న్యూఢిల్లీ: నివాస రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో సంస్థాగత ఇన్వెస్టర్ల (ఇనిస్టిట్యూషనల్) పెట్టుబడులు సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో భారీగా పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన పెట్టుబడులు 174 మిలియన్ డాలర్లు (రూ.1,444 కోట్లు)తో పోల్చి చూస్తే, 71 శాతం వృద్ధితో 298 మిలియన్ డాలర్లు (రూ.2,473కోట్లు)గా నమోదయ్యాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది.
భారత రియల్ ఎస్టేట్ పరిశ్రమ మొత్తం మీద సెపె్టంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 679.9 మిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులను ఆకర్షించినట్టు ఈ నివేదిక వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వచి్చన 374 మిలియన్ డాలర్లతో పోల్చి చూసినప్పుడు 82 శాతం వృద్ధి నమోదైంది. అగ్రగామి సంస్థలు ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని కోరుతున్నాయని వెస్టియన్ సీఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఇది ఆఫీస్ వసతులకు డిమాండ్‌ను పెంచుతుందన్నారు.
ఫలితంగా రానున్న త్రైమాసికాల్లో పెట్టుబడులు పెరగొచ్చని అంచనా వేశారు. సెపె్టంబర్ త్రైమాసికంలో వచ్చిన సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో 71 శాతం దేశీ ఇన్వెస్టర్లు సమకూర్చినవి. విదేశీ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి 27 శాతం పెట్టుబడులు వచ్చాయి. సెపె్టంబర్ క్వార్టర్‌లో అత్యధికంగా ఇనిస్టిట్యూషనల్ పెట్టుబడులను నివాస ప్రాజెక్టులే దక్కించుకున్నాయి. వీటి వాటా 44 శాతంగా ఉంది. వాణిజ్య రియల్ ఎస్టేట్ ఆస్తుల్లోకి 24 శాతం పెట్టుబడులు వెళ్లాయి. ఆఫీస్ ఆస్తులు 164 మిలియన్ డాలర్లు, ఇండ్రస్టియల్ వేర్‌హౌసింగ్ ఆస్తులు 190 మిలియన్ డాలర్ల చొప్పున సంస్థాగత పెట్టుబడులను ఆకర్షించాయి.
Comments
Please login to add a commentAdd a comment