Investors
-
ఫండ్స్‌లో పెట్టుబడులకు క్యూ
న్యూఢిల్లీ: గత క్యాలండర్ ఏడాది(2024)లో మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు) పట్ల ఇన్వెస్టర్లు అత్యంత ఆసక్తిని ప్రదర్శించారు. దీంతో 239 కొత్త ఫండ్ ఆఫరింగ్స్(ఎన్‌ఎఫ్‌వోలు) ద్వారా మొత్తం రూ. 1.18 లక్షల కోట్లను అందుకున్నాయి. వీటిలో సెక్టోరల్ లేదా థిమాటిక్ ఈక్విటీ ఫండ్స్ ఇన్వెస్టర్లను గరిష్టంగా ఆకట్టుకున్నట్లు జెర్మినేట్ ఇన్వెస్టర్ సర్వీసెస్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. కాగా.. 2023లో 212 ఎన్‌ఎఫ్‌వోలు ఉమ్మడిగా రూ. 63,854 కోట్లు సమీకరించగా.. 2022లో 228 పథకాలకు రూ. 62,187 కోట్లు లభించాయి. అంతక్రితం అంటే 2020లో 81 కొత్త పథకాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. తద్వారా ఫండ్స్ రూ. 53,703 కోట్లు సమీకరించాయి. వీటితో పోలిస్తే గతేడాది రెట్టింపు పెట్టుబడులు అందుకోవడం గమనార్హం! ఇది ఇన్వెస్టర్లలో పెరిగిన విశ్వాసంతోపాటు.. పటిష్ట వృద్ధి పథాన్ని ప్రతిబింబిస్తోంది. మార్కెట్ల ఎఫెక్ట్ సాధారణంగా స్టాక్ మార్కెట్లు పురోగమిస్తున్నప్పుడు ఎన్‌ఎఫ్‌వోలు వెలువడుతుంటాయని విశ్లేషకులు పేర్కొన్నారు. సానుకూల సెంటిమెంటు, ఇన్వెస్టర్ల ఆశావహ ధృక్పథం ప్రభావం చూపుతుంటాయి. ఇన్వెస్టర్ల ఆసక్తి ఆధారంగా కొత్త పథకాలకు ఫండ్స్ తెరతీస్తుంటాయి. దీంతో పెట్టుబడులను సమకూర్చుకోగలుగుతాయి. వెరసి 2024లో అధిక ఎన్‌ఎఫ్‌వోల ద్వారా భారీగా పెట్టుబడులను సమీకరించాయి. గతేడాది స్టాక్ ఇండెక్స్‌లలో సెన్సెక్స్ 5,899 పాయింట్లు(8.2 శాతం) జంప్‌చేయగా.. నిఫ్టీ 1,913 పాయింట్లు(8.8 శాతం) ఎగసింది. ఈఎస్జీ సైతం గతేడాది పెట్టుబడుల్లో థిమాటిక్, సెక్టోరల్, ఇండెక్స్, ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్‌లు) అధిక శాతం ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. నివేదిక ప్రకారం 53 ఎన్‌ఎఫ్‌వోల ద్వారా ఫండ్స్‌కు రూ. 79,109 కోట్లు లభించాయి. ఇన్వెస్టర్ల ఆసక్తికి అనుగుణంగా రూపొందించిన థీమ్స్ లేదా థిమాటిక్, సెక్టోరల్ ఫండ్స్ ఇందుకు సహకరించాయి. తయారీ, టెక్నాలజీ, పర్యావరణం, సామాజిక, సుపరిపాలన(ఈఎస్జీ) విభాగాలను ఇందుకు ప్రస్తావించవచ్చు. విడిగా చూస్తే హెచ్డీఎఫ్సీ మ్యాన్యుఫాక్చరింగ్ ఫండ్ ఎన్ఎఫ్వో గత ఏప్రిల్‌లో రూ. 12,500 కోట్లు అందుకుంది. డిసెంబర్లో అత్యధిక ఎన్‌ఎఫ్‌వోలు మార్కెట్లను తాకడం ప్రస్తావించదగ్గ అంశం! -
బుల్ స్వారీలో ‘ఆమె’ ఫస్ట్
సాక్షి, అమరావతి: స్టాక్ మార్కెట్లో బుల్ స్వారీ చేయడానికి మహిళా ఇన్వెస్టర్లు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ తర్వాత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం 2022 తర్వాత ప్రారంభమవుతున్న ప్రతి నాలుగు డిమ్యాట్ అకౌంట్లలో ఒకటి మహిళా ఖాతాగా ఉన్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2021 నుంచి సగటున ఏటా మూడు కోట్ల ఖాతాలు ప్రారంభమవ్వగా, ఈ ఏడాది ఇప్పటికే నాలుగు కోట్లకు పైగా డిమ్యాట్ ఖాతాలు ప్రారంభం కావడం గమనార్హం. 2014లో దేశం మొత్తం మీద 2.2 కోట్ల ఖాతాలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 17 కోట్లు దాటింది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య క్రమేపి పెరుగుతూ వస్తోంది. 2014 ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.12,068 కోట్ల నిధులు సేకరిస్తే, 2024లో రూ.1.60 లక్షల కోట్లు స్టాక్ మార్కెట్ ద్వారా సేకరించడం గమనార్హం. ఇదే సమయంలో సిప్ విధానం ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఏటా రూ.రెండు లక్షల కోట్లకుపైగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. కొత్త ఇన్వెస్టర్లలో హైదరాబాదీలు అధికంమహిళా ఇన్వెస్టర్ల విషయంలో పెద్ద రాష్ట్రాల్లో ఢిల్లీ 29.8%, మహారాష్ట్ర 27.7%, తమిళనాడు 27.5%తో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. చిన్న రాష్ట్రాలు కూడా కలుపుకుంటే గోవా 32%తో మొదటి స్థానంలో ఉంది. మహిళా ఇన్వెస్టర్ల సంఖ్య తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా ఉన్నాయి. 2022లో ఏపీలో మొత్తం ఇన్వెస్టర్లలో మహిళా ఇన్వెస్టర్ల సంఖ్య 19.5% ఉండగా, అది ఇప్పుడు 22.7 శాతానికి పెరిగింది. మహిళా ఇన్వెస్టర్లు వేగంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీ రెండవ స్థానంలో నిలిచింది. హిమాచల్ ప్రదేశ్ 3.7% వృద్ధితో మొదటి స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ 3.2% వృద్ధితో రెండవ స్థానంలో నిలిచింది. కోవిడ్ తర్వాత నుంచి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే 30 ఏళ్లలోపు వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. 2018లో మొత్తం ఇన్వెస్టర్లలో 22.9 శాతంగా ఉన్న 30 ఏళ్లలోపు ఇన్వెస్టర్ల సంఖ్య ఇప్పుడు 40 శాతానికి చేరుకుంది. కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్న వారిలో అత్యధికంగా హైదరాబాద్, బెంగళూరు, కాన్పూర్ వంటి పట్టణ ఇన్వెస్టర్లు ఉంటున్నట్లు ఎస్బీఐ నివేదిక వెల్లడించింది. -
అమరావతి అంటే పెట్టుబడిదారులకు భయమవుతోంది
సాక్షి, హైదరాబాద్: అమరావతి అంటేనే పెట్టుబడిదారులు భయపడే పరిస్థితి వచ్చిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో తెలంగాణ పెట్టుబడులు ఆంధ్రకు వెళ్తాయేమోననే అభిప్రాయం ఉండేదని, ఇటీవల అమరావతిలో సంభవించిన వరదలతో ఆ భావన పోయిందన్నారు. పొంగులేటి సోమవారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ.. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పుంజుకుంటోందన్నారు. సెప్టెంబర్‌తో పోలిస్తే నవంబర్‌లో, నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్లో కొంత పురోగతి కనిపిస్తోందని, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం కూడా పెరుగుతోందని చెప్పారు. పెట్టుబడులు ఆంధ్రకు వెళ్లే అవకాశముందా అని విలేకరులు ప్రశ్నించగా... పెట్టుబడిదారులంతా తిరిగి హైదరాబాద్ బాట పడుతున్నారని, కొందరు బెంగళూరు వైపు చూస్తున్నారని చెప్పారు. ‘అమరావతిలో ఇటీవల వచ్చిన వరదలతో సీన్ మారిపోయింది. వాళ్లు ఎంత బూస్టప్ ఇవ్వాలనుకున్నా సాధ్యం కావడం లేదు. ఎలాంటి చర్యలు తీసుకున్నా వరదల నుంచి రక్షణ ఉండదని పెట్టుబడిదారులు భావిస్తున్నారు’అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల్లో హైడ్రా పట్ల భయం పోయిందని, మొదట్లో తప్పుడు ప్రచారం వల్ల కొంత వేరే అభిప్రాయం ఉన్నా.. ఇప్పుడు ప్రజలకు నిజం తెలిసిపోయిందన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. సంక్రాంతికి రైతు భరోసా తప్పకుండా ఇస్తామని చెప్పిన పొంగులేటి.. రాష్ట్రంలో భూమిలేని నిరుపేదలకు రూ.12వేలను రెండు దఫాల్లో ఇస్తామని చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 15 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని, ఇందుకోసం విడతకు రూ.1000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.7 లక్షల కోట్లు అప్పు వాస్తవమని, ఈ విషయంలో చర్చ నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ గొడవ చేయాలని చూస్తోందన్నారు. కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులు లెక్కలోకి రావా అని ప్రశ్నించారు. అసలు కార్పొరేషన్ల నుంచి ఒక్క రూపాయి అయినా ఆదాయం వచ్చే పరిస్థితి ఉందా అని వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, సినిమా వాళ్లు, జర్నలిస్టులు, ప్రజలందరూ తమకు సమానమేనని అన్నారు. శాసనసభలో ఎవరి పాత్ర వారు పోషించాల్సిందేనని, భట్టిపై ప్రివిలేజ్ తీర్మానం ఇవ్వడం బీఆర్ఎస్ హక్కు అని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నానని, ఆయన అసెంబ్లీలో ఉన్నప్పుడు మంత్రి హోదాలో చర్చలో మాట్లాడాలని తనకు కూడా కోరికగా ఉందని పొంగులేటి చెప్పారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజల్లో వ్యతిరేకత లేదని, ఆదానీ విషయంలో ఏఐసీసీ విధానమే తమ విధానమని స్పష్టంచేశారు. -
వాటి జోలికి వెళ్లొద్దు.. ఇన్వెస్టర్లకు సెబీ వార్నింగ్!
గత 30 రోజుల్లో క్లయింట్ ఎలాంటి లావాదేవీలను చేపట్టని సందర్భంలో తదుపరి సెటిల్మెంట్లో మూడు రోజుల్లోగా ఖాతాలోని నిధులను వెనక్కి ఇవ్వవలసిందిగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ప్రతిపాదించింది. ఖాతాల నెలవారీ రన్నింగ్ సెటిల్మెంట్ సైకిల్‌కు సంబంధించి స్టాక్ బ్రోకర్లకు సెబీ తాజా మార్గదర్శకాలను ప్రతిపాదించింది.రానున్న సెటిల్మెంట్ రోజులకు ఇది వర్తించనున్నట్లు కన్సల్టేషన్ పేపర్లో పేర్కొంది. దీనికి క్వార్టర్లీ సెటిల్మెంట్గా సైతం పిలిచే సంగతి తెలిసిందే. ఇన్వెస్టర్ల పరిరక్షణతోపాటు.. సరళతర బిజినెస్ నిర్వహణకు వీలు కల్పించే బాటలో సెబీ తాజా మార్గదర్శకాలకు ప్రతిపాదించింది. వెరసి క్లయింట్ల నిధుల సెటిల్మెంట్ను తప్పనిసరి చేయనుంది. ఈ అంశాలపై ఈ నెల 26వరకూ సెబీ ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించనుంది.ఇదిలా ఉండగా అనామక ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా లభించే అన్‌లిస్టెడ్ డెట్ సెక్యూరిటీస్తో జాగ్రత్తగా ఉండాలని, వాటికి జోలికి వెళ్లొద్దని ఇన్వెస్టర్లను సెబీ హెచ్చరించింది. ఈ అన్‌రిజిస్టర్డ్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై ఎటువంటి నియంత్రణా ఉండదని, మదుపరుల రక్షణ వ్యవస్థ కూడా లేదని ఓ ప్రకటనలో పేర్కొంది.కంపెనీల చట్టం 2013ను ఉల్లంఘిస్తూ 200లకుపైగా ఇన్వెస్టర్లకు అన్‌లిస్టెడ్ సెక్యూరిటీస్‌ను అక్రమ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయని సెబీ గుర్తించింది. ఈ క్రమంలోనే మదుపరులను అప్రమత్తం చేసింది. వీటిలో పెట్టుబడులు పెడితే చాలా ప్రమాదమని గుర్తుచేసింది. లిస్టెడ్ డెట్ సెక్యూరిటీల్లో పెట్టుబడుల కోసం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఆథరైజ్డ్ స్టాక్‌బ్రోకర్లు నిర్వహించే రిజిస్టర్డ్ ఆన్లైన్ బాండ్ ప్లాట్ఫామ్స్ల్లోకి మాత్రమే వెళ్లాలని సెబీ సూచించింది. -
మేము అదానీ వెంటే...
న్యూఢిల్లీ: క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌నకు ఇన్వెస్టర్లు బాసటగా నిలుస్తున్నారు. గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తదితరులపై అమెరికాలో ఆరోపణలు వచ్చినప్పటికీ తమ పెట్టుబడుల విషయంలో పునరాలోచనేమీ లేదని అబు ధాబీకి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (ఐహెచ్సీ) వెల్లడించింది. హరిత ఇంధనం, పర్యావరణ అనుకూల రంగాల్లో అదానీ గ్రూప్ చేస్తున్న కృషిపై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొంది. ఐహెచ్సీ 2022లో అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్), అదానీ ట్రాన్స్‌మిషన్‌లో (ఏటీఎల్) చెరి 500 మిలియన్ డాలర్లు, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 1 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత ఏజీఈఎల్, ఏటీఎల్‌లో ఒక శాతం పైగా వాటాలు విక్రయించినప్పటికీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో మాత్రం 5 శాతం పైగా వాటాలు పెంచుకుంది. మరోవైపు, అంతర్జాతీయ భాగస్వాములు కూడా అదానీ గ్రూప్‌నకు మద్దతు తెలిపారు. అదానీ గ్రూప్‌తో భాగస్వామ్యంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని శ్రీలంక పోర్ట్స్ అథారిటీ తెలిపింది. దేశంలో పోర్ట్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అదానీ గ్రూప్ కీలక పాత్ర పోషిస్తోందని వివరించింది. అదానీ గ్రూప్ 1 బిలియన్ డాలర్లతో కొలంబో టెరి్మనల్‌ను గ్రూప్ అభివృద్ధి చేస్తోంది. మరోవైపు, టాంజానియా ప్రభుత్వం కూడా అదానీ పోర్ట్స్‌తో ఒప్పందాలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులపై ఎలాంటి ఆందోళన లేదని, కాంట్రాక్టులన్నీ దేశ చట్టాలకు అనుగుణంగానే ఉన్నాయని వివరించింది. దార్–ఎ–సలామ్ పోర్టులోని 2వ కంటైనర్ టెర్మినల్ నిర్వహణకు టాంజానియాతో అదానీ పోర్ట్స్ ఇటీవలే 30 ఏళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సౌర విద్యుత్ కాంట్రాక్టుల కోసం అధికారులకు లంచాలిచ్చారని అదానీపై అమెరికాలో ఆరోపణలు రావడంతో గ్రూప్ కంపెనీల షేర్లు కుదేలుకావడం, అభియోగాలేమీ తీవ్రమైనవి కావని సంస్థ స్పష్టతనివ్వడంతో మళ్లీ పుంజుకోవడం తెలిసిందే. -
అంతర్జాతీయ పరిణామాలే కీలకం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసిక(జులై–సెప్టెంబర్) ఫలితాల సీజన్ ముగింపు దశకు చేరడంతో ఇకపై దేశీ స్టాక్ మార్కెట్లకు అంతర్జాతీయ పరిణామాలే దిక్సూచిగా నిలవనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దేశీయంగా ప్రభావిత అంశాలు కొరవడటం దీనికి కారణమని తెలియజేశారు. వివరాలు చూద్దాం.న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ క్యూ2 ఫలితాలు దాదాపు ముగియనున్నాయి. దీంతో ఇకపై ఇన్వెస్టర్లు విదేశీ మార్కెట్లు, పెట్టుబడులు, గణాంకాలవైపు దృష్టి సారించనున్నట్లు స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. బుధవారం(20న) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెలవు ప్రకటించారు. దీంతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు నాలుగు రోజులే పనిచేయనున్నాయి.కొద్ది రోజులుగా మార్కెట్లు నేలచూపులతో కదులుతున్న నేపథ్యంలో కొంతమేర షార్ట్‌కవరింగ్‌కు వీలున్నట్లు నిపుణులు అంచనా వేశారు. ఫలితంగా మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని తెలియజేశారు. 288మంది సభ్యుల మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీసహా పలు పారీ్టలు ఎన్నికలలో పోటీ పడుతుండటంతో ఫలితాలకు ప్రాధాన్యత ఏర్పడింది. యూఎస్ ఎఫెక్ట్ కొత్త ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నేపథ్యంలో ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలపడుతోంది. గత వారాంతాన ఒక దశలో 106.66ను తాకింది. దీంతో దేశీ కరెన్సీ బలహీనపడుతూ వస్తోంది. గురువారం(14న) రూపాయి సరికొత్త కనిష్టం 84.41 వద్ద ముగిసింది. దీనికితోడు యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ సైతం మెరుగుపడుతున్నాయి. గత వారం చివర్లో 4.5 శాతానికి చేరాయి. మరోవైపు చైనా సహాయక ప్యాకేజీలకు తెరతీస్తోంది. రియల్టీ రంగానికి వెసులుబాటు కల్పించింది. 5.3 ట్రిలియన్ డాలర్ల విలువైన మార్టీగేజ్ రుణ వ్యయాలుసహా.. డౌన్ పేమెంట్‌ను తగ్గించడం వంటి చర్యలు చేపట్టింది. ఈ అంశాల నేపథ్యంలో ఇటీవల కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్ నుంచి విదేశీ పెట్టుబడులు భారీ స్థాయిలో తరలివెళుతున్నాయి. ఈ వారం జపాన్ ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి. యూఎస్ నిరుద్యోగిత, తయారీ, సరీ్వసుల రంగ గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. 10 శాతం దిద్దుబాటు.. గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో డీలా పడ్డాయి. సెన్సెక్స్ 1,906 పాయింట్లు కోల్పోయి 77,580 వద్ద ముగిసింది. వెరసి రికార్డ్ గరిష్టం(86,000స్థాయి) నుంచి 8,395 పాయింట్లు(10 శాతం) పడిపోయింది. ఇక గత వారం నిఫ్టీ సైతం 616 పాయింట్లు క్షీణించి 23,533 వద్ద స్థిరపడింది. ఈ బాటలో చరిత్రాత్మక గరిష్టం(26,277) నుంచి 2,745 పాయింట్లు పతనమైంది.వర్ధమాన మార్కెట్లకు దెబ్బయూఎస్ బాండ్ల ఈల్డ్స్, డాలరు బలపడటంతో వర్ధమాన మార్కెట్లపై ప్రభావం పడుతున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ పేర్కొన్నారు. క్యూ2 ఫలితాల సీజన్ ముగియడంతో ఇకపై మార్కెట్లు విదేశీ ఇన్వెస్టర్ల తీరు ఆధారంగా కదలవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ట్రేడర్లు ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌ను అనుసరించే వీలున్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాల నేపథ్యంలో ఈ వారం దేశీ మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య కదిలే వీలున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్‌మేనేజ్‌మెంట్, రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అంచనా వేశారు.అమ్మకాల బాటలోనే...దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా రూ. 22,420 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. యూఎస్ డాలర్‌తోపాటు ట్రెజరీ ఈల్డ్స్ బలిమి, చైనా ప్యాకేజీలు, దేశీ మార్కెట్ల గరిష్ట విలువల కారణంగా అమ్మకాలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో గత నెల(అక్టోబర్)లో కొత్త రికార్డ్ నెలకొల్పుతూ రూ. 94,017 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. ఇంతక్రితం 2020 మార్చిలో మాత్రమే ఈ స్థాయిలో రూ. 61,973 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. అయితే ఈ ఏడాది సెపె్టంబర్లో 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! -
పదేళ్లలో భారత్‌ను విడిచిపెట్టినవారు ఇంతమందా?.. కారణం ఇదేనా..
2014 తర్వాత.. ఈ పదేళ్లలో దేశాన్ని విడిచిపెట్టిన వారి సంఖ్యలో 67శాతం పెరుగుదల నమోదైంది. 2014లో మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి రోజులను గుర్తు చేసుకుందాం. పాలన చేపట్టిన కొన్నాళ్లకే మోదీ ఓ పథకాన్ని తీసుకొచ్చారు.. అదే మేక్ ఇన్ ఇండియా..! భారత్‌ను ప్రపంచంలో టాప్ మాన్యుఫాక్చరింగ్ సెంటర్‌గా మార్చాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే సీన్ కట్ చేస్తే.. ఈ పథకం ఆశించిన స్థాయిలో హిట్ కాలేకపోయిందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇండియన్స్ భారీగా భారత్‌ను విడిచి వెళ్తున్నారని.. పెట్టుబడులు కూడా ఇతర దేశాల్లో ఎక్కువగా పెడుతున్నారని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.చాలా మంది భారతీయులు.. ముఖ్యంగా బడా పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు ఇండియాలో కాకుండా విదేశాలలో అవకాశాలను సృష్టించుకుంటున్నారు. ఇటీవల భారత పౌరసత్వం విడిచిపెట్టిన వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. 2022లో 2 లక్షల 25 వేల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదిలేశారు. వీరంతా ఎక్కువగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వెళ్లారు. అక్కడ ఉద్యోగ అవకాశాలతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ వీరిని ఎక్కువగా ఆకర్షించింది.విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి కారణాలుమరోవైపు భారతీయులు విదేశాల్లో పెట్టుబడులు పెడుతుండడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. భారత్‌లో పన్ను వసూలు ఎక్కువ. దీని కారణంగా ఇండియాలో వ్యాపారం చేయడం కష్టంతో పాటు నష్టంతో కూడుకున్న విషయమని చాలామంది వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. అటు వైద్య సేవలు, విద్య, భద్రత లాంటి అంశాల కోసం జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉన్న దేశాలకు వలస వెళ్లే వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఇక కొన్ని దేశాలు నైపుణ్యం కలిగిన వ్యక్తులకు, పెట్టుబడిదారులకు ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తున్నాయి. కొన్ని యూరప్ దేశాలు, కరేబియన్ దేశాలు పెట్టుబడుల ద్వారా పౌరసత్వం లేదా రెసిడెన్సీ ఇవ్వడం లాంటి ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నాయి. దీంతో మార్కెట్ రిస్క్ ఎందుకని.. ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడితే బెటర్ అని చాలామంది భారతీయులు భావిస్తున్నారు...!భారతీయులు ఇతర దేశాల్లో పెట్టుబడులు భారీగా పెడుతుండడానికి పదేళ్ల నుంచి కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఒక కారణంగా విశ్లేషకులు అభిప్రాయడపతున్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న కొన్ని ఆర్థిక విధానాలు, దేశీయ పెట్టుబడిదారులకు భయాన్ని కలిగించాయి. ఉదాహరణకు.. డీమానిటైజేషన్.. అంటే నోట్ల రద్దు లాంటి నిర్ణయాలు ఆర్థిక సంక్షోభానికి దారితీశాయన్నది నిపుణుల మాట. 2016లో నోట్ల రద్దు తర్వాత బడా వ్యాపారులు తమ పెట్టుబడులను ఇండియాలో ఉపసంహరించుకున్నారు. అటు నోట్ల రద్దు తర్వాత, చిన్న వ్యాపారాలు MSME సంస్థలు భారీ నష్టాల పాలయ్యాయి. ఆ తర్వాత దేశీయ పెట్టుబడులు క్రమంగా తగ్గాయి.వ్యాపారుల కష్టాలను పెంచిన జీఎస్టీమరోవైపు 2017లో కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ విధానం కూడా వ్యాపారుల కష్టాలను పెంచింది. జీఎస్టీ అమలు తర్వాత వ్యాపార ఖర్చులు పెరిగాయి. దీంతో భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారులు ఆసక్తి చూపడం తగ్గిపోయింది. ఇక 2014 తర్వాత దేశంలో ఉపాధి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువతులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇండియాలో తగినంత అవకాశాలు లేకపోవడంతో యువత ఎక్కువగా విదేశాలకు వలసపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు అక్కడే పెట్టుబడులు కూడా పెట్టుకుంటున్నారు. 2014 నుంచి 2020 వరకు దేశీయ ఉపాధి రేటు కేవలం 3-4శాతం మాత్రమే ఉంది.ఇదీ చదవండి: ఈ లింక్ క్లిక్ చేస్తే మీ డబ్బు డబుల్!.. ఇవి నమ్మారో..పెట్టుబడిదారులకు శాపంగా పన్నులుదేశంలో పెరిగిన పన్నులు పెట్టుబడిదారులకు శాపంగా మారాయి. ఫ్లిప్‌కార్ట్ లాంటి భారతీయ కంపెనీలు కూడా విదేశాలలో పెట్టుబడులు పెంచడం ప్రారంభించాయి. అటు భారత్ రూపాయి విలువ అంతర్జాతీయంగా తగ్గిపోవడం కూడా పెట్టుబడిదారులపై ప్రభావం చూపింది. రూపాయి విలువ 2014లో డాలర్‌కి 60 రూపాయల వద్ద ఉంటే ఇప్పుడది 80 దాటేసింది. ఇలా మేకిన్ ఇన్ ఇండియా ఫెయిల్యూర్, పన్నులు, నోట్ల రద్దు, జీఎస్టీ, రూపాయి బలహీనత లాంటి అంశాలు భారత్ పెట్టుబడిదారులపై ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో విదేశాల్లో భారతీయ పెట్టుబడులు పెరిగాయి. -
వచ్చే ఏడాదిలోనూ పసిడిలో రాబడులు
న్యూఢిల్లీ: సంవత్ 2081లోనూ (వచ్చే ఏడాది కాలంలో) బంగారం, వెండి ఇన్వెస్టర్లకు రాబడులు కురిపించనున్నాయి!. దేశ ఆర్థిక వ్యవస్థలో సానుకూల వృద్ధికి తోడు, అనిశి్చతుల్లో సురక్షిత సాధనంగా ఉన్న గుర్తింపు బంగారంలో ర్యాలీకి మద్దతుగా నిలుస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సంవత్ 2080లో నిఫ్టీ 25 శాతం పెరగ్గా, బంగారం 30 శాతం రాబడులను ఇచ్చింది. ‘‘సంవత్ 2081 బంగారానికి అనుకూలంగా ఉంటుంది. కనీసం 10 శాతం రాబడులు ఇవ్వొచ్చు. దిగుమతి సుంకాల తగ్గింపు ప్రభావంతో కొనుగోళ్లు ఇదే మాదిరి కొనసాగితే గరిష్టంగా 15–18% రాబడులకూ అవకాశం ఉంటుంది. ఒకవేళ దిగుమతులపై సుంకాలు పెంచితే బంగారం పనితీరు 15 శాతాన్ని మించొచ్చు. స్థిరమైన వడ్డీ రేట్ల వాతావరణం సైతం బంగారం ఎగువవైపు ర్యాలీకి మద్దతుగా నిలుస్తుంది’’అని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది తెలిపారు. సంవత్ 2080లో వెండి ధర 40% ర్యాలీ చేసిందని, రాబడుల్లో స్థిరమైన ధోరణి కొనసాగుతుందని అన్నారు. -
టపటపా!.. స్టాక్ మార్కెట్ల భారీ పతనం
సూచీలు ఒకశాతానికి పైగా పతనం కావటంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం విలువ మంగళవారం ఒక్కరోజే రూ.9.19 లక్షల కోట్లు హరించుకుపోయింది. దీంతో బీఎస్ఈలో మార్కెట్ విలువ రూ.444.45 లక్షల కోట్లకు (5.29 ట్రిలియన్ డాలర్లు) దిగివచి్చంది.ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లలో మంగళవారం అమ్మకాలు వెల్లువెత్తాయి. సూచీలు భారీగా నష్టపోయాయి. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ ఒక శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ 931 పాయింట్లు పతనమైన 80,221 వద్ద స్థిరపడగా... నిఫ్టీ 309 పాయింట్లు క్షీణించి 24,472 వద్ద నిలిచింది. ముగింపు స్థాయిలు రెండు నెలల కనిష్టం కావడం గమనార్హం. ఉదయం స్తబ్ధుగా మొదలైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలతో నష్టాల బాటపట్టాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపడంతో ట్రేడింగ్ గడిచే కొద్దీ నష్టాల తీవ్రత మరింత పెరిగింది.ఒక దశలో సెన్సెక్స్ 1,002 పాయింట్లు క్షీణించి 80,149 వద్ద, నిఫ్టీ 335 పాయింట్లు పతనమై 24,446 వద్ద కనిష్టాలు తాకాయి. వాస్తవానికి ఇండెక్స్‌లు ఒక శాతమే నష్టపోయినా... మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు చాలావరకూ భారీగా పతనమయ్యాయి. కొన్ని డిఫెన్స్ రంగ షేర్లు 10–12 శాతం వరకూ పతనం కాగా... ప్రభుత్వ బ్యాంకులతో సహా పలు ప్రధాన రంగాల షేర్లు 3–6 శాతం మధ్యలో నష్టపోయాయి. అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాలే ఇంట్రాడేలో అన్ని రంగాల షేర్లలోనూ విక్రయాలు వెల్లువెత్తాయి. సూచీల వారీగా అత్యధికంగా ఇండ్రస్టియల్ ఇండెక్స్ 3.50% నష్టపోయింది. రియల్టీ 3.30%, కమోడిటీ 3%, పవర్ 2.64%, యుటిలిటి, టెలికం, కన్జూమర్ డి్రస్కేషనరీ సూచీలు 2.50 నష్టపోయాయి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ ఏకంగా 4% పతనమైంది. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.50% నష్టపోయింది. ఆసియాలో చైనా, హాంగ్‌కాంగ్ సూచీలు మినహా అన్ని దేశాల ఇండెక్సులు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు 1.50% పడిపోగా. అమెరికా స్టాక్ సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.నష్టాలు ఎందుకంటే.. కార్పొరేట్ కంపెనీల సెపె్టంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతు న్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా క్షిపణి దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్... నవంబర్‌లో పావుశాతం మేరకే వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలు న్నాయి. అమెరికా పదేళ్ల బాండ్లపై రాబడులు 3 నెలల గరిష్టానికి (4.21%), డాలర్ ఇండెక్సు 103.96 స్థాయికి చేరుకున్నాయి. ఇవన్నీ అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన ధోరణులకు కారణమయ్యాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో ఒక్క ఐసీఐసీఐ బ్యాంకు షేరు 0.67% లాభంతో గట్టెక్కింది. ఎంఅండ్ఎం 4%, టాటా స్టీల్ 3%, ఎస్బీఐ 2.95%, టాటా మోటార్స్ 2.64%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 2.50%, రిలయన్స్ 2%, ఎల్అండ్టీ 2%, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 1% చొప్పున నష్టపోయాయి. -
బోర్డు తిప్పేసి.. రూ.7 వేల కోట్లు కొట్టేసి..
సాక్షి, హైదరాబాద్: ఒకటి రెండు కాదు ఏకంగా రూ.7 వేల కోట్ల స్కాం జరిగింది. అధిక వడ్డీ ఆశ చూపించి పెట్టుబడిదారులకు కుచ్చుటోపీ పెట్టింది అస్సాంలోని గువాహటికి చెందిన డీబీ స్టాక్ బ్రోకింగ్. ఈ సంస్థకు హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలోనూ కార్యాలయం ఉంది. నగరానికి చెందిన వందలాది మంది ఇన్వెస్టర్లు డీబీ స్టాక్ బ్రోకింగ్‌లో పెట్టుబడులు పెట్టారు. వడ్డీ కాదు కదా అసలు కూడా చెల్లించకుండా బిచాణా ఎత్తివేయడంతో లబోదిబోమంటూ బాధితులు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (ఈఓడబ్ల్యూ)లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. 23 వేల మంది పెట్టుబడులు అస్సాంకు చెందిన దీపాంకర్ బర్మన్ 2018లో డీబీ స్టాక్ బ్రోకింగ్‌ను ప్రారంభించారు. ఈ సంస్థకు గువాహటితోపాటు హైదరాబాద్, బెంగళూరు, ముంబైలోనూ కార్యాలయాలున్నాయి. పెట్టుబడులపై ఏడాదికి 120 శాతం, ఆరు నెలలకు 54 శాతం, మూడు నెలలకు 27 శాతం, నెలకు 8 శాతం చొప్పున వడ్డీ ఇస్తామని ప్రకటించారు. దీంతో స్థానికులతోపాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు కొంతకాలం పాటు వడ్డీ చెల్లించిన ఈ సంస్థ.. ఈ ఏడాది జూలై నుంచి చెల్లింపులు నిలిపివేసింది. అధిక వడ్డీ ఆశ చూపించి మన దేశంతో పాటు ఆస్ట్రేలియాలో ఇన్వెస్టర్ల నుంచి కూడా డిపాజిట్లు సేకరించారు. సుమారు 23 వేల మంది పెట్టుబడులు పెట్టారు. గత నెలలో పుప్పాలగూడకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి పంచాక్షర్ రూ. 11 లక్షలు, గంటాడి హరి రూ. 88.50 లక్షలు, విశ్వజీత్ సింగ్ రూ. 36.80 లక్షలు, పి.రాజు మహేంద్ర కుమార్ రూ. 26 లక్షలు, వందపాటి లక్ష్మి రూ. 64.50 లక్షలు.. ఇలా డీబీ స్టాక్ బ్రోకింగ్‌లో పెట్టుబడులు పెట్టి మోసపోయామని పలువురు బాధితులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దీపాంకర్ బర్మన్, అతని సహచరులపై చీటింగ్‌తోపాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆగస్టు 21న బర్మన్ అస్సాంలోని ఆఫీసు బోర్డు తిప్పేసి గువాహటి నుంచి పరారయ్యారు. దీంతో పాన్ బజార్ పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇన్వెస్టర్లు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలని పోలీసులు సూచించారు. బర్మన్ ఆ్రస్టేలియాలో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్నారు. -
రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లకు కొత్త సాధనం
న్యూఢిల్లీ: పెట్టుబడులపై అధిక రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్ల కోసం సెబీ ‘న్యూ అస్సెట్ క్లాస్’ (కొత్త సాధనం)ను ప్రవేశపెట్టింది. అలాగే, ప్యాసివ్ ఫండ్స్‌కు ప్రోత్సాహకంగా ‘ఎంఎఫ్ లైట్–టచ్’ కార్యాచరణను అనుమతించింది. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి నిబంధనల సవరణలకూ ఆమోదం తెలిపింది. ఇలా 17 ప్రతిపాదనలకు సెబీ బోర్డు సమావేశంలో ఆమోదం లభించింది.అందరూ అనుకున్నట్టు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో)లో రిటైల్ ట్రేడర్ల స్పెక్యులేషన్ కట్టడిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం గమనార్హం. సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్‌పై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ సంస్థ, కాంగ్రెస్ పార్టీ ఆరోపణల తర్వాత జరిగిన మొదటి బోర్డు సమావేశం ఇది కావడంతో అందరిలోనూ దీనిపై ఆసక్తి నెలకొంది. న్యూ అస్సెట్ క్లాస్ మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సేవలు (పీఎంఎస్) పొందాలంటే కనీసం రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టాలి. రాబడుల కోసం రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ, రూ.50 లక్షల పెట్టుబడి అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఈ తరహా ఇన్వెస్టర్ల కోసం మ్యూచువల్ ఫండ్స్, పీఎంఎస్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త ఉత్పత్తిని సెబీ ప్రవేశపెట్టింది. దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలు సైతం స్వీకరించింది. ఈ సాధనంలో డెరివేటివ్స్‌లో పెట్టుబడులకు అనుమతి ఉంటుంది. రుణాలు తీసుకోవడానికి అనుమతి ఉండదు. అన్‌లిస్టెడ్, అన్‌రేటెడ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా అనుమతి లేదు. టీప్లస్0 ప్రస్తుతం టీప్లస్1 సెటిల్మెంట్ విధానం అమల్లో ఉంది. అంటే స్టాక్స్ కొనుగోలు చేసిన మరుసటి పనిదినంలో దాన్ని సెటిల్ చేస్తారు. తదుపరి దశలో టీప్లస్0కు మళ్లాలన్నది సెబీ ప్రణాళిక. ఇందులో భాగంగా 25 స్క్రిప్‌లకు ఆప్షనల్ (ఐచి్ఛకం) టీప్లస్0 విధానం (ట్రేడింగ్ రోజే సెటిల్మెంట్) అమల్లో ఉంది. ఇప్పుడు టాప్–500 (మార్కెట్ విలువ పరంగా) స్టాక్స్‌కు టీప్లస్0 విధానాన్ని ఐచి్ఛకంగా చేస్తూ సెబీ నిర్ణయం తీసుకుంది. రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్లు అందరూ తమ ఇన్వెస్టర్లకు టీప్లస్0 సెటిల్మెంట్ను ఆఫర్ చేయవచ్చు. ఇందుకోసం ప్రత్యేకమైన బ్రోకరేజీ చార్జీలను వసూలు చేసుకునే స్వేచ్ఛను సెబీ కల్పించింది. మ్యూచువల్ ఫండ్స్ సైతం టీప్లస్0 విధానాన్ని పొందొచ్చు. ఎంఎఫ్ లైట్ ప్యాసివ్ పండ్స్‌కు సంబంధించి సరళించిన కార్యాచరణను సెబీ ప్రకటించింది. కేవలం ప్యాసివ్ ఫండ్స్‌ను నిర్వహించే సంస్థలకు నిబంధనల భారాన్ని తగ్గించింది. కేవలం ప్యాసివ్ ఫండ్స్ రూపంలో ప్రవేశించే కొత్త సంస్థలకు మార్గం తేలిక చేసింది. నికర విలువ, ట్రాక్ రికార్డు, లాభదాయకత పరిమితులను తగ్గించింది. రైట్స్ ఇష్యూ వేగవంతం రైట్స్ ఇష్యూలు వేగంగా పూర్తి చేసేందుకు సెబీ కొత్త నిబంధనలు రూపొందించింది. దీని కింద బోర్డు ఆమోదించిన నాటి నుంచి 23 పనిదినాల్లో రైట్స్ ఇష్యూ ముగుస్తుంది. ప్రస్తుతం 317 రోజుల సమయం తీసుకుంటోంది. ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్‌కు పట్టే 40 రోజుల కంటే కూడా తక్కువ కానుంది. ఇతర నిర్ణయాలు.. » సెకండరీ మార్కెట్లో (నగదు విభాగం) యూపీఐ బ్లాక్ విధానం (ఏఎస్బీఏ) లేదా 3ఇన్1 ట్రేడింగ్ సదుపాయం ద్వారా ఇన్వెస్టర్లు ట్రేడ్ చేసుకోవచ్చు. 2025 ఫిబ్రవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రస్తుతం మాదిరే తమ బ్యాంక్ ఖాతా నుంచి నిధులను ట్రేడింగ్ అకౌంట్‌కు బదిలీ చేసి కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఐపీవో దరఖాస్తుకు ఏఎస్బీఏ విధానం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. » ఆఫ్‌షోర్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్లను (ఎడీఐలు) జారీ చేసే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐలు) సంబంధించి పర్యవేక్షణ యంత్రాంగం ఏర్పాటు కానుంది. ఎఫ్‌పీఐలు తమ నుంచి ఓడీఐలను పొందిన వారి వివరాలను సరిగ్గా అందిస్తున్నాయా? అన్నది ఈ యంత్రాంగం పర్యవేక్షించనుంది. -
బాహు‘బుల్’ ఐపీఓలొస్తున్నాయ్!
ఇప్పటిదాకా వచ్చినవి ఒక రేంజ్.. ఇకపై వచ్చేవి వేరే లెవెల్! అడుగుపెడితే మార్కెట్ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోవాల్సిందే!! ఇప్పటికే సెపె్టంబర్లో ఇన్వెస్టర్లు ఐపీఓల వర్షంలో ముద్దవుతుండగా.. రాబోయే రెండు నెలల్లో బాహుబలి ఆఫర్లు మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. దేశంలో రెండో బడా కార్ల కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా అతిపెద్ద ఇష్యూగా రికార్డు బ్రేక్ చేయనుంది. ఇక ఫుడ్–గ్రాసరీ డెలివరీ దిగ్గజం స్విగ్గీ రెండో మెగా స్టార్టప్ ఆఫర్‌గా నిలవనుంది. ఈ రెండింటికీ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక మెగా ఐపీఓల జాతరకు రంగం సిద్ధమైంది. దక్షిణకొరియా కార్ల దిగ్గజం హ్యుందాయ్ ఐపీఓకు సెబీ తాజాగా ఆమోదం తెలపడంతో పబ్లిక్ ఆఫర్ల (ఐపీఓ) చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ కనీసం 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25,000 కోట్లు) సమీకరించనుంది. హ్యుందాయ్ ఇండియా మాతృ సంస్థ (ప్రమోటర్) హ్యుందాయ్ మోటార్ కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో కొంత వాటాను, అంటే 14.22 కోట్ల షేర్లను విక్రయిచనుంది. తాజా ఈక్విటీ షేర్లు ఏవీ జారీ చేయడం లేదు. ఈ ఇష్యూ పూర్తయితే ఎల్ఐసీ రికార్డును బద్దలవుతుంది. 2022లో ఎల్ఐసీ ఐపీఓ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.21,000 కోట్లను సమీకరించింది. ఇప్పటిదాకా ఇదే దలాల్ స్ట్రీట్‌లో అతిపెద్ద పబ్లిక్ ఆఫర్.రెండు దశాబ్దాల తర్వాత... దేశీ వాహన పరిశ్రమలో ఇదో సరికొత్త మైలురాయిగా నిలవనుంది. 2003లో జపాన్ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ లిస్టింగ్ అయిన రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ దేశీయంగా ఒక కార్ల కంపెనీ ఐపీఓకు వస్తుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. అమ్మకాల పరంగా దేశంలో రెండో అతిపెద్ద కార్ల కంపెనీగా నిలుస్తున్న హ్యుందాయ్ ఇండియా మార్కెట్ క్యాప్ (విలువ) 18–20 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ప్రస్తుతం మారుతీ మార్కెట్ విలువ దాదాపు 48 బిలియన్ డాలర్లు. కాగా, అక్టోబర్‌లో హ్యుందాయ్ ఐపీఓ వస్తుందని సమాచారం. 1996లో భారత్‌లోకి అడుగుపెట్టిన హ్యుందాయ్.. వివిధ కార్ల విభాగాల్లో 13 మోడల్స్ విక్రయిస్తోంది. గత నెలలో ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఐపీఓ ద్వారా రూ.6,145 కోట్ల సమీకరించడంతో పాటు బంపర్ లిస్టింగ్ నేపథ్యంలో హ్యుందాయ్ మెగా ఇష్యూపై ఇన్వెస్టర్లు గురిపెడుతున్నారు. స్విగ్గీ డెలివరీ రెడీ...ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీకి కూడా సెబీ నుంచి ప్రాథమిక ఆమోదం లభించింది. సెబీ కొన్ని మార్పుచేర్పులు సూచించడంతో తుది డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను కంపెనీ త్వరలో దాఖలు చేయనుంది. ఏప్రిల్‌లో వాటాదారుల ఆమోదం ప్రకారం ఈ మెగా ఇష్యూ ద్వారా రూ.10,414 కోట్లను స్విగ్గీ సమీకరించనుంది. ఇందులో రూ.3,750 కోట్లను తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా కంపెనీ సమీకరించనుంది. మిగతా మొత్తాన్ని ప్రస్తుత ఇన్వెస్టర్లు కొంత వాటాను విక్రయించి సొమ్ము చేసుకోనున్నారు. తుది ఆమోదం మేరకు ఇష్యూ సైజు 1.4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.11,700 కోట్లు) ఉండొచ్చని అంచనా. 2014లో ఆరంభమైన స్విగ్గీ ప్రస్తు తం ఫుడ్ డెలివరీతో పాటు క్విక్ కామర్స్ (ఇన్‌స్టామార్ట్), హైపర్ లోకల్ లాజిస్టిక్స్ విభాగాల్లో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ 13 బిలియన్ డాలర్లుగా అంచనా. 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 1.09 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించింది. 4,700 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా, జొమాటో 2021లో బంపర్ లిస్టింగ్‌తో బోణీ చేసింది. రూ.9,375 కోట్లు సమీకరించింది. రూ.76 ఇష్యూ ధర కాగా, 60% ప్రీమియంతో రూ.115 వద్ద లిస్టయింది. రెండేళ్లలో జొమాటో షేరు రూ.46 కనిష్ట స్థాయి నుంచి 520 శాతం (ప్రస్తుత ధర 286) ఎగబాకడం విశేషం. కాగా, స్విగ్గీ ఐపీఓ నవంబర్‌లో ఉండొచ్చనేది మార్కెట్ వర్గాల సమాచారం.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
గోల్డ్ ఈటీఎఫ్‌లు జిగేల్!
ఇన్వెస్టర్లు పుత్తడి పెట్టుబడుల వెంట పడుతున్నారు. భారీగా లాభాలందిస్తున్న సావరీన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ) జారీ నిలిచిపోవడం... తాజా బడ్జెట్లో పన్ను ఊరట.. బంగారం రేట్లు అంతకంతకూ దూసుకుపోతుండటంతో మదుపరులు మళ్లీ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ద్వారా బంగారం కొనుగోళ్లకు సై అంటున్నారు. గత కొంతకాలంగా మెరుపు కోల్పోయిన గోల్డ్ ఈటీఎఫ్‌లు మళ్లీ తళుక్కుమంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా రూ. 6,134 కోట్ల విలువైన పెట్టుబడులు గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి వచి్చనట్లు అంచనా. ఇందులో రూ.4,500 కోట్లు గత నాలుగు నెలల్లోనే మదుపరులు ఇన్వెస్ట్ చేయడం విశేషం. అంతేకాదు, ఒక్క ఆగస్ట్ నెలలోనే మునుపెన్నడూ లేనంత స్థాయిలో రూ.1,611 కోట్ల నిధులు వెల్లువెత్తాయి. బడ్జెట్లో కస్టమ్స్ సుంకాన్ని భారీగా తగ్గించడంతో ఒక్కసారిగా బంగారం రేట్లు రూ. 3,000కు పైగా దిగొచి్చన సంగతి తెలిసిందే. దీంతో పసిడి ప్రియులు పండుగ చేసుకున్నారు. ఆభరణాల కొనుగోళ్లు జోరందుకోవడంతో పాటు అటు డిజిటల్ రూపంలో కూడా ఇన్వెస్టర్లు పెట్టుబడుల స్పీడ్ పెంచారు. ఇదిలాఉంటే, అంతర్జాతీయంగా పుత్తడి సరికొత్త ఆల్‌టైమ్ గరిష్టాలతో దూసుకెళ్తూనే ఉంది. తాజాగా ఔన్స్ రేటు 2,600 డాలర్లను అధిగమించి చరిత్ర సృష్టించింది. దీంతో దేశీయంగానూ సుంకం కోతకు ముందు స్థాయికి, అంటే 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.75,500కు చేరింది. గోల్డ్ బాండ్ల నిలిపివేత ఎఫెక్ట్... గోల్డ్ ఈటీఎఫ్‌లకు ఆదరణ తగ్గేందుకు గోల్డ్ బాండ్లు ప్రధాన కారణం. దేశంలో బంగారం దిగుమతులకు అడ్డుకట్టవేయడం కోసం 2016లో ప్రవేశపెట్టిన ఎస్జీబీ స్కీమ్‌ను ప్రభుత్వం ఈ ఏడాది ఆరంభం వరకు పక్కాగా అమలు చేసింది. క్రమంతప్పకుండా ఎస్జీబీలను జారీ చేస్తూ వచి్చంది. అటు బంగారం ధర భారీగా పెరగడంతో పాటు వార్షికంగా 2.5% వడ్డీ రేటు లభించడం.. 8 ఏళ్ల మెచ్యూరిటీ వరకు పెట్టుబడులను కొనసాగిస్తే మూలధన లాభాల పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు గోల్డ్ బాండ్లపై బాగా ఆసక్తి చూపారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో గడువు తీరిన ఎస్‌జీబీలపై 120 శాతం పైగానే రాబడి లభించడం విశేషం. ప్రస్తుతం ఇంకా రూ.27,000 కోట్ల విలువైన గోల్డ్ బాండ్లు ఇన్వెస్టర్ల వద్ద ఉన్నాయి. అయితే, బంగారం ధర భారీగా పెరిగిపోవడంతో ప్రభుత్వ ఖజానాకు భారంగా మారిన నేపథ్యంలో కేంద్రం కొత్త గోల్డ్ బాండ్ల జారీకి ముఖం చాటేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత మళ్లీ ఆ ఊసే లేదు. దీంతో ఇక ఈ స్కీమ్‌కు ప్రభుత్వం నీళ్లొదిలినట్టేననేది పరిశీలకుల అభిప్రాయం. ఈటీఎఫ్‌ల వైపు చూపు... గడిచిన ఏడాది కాలంలో గోల్డ్ 20 శాతం మేర రాబడులు అందించింది. గోల్డ్ బాండ్ల జారీ నిలిచిపోవడంతో ఇన్వెస్టర్లకు ప్రధానంగా రెండే ఆప్షన్లున్నాయి. ఇప్పటికే ట్రేడవుతున్న గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయడం, లేదంటే గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం. ‘బడ్జెట్లో బంగారం పెట్టుబడులపై సానుకూల పన్ను విధానం, కస్టమ్స్ సుంకం తగ్గింపు, తాజా గోల్డ్ బాండ్ల జారీ లేకపోవడం వంటి కారణాలతో ఇన్వెస్టర్లు మళ్లీ గోల్డ్ ఈటీఎఫ్‌ల బాట పడుతున్నారు’ అని మనీ మంత్ర ఫౌండర్ విరల్ భట్ పేర్కొన్నారు. గోల్డ్ బాండ్ల మెచ్యూరిటీ తర్వాత భారీగా లాభాలను కళ్లజూసిన ఇన్వెస్టర్లు సైతం మళ్లీ ఆ ఆప్షన్ లేకపోవడంతో గోల్డ్ ఈటీఎఫ్‌లకు తిరిగొస్తున్నారని ఫండ్ డి్రస్టిబ్యూటర్లు చెబుతున్నారు. తాజా బడ్జెట్లో బంగారం పెట్టుబడులపై దీర్ఘకాల మూలధన లాభాల పన్ను తగ్గింపు కూడా గోల్డ్ ఈటీఎఫ్‌లకు సానుకూలంగా మారింది. పెట్టుబడిని రెండేళ్లకు పైగా కొనసాగిస్తే 12.5% సుంకం చెల్లిస్తే సరిపోతుంది. గతంలో ఇన్వెస్టర్ల ట్యాక్స్ శ్లాబ్‌ను బట్టి పన్ను విధింపు ఉండేది.రేటు రయ్ రయ్...భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల కోత ఖాయంగా కనిపిస్తుండటంతో బంగారం రేట్లు మరింత ఎగబాకే అవకాశం ఉందనేది ఫండ్ మేనేజర్ల అంచనా. ‘మెరుగైన రాబడుల నేపథ్యంలో పసిడి పెట్టుబడుల ట్రెండ్ కొనసాగనుంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి తోడు పశి్చమాసియాలో యుద్ధ వాతావరణంతో సురక్షిత పెట్టుబడి సాధనమైన పుత్తడిలోకి పెట్టుబడులు పెరిగాయి. సెంట్రల్ బ్యాంకులు సైతం పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటున్నాయి. ఇవన్నీ గోల్డ్ రష్కు మరింత దన్నుగా నిలుస్తున్నాయి’ అని క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ చిరాగ్ మెహతా అభిప్రాయపడ్డారు. -
స్టార్టప్‌ల కోసం ‘భాస్కర్’ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: అంకుర సంస్థలు, ఇన్వెస్టర్లు తదితర వర్గాలకు కేంద్ర హబ్‌గా ఉపయోగపడే భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ (BHASKAR) ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. స్టార్టప్‌లు, మదుపరులు, సర్వీస్ ప్రొవైడర్లు, ప్రభుత్వ శాఖలు పరస్పరం సహకరించుకోవడానికి, ఆలోచనలు పంచుకోవడానికి ఈ పోర్టల్ ఒక వేదికగా ఉపయోగపడగలదని మంత్రి చెప్పారు. ఇందులో రిజిస్టర్ చేసుకునేవారికి ప్రత్యేకంగా భాస్కర్ (BHASKAR) ఐడీ కేటాయిస్తారు. వనరులు, భాగస్వాములు, అవకాశాల వివరాలను యూజర్లు సులువుగా పొందేందుకు, వేగవంతంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడేలా ఇందులో సెర్చ్ ఫీచరును శక్తిమంతంగా తీర్చిదిద్దారు. స్టార్టప్ ఇండియా కింద చేపట్టే అన్ని కార్యక్రమాలు, సంస్థలను ఒకే గొడుగు కిందికి తెచ్చే విధంగా కంపెనీల చట్టంలోని సెక్షన్ 8 కింద లాభాపేక్షరహిత కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. ఇన్వెస్ట్ ఇండియా తరహాలో పరిశ్రమ వర్గాల పర్యవేక్షణలోనే ఉండే ఈ సంస్థలో నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా భాగమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అటు, భాస్కర్ పోర్టల్‌ను మరింత పటిష్టంగా మార్చేందుకు పరిశ్రమవర్గాలన్నీ ముందుకు రావాలని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటియా తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో 1,46,000 పైచిలుకు ప్రభుత్వ గుర్తింపు పొందిన అంకురాలు ఉండగా రాబోయే రోజుల్లో వీటి సంఖ్య 50 లక్షలకు పెంచే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు వివరించారు. వచ్చే ఏడాది జనవరి 16 నాటికి దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక స్టార్టప్ ఉంటుందని భాటియా చెప్పారు. -
‘అలా అయితే.. బంగ్లాకు పెట్టుబడిదారులు వెళ్లరు’
ఢిల్లీ: రాజకీయ సంక్షోభాలతో బంగ్లాదేశ్.. పాకిస్తాన్లా మారితే పొరుగుదేశానికి పెట్టుబడిదారులు వెళ్లకుండా దూరంగా ఉంటారని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ఆయన బుధవారం భారత్ టెక్స్-2025 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ‘భారతదేశానికి పెద్ద కార్మిక మార్కెట్ ఉన్నందున బంగ్లాదేశ్ లేదా వియత్నాం నుంచి భారతీయ వస్త్ర పరిశ్రమ ఎటువంటి సవాలును ఎదుర్కోవడం లేదు. బంగ్లాదేశ్ పాకిస్థాన్‌లా మారితే పెట్టుబడిదారులు అక్కడికి వెళ్లే ముందు ఆలోచిస్తారు. ప్రతి రంగాన్ని ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి అనుసంధానం చేసే యోచనలో ఉన్నాం. మేము మరిన్ని ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం’ అని అన్నారు. భారత్ టెక్స్-2025 కార్యక్రమాలు ఫిబ్రవరి 14 నుంచి 17 తేదీ వరకు భారత్ మైదాన్‌లో జరగనున్నాయి. ఫిబ్రవరి 12 నుంచి 15 తేదీల్లో ఇండియా ఎక్స్పో సెంటర్, మార్ట్‌లో వస్త్రాలు, హస్తకళలు, గార్మెంట్ మెషినరీ, దుస్తులకు సంబంధించిన ఎగ్జిబిషన్ జరగనుంది. -
ఇన్వెస్టర్లను భయపెడుతున్న నాలుగు పదాల ట్వీట్
ఇటీవల కుప్ప కూలిన స్టాక్ మార్కెట్లు ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నడుస్తున్నాయి. ఈ తరుణంలో అమెరికా ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ 'హిండెన్‌బర్గ్ రీసెర్చ్' చేసిన ఓ ట్వీట్ చాలామందిలో ఆందోళన కలిగిస్తోంది. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటి? దాని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో 'సమ్‌థింగ్ బిగ్ సూన్ ఇండియా' అని ట్వీట్ చేసింది. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. హిండెన్‌బర్గ్ మరోసారి భారతీయ మార్కెట్లలో బాంబు పేల్చనుందా.. అని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఏ కంపెనీ మీద నివేదికల విడుదల చేస్తుందో అని చర్చించుకుంటున్నారు.హిండెన్‌బర్గ్ 2023 జనవరిలో అదానీ గ్రూప్ తమ కంపెనీ కంపెనీ షేర్స్ కృత్రిమంగా పెంచినట్లు ఓ నివేదికలో వెల్లడించింది. దీంతో అదానీ గ్రూప్ షేర్స్ ఒక్కసారిగా పడిపోయాయి. ఈ ఆరోపణలు సరైనవి కాదని, అదానీ గ్రూప్ ఖండించింది. ఆ తరువాత ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచడానికి అనేక చర్యలు తీసుకుంది. మొత్తానికి అదానీ గ్రూప్ మళ్ళీ యధాస్థితికి వచ్చింది.ఇప్పుడు హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన నాలుగు పదాల ట్వీట్.. మళ్ళీ అదానీ గ్రూపును ఉద్దేశించి చేసిందా అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఈ ట్వీట్ అంతరార్ధం మాత్రం అవగతం కావడం లేదు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనేది 2017లో ప్రారంభమైన ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ కంపెనీ. ఈ కంపెనీలో ప్రస్తుతం 10మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.Something big soon India— Hindenburg Research (@HindenburgRes) August 10, 2024 -
ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్లు @ 10 కోట్లు
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈ) మరో ఘనతను సాధించింది. రిజిస్టర్డ్ ఇన్వెస్టర్ల సంఖ్య 10 కోట్లను తాకింది. ప్రధానంగా గత ఐదేళ్లలోనే కోటి మంది కొత్తగా రిజిస్టర్ అయ్యారు. వెరసి గత ఐదేళ్లలో రిజిస్టర్డ్ ఇన్వెస్టర్లు మూడు రెట్లు పెరిగారు. డిజిటైజేషన్లో వేగవంత వృద్ధి, ఇన్వెస్టర్లకు అవగాహన పెరుగుతుండటం, నిలకడైన స్టాక్ మార్కెట్ల పురోగతి, ఆర్థిక వృద్ధిలో అందరికీ భాగస్వామ్యం(ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) తదితర అంశాలు ఇందుకు సహకరిస్తున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ పేర్కొంది. గురువారానికల్లా(ఆగస్ట్ 8) యూనిక్ రిజిస్టర్డ్ ఇన్వెస్టర్ల సంఖ్య తాజాగా 10 కోట్ల మైలురాయికి చేరినట్లు వెల్లడించింది. దీంతో మొత్తం క్లయింట్ల ఖాతాల(కోడ్స్) సంఖ్య 19 కోట్లను తాకినట్లు తెలియజేసింది. క్లయింట్లు ఒకటికంటే ఎక్కువ(ట్రేడింగ్ సభ్యులు)గా రిజిస్టరయ్యేందుకు వీలుండటమే దీనికి కారణం. 25ఏళ్లు.. నిజానికి ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్ల సంఖ్య 4 కోట్ల మార్క్‌కు చేరుకునేందుకు 25 ఏళ్లు పట్టింది. 2021 మార్చిలో ఈ రికార్డ్ సాధించగా.. తదుపరి రిజి్రస్టేషన్ల వేగం ఊపందుకోవడంతో సగటున ప్రతీ 6–7 నెలలకు కోటి మంది చొప్పున జత కలిసినట్లు ఎన్ఎస్ఈ తెలియజేసింది. ఈ ట్రెండ్ కొనసాగడంతో గత 5 నెలల్లోనే కోటి కొత్త రిజి్రస్టేషన్లు నమోదైనట్లు వెల్లడించింది. క్లయింట్ల కేవైసీ విధానాలను క్రమబదీ్ధకరించడం, ఇన్వెస్టర్లకు అవగాహనా పెంపు కార్యక్రమాలు, సానుకూల మార్కెట్ సెంటిమెంటు తదితర అంశాలు ఇందుకు తోడ్పాటునిచి్చనట్లు ఎన్ఎస్ఈ బిజినెస్ డెవలప్మెంట్ చీఫ్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ వివరించారు. -
ఒలింపిక్స్ నేర్పించే పెట్టుబడి పాఠాలు
భారత క్రీడాకారులు పతకాల బోణీ కొట్టడంతో దేశీయంగా క్రీడాభిమానులందరికీ ఒలింపిక్స్‌పై ఆసక్తి మరింత పెరిగింది. వివిధ దేశాల క్రీడాకారులు వేర్వేరు అంశాల్లో పోటీపడుతుండటం చూడటానికి ఎంతో ఉత్సాహకరంగా ఉంటుంది. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు క్రీడాకారులు ఎన్నో ఏళ్లుగా ఎలాగైతే సిద్ధమవుతారో, ఇన్వెస్టర్లు కూడా తమ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవడానికి ఏళ్ల తరబడి ప్లానింగ్ చేసుకోవాలి. పొదుపు చేయాలి. వివేకవంతంగా ఇన్వెస్ట్ చేయాలి. మ్యుచువల్ ఫండ్స్‌లో.. అందునా లార్జ్‌క్యాప్స్‌లో దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేయడానికి సంబంధించి ఒలింపిక్స్ మనకేం నేరి్పస్తాయో ఓసారి చూద్దాం. ఒలింపిక్స్, లార్జ్ క్యాప్ మ్యుచువల్ ఫండ్స్ వేర్వేరు ప్రపంచాలుగా అనిపించినా తరచి చూస్తే వాటి మధ్య చాలా సారూప్యతలు కనిపిస్తాయి. సునాయాసమనేది ఓ అపోహ.. లార్జ్ క్యాప్ మ్యుచువల్ ఫండ్స్ ప్రధానంగా దిగ్గజ సంస్థలపైనా, సుదీర్ఘకాలంగా అన్ని రకాల ఆటుపోట్లను తట్టుకుని నిలబడిన కంపెనీలపైనా దృష్టి పెడతాయి. ఈ కంపెనీలన్నీ అగ్రస్థానానికి చేరుకునే క్రమంలో మార్కెట్లను, ప్రోడక్టులను అర్థం చేసుకోవడానికి ఎంతో సమయం వెచ్చించినవై, ఎంతో శ్రమించినవై ఉంటాయి. అనుభవజు్ఞలైన ఒలింపిక్ టీమ్ సభ్యుల్లాగే లార్జ్ క్యాప్ కంపెనీలు నేడు సునాయాసంగా ఉన్నట్లుగా కనిపించడం వెనుక ఎంతో శ్రమ దాగి ఉంటుంది. వాటి ఆదాయాలు స్థిరంగా వృద్ధి చెందుతుంటాయి. పటిష్టమైన బ్రాండ్ గుర్తింపు ఉంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మారేందుకు పుష్కలంగా వనరులు ఉంటాయి. అనేక విజయాలు సాధించి అపార అనుభవం ఆర్జించిన ఒలింపిక్స్ టీమ్ ఎలాగైతే అసాధారణ పరిస్థితుల్లోనూ పట్టు తప్పకుండా నిలదొక్కుకోగలదో ఈ కంపెనీలు కూడా కఠిన పరిస్థితుల్లోనూ తీవ్ర హెచ్చుతగ్గులకు లోను కావు. దృఢసంకల్పంతో విజయానికి బాటలు.. మారథాన్ రేసులో తలెత్తే అలసట, అనూహ్య పరిస్థితులను శారీరకంగా, మానసికంగా ఎలా ఎదుర్కొనాలనేది బాగా తెలిసి, తగు వ్యూహాలను రూపొందించుకున్న మారథానర్ గురించి ఒక్కసారి ఊహించుకోండి. సాధారణంగా అమెచ్యూర్ మారథానర్ ప్రారంభంలో కొన్ని మైళ్లు అలవోకగా పరుగెత్తవచ్చు. కానీ ఆ తర్వాత కూడా అలాగే కొనసాగిస్తే కాళ్లు సహకరించవు. ఊపిరి ఆడదు. సరైన యాటిట్యూడ్, మానసిక శిక్షణ లేకపోతే ఆ దశలో ఆగిపోవాల్సి వస్తుంది. కానీ అనుభవజూ్ఞలైన ఒలింపిక్ క్రీడాకారులు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కఠిన శిక్షణ పొందినందున ముందుకు సాగిపోతారు. లార్జ్ క్యాప్ కంపెనీలు కూడా అచ్చంగా అలాంటివే. అవి గతంలో మార్కెట్లో హెచ్చుతగ్గులు ఎన్నింటినో చూసి ఉంటాయి. మారిపోతున్న వినియోగదారుల డిమాండ్లకు అనుగుణంగా తమను తాము మలుచుకున్నవై ఉంటాయి. తాత్కాలిక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనగలిగే ఆర్థిక సామర్థ్యాలు కలిగి ఉన్నవై ఉంటాయి. తుపానులు ఎదురైతే ఎలా బైటపడాలన్నది ఈ కంపెనీలకు బాగా తెలిసి ఉంటుంది. డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు ప్రపంచం నలుమూలల నుంచి అథ్లెట్లు.. ఒలింపిక్స్‌లో వివిధ విభాగాల్లో పోటీపడతారు. 2024 ఒలింపిక్స్‌లో 39 స్పోర్ట్స్వ్యాప్తంగా 329 ఈవెంట్లు ఉన్నాయి. తొలిసారిగా బ్రేక్డ్యాన్సింగ్కు కూడా చోటు కల్పించారు. లార్జ్ క్యాప్ మ్యుచువల్ ఫండ్స్‌లోను ఇలాంటి వైవిధ్యం ఉంటుంది. వివిధ ఈవెంట్లలో పాల్గొనడం వల్ల పతకాలు గెల్చుకునే అవకాశాలు ఎలాగైతే మెరుగుపడతాయో వివిధ రంగాలవ్యాప్తంగా పలు కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లార్జ్ క్యాప్ ఫండ్స్ రిసు్కలను తగ్గించుకుని మెరుగైన రాబడులు అందించేందుకు ఉపయోగకరంగా ఉంటాయి.సురేశ్ సోని - సీఈవో, బరోడా బీఎన్పీ పారిబా అసెట్ మేనేజ్మెంట్ ఇండియా -
ఈ వారం ఐపీఓల ఇన్వెస్టర్లకు పండగే
-
పరిమిత శ్రేణిలోనే కదలికలు
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలోనూ పరిమిత శ్రేణిలో కదలాడొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. డెరివేటివ్ కాంట్రాక్టుల నెలవారీ గడువు గురువారం(జూన్ 27)తో పూర్తి కానుండడం కూడా మార్కెట్లో ఊగిసలాట ఉండొచ్చంటున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు సూచీలకు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. వీటితో పాటు రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. ‘‘స్టాక్ మార్కెట్లో బుల్లిష్ సెంటిమెంట్ ఉన్నప్పట్టకీ., కొనుగోళ్లు చేసేందుకు గానీ, అమ్మకాలు జరిపేందుకు గానీ ప్రేరేపించే అంశాలేవీ లేనందున సూచీలు పరిమిత శ్రేణిలో చలించవచ్చు. అలాగే బడ్జెట్ అంచనాల వార్తలకు అనుగుణంగా బడ్జెట్ ఆధారిత రంగ షేర్లలో మూమెంటమ్ అధికంగా ఉండొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ 23,400 – 23,700 శ్రేణిలో దిద్దుబాటు ఉండొచ్చు. దిగువ స్థాయిలో 23,300–23,200 పరిధిలో తక్షణ మద్దతు నెలకొని ఉంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ సాంకేతిక నిపుణులు ప్రవేశ్ గౌర్ తెలిపారు. ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగే గతవారంలో సెన్సెక్స్ 217 పాయింట్లు, నిఫ్టీ 36 పాయింట్లు లాభపడ్డాయి. జీఎస్టీ కౌన్సిల్ సమావేశ నిర్ణయాల ప్రభావం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శనివారం జరిగిన 53వ జీఎస్టీ పాలక మండలి సమావేశ నిర్ణయాలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. ముఖ్యంగా ఎరువులపై జీఎస్టీ 18% నుంచి 5 శాతానికి తగ్గింపు ప్రతిపాదనను మంత్రుల బృందానికి (జీవోఎం) సిఫార్సు చేయడంతో ఫెర్టిలైజర్లలో కదలికలు ఉండొచ్చు. అలాగే, ఈ సమావేశంలో ఆన్లైన్ గేమింగ్‌పై జీఎస్టీకి సంబంధించి ఎటువంటి చర్చ జరగకపోవడంతో ఆన్లైన్ గేమింగ్ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనుకావచ్చు. విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయ్ విధాన సంస్కరణలు, ఆర్థిక వృద్ధి కొనసాగింపుపై అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్లో క్రమంగా పెట్టుబడులు పెంచుకుంటున్నారు. ఈ జూన్ ఇప్పటివరకు(జూన్ 21 నాటికి) నికరంగా రూ.12,170 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఫైనాన్సియల్ సరీ్వసెస్, టెలికం, రియల్టీ షేర్ల పట్ల ఆసక్తి కనబరిచారు. ఎఫ్ఎంసీజీ, ఐటీ, మెటల్, అయిల్‌అండ్‌గ్యాస్ షేర్లను విక్రయించారు. ఇక డెట్ మార్కెట్ లో రూ.10,575 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేశారు. ‘‘కేంద్రం వృద్ధికి మద్దతనిచ్చే బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చనే ఆశలు ఎఫ్ఐఐలను కొనుగోళ్లకు ప్రేరేపిస్తున్నాయి. అయినప్పట్టకీ దేశీయ ఈక్విటీ మార్కెట్ వాల్యుయేషన్లు భారీ పెరిగాయనే నెపంతో ఎఫ్ఐఐలు ఆచితూచి కొనుగోళ్లు చేస్తున్నారు’’ అని మార్నింగ్స్టాక్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవత్సవ తెలిపారు. ఇక మేలో ఎఫ్‌పీఐలు ఈక్విటీల నుండి రూ. 25,586 కోట్లను ఉపసంహరించుకున్నారు, ఏప్రిల్‌లో రూ. 8,700 కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు. అదే మార్చిలో రూ.35,098 కోట్లు, ఫిబ్రవరిలో రూ.1,539 కోట్లు నికర పెట్టుబడి పెట్టారు. రెండు ఐపీఓలు, 2 లిస్టింగులు రెండు కంపెనీలు ఈ వారంలో నిధుల సమీకరణకు రానున్నాయి. ఆఫీసర్స్ చాయిస్ విస్కీ తయారీ కంపెనీ అలైడ్ బ్లెండర్స్ పబ్లిక్ ఇష్యూ మంగళవారం( 25న) ప్రారంభమై, గురువారం (జూన్ 27న) ముగియనుంది. తద్వారా రూ.1,500 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 26న ప్రారంభంకానుంది. 28న ముగియనున్న ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 171 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇదే వారంలో డీఈఈ డెవలప్మెంట్ ఇంజినీర్స్ షేర్లు మంగళవారం, ఆక్మే ఫిన్‌ట్రేడ్ షేర్లు శుక్రవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం అమెరికా మార్చి త్రైమాసిక జీడీపీ వృద్ధి గణాంకాలు గురువారం, అదే రోజు యూరోజోన్ జూలై కన్జూమర్ కాని్ఫడెన్స్ డేటా, జపాన్ మే రిటైల్ అమ్మక గణాంకాలు విడుదల కానున్నాయి. మరుసటి రోజు(శుక్రవారం) చైనా మార్చి క్వార్టర్ కరెంట్ ఖాతా లోటు, జపాన్ మే నిరుద్యోగ గణాంకాలు, బ్రిటన్ క్యూ1 జీడీపీ వృద్ధి డేటా వెల్లడి కానున్నాయి. భారత మే నెల వాణిజ్య లోటు, మౌలిక రంగ వృద్ధి, మార్చి త్రైమాసిక కరెంటు ఖాతా లోటు (సీఏడీ), విదేశీ కరెన్సీ రుణ గణాంకాలు శుక్రవారం విడుదల కానున్నాయి. -
నాలుగేళ్లలో 50వేల కోట్ల లాభాలు: నితిన్ కామత్ ట్వీట్ వైరల్
దేశంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తరువాత మార్కెట్ వేగంగా పుంజుకుంటోంది. కరోనా మహమ్మారి భారతదేశంలో వ్యాపించిన తరువాత చాలామంది స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేశారు. ఆ తరువాత అనుకున్నంత లాభాలు లాలేదు, కానీ ఇటీవల కొన్ని సంస్థలు ఏకంగా కోట్ల రూపాయల లాభాలను ఆర్జించాయి. ఇందులో ఒకటి జెరోధా కంపెనీ.జెరోధా కంపెనీ కో ఫౌండర్ నితిన్ కామత్ ఈ సందర్భంగా తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఈక్విటీ పెట్టుబడిదారులు గత నాలు సంవత్సరాల్లో రూ. 50,000 కోట్ల లాభాలను సాధించారు. రూ. 4,50,000 కోట్ల ఏయూఎంలో రూ. 1,00,000 కోట్ల లాభాలను పొందినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నితిన్ కామత్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.ఇక మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 4 పాయింట్లు లాభపడి 23,264 వద్దకు చేరింది. సెన్సెక్స్ 33 పాయింట్లు నష్టపోయి 76,456 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో ఎల్ అండ్ టీ, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫిన్సర్వ్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.Equity investors @zerodhaonline have realized a profit of Rs 50,000 crores over the last 4+ years and are sitting on unrealized profits of Rs 1,00,000 crores on an AUM of Rs 4,50,000 crores. By the way, most of the AUM was added in the last four years. pic.twitter.com/4X981aY2jH— Nithin Kamath (@Nithin0dha) June 11, 2024 -
గోల్డ్ బాండ్లకు ఇన్వెస్టర్ల ఆదరణ...
న్యూఢిల్లీ: 2023–24 ఆర్థిక సంవత్సరంలో సావరిన్ గోల్డ్ బాండ్లలో ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ భారీగా పెరిగి రూ.27,031 కోట్లకు చేరింది. పరిమాణంలో ఈ విలువ 44.34 టన్నులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. 2022–23లో ఈ విలువ, పరిమాణం వరుసగా రూ.6,551 కోట్లు, 12.26 టన్నులుగా ఉంది. అధికారిక సమాచారం ప్రకారం.. 2015లో ఈ పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి 67 విడతల్లో విక్రయాలు జరిగాయి. రూ.72,274 కోట్లు సమకూరగా, పరిమాణంలో 146.96 టన్నులకు ఈ విలువ ప్రాతినిధ్యం వహిస్తోంది. వార్షికంగా పసిడి ధర 10 గ్రామలుకు (పూర్తి స్వచ్ఛత) రూ.62,300 నుంచి రూ.73,200కు ఎగసింది. -
సెన్స్‌క్స్ డౌట్!
మళ్లీ వచ్చేది మోదీయే... ఈసారి ఎన్డీయే కూటమికి 400 పై చిలుకు సీట్లు పక్కా... బీజేపీకి కనీసం 370 సీట్లు ఖాయం... కమలనాథుల అంచనాలివి! తీరా ఎన్నికలు మొదలై ఒక్కో విడత పోలింగ్ ముగుస్తున్నకొద్దీ ఈ ఉత్సాహం మెల్లమెల్లగా నీరుగారుతోంది. నాలుగు విడతల్లోనూ పోలింగ్ గత ఎన్నికలతో పోలిస్తే తగ్గడంతో అధికార పార్టీలో కాస్త అలజడి మొదలైంది. ఇదే మూడ్ స్టాక్ మార్కెట్లోనూ ప్రతిబింబిస్తోంది. ఓటింగ్ తగ్గడంతో బీజేపీ సొంతంగా మేజిక్ ఫిగర్‌ను అందుకుంటుందో లేదోనన్న అనుమానాలు తలెత్తడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం దెబ్బతింది. రోజుకో కొత్త రికార్డులతో రంకెలేసిన బుల్ ఒక్కసారిగా రివర్స్ గేర్ వేసింది. ఎన్నికల ‘వేడి’కి తికమకపడుతోంది. నిన్నమొన్నటిదాకా పెట్టుబడుల వరద పారించిన విదేశీ ఇన్వెస్టర్లు పొలోమంటూ అమ్మకాలకు తెగబడుతున్నారు. అయి తే ఫలితాలపై అనిశ్చితి వల్లే సెంటిమెంట్‌పై ప్రభావం పడుతోందని, బీజేపీ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇన్వెస్టర్లు తరలివస్తారని నిపుణులు పేర్కొంటున్నారు... స్టాక్ మార్కెట్లో ఈసారి ఎన్నికల ముందస్తు ర్యాలీతో రికార్డుల మోత మోగింది. మోదీ 3.0పై నమ్మకానికి తోడు ఎన్డీయే సీట్ల సంఖ్య కూడా పెరుగుతుందన్న అంచనాలు దీనికి కారణం. అయితే, ఎన్నికల ‘వేడి’ జోరందుకుని, పోలింగ్ మొదలయ్యాక ఇన్వెస్టర్లలో నెమ్మదిగా నమ్మకం సడలుతూ వస్తోంది. ఇప్పటిదాకా పోలింగ్ పూర్తయిన నాలుగు విడతల్లోనూ గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గడం దీనికి ఆజ్యం పోసింది. మండుటెండలు, పట్టణ ఓటర్ల నిరాసక్తత వంటి కారణాలు ఎన్నున్నా ... ఓటింగ్ పడిపోవడంతో ఫలితాల్లో బీజేపీ బంపర్ విక్టరీపై అనుమానాలు ఇన్వెస్టర్లలో గుబులు పుట్టిస్తున్నాయి. ఇటీవలే సెన్సెక్స్ (75,111 పాయింట్లు), నిఫ్టీ (22,795 పాయింట్లు) కొత్త ఆల్‌టైం గరిష్టాలను తాకిన తర్వాత భారీగానే క్షీణించాయి. గడచిన నెల రోజుల్లో సూచీలు దాదాపు 3 శాతం పైగానే పడటం దీనికి అద్దం పడుతోంది. గత ఎన్నికల్లో తొలి విడతల్లో పోలింగ్ తగ్గినా, క్రమంగా పుంజుకుంది. దాంతో మొత్తమ్మీద రికార్డు స్థాయిలో 67.4 శాతం ఓటింగ్ జరిగింది. బీజేపీ సొంత బలం కూడా 282 నుంచి 303 లోక్‌సభ స్థానాలకు ఎగబాకింది. ఈసారి మాత్రం తొలి విడత నుంచే ఓటింగ్ క్రమంగా తగ్గముఖం పడుతూ వస్తోంది. మిగతా 3 విడతల్లోనూ ఇలాగే మందకొడిగా జరిగితే మొత్తం ఓటింగ్ గతం కంటే 2 నుంచి 3 శాతం తగ్గేలా కని్పస్తోంది.విదేశీ ఇన్వెస్టర్లు పీఛే ముడ్... ఓటింగ్ శాతం తగ్గుతుండటం, ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి నెలకొనడంతో విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ)లో కూడా ఆందోళన మొదలైంది. మన ఈక్విటీ మార్కెట్లలో గత నెలన్నరలో రూ.30 వేల కోట్లకు పైగా విలువైన షేర్లను అమ్మేయడం దీనికి నిదర్శనం. మార్కెట్లు భారీగా పడటానికి ఎఫ్‌పీఐల విక్రయాలే కీలకంగా నిలుస్తున్నాయి. 2023లో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఏకంగా రూ.1.77 లక్షల కోట్లను దేశీ మార్కెట్లో కుమ్మరించి రికార్డులు బద్దలుకొట్టారు. అంతేకాదు, ఇందులో దాదాపు మూడో వంతు (రూ.58 వేల కోట్లు) ఒక్క డిసెంబర్లోనే ఇన్వెస్ట్ చేయడం విశేషం. దీనికి తోడు దేశీ ఇన్వెస్టర్లు, ఫండ్స్ జోరుతో బుల్ రంకెలేసింది. గతేడాది సెన్సెక్స్, నిఫ్టీ 20 శాతం రాబడులు అందించాయి. కార్పొరేట్ కంపెనీల లాభాలు పుంజుకోవడం, ప్రభుత్వ పెట్టుబడుల జోరు, స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండటం, వృద్ధి రేటు పుంజుకోవడం, సుస్థిర ప్రభుత్వం, స్థిరమైన పాలసీలు తదితర కారణాలతో విదేశీ ఇన్వెస్టర్లకు భారత్ ఆకర్షణీయ గమ్యస్థానంగా నిలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల విషయానికొస్తే, 2014లో ఎన్నికలు జరిగిన ఏప్రిల్–మే నెలల్లో విదేశీ ఇన్వెస్టర్లు రూ.23,607 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. 2019 ఇదే కాలంలో రూ.29,113 కోట్లు దేశీ మార్కెట్లో కుమ్మరించారు. దీంతో 2019లో నాలుగో దశ పోలింగ్ ముగిసే నాటికి నెల రోజుల్లో సెన్సెక్స్ 3.7 శాతం, నిఫ్టీ 2.2 శాతం చొప్పున ఎగబాకాయి. ఈసారి మాత్రం ట్రెండ్ దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఒకపక్క విదేశీ ఇన్వెస్టర్లు తిరోగమన బాట పట్టగా.. దేశీయంగానూ ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటం మార్కెట్‌కు ప్రతికూలంగా మారింది.విదేశీ మార్కెట్లు రయ్ రయ్ ఉక్రెయిన్–రష్యా యుద్ధం, మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల వంటి భౌగోళిక రాజకీయ అనిశ్చితుల ప్రభావం కంటే, ఎన్నికల ప్రభావమే మన మార్కెట్లో ప్రధానంగా కనిపిస్తోంది. విదేశీ మార్కెట్లు గత నెల రోజుల్లో భారీగా పెరిగినప్పటికీ.. మన సూచీలు ఆ స్థాయిలో పెరగకపోగా, 3 శాతం మేర పడిపోవడం దీనికి నిదర్శనం. గత నెల రోజుల వ్యవధిలో హాంకాంగ్ హాంగ్‌సెంగ్ ఇండెక్స్ ఏకంగా 15.2 శాతం జంప్ చేసింది. బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ సూచీ 6 శాతం, యూఎస్ డోజోన్స్ 4.7 శాతం, జర్మనీ డాక్స్ సూచీ 4.1 శాతం, చైనా షాంఘై ఇండెక్స్ 3 శాతం చొప్పున ఎగబాకాయి. ‘‘ఎన్నికల ఫలితాలపై అనుమానంతోనే విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాట పట్టారు. ఓటింగ్ శాతం భారీగా తగ్గితే, బీజేపీ అంచనాలు తారుమారు కావచ్చు. ఆ పార్టీ సాధించే సీట్లు గణనీయంగా తగ్గే అవకాశముంది. మిగతా విడతల ఓటింగ్‌పై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారు. తదనుగుణంగానే మార్కెట్ల గమనం ఉంటుంది’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. ఎందుకీ ఆందోళన...బీజేపీకి గనుక సొంతంగా మెజారిటీ రాకపోతే ఎన్డీఏ పక్షాలపై పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీనివల్ల ప్రాంతీయ పార్టీల డిమాండ్లకు తలొగ్గడం, బుజ్జగింపులు తదితరాలతో విధాన నిర్ణయాలపై ప్రభావం పడుతుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేగాక కీలక బిల్లుల ఆమోదం విషయంలో ఇప్పుడున్న స్వేచ్ఛ లేకపోవడం కూడా అటు ఆర్థిక వ్యవస్థకు, ఇటు మార్కెట్లకు ప్రతికూలాంశం. చివరి మూడు విడతల్లో భారీగా ఓటర్లు పోటెత్తితే తప్ప ప్రస్తుత ఓటింగ్ శాతం ప్రకారం చూస్తే బీజేపీకి సొంతంగా 370, ఎన్డీఏ కూటమికి 400 పై చిలుకు సీట్ల లక్ష్యం నెరవేరే అవకాశాలు లేనట్టే. అంతేగాక గతంలో మాదిరిగానైనా రాకుండా బీజేపీ ఏ 260 సీట్ల దగ్గరో ఆగిపోతే మళ్లీ సంకీర్ణ లుకలుకలు తలెత్తే ఆస్కారం లేకపోలేదు. ఇవన్నీ మార్కెట్లకు రుచించని విషయాలే. విదేశీ ఇన్వెస్టర్లలో ఇలాంటి భయాలే నెలకొన్నాయిప్పుడు! అందుకే ప్రస్తుతానికి కొన్ని పొజిషన్లను తగ్గించుకుని, ఫలితాల తర్వాత పరిస్థితులను బట్టి మళ్లీ ఇన్వెస్ట్ చేయొచ్చనే భావన వారిలో కనబడుతోందని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. సూచీల తాజా పతనంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం స్పందించారంటే, ఇన్వెస్టర్లలో ఆందోళన అధికార పక్షాన్ని కూడా బాగానే కలవరపెడుతోందని పరిశీలకులు చెబుతున్నారు. ‘గతంలో కూడా మార్కెట్లు గట్టిగా పడిన సందర్భాలున్నాయి. కాబట్టి స్టాక్ మార్కెట్ కదలికలను నేరుగా ఎన్నికలకు ముడిపెట్టకూడదు. తాజా ఒడిదుడుకులకు ‘కొన్ని వదంతులు’ ఆజ్యం పోసి ఉండొచ్చు. నా అభిప్రాయం ప్రకారం జూన్ 4కు ముందే షేర్లు కొనుక్కోండి. ఫలితాల తర్వాత మార్కెట్ దూసుకెళ్తుంది’ అని అమిత్ షా తాజాగా వ్యాఖ్యానించారు.2004లో 20% క్రాష్ఎన్నికల ముందస్తు పరిస్థితులతో సంబంధం లేకుండా గత నాలుగు ఎన్నికల్లోనూ ఫలితాల తర్వాత సెస్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలనే అందించాయి. అయితే 2004 ఎన్నికల్లో వాజ్‌పేయి సర్కారు అనూహ్య ఓటమి చవిచూడటం, హంగ్ కారణంగా ఫలితాల తర్వాత 20 శాతం మార్కెట్ క్రాష్ అయింది! కానీ మన్మోహన్ సింగ్ ప్రధానిగా యూపీఏ ప్రభుత్వం కొలువుదీరాక మార్కెట్ విశ్వాసం పుంజుకుంది. మిగతా ఏడాది కాలంలో రాబడులు దండిగానే వచ్చాయి. 2009 ఫలితాల తర్వాత మే 18 నుంచి డిసెంబర్ వరకు 31 వరకు సెన్సెక్స్, నిఫ్టీ ఏకంగా 40 శాతం దూసుకెళ్లడం విశేషం. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు జోరుకు తోడు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వరద, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అమెరికాలో సహాయక ప్యాకేజీలు కూడా దోహదం చేశాయి. 2019 ఎన్నికల తర్వాత మాత్రం మార్కెట్లు ఏమంత పెద్దగా పెరగలేదు. ప్రపంచ మార్కెట్లలో అనిశి్చతి, అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం, బలహీన వృద్ధి రేటు వంటి ప్రభావాలతో 4 నుంచి 5 శాతం మాత్రమే రాబడులొచ్చాయి. అధికార పక్షం గెలుపు అంచనాలు తప్పొచ్చనే ఆందోళనల వల్లే దేశీ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు వస్తున్నాయి. ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బీజేపీకి సీట్లు భారీగా తగ్గినా, సొంతంగా మెజారిటీ రాకపోయినా, ఫలితాల రోజున మార్కెట్ నుంచి తీవ్ర ప్రతిస్పందన ఉండొచ్చు. ఫలితా లొచ్చేదాకా∙ఇదే అలజడి ఉంటుంది– మాధవీ అరోరా, ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ ముఖ్య ఆర్థికవేత్త– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇన్వి ట్స్‌లో పెట్టుబడులు జూమ్..
న్యూఢిల్లీ: ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (ఇన్వి ట్స్), రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులపై (రీట్స్) మదుపుదార్ల ఆసక్తి పెరుగుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వీటిలో రూ. 17,116 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. స్థిరమైన రాబడులు అందిస్తుండటంతో ఈ సాధనాల్లో పెట్టుబడులు 14 రెట్లు పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రైమ్ డేటాబేస్డాట్కామ్ క్రోడీకరించిన గణాంకాల ప్రకారం 2023–24లో రీట్స్, ఇన్వి ట్స్ రూ. 17,116 కోట్లు సమీకరించాయి. 2022–23లో ఇది రికార్డు కనిష్ట స్థాయి రూ. 1,166 కోట్లుగా నమోదైంది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా ఒక ఇన్వి ట్ ఓఎఫ్ఎస్ (ఆఫర్ ఫర్ సేల్) కూడా చేపట్టింది. డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ సంస్థ ఓఎఫ్ఎస్ మార్గంలో రూ. 2,071 కోట్లు సమీకరించింది. సెబీ ఇటీవల నిబంధనలను సవరించిన నేపథ్యంలో ఈ విభాగం ఏయూఎం (నిర్వహణలోని ఆస్తులు) 500 మిలియన్ డాలర్ల స్థాయి నుంచి 2030 నాటికి 5 బిలియన్ డాలర్లకు చేరవచ్చని వైజ్ఎక్స్ సీఈవో ఆర్యమాన్ వీర్ తెలిపారు. కొత్తగా వచ్చే పెట్టుబడుల్లో 75 శాతం వాటాతో రహదారుల రంగం ప్రధాన లబి్ధదారుగా ఉండగలదని పేర్కొన్నారు. -
ఫెడ్ నిర్ణయాలకు ఎదురుచూపు
ముంబై: అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం ప్రారంభం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించడంతో దేశీయ స్టాక్ సూచీలు సోమవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. అయితే రిలయన్స్ (1.45%)తో పాటు మెటల్, ఇంధన, ఆటో షేర్లూ రాణించడంతో స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్‌లో 672 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 105 పాయింట్ల లాభంతో 72,748 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 207 పాయింట్ల రేంజ్లో 22,124 వద్ద గరిష్టాన్ని, 21,917 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 32 పాయింట్లు పెరిగి 22,056 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు ప్రారంభంలోనే నష్టాల్లోకి జారుకున్నాయి. మిడ్ సెషన్ తర్వాత ఇటీవల దిగివచి్చన నాణ్యమైన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ,, ప్రైవేటు బ్యాంకులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇక బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ స్వల్పంగా 0.4% లాభపడగా, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.7% నష్టపోయింది.