
సాక్షి,ముంబై: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, కోవిడ్-19 ఆందోళనలు, రష్యా, సౌదీ అరేబియా ప్రైస్‌వార్ కారణంగా భారీ ఎగిసిన చమురు ధరలతో దేశీయ స్టాక్‌మార్కెట్లో ప్రకంపనలు రేపింది. చమురు ధరల చారిత్రక పతనం దలాల్ స్ట్రీట్‌ను వణింకించింది. ఇన్వెస్టర్ల ఆందోళనభారీ అమ్మకాలకు తెరతీసింది. దీంతో వరుస నష్టాలతో కుదేలైన దలాల్ స్ట్రీట్ మరింత కనిష్టానికి కుప్పకూలింది. కీలక సూచీలు సెన్సెక్స్,నిఫ్టీ అతి భారీ ఇంట్రాడే నష్టాలను నమోదు చేసింది. నిఫ్టీలోని 50 షేర్లలోదాదాపు అన్ని నష్టాలనే మూట గట్టుకున్నాయి. సెన్సెక్స్‌లో సుమారు 800పైగా షేర్లు 52 వారాల కనిష్టానికి చేరాయంటేనే పతనం ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. బ్యాంకింగ్, ఆటో, మిడ్ క్యాప్, ప్రైవేటు రంగ ఆయిల్ షేర్ల భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. రూ .7 లక్షల కోట్ల విలువైన పెట్టుబడిదారుల సంపద తుడిచిపెట్టుకుపోయింది.
కాగా సెన్సెక్స్ ఇంట్రాడేలో ఏకంగా 2450 పాయింట్లు కుప్పకూలింది. బ్యాంకింగ్, ఆటో సహా అన్ని రంగాలు అమ్మకాలతో కుదేలయ్యాయి. ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర బీఎస్‌ఈలో 13.65 శాతం పతనమైంది. అలాగే రూ. 10లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌లోరూ.2.7లక్షల కోట్లు ఆవిరైపోయాయి. అటు డాలరుతో రూపాయి మారకం విలువ కూడా పతనం బాటలోనే పయనించింది. 16 పైసలు దిగజారి ఈ రోజు (మార్చి 9, 2020) ట్రేడింగ్ రూ.74.03 వద్ద కనిష్టానికి పతనమైంది. అనంతరం 74.18 స్థాయిని తాకి చివరకు 74.08 వద్ద ముగిసింది. 2018 అక్టోబరులో 74.48 వద్ద అల్ టైం కనిష్టానికి పడిపోయింది. శుక్రవారం రూపాయి 73.78 వద్ద క్లోజ్ అయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment