lose
-
జమ్ముకశ్మీర్ ఫలితాలు.. బీజేపీ చీఫ్ ఓటమి
పదేళ్ల తర్వాత జరిగిన జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి దూసుకుపోతుంది. మ్యాజిక్ ఫిగర్‌కు కావాల్సిన మెజార్జీకి(45)మించి 49 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో కేంద్రపాలిత ప్రాంతంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు లాంఛనంగా మారింది.ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో బీజేపీ 29 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. నౌషేరా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాష్ట్ర బీజేపీచీఫ్ రవీందర్ రైనా ఓటమి చెందారు. నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్ధి సురీందర్ చౌదరి చేతిలో 7, 819ఓట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఈసీ ప్రకారం.. చౌదరికి 35,069 ఓట్లు రాగా, రైనాకు 27,250 ఓట్లు వచ్చాయి.కాగా జమ్ముకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. హంగ్ ప్రభుత్వమే ఏర్పాటు అవుతుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ వాటికి భిన్నంగా ఫలితాల్లో కాంగ్రెస్- ఎన్సీ కూటమి ఆధిక్యంలో దూసుకెళ్లింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు దక్కించుకుంది. దీంతో బుద్గామ్‌లో గెలుపొందిన ఒమర్ అబ్దుల్లానే సీఎంగా బాధ్యతలు చేపడతారని ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దులా పేర్కొన్నారు. -
సన్నబడ్డ సంపన్నులు! రూ. 11 లక్షల కోట్ల సంపద ఆవిరి!!
ప్రపంచంలో సంపన్నుల సంపద కరిగిపోయింది. ఒక్క జెఫ్ బెజోస్ నెట్‌వర్త్ శుక్రవారం 15.2 బిలియన్ డాలర్లు (రూ. 1.2 లక్షల కోట్లు) తగ్గిపోయింది. దీంతో ప్రపంచంలోని 500 మంది సంపన్నుల సంపద 134 బిలియన్ డాలర్లు (రూ. 11 లక్షల కోట్లు) క్షీణించింది.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అమెజాన్ షేర్లు మార్కెట్లో విస్తృత అమ్మకాల మధ్య 8.8% పడిపోయాయి. బెజోస్ నెట్‌వర్త్ 191.5 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఒక్క రోజులో భారీగా సంపద క్షీణించడం జెజోస్కి ఇది మూడోసారి. 2019లో విడాకుల పరిష్కారం తర్వాత 36 బిలియన్ డాలర్లు, 2022లో అమెజాన్ షేర్లు 14% పడిపోయాయి.నాస్డాక్ 100 ఇండెక్స్ 2.4% పడిపోయింది. ఇలాన్ మస్క్, ఒరాకిల్ కార్పొరేషన్ లారీ ఎల్లిసన్‌తో సహా ఇతర టెక్ బిలియనీర్ల సంపదలు వరుసగా 6.6 బిలియన్ డాలర్లు, 4.4 బిలియన్ డాలర్లు తగ్గాయి. ఫెడరల్ రిజర్వ్ రేట్ కోతలపై అనిశ్చితి, అలాగే కొన్ని అధిక-ప్రొఫైల్ ఆదాయాల్లో నిరాశలు, టెక్-హెవీ ఇండెక్స్‌ను దిద్దుబాటులోకి నెట్టేశాయి. కేవలం మూడు వారాల్లోనే 2 ట్రిలియన్ డాలర్ల విలువను తుడిచిపెట్టేసింది. -
బిలీయనీర్లకు బ్యాడ్ ఫ్రైడే
స్టాక్ మార్కెట్ ఎప్పుడెలా ఉంటుందో ఊహించలేము. కొన్ని సార్లు భారీ లాభాలను తెచ్చిపెడితే, మరికొన్ని సార్లు చావుదెబ్బ కొడుతుంది. ఇదంతా సంపన్నులకు సర్వసాధారణమే.. అయినప్పటికీ తాజాగా అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ఒక్కరోజులోనే (శుక్రవారం) 15.2 బిలియన్ డాలర్లు నష్టపోయారు.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అమెజాన్.కామ్ ఇంక్ షేర్లు భారీగా పతనమవ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 500 మంది ధనవంతులు సంపద 134 బిలియన్ డాలర్లు తగ్గింది. ఇందులో గరిష్టంగా జెఫ్ బెజోస్ 15.2 బిలియన్ డాలర్లు నష్టపోగా.. ఈయన నికర విలువ 191.5 బిలియన్లకు పడిపోయింది.నాస్డాక్ 100 ఇండెక్స్ 2.4 శాతం పడిపోవడంతో.. టెస్లా బాస్ మస్క్, ఒరాకిల్ కార్పొరేషన్ లారీ ఎల్లిసన్ ఇద్దరూ నష్టాలను చవి చూసారు. దీంతో వీరి సంపద 6.6 బిలియన్ డాలర్లు, 4.4 బిలియన్ డాలర్లు తగ్గింది. దీంతో దిగ్గజ పారిశ్రామిక వేత్తలు మాత్రమే కాకుండా.. చాలామంది పెట్టుబడిదారులు గందరగోళానికి గురయ్యారు.వ్యక్తిగత సంపద పరంగా మస్క్ తర్వాత స్థానంలో నిలిచిన బెజోస్ ఏడాది పొడవునా అమెజాన్ షేర్లను స్థిరంగా విక్రయించారు. ఒక్క ఫిబ్రవరిలో తొమ్మిది ట్రేడింగ్ రోజులలో సుమారు 8.5 బిలియన్ల విలువైన స్టాక్‌ను విక్రయించారు. గత నెలలో ఒక రోజు అమెజాన్ షేర్లు రికార్డు స్థాయికి చేరాయి. దీంతో బెజోస్ 5 బిలియన్స్ విలువైన 25 మిలియన్ అదనపు షేర్లను విక్రయించే ప్రణాళికను వెల్లడించారు. కానీ ఇటీవల భారీగా నష్టపోయారు. -
పార్ట్‌టైమ్ జాబ్ నిలువునా ముంచేసింది.. ఇది ఓ టెకీ కథ.. తస్మాత్ జాగ్రత్త!
ఆన్లైన్, సైబర్ మోసాలు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. సామాన్యులే కాకుండా బాగా చదువుకున్నవారు, టెక్నాలజీపై అవగాహన ఉండి ఐటీ రంగంలో పనిచేస్తున్న వారు కూడా ఈ ఆన్లైన్ ఫ్రాడ్లకు బలవుతున్నారు. ఆన్లైన్లో పార్ట్‌టైమ్ జాబ్‌తో నిలువునా మోసపోయిన ఓ టెకీ ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. గత ఏడాది ఫిబ్రవరి 11 నుంచి వివిధ ఆన్లైన్ టాస్క్‌లపేరుతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సహా ఎనిమిది మందిని ఏకంగా రూ. 1.04 కోట్లకు మోసగించిన ఉదంతానికి సంబంధించి పుణే, పింప్రీ చించ్వాడ్లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు గురువారం ఎనిమిది ఎఫ్ఐఆర్లను నమోదు చేశాయి. రూ. 30.20 లక్షలు నష్టపోయిన టెకీ ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మహారాష్ట్రలోని వాకాడ్ ప్రాంతానికి చెందిన 39 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ గత జనవరి 24 నుంచి 27 తేదీల మధ్య రూ.30.20 లక్షలు నష్టపోయారు. ఇటీవల జాబ్ పోవడంతో నిరుద్యోగిగా మారారు. దీంతో ఆన్లైన్ టాస్క్‌లు పూర్తి చేసే పార్ట్‌టైమ్‌లో చేరారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్ గురించి జనవరి 24న తన మొబైల్ ఫోన్‌కు సందేశం వచ్చింది. దీనికి స్పందించిన ఆయనకు ఫోన్లో మెసెంజర్ యాప్‌ను డౌన్లోడ్ చేయాలని చెప్పారు. ఆపై ఆయన్ను ఓ గ్రూప్‌లో చేర్చారు. ఆ తర్వాత వివిధ రకాల వస్తువులు, కంపెనీలకు రేటింగ్ ఇచ్చే టాస్క్‌లు అప్పగించారు. ఈ టాస్క్‌లు పూర్తి చేశాక రూ.40 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి ముందుగా కొద్దికొద్దిగా టెకీ నుంచి డబ్బు తీసుకున్నారు. ఇలా జనవరి 24 నుంచి 12 విడతల్లో రూ.30.20 లక్షలు మోసగాళ్లు చెప్పిన బ్యాంక్ అకౌంట్లకు బాధితుడు ట్రాన్స్ఫర్ చేశాడు. కంపెనీకి లాస్ వచ్చిందని మళ్లీ కొంత డబ్బు పంపించాలని చెప్పడంతో అనుమానం వచ్చిన అతను తాను అప్పటిదాకా ట్రాన్స్ఫర్ డబ్బును తిరిగిచ్చేయాలని డిమాండ్ చేశాడు. దీంతో మోసగాళ్లు అతని స్పందించడం మానేశారు. మేనేజర్ రూ.72.05 లక్షలు ఇదే విధంగా థెర్‌గావ్‌కు చెందిన 24 ఏళ్ల గ్రాడ్యుయేట్ యువతి కూడా రూ.2.39 లక్షలు నష్టపోయింది. ఈమే కాకుండా మరో ఆరుగురు కూడా ఆన్లైన్ టాస్క్‌లతో మోసపోయారు. వీరిలో ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్న మహిళ కూడా ఉన్నారు. ఆమె ఏకంగా రూ.72.05 లక్షలు నష్టపోవడం గమనార్హం. -
బల్దియా టు అసెంబ్లీ
చెరుపల్లి వెంకటేశ్: కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఎదిగిన వారెందరో ఉన్నారు. హైదరాబాద్ బల్దియా నుంచే ఇలా ఎదిగిన వారూ చాలామంది ఉన్నారు. కార్పొరేటర్లుగా పోటీ చేసి గెలిచినా, ఓడి నా పట్టు వదలకుండా కృషి చేసి పైమెట్టు ఎక్కారు. ఎక్కువ పర్యాయాలు ఎమ్మెల్యేలుగా గెలవడంతోపాటు మంత్రులైన తలసాని శ్రీనివాస్ యాదవ్, టి.పద్మారావుగౌడ్, సి.కృష్ణయాదవ్, ముఖేశ్‌గౌడ్ తదితరులు నగరపాలకసంస్థ కార్పొరేటర్లుగా పోటీచేసిన వారే. ఎంసీహెచ్ నుంచే మొదలు తొలిసారిగా చాలామంది ఎంసీహెచ్(మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్) 1986 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లో మోండా డివిజన్ నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీచేసిన తలసాని, పద్మారావు చేతిలో ఓడిపోయారు. అనంతరం తలసాని 5 పర్యాయాలు ఎమ్మెల్యే గా గెలిచి టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పలుశాఖలు నిర్వహించారు. ఇక 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పద్మారావు బీఆర్ఎస్ ప్రభు త్వంలో మంత్రిగానూ, డిప్యూ టీ స్పీకర్‌గా నూ పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కృష్ణయాదవ్ టీడీపీ హయాంలో మంత్రిగానూ, ప్ర భుత్వ విప్‌గానూ పనిచేశారు. మూడుసార్లు ఎమ్మె ల్యే అయిన ముఖేశ్‌గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తొలుత టీడీపీ కార్పొరేటర్‌గా ఉన్న రాజాసింగ్ బీజేపీ నుంచి రెండు పర్యాయాలు ఎమ్యెల్యేగా ఎన్నికై మూడోసారి పోటీ చేస్తున్నారు. ఓటమి నుంచి గెలుపు.. దోమలగూడ, జవహర్‌నగర్ నుంచి కార్పొరేటర్లుగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ జి.సాయన్న, డా.కె.లక్ష్మణ్ తర్వాతి కాలంలో ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో సాయన్న ఐదు పర్యాయాలు, లక్ష్మణ్ రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. లక్ష్మణ్ ప్రస్తు తం రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. సాయన్న మరణానంతరం ప్రస్తుతం ఆయన కుమార్తె లాస్య నందిత తండ్రి ప్రాతినిధ్యం వహించిన కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. మూసారాంబాగ్ కార్పొరేటర్‌గా ఓడిపోయిన తీగల కృష్ణారెడ్డి 2002లో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్‌గా గెలిచారు. ఆ తర్వాత మహేశ్వరం నియోజకవర్గం నుంచి 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సీన్ రివర్స్ ►మోండా డివిజన్‌కు పోటీ చేసిన పద్మారావు చేతిలో శ్రీనివాస్‌యాదవ్ కార్పొరేటర్‌గా ఒకసారి, సికింద్రాబాద్ నుంచి శాసనసభ ఎన్నికల్లో ఒకసారి ఓడిపోగా, శ్రీనివాస్‌యాదవ్ చేతిలో ఎమ్మెల్యే ఎన్నికల్లో పద్మారావు ఒకసారి ఓడిపోయారు. ►జవహర్‌నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గోపాల్ చేతిలో ఓటమిపాలైన లక్ష్మణ్, ముషీరాబాద్‌లో 2014లో గోపాల్‌పై ఎమ్మెల్యేగా గెలిచారు. తిరిగి 2018లో గోపాల్ గెలవగా లక్ష్మణ్ ఓడారు. పార్టీ అధ్యక్షులుగానూ కార్పొరేటర్లుగా పోటీ చేయడం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలైన శ్రీనివాస్‌యాదవ్, కృష్ణయాదవ్ , సాయన్న, ముఠా గోపాల్ హైదరాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షులుగానూ పనిచేశారు. పద్మారావు టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షుడిగా పనిచేశారు. లక్ష్మణ్ బీజేపీ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. ఎంపీలుగానూ.. ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఒవైసీ సైతం కార్పొరేటర్ నుంచి ఎంపీ స్థాయికి ఎదిగారు. బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా చేసిన రేణుకాచౌదరి ఎంపీగా, కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఇలా బల్దియా నుంచి రాజకీయప్రస్థానం ప్రారంభించి తదనంతరం గెలిచినవారు, ఓడిన వారు ఇంకా ఎందరో ఉన్నారు. పలువురు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లుగానూ పనిచేశారు. కృష్ణారెడ్డి, సు«దీర్‌రెడ్డి హుడా చైర్మన్లుగానూ వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో... పోటీలో సిట్టింగ్ కార్పొరేటర్లు ప్రస్తుతం బల్దియా సిట్టింగ్ కార్పొరేటర్లలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన జగదీశ్వర్‌గౌడ్ శేరిలింగంపల్లి నుంచి , విజయారెడ్డి ఖైరతాబాద్ నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు. తోకల శ్రీనివాసరెడ్డి(బీజేపీ) రాజేంద్రనగర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. శాస్త్రిపురం కార్పొరేటర్‌గా ఉన్న మహ్మద్ మోబిన్ బహదూర్‌పురా నుంచి ఎంఐఎం అభ్యర్థిగా బరిలో ఉన్నారు. షేక్‌పేట కార్పొరేటర్ రాషెద్ ఫరాజుద్దీన్ జూబ్లీహిల్స్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీలు సైతం.. మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్‌రెడ్డి ఉప్పల్ నుంచి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు. ఎంఐఎం మాజీ కార్పొరేటర్ బి.రవియాదవ్ రాజేంద్రనగర్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ మేయర్లు, డిప్యూటీ మేయర్ కూడా జీహెచ్ఎంసీ మేయర్లుగా పనిచేసిన జులి్ఫకర్ అలీ, మాజిద్‌హుస్సేన్ ఎంఐఎం అభ్యర్థులుగా చారి్మనార్, నాంపల్లి నియోజకవర్గాల నుంచి ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. డిప్యూటీ మేయర్‌గా పనిచేసిన జాఫర్ హుస్సేన్ ఇప్పటికే రెండు పర్యాయాలు నాంపల్లి ఎమ్మెల్యేగా చేసి మూడోసారి యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. వీరిలో జుల్ఫికర్‌అలీ, మాజిద్ హుస్సేన్‌లు మేయర్ల పదవీకాలం ముగిశాక సైతం తిరిగి కార్పొరేటర్లుగానూ పనిచేశారు. మాజిద్ ప్రస్తుతం సిట్టింగ్ కార్పొరేటర్‌గా కూడా ఉన్నారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్ సనత్‌నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. సుదీర్‌రెడ్డి ఎల్బీనగర్ నుంచి రెండుపర్యాయాలు గెలిచి మళ్లీ బరిలో ఉన్నారు. ముఠాగోపాల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి, తిరిగి పోటీ చేస్తున్నారు. పద్మారావు సికింద్రాబాద్‌లో మూడుసార్లు గెలిచారు. మళ్లీ బరిలో నిలిచారు. హిమాయత్‌నగర్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణయాదవ్ రూపాంతరం చెందిన అంబర్‌పేట నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా బరి లో ఉన్నారు. -
నకిలీ విత్తు.. నమ్మితే చిత్తు.. విత్తనాల కొనుగోలుకు ముందు ఇలా చేయండి..
దుబ్బాక(సిద్ధిపేట జిల్లా): తొలకరి చినుకులు పలుకరించాయి. అన్నదాతలు వానాకాలం సాగుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆరుగాలం శ్రమకు ఫలితం దక్కాలంటే ఆది నుంచి వేసే పంట విషయంలో అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి. దుక్కి దున్నింది మొదలుకొని పంట చేతికొచ్చే వరకు జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్ అంటున్నారు. ముఖ్యంగా విత్తనాలు, ఎరువుల కొనుగోలులో జాగ్రత్తలు పాటించడం అవసరం. చదవండి: సికింద్రాబాద్ అల్లర్లు: ‘సాక్షి’ చేతిలో రిమాండ్ రిపోర్ట్.. కీలక అంశాలు వెలుగులోకి.. కొందరు డీలర్లు నకిలీ విత్తనాలను విక్రయిస్తూ ఏటా అన్నదాతలను నట్టేట ముంచుతున్నారు. వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. విత్తనాల ఎంపిక నుంచి పంట దిగుబడి వరకు శాస్త్రీయ సాగు పద్ధతులను అవలంభించడంతో పాటు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో ముందుకు సాగాలంటున్నారు. జిల్లాలో అధికారులు నకిలీ విత్తన విక్రయాలపై నిఘా పెంచారు. ప్రభుత్వం సైతం నకిలీ విత్తలనాలను విక్రయిస్తున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించింది. అయినా రైతుల అమాయకత్వాన్ని కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు. విత్తనాల కొనుగోలుకు ముందు.. ♦వ్యవసాయ శాఖ లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయాలి. ♦విత్తన ప్యాకెట్లు, బస్తాలపై పేరు, గడువు తేదీ వివరాలు తప్పకుండా గమనించాలి. ♦సరిగా సీల్ చేసి ఉన్న బస్తాలు, ధ్రువీకరణ పత్రం ఉన్న విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి. రశీదు తీసుకోవాలి ♦రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత రశీదు తప్పకుండా తీసుకోవాలి. రశీదుపై విత్తన రకం, గడువు తేదీ, డీలర్ సంతకం తీసుకోవాలి. రైతు సంతకం కూడా ఉండేలా చూసుకోవాలి. ♦విత్తనాలను కొనుగోలు చేసేముందు వ్యవసాయ శాఖ అధికారి, శాస్త్ర వేత్తల సూచనలు తీసుకోవడం మంచిది. ♦రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ధ్రువీకరించిన విత్తనాలు విక్రయిస్తాయి. వీటిని కొనుగోలు చేసే సమయంలో బస్తా పై నీలి వర్ణం ట్యాగ్ ఉందో లేదో గమనించాలి. ♦లేబుల్ విత్తనాలు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. జిల్లాలో ఈ రకం విత్తనాలు అధికంగా కొనుగోలు చేస్తున్నారు. వీటి కొనుగోలు చేసే ముందు విత్తన సంచిపై ఆకుపచ్చ ♦ట్యాగ్ కట్టి ఉంటుంది. దీనిపై విత్తన ప్రమాణాలు ముద్రించి విక్రయిస్తారు. ఈ విత్త్తనాలను రైతులు కేవలం ఆయా కంపెనీల నమ్మకంపై మాత్రమే కొనుగోలు చేయాలి. పూర్తి వివరాలు తీసుకుని డీలర్ల నుంచి సరైన బిల్లు తీసుకోవాలి ♦బ్రిడిల్ విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు విత్తన సంచికి పసుపు రంగు ట్యాగ్ ఉందో లేదో గమనించాలి ♦ఎలాంటి విత్తనాలు కొనుగోలు చేసిన పంట సాగు వరకు రశీదులను రైతులు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. ఎరువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పంటల అధిక దిగుబడికి ఎరువులు ఎంతో మేలు చేస్తాయి. కానీ కొందరు దళారుల, వ్యాపారుల నాసి రకం ఎరువులు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. ఫలితంగా అమాయక రైతులు నష్టపోతున్నారు. ఈ మేరకు కొన్ని మెలకువలు పాటిస్తే నకిలీలను నివారించే అవకాశం ఉంది. ♦లైసెన్స్ ఉన్న దుకాణాల్లో మాత్రమే ఎరువులను కొనుగోలు చేయాలి. ♦కొనుగోలు చేసిన ఎరువులకు సరైన బిల్లును తీసుకోవాలి. వాటిని జాగ్రత్తగా దాచుకోవాలి. ♦డీలర్ బుక్‌లో రైతులు తప్పకుండా సంతకం చేయాలి. కఠిన చర్యలు తీసుకుంటాం జిల్లాలో ఎవరైన నకిలీ విత్తనాలను విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారి లైసెన్స్ రద్దు చేస్తాం. ఎక్కడైన నకిలీ విత్తనాలను విక్రయిస్తే రైతులు వెంటనే దగ్గరలో వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసిన రైతుల వివరాలు గోప్యంగా ఉంచుతాం. – శివప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి -
మళ్లీ కనిష్టాల దిశగా రూపాయి
ముంబై: ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా నాల్గవరోజు మంగళవారం కనిష్టాల దిశగా పయనించింది. 21పైసలు నష్టంతో 76.50 వద్ద ముగిసింది. భౌగోళిక ఉద్రిక్తతలు, దేశం నుంచి విదేశీ నిధుల ప్రవాహం, ఈక్విటీ మార్కెట్ల బలహీనత, అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ (రెండేళ్ల గరిష్ట స్థాయిలో 101.02కు అప్) బలోపేత ధోరణి వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం. ట్రేడింగ్‌లో 76.34 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 76.25 గరిష్ట– 76.53 కనిష్ట స్థాయిల్లో కదలాడింది. చదవండి: ప్రపంచంలోనే మరే దేశానికి సాధ్యపడకుండా..జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న భారత్..! -
కాంగ్రెస్ ఘోర పరాజయం.. సోషల్ మీడియాలో రాహుల్, సిద్ధూపై సెటైర్లు
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. పంజాబ్‌లో ఉన్న ప్రభుత్వాన్ని సైతం పోగొట్టుకుంది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాల ప్రచారం కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం చేకూర్చలేకపోయిందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. కాంగ్రెస్‌పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ అని, అన్నా, చెల్లెళ్ల బ్రాండ్ విలువ కూడా తగ్గిపోయిందని విమర్శకులంటున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రియాంకాగాంధీ యూపీ ఎన్నికల్లో ఎవరూ చేయనంత ప్రచారం చేశారు. మొత్తం 209 ర్యాలీలు, రోడ్ షోలలో ప్రసంగించారు. యూపీ మీదే ఆమె ఎక్కువగా కేంద్రీకరించినా, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్‌ల్లోనూ తిరిగారు. మహిళా సమస్యలవంటి ప్రధాన అంశాలపై ఫోకస్ చేసినా, తన సభలకు పెద్ద ఎత్తున ప్రజలను రప్పించగలిగినా, వారిని ఓటు బ్యాంకుగా మలుచుకోలేకపోయారు. ఇక రాహుల్‌గాంధీ సైతం ఐదు రాష్ట్రాల్లో పలు ర్యాలీల్లో పాల్గొన్నారు. అయినా ఆయన మ్యాజిక్కేమీ పనిచేయలేదు. రాహుల్, ప్రియాంకాగాంధీలు పార్టీలోనూ విశ్వసనీయత కోల్పోతున్నారని, వైఫల్యానికి బాధ్యులను చేస్తూ తొందరల్లోనే సొంత పార్టీ నేతలే వారి మీద కత్తులు దూయడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. పంజాబ్‌లో దళితుడిని ముఖ్యమంత్రిని చేశామని చూపించే ప్రయత్నం చేశారు కానీ అది బెడిసికొట్టింది. ప్రియాంకా గాంధీ కష్టపడ్డారనడంలో సందేహం లేదు. క్షేత్రస్థాయిలో ఆమె బాగా పనిచేశారు. ప్రధానమైన మహిళల సమస్యలను లేవనెత్తారు. అయినా రాజకీయాల్లో మ్యాజిక్కులంటూ ఉండవు, కొన్నిసార్లు ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్‌కు అలాంటి టైమ్ నడుస్తోంది. రాజీకీయాలు ఒక్కరాడే ఆట కాదు, ఇది టీమ్గేమని గాంధీ కుటుంబం ఇప్పటికైనా తెలుసుకోవాలని, బలమైన నేతలను ఒక్కతాటి మీదకు తీసుకురావడంలో పార్టీ విఫలమైందని ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఓటమిపాలైన ప్రతిసారీ పార్టీలో అసమ్మతిరాగాలు పెరుగుతాయి. అలా గొంతెత్తిన వారిని తగ్గించే ప్రయత్నమూ జరుగుతుంది. అదే సమస్యకు అసలు కారణం. రాష్ట్రాల్లో స్థానిక నాయకులకు ప్రోత్సాహం పెరగాలి. జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, సచిన్ పైలట్వంటి నేతలను కొత్తనాయకత్వంగా చూపించే ప్రయత్నం చేయాలి. కానీ కాంగ్రెస్ అందులో విఫలమైంది. గతంలో కాంగ్రెస్‌కు రాష్ట్రాల్లో నమ్మినబంట్ల వంటి రాజకీయ నాయకులున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరు నేతలే దేశం మొత్తాన్ని సమీకరించాలనుకున్నారు. ఇక్కడే అన్నాచెల్లెళ్లు విఫలమయ్యారంటున్నారు విశ్లేషకులు. మీమ్స్ అండ్ జోక్స్.. ఐదు రాష్ట్రాల్లో ఓటమితో కాంగ్రెస్‌పై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వైరలవుతున్నాయి. రాహుల్‌గాంధీ, నవజ్యోజోత్సింగ్సిద్ధూలపై జోకులు పేలుతున్నాయి. ‘కాంగ్రెస్‌కు మరో ఆప్షన్ లేదు. గాంధీ ఫ్యామిలీని వదిలేసి.. కొత్త నాయకత్వంతో ముందుకు రావాలి. లేదంటే పార్టీపనైపోయినట్టేనని ఈ ఎన్నికల ఫలితాలు సందేశమిస్తున్నాయి’ అని ఫిల్మ్ మేకర్ మనీష్ ముంద్రా ట్వీట్ చేశారు. ఇక రాహుల్‌గాంధీ విదేశాలకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందంటూ పలువురు ట్వీట్స్ చేశారు. ‘రాహుల్ గాంధీ బ్రేక్ తీసుకోవడానికి ఇది సరైన సమయం. ఇప్పుడు అంతర్జాతీయ విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి’ అంటూ ఒకరు ట్వీట్ చేశారు. ఇక కాలమిస్ట్, రచయిత ఆనంద్ రంగనాథన్ అయితే ఏకంగా ఫ్లైట్ అనౌన్స్‌మెంట్‌ను అనుకరిస్తూ ట్విట్టర్ వేదికగా విమర్శించాడు. పంజాబ్‌లో పార్టీ ఓటమికి కారణమయ్యారంటూ మాజీ క్రికెటర్ సిద్ధూపైనా నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. పంజాబ్ ఎగ్జిట్‌పోల్స్ చూడగానే సిద్ధూకి కపిల్ శర్మ ఫోన్ కాల్ వస్తుందని, తనకూ పోటీ వస్తున్నందున అర్చనా పురాణ్ శర్మ జాగ్రత్తగా ఉండాలంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. -
వారం రోజుల్లో సుమారు రెండున్నర లక్షల కోట్లు ఖతమ్..!
గత కొద్దిరోజులుగా దేశీయ స్టాక్‌మార్కెట్స్ కొత్త రికార్డులను నమోదుచేసిన విషయం తెలిసిందే. రంకెలేస్తు వచ్చిన బుల్‌ను బేర్ ఒక దెబ్బతో పడగొట్టింది. పలు కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, అంతర్జాతీయ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకలు, ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించే విషయంలో అమ్మకాల జోరు ఊపందుకోవడంతో స్టాక్‌మార్కెట్లు కొద్దిరోజుల నుంచి కుప్పకూలుతూ వచ్చాయి. అక్టోబర్ 29 రోజున దేశీయ సూచీలు ఒక్కసారిగా పడిపోవడంతో ఇన్వెస్టర్ల రూ. 4.82 లక్షల కోట్ల సంపద ఆవిరి అయ్యింది. బేర్ కొట్టిన దెబ్బకు రిలయన్స్, హెడీఎఫ్సీ లాంటి టాప్ 10 అత్యంత విలువైన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పడిపోయాయి. అత్యంత విలువైన కంపెనీలలో తొమ్మిది కంపెనీలు గత వారం మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 2,48,542.3 కోట్లను కోల్పోయాయి. బలహీనమైన విస్తృత మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా సంస్థలు తమ మార్కెట్ విలువను కోల్పోవడం జరిగింది. టాప్-10 మార్కెట్ క్యాప్ కంపెనీల జాబితాలో కేవలం ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రమే లాభపడింది. చదవండి: నవంబర్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్..! ఇవే..! ►రిలయన్స్ మార్కెట్ క్యాప్ సుమారు రూ.56,741.2 కోట్లు తగ్గి రూ.16,09,686.75 కోట్లకు చేరుకుంది. ►హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 54,843.3 కోట్లు క్షీణించి రూ.8,76,528.42 కోట్ల వద్ద స్థిరపడింది. ►టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) విలువ రూ.37,452.9 కోట్లు తగ్గి రూ.12,57,233.58 కోట్లకు చేరుకుంది. ►ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ విలువ రూ.27,678.78 కోట్లు తగ్గి రూ.7,01,731.59 కోట్ల వద్ద స్థిరపడింది. ►కోటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్ క్యాప్ విలువ రూ.27,545.09 కోట్లు తగ్గడంతో రూ.4,03,013 కోట్లకు చేరింది. ►బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 18,774.8 కోట్లు తగ్గింది. దీంతో ఎమ్-క్యాప్ విలువ 4,46,801.66 కోట్లకు చేరుకుంది. ►హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్) రూ. 14,356 కోట్లు తగ్గి రూ. 5,62,480.40 కోట్ల వద్ద స్థిరపడింది. ►హెచ్‌డిఎఫ్‌సి వాల్యుయేషన్ రూ.10,659.37 కోట్లు తగ్గి రూ.5,14,217.69 కోట్లకు చేరుకోగా.. ప్రభుత్వ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంత మేర నష్టాలను చవిచూసింది. గతవారంలో సుమారు రూ.490.86 కోట్లు తగ్గి రూ.4,48,372.48 కోట్లకు చేరింది. ►టాప్-10 మార్కెట్ క్యాప్ కల్గిన కంపెనీలో కేవలం ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రమే రూ. 30,010.44 కోట్లను జోడించి రూ. 5,56,507.71 కోట్లకు తీసుకుంది. చదవండి: గూగుల్‌పే మాదిరిగా...వాట్సాప్‌లో రూ. 255 వరకు క్యాష్‌బ్యాక్..! -
నష్టాల్లో ముగిసిన సూచీలు..!
దేశీయ సూచీలు బుధవారం మళ్లీ నష్టాలను చవిచూశాయి. స్టాక్‌మార్కెట్ ప్రారంభంలో సూచీల జోరు కనిపించినా...ట్రేడింగ్ ముగిసే సమయంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో దేశీ సూచీలు నష్టాలను చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఈ రోజు ఉదయం 60,997 పాయింట్లతో ప్రారంభమవ్వగా ఒకానొక సమయంలో సూచీలు 400 కు పాయింట్లతో 61, 570 వద్దకు చేరుకుంది. మధ్యాహ్నం 2.15 ప్రాంతంలో ఇన్వెస్టర్లు అమ్మకాలపై మొగ్గు చూపడంతో చివరికి 206.93 పాయింట్ల నష్టంతో 61143.33 వద్ద ముగిసింది. నిఫ్టీ 57.40 పాయింట్లు నష్టపోయి 18,210.95 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్-30 సూచీలో ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎస్బీఐ, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్, మారుతీ, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, టెక్ మహీంద్రా లాభాలను గడించాయి. యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌యూఎల్, టాటా స్టీల్, రిలయన్స్, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎంఅండ్ఎం, బజాజ్ ఆటో షేర్లు నష్టాలను పొందాయి. చదవండి: జియోఫోన్ నెక్ట్స్ లాంచ్...! సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు..! -
ప్రపంచ బిలియనీర్లకు శనిలా దాపురించిన చైనా కొత్త సంక్షోభం..!
చైనాకు చెందిన అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్ ఎవర్‌గ్రాండే దివాలా తీసేందుకు సిద్ధంగా ఉంది. ఎవర్‌గ్రాండే గ్లోబల్ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఇది ఒకటి. 2008 అమెరికాలో సుమారు 600 బిలియన్ డాలర్లకు దివాలా తీసిన సంస్థ లేమన్ బ్రదర్స్ మాదిరిగానే ఎవర్ గ్రాండే దివాలా తీసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. లేమన్ బ్రదర్స్ తరహాలో ఎవర్‌గ్రాండే కూడా ప్రపంచంలో రెండో అతిపెద్ద సంక్షోభంగా నిలిచే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: బ్యాంకులకు భారీ షాక్ ? అప్పులు చెల్లించలేని స్థితికి చేరిన మరో సంస్థ ! శనిలా దాపురించిన ఎవర్‌గ్రాండే..! తాజాగా ఎవర్‌గ్రాండే సంక్షోభం ప్రపంచంలోని బిలియనీర్లకు శనిలాగా పట్టుకుంది. ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులైన ఎలోన్ మస్క్, జెఫ్ బెజోస్, బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్, వారెన్ బఫెట్ తదితర బిలియనీర్లు ఏకంగా సుమారు 26 బిలియన్ల డాలర్ల(సుమారు రూ.1,92,082 కోట్ల రూపాయలు)పైగా నష్టపోయారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్ నికర విలువ 7.2 బిలియన్ డాలర్లు తగ్గి 198 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సుమారు 5.6 బిలియన్ డాలర్లను కోల్పోగా, జెఫ్ బెజోస్ నికర విలువ 194 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచ బిలియనీర్ల జాబితాలోని మొదటి ఐదు స్థానాల్లోని మరో ముగ్గురు వ్యక్తులు లూయిస్ విట్టన్ ఎస్ఈ గ్రూప్ హెడ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ రెండు బిలియన్ డాలర్లు నష్టపోయి 157 బిలియన్ డాలర్ల వద్ద, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 1.94 బిలియన్ డాలర్లు నష్టపోయి 149 బిలియన్ డాలర్ల వద్ద, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ 3.27 బిలియన్ డాలరు నష్టపోయి.. 132 బిలియన్ వద్ద నిలిచారు. వారితో పాటుగా లారీపేజ్-సెర్జే బ్రిన్, స్టీవ్ బామర్, లారీ ఎల్లిసన్, వారన్ బఫెట్ వరుసగా..1.9 , 1.8, 1.9 , బిలియన్ డాలర్లు, 764 మిలియన్ డాలర్లు, 701 మిలియన్ డాలర్లు నష్టపోయారు. వడ్డీలను చెల్లించలేం..ఇన్వెస్టర్లకు పంగనామాలు..! బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో 359 వ స్థానంలో నిలిచిన ఎవర్‌గ్రాండే వ్యవస్థాపకుడు, ఛైర్మన్ హుయ్ కా యాన్ కంపెనీ షేర్లు 11 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోవడంతో అతని నికర ఆస్తులు విలువ ర్యాంకింగ్‌లో తగ్గుదల కనిపించింది. ఎవర్‌గ్రాండే షేర్లు చివరిగా 2010 మేలో ఈ స్థాయిలో ట్రేడ్ అయ్యాయి. ఎవర్‌గ్రాండే చైనాలో రియల్ఎస్టేట్ రంగంలో అతి పెద్ద దిగ్గజం. సంస్థ జారీ చేసిన బాండ్లపై సెప్టెంబర్ 23నాటికి కట్టాల్సిన 80 మిలియన్ డాలర్ల వడ్డీని చెల్లించలేనని ఎవర్‌గ్రాండే ప్రకటించడంతో ఒక్కసారిగా ఇన్వెస్టర్లు షాక్‌కు గురయ్యారు. -
కోవిడ్ సెకండ్ వేవ్.. కుదేలవుతున్న క్యాబ్‌లు!
సాక్షి, సిటీబ్యూరో: ఏడాదికి పైగా ప్రజారోగ్యంపై పడగ నీడలా మారిన మహమ్మారి కోవిడ్ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. గతేడాది విజృంభించిన వైరస్ బారినుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న వ్యవస్థలు తిరిగి కుదేలవుతున్నాయి. చాపకింద నీరులా విస్తరిస్తున్న కోవిడ్ రెండో దశ ఉద్ధృతి అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. గత సంవత్సరం కోవిడ్ కారణంగా కుదేలైన ప్రజారవాణా వ్యవస్థలు తిరిగి కోలుకుంటున్న తరుణంలో ముంచుకొచ్చిన రెండో దశ మరోసారి పిడుగుపాటుగా మారింది, ప్రత్యేకించి క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు, మినీబస్సులు, ఆటోలు తదితర వాహనాలపై ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సుమారు 80 వేలకుపైగా క్యాబ్‌లు ఉబెర్, ఓలా తదితర క్యాబ్దిగ్గజ సంస్థలకు అనుసంధానమై తిరుగుతుండగా, గత నెల రోజులుగా 50 వేలకు పడిపోయినట్లు అంచనా. ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టడం, రాత్రింబవళ్లు పడిగాపులు కాసినా కనీస ఆదాయం లభించకపోవడంతో చాలా మంది డ్రైవర్లు, వాహన యజమానులు క్యాబ్‌లను వదిలేస్తున్నారు. గత 10 రోజులుగా క్యాబ్‌ల వినియోగం గణనీయంగా తగ్గినట్లు తెలంగాణ క్యాబ్స్, ట్యాక్సీ డ్రైవర్స్ జేఏసీ చైర్మన్ షేక్ సలావుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్‌కు ముందు వేలాది మందికి ఉపాధినిచ్చిన క్యాబ్‌లు ఇప్పుడు భారంగా మారినట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్‌కు తగ్గిన బుకింగ్‌లు.. ►పెళ్లిళ్లు, వేడుకలు, సామూహిక ఉత్సవాలు వంటి వివిధ కార్యక్రమాల కోసం హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే ట్రావెల్స్ వాహనాల బుకింగ్‌లు కూడా తగ్గుముఖం పట్టాయి. 8 సీట్లు, 10 సీట్లతో నడిచే మ్యాక్సీ క్యాబ్‌లు, 14 నుంచి 22 సీట్ల వరకు ఉండే మినీ బస్సులకు డిమాండ్ తగ్గినట్లు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు పేర్కొన్నారు. ►మే నెల వరకూ పెళ్లిళ్ల ముహూర్తాలు లేకపోవడంతో వాహనాలకు డిమాండ్ కనిపించడం లేదు. ముఖ్యంగా పర్యాటక రంగం చాలా వరకు దెబ్బతిన్నది. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే సందర్శకుల తగ్గిపోయింది. కోవిడ్‌కు ముందు ప్రతిరోజూ సుమారు 50 వేలమందికి పైగా వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు నగర సందర్శన కోసం వచ్చేవారు. ఏడాదికిపైగా అంంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చే వారి సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతుండగా కోవిడ్ రెండో దశ ఉప్పెనలా వచ్చిపడింది. దీంతో బుకింగ్‌లపై ప్రభావం పడినట్లు ట్రావెల్స్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెరుచుకోని ఐటీ రంగం.. ►గతేడాది ఐటీ సంస్థలు లాక్డౌన్ విధించాయి. సాఫ్ట్వేర్ నిపుణులు చాలా వరకు ఇంటి నుంచే పని చేస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీకి, ఐటీ ప్రాంతాలకు రోజుకు 10,వేలకుపైగా క్యాబ్‌లు రాకపోకలు సాగించేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. క్యాబ్‌లు చాలా వరకు సాధారణ రాకపోకలపై మాత్రమే ఆధారపడి తిరుగుతున్నాయి. కానీ ప్రస్తుత రెండో దశ దృష్ట్యా అత్యవసర పరిస్థితిల్లో మాత్రమే నగర వాసులు క్యాబ్‌లు వినియోగిస్తున్నారు. ► ఇదే సమయంలో వ్యక్తిగత వాహనాల వినియోగం పెరిగింది. కోవిడ్ దృష్ట్యా గతేడాది నుంచి ఎక్కువ మంది వ్యక్తిగత వాహనాలపైనే ఆధారపడ్డారు. గత నవంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి రెండో వారం వరకు ప్రజారవాణా వాహనాలకు డిమాండ్ కనిపించింది. కానీ ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. -
కొన్ని విషయాలను తేలిగ్గా తీసుకోం: కోహ్లీ
అహ్మదాబాద్: ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా, నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ గెలిచిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లి మాట్లాడుతూ.. ‘పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయాము. అనుకున్న షాట్లను సరిగ్గా ఆడలేకపోయాం’ అని అన్నాడు. రాబోయే మ్యాచ్‌ల్లో పక్కా ప్లాన్‌తో తిరిగివస్తామని తెలిపాడు. బ్యాటింగ్‌లో పేలవ ప్రదర్శన కారణంగా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందన్నాడు. దీంతో ఇంగ్లాండ్ విజయం సులువైందని చెప్పాడు. శ్రేయస్ అయ్యర్ ఒక్కడే మంచి ప్రదర్శన చేసినా మిగతా బ్యాట్స్మన్లు పూర్తిగా విఫలమయ్యారని కోహ్లి తెలిపాడు.ఆటలో గెలుపు, ఓటములు సహజమేనని తర్వాతి మ్యాచ్‌కు సరైన ప్రణాళికతో తిరిగివస్తామని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందు కేవలం ఐదు టీ20 మ్యాచ్‌లే ఉండగా, ఈ సమయంలో ప్రయోగాలు చేసిన, కొన్ని విషయాలను మాత్రం తేలిగ్గా తీసుకోలేమని వివరించాడు. టీమిండియా నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు కోల్పోయి చేధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. (చదవండి: కోహ్లి కథ ముగిసినట్టేనా..!) -
రూ.7లక్షల కోట్లు ఎగిరి పోయాయి
సాక్షి,ముంబై: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, కోవిడ్-19 ఆందోళనలు, రష్యా, సౌదీ అరేబియా ప్రైస్‌వార్ కారణంగా భారీ ఎగిసిన చమురు ధరలతో దేశీయ స్టాక్మార్కెట్లో ప్రకంపనలు రేపింది. చమురు ధరల చారిత్రక పతనం దలాల్ స్ట్రీట్‌ను వణింకించింది. ఇన్వెస్టర్ల ఆందోళనభారీ అమ్మకాలకు తెరతీసింది. దీంతో వరుస నష్టాలతో కుదేలైన దలాల్ స్ట్రీట్ మరింత కనిష్టానికి కుప్పకూలింది. కీలక సూచీలు సెన్సెక్స్,నిఫ్టీ అతి భారీ ఇంట్రాడే నష్టాలను నమోదు చేసింది. నిఫ్టీలోని 50 షేర్లలోదాదాపు అన్ని నష్టాలనే మూట గట్టుకున్నాయి. సెన్సెక్స్‌లో సుమారు 800పైగా షేర్లు 52 వారాల కనిష్టానికి చేరాయంటేనే పతనం ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. బ్యాంకింగ్, ఆటో, మిడ్ క్యాప్, ప్రైవేటు రంగ ఆయిల్ షేర్ల భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. రూ .7 లక్షల కోట్ల విలువైన పెట్టుబడిదారుల సంపద తుడిచిపెట్టుకుపోయింది. కాగా సెన్సెక్స్ ఇంట్రాడేలో ఏకంగా 2450 పాయింట్లు కుప్పకూలింది. బ్యాంకింగ్, ఆటో సహా అన్ని రంగాలు అమ్మకాలతో కుదేలయ్యాయి. ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర బీఎస్ఈలో 13.65 శాతం పతనమైంది. అలాగే రూ. 10లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌లోరూ.2.7లక్షల కోట్లు ఆవిరైపోయాయి. అటు డాలరుతో రూపాయి మారకం విలువ కూడా పతనం బాటలోనే పయనించింది. 16 పైసలు దిగజారి ఈ రోజు (మార్చి 9, 2020) ట్రేడింగ్ రూ.74.03 వద్ద కనిష్టానికి పతనమైంది. అనంతరం 74.18 స్థాయిని తాకి చివరకు 74.08 వద్ద ముగిసింది. 2018 అక్టోబరులో 74.48 వద్ద అల్ టైం కనిష్టానికి పడిపోయింది. శుక్రవారం రూపాయి 73.78 వద్ద క్లోజ్ అయిన సంగతి తెలిసిందే. చదవండి : కోవిడ్‌కు ‘చమురు’ ఆజ్యం, మార్కెట్ కుదేలు రిలయన్స్‌కు చమురు షాక్ -
ఫేస్బుక్ షేర్ల భారీ పతనం
శాన్ఫ్రాన్సిస్కో: ఫేస్బుక్ షేర్లు తన చరిత్రలోనే అత్యంత భారీ పతనాన్ని గురువారం చవిచూశాయి. షేరు ధర 20 శాతం మేర పడిపోగా, కంపెనీ మార్కెట్ విలువ ఒక్క రోజులోనే 120 బిలియన్ డాలర్లకు పైగా ఆవిరైపోయింది. న్యూయార్క్‌లో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.41 గంటలకు షేరు 179.92 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. విక్రయాలు, యూజర్ల వృద్ధి జూన్ క్వార్టర్(రెండో త్రైమాసికం)లో విశ్లేషకుల అంచనాల కంటే తక్కువగా ఉండటంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. దీంతో షేర్లను విక్రయించడానికి పోటీ పడ్డారు. ఫలితం... షేరు ధర భారీగా పడిపోయింది. గురువారం ట్రేడింగ్ మొదలయ్యేటప్పటికి కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 619 బిలియన్ డాలర్లుండగా... కాసేపటికే 120 బిలియన్ డాలర్లను కోల్పోయింది. 120 బిలియన్ డాలర్లంటే మన కరెన్సీలో దాదాపు రూ.8 లక్షల కోట్లు. భారత్‌లో నంబర్–1 లిస్టెడ్ కంపెనీగా ఉన్న టీసీఎస్ మార్కెట్ విలువకన్నా ఇది ఎక్కువ. 2018 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన రెండు త్రైమాసికాల్లోనూ ఆదాయ వృద్ధి తగ్గొచ్చని ఫేస్బుక్ సీఎఫ్‌వో డేవిడ్ వెహ్నెర్ ప్రకటించడం కూడా ప్రభావం చూపించింది. గతంలోనూ 2015లో మొదటి త్రైమాసికం (జనవరి–మార్చి) ఫలితాలు అంచనాలను తప్పాయి. యూజర్ల డేటా లీకవ్వడం, ప్రకటనదారులకు అనుగుణంగా విధానాలను మార్చడం వంటి చర్యలతో ఫేస్బుక్ ఇటీవలి కాలంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. యాక్టివ్ యూజర్లు 147 కోట్లు ఫేస్‌బుక్‌కు జూన్ నెలలో 147 కోట్ల మంది రోజువారీ యాక్టివ్ యూజర్లుగా ఉన్నారు. కానీ, బ్లూంబర్గ్ పోల్‌లో విశ్లేషకులు మాత్రం 148 కోట్ల మేర ఉండొచ్చనే అంచనాలు వ్యక్తం చేశారు. అతిపెద్ద మార్కెట్లయిన అమెరికా, కెనడాలో ఏ మాత్రం పెరుగుదల లేకుండా 185 మిలియన్ల యూజర్లు యథాతథంగా ఉండగా... యూరోప్‌లో ఒక శాతం తగ్గి 179 మిలియన్లకు చేరారు. అయితే, గతేడాది ఇదే కాలంతో పోలిస్తే మాత్రం ఫేస్‌బుక్‌ను సగటున రోజువారీగా వినియోగించే వారి సంఖ్యలో 11 శాతం పెరుగుదల ఉంది. విశ్లేషకులు 13.3 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అంచనా వేయగా, వాస్తవంగా 13.2 బిలియన్ డాలర్ల మేర నమోదైంది. జూన్ చివరికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 30,275 మంది. ఫలితాలకు ముందు రోజు బుధవారం ఫేస్బుక్ షేరు జీవితకాల రికార్డు స్థాయి 217.50 డాలర్ల వద్ద ముగిసింది. ఈ ధర ప్రకారం కంపెనీ మార్కెట్ విలువ 619 బిలియన్ డాలర్లు. ఈ ఏడాదిలో ఈ షేరు ఇప్పటి వరకు 23 శాతం పెరిగింది. -
జియో యూజర్లు సగం తగ్గిపోనున్నారట!
ముంబై: ఉచిత ఆఫర్లతో టెలికాం మార్కెట్లోకి దూసుకొచ్చిన రిలయన్స్ జియోకి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ తరువాత జియో ఖాతాదారుల సంఖ్య సగానికి పడిపోనుందట. ముఖ్యంగా హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ మార్చి31తో ముగియ నుండటంతో జియో యూజర్లు వేరే నెట్‌వర్క్‌కు మారిపోయే అవకాశం ఉందని నివేదికలు వెలువడుతున్నాయి. దాదాపు ఆరునెలలపాటు ఉచిత డ్యాటా, వాయిస్ సేవలను అనుభవించిన జియో ఖాతాదారులు ఏప్రిల్ నుంచి కొత్త తారిఫ్‌లు అమలుకానున్న నేపథ్యంలో జియో లో ఉండాలా వద్దా లేదా ఆలోచిస్తారని తెలుస్తోంది. అలాగే డ్యాటా క్వాలిటీ, స్పీడ్ పై వేచి సూచే ధోరణిని అవలంబించనున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాను రిలయన్స్ ప్రైమ్ మెంబర్ గా చేరినా.. జియో సేవల నాణ్యతపై వేచి చూస్తానని కోలకతాకుచెందిన ప్రభుత్వ రంగ బ్యాంక్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ షావోన్ దాస గుప్తా (69) చెప్పారు. ఈయన వాయిస్ కాల్స్‌కోసం వోడాఫోన్ ను వినియగిస్తే.. డాటా సర్ఫింగ్ కోసం జియోను వాడతారట. కోలకతా లో ఒక PSU ఒక అతను జియో ప్రధాని చేరాల్సి కానీ దాని సేవలు ఏదైనా లోపం కోసం లుకౌట్ న ఉంటుంది అన్నారు. దాస్‌గుప్తా వోడాఫోన్ నుండి తన కాల్స్ చేస్తుంది మరియు డేటా సర్ఫింగ్ కోసం తన జియో సిమ్ ఉపయోగిస్తారట. మార్కెట్లో పోటీదారులతో పోలిస్తే జియో ధరలు బావుంటే కొనసాగుతానని, లేదంటే వోడాఫోన్‌కు మళ్లీ తరలిపోనున్నట్టు చెప్పారు. కాగా వెల్ కం ఆఫర్ తో సంచలనంగా దూసుకొచ్చిన జియో హ్యాఫీ న్యూ ఇయర్ ఆఫర్ ను ప్రవేశపెట్టింది. ఇది మార్చి 31తో ముగియనుండడంతో ప్రైమ్ మెంబర్ షిప్ స్కీం, కొత్త టారిఫ్ లను ప్రకటించింది. ప్రైమ్ మెంబర్లుగా మారాలంటే ముందు రూ.99 చెల్లించాలి. ఈ ఫీజు ఏడాది వరకే చెల్లుబాటు అవుతుంది. రిలయన్స్ అధినేత ముకేష అంబానీ ప్రకటించిన దాని ప్రకారం ఇలా మెంబర్లుగా మారిన తర్వాత ఫ్రీ ఆఫర్లు వాడుకోవాలంటే మాత్రం నెలకి మరో 303 రూపాయలు చెల్లించాల్సిన సంగతి తెలిసిందే. -
టీడీపీకి ఓటమి భయం
⇒ అందుకే మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేస్తోంది ⇒ కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కోడుమూరు: తెలుగుదేశం పార్టీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే కర్నూలు కార్పొరేషన్ ఎన్నికలను వాయిదా వేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. శనివారం లద్దగిరిలోని తన స్వగృహంలో వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతూ.. పరిస్థితులన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయని, కాంగ్రెస్ నాయకులంతా పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జి చెరుకుపాటి నారాయణ వెంట వెళ్తున్నారని తెలియజేయడంతో కోట్ల కొంత అసహనానికి లోనయ్యాడు. రెండు గుర్రాల స్వారీ పద్ధతి కాదని, తన వెంట నడిచే వాళ్లే తనతో ఉండాలని, లేదంటే ఎవరి దారి వాళ్లు చూసుకోవాలని తెగేసి చెప్పారు. టీడీపీ నేతల దౌర్జన్యాలకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. రెండున్నర సంవత్సరాలు టీడీపీ ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంతో ప్రజలు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. కరువు ఏర్పడినా మూడేళ్లుగా నష్టపరిహారమివ్వలేదని, రైతులకు గిట్టుబాటు ధరలు రావడంలేదని.. ఈ సమస్యలన్నింటిపై పోరాడేందుకు జిల్లా అంతటా పర్యటిస్తానని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి కూర్చున్నా.. కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గెలవలేదన్నారు. కార్యకర్తల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు లక్కసారం లక్ష్మీరెడ్డి, వెల్దుర్తి జెడ్పీటీసీ సభ్యులు సమీర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు సంజన్నగౌడ్, అమకతాడు వీరభద్రుడు తదితరులు పాల్గొన్నారు. -
గ్లోబల్ ర్యాంకింగ్‌లో ఐఐటీలు ఢమాల్
న్యూఢిల్లీ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు(ఐఐటీలు) గ్లోబల్ ర్యాంకింగ్‌లో ఢమాల్ మనిపించాయి. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ మంగళవారం విడుదలచేసిన 2016-17 ర్యాంకింగ్స్‌లో ఐఐటీలు తమ స్థానాలను కోల్పోయాయి. ఈ ర్యాంకింగ్‌లో వరుసగా ఐదో ఏడాది కూడా అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) ప్రపంచంలో బెస్ట్‌గా నిలిచింది. ఈ ర్యాంకింగ్‌లో ఇండియాలో అత్యున్నత సంస్థగా మళ్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సు బెంగళూరే చోటు దక్కించుకుంది. కానీ టాప్ 150 స్థానం నుంచి మాత్రం ఈ ఇన్స్టిట్యూట్ పడిపోయిందని క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో వెల్లడైంది. అయితే ఐఐటీ మద్రాసు మాత్రం టాప్ 250 స్థానాన్ని చేధించి, ఐదు స్థానాలు పైకి ఎగబాకినట్టు ర్యాంకింగ్ల్లో తెలిసింది. 10 ఇండియన్ యూనివర్సిటీలో తొమ్మిది 700 ర్యాంకింగ్‌లో నిలిచాయి. అయితే గతేడాది కంటే ఈ యూనివర్సిటీలు తమ ఈ ర్యాంక్‌లను కోల్పోయాయి. అకాడమిక్, ఎంప్లాయర్ రిప్యూటేషన్ రెండింటి ర్యాంకింగ్‌లోనూ ఈ ఇన్స్టిట్యూట్లు పేలవమైన ప్రదర్శన కనబర్చినట్టు ర్యాంకింగ్ రిపోర్టు వెల్లడించింది. వరల్డ్ టాప్ 100 రీసెర్చ్ ఇంపాక్ట్ ర్యాంకింగ్‌లో కూడా భారత్ నుంచి కేవలం నాలుగు ఇన్స్టిట్యూట్లు మాత్రమే చోటు దక్కించుకున్నట్టు రీసెర్చ్ రిపోర్టు తెలిపింది. భారత్ బెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్గా ఐఐఎస్సీ 11వ స్థానాన్ని ఆక్రమించుకుంది. ర్యాంకింగ్‌లో పడిపోవడానికి చాలా కారణాలు ప్రభావితం చేశాయని క్యూఎస్ ఇంటిలిజెంట్ యూనిట్ రీసెర్చ్ హెడ్ బెన్ సౌటర్ తెలిపారు. పీహెచ్డీ క్వాలిఫైడ్ రీసెర్చర్లు తక్కువగా ఉండట, ఇతర దేశాలనుంచి పీహెచ్డీ క్వాలిఫైడ్ రీసెర్చర్లను ఇండియా నియమించుకోవడం ర్యాంకింగ్‌లను ప్రభావితం చేస్తున్నాయన్నారు. ప్రాంతీయ పోటీదారులను ఇండియా పెంచుకుని ఫర్ఫార్మెన్స్ను ఇండియా మెరుగుపరుచుకోవాలని ఈ ర్యాంకింగ్‌లు సూచిస్తున్నట్టు సౌటర్ తెలిపారు. 2004 నుంచి యూఎస్ ఇన్స్టిట్యూషన్సే ఈ ర్యాకింగ్‌లో టాప్ 3 స్థానాలను ఆక్రమించుకుంటూ వస్తున్నాయి. -
అన్నింటా నిరాశే...
చేతులెత్తేసిన సానియా-బోపన్న జంట కాంస్య పతక పోరులో పరాజయం రియో డి జనీరో: తమ అనుభవాన్నంతా రంగరించి పోరాడినా మిక్స్డ్ డబుల్స్ టెన్నిస్‌లో సానియా మీర్జా-రోహన్ బోపన్న (భారత్) జంటకు నిరాశ తప్పలేదు. ఆదివారం జరిగిన కాంస్య పతక పోరులో నాలుగో సీడ్ సానియా-బోపన్న ద్వయం 1-6, 5-7తో లూసీ హర్డెకా-రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్లో భారత జంట తడబడింది. ఒత్తిడిలో ఆడుతున్నట్లు కనిపించిన సానియా-బోపన్న సులువుగా రావాల్సిన పాయింట్లను కూడా సాధించలేకపోయారు. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయిన సానియా-బోపన్నలు తొలి సెట్‌ను 27 నిమిషాల్లో చేజార్చుకున్నారు. రెండో సెట్లో భారత జంట కాస్త తేరుకున్నట్లు కనిపించింది. 3-1తో ఆధిక్యంలో ఉన్న దశలో తమ సర్వీస్‌ను కోల్పోయిన సానియా జంట ఆ తర్వాత 11వ గేమ్‌లోనూ సర్వీస్‌ను చేజార్చుకుంది. 12వ గేమ్‌లో చెక్ రిపబ్లిక్ ద్వయం తమ సర్వీస్‌ను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకోవడంతోపాటు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. మ్యాచ్ మొత్తంలో సానియా-బోపన్న జోడి ఆరు డబుల్ ఫాల్ట్‌లతోపాటు 13 అనవసర తప్పిదాలు చేసింది. శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన సెమీఫైనల్లో సానియా-బోపన్న జోడి 6-2, 2-6, 3-10తో ‘సూపర్ టైబ్రేక్’లో వీనస్ విలియమ్స్-రాజీవ్ రామ్ (అమెరికా) జంట చేతిలో ఓడిపోయింది. రిక్త హస్తాలతో షూటర్లు గత మూడు ఒలింపిక్స్‌లలో పతకాలు అందించిన షూటింగ్ క్రీడాంశంలో ఈసారి భారత షూటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. ఏకంగా 12 మంది పాల్గొన్నా... ఒక్కరు కూడా పతకాన్ని సాధించలేకపోయారు. ఆదివారం జరిగిన చివరిదైన ఈవెంట్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో చెయిన్ సింగ్, గగన్ నారంగ్ ఫైనల్‌కు చేరడంలో విఫలమయ్యారు. క్వాలిఫయింగ్‌లో చెయిన్ సింగ్ 1169 పాయింట్లతో 23వ స్థానంలో... గగన్ నారంగ్ 1162 పాయింట్లతో 33వ స్థానంలో నిలిచారు. -
పోచంపల్లిలో భారీగా నష్టం
భూదాన్‌పోచంపల్లి : మండలంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షానికి పలు చోట్ల ఆస్తినష్టం వాటిల్లింది. రేవనపల్లి చెరువు అలుగుకు గండి పడడంతో చెరువులో ఉన్న సుమారు రూ.15 లక్షల విలువైన చేపలు కొట్టుకుపోయాయి. గౌస్‌కొండ గ్రామంలో చాంద్పాషకు చెందిన పెంకుటిల్లు ధ్వంసమైంది. ఇల్లు కూలి పక్కనే ఉన్న డబ్బా కొట్టుపై పడడంతో అది పాక్షికంగా ధ్వంసమైంది. ఈ ఘటనలో రూ. 30వేల ఆస్తినష్టం వాటిల్లిందని బాధితుడు పేర్కొన్నాడు. నీటి మునిగిన వరి పొలాలు... పోచంపల్లి, రేవనపల్లి చెరువులు ఉధృతంగా అలుగు పోస్తుండడంతో వాటి కింద ఉన్న సుమారు 100 ఎకరాలకు పైగా వరి పొలాలు నీటి మునిగాయి. సీతావానిగూడెంలో సద్దుపల్లి అంజిరెడ్డితో పాటు సమీప రైతులకు చెందిన సుమారు 10 ఎకరాలు, భీమనపల్లిలో బానోతు హనుమ అనే కౌలు రైతుకు చెందిన 3 ఎకరాలు, ముక్తాపూర్ గ్రామంలోని మూసీ కాల్వ పరివాహకంలో మరో 20 ఎకరాలు వరి నీట మునిగింది. అలాగే పోచంపల్లి చెరువు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రేవనపల్లి, శివారెడ్డిగూడెం, ఇంద్రియాల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ కాల్వ నుంచి వరద నీరు వస్తుండడంతో మండలంలోని చెరువులన్నీ నిండి కళకళలాడుతున్నాయి. దోతిగూడెం ప్రాథమిక పాఠశాల ఆవరణలో పెద్ద ఎత్తున వర్షం నీరు నిలువడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. మండలంలో 69.2 వర్షపాతం నమోదైనట్లు ఏఎస్ఓ నర్సిరెడ్డి తెలిపారు. అధికారుల సందర్శన... ఇరిగేషన్ డీఈ రవీందర్, ఏఈ శాలిని, తహసీల్దార్ డి.కొమురయ్య, ఆర్ఐ నిర్మల, వీఆర్వో చెక్క నర్సింహ, సర్పంచ్ గోదాసు శశిరేఖజంగయ్య, సింగిల్‌విండో చైర్మన్ మర్రి నర్సింహారెడ్డి, గోదాస్ యాదగిరి బుధవారం గండిపడిన రేవనపల్లి చెరువు అలుగు గండిని పరిశీలించారు. వరద ఉధృతి తగ్గిన వెంటనే ఇసుక బస్తాలతో తాత్కాలికంగా గండి పూడ్చివేస్తామని డీఈ రవీందర్ తెలిపారు. మూడో విడత మిషన్ కాకతీయలో కట్ట, అలుగు, తూము మరమ్మతులు చేపట్టుతామన్నారు. -
ఓ ప్రిన్సిపాల్.. ఇద్దరు అమ్మాయిలు..ఓ ఫైట్
లండన్: ఇద్దరు విద్యార్థినుల మధ్య గొడవను సర్దుమణిగేలా చేసేందుకు వెళ్లిన ఓ అసిస్టెంట్ ప్రిన్సిపాల్ సమస్యల్లో ఇరుక్కున్నాడు. మరో అమ్మాయితో గొడవ పడుతున్న పదిహేనేళ్ల విద్యార్థిని విడిపించేందుకు ఆ విద్యార్థిని గొంతుదగ్గరపట్టుకొని లాగడంతో ఆ బాలిక అపస్మారక స్థితిలోకి పోయింది. ఇది కాస్త వీడియో రూపంలో బయటకు రావడంతో పెద్ద రచ్చగా మారి పోలీసుల వరకు వెళ్లింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. లండన్ లోని కింగ్ స్ట్రీ సీనియర్ హై స్కూల్లో మాక్ బర్గెస్ అనే అసిస్టెంట్ ప్రిన్సిపాల్ ఉన్నాడు. గత సోమవారం ఇద్దరు విద్యార్థినులు బాగా గొడవపడుతుంటే ఇతర విద్యార్థినులు గట్టిగా కేకలు వేయడం మొదలు పెట్టారు. అనంతరం తమ చేతుల్లోని సెల్ ఫోన్లు బయటకు తీసి రికార్డు చేయడం మొదలు పెట్టారు. కానీ, వారిని విడిపించేందుకు ఏ ఒక్కరూ వెళ్లలేదు. దీంతో స్కూల్ యాజమాన్యంలో ఒకరైన మాక్ బర్గెస్ ఆ గొడవపడుతున్నవారి వద్దకు వెళ్లి తొలుత ఆపే ప్రయత్నం చేశాడు. మందలించి చూశాడు. అయినా, వారు ఆయన మాట వినకుండా కొట్టుకుంటుండటంతో అందులో పదిహేనేళ్ల విద్యార్థినిని మెడదగ్గరపట్టుకొని గట్టిగా వెనక్కి లాగాడు. అలా కొన్ని అడుగుల దూరం వెనక్కిలాగుతూ వెళ్లాడు. దీంతో ఆ అమ్మాయి అపస్మారక స్థితిలోకి పోయింది. ఈ వీడియో వెలుగుచూడంతో ఆ బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించగా.. వారు కేసు నమోదు చేశారు. అయితే, తొలుత ఆయనను అరెస్టు చేయాలని చెప్పిన కోర్టు అనంతరం కేవలం నోటీసులు మాత్రం జారీ చేస్తే సరిపోతుందని, వివరణ కోరాలని తెలిపింది. కానీ, ఆ బాలిక తల్లి మాత్రం ఆయనకు శిక్ష పడాలని అంటోంది. గత ఐదురోజులుగా తన కూతురు సస్పెండ్ అయ్యి ఇంట్లోనే ఉంటుందని, ఆ ప్రిన్సిపాల్ తన కూతురును ఈడ్చేసిన విధానం చూస్తుంటే ఓ తల్లిగా ఎంతో బాధకలుగుతుందని, కనీసం మెడ కూడా తిప్పలేకుండా ఉండి మెడిసిన్ వాడుతుందని చెప్పింది. -
నెయ్యితో బరువు తగ్గొచ్చు..!
నెయ్యి, నూనెలు, పాల ఉత్పత్తులతో కొవ్వు పెరిగిపోతుందని భయపడతాం. శరీర బరువు తగ్గించుకోవాలన్నపుడు భోజనంలో నెయ్యి వాడకం మానేస్తాం. అలాగే నెయ్యితో తయారు చేసే స్వీట్లు, వంటకాలకు దూరంగా ఉంటాం. అయితే నెయ్యి తినడం వల్ల బరువు తగ్గుతారంటే నమ్ముతారా? అవును ఇది నజంగానే అధిక క్యాలరీలు కలిగిన పదార్థమే అయినా... నెయ్యితో ఎన్నో ప్రయోజనాలు కూడ ఉన్నాయని డైటీషియన్లు చెప్తున్నారు. భారత సంప్రదాయ వంటకాల్లోనూ, భోజనంలోనూ విరివిగా వాడే నెయ్యి వల్ల బరువు తగ్గుతారని, దీనికి తోడు అనేక ప్రయోజనాలు కూడ ఉన్నాయని చెప్తున్నారు. నెయ్యిని రోజువారీ ఆహరంలో వినియోగించి ఆరోగ్యాన్ని పొందవచ్చని డైటీషియన్లు సూచిస్తున్నారు. కొబ్బరి, నువ్వుల నూనె వంటి ఆరోగ్యకరమైన కొవ్వును మాత్రమే నెయ్యి కూడ కలిగి ఉంటుందంటున్నారు. కొద్దిపాటి ఆమ్లాలు కలిగిన కొవ్వు మాత్రమే కలిగి ఉండే నెయ్యిని... కాలేయం స్వయంగా కరిగించుకొని.. శరీరానికి మంచి శక్తినిస్తుందని చెప్తున్నారు. ఒమేగా-3 ని కలిగి ఉన్న నెయ్యి తినడంవల్ల క్యాన్సర్, గుండెజబ్బులు, మధుమేహం వంటి ప్రమాదాలకు దూరం కావొచ్చని, నెయ్యిలో ఉండే 'కంజుగేటెడ్ లినోలైక్' ఫ్యాటీ ఆమ్లం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని డైటీషియన్లు వివరిస్తున్నారు. నెయ్యిలో కొలెస్ట్రాల్ శాతం తక్కువగా ఉండటం, అలాగే ఒమేగా-3 ఉండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని రక్షించేందుకు సహకరిస్తుంది. అంతేకాక నెయ్యి మాయిశ్చురైజర్ గా కూడ ఉపయోగ పడుతుంది. పొడిచర్మంతో బాధపడేవారికి, పెదాలు పగిలిపోయే సమస్య ఉన్నవారికి నెయ్యి సహకరించి మృదుత్వాన్ని చేకూరుస్తుంది. అలాగే వాపులు, కాలిన గాయాలకు మందుగా కూడ నెయ్యి ఉపకరిస్తుంది. ముఖ్యంగా మనం తినే ఆహారం సులభంగా జీర్ణమయ్యేందుకు నెయ్యిలో ఉండే బటిరిక్ ఆమ్లాలు ఎంతగానో ఉపయోగ పడతాయి. కడుపులో ఉండే గ్యాస్ ను బయటకు పంపించి, జీర్ణశక్తిని పెంచి శరీరం ఆరోగ్యంగా ఉండేట్టు చేస్తుంది. నెయ్యిలో ఉండే గ్యాస్ట్రిక్ యాసిడ్ శరీరంలోని శక్తిహీనతను తగ్గించి కీళ్ళ మధ్యన ఉండే జారుడు పదార్థాన్ని రక్షిస్తూ శరీరం ఫ్లెక్సిబుల్ గా ఉండేందుకు సహకరిస్తుంది. ఎ, డి, ఇ, కె, విటమిన్లను కూడ కలిగి ఉండే నెయ్యి... ప్రతిరోజూ భోజనంలో ఒక్క టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇతర నూనె పదార్థాలను వేపుళ్ళకు వినియోగించడం కన్నా నెయ్యిని వినియోగించడం ఎంతో శ్రేయస్కరమంటున్నారు. సౌందర్య సాధనంగా కూడ నెయ్యిని వినియోగించవచ్చని, భారత మహిళలు పొడి చర్మానికి మాయిశ్చురైజర్ గా నెయ్యిని వినియోగిస్తారని, తల్లోని చర్మానికి పట్టిస్తే జుట్టు పెరుగుదలను కూడ మెరుగుపరుస్తుందని నమ్ముతారని వైద్య నిపుణులు చెప్తున్నారు. -
ప్రపంచ కుబేరులు తీవ్రంగా నష్టపోయారు!
ప్రపంచ కుబేరుల్లో సుమారు నాలుగు వందలమంది కేవలం మూడు వారాల్లోనే వందల బిలియన్ డాలర్లను కోల్పోవడం మార్కెట్ ప్రపంచాన్నే నివ్వెరపరుస్తోంది. వీరంతా మూడు సంవత్సరాల కాలంతో పోలిస్తే ఈ ఒక్క నెలలోనే భారీ నష్టాలను చవిచూశారు. ఉమ్మడిగా వీరు నష్టపోయిన సంపద విలువ 350 బిలియన్ డాలర్లని బ్లూమ్ బర్గ్ బిజినెస్ రిప్టోర్లులు చెప్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఈక్విటీల వృద్ధి రేటు తీవ్రంగా పడిపోవడంతో వందలమంది బిలియనీర్లు భారీ నష్టాల పాలయ్యారు. బ్లూం బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం ఈ ఒక్కవారంలోనే వారంతా సుమారు 115 బిలియన్ డాలర్ల నష్టాలను చవి చూశారు. అందులో ఏడుగురు శుక్రవారం ఒక్కరోజులోనే ఒక బిలియన్ డాలర్లను కోల్పోయినట్లు నివేదికలు చెప్తున్నాయి. బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ ప్రకారం అమెజాన్ డాట్ కామ్ ఇంక్ (Amazon.com Inc. ) వ్యవస్థాపకుడు జెఫ్ బెజాస్ నష్టాల్లో అందరికన్నా ముందున్నారు. 8.9 బిలియన్ డాలర్లను ఈ ఒక్క నెల్లోనే నష్టపోయారు. అంతేకాక ఒక్క శుక్రవారం రోజునే 1.9 బిలియన్ డాలర్ల తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారు. అలాగే బిల్ గేట్స్ 6.8 బిలియన్ డాలర్ల నికర విలువను, చైనా అత్యధిక సంపన్నుడు వాంగ్ జియాన్ లిన్ 6.4 బిలియన్ డాలర్లను నష్టపోయారు. డౌజోన్స్ 391 పాయింట్లతో పాటు, మార్కెట్లో యూరోపియన్ స్టాక్స్ భారీగా పడిపోయిన కారణంగా ఇటువంటి తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వచ్చిందని తాజా రిపోర్టులు చెప్తున్నాయి. అలాగే స్టేట్ రెస్క్యూ ప్రచారంతో షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ కూడ ఏడు నెలల్లో రెండోసారి ఊహించని రీతిలో మలుపు తిరిగింది. ఇదిలా ఉంటే పన్నెండు సంవత్సరాల కాలంలో చమురు ధరలు తీవ్రంగా పడిపోవడం వల్లనే స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలపాలయ్యాయని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదికలు చెప్తున్నాయి. కాగా తీవ్రంగా నష్టపోయిన నాలుగు వందలమంది అత్యధిక సంపన్నుల్లో ఈ సంవత్సరం తొమ్మిది మంది నికర విలువలో కొంత పెరుగుదల కనిపించింది. వీరిలో ముఖ్యంగా ముంబైకి చెందిన రిలయన్స్ ఇండస్ల్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, భారత ఆయిల్ బిలియనీర్ ముఖేష్ అంబానీ నికర విలువలో 620 మిలియన్ డాలర్ల వృద్ధి కనిపించింది. -
రూ. 3,865 కోట్ల నష్టం
వర్షాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హడావుడి నివేదిక సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడనాల ప్రభావంతో కురిసిన వర్షాలకు రాష్ట్రంలో రూ.3,865 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు రాష్ట్ర విపత్తుల విభాగం అంచనా వేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా ఒక ప్రాథమిక నివేదికను తయారు చేసి బుధవారం కేంద్ర ప్రభుత్వానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక వస్తే తాత్కాలిక సాయాన్ని ప్రకటిస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నివేదికను ఢిల్లీకి పంపింది. అయితే బుధవారం అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడంతో హైదరాబాద్ నుంచి వెళ్లిన అధికారి ఏపీ భవన్‌లోని ఓ ముఖ్య అధికారికి ఈ నివేదికను అందజేసి వచ్చారు. అందులో పంట నష్టాన్ని రూ.1,420 కోట్లుగా చూపారు. -
ఆర్టీసీలో నష్టాల పరంపర
సెప్టెంబర్‌లో రూ.69 కోట్లు ఈ ఏడాది మొత్తం రూ.234 కోట్లు చార్జీల పెంపు కోసం సర్కారుపై ఒత్తిడి సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ప్రయాణం పీకల్లోతు నష్టాల్లోకి కూరుకుపోయే దిశగా సాగుతోంది. వేతన సవరణ రూపంలో పడ్డ భారంతో ఇప్పటికే కునారిల్లిన సంస్థ తాజాగా రికార్డుస్థాయి నష్టాల తో కోలుకోలేని స్థితికి చేరుకుంటోంది. ఆగస్టు నెలలో రూ.68 కోట్ల నష్టాలతో ఉలిక్కిపడ్డ ఆర్టీసీకి సెప్టెంబర్ నెల నష్టాలు దిమ్మతిరిగేలా చేశాయి. రూ.69.12 కోట్లు నష్టాలు వచ్చినట్టు తాజాగా లెక్క తేల్చారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయానికి నష్టాల మొత్తం రూ.214.10 కోట్లుగా ఉండగా ఈ సంవత్సరం అది రూ.234.50 కోట్లుగా నమోదైంది. వెరసి గత ఏడాది కంటే నష్టాలు ఎక్కువగా ఉండబోతున్నట్లు దాదాపు తేలిపోయింది. హైదరాబాద్ సిటీ జోన్లో నష్టాలు రూ.32 కోట్లను మించిపోయాయి. కరీంనగర్ జోన్ పరిధిలో రూ.20 కోట్లు, హైదరాబాద్ జోన్ పరిధిలో రూ.17 కోట్లు నష్టాలు నమోదయ్యాయి. ఇలా తీవ్ర నష్టాలు, అప్పులకుప్పల నేపథ్యంలో కొత్తగా రుణం ఇచ్చేందుకు బ్యాంకులు సైతం ముందుకు రావట్లేదు. చార్జీల పెంపు తప్పదా? వేతన సవరణ సమయంలో అంతర్గత సామర్థ్యం పెంచుకుని ఆదాయం పెంపుపై దృష్టి సారించాలని ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. కానీ ఇప్పటికిప్పుడు ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో అర్థం కాక అధికారులు హైరానా పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా సాయమంటూ లేదు. రెండు నెలలుగా రూ.75 కోట్లు చొప్పున అందజేసిన మొత్తంతో జీతాలు చెల్లించేశారు. బస్ పాస్ మొత్తం రీయింబర్స్మెంట్ రూపంలో గతంలో వచ్చినట్టుగా ప్రభుత్వం నుంచి ఈ మొత్తం వచ్చింది. అంతేగానీ అదనంగా వచ్చిన సాయమంటూ లేదు. ఈ స్థితిలో బస్సు చార్జీల పెంపు ఒక్కటే మార్గమని ఆర్టీసీ భావిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు ప్రభుత్వానికి నివేదించగా, జీహెచ్ఎంసీ ఎన్నికల భయంతో ప్రభుత్వం ఆ సాహసం చేయలేదు. మరోసారి ఒత్తిడి చేసే యోచనలో అధికారులున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కూడా చార్జీల పెంపుపై ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తోంది. అక్కడ సానుకూల నిర్ణయం తీసుకుంటే ఇక్కడ కూడా మార్గం సుగమమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక అప్పు కోసం డిపోలను తనఖా పెట్టే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలిసింది.