పదేళ్ల తర్వాత జరిగిన జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి దూసుకుపోతుంది. మ్యాజిక్ ఫిగర్‌కు కావాల్సిన మెజార్జీకి(45)మించి 49 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో కేంద్రపాలిత ప్రాంతంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు లాంఛనంగా మారింది.
ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో బీజేపీ 29 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. నౌషేరా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాష్ట్ర బీజేపీచీఫ్ రవీందర్ రైనా ఓటమి చెందారు. నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్ధి సురీందర్ చౌదరి చేతిలో 7, 819ఓట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఈసీ ప్రకారం.. చౌదరికి 35,069 ఓట్లు రాగా, రైనాకు 27,250 ఓట్లు వచ్చాయి.
కాగా జమ్ముకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. హంగ్ ప్రభుత్వమే ఏర్పాటు అవుతుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ వాటికి భిన్నంగా ఫలితాల్లో కాంగ్రెస్- ఎన్సీ కూటమి ఆధిక్యంలో దూసుకెళ్లింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు దక్కించుకుంది. దీంతో బుద్గామ్‌లో గెలుపొందిన ఒమర్ అబ్దుల్లానే సీఎంగా బాధ్యతలు చేపడతారని ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దులా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment