చే చోట ఎమ్మెల్యేలను శిబిరాలకు తరలించేందుకు రెండు పారీ్టలూ ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు సమాచారం. ► నాలుగు రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ► తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు. ► అనంతరం 8.30గంటలకు నుంచి ఓటింగ్ యంత్రాల్లోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 52 జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ సాగుతోంది. ఇక్కడ 2,533 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. గురువారం నాటి ఎగ్జిట్ పోల్స్‌లో మూడు బీజేపీకి ఘనవిజయం ఖాయమని పేర్కొన్నాయి. 2018 మాదిరిగా రెండు పార్టీలూ విజయానికి దగ్గరగా వస్తాయని మరికొన్ని అంచనా వేశాయి. ఒకట్రెండు కాంగ్రెస్ విజయాన్ని సూచించాయి. భారీ మెజారిటీతో బీజేపీ అధికారాన్ని నిలుపుకుని తీరుతుందని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శనివారం ధీమా వ్యక్తంచేశారు. ప్రజలు ఈసారి మార్పుకే ఓటేశారని పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ చెప్పుకొచ్చారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు సాధించగా బీజేపీ 109 స్థానాలతో సరిపెట్టుకుంది. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు: 230 మెజారిటీ మార్కు: 116 రాజస్తాన్ ఈ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వాన్ని మార్చేయడం రాజస్తాన్ ప్రజల అలవాటు. ఈ ఆనవాయితీ ఈసారీ కొనసాగుతుందని, మోదీ మేనియా తోడై తమకు అధికారం కట్టబెడుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. సీఎం గెహ్లోత్ మాత్రం ఈసారి ఆనవాయితీ మారుతుందని నమ్మకం పెట్టుకున్నారు. తన సంక్షేమ పథకాలు కచ్చితంగా గట్టెక్కిస్తాయని చెబుతున్నారు. 2018 ఎన్నికల్లో అధికారంలోకి వచి్చన నాటినుంచీ గెహ్లోత్‌పై కారాలూ మిరియాలూ నూరుతూ వస్తున్న కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలట్ ప్రచార పర్వంలో మాత్రం సంయమనం పాటించారు. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు: 200 మెజారిటీ మార్కు: 101 ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 33 జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ సాగుతోంది. లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేలా చూసేందుకు 90 మంది రిటర్నింగ్ అధికారులు, 416 మంది సహాయ రిటరి్నంగ్ అధికారులు, 1,698 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. రాష్ట్రంలో మొత్తం 1,181 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో కాంగ్రెస్ నుంచి సీఎం భూపేశ్ బఘెల్, ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్‌దేవ్, బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ తదితర ప్రముఖులున్నారు. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు: 90 మెజారిటీ మార్కు:46 -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పుపై ఉత్కంఠ
-
Chhattisgarh Election Results 2023: ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఘన విజయం
Updates.. 54 చోట్ల గెలిచిన బీజేపీ 35 స్థానాల్లో కాంగ్రెస్ విజయం ఒక సీటు గెలిచిన గోండ్వానా గణతంత్ర పార్టీ 54 స్థానాల్లో బీజేపీ ముందంజ 49 చోట్ల గెలిచిన బీజేపీ, మరో 5 చోట్ల ఆధిక్యం 33 స్థానాల్లో కాంగ్రెస్ విజయం, 2 చోట్ల ముందంజ ఒక సీటు గెలిచిన గోండ్వానా గణతంత్ర పార్టీ 55కు చేరిన బీజేపీ ఆధిక్యం 12 చోట్ల బీజేపీ గెలుపు. మరో 42 స్థానాల్లో ఆధిక్యం. 7 స్థానాల్లో కాంగ్రెస్ విజయం. మరో 28 చోట్ల ముందంజ. ఈసీ ట్రెండ్స్ ప్రకారం ఆధిక్యంలో బీజేపీ బీజేపీ-53 కాంగ్రెస్-36 ఇతరులు-1 ►ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ సగం మార్కును దాటింది. ఈసీ ట్రెండ్స్ ప్రకారం 50 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 38 స్థానాల్లో కొనసాగుతోంది. BJP crosses the halfway mark in Chhattisgarh; leads on 50 seats as official ECI trends; Congress - 38 pic.twitter.com/3nwc7kjU8M — ANI (@ANI) December 3, 2023 ఈసీ ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ-46 కాంగ్రెస్-40 ఇతరులు-1 Assembly election results 2023: BJP, Congress in close fight in Chhattisgarh Read @ANI Story | https://t.co/5qa7sIWm8r#ChhattisgarhElection2023 #Chhatisgarh #BJP #Congress pic.twitter.com/PfSEFuDabk — ANI Digital (@ani_digital) December 3, 2023 ►ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ రాష్ట్ర బీజేపీ కో-ఇన్చార్జ్ నితిన్ నబిన్ అన్నారు. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. ఇదీ ప్రజలు గ్రహించారన్నారు. స్పష్టమైన మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. #WATCH | Bihar BJP MLA and Chhattisgarh BJP Co-in charge, Nitin Nabin says, "...BJP will form government in Chhattisgarh...The people of Chhattisgarh have realised that the Congress government is corrupt and they have cheated the people. BJP will form the government with a clear… pic.twitter.com/rKlcGnFMHp — ANI (@ANI) December 3, 2023 ►ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీగా పోటీ సాగుతోంది. ఈసీ ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ-39, కాంగ్రెస్-35 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. Update | Assembly elections 2023 | BJP leading on 39 seats, Congress on 35 in Chhattisgarh, say ECI https://t.co/XPv0B1D71f pic.twitter.com/OwTxHgaR5v — ANI (@ANI) December 3, 2023 ఈసీ ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ-27 కాంగ్రెస్-24 ఇతరులు-2 Assembly results: BJP leading on 23 seats in Chhattisgarh Read @ANI Story |https://t.co/CFLP1TPfQ1#ChhattisgarhElections2023 #Chhattisgarh #Congress #BJP #ElectionCommissionOfIndia pic.twitter.com/E2FlQ6As6H — ANI Digital (@ani_digital) December 3, 2023 ►మొదటి రౌండ్ కౌంటింగ్‌లో కాంగ్రెస్ 15, బీజేపీ 13 స్థానాల్లో ఆధిక్యం ►అంబికాపూర్ స్థానంలో ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి టిఎస్ సింగ్ డియో ముందంజ ►పటాన్ నియోజకవర్గంలో సీఎం భూపేష్ బఘేల్ వెనుకంజ Congress - 11, BJP- 11 in 90-seat assembly of Chhattisgarh pic.twitter.com/6Q8Frk0jKn — ANI (@ANI) December 3, 2023 ►బీజేపీ మాజీ మంత్రి అమర్ అగర్వాల్ తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి శైలేష్ పాండేపై 3000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో కాంగ్రెస్ 45 , బీజేపీ 32 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ►ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా మాట్లాడుతూ, మా అంచనాల కంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రెండింటిలోనూ మేము అధికారాన్ని నిలుపుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లో తిరిగి అధికారం చేజిక్కించుకుంటామని, తెలంగాణలో అధికారం చేపడతామన్నారు. #WATCH | Counting of votes begins, Congress leader Pawan Khera says, "The results will be better than our hopes and expectations. We are retaining power in both Rajasthan and Chhattisgarh. We will reclaim power in Madhya Pradesh and claim power in Telangana." pic.twitter.com/nRXevzQcdp — ANI (@ANI) December 3, 2023 ►ఛత్తీస్‌గఢ్‌లో 33 జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేలా చూసేందుకు 90 మంది రిటర్నింగ్ అధికారులు, 416 మంది సహాయ రిటర్నింగ్ అధికారులు, 1,698 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ►రాష్ట్రంలో మొత్తం 1,181 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో కాంగ్రెస్ నుంచి సీఎం భూపేశ్ బఘెల్, ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్‌దేవ్, బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ తదితర ప్రముఖులున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు: 90 మెజారిటీ మార్కు:46 -
కామారెడ్డి కౌంటింగ్ సెంటర్..
-
నాలుగు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల సమరం ముగిసింది. ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైన నేతల భవితవ్యం ఆదివారం వెల్లడి కానుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యాయి. నెలన్నరకు పైగా ప్రచారంలో నిరంతరాయంగా చెమటోడ్చి విశ్రాంతి తీసుకుంటున్న అభ్యర్థులు, నేతల్లో ఫలితాలపై చెప్పలేనంత ఉత్కంఠ నెలకొంది. ఐదో రాష్ట్రమైన మిజోరంలో ఓట్ల లెక్కింపు సోమవారానికి వాయిదా పడింది. వీటిని కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న నేపథ్యంలో ఫలితాలపై దేశవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మూడుచోట్ల ముఖాముఖి మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోరు సాగింది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, మిగతా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. గత మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని మట్టికరిపించిన కాంగ్రెస్, అదే ఊపులో తాజా ఎన్నికల్లో మరిన్ని రాష్ట్రాల్లో పాగా వేస్తానని ఆశాభావంతో ఉంది. ఈసారి రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లు తమ వశమవుతాయని బీజేపీ భావిస్తోంది. ఈసారి మధ్యప్రదేశ్‌లో బీజేపీకి బాగా మొగ్గుందని, రాజస్తాన్‌లో ఆ పార్టీ ముందంజలో ఉందని గురువారం వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పేర్కొన్నాయి. ఛత్తీస్‌గఢ్‌తో పాటు తెలంగాణలో కాంగ్రెస్‌కే విజయావకాశాలున్నట్టు తేల్చాయి. హోరాహోరీ పోటీ నేపథ్యంలో హంగ్ వచ్చే చోట ఎమ్మెల్యేలను శిబిరాలకు తరలించేందుకు రెండు పారీ్టలూ ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు సమాచారం. ఉదయం ఎనిమిదికి షురూ ► నాలుగు రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ► తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ► అనంతరం 8.30గంటలకు నుంచి ఓటింగ్ యంత్రాల్లోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 52 జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ సాగుతోంది. ఇక్కడ 2,533 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. గురువారం నాటి ఎగ్జిట్ పోల్స్‌లో మూడు బీజేపీకి ఘనవిజయం ఖాయమని పేర్కొన్నాయి. 2018 మాదిరిగా రెండు పార్టీలూ విజయానికి దగ్గరగా వస్తాయని మరికొన్ని అంచనా వేశాయి. ఒకట్రెండు కాంగ్రెస్ విజయాన్ని సూచించాయి. భారీ మెజారిటీతో బీజేపీ అధికారాన్ని నిలుపుకుని తీరుతుందని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శనివారం ధీమా వ్యక్తంచేశారు. ప్రజలు ఈసారి మార్పుకే ఓటేశారని పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ చెప్పుకొచ్చారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు సాధించగా బీజేపీ 109 స్థానాలతో సరిపెట్టుకుంది. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు: 230 మెజారిటీ మార్కు: 116 రాజస్తాన్ ఈ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వాన్ని మార్చేయడం రాజస్తాన్ ప్రజల అలవాటు. ఈ ఆనవాయితీ ఈసారీ కొనసాగుతుందని, మోదీ మేనియా తోడై తమకు అధికారం కట్టబెడుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. సీఎం గెహ్లోత్ మాత్రం ఈసారి ఆనవాయితీ మారుతుందని నమ్మకం పెట్టుకున్నారు. తన సంక్షేమ పథకాలు కచ్చితంగా గట్టెక్కిస్తాయని చెబుతున్నారు. 2018 ఎన్నికల్లో అధికారంలోకి వచి్చన నాటినుంచీ గెహ్లోత్‌పై కారాలూ మిరియాలూ నూరుతూ వస్తున్న కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలట్ ప్రచార పర్వంలో మాత్రం సంయమనం పాటించారు. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు: 200 మెజారిటీ మార్కు: 101 ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 33 జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ సాగుతోంది. లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేలా చూసేందుకు 90 మంది రిటర్నింగ్ అధికారులు, 416 మంది సహాయ రిటరి్నంగ్ అధికారులు, 1,698 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. రాష్ట్రంలో మొత్తం 1,181 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో కాంగ్రెస్ నుంచి సీఎం భూపేశ్ బఘెల్, ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్‌దేవ్, బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ తదితర ప్రముఖులున్నారు. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు: 90 మెజారిటీ మార్కు:46 -
కర్ణాటకలో సినిమా అట్టర్ ఫ్లాప్, తెలంగాణలో కాషాయ పార్టీ పరిస్థితేంటి?
కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ మీద ప్రభావం చూపుతాయా? తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి వస్తామన్న కమలనాథుల ఆశలపై కర్ణాటక నీళ్ళు చల్లిందా? కర్ణాటక షాక్ నుంచి తెలంగాణ కాషాయసేన ఇప్పట్లో కోలుకుంటుందా? బీజేపీలోకి వలసలు కొనసాగుతాయా? ఆగుతాయా? అసలు తెలంగాణ కమలనాథుల యాక్షన్ ప్లాన్ ఏంటి? కర్ణాటకలో బీజేపీ సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని.. ఆ తర్వాత గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరేయడమేనని తెలంగాణ కాషాయ సేన భారీగా ఆశలు పెట్టుకుంది. కానీ, కన్నడ ప్రజలు వారి ఆశలు అడియాశలు చేసేశారు. భారీ అంచనాలతో విడుదలైన సినిమా అట్టర్ ఫ్లాప్ అయినట్లుగా కర్ణాటక బీజేపీ పరిస్థితి తయారైంది. అస్థిర రాజకీయాలకు తెర దించుతూ కాంగ్రెస్ విజయ దుంధుభి మోగించింది. కర్ణాటక ఫలితాలు తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపగా.. బీజేపీ నేతల్లో నిరాశ మిగిల్చింది. ఫలితాలు వెల్లడయ్యాక బీజేపీ ఆఫీస్‌లో ఒక్కసారిగా సందడి తగ్గిపోయింది. స్తబ్తత ఆవరించింది. (ఓఆర్ఆర్ను కేసీఆర్ పర్యవేక్షణలో తెగనమ్మారు: రేవంత్ రెడ్డి) చేరికలేవీ? మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి తర్వాత బీజేపీ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మహేశ్వర్ రెడ్డి మినహా.. చెప్పుకోదగ్గ స్థాయిలో చేరికలు జరగలేదు. కన్నడ నాట ఫలితాల ఎఫెక్ట్ తో చేరిన నేతలు కూడా డైలమాలో పడ్డారు. తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి ఈటల రాజేందర్ వెళ్లిన సందర్భంలో పార్టీలో విబేధాలు బయటపడ్డాయి. కర్ణాటక ఫలితాల నేపథ్యంలో ఇప్పట్లో కాషాయ కండువా కప్పుకునేది ఎవరు? కొత్తగా బీజేపీలో చేరే వారికి ఎలాంటి భరోసా కల్పిస్తారు? అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొల్లాపూర్ కు చెందిన జూపల్లి కృష్ణారావు ఇప్పుడు బీజేపీ వైపు చూడటం కష్టమేనని వాళ్ల వర్గీయులు చెబుతున్నారు. వాళ్లు కాంగ్రెస్ వైపు అడుగేస్తారనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. గ్రూపు తగాదాలతో రగిలిపోతున్న తెలంగాణ కమలదళం... కర్ణాటక ఫలితాల ఎఫెక్ట్ తో బలహీనపడుతుందా? నాయకుల మధ్య విభేదాలు రచ్చకెక్కుతాయా? అనే చర్చ జరుగుతోంది. అయితే కర్ణాటకలో ఓడినంత మాత్రాన తెలంగాణలో పార్టీ దూకుడు ఏమాత్రం తగ్గదని.. రెట్టించిన ఉత్సాహంతో కమలదళం కార్యరంగంలోకి దూకుతుందని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. (బీజేపీ కార్యకర్తల్లో కొత్త కన్ఫ్యూజన్.. రంగంలోకి హైకమాండ్) -
కర్ణాటక తీర్పు
సాక్షి, బెంగళూరు: ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. మొత్తం 2,615 మంది అభ్యర్థుల తలరాత ఏమిటో తేలిపోనుంది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎ దురు చూస్తున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నా యి. ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 8 గంటలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) తెరపై ఎన్నికల ఫలితం కనిపించడం ప్రారంభం కానుంది. కౌంటింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తుది ఫలితాలపై మధ్యాహ్నం కల్లా ఒక స్పష్టమైన చిత్రం ఆవిష్కృతం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 73.19 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీల నడుమ హోరాహోరీ ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కొన్ని సర్వేలు బీజేపీ మళ్లీ గెలుస్తుందని తెలియజేశాయి. స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ నెగ్గే అవకాశం ఉన్నట్లు మరికొన్ని సర్వేల్లో వెల్లడయ్యింది. జేడీ(ఎస్) కింగ్‌మేకర్ మారే అవకాశాలు కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటకలో గత 38 ఏళ్లుగా అధికార పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. ఆ ఆనవాయితీని బద్ధలు కొట్టాలన్న లక్ష్యంతో అధికార బీజేపీ శ్రమించింది. మరోవైపు ఈ ఎన్నికలపై కాంగ్రెస్‌కు భారీ ఆశలే ఉన్నాయి. వీటిలో గెలిస్తే పార్టీల్లో కొత్త ఉత్సాహం వస్తుందని, వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో తామే అతిపెద్ద పార్టీగా అవతరిస్తామని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది. తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండనుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం మాదే: బొమ్మై ఎన్నికల్లో తమకే సంపూర్ణ మెజార్టీ లభిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ధీమా వ్యక్తం చేశారు.సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే ప్రసక్తే లేదన్నారు. పార్టీ సహచర నాయకులతో కలిసి మాజీ సీఎం బీఎస్ యడియూరప్పను శుక్రవారం ఆయన నివాసంలో కలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ సొంతంగా పోలింగ్ బూత్ స్థాయిలో ఓటింగ్ సరళిని పరిశీలించిందని మేజిక్ ఫిగర్ దాటుతామన్న విశ్వాసం తమకి ఉందన్నారు. హంగ్ అసెంబ్లీ వస్తే బీజేపీ వైఖరి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఊహాగానాలను తాను విశ్వసించనని చెప్పారు. తమకి మెజార్టీ ఖాయమని స్పష్టం చేశారు. ఈ సారి ఎన్నికల్లో అత్యధికంగా 73.19% పోలింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్‌లో అత్యధిక సంస్థలు కాంగ్రెస్‌కే స్వల్ప మొగ్గు వస్తుందని వెల్లడించాయి. సంప్రదింపులు.. బేరసారాలు కర్ణాటకలో అధికారం చేజిక్కించుకునేందుకు ఇప్పటికే పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. నేతలు వరుసగా సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. గెలుపోటముల లెక్కలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 224 సీట్లను గాను 113 సీట్లు సాధించాలి. కనీసం సాధారణ మెజార్టీ సాధిస్తామని బీజేపీ, కాంగ్రెస్ ధీమాగా చెబుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్‌కు చేరువగా వచ్చి ఆగిపోతే హంగ్ పరిస్థితులు రానున్నాయి. అందుకే కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులపై పార్టీలు కన్నేశాయి. స్వతంత్ర అభ్యర్థులపైనా దృష్టి పెట్టాయి. వారితో సంప్రదింపులు, బేరసారాలు జరుపుతున్నట్లు తెలిసింది. హంగ్ ఏర్పడితే చేపట్టాల్సిన కార్యాచరణపై కాంగ్రెస్ పెద్దలు చర్చించారు. ఇక బీజేపీ నేతలు కూడా సమాలోచనాల్లో మునిగిపోయారు. శుక్రవారం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాజీ సీఎం యడియూరప్ప నివాసానికి వెళ్లి మాట్లాడారు. జేడీ(ఎస్)లో ఇంకా ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో అందరి చూపు ఆ పార్టీ పైనే ఉంది. జేడీ(ఎస్) నేత, మాజీ సీఎం కుమారస్వామి సింగపూర్ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రంలో హంగ్ వస్తే తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించేందుకు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎమ్మెల్యేగా నెగ్గినవారంతా శనివారం సాయంత్రంలోగా బెంగళూరుకు చేరుకోవాలని ప్రధాన పార్టీల నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. -
ట్విస్ట్: ధర్మపురి ఎన్నికపై హైకోర్టు ఆదేశాలు.. స్ట్రాంగ్ రూమ్ తాళాలు మిస్
జగిత్యాల: జిల్లాలోని ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గానికి 2018లో జరిగిన ఎన్నికల డాక్యుమెంట్ కాపీలు, సీసీ ఫుటేజీలు, ఇతర ఎన్నికల సామగ్రి భద్రపర్చిన స్ట్రాంగ్‌రూమ్ తాళాలు మిస్సయ్యాయి. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక అక్రమమని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు సుమారు నాలుగున్నరేళ్లుగా కొనసాగుతోంది. అయితే, ఎన్నికల ఫలితాలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌ను తెరిచి 17ఏ, 17సీ డాక్యుమెంట్ కాపీలు, సీసీ ఫుటేజీలు, ఎన్నికల ప్రొసీడింగ్స్‌ను ఈనెల 11న తమకు సమరి్పంచాలని హైకోర్టు ఇటీవల ఆదేశించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా సమక్షంలో మల్యాల మండలం నూకపల్లి వీఆర్కే కళాశాలలోని స్ట్రాంగ్‌రూమ్‌ను తెరిచేందుకు ఉద్యోగులు వెళ్లారు. ధర్మ పురి నియోజకవర్గానికి సంబంధించిన మూడు స్ట్రాంగ్‌రూమ్‌లు వీఆర్కే కళాశాలలో ఉండగా, అందులో కోర్టు అడిగిన 17ఏ, 17సీ వీడియో ఫుటేజీలు భద్రపర్చిన గది లాక్ ఓపెన్ కాలేదు. మిగతావి రెండు ఓపెన్ అయ్యాయి. అందులో ఈవీఎంలు, వీవీప్యాడ్లు భద్రంగానే ఉన్నాయి. కోర్టు అడిగిన డాక్యుమెంట్లు భద్రపర్చిన స్ట్రాంగ్‌రూమ్ మాత్రమే ఓపెన్ కాకపోవడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయమై కలెక్టర్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ.. ధర్మపురి నియోజకవర్గం స్ట్రాంగ్‌రూమ్–3కి లాక్ ఓపెన్ కావడం లేదని తెలిపారు. పతినెలా వచ్చి చూసినప్పుడు తాళానికి సీల్ వేసే ఉందన్నారు. ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామని, నివేదిక సమరి్పస్తామని, హైకోర్టు నిర్ణయానుసారం వ్యహరిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్ తప్పిదం వల్లే: అడ్లూరి ధర్మపురి నియోజకవర్గ ఎన్నికల వీడియో ఫుటేజీ, డాక్యుమెంట్లు ఉంచిన రూమ్ 786051 తాళం చెవి లేకపోవడానికి కలెక్టర్, మంత్రి కొప్పుల ఈశ్వరే బాధ్యత వహించాలని డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. కలెక్టర్ తప్పిదం వల్లే ఇది జరిగిందని ఆరోపించారు. -
కొండల్లో కాషాయ రాగం
‘ఎవడన్నా కోపంగా కొడతాడు, లేకపోతే బలంగా కొడతాడు... వీడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు!’ ఇది ఓ హిట్ సినిమాలో ఫైట్ చేసిన హీరోను ఉద్దేశించి ఓ ఛోటా విలన్ పాపులర్ డైలాగ్. సమయం, సందర్భం వేరైనా... గురువారం నాడు వెలువడ్డ మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయాలకు ఇదే డైలాగ్ సరిగ్గా సరిపోతుంది. త్రిపుర అసెంబ్లీ స్థానాల్లో సగానికి పైగా గెలిచి, బీజేపీ ఆ రాష్ట్రాన్ని స్వీప్ చేసింది. నాగాలాండ్‌లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీపీపీ కూటమి అధిక స్థానాలు సాధించి, సర్కారు ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. మిగిలిన మేఘా లయలో ఎన్పీపీ అధిక స్థానాలు దక్కించుకున్నా, అక్కడా ప్రస్తుత సీఎం కన్రాడ్ సంగ్మా చూపు నిన్నటి దాకా తమ ప్రభుత్వంలో భాగమైన బీజేపీని మళ్ళీ కలుపుకోవడం మీదే ఉంది. వెరసి, ముచ్చటగా మూడు రాష్ట్రాలూ బీజేపీ జేబులోనే! అదీకాక అటు సీపీఎం, ఇటు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తదితరుల్ని కనుమరుగు చేసి, కాషాయం రెపరెపలాడడం విశేషం. కొన్నేళ్ళ క్రితం ఈశాన్యంలో సీట్ల బలమే కాదు... ఓటర్ల బలగం కూడా లేని కాషాయ పార్టీ ఇప్పుడు అక్కడి రాష్ట్రాలన్నిటిలో కాంగ్రెస్‌ను తోసిపుచ్చి, తిరుగులేని శక్తిగా నిలవడం ఆషామాషీ కాదు. అందుకు ఆ పార్టీ దీర్ఘకాలిక వ్యూహం, ఎన్నికల లెక్కల్లో స్థానిక పొత్తులు వగైరా అనేకం ఉన్నాయి. గిరిజన జనాభా, క్రైస్తవులు ఎక్కువగా ఉండే ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ స్వరం మార్చింది. మతపరమైన అంశాలు, గొడ్డుమాంసంపై నిషేధం లాంటి ప్రస్తావనలే తేకుండా తెలివిగా వ్యవహ రించింది. మైనారిటీల అభద్రతనూ, సెంటిమెంట్లనూ రెచ్చగొట్టే తెలివితక్కువ పనికి దిగలేదు. పైగా, కేంద్రంలోని అధికారపక్షంతో స్నేహంగా సాగాలని భావించే అభివృద్ధి ఆధారిత ప్రజాస్వా మ్యాన్ని ఈ సుదూర పర్వతప్రాంత రాష్ట్రాలు నమ్మడం సాధారణం. అందుకు తగ్గట్లే పొరుగునే బీజేపీ పాలిత అస్సామ్‌లోని అభివృద్ధి నమూనాను చూపి, ఓటర్లను బీజేపీ తన వైపు తిప్పుకొంది. త్రిపురలో కాంగ్రెస్, టీఎంసీ, కొత్తగా వచ్చిన ‘టిప్రా మోటా పార్టీ’లతో త్రిముఖ పోటీని ఎదుర్కొన్న కమలనాథులు వరుసగా రెండోసారీ గద్దెనెక్కడం విశేషం. వ్యతిరేకతను ఎదుర్కొంటున్న విప్లవ్‌దేవ్‌ను సరైన సమయంలో సీఎంగా పక్కకు తప్పించి, మాణిక్ సాహాకు కిరీటం పెట్టడమూ బీజేపీకి వ్యూహాత్మకంగా ఫలించింది. గతంలో వరుసగా 7 సార్లు త్రిపురను పాలించి, శాసించిన సీపీఎంకు ఆ రాష్ట్రంలో ఇది వరుసగా రెండో పరాజయం. పైగా ఓట్లు 42 శాతం నుంచి 24 శాతానికి పడిపోవడం ఆ పార్టీకి ప్రమాదఘంటిక. ‘టిప్రా’ కింగ్‌మేకర్‌గా ఆవిర్భవించకున్నా, కలసి బరిలోకి దిగిన సీపీఎం – కాంగ్రెస్ అవకాశాలను దెబ్బ తీసింది. బెంగాలీ ఓటర్లపై టీఎంసీ పెట్టుకొన్న ఆశ అడియాసైంది. 2018తో పోలిస్తే బీజేపీ కూటమికి 11 శాతం ఓట్లు తగ్గినా, కమల నాథులే సొంతంగా సర్కారు ఏర్పాటు చేసే స్థితికి చేరుకోవడం ప్రతిపక్షాల అనైక్యతకు ప్రతిఫలం! శుభవార్త ఏమంటే, అరవై ఏళ్ళ నాగాలాండ్ చరిత్రలో తొలిసారిగా మహిళలు ఎమ్మెల్యే లుగా ఎన్నిక కావడం! పితృస్వామ్య భావజాలం ప్రబలంగా ఉండే ఈ గడ్డపై గతంలో పట్టణ మునిసిపల్ ఎన్నికల్లో స్త్రీల రంగప్రవేశానికి ప్రయత్నం జరిగినా, హింస రేగి పోటీ నుంచి తప్పుకోవాల్సొచ్చింది. కానీ ఈసారి ఏకంగా ఇద్దరు మహిళలు గెలవడం గమనార్హం. ఇది మార్పు పవనాలకు ప్రతీక. ఇక, వివిధ రాష్ట్రాల పార్టీలు (జేడీ–యూ, లోక్‌జనశక్తి, శరద్ పవార్ ఎన్సీపీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా) నాగాలాండ్ బరిలో దిగడం చిత్రం. ఆరు సీట్లలో ఎన్సీపీ గెలవడం, పశ్చిమాన మహారాష్ట్ర నుంచి వచ్చి తూర్పున నాగాలాండ్‌లో సత్తా చాటి, పెద్ద ప్రతిపక్షంగా అవతరించడం విచిత్రం. ఈశాన్య రాష్ట్రాల్లో అంచనాలకు అల్లంత దూరంలో ఆగిన కాంగ్రెస్ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన 6 ఉప ఎన్నికల్లో మాత్రం 3 చోట్ల విజయాలు సాధించింది. తమిళనాట ఈరోడ్ (ఈస్ట్), మహారాష్ట్రలోని కస్బాపేట్, బెంగాల్లో టీఎంసీ నుంచి చేజిక్కించుకున్న సాగర్‌దిఘీ స్థానాలు హస్తానికి కొంత ఊరట. ఈరోడ్ గెలుపు వెనుక అధికార డీఎంకెతో పొత్తు, కస్బాలో విజయానికి మహా వికాస్ ఆఘాడీ కూటమి మద్దతు, 2021 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన బెంగాల్లో ఈసారి సీపీఎం అండ కాంగేయులకు కలిసొచ్చింది నిజమే. అయితే, 32 ఏళ్ళుగా కంచుకోటైన పుణేలోని కస్బాపేట్లో బీజేపీ ఓటమి ఆలోచన రేపుతోంది. అదే సమయంలో మిగతా 3 ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడం, అందులోనూ రామ్‌గఢ్‌ను కైవసం చేసుకోవడం విస్మరించలేం. ఒకరకంగా ఈ ఫలితాలు ప్రతిపక్షాలకు ఆత్మశోధన అవకాశం. ఏ మాటకా మాట – ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలను బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు ఏ మేరకు సీరియస్‌గా తీసుకున్నాయన్నది అనుమానమే. ప్రధాని, కేంద్ర హోమ్‌మంత్రి సహా పలువురు పదేపదే ఈశాన్యంలో పర్యటించారు. ప్రతిపక్షాలపై ప్రచారదాడి చేశారు. స్థానిక స్థితిగతులకు అనుగుణంగా వ్యాఖ్యలు, వ్యూహాలు మార్చుకున్నారు. ప్రతిపక్షాల్లో గెలిచితీరాలనే ఆ పట్టుదల, ఎన్నికల చాణక్యం కొరవ డ్డాయి. మరి రెండు నెలల్లో కర్ణాటక, ఆ వెంటనే మధ్యప్రదేశ్, రాజస్థాన్ – ఇలా అనేక రాష్ట్రాల్లో ఎన్ని కలు రానున్న వేళ ప్రతిపక్షాలకు ఈ ఫలితాలు ఓ మేలుకొలుపు. ఐక్యత, ఐడియాలజీ ఏదీ లేకుండా ఒక్క మోదీ వ్యతిరేక మంత్రమే ఫలిస్తుందనుకుంటే పొరపాటు. ప్రత్యర్థి బలవంతుడైనప్పుడు ప్రత్యామ్నాయ వ్యూహాలు, అజెండాలు లేకుండా సవాలు చేస్తే శృంగభంగం తప్పదు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు మేలుకుంటే... కోలుకుంటాయి. లేదంటే, ఎన్నికలు ఏవైనా ఫలితాలు కాస్త అటూ ఇటుగా ఇలాగే ఉంటాయి. -
త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ ఘన విజయం.. మేఘాలయలో షాక్..
సాక్షి, హైదరాబాద్: ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. త్రిపుర, నాగాలాండ్‌లో మెజార్టీతో మరోసారి అధికారంలోకి వచ్చింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచే బీజేపీ పూర్తి ఆధిక్యం కనబరిచింది. దీంతో, రెండు రాష్ట్రాల్లో వికర్టీని అందుకుంది. - త్రిపురలో 60 స్థానాలకు గానూ 33 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 31ని అందుకోవడంతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. - ఇక, కాంగ్రెస్, లెప్ట్ కూటమి 14 స్థానాల్లో విజయం సాధించగా.. కొత్త పార్టీ టిప్రా మోథా 13 స్థానాల్లో జయభేరి మోగించి అధికార పార్టీకి ఝలక్ ఇచ్చింది. As per ECI, BJP leading on 33 seats out of 60 Assembly seats; Counting of votes underway#TripuraAssemblyElections2023 pic.twitter.com/uKPKZ0nzgP — ANI (@ANI) March 2, 2023 - నాగాలాండ్‌లో బీజేపీ, ఎన్డీపీపీ కూటమి భారీ విజయాన్ని అందుకుంది. 60 స్థానాలకు గానూ బీజేపీ కూటమి 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది ఎన్పీఎఫ్ రెండు స్థానాలు కైవసం చేసుంది. కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. ఇతరులు 21 చోట్ల విజయం సాధించడం గమనార్హం. - ఇక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ 31ని క్రాస్ చేయడంతో బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. మేఘాలయలో హంగ్... మరోవైపు.. మేఘాలయలో హంగ్ వచ్చింది. సీఎం కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ 25 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 31ని అందుకోలేకపోయింది. కాంగ్రెస్ ఐదు, బీజేపీ 4 సీట్లతో సరిపెట్టుకున్నాయి. ఇతరులు 25 స్థానాల్లో గెలుపొందారు. అయితే కాన్రాడ్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధమని బీజేపీ ప్రకటించింది. ఒకవేళ ఈ రెండు పార్టీలు కలిస్తే మేఘాలయ ప్రభుత్వంలో కూడా బీజేపీ భాగం కానుంది. ఫలితంగా మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నట్లు అవుతుంది. ఇదిలా ఉండగా.. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో కూడా గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ భారీ ఓటమిని చవిచూసింది. రెండు రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. నాగాలాండ్‌లో అసలు ఖాతా తెరవలేకపోయింది. -
Election Results: మేఘాలయలో హంగ్.. బీజేపీ బిగ్ ప్లాన్!
► ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. త్రిపుర, నాగాలాండ్‌లో మెజార్టీతో మరోసారి అధికారంలోకి వచ్చింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచే బీజేపీ పూర్తి ఆధిక్యం కనబరిచి రెండు రాష్ట్రాల్లో వికర్టీని అందుకుంది. త్రిపురలో 60 స్థానాలకు గానూ 33 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 31ని అందుకోవడంతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కాంగ్రెస్, లెప్ట్ కూటమి 14 స్థానాల్లో విజయం సాధించగా.. కొత్త పార్టీ టిప్రా మోథా 13 స్థానాల్లో జయభేరి మోగించి అధికార పార్టీకి ఝలక్ ఇచ్చింది. ► నాగాలాండ్‌లో బీజేపీ, ఎన్డీపీపీ కూటమి భారీ విజయాన్ని అందుకుంది. 60 స్థానాలకు గానూ బీజేపీ కూటమి 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది ఎన్పీఎఫ్ రెండు స్థానాలు కైవసం చేసుంది. కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. ఇతరులు 21 చోట్ల విజయం సాధించడం గమనార్హం. ఇక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ 31ని క్రాస్ చేయడంతో బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి ► మరోవైపు.. మేఘాలయలో హంగ్ వచ్చింది. సీఎం కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ 25 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 31ని అందుకోలేకపోయింది. కాంగ్రెస్ ఐదు, బీజేపీ 4 సీట్లతో సరిపెట్టుకున్నాయి. ఇతరులు 25 స్థానాల్లో గెలుపొందారు. అయితే కాన్రాడ్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధమని బీజేపీ ప్రకటించింది. ఒకవేళ ఈ రెండు పార్టీలు కలిస్తే మేఘాలయ ప్రభుత్వంలో కూడా బీజేపీ భాగం కానుంది. ఫలితంగా మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నట్లు అవుతుంది. ► తమిళనాడులోని ఈరోడ్ ఉపఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఈవీకేఎస్ ఎలన్గోవన్ ఘన విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికల్లో అధికార డీఎంకే కాంగ్రెస్‌కు మద్దతిచ్చింది. ఈ విజయం సీఎం ఎంకే స్టాలిన్ వల్లే సాధ్యమైందని ఎలన్గోవన్ పేర్కొన్నారు. ఎన్నికల హామీలను 80శాతం నెరవేర్చినట్లు చెప్పారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 40కి 40 ఎంపీ స్థానాలు డీఎంకే కూటమే కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. Credit of this victory goes to CM MK Stalin. He did 80% of the things that were promised by DMK in election manifesto. I feel proud to be a part of the Legislative Assembly which is headed by MK Stalin: DMK-backed Congress candidate EVKS Elangovan on his lead in #ErodeEastResults pic.twitter.com/J9XkJE70tT — ANI (@ANI) March 2, 2023 ► ఈశాన్య భారతంలో కాషాయ జెండా మరోసారి రెపరెపలాడింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటింది. బీజేపీ.. త్రిపురలో రెండో సారి అధికారంలోకి రాగా.. నాగాలాండ్‌లో బీజేపీ-ఎన్డీపీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ► ఇక, మేఘాలయలో ఎన్‌పీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ► రాత్రి 7 గంటలకు ఢిల్లీ బీజేపీ ఆఫీసుకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. మూడు రాష్ట్రాల విక్టరీ వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు. ► మహారాష్ట్రలోని పుణే జిల్లా కస్బా స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో, కాంగ్రెస్ శ్రేణులు, మహా వికాస్ అగాడీ కార్యకర్తలు బాణాసంచా కాల్చుతూ సంబురాలు చేసుకుంటున్నారు. #WATCH | Maharashtra: Maha Vikas Aghadi (MVA) workers celebrate in Pune as official EC trends show Congress candidate Dhangekar Ravindra Hemraj leading in Kasba Peth assembly by-election. pic.twitter.com/Duxyvm9K15 — ANI (@ANI) March 2, 2023 ► త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. బోర్దోవలి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం సాహా.. సీపీఎం అభ్యర్థి ఆశిష్‌కుమార్ సాహాపై విజయం సాధించారు. ► మేఘాలయలో హంగ్ దిశగా పోలింగ్ కౌంటింగ్ కొనసాగుతోంది. సీఎం కాన్రాడ్ సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ 17 స్థానాల్లో ఆధిక్యంగా ఉంది. #MeghalayaElections | As per official EC trends, CM Conrad Sangma's National People's Party leading on 17 of the total 59 seats so far. Counting of votes still underway, trends on 47 seats known. pic.twitter.com/GsLOUPGgSd — ANI (@ANI) March 2, 2023 ► తమిళనాడులోని ఈరోడ్ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు. కాగా, ఉప ఎన్నికల్లో అధికార డీఎంకే కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన విషయం తెలిసిందే. Tamil Nadu | E.V.K.S.Elangovan of Congress leading in Erode East by-election pic.twitter.com/IQ08d1Tv4L — ANI (@ANI) March 2, 2023 ► పూణేలోని చించావద్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ లీడింగ్ కొనసాగుతోంది. Pune, Maharashtra | Counting of votes underway for Kasba Peth by-elections pic.twitter.com/CUp88aRSL3 — ANI (@ANI) March 2, 2023 ► పశ్చిమ బెంగాల్‌లోని సాగర్‌డిగీ ఉప ఎన్నికల్లో ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. కాంగ్రెస్, టీఎంసీ మధ్య హోరాహోరి కొనసాగుతోంది. ► మేఘాలయలో ఫలితాలు హంగ్ దిశగా వెళ్తున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ కనపించడం లేదు. ► నాగాలాండ్‌లో బీజేపీ, ఎన్డీపీపీ కూటమి భారీ ఆధిక్యంతో 50 స్థానాల్లో దూసుకుపోతోంది. ► త్రిపురలో 60 స్థానాలకు గానూ దాదాపు 39 స్థానాల్లో బీజేపీలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ 31ని క్రాస్ చేయడంతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ► మేఘాలయలో ఎన్పీపీ 28, బీజేపీ 10 స్థానాల్లో ఆధిక్యం ► నాగాలాండ్‌లో బీజేపీ 21, ఎన్పీఎఫ్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ► త్రిపురలో బీజేపీ 24 స్థానాల్లో, ట్రిపా 10 స్థానాల్లో, లెఫ్ట్ 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ► అరుణాచల్ ప్రదేశ్‌లోని లూమ్లా, జార్ఖండ్‌లోని రామ్‌ఘర్, తమిళనాడులోని ఈరోడ్, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్డిగి అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం Counting of votes for Tripura, Nagaland & Meghalaya elections begins Counting for by-elections for Lumla assembly seat of Arunachal Pradesh, Ramgarh (Jharkhand), Erode East (Tamil Nadu), Sagardighi (West Bengal) & Kasba Peth, Chinchwad assembly seats of Maharashtra also begins pic.twitter.com/mMlLV3ryfV — ANI (@ANI) March 2, 2023 ► మూడు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం ► ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా మేఘాలయలోని తూర్పు పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లాలో జిల్లా మేజిస్ట్రేట్ 144 సెక్షన్ విధించారు. Meghalaya | Section 144 imposed in Eastern West Khasi Hills district by the District Magistrate pic.twitter.com/JY8t1wHCp9 — ANI (@ANI) March 2, 2023 ► ముఖ్యంగా త్రిపుర అసెంబ్లీ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. బీజేపీని ఓడించేందుకు లెఫ్ట్, కాంగ్రెస్ జట్టు కట్టి బరిలో దిగాయి. కొత్తగా తెరపైకి వచ్చిన టిప్రా మోతా కనీసం 15 స్థానాలకు పైగా గెలుచుకుని కింగ్‌మేకర్‌గా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ► నాగాలాండ్, మేఘాలయలో కూడా ఫలితాలపై చర్చ నడుస్తోంది. Nagaland | The counting of votes for the #NagalandAssemblyElections2023 will begin at 8 am; Visuals from counting centre at Deputy Commissioner's office in Kohima pic.twitter.com/XdT0sWc4e9 — ANI (@ANI) March 2, 2023 న్యూఢిల్లీ: మూడు ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. కాగా, మూడు రాష్ట్రాల్లో 60 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. మ్యాజిక్ ఫిగర్ 30 దాటిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. -
‘ఈశాన్య’ ఫలితాలు నేడే
న్యూఢిల్లీ: మూడు ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఈశాన్యాన మరింతగా విస్తరించాలన్న అధికార బీజేపీ ఆశలు ఏ మేరకు నెరవేరాయన్నది ఈ ఫలితాలతో తేలనుంది. ముఖ్యంగా ఈసారి అందరి దృష్టీ ప్రధానంగా త్రిపురపైనే నెలకొంది. అక్కడ పాతికేళ్ల వామపక్ష పాలనకు తెర దించుతూ అభివృద్ధి నినాదంతో బీజేపీ 2018లో సొంతంగా అధికారంలోకి రావడం తెలిసిందే. దాంతో ఈసారి బీజేపీని ఎలాగైనా నిలువరించేందుకు చిరకాల శత్రుత్వాన్ని పక్కన పెట్టి మరీ లెఫ్ట్, కాంగ్రెస్ జట్టు కట్టి బరిలో దిగాయి. ఇక నాగాలాండ్, మేఘాలయల్లో కూడా బీజేపీ అధికార సంకీర్ణంలో భాగస్వామిగా ఉంది. అయితే మేఘాలయలో ఎన్నికల ముందు అధికార నేషనల్ పీపుల్స్ పార్టీతో బంధం తెంచుకుని సంకీర్ణం నుంచి బయటికొచ్చింది. అంతేగాక తొలిసారిగా మొత్తం 60 స్థానాలకూ పోటీ చేసింది! నాగాలాండ్‌లో మరోసారి ఎన్డీపీపీతో కలిసి బరిలో దిగింది. అక్కడ బీజేపీ అధికారం నిలుపుకుంటుందని, త్రిపురలో ఏకైక పెద్ద పార్టీగా మెజారిటీకి చేరువగా వస్తుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొనడం తెలిసిందే. ఇక త్రిపురలో హంగ్ తప్పకపోవచ్చని అంచనా వేశాయి. కొత్తగా తెరపైకి వచ్చిన టిప్రా మోతా కనీసం 15 స్థానాలకు పైగా గెలుచుకుని కింగ్‌మేకర్‌గా మారొచ్చని జోస్యం చెప్పాయి. -
మమతకు జై కొట్టిన ‘కాంగ్రెస్’ జిల్లాలు
కోల్‌కతా: కాంగ్రెస్ కుంచుకోటలుగా ఉన్న ముస్లిం ఆధిక్య జిల్లాలైన మాల్దా, ముర్షీదాబాద్‌లు ఈసారి తృణమూల్‌కు జై కొట్టాయి. ఫలితంగా మమతా బెనర్జీ అద్వితీయ విజయం సాధ్యమైంది. ఈ రెండు జిల్లాల్లో టీఎంసీకి పెద్దగా పట్టులేదు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మాల్దా జిలాల్లోని 12 సీట్లలో టీఎంసీ ఒక్క సీటూ గెలువలేదు. ముర్షీదాబాద్‌లోని 22 స్థానాల్లో కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. ఈ రెండు జిల్లాల్లోని 34 స్థానాల్లో కాంగ్రెస్ ఏకంగా 21 స్థానాల్లో (మాల్దాలో 7, ముర్షీదాబాద్‌లో– 14) నెగ్గింది. 2011 ఎన్నికల్లోనూ ఈ ప్రాంతంలో కాంగ్రెసే విజయ ఢంకా మోగించింది. 2021 ఎన్నికల నాటికి పరిస్థితి తారుమారైంది. ఈ ప్రాంతంలో అనూహ్యంగా తృణమూల్ పుంజుకుంది. రెండు జిల్లాల్లోని 32 స్థానాల్లో 24 సీట్లలో టీఎంసీ విజయం సాధించింది. పోటీలో ఉన్న వారిలో ఇద్దరు అభ్యర్థులు మరణించడంతో శంషేర్‌గంజ్, జంగీపూర్ స్థానాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 8 సీట్లలో విజయం సాధించి బీజేపీ కూడా ఈ ప్రాంతంలో గణనీయ స్థాయిలో బలపడింది. ముస్లిం జనాభా మెజారిటీగా ఉన్న ఈ ప్రాంతంలో కాంగ్రెస్, లెఫ్ట్, ఐఎస్ఎఫ్ కూటమి ఈ ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానంలోనూ విజయం సాధించకపోవడం గమనార్హం. మార్పునకు కారణమేంటి? ఈ రెండు ముస్లిం ఆధిపత్య జిల్లాలు. మాల్దాలో 51% జనాభా, ముర్షీదాబాద్‌లో 66% జనాభా ముస్లింలే. చాన్నాళ్లుగా వీరు కాంగ్రెస్‌కు గట్టి మద్దతుదారులుగా ఉన్నారు. కానీ, ఈ ఎన్నికల్లో, మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ముస్లింలు అత్యంత వ్యూహాత్మకంగా ఓట్లు వేసినట్లు స్పష్టమవుతోంది. తృణమూల్, బీజేపీ, కాంగ్రెస్ కూటమిల త్రిముఖ పోరులో, బీజేపీ వ్యతిరేక పార్టీల మధ్య తమ ఓట్లు చీలితే, అది అంతిమంగా బీజేపీకి లాభిస్తుందని వారు గుర్తించారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ నార్త్ మాల్దా స్థానంలో చోటు చేసుకున్న త్రిముఖ పోరు వల్ల బీజేపీ లాభపడిన విషయాన్ని వారు మర్చిపోలేదు. దాంతో, కీలకమైన ఈ ఎన్నికల్లో ఆ తప్పు చేయవద్దని, తృణమూల్, కాంగ్రెస్‌ల మధ్య తమ ఓట్లు చీలకూడదని నిర్ణయించుకున్నారు. మూకుమ్మడిగా తృణమూల్‌కు మద్దతిచ్చారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత, వివాదాస్పద ఎన్నార్సీ, సీఏఏలను మమత గట్టిగా వ్యతిరేకించడం ముస్లింలకు ఆమెపై విశ్వాసం పెరగడానికి కారణమైంది. బీజేపీ గెలిస్తే సీఏఏ, ఎన్నార్సీలను అమలు చేస్తారన్న భయం కూడా ముస్లింలను మమతకు దగ్గర చేసింది. బీజేపీ గెలుపును అడ్డుకునేలా, ఈ రెండు జిల్లాల్లో ముస్లింల వ్యూహాత్మక ఓటింగ్ సరళి తృణమూల్ ఘనవిజయానికి బాటలు వేసింది. -
Nandigram: నందిగ్రామ్.. హై టెన్షన్
కోల్‌కతా: తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ తొలిసారి బరిలో నిలిచిన పశ్చి మ బెంగాల్‌లోని నందిగ్రామ్ నియోజకవర్గ ఫలితాలు నరాలు తెగే ఉత్కంఠత రేపాయి. కౌంటింగ్ కొనసాగుతున్న కొద్దీ మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేంధు అధికారి మధ్య క్షణ క్షణం మారిపోతున్న ఓట్ల మెజారిటీ... మొత్తం రాష్ట్ర ఎన్నికల ఘట్టంలోనే అత్యంత ప్రధానమైనదిగా నిలిచింది. ఇద్దరు ప్రధాన పార్టీల ప్రత్యర్థుల మధ్య అటూ ఇటూ దోబూచులాడిన మెజారిటీ.. చివరకు సువేంధు అధికారిని వరించింది. మమతా బెనర్జీపై స్వల్ప ఆధిక్యంతో గెలిచినట్లు ఎన్నికల సంఘం ఎట్టకేలకు ప్రకటించింది. అయితే, నందిగ్రామ్ ఫలితాలపై తాను కోర్టుకు వెళ్తానని మమతా ప్రకటించారు. అంతకుముందు ఆదివారం ఉదయం కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమవగా కొద్దిసేపటికే సువేంధు మమత కంటే ఆధిక్యంలోకి వచ్చారు.ఆ తర్వాత సువేంధు మెజారిటీ ఏకంగా ఎనిమిది వేల దాకా వెళ్లింది. మధ్యాహ్నందాకా సువేంధుదే పైచేయి. మధ్యాహ్నం నుంచి నెమ్మదిగా పుంజుకుని మమత ఆధిక్యంలోకి వచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఆధిక్యత మరొకరి చెంతకు చేరింది. ఒకానొక దశలో సువేంధు కేవలం ఆరు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఓట్ల లెక్కింపులో ప్రతీ రౌండ్లో మెజారిటీ సువేంధు, మమత మధ్య మారుతూ వచ్చింది. సువేంధు 1,200 ఓట్ల మెజారిటీలో గెలిచారని వార్తలు రాగా, ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని ఎన్నికల సంఘం తెలిపింది. ఆ తర్వాత కొద్దిసేపటికే 1,956 ఓట్ల ఆధిక్యంతో సువేంధు అధికారి గెలిచారని ఎన్నికల సంఘం ప్రకటించింది. త్యాగాలు తప్పవు.. ఈసీ ప్రకటనపై మమతా బెనర్జీ వెంటనే స్పందించారు. ‘‘నందిగ్రామ్‌లో ఓటమిని అంగీకరిస్తున్నాను. మరేం ఫరవాలేదు. అయితే, నందిగ్రామ్‌లో అక్రమాలు జరిగాయని విన్నాను. దీనిపై కోర్టుకు వెళతాను. మనం మొత్తం రాష్ట్రాన్నే గెలిచాం. ఇంతటి ఘన విజయం సాధించినపుడు ‘నందిగ్రామ్’లో ఓటమిలాంటి త్యాగాలు తప్పవు’’ అని ఫలితాల అనంతరం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. నందిగ్రామ్‌లో రీకౌంటింగ్ జరపాలని ఈసీని టీఎంసీ కోరగా అందుకు ఈసీ నిరాకరించింది. -
Mamata Banerjee: భారత్‌ను రక్షించిన బెంగాల్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ తన తీర్పుతో భారతదేశాన్ని రక్షించిందని తృణమూ ల్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం మమతా బెనర్జీ అన్నారు. శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీకి అఖండ విజయం కట్టబెట్టిన బెంగాల్ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె ఆదివారం సాయంత్రం కోల్‌కతాలో మీడియాతో మాట్లాడారు. కోవిడ్–19 మహమ్మారిని అరికట్టడమే తన ప్రథమ కర్తవ్యమని చెప్పారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎక్కడా విజయోత్సవాలు జరపొద్దని పార్టీ శ్రేణుల కు విజ్ఞప్తి చేశారు. ఇది బెంగాల్ ప్రజల విజయం, ప్రజాస్వామ్య విజయమని వ్యాఖ్యానించారు. ఈరోజు భారత్‌ను బెంగాల్ కాపాడిందని పేర్కొ న్నారు. మానవత్వాన్ని సైతం రక్షించిందని వివరిం చారు. ఎన్నో అవాంతరాలకు ఎదురొడ్డి నిలిస్తే ఈ గెలుపుదక్కిందని వెల్లడించారు. కేంద్రానికి, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు, యంత్రాం గానికి వ్యతిరేకంగా పోరాటం సాగించామని గుర్తుచేశారు. డబుల్ ఇంజన్ కాదు.. డబుల్ సెంచరీ ఎన్నికల సంఘం(ఈసీ) తీరుపైనా దీదీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఈసీ తమ పార్టీని వేధింపులకు గురి చేసిందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా డబుల్ ఇంజన్ ప్రభుత్వం గురించి మాట్లాడగా, ఎన్నికల్లో తమ పార్టీ డబుల్ సెంచరీ సాధించిందని వ్యాఖ్యానించారు. 2021లో 221 సీట్లు సాధించాలని ఆశించామని, లక్ష్యానికి చేరువయ్యా మని చెప్పారు. నందిగ్రామ్‌లో ఓట్ల లెక్కింపులో గందరగోళం జరిగిందని, దీనిపై కోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు. బెంగాల్లో గొప్ప విజయం సాధించామని, అదే సమయంలో నందిగ్రామ్ ప్రజల తీర్పును గౌరవిస్తానని పేర్కొన్నారు. వారి తీర్పు ఏదైనప్పటికీ అంగీకరిస్తానని తెలిపారు. భారతీయులందరికీ ఉచితంగా టీకా ఇవ్వాల్సిందే ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని మమతా బెనర్జీ తెలిపారు. పూర్తిగా కోలుకుంటానని, కాలుకు కట్టు (ప్లాస్టర్) తొలగిస్తానని కొద్ది రోజుల క్రితమే చెప్పానని అన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. బెంగాల్ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తానని పునరు ద్ఘాటించారు. ప్రతి భారతీయుడికి ఉచితంగా టీకా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశంలోని 140 కోట్ల మందికి కరోనా టీకా ఇవ్వడానికి రూ.30,000 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుందని అంచనా వేశారు. ఉచిత టీకా విషయంలో తన డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోతే కోల్‌కతాలో మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ధర్నాలో కూర్చుంటానని హెచ్చరించారు. ఎన్నికల్లో తమ పార్టీకి అద్భుతమైన విజయం దక్కినప్పటికీ ప్రమాణ స్వీకారం నిరాడంబరంగానే చేస్తానని చెప్పారు. ఆర్భాటానికి దూరంగా ఉంటామన్నారు. కరోనా ఉధృతి కారణంగా విజయోత్సవాలకు సమయం లేదని, మహమ్మారిని అరికట్టడంపైనే దృష్టి పెడతానని వివరించారు. ఈ ముప్పు తొలగిపోయాక కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో మెగా ర్యాలీ నిర్వహిస్తామన్నారు. -
అస్సాంలో కమలదళానికి కఠిన పరీక్ష
అస్సాంలో కమలదళానికి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో కఠిన పరీక్ష ఎదురుకానుంది. క్లీన్ఇమేజ్తో బీజేపీ విజయానికి తోడ్పడిన ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ను మళ్లీ సీఎంగా ఎంపిక చేయాలా లేక అస్సాంలో అత్యంత ప్రజాదరణగల నేతల్లో ఒకరైన ఆర్థిక మంత్రి హిమంతా బిశ్వ శర్మను సీఎం చేయాలా అనే దానిపై బీజేపీ అధినాయకత్వం తేల్చుకోవాల్సి ఉంది. బీజేపీ ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడం ద్వారా సీఎం మార్పుపై ముందుగా సంకేతాలు ఇచ్చిందన్న అభిప్రాయం ఓవైపు వ్యక్తమవుతుండగా... మరోవైపు అధికారంలో ఉన్న రాష్ట్రంలో నాయకత్వ మార్పు గురించి బీజేపీ చర్చించిన సంప్రదాయమేదీ గత 40 ఏళ్లలో లేదనే అంశమూ తెరపైకి వస్తోంది. ఏది ఏమైనా వారిద్దరి రాజకీయ భవిష్యత్తును ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిర్ణయిస్తారని, మోదీ ఎంపిక మేరకు సీఎం అభ్యర్థి ఎవరో ఖరారవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సర్బానంద... విద్యార్థి నేతగా మొదలై... దిబ్రూగఢ్‌కు చెందిన సర్బానంద సోనోవాల్ ఆ రాష్ట్ర కీలక రాజకీయ నేతల్లో ఒకరిగా ఎదిగారు. బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి చొరబడే అక్రమ వలసదారులను వెనక్కి పంపాలంటూ 1970లలో భారీ ఉద్యమం సాగించిన ఆల్‌అస్సాం స్టూడెంట్స్ యూనియన్‌లో విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. 1992 నుంచి 1999 వరకు ఆ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సంస్థ రాజకీయ అవతారమైన అసోం గణ పరిషత్ (ఏజీపీ)లో 2001లో చేరారు. తదనంతర పరిణామాల్లో 2011లో ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. 2014లో లఖీంపూర్ ఎంపీగా గెలిచి మోదీ మంత్రివర్గంలో యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) అయ్యారు. 2016లో అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నాయకత్వం ఆయనను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమిని గెలిపించి సీఎం పగ్గాలు చేపట్టారు. హిమంతా... విలక్షణ నేత అస్సాంలోని గువాహటికి చెందిన డాక్టర్‌హిమంతా బిశ్వ శర్మ విలక్షణ రాజకీయ నేతగా అంచెలంచెలుగా ఎదిగారు. కాలేజీ రోజుల్లో విద్యార్థి సంఘం కార్యదర్శిగా పనిచేసిన అనుభవమున్న శర్మ 2001లో కాంగ్రెస్‌లో చేరి రాజకీయాల్లోకి వచ్చారు. 2001లో తొలిసారి ఏజీపీ నేత బీర్గు కుమారు ఫుకన్‌ను ఓడించి జాలుక్‌బరి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 2006, 2011లో అదే నియోజకవర్గం నుంచి గెలిచి హ్యాట్రిక్‌కొట్టారు. 2006లో వైద్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శర్మ 2011లో విద్యాశాఖ పగ్గాలు అందుకున్నారు. ఆ శాఖలో మంచి పనితీరు కనబరిచారు. 2014లో నాటి కాంగ్రెస్ సీఎం తరుణ్‌గొగోయ్‌పై తిరుగుబాటు చేసి 2015లో బీజేపీలో చేరారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో జాలుక్‌బరి స్థానం నుంచి తిరిగి గెలవడం ద్వారా ప్రభుత్వంలో కేబినెట్‌మంత్రిగా చేరారు. -
అస్సాంలో కాషాయ రెపరెపలు
గువాహటి: ఎగ్జిట్‌పోల్స్‌అంచనాలను నిజంచేస్తూ అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ వరుసగా రెండోసారి విజయదుందుభి మోగించింది. 126 స్థానాలున్న అసెంబ్లీలో 74 సీట్లు గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. 2016 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఎన్డీఏకు స్వల్పంగా సీట్లు తగ్గాయి. ఈసారి బీజేపీ 59 స్థానాల్లో విజయం సాధించగా, మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్ 9 చోట్ల, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ 6 సీట్లలో గెలుపొందాయి. ప్రముఖుల హవా... సీఎం సర్బానంద సోనోవాల్, వైద్య మంత్రి హిమంతా బిశ్వాస్ శర్మ, ఏజీపీ చీఫ్, మంత్రి అతుల్ బోరా వరుసగా మజులీ, జాలుక్‌బరి, బోకాఖాట్ నియోజకవర్గాల నుంచి ఘన విజయం సాధించారు. తమ సుపరిపాలనకు మెచ్చే ప్రజలు మరోసారి పాలన సాగించాలని ఎన్డీఏకు అవకాశం ఇచ్చారని సోనోవాల్ వ్యాఖ్యానించారు. మంత్రి హిమంతా బిశ్వా శర్మ లక్ష ఓట్ల మెజారిటీ సాధించారు. ఆయనకు ఇది వరుసగా ఐదో గెలుపు. పటచార్‌కుచి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అస్సాం శాఖ అధ్యక్షుడు రంజీత్ దాస్... ఏజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పబీంద్ర దేకాపై గెలిచారు. కాంగ్రెస్‌కు మళ్లీ తప్పని ఓటమి... కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి 51 సీట్లకే పరిమితమై మరోసారి అధికారానికి దూరమైంది. కాంగ్రెస్ 30 సీట్లను గెలుచుకోగా మహాకూటమిలోని మిగతా పార్టీలైన ఏఐయూడీఎఫ్ 16 సీట్లలో, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ 4 సీట్లలో, సీపీఎం ఒక చోట గెలిచాయి. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రిపుణ్ బోరా తన పదవికి రాజీనామా చేశారు. అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ చేసిన పొరపాట్ల వల్లే భారీ మూల్యం చెల్లించుకుందని, ఎన్డీఏ గెలిచేందుకు ఇదే ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకుడు రాజన్ పాండే పేర్కొన్నారు. బీజేపీ సైతం అభ్యర్థుల తొలి జాబితా విడుదలలో పొరపాట్లు చేసినా ఆ తర్వాత విడుదల చేసిన జాబితాలలో ఆ తప్పుల ను సరిదిద్దుకుందన్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేస్తామనే హామీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లినా ఆశించిన స్థాయిలో ఓట్లు పొందలేకపోయిందన్నారు. -
ఉద్దండులకు సాధ్యపడలేదు.. కానీ ఆయన సాధించారు
సంపూర్ణ అక్షరాస్యత.. వర్తమాన అంశాలపై పూర్తి అవగాహన కేరళ ప్రజల సొంతం.. రాజకీయాల గురించి, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఎవరిని అడిగినా గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తుంటారు. అందుకే గత 40 ఏళ్లుగా ఒక్కసారి అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఎందరో రాజకీయ చతురులు.. మరెందరో ఉద్దండులకు కూడా అది సాధ్యపడలేదు. నంబూద్రీపాద్, ఏకే గోపాలన్, కృష్ణ పిళ్లై వంటి శక్తిమంతమైన కమ్యూనిస్టు నేతలే అక్కడి ప్రజల నాడి పట్టలేకపోయారు. దీన్ని బట్టే కేరళ ప్రజల రాజకీయ చైతన్యం ఎలా ఉందో అంచనా వేయొచ్చు. 1980 నుంచి ఏ ఒక్కరిని కూడా కేరళ ప్రజలు వరుసగా రెండోసారి సీఎం కుర్చీపై కూర్చోబెట్టలేదు. అలాంటిది 40 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ.. రెండోసారి అధికారంలోకి రానున్నారు కేరళ ప్రస్తుత ముఖ్యమంత్రి, కెప్టెన్, కామ్రేడ్ పినరయి విజయన్. గతంలో ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన ఏ రాజకీయ నేతకూ సాధ్యంకాని ఈ అరుదైన రికార్డు.. విజయన్ను ఎలా వరించింది..? అఖండ విజయ సాధనకు తోడ్పడిన అంశాలేంటి..? గత ఐదేళ్ల పాలనలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తిరిగి ఎలా విజయ పతాకా ఎగరేయగలిగారు..? సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ రెండోసారి అధికారంలోకి రావడానికి పినరయి విజయన్ నాయకత్వ లక్షణాలు ఎంతో ఉపయోగపడ్డాయని అనడంలో సందేహం లేదు. ఎన్నికలకు ముందే విజయన్ రచించిన వ్యూహాలు ప్రతిపక్షాలను ఎన్నికల్లో నిలదొక్కుకోకుండా చేశాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌లో విభేదాలు పినరయికి బాగా కలిసొచ్చాయి. కష్టకాలంలో ముందుండి.. సమస్య వచ్చినప్పుడే అసలైన లీడర్ ఎవరో తెలుస్తుంది అంటారు. గత ఐదేళ్లుగా కేరళలో ఒకదాని వెనుక ఒకటి వచ్చి పడుతున్న ఉపద్రవాలను చాకచక్యంగా, విజయవంతంగా ఎదురొడ్డి నిలిచారు పినరయి విజయన్. సమస్యలు, ఇబ్బందులు ఉన్న చోట తాను ఉన్నానంటూ ధైర్యం ఇచ్చారు. 2017లో ఓఖి సైక్లోన్, 2018లో నిపా వైరస్, 2018, 2019లో వరదలు, 2020లో కరోనా మహమ్మారి.. ఇలా అన్ని విపత్తులనూ విజయన్ సమర్థం గా ఎదుర్కొన్నారు. సైక్లోన్ సమయాల్లో ప్రజలను రక్షించడమే కాకుండా, వారికి కావాల్సిన ఆహారాన్ని, వరదలకు సంబంధించిన కిట్లను ప్రజలంద రికీ ప్రభుత్వం చేరవేసింది. మీడియా ముందుకు వచ్చి పరిస్థితులపై సీఎం ఎప్పటికప్పుడు పరిస్థితులను వివరిస్తూ ప్రజలకు నిబ్బరం కల్పించారు. విపత్తు నిర్వహణలో దిట్ట.. గతేడాది దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సమయంలో వలస కూలీలు పడ్డ ఇబ్బందులు వర్ణణాతీతం.. కానీ విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర సంక్షేమ పథకాలు, సేవలతో రాష్ట్ర ప్రజలకు ఆపన్న హస్తం అందించింది. అడ్వాన్స్‌గా పెన్షన్ ఇవ్వడం, ఉచితంగా రేషన్ సరుకులను పంపిణీ చేసింది. వలస కార్మికులను తమ రాష్ట్ర అతిథులుగా చూసుకుంటామని భరోసా కల్పించింది. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అత్యంత కష్ట కాలంలో ప్రజల బాగోగులు చూసుకోవడం ద్వారా ప్రజల మనసులను దోచుకున్నారు విజయన్. రేషన్ సరుకుల పంపిణీ లాక్డౌన్ తర్వాత కూడా ఇప్పటికీ కొనసాగుతుండటం వల్ల ప్రజలకు మరింత దగ్గరయ్యారు. హామీలన్నీ నెరవేర్చే దిశగా.. గత ఎన్నికల్లో తాను చేసిన 600 హామీల్లో.. ఏకంగా 570 హామీలను నెరవేర్చిన ఘనత విజయన్‌కే దక్కింది. ఎన్నో పథకాలను ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఎంతో దూరదృష్టితో రూపొందించారు. ‘లైఫ్ మిషన్’ద్వారా ఇళ్లు లేని, భూమి లేని నిరుపేదలకు దాదాపు 2 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చారు. ‘అర్ధ్రమ్ మిషన్’పథకం ద్వారా రాష్ట్ర ఆరోగ్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ప్రతి పేదవాడికి ప్రతి జిల్లా, నియోజకవర్గ స్థాయిలోనే సరైన వైద్యం అందేలా చేశారు. ‘ఎడ్యుకేషన్ మిషన్’ద్వారా వెయ్యి ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారు. ప్రభుత్వ పాఠశాలల్లో హైటెక్ క్లాస్‌రూమ్స్, హైటెక్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేసి, దేశంలోనే తొలి డిజిటల్ రాష్ట్రంగా పేరుగాంచేలా చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఎన్నో సూచీల్లో మొదటి స్థానంలో కేరళ నిలిచేలా ఎంతో కృషి చేశారు పినరయి విజయన్. అయితే విజయన్ ప్రస్థానం నల్లేరు మీద నడకేమీ కాదు. ఆయనా ఎన్నో ఒడిదొడుకులను చవిచూశారు. ఎన్నో ఆరోపణలను ఎదుర్కొన్నారు. అంతెందుకు సొంత పార్టీలోనే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీపీఐఎం సీనియర్ నేత అచ్యుతానందన్‌కు, పినరయి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గోల్డ్ స్మగ్లిం గ్ కేసులో ఆయన హస్తం ఉందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఒకానొక సందర్భంలో పినరయిని మీడియా విలన్‌గా చిత్రీకరించింది. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ధైర్యంగా, పవర్ హౌస్లా నిలబడ్డారు రియల్ కామ్రేడ్. కేరళలో మత రాజకీయాలకు స్థానం లేదని ప్రజలు నిరూపించారు. ఎల్డీఎఫ్ విజయాన్ని ప్రజలకు అంకితం ఇస్తున్నా. ప్రభుత్వ ఇమేజీ, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బురద చల్లేందుకు పలు మీడియా సంస్థలు చేసిన దుష్ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టారు. రాష్ట్రంలో లౌకికవాదం కొనసాగాలంటే లెఫ్ట్ ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉందని జనం నమ్మారు. ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ నేతలు లేనిపోని ప్రచారాలు చేసుకున్నారు. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, వేరే రాష్ట్రాల సీఎంలు కేరళకు వచ్చి బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు చాలా తాపత్రయపడ్డారు. వేరే రాష్ట్రాల్లో బీజేపీ మత రాజకీయాలు చెల్లినట్లు కేరళలో చెల్లదని మరోసారి రుజువైంది’. – పినరయి విజయన్, కేరళ సీఎం -
Pinarayi Vijayan: పినరయి దిగ్విజయన్
తిరువనంతపురం: పినరయి విజయన్ నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్ కేరళలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలోని మొత్తం 140 సీట్లకు గాను, 99 సీట్లను ఎల్డీఎఫ్ కైవసం చేసుకుంది. ప్రతిపక్ష యూడీఎఫ్ 41 స్థానాల్లో గెలుపొందింది. సీఎం పినరయి విజయన్, ఆయన కేబినెట్ సహచరులు కేకే శైలజ, ఎంఎం మణి, ఏసీ మొయిదీన్, సురేంద్రన్, రామచంద్రన్, క్రిష్ణ కుట్టీ, టీపీ రామకృష్ణన్, చంద్రశేఖరన్ తదితరులు గెలుపొందారు. ఇటీవల రాజీనామా చేసిన ఉన్నత విద్యా శాఖ మాజీ మంత్రి కేటీ జలీల్ కూడా తవనూర్ నుంచి గెలిచారు. అయితే ఫిషరీస్ మంత్రి మెర్సీకుట్టీ అమ్మ కాంగ్రెస్ అభ్యర్థి పీసీ విష్ణునాథ్ చేతిలో ఓడిపోయారు. ప్రతిపక్ష నేతలు రమేశ్ చెన్నితల, మాజీ సీఎం ఊమెన్ చాందీ గెలుపొందారు. తన సమీప అభ్యర్థి అధికార సీపీఎం తరఫున పోటీ చేసిన సీ థామస్‌పై 9,044 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా.. ఎల్డీఎఫ్ రెండోసారి అధికారంలోకి అంత సులువుగా ఏమీ రాలేదు. కేరళ నుంచి వామపక్షాలను తుడిచిపెడతామని యూడీఎఫ్, బీజేపీలు ప్రచారం సందర్భంగా చాలాసార్లు ఉద్ఘాటించాయి. ప్రభుత్వంపై వచ్చిన ఎన్నో ఆరోపణలు, మనీ లాండరింగ్ కేసులో పార్టీ మాజీ సెక్రటరీ బాలకృష్ణన్ కుమారుడిని అరెస్టు చేశారు. ప్రభుత్వంపై కాస్త అసంతృప్తి తదితర సమస్యలను దాటుకుంటూ సీఎం పీఠం దక్కించుకుంది. గతేడాది సంచలనం రేపిన బంగారం స్మగ్లింగ్ కేసులో సీఎం కార్యాలయం ప్రమేయం ఉందని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం పినరయి విజయన్‌కు తెలిసే జరిగిందంటూ కాంగ్రెస్ తీవ్రంగా ఎండగట్టింది. తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేట్ అధికారి ఒకరు 1.9 లక్షల డాలర్లు (రూ.1.2 కోట్లు) ఒమన్‌లోని మస్కట్‌కు స్మగ్లింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. విజయన్‌కు చాలా దగ్గరి వ్యక్తి, మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.శివశంకర్‌పై ఉన్న రెండు కేసుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతోంది. ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలను.. మోదీ ప్రభుత్వం, కేంద్ర దర్యాప్తు సంస్థలు తమపై దాడి చేస్తున్నాయంటూ ప్రచారం చేస్తూ.. సానుభూతి పొందుతూ దే ప్రయత్నం చేసింది. మూడేళ్ల కింద శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళను అనుమతించే వివాదంతో కేరళ ప్రభుత్వం ఒకానొక సందర్భంలో తీవ్ర రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ వివాదం అధికారపార్టీపై తీవ్ర ప్రభావమే చూపింది. దీంతో తిరిగి అధికారంలోకి వస్తామా అని ఎల్డీఎఫ్ వర్గాలే అనుమానం వ్యక్తం చేశాయి. అయితే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఘన విజయం సాధించడంతో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే తరహా విజయం వరిస్తుందని ఆశలు చిగురించాయి. ఉన్న ఒక్కసీటూ కోల్పోయిన బీజేపీ కేరళలో బీజేపీ ఖాతా కూడా తెరవలేదు. గతంలో ఉన్న సిట్టింగ్ స్థానంలో కూడా బీజేపీ ఓడిపోయింది. బీజేపీ తరఫున పోటీ చేసిన ఆ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. ‘మెట్రోమ్యాన్’ఇ.శ్రీధరన్ కూడా గెలవలేకపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానంలో గెలుపొందగా, ఇప్పుడు ఆ సిట్టింగ్ స్థానాన్ని కూడా కోల్పోయింది. మిజోరం మాజీ గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్‌ను బరిలో దింపగా, సీపీఎం అభ్యర్థి వి.శివకుట్టి చేతిలో పరాజయం చెందారు. మెట్రోమ్యాన్ శ్రీధరన్ కొన్ని రౌండ్ల వరకు ఆధిక్యం కనబర్చినా.. చివరి క్షణంలో సీపీఎం అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే షఫీ పారాంబిల్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల ముందు సీఎం అభ్యర్థిని ఎప్పుడూ ప్రకటించని బీజేపీ.. శ్రీధరన్‌ను తమ పార్టీ సీఎం అభ్యర్థి అంటూ ప్రచారం చేసింది. అయినా బీజేపీ వ్యూహం కేరళలో ఫలించలేదు. సినీ నటుడు, రాజ్యసభ ఎంపీ సురేశ్ గోపీ బీజేపీ తరఫున బరిలో దిగారు. ఓట్ల లెక్కింపులో సురేశ్ ఆధిక్యం కనబర్చినా.. చివరి రౌండ్లతో ఫలితం తారుమారైంది. మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేంద్ర మాజీ మంత్రి కేజే అల్ఫోన్స్ కూడా కంజిరపల్లి స్థానం నుంచి ఓడిపోయారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు ఎన్నికల ప్రచారానికి వచ్చారు. లవ్ జిహాద్, శబరిమల ఆలయంలోని మహిళల ప్రవేశం వంటి అంశాలను బీజేపీ తన అస్త్రాలుగా మార్చుకుని తీవ్రంగా ప్రచారం చేసింది. ఎల్డీఎఫ్పై తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ ప్రచారాన్ని కొనసాగించింది. అయినా కేరళలో బీజేపీ ప్రభావం చాలా తక్కువగా ఉన్నట్లు తాజా ఫలితాల ద్వారా స్పష్టం అవుతోంది. సరైన రాష్ట్రస్థాయి నాయకుడు లేకనే.. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం.. బంగారం స్మగ్లింగ్ కేసులో సీఎం విజయన్ పాత్ర వంటి అంశాలను యూడీఎఫ్ కూటమి ఓటర్లలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కాకపోతే పినరయి విజయన్ వంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడితో దీటుగా ఎదుర్కోగల నేత లేకపోవడం కూడా యూడీఎఫ్ వెనుకంజకు ముఖ్య కారణమని విశ్లేషిస్తున్నారు. మాజీ సీఎం ఊమెన్ చాందీ ఎన్నికల ర్యాలీలో.. ఓ మత సంస్థలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సంచలనం రేపాయి. చాలా విమర్శలు కూడా వచ్చాయి. ఈ వ్యాఖ్యలు కూడా యూడీఎఫ్ కూటమికి నష్టం చేకూర్చాయనే చెప్పొచ్చు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు చెక్ పెట్టగల సత్తా తమకే ఉందని యూడీఎఫ్ భావించింది. అయితే ఫలితాలు అందుకు భిన్నంగా ఉండటంతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎదురు దెబ్బ అని చెబుతున్నారు. -
కేరళ: మరోసారి లెఫ్ట్ ప్రభుత్వం.. ధర్మదాం నుంచి పినరయి విజయం
లైవ్ అప్డేట్స్: ► "కేరళ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించినందుకు పినరయి విజయన్, ఎల్డీఎఫ్ కు నా అభినందనలు. మేము ఇద్దరం కలిసి విస్తృతమైన విషయాలపై పనిచేస్తాము. కోవిడ్ -19 మహమ్మారిని భారతదేశం నుంచి తరిమికొట్టే విషయంలో కలిసి పనిచేయనున్నాం" అని పీఎం మోడీ ట్వీట్ చేశారు. ► కేరళ ఎన్నికల్లో ధర్మదాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి సీపీఎం నాయకుడు పినరయి విజయన్ కాంగ్రెస్ సీ రఘునాథన్ పై 50,123 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ► "కేరళ ప్రజలు మరోసారి మా ప్రభుత్వంపై విశ్వాసం ఉంచారు. అయితే కోవిడ్ -19 వల్ల పెద్దగా సంబరాలు జరుపుకునే సమయం ఇది కాదు. ప్రతి ఒక్కరూ కోవిడ్ -19కి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలి" అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు ► శశి థరూర్ పినరయి విజయన్ ను అభినందించారు "గత 44 సంవత్సరాలలో మొదటిసారి తిరిగి ఎన్నికైనందుకు @CMOKerala @vijayanPinarayiకి నా అభినందనలు. ప్రజలు చూపిన విశ్వాసాన్ని గౌరవించడం వారి కర్తవ్యం. #కోవిడ్ & మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆయనకు మన మద్దతు ఉండాలి "అని ఎల్డిఎఫ్ చారిత్రాత్మక విజయంపై శశి థరూర్ ట్వీట్ చేశారు. మెట్రోమాన్ ఈ శ్రీధరణ్‌కు షాక్...! ► మెట్రోమాన్ ఈ శ్రీధరణ్‌కు షాక్ తగిలింది. పాలక్కడ్ నుంచి పోటి చేస్తోన్న శ్రీ ధరణ్ సిట్టింగ్ ఎమ్మెల్యే షఫి పరంబిల్ (కాంగ్రెస్) చేతిలో ఓడిపోయారు. 1000పైగా మెజార్టీతో పాలక్కడ్‌ను తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి గెలుచుకుంది. పాలక్కడ్ నియోజకవర్గంపై కాంగ్రెస్ మరోసారి తన సత్తాచాటింది. కాగా మరోసారి ఎల్డీఫ్ కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. ► కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె.కె.శైలజ మట్టన్నూర్ నియోజకవర్గం నుంచి 61,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కేరళ ఎన్నికల చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక మెజారిటీ గెలిచిన చరిత్ర ఇదేనని చెబుతున్నారు. ► కేరళలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అధికార ఎల్డీఎఫ్ ఆధిక్యంలో దూసుకు పోతుంది. 44 స్థానాల్లో గెలుపొంది, 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎల్డీఎఫ్ 10 స్థానాలను కైవసం చేసుకుని, 35 లీడ్‌లో ఉంది. ► ఎల్డీఎఫ్ 70 , యూడీఫ్ 37 స్థానాలలో కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఎల్డీఎఫ్ 26, యూడీఫ్ 6 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ► త్రిశూర్‌లో బిజేపీ అభ్యర్థి సురేష్ గోపి ముందంజలో ఉన్నారు. ► రెండోసారి విజయం దిశగా దూసుకుపోతున్న లెఫ్ట్ ప్రభుత్వం.. ► పినరయి విజయన్‌దే ఈవిజయం అంటున్న విశ్లేషకులు.. ► ధర్మదాంలో సీఎం పినరయి విజయన్ ఆధిక్యం ► పుత్తుపల్లిలో ఊమెన్ చాందీ చాంది ఆధిక్యం ► కేరళలో పాలక్కడ్‌లో మెట్రోమాన్ శ్రీధరన్ ముందంజ.. ► కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య హోరాహోరీ ధర్మదంలో పోటీ చేసిన పినరయి విజయన్(CPM) పుట్టుపల్లిలో పోటీ చేసిన ఊమెన్ చాందీ(కాంగ్రెస్) కళహాకూట్టంలో పోటీ చేసిన శోభా సురేంద్రన్(బీజేపీ) ► కేరళలో ఆధిక్యం దిశలో దూసుకుపోతున్న అధికార ఎల్డీఎఫ్.. ఎల్డీఎఫ్ 78 , యూడీఎఫ్ 48 ► కేరళలో తొలి రౌండ్లో ఎల్డీఎఫ్ ఆధిక్యం.. ఎల్డీఎఫ్ 68, యూడీఎఫ్ 47 ► కేరళలో ఎల్డీఎఫ్ ముందంజ ఎల్డీఎఫ్ 33, యూడీఎఫ్ 18 చోట్ల ఆధిక్యం ► కేరళలో ఎల్డీఎఫ్ ముందంజ ఎల్డీఎఫ్ 14, యూడీఎఫ్ 9 చోట్ల ఆధిక్యం ► కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఎవరు అధికారంలోకి రానున్నారో నేటి ఫలితాలు తేల్చనున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్‌లో భాగంగా కేరళలో 633 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. కేరళలో 140 శాసనసభ స్థానాలు ఉండగా.. ఏప్రిల్ 6న జరిగిన ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి 957 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కేరళలో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద జనం గుంపులుగా చేరడానికి వీల్లేదన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుందని, రాత్రి పొద్దుపోయే దాకా కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. మొత్తం ప్రక్రియను పర్యవేక్షించడానికి 1,100 మంది పరిశీలకులను నియమించామని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల్లోకి అడుగు పెట్టాలంటే కరోనా నెగటివ్ రిపోర్టు లేదా డబుల్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించాలని తేల్చిచెప్పారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరైనా కరోనా ప్రోటోకాల్స్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది. -
నేడే ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు
న్యూఢిల్లీ/కోల్‌కతా/చెన్నై/తిరువనంతపురం: ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 822 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. 2016లో ఆయా రాష్ట్రాలన్నింటిలో కలిపి 1,002 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేయగా, ఈసారి 2,364 హాళ్లు సిద్ధం చేశారు. అంటే హాళ్ల సంఖ్యను ఏకంగా 200 శాతం పెంచారు. అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 1,113, కేరళలో 633, అస్సాంలో 331, తమిళనాడులో 256, పుదుచ్చేరిలో 31 హాళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలను కనీసం 15 సార్లు శానిటైజేషన్ చేయనున్నట్లు అధికారులు చెప్పారు. మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద జనం గుంపులుగా చేరడానికి వీల్లేదన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుందని, రాత్రి పొద్దుపోయే దాకా కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. మొత్తం ప్రక్రియను పర్యవేక్షించడానికి 1,100 మంది పరిశీలకులను నియమించామని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల్లోకి అడుగు పెట్టాలంటే కరోనా నెగటివ్ రిపోర్టు లేదా డబుల్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించాలని తేల్చిచెప్పారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరైనా కరోనా ప్రోటోకాల్స్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది. కీలకమైన పశ్చిమ బెంగాల్లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 దాకా 8 దశల్లో 294 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 108 కేంద్రాల్లో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. 256 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. ఓట్ల లెక్కింపునకు ముందే ఈవీఎంలు, వీవీప్యాట్లను శానిటైజ్ చేయనున్నారు. 126 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో మార్చి 27 నుంచి ఏప్రిల్ 6 దాకా మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. కేరళలో 140 శాసనసభ స్థానాలున్నాయి. ఏప్రిల్ 6న జరిగిన ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి 957 మంది అభ్యర్థులు పోటీ చేశారు. తమిళనాడు, పుదుచ్చేరిలో ఏప్రిల్ 6న ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. తమిళనాడులో 234 స్థానాలుండగా, దాదాపు 4 వేల మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలతోపాటు కన్యాకుమారి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించారు. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ సీట్లున్నాయి. ఓట్ల లెక్కింపు సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. బెంగాల్ ఎవరిదో? దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్రీకృతమయ్యింది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మళ్లీ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డారు. ప్రతిపక్ష బీజేపీ సైతం గట్టి పోటీ ఇచ్చింది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్–బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. అస్సాంలో అధికార బీజేపీ కూటమి ముందంజలో ఉన్నట్లు తేలింది. కేరళలో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. పుదుచ్చేరిలో కాంగ్రెస్‌కు పరాభవం తప్పదని అంటున్నారు. ఇక్కడ బీజేపీ–ఏఐఏడీఎంకే–ఏఐఎన్ఆర్సీ కూటమి విజయం సాధిస్తుందని చెబుతున్నారు. తమిళనాడులో అధికార ఏఐఏడీఎంకే–బీజేపీ కూటమికి భంగపాటు ఎదురవుతుందని, ప్రతిపక్ష డీఎంకే–కాంగ్రెస్ కూటమి గద్దెనెక్కబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. -
బీజేపీకి మరో ఓటమి
-
జేఎంఎం కూటమి జయకేతనం
రాంచీ/న్యూఢిల్లీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీల కూటమి మెజారిటీ సాధించింది. 81 స్థానాలున్న అసెంబ్లీలో 47 సీట్లను కూటమి అభ్యర్థులు గెలుచుకున్నారు. గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ 25 స్థానాలకే పరిమితమైంది. కూటమిలో జేఎంఎం 30 స్థానాల్లో, కాంగ్రెస్ 16 సీట్లలో, ఆర్జేడీ ఒక స్థానంలో గెలుపొందాయి. ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి, బీజేపీ నేత రఘుబర్ దాస్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ ద్రౌపది ముర్ముకి అందించానని, కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని తనను కోరారని అనంతరం రఘుబర్ తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన జేఎంఎం కూటమికి, కూటమి సీఎం అభ్యర్థి హేమంత్ సోరెన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. జార్ఖండ్ ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి విజయం సాధించడం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పేర్కొన్నారు. జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్‌కు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో ప్రతిష్టాత్మక జంషెడ్పూర్(ఈస్ట్) స్థానం నుంచి సీఎం రఘుబర్ దాస్ పోటీ చేశారు. ఆయనపై బీజేపీ రెబెల్ అభ్యర్థి సరయు రాయ్ గెలుపొందారు. జంషెడ్పూర్(వెస్ట్) నుంచి టికెట్ నిరాకరించడంతో సరయు రాయ్ ఇండిపెండెంట్‌గా జంషెడ్పూర్(ఈస్ట్) నుంచి బరిలో దిగారు. అసెంబ్లీ స్పీకర్ దినేశ్ ఓరాన్, పలువురు మంత్రులు ఓటమి పాలయ్యారు. విజయం అనంతరం జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ రాష్ట్ర ప్రజలకు, తన తండ్రి శిబూ సోరెన్‌కు, కూటమి పార్టీల నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్(ఏజేఎస్‌యూ) పార్టీ 2 సీట్లలో గెలుపొందింది. ఆ పార్టీ అధ్యక్షుడు సుదేశ్ మహతో 20 వేల మెజారిటీతో సిలీ స్థానం నుంచి గెలుపొందారు. జార్ఖండ్ వికాస్ మోర్చా– ప్రజా తాంత్రిక్(జేవీఎం–పీ) చీఫ్ బాబూలాల్ మరాండి ధన్వార్ స్థానం నుంచి గెలుపొందగా, ఆ పార్టీ మరో రెండు సీట్లనూ గెలుచుకుంది. రాంచి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సీపీ సింగ్ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 33.53%, జేఎంఎంకు 19.29%, కాంగ్రెస్‌కు 13.78%, ఆర్జేడీకి 2.82%, ఏజేఎస్‌యూకి 8.15%, ఎంఐఎంకు 1.08% ఓట్లు లభించాయి. ముస్లింల జనాభా గణనీయంగా ఉన్న జార్ఖండ్‌లో సీఏఏ వ్యతిరేకత తీవ్ర ప్రభావం చూపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. దాంతోపాటు రాష్ట్రంలో ముస్లింలపై జరిగిన పలు మూకదాడులపై కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. ఏజేఎస్‌యూతో పొత్తు కుదుర్చుకోలేకపోవడం కూడా బీజేపీ ఓటమికి కారణంగా భావిస్తున్నారు. పీఎం మోదీ శుభాకాంక్షలు జార్ఖండ్ అసెంబ్లీ విజయం సాధించిన జార్ఖండ్ ముక్తి మోర్చా నేత హేమంత్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన హేమంత్, జేఎంఎం నేతృత్వంలోని కూటమికి అభినందనలు’ అని ట్వీట్ చేశారు. ఇన్నాళ్లు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు జార్ఖండ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఓటమి బీజేపీది కాదని, వ్యక్తిగతంగా తనదని ముఖ్యమంత్రి రఘుబర్ వ్యాఖ్యానించారు. సీఏఏ, ఎన్నార్సీలపై ప్రజా తీర్పు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంపై కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ కార్యకర్తలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఉపాధి, నీరు, అడవి, వ్యవసాయం, వాణిజ్యం.. తదితర అంశాల్లో ప్రభుత్వ సాయాన్ని కోరుకుంటోంటే బీజేపీ నేతృత్వంలోని కేంద్రం మాత్రం విభజన రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. అందుకే ప్రజలు ఈ తీర్పునిచ్చారని ఆమె ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల అహంకారాన్ని జార్ఖండ్ ప్రజలు నాశనం చేశారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. హేమంత్ సోరెన్‌కు టీఎంసీ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ శుభాకాంక్షలు తెలిపారు. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా తాజాగా ప్రజలు ఇచ్చిన తీర్పు ఇదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ @ 7 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో సొంతంగా కానీ, కూటమితో కలిసి కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 7కి చేరింది. పంజాబ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరిలో కాంగ్రెస్ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలతో పొత్తు పెట్టుకుని అధికారంలో భాగస్వామ్యం సాధించింది. తాజాగా జార్ఖండ్‌లో జేఎంఎం కూటమిలో చేరి విజయం సాధించింది. హేమంత్ నేపథ్యం జార్ఖండ్ ఎన్నికల్లో విజయం సాధించిన జార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం) అధ్యక్షుడు హేమంత్ సోరెన్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. గిరిజన పోరాటయోధుడు బిర్సా ముండాయే తనకు స్ఫూర్తి అని చెప్పుకునే హేమంత్.. కేంద్ర మాజీ మంత్రి, మూడుసార్లు జార్ఖండ్ సీఎంగా పనిచేసిన ఆదివాసీ నేత శిబూ సోరెన్ కుమారుడు. ► తల్లిదండ్రులు: రూపి, శిబూ సోరెన్ ► జననం: 1975 ఆగస్ట్ 10. ► స్వస్థలం: రామ్‌గఢ్ జిల్లా నేమ్రా గ్రామం, జార్ఖండ్ ► విద్య: ఇంటర్, ఇంజినీరింగ్ (డిస్కంటిన్యూ) ► హాబీలు: వంట చేయడం, క్రికెట్ ఆడటం ► భార్య: కల్పనా సోరెన్ రాజకీయ ప్రవేశం ► సోదరుడు దుర్గ హఠాన్మరణంతో హేమంత్ 2009లో జేఎంఎం పగ్గాలు చేపట్టారు. ► 2005లో తొలిసారి దుమ్కా స్థానం నుంచి ఎన్నికల బరిలోకి. జేఎంఎం తిరుగుబాటు నేత స్టీఫెన్ మరాండీ చేతిలో ఓటమి. ► 2009– 2010లో రాజ్యసభ సభ్యుడు. ► 2010లో జార్ఖండ్ డెప్యూటీ సీఎంగా బాధ్యతలు. ► 2013 జూలై 13న జార్ఖండ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన ఎత్తివేసిన తరువాత కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతుతో 2013 జూలై 15న సుమారు 38 ఏళ్లకే రాష్ట్రానికి అత్యంత చిన్న వయస్కుడైన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014 డిసెంబర్ వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ► 2014 డిసెంబర్ 23న బార్‌హైత్ ఎమ్మెల్యేగా ఎన్నిక.. ప్రతిపక్ష నేతగా ఎంపిక. -
ఐదోసారి సీఎంగా నవీన్
భువనేశ్వర్: ఒడిశా శాసనసభ ఎన్నికల్లో వరుసగా ఐదోసారి విజయఢంకా మోగించిన బిజు జనతా దళ్ అధినేత నవీన్ పట్నాయక్ మే 29వ తేదీన నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భువనేశ్వర్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఆయన వరుసగా ఐదోసారి ఒడిశా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్నారు. అంతకుముందు బీజేడీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం సుమారు 45 నిమిషాలు జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా నవీన్ పట్నాయక్‌ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ గణేషి లాల్‌ను కలసిన నవీన్ పట్నాయక్.. ఎమ్మెల్యేలు తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న తీర్మాన ప్రతిని ఆయనకు అందజేశారు. అనంతరం ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ గణేషి లాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా నవీన్ పట్నాయక్‌ను ఆహ్వానించారు. ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేడీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 146 శాసనసభ స్థానాలకు గాను 112 సీట్లలో బీజేడీ విజయం సాధించింది. బీజేపీ 23 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఇక కాంగ్రెస్ 9 సీట్లకే పరిమితమైంది. పాట్కూరా శాసనసభ స్థానంలో అభ్యర్థి మరణం, ఫోణి తుపాను కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. దేశంలో మోదీ గాలి వీస్తున్పప్పటికీ రాష్ట్రంలో మాత్రం 23 సీట్లకే బీజేపీ పరిమితమైంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ అదనంగా 13 స్థానాల్ని గెలుచుకొని ప్రతిపక్ష స్థానాన్ని అందుకుంది. నిరాడంబర వ్యక్తిత్వం నిరాడంబర జీవనశైలి, సాదాసీదా ఆహార్యం, సాత్వికాహారం రాజీలేని పనితీరు ఒడిశాలో వరుసగా అయిదు పర్యాయాలు అధికారాన్ని నిలుపుకున్న నవీన్ పట్నాయక్ వ్యవహార శైలి. రాష్ట్రానికి చాలాకాలం దూరంగా ఉండటంతో మాతృభాష ఒడియాపై పట్టులేకున్నా కష్టించి పని చేయడంపై మమకారమే ఆయనను ప్రజలకు చేరువ చేసింది. ఐదేళ్లు పాటు పాలించిన నేతలు తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొం టున్న ప్రస్తుత రాజకీయాల్లో సుమారు 19 ఏళ్ల పాటు అధికారాన్ని నిలుపుకుని.. మరోసారి సీఎంగా గెలిచిన ఘనత ఆయన సొంతం. ఈ నేపథ్యంలో నవీన్ పట్నాయక్ జీవితంలోని ముఖ్య ఘట్టాలు.. జననం.. విద్యాభ్యాసం.. ఒడిశా దివంగత ముఖ్యమంత్రి, జనతా దళ్ నేత బిజు పట్నాయక్, గ్యాన్ పట్నాయక్ దంపతుల కుమారుడైన నవీన్ పట్నాయక్ ఒడిశాలోని కటక్ ప్రాంతంలో అక్టోబర్ 16, 1946లో జన్మించారు. డెహ్రాడూన్‌లోని వెల్హం బాలుర పాఠశాల, డూన్ పాఠశాలల్లో ఆయన ప్రాథమిక విద్య నభ్యసించారు. అనంతరం ఢిల్లీ విశ్వవిద్యాల యానికి చెందిన సెయింట్ స్టీఫెన్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. పాఠశాల స్థాయి నుంచే ఆయన చరిత్ర, ఆయిల్ పెయింటింగ్, అథ్లెటిక్స్‌పై మక్కువ పెంచుకున్నారు. డూన్ స్కూల్లో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకి నవీన్ మూడేళ్ల జూనియర్. ఒడిశా రాష్ట్రానికి, రాజకీయాలకు దూరంగా ఉన్న నవీన్ .. తండ్రి మరణంతో అమెరికా నుంచి తిరిగివచ్చి 1996లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. -
తెలంగాణ ఎన్నికలపై అనుమానాలున్నాయి
-
తాత్కాలిక స్పీకర్‌పై తకరారు!
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప నాయకత్వాన ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం బలపరీక్ష నిర్వహణకు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ కేజీ బోపయ్యను గవర్నర్ వజూభాయ్ వాలా నియమించడంతో ప్రొటెం స్పీకర్ నియామకం, పాత్రపై చర్చ మొదలైంది. లోక్‌సభ ప్రొటెం స్పీకర్ నియామకానికి అనుసరించే పద్ధతులనే శాసనసభ ప్రొటెం స్పీకర్ విషయంలోనూ పాటిస్తారు. ప్రొటెం స్పీకర్ పదవికి సీనియర్ సభ్యుడిని నియమిస్తారు. లోక్‌సభకైతే పార్లమెంటు సభా వ్యవహారాల విభాగం, అసెంబ్లీకైతే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కొందరు సీనియర్ సభ్యుల జాబితా రూపొందించి పంపితే ఆయా ప్రభుత్వాలు ఒకరిని ఎంపిక చేస్తాయి. లోక్‌సభకైతే ప్రొటెం స్పీకర్‌ను రాష్ట్రపతి, అసెంబ్లీకైతే ప్రొటెం స్పీకర్‌ను గవర్నర్ నియమించి ప్రమాణం చేయిస్తారు. సంప్రదాయంగా దీన్ని పాటిస్తున్నారు. అత్యధిక సీనియర్ అయిన సభ్యుడినే ఈ పదవికి నియమించాలనే నిబంధనలేమీ లేవు. ప్రొటెం స్పీకర్ ప్రధాన విధులు కొత్తగా ఎన్నికైన సభ్యులందరితో ప్రమాణం చేయించడంతోపాటు, స్పీకర్ ఎన్నిక జరిగే వరకూ సభను నిర్వహించడం. ఎన్నికలు జరిగిన వెంటనే ప్రొటెం స్పీకర్‌ను నియమిస్తారు. మధ్యలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు ఇద్దరూ రాజీనామా చేయడం లేదా మరణించడం జరిగితే కూడా ప్రొటెం స్పీకర్‌ను నియమిస్తారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు ముందు ప్రొటెం స్పీకర్ అప్పటి ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నదీ లేనిదే తేల్చే బలపరీక్ష నిర్వహించడం రాజ్యాంగం ప్రకారం తప్పేమీ లేదని రాజ్యాంగ నిపుణుడు పీడీటీ ఆచారీ చెప్పారు. స్పీకర్‌ను ఎన్నుకునే స్థితిలో సభ లేనప్పుడు ప్రొటెం స్పీకర్ బలపరీక్ష నిర్వహించడం సక్రమమేనని ఆయన వివరించారు. నెలలో ముగ్గురు ప్రొటెంలు ఆంధ్రప్రదేశ్‌లో 1984 ఆగస్ట్‌లో ఎన్టీఆర్ ప్రభుత్వం బర్తరఫ్ తర్వాత గద్దెనెక్కిన నాదెండ్ల భాస్కరరావు సర్కారు బలపరీక్ష సమయంలో ముగ్గురు సీనియర్ ఎమ్మెల్యేలు ప్రొటెమ్ స్పీకర్లు(నెల రోజుల్లో)గా పనిచేశారు. అప్పటి స్పీకర్ తంగి సత్యనారాయణ, డెప్యూటీ స్పీకర్ ఎ.భీమ్‌రెడ్డి రాజీనామా చేసి నాదెండ్ల కేబినెట్లో చేరడంతో సభా నిర్వహణకు సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎం. బాగారెడ్డిని ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. సభలో రోజూ రభస జరగడంతో బాగారెడ్డి రాజీనామా చేశారు. తర్వాత ఎంఐఎం నేత సుల్తాన్సలాహుద్దీన్ ఒవైసీని ఈ పదవిలో నియమించగా ఆయన నాదెండ్లకు సర్కారుకు అనుకూలంగా వ్యవహరిస్తూ సభలో గొడవలను అదుపు చేయలేకపోయారనే ఆరోపణలొచ్చాయి. ఫలితంగా ఆయనను గవర్నర్తొలగించారు. నెల తర్వాత మళ్లీ సీఎంగా ప్రమాణం చేసిన ఎన్టీఆర్ సర్కారు బలపరీక్ష నిర్వహణకు నియమితుడైన సీనియర్ సభ్యుడు పి.మహేంద్రనాథ్ ప్రొటెం స్పీకర్‌గా ఆ పని పూర్తి చేశారు. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
2 సీట్లు నెగ్గి అధికారంలోకా.. ఎలా..!
సాక్షి, షిల్లాంగ్: మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండంటే రెండే స్థానాల్లో నెగ్గిన బీజేపీ అధికారాన్ని ఏ విధంగా కోరుకుంటుందని సీఎం ముకుల్ సంగ్మా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలే వారిని వద్దనుకున్న నేపథ్యంలో ఏకంగా ప్రభుత్వం ఏర్పాటు కోసం బీజేపీ పావులు కదుపుతుందన్నారు. ఇటీవల జరిగిన న్నికల్లో ఎవరికీ పూర్తి మెజార్టీ రాకపోవడంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన విషయం తెలిసిందే. కానీ బీజేపీ మాత్రం కొన్ని పార్టీలతో కలిసి కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని లీకులిస్తోంది. దీనిపై సీఎం ముకుల్ సంగ్మా రాజధాని షిల్లాంగ్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. 'ఈ ఎన్నికల్లో మేఘాలయ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం. 21 స్థానాలతో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించంతో.. ప్రభుత్వ ఏర్పాటు అంశాలను గవర్నర్‌ను కలిసి చర్చించాను. స్థానిక పార్టీల అభ్యర్థులు, కొందరు స్వత్రంత్రుల మద్ధతు కూడగట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని గవర్నర్ కు తెలిపాను. కానీ 47 స్థానాల్లో పోటీచేసి కేవలం రెండు స్థానాల్లోనే విజయం సాధించిన బీజేపీ అధికారంలోకి రావడం ఏ విధంగా సాధ్యమవుతుంది. స్థానిక రాజకీయ పార్టీల నెగ్గిన అభ్యర్థులను మభ్యపెట్టి ఎలాగైనా సరే మేఘాలయలో అధికారంలోకి రావాలని బీజేపీ అత్యాశకు పోతుందంటూ' సీఎం ముకుల్ సంగ్మా విమర్శించారు. మేఘాలయలో 59 స్థానాలకు ఎన్నికలు జరగగా.. అధికార కాంగ్రెస్ 21 స్థానాలు, నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) 19 సీట్లు సొంతం చేసుకుంది. 47 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ రెండు చోట్ల మాత్రమే గెలిచింది. యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ(యూడీపీ) ఆరు చోట్ల, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) నాలుగు, హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(హెచ్ఎస్పీడీపీ) రెండు చోట్ల గెలుపొందాయి. కేహెచ్ఎన్ఏఎం, ఎన్సీపీలు చెరొక స్థానంలో, స్వతంత్రులు మూడు స్థానాల్లో గెలిచాయి. యూడీఎఫ్, హెచ్‌ఎస్‌పీడీపీలు పొత్తుపై ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి. -
త్రిపురలో లెఫ్ట్‌కు చెక్
అగర్తలా: త్రిపురలో 25 ఏళ్ల అప్రతిహత కమ్యూనిస్టు పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. బీజేపీ–ఐపీఎఫ్టీ (ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర) కూటమికి భారీ మెజారిటీతో పట్టంగట్టారు. ఇంతవరకు త్రిపురలో ఒక్క కౌన్సిలర్ సీటు కూడా లేని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది. ఫిబ్రవరి 18న త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరగగా.. శనివారం ఫలితాలు వెల్లడయ్యాయి. బీజేపీ కూటమి 43 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించింది. కమలం పార్టీ సొంతంగా 35 స్థానాలను కైవసం చేసుకోగా.. ఐపీఎఫ్టీ 8 చోట్ల విజయం సాధించింది. మాణిక్ సర్కార్ నేతృత్వంలోని సీపీఎం 16 సీట్లకే పరిమితమైంది. గత అసెంబ్లీలో 10 స్థానాలతో విపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు ఒక్క సీటుకూడా దక్కలేదు. విపక్ష మొత్తం 60 స్థానాలకు గానూ 59 సీట్లకు ఎన్నికలు జరిగాయి. అభ్యర్థి మృతితో ఒక స్థానంలో ఎన్నిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. వామపక్షానికి షాకింగ్ ఓటమి త్రిపురలో సీపీఎంకు ఇంత దారుణమైన ఓటమి ఎన్నడూ ఎదురుకాలేదు. 1988లో కాంగ్రెస్–త్రిపుర ఉపజాతి జుబా సమితి కూటమి అధికారం సంపాదించినా.. ఇంత తక్కువ సీట్లను పొందలేదు. అటు, కౌన్సిలర్ సీటుకూడా లేని స్థానం నుంచి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమించింది. ప్రభుత్వ వ్యతిరేకతను సరిగ్గా వినియోగించుకుని వ్యూహాత్మక ప్రచారంతో దూసుకెళ్లింది. మొత్తం 51 స్థానాల్లో బీజేపీ పోటీ చేయగా దాదాపు 43 శాతం ఓట్లు సంపాదించింది. 9 చోట్ల అభ్యర్థులను నిలిపిన ఐపీఎఫ్టీ దాదాపు 7.5 శాతం ఓట్లను పొందింది. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విప్లవ్ దేవ్ ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో 50–60 శాతం ఓట్లను పొందిన వామపక్ష కూటమి ఈసారి 42.7 శాతం ఓట్లు సాధించింది. ఒక్కసీటు కూడా గెలవని కాంగ్రెస్ రెండు శాతానికన్నా తక్కువ ఓట్లు పొందింది. గిరిజనుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో బీజేపీ భారీ మెజారిటీ సంపాదించింది. ప్రజలు మార్పుకు ఓటేశారు త్రిపుర ప్రజలు మార్పును కోరుకోవటమే తమ ఘనవిజయానికి కారణమని బీజేపీ నేత రాంమాధవ్ పేర్కొన్నారు. ‘మేం ‘పరివర్తన్’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాం. ప్రజలు కూడా మార్పును బలంగా కోరుకున్నారు. అందుకే మాకు పట్టంగట్టారు’ అని ఆయన పేర్కొన్నారు. అస్సాం మంత్రి, త్రిపుర బీజేపీ ఇంచార్జ్ హిమంత బిస్వ శర్మ మాట్లాడుతూ.. ‘మాణిక్ సర్కార్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది. 25 ఏళ్లుగా వారే పాలిస్తున్నా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అందుకే ప్రజలకు వారిని గద్దెదించి బీజేపీకి అవకాశమిచ్చారు. గిరిజన ప్రాంతాల్లో బలంగా ఉన్న ఐపీఎఫ్టీ కూడా బీజేపీ విజయంలో కీలక భాగస్వామి. త్రిపుర జనాభాలో 35 శాతం ఓట్లు గిరిజనులవే. వారు ఏకపక్షంగా బీజేపీకి మద్దతిచ్చారు’ అని వెల్లడించారు. మైనారిటీలు మరీ ముఖ్యంగా క్రిస్టియన్లు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారన్న వార్తల్లో వాస్తవం లేదని.. వారంతా మనస్ఫూర్వకంగా బీజేపీకి మద్దతు తెలిపారని శర్మ పేర్కొన్నారు. ‘త్రిపుర ప్రజలు రాష్ట్రంలో బీజేపీ కూటమికి అధికారమిచ్చారు. 25 ఏళ్లుగా వారికి సేవచేసే అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు. బీజేపీ త్రిపురతోపాటు దేశవ్యాప్తంగా విభజన రాజకీయాలకు పాల్పడుతోంది’ అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ విమర్శించారు. నేను సిద్ధమే.. కానీ పార్టీ నిర్ణయిస్తుంది త్రిపురలో బీజేపీ అధికారంలోకి రావటంలో ముఖ్యమంత్రి అభ్యర్థిపై చర్చ మొదలైంది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విప్లవ్ కుమార్ దేవ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రచారం జరుగుతోంది. అయితే అవకాశం ఇస్తే సీఎంగా సేవలందించేందుకు తాను సిద్ధమేనని.. కానీ నిర్ణయం తీసుకోవాల్సింది పార్టీ పార్లమెంటరీ బోర్డేనన్నారు. ‘బాధ్యతలు తీసుకునేందుకు నేను సిద్ధమే. నాకు అప్పజెప్పిన పనినుంచి నేనెప్పుడూ పారిపోను. పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నాకు ఇచ్చారు. దీన్ని నా సామర్థ్యానికి అనుగుణంగా నెరవేరుస్తున్నాను’ అని విప్లవ్ తెలిపారు. బీజేపీ ఇచ్చిన పిలుపుతో 25 ఏళ్ల కమ్యూనిస్టు కోటను కూకటివేళ్లతో పెకిలించి.. తమకు అధికారాన్ని కట్టబెట్టిన త్రిపుర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ అమిత్‌షాలు తనను వెన్నంటి ప్రోత్సహించారన్నారు. ఇక త్రిపురను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ‘సీపీఎం పాలనలో రాష్ట్రం నష్టపోయింది. మేం సుపరిపానలతో పరిస్థితిలో మార్పు తీసుకొస్తాం’ అని దేవ్ పేర్కొన్నారు. విప్లవ్ కుమార్ దేవ్ -
ఆ సీఎం రెండు చోట్లా ఘన విజయం
సాక్షి, షిల్లాంగ్: మేఘాలయ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత ముకుల్ సంగ్మా రెండు స్థానాల్లో ఘన విజయం సాధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంపాతి, సంగ్సక్ నియోజవర్గాల నుంచి బరిలోకి దిగిన సంగ్మా విజయకేతనం ఎగురవేశారు. సంగ్మా రెండు పర్యాయాలు సీఎంగా చేశారు. తొలిసారి 2010 ఏప్రిల్‌లో మేఘాలయ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ముకుల్ సంగ్మా 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. కానీ మేఘాలయలో హంగ్ ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. శనివారం ఉదయం నుంచి జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ సూచనలు లేవు. మధ్యాహ్నం సమయానికి జరిగిన ఓట్ల లెక్కింపులో 2 చోట్ల నెగ్గిన కాంగ్రెస్ మరో 20 చోట్ల ఆధిక్యంలో ఉండగా, ఎన్పీపీ 16 చోట్ల, ఇతరులు 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మేఘాలయాలో ఫలితాలు బీజేపీకి మింగుడు పడటం లేదు. బీజేపీ ఇక్కడ కేవలం 4 స్థానాలు నెగ్గేలా కనిపిస్తోంది. కాగా, మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ 59 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపగా, బీజేపీ తరపున 47 మంది పోటీ చేసిన విషయం తెలిసిందే. -
నాగాలాండ్‌లో బీజేపీ కూటమి హవా..!
సాక్షి, కోహిమా: త్రిపురలో అధికార సీపీఎంకు బీజేపీ షాకివ్వగా.. నాగాలాండ్‌లో తమ మిత్రపక్షంతో కలిసి అధికారం చేపట్టనుంది. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా.. ప్రస్తుత ట్రెండ్స్ గమనిస్తే అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ అధికారం కోల్పోయేలా కనిపిస్తుంది. బీజేపీ-నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ) కూటమి విజయం సాధించే అవకాశాలున్నాయి. ఎన్డీపీపీ-బీజేపీ కూటమి 32 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్తుండగా, అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ పార్టీ 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరో 5 స్థానాల్లో ఇతరులు ఆధిక్యంలో కొనసాగుతుండటం గమనార్హం. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన స్థానాలకు (31 సీట్లు) ఒకట్రెండు తక్కువ వచ్చినా స్వతంత్రుల మద్ధతుతోనైనా అధికారం హస్తగతం చేసుకోవాలని బీజేపీ-ఎన్డీపీపీ కూటమి భావిస్తోంది. నాగాలాండ్‌లో బీజేపీ, ఎన్డీపీపీతో జత కట్టగా.. ఎన్డీపీపీ 40 స్థానాల్లో, బీజేపీ 20 చోట్ల పోటీ చేసిన విషయం తెలిసిందే. కాగా, 18 స్థానాల్లోనే బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పరాభవం తప్పడం లేదు. కనీసం ఒక్క స్థానంలోనూ నెగ్గేలా కనిపించడం లేదు. బీజేపీ నేత హిమాంత బిస్వా శర్మ జోస్యం చెప్పినట్లుగానే త్రిపురను బీజేపీ నేరుగా సొంతం చేసుకోనుండగా, నాగాలాండ్‌లో ప్రధాన మిత్రపక్షం ఎన్డీపీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఎన్డీపీపీ చీఫ్ నీఫి రియో ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. మేఘాలయాలో మాత్రం బీజేపీకి ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. -
అక్కడ గెలిస్తే.. నాగాలాండ్‌లోనూ మాదే హవా!
సాక్షి, న్యూఢిల్లీ/అగర్తల: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామని బీజేపీ నేత హిమాంత బిస్వా శర్మ ధీమా వ్యక్తం చేశారు. త్రిపురలో విజయం సాధిస్తే.. నాగాలాండ్‌లోనూ మా కూటమి మళ్లీ సొంతం చేసుకుంటామని ఆయన అభిప్రాయపడ్డారు. ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లలో గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత పలు అంశాలు ప్రస్తావించారు. మరోవైపు త్రిపురలో బీజేపీ, సీపీఎం మధ్య రసవత్తర పోరు జరుగుతోంది. 'త్రిపురలో సొంత మెజారిటీతో నెగ్గి తీరుతాం. నాగాలాండ్‌లో మిత్రపక్షంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మేఘాలయాలో బీజేపీకి ప్రతికూల ఫలితాలు వస్తే ఇతర పార్టీలతో చర్చించి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని' హిమాంత బిస్వా శర్మ తెలిపారు. అయితే త్రిపురను విడగొట్టేందుకు సిద్ధంగా లేమని బీజేపీ ఇదివరకే స్పష్టం చేసింది. కానీ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఓ కమిటీని ఏర్పాటు చేసి, కమిటీ సభ్యుల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. త్రిపురలో నాగాలాండ్‌లో బీజేపీ, ఎన్డీపీపీతో జత కట్టగా.. ఎన్డీపీపీ 40 చోట్ల, బీజేపీ 20 చోట్ల పోటీ చేశాయి. త్రిపుర ఎన్నికల కౌంటింగ్‌లో వామపక్షాలు 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ అభ్యర్థులు 28 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. నాగాలాండ్ లో ఎన్డీపీపీ-బీజేపీ 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ 29 స్థానాల్లో దూసుకెళ్తోంది. -
మరికొన్ని గంటల్లో 'ఈశాన్య' రాష్ట్రాల భవితవ్యం
అగర్తల/కోహిమా/షిల్లాంగ్: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. నేడు(శనివారం) ఉదయం 8 గంటలకు మూడు రాష్ట్రాల్లోనూ కౌంటింగ్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఈ మూడు రాష్ట్రాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. త్రిపురలో ఫిబ్రవరి 18న, మేఘాలయ, నాగాలాండ్‌లో ఫిబ్రవరి 27న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. మూడు రాష్ట్రాల్లోనూ 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వివిధ కారణాల వల్ల మూడింటిలోనూ 59 స్థానాలకే పోలింగ్ జరిగింది. త్రిపుర, మేఘాలయలో అభ్యర్థుల మరణం కారణంగా ఒక్కో స్థానానికి ఎన్నిక వాయిదా పడింది. ఇక నాగాలాండ్‌లో నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(ఎన్డీపీపీ) చీఫ్ నీఫి రియో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ 59 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. బీజేపీ తరపున 47 మంది పోటీలో ఉన్నారు. నాగాలాండ్‌లో బీజేపీ, ఎన్డీపీపీతో జత కట్టింది. ఇక్కడ ఎన్డీపీపీ 40 చోట్ల, బీజేపీ 20 చోట్ల పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 18 స్థానాల్లోనే బరిలో ఉంది. కమలం వికసించేనా..? త్రిపురలో 25 ఏళ్లుగా కొనసాగుతున్న వామపక్ష కూటమికి పరాభవం తప్పదని, ఇక్కడ బీజేపీ అధికారం కైవసం చేసుకునే అవకాశం ఉందని రెండు ఎగ్జిట్‌పోల్ సర్వేల్లో తేలింది. మిగతా రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ గట్టి పోటీ ఇస్తుందని పేర్కొంది. మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ పదేళ్లుగా అధికారంలో ఉంది. 2008లో మూడు నెలల రాష్ట్రపతి పాలన మినహా నాగాలాండ్‌లో నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) 2003 నుంచి అధికారంలో ఉంది. అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన బీజేపీ మేఘాలయ, నాగాలాండ్, త్రిపురలోనూ విజయకేతనం ఎగురవేసి ఈశాన్య భారతంలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. -
మోదీ మ్యాజిక్..బీజేపీ డబుల్ హ్యాట్రిక్
-
నేడే గుజరాత్,హిమాచల్ జడ్జిమెంట్
-
అక్కడ 'నోటా' దుమ్మురేపింది!
పై వారెవరూ కాదు (నన్ ఆఫ్ ది అబో- నోటా).. అని ఈవీఎంలపై ఉండే ఈ మీటనే తాజా ఎన్నికల్లో ఓటర్లను ఎక్కువగా ఆకర్షించినట్టు కనిపిస్తున్నది. ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులందరినీ తిరస్కరించే హక్కును ఓటర్లకు కల్పిస్తున్న నోటాకు పశ్చిమ బెంగాల్లో భారీగా ఓట్లు పోలయ్యాయి. బెంగాల్‌లోని చాలా నియోజకవర్గాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష వామపక్ష-కాంగ్రెస్ కూటమి, బీజేపీల తర్వాత అత్యధిక ఓట్లు నోటాకే పడ్డాయి. దీంతో 'నోటా'నే నాలుగో పోటీదారుగా చాలాచోట నిలిచింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన బీఎస్పీ, సీపీఐ, ఫార్వర్డ్ బ్లాక్, ఎస్‌యూసీఐ, స్వతంత్ర అభ్యర్థుల కంటే కొన్నిచోట్ల నోటాకే అధిక ఓట్లు రావడం గమనార్హం. ఇదే తరహా పరిస్థితి ఇటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన పుదుచ్చేరి, తమిళనాడు, అసోంలోనూ కనిపించింది. ఇక్కడ కూడా 'నోటా'కు ఓటర్లు గణనీయంగానే మొగ్గుచూపారు. ఒక్క కేరళలో మాత్రం 'నోటా'కు చాలా తక్కువమంది ఓటు వేశారు. అసోంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కంటే 'నోటా'కే ఎక్కువ ఓట్లు పడటం గమనార్హం. బెంగాల్లో 6.6 కోట్ల ఓటర్లు ఉండగా, అందులో 8లక్షలకుపైగా మంది ఓటర్లు తమకు ఏ అభ్యర్థి నచ్చలేదంటూ 'నోటా'కు ఓటు గుద్దారు. బెంగాల్లో 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఐదులక్షలకుపైగా 'నోటా'ను వినియోగించుకున్నారు. -
టాప్ హీరోలు!
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో టాప్ హీరోలుగా ఈ సారి కొందరే నిలిచారు. ఓట్ల చీలికతో ఈ సారి టాపర్ల సంఖ్య తక్కువే. గతంలో యాైభై, డెబ్బై, లక్షా అంటూ మెజారిటీల్ని దక్కించుకున్న వాళ్లు కూడా ఈ సారి పది, ఇరవై, ముప్పైలోపు పరిమితం కావాల్సి వచ్చింది. ఇందులో సీఎం జయలలిత, డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్లు కూడా ఉన్నారు. ఇక, తామే హీరోలం అన్నట్టుగా డీఎంకే, అన్నాడీఎంకేలకు చెందిన పలువురు నలబై నుంచి డెబ్బై వేలలోపు ఓట్లతో టాప్ హీరోలుగా నిలిచారు. ఈ హీరోల్లో ప్రప్రథముడిగా తొమ్మిది పదుల వయస్సు దాటి పదమూడో సారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్న డీఎంకే అధినేత కరుణానిధి ఉన్నారు. కరుణానిధికి 68,366 ఓట్ల మెజారిటీ దక్కింది. తదుపరి ఒట్టన్ చత్రం నుంచి డిఎంకే తరపున ఎన్నికైన చక్రపాణి 65 వేల 711 ఓట్ల మెజారిటీ దక్కించుకున్నారు. తిరువణ్ణామలై నుంచి డిఎంకే తరపున ఎన్నికైన ఏవివేలు 50 వే ల 348, తిరుక్కోవిలూరు నుంచి డీఎంకే తరఫున పొన్ముడి 41,057 ఓట్ల మెజారిటీ పొందారు. తిరుపత్తూరు నుంచి డీఎంకే తరఫున ఎన్నికైన పెరియకరుప్పన్ 42004 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇక, అన్నాడీఎంకే అధినేత్రి జె జయలలిత కన్నా, ఆ పార్టీకి చెందిన పలువురు మంత్రులు యాభై వేలకు పైగా మెజారిటీ సాధించడం విశేషం. ఇందులో మాజీ ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం, బోడి నాయకనూర్ నుంచి 53 వేల 107 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మరో మంత్రి ఎస్పి వేలుమణి తొండాముత్తురులో 64,041 ఓట్ల మెజారిటీ, ఇంకో మంత్రి తంగమణి కుమర పాళయం నుంచి 47 వేల 329, ఎడపాడి నుంచి మంత్రి ఎడపాడి కె. పళని స్వామి 42,022 ఓట్ల మెజారిటీతో టాప్ హీరోలుగా అయ్యారు. ఘోరం: అత్యధిక మెజారిటీతో హీరోలుగా కొందరు అవతరిస్తే, మరి కొందరు హీరోలు అత్యధిక ఓట్ల మెజారిటీ తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూశారు. ఇందులో తొలి నేతగా డీఎండీకే అధినేత, ప్రజా సంక్షేమ కూటమి సీఎం అభ్యర్థి విజయకాంత్ నిలిచారు. ఆయన 47, 526 ఓట్లతో అన్నాడీఎంకే అభ్యర్థి కుమర గురు చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూశారు. తదుపరి పీఎంకే సీఎం అభ్యర్థి 18,446 వేలతో ఓటమి ఎదు చవి చూడాల్సి వచ్చింది. -
ఉపఎన్నికల్లో బీజేపీకి షాక్
నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి దక్కింది ఏడే.. బీహార్‌లో లౌకికవాద కూటమి ప్రయోగం సక్సెస్ బెంగళూరు: మూడు నెలల క్రితం లోక్‌సభ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన బీజేపీకి నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు మాత్రం నిరాశనే మిగిల్చాయి. ఈ నెల 21న బీహార్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో 18 అసెంబ్లీ సీట్లకు ఉపఎన్నికలు జరగగా.. సోమవారం ప్రకటించిన ఫలితాల్లో బీజేపీ కూటమి 8 సీట్లలో విజయం సాధించింది. బీహార్‌లో దూసుకెళ్తామని భావించిన ఆ పార్టీకి ఆర్జేడీ, జేడీ (యు), కాంగ్రెస్ పార్టీలతో కూడిన లౌకికవాద కూటమి గట్టి షాకిచ్చింది. ఆ రాష్ట్రంలో పది స్థానాలకు ఎన్నికలు జరగగా రెండు సిట్టింగ్ స్థానాలు కోల్పోయిన బీజేపీ నాలుగు స్థానాలతో సరిపెట్టుకుంది. లౌకికవాద కూటమికి 6 (ఆర్జేడీ 3, జేడీ (యు) 2, కాంగ్రెస్ 1) స్థానాలు దక్కాయి. కంచుకోట మధ్యప్రదేశ్‌లో క్లీన్‌స్వీప్ చేస్తామని భావించిన బీజేపీకి నిరాశే మిగిలింది. ఇక్కడ మూడు స్థానాల్లో ఎన్నిక జరగ్గా.. ఊహించని రీతిలో కాంగ్రెస్ ఒక సీటు గెలుచుకుంది. ఇక పంజాబ్‌లో రెండు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ ఒక సీటు గెలుచుకోగా.. కాంగ్రెస్ మరో సీటులో విజయం సాధించింది. కర్ణాటకలోని మూడు శాసనసభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలు దక్కించుకుంది. బీజేపీకి దక్కింది ఒక్కటే. మోడీ పాలనపై అసంతృప్తికి సూచిక.. అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్రమోడీ పాలనపై అసంతృప్తికి సూచన అని జేడీ (యు) నేత నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. బీజేపీ మతవాద ఎజెండాను నిలువరించడానికి లెఫ్ట్ పార్టీలను కూడా కలుపుకొనిపోయే దిశగా యోచిస్తున్నామని ఆయన తెలిపారు. కర్ణాటక ఫలితాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించడం ద్వారా నరేంద్ర మోడీ విజయం తాత్కాలికమని వెల్లడైందన్నారు. కాగా, ఈ ఫలితాలు మోడీ పాలనకు ప్రతీక అనడాన్ని బీజేపీ ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ ఖండించారు. -
నేడు ‘సార్వత్రిక’ తీర్పు
సాక్షి, ఒంగోలు : అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. శుక్రవారంతో రాజకీయ పార్టీల అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఈ నెల 7వ తేదీన జరిగిన అసెంబ్లీ , లోక్‌సభ ఎన్నికల ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నానికి తేటతెల్లం కానున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమై మధ్యాహ్నానికి తుది ఫలితాలు వెల్లడవుతాయి. జిల్లాలో ఒంగోలు, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు 12 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఒంగోలు నగరంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లోనే నిర్వహిస్తున్నారు. ఈ మేరకు లెక్కింపు కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లోక్‌సభ, అసెంబ్లీ ఓట్లలెక్కింపు ఒకేసారి జరిగేలా చర్యలు చేపట్టారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ్‌కుమార్ పర్యవేక్షణలో అధికార యంత్రాంగం కౌంటింగ్ ప్రక్రియకు సర్వసన్నద్ధమైంది. జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్‌తో పాటు లోక్‌సత్తా, బీఎస్పీ, జైసమైక్యాంధ్ర, సీపీఐ, సీపీఎం, స్వతంత్రులతో కలిపి మొత్తం 187 మంది బరిలో నిలిచారు. ఒంగోలు, బాపట్ల లోక్‌సభ స్థానాల్లో 29 మంది పోటీ చేశారు. పోలింగ్ రోజు జిల్లా వ్యాప్తంగా అన్నిచోట్లా ఓటర్ల చైతన్యం వెల్లివిరిసింది. 2009 సాధారణ ఎన్నికలతో పోల్చిచూస్తే ఈ ఎన్నికల్లో దాదాపు 7.5 శాతం ఓటింగ్ అదనంగా నమోదు కావడం విశేషం. కొద్ది గంటల్లో ఫలితాల వెల్లడికానుండటంతో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు, వారి మద్దతుదారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటూ భవిష్యత్‌పై లెక్కలేసుకుంటున్నారు. ఎవరికి వారు విజయం తమదేనంటూ పైకి గంభీరంగా కనిపిస్తున్నా ఫలితాలపై లోలోపల టెన్షన్ అనుభవిస్తున్నారు. రౌండ్లవారీగా ఫలితాలు... లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను జిల్లా కేంద్రంలోని మూడు ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్ గంటన్నర వ్యవధిలో పూర్తిచేసేలా కలెక్టర్ అధికారయంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు ఒక్కో సెగ్మెంట్‌కు కనిష్టంగా 16 రౌండ్లు, గరిష్టంగా 20 రౌండ్లలో జరగనుంది. ఒక్కో రౌండ్‌కు నాలుగున్నర నిమిషాల సమయం పట్టనుంది. కౌంటింగ్ హాలులో మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేసి ఒక్కో టేబుల్‌పై 20 ఈవీఎంలు ఉండేలా చర్యలు చేపట్టారు. ఆ మేరకు 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ 9.30 గంటలకల్లా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. అడుగడుగునా పోలీసులు ఒంగోలు నగరంలో శుక్రవారం సాయంత్రం వరకు పోలీసు యాక్ట్ 30, 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఎస్పీ పి. ప్రమోద్‌కుమార్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు, అభ్యర్థుల మద్దతుదారులు భారీగా ఒంగోలు తరలి వచ్చారు. అదే సమయంలో కొంత ఉద్రిక్తత పరిస్థితులు కూడా చోటచేసుకునే అవకాశాలుండటంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలో అడుగడుగునా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏజెంట్ పాస్‌లు ఉన్నవారు, నగర వాసులు మినహా ఒంగోలు నగరానికి ఎవరూ రాకూడదని, ఒకవేళ పనికోసం వచ్చిన వారు వెంటనే వెళ్లిపోవాలని పోలీసు అధికారులు హెచ్చరించారు. -
బల్దియా, పరిషత్ఫలితాలతో అయోమయం
కామారెడ్డి, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్స్‌గా భావించిన మున్సిపల్, పరిషత్ ఎన్నికల ఫలితాలు అయోమయాన్ని సృష్టించా యి. ముఖ్యంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు రెండు లోక్‌సభ స్థానాలకు గత నెల 30న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అంతకు ముందు, మార్చి 30న మున్సిపల్, ఏప్రిల్ 6, 11తేదీ ల్లో మండల, జిల్లా ప్రాదేశిక నియోజ కవర్గాల ఎన్నికలు జరిగాయి. వాటికి సంబంధించి ఓట్ల లెక్కింపు ఈ నెల 12,13 తేదీలలో పూర్తి కాగా, వాటి లో మిశ్రమ ఫలితాలు రావడం అభ్యర్థులను ఆలోచనలో పడవేసింది. సా ర్వత్రికానికి ముందు జరిగిన ఎన్నికలను సెమీస్‌గా భావించారు. కామారెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల ఫలితా లు ఒక రకంగా ఉండగా, ప్రాదేశిక నియోజకవర్గాల ఫలితాలు మరోరకంగా ఉన్నా యి. దీంతో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన వారిని వెన్నాడుతోంది. ఇదీ పరిస్థితి కామారెడ్డి నియోజకవర్గంలో జరిగిన మున్సిపల్, పరిషత్ ఫలితాలను పరిశీలిస్తే, కామారెడ్డి మున్సిపాలిటీలో 33 వార్డులకుగాను కాంగ్రెస్ 17 స్థానాలను గెలుచుకుం ది. ఇండిపెండెంట్‌గా గెలుపొందిన ఒకరు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఈ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరనుంది. టీఆర్ఎస్ కేవలం ఐదుగురు కౌన్సిలర్లను గెలు చుకుంది. ఓట్ల పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మొత్తం ఓట్లు 14,087 కాగా, టీఆర్ఎస్కు 11,345 ఓట్లు వచ్చాయి. సీట్ల పరంగా టీఆర్ఎస్ కన్నా 12 స్థానాలు ఎక్కువగా గెలుచుకున్న కాంగ్రెస్‌కు కేవలం 2,742 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. అలాగే మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికలలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. నియో జకవర్గంలో నాలుగు జడ్పీటీసీ స్థానాలుండగా, కాంగ్రెస్, టీఆర్ఎస్ చెరో రెండింటిని గెలుచుకున్నాయి. ఓట్ల పరంగా చూస్తే కాంగ్రెస్‌కు 48,560 ఓట్లు రాగా, టీఆర్ఎస్ కు 50,309 ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్కు కేవలం 1749 ఓట్ల ఆధిక్యత దక్కింది. ఎంపీటీసీ స్థానాల సంఖ్యను పరిశీలిస్తే నియోజకవర్గంలో 63 స్థానాలకుగాను కాంగ్రెస్ 33 గెలుచుకుంది. టీఆర్ఎస్కు 27 స్థానాలు మాత్రమే వచ్చాయి. మున్సిపల్, స్థానిక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ల మద్య నువ్వానేనా అన్నట్టుగా పో టీ కనిపించింది. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగింది. మరి సార్వత్రిక ఎన్నికలలో ఓటరు ఎలా తీర్పు ఇచ్చాడన్నది తేలాలంటే మరో రోజు వేచిచూడాల్సిందే. ఎన్నికలోల గెలిస్తేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, ఓడితే రాజకీయంగా దెబ్బతినాల్సిందేనన్న అభిప్రాయం వారిని వెన్నాడుతోంది. అంతటా ఇలాగే దాదాపు ఇదే పరిస్థితి అన్ని నియోజకవర్గాలలో నెలకొని ఉంది. నిజామాబాద్ నగరంలో అనూహ్యంగా ఎంఐఎం దూసుకువచ్చింది. ఇది అంచనాలను తారుమారు చేస్తుందేమోననే ఆలోచన ఆయా పార్టీల నేతలను వెంటాడుతోంది. బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాలలో అన్ని జడ్పీటీసీలను టీఆర్ఎస్ కైవసం చేసుకు ంది. మిగతా ప్రాంతాలలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఇదే నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. -
మార్కెట్ పంచాంగం
నిరోధశ్రేణి 20,867-20,907 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తాజా పెట్టుబడుల బదులు లాభాల స్వీకరణకే ఇన్వెస్టర్లు మొగ్గుచూపడంతో ముగిసినవారంలో స్టాక్ సూచీలు గరిష్టస్థాయి నుంచి 3 శాతం మేర పతనమయ్యాయి. దేశీ స్టాక్ మార్కెట్‌ను డ్రైవ్ చేస్తున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు డిసెంబర్ 9వరకూ పెట్టుబడుల జోరు కనపర్చినా అటుతర్వాత వెనుకడుగువేయడంతో గరిష్టస్థాయిలో సూచీలు స్థిరపడలేకపోయాయి. సూచీలు ఆల్‌టైమ్ గరిష్టస్థాయికి చేరిన తర్వాత సాంకేతికంగా జరిగే సర్దుబాటులో భాగంగానే గతవారం క్షీణత జరిగిందని ప్రస్తుతానికి పరిగణించాల్సివుంటుంది. ఇది సహజ సర్దుబాటు ప్రక్రియే అయితే ఈ వారం రిజర్వుబ్యాంక్, ఫెడ్ పాలసీ ప్రకటనల తర్వాత స్టాక్ సూచీలు నాటకీయంగా పెరిగే ఛాన్స్ వుంటుంది. రాబోయే డౌన్‌ట్రెండ్‌కు ఇటీవలి గరిష్టస్థాయివద్ద బీజం పడివుంటే రానున్నవారాల్లో పెద్ద పతనం సంభవించే ప్రమాదం కూడా వుంటుంది. ఈ వారం పాలసీ ప్రకటనల తర్వాత దిగువన ప్రస్తావించిన మద్దతు, నిరోధస్థాయిల వద్ద సూచీలు ప్రవర్తించేతీరును బట్టి మధ్యకాలిక ట్రెండ్‌పై స్పష్టమైన అంచనాలకు రావొచ్చు. సెన్సెక్స్‌పై సాంకేతిక అంచనాలు డిసెంబర్ 13తో ముగిసినవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ గతవారపు అంచనాలకు అనుగుణంగా 21,484 గరిష్టస్థాయికి చేరిన తర్వాత వేగంగా 700 పాయింట్ల మేర నష్టపోయి, 20,692 స్థాయికి పతనమయ్యింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 281 పాయింట్ల నష్టంతో 20,716 వద్ద ముగిసింది. ఈ వారం సెన్సెక్స్‌కు 20,867-20,907 శ్రేణి (ఇది డిసెంబర్ 13నాటి గ్యాప్డౌన్స్థాయి) వద్ద తక్షణ నిరోధం ఎదురుకావొచ్చు. ఆపైన స్థిరపడితే 21,050 స్థాయికి చేరవచ్చు. ఈ స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో ఛేదిస్తే కొద్దివారాల్లో మళ్లీ 21,500-21,600 శ్రేణిని అందుకోవొచ్చు. ఈ వారం మార్కెట్ క్షీణతతో మొదలైతే 20,670 సమీపంలో తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ లోపున వేగంగా 20,460 వద్దకు తగ్గవచ్చు. ఈ స్థాయిని ముగింపులో కోల్పోతే 20,325 స్థాయికి పతనం కావొచ్చు. ఈ స్థాయి దిగువన మరోదఫా 20,137 స్థాయిని పరీక్షించవచ్చు. నిఫ్టీ తక్షణ నిరోధం 6,232 డిసెంబర్13తో ముగిసినవారంలో గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన అంచనాలకు అనుగుణంగానే 6,415 గరిష్టస్థాయికి చేరి, అటుతర్వాత వేగంగా 6,160 స్థాయికి ఎన్ఎస్ఈ నిఫ్టీ క్షీణించింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 92 పారుుంట్ల నష్టంతో 6,168 వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీకి 6,232 వద్ద తక్షణ అవరోధం ఎదురవుతున్నది. డిసెంబర్ 5న గ్యాప్‌అప్ సందర్భంగా 6,209-6,232 మధ్య గ్యాప్ ఏర్పడగా, డిసెంబర్ 13న గ్యాప్‌డౌన్‌తో మార్కెట్ మొదలుకావడంతో సరిగ్గా అదేస్థాయిలో.....అంటే 6,208-6,230 మధ్య ట్రేడింగ్ గ్యాప్ ఏర్పడింది. రానున్నరోజుల్లో మార్కెట్లో తిరిగి అప్‌ట్రెండ్ మొదలుకావాలంటే ఈ గ్యాప్ అవరోధాన్ని నిఫ్టీ అధిగమించాల్సివుంటుంది. ఈ నిరోధంపైన ముగిస్తే వేగంగా 6,275 స్థాయికి చేరవచ్చు. ఆపైన స్థిరపడితే కొద్ది వారాల్లో తిరిగి 6,415 స్థాయికి చేరవచ్చు. ఈ సోమవారం మార్కెట్ బలహీనంగా మొదలైతే 6,150 సమీపంలో తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే వేగంగా 6,112 వద్దకు తగ్గవచ్చు. ఈ స్థాయి దిగువన ముగిస్తే క్రమేపీ 6,030 స్థాయికి తగ్గవచ్చు. ఈ దిగువన 5,972 స్థాయికి పతనం కావొచ్చు. బ్యాంక్ నిఫ్టీ కీలకం.... ఆర్బీఐ, ఫెడ్ నిర్ణయాలు వెలువడిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ కదలికలు మొత్తం మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయవచ్చు. బ్యాంకింగ్ షేర్లకు సెన్సెక్స్, నిఫ్టీల్లో 30-40% వెయిటేజీ వుండటం, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు ఈ షేర్లలో అధికశాతం పెట్టుబడులు వుండటం, భారత్, అమెరికా కేంద్ర బ్యాంకులు చేసే పాలసీ ప్రకటనలు వడ్డీ రేట్లను నిర్దేశించేవికావడం వంటి అంశాల కారణంగా బ్యాంక్ నిఫ్టీ కదలికలకు ఈ వారం ప్రాధాన్యత వుంది. ముగిసినవారంలో ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీల క్షీణత 1.5 శాతంలోపునకే పరిమితమైనా, బ్యాంక్ నిఫ్టీ మాత్రం 3 శాతం క్షీణించి 11,367 వద్ద ముగిసింది. గరిష్టస్థాయి నుంచి ఈ సూచీ 8 శాతం పడిపోయింది. బ్యాంక్ నిఫ్టీ తిరిగి అప్‌ట్రెండ్‌లో ప్రవేశించాలంటే ఈ బుధ, గురువారాల్లో బ్యాంక్ నిఫ్టీ వేగంగా 11,750 వద్దనున్న తొలి అవరోధాన్ని అధిగమించాల్సివుంటుంది. ఆపైన డిసెంబర్ 9నాటి 12,225 గరిష్టస్థాయిని వేగంగా అందుకోవొచ్చు. అటుపైన స్థిరపడితే 13,000 స్థాయికి కొద్దివారాల్లో పెరగవచ్చు. ఈ వారం 11,750 నిరోధాన్ని దాటలేకపోతే 10,650-10,800 మద్దతుశ్రేణికి తగ్గవచ్చు. ఈ లోపున 10,300 స్థాయికి నిలువునా పతనమయ్యే ప్రమాదం ఉంటుంది. -
రాజస్థాన్, మధ్య ప్రదేశ్‌లో వికసించిన కమలం