
మళ్లీ కనిష్టాల దిశగా రూపాయి
ముంబై: ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా నాల్గవరోజు మంగళవారం కనిష్టాల దిశగా పయనించింది. 21పైసలు నష్టంతో 76.50 వద్ద ముగిసింది.
భౌగోళిక ఉద్రిక్తతలు, దేశం నుంచి విదేశీ నిధుల ప్రవాహం, ఈక్విటీ మార్కెట్ల బలహీనత, అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ (రెండేళ్ల గరిష్ట స్థాయిలో 101.02కు అప్) బలోపేత ధోరణి వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం. ట్రేడింగ్‌లో 76.34 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 76.25 గరిష్ట– 76.53 కనిష్ట స్థాయిల్లో కదలాడింది.
చదవండి: ప్రపంచంలోనే మరే దేశానికి సాధ్యపడకుండా..జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న భారత్..!