Residential
-
ప్రాపర్టీ సందర్శన సేవలు ప్రారంభం
రియల్టీ రంగంలో ఆన్లైన్ సేవలందిస్తున్న టైమ్స్ గ్రూప్ ఆధ్వర్యంలోని మ్యాజిక్‌బ్రిక్స్ సంస్థ తన వినియోగదారులకు మెరుగైన సర్వీసు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ప్రాపర్టీ కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన వినియోగదారులు మరింత సమర్థంగా నిర్ణయం తీసుకునేందుకు వీలుగా హైదరాబాద్‌లో ప్రాపర్టీ సందర్శనను ప్రారంభించింది. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రాపర్టీ కొనుగోలు చేయాలంటే చాలామందికి అనుమానాలుంటాయి. కాబట్టి నేరుగా ప్రాపర్టీ సందర్శించి నిర్ణయం తీసుకునేందుకు మ్యాజిక్స్బ్రిక్స్ తన ప్లాట్‌ఫామ్ ద్వారా అవకాశం కల్పిస్తుంది.మ్యాజిక్ బ్రిక్స్ 100కుపైగా బిల్డర్లతో కలిసి హైదరాబాద్‌లో సైట్ విజట్ ప్రోడక్ట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది. ఇప్పటికే బెంగళూరులో ఉన్న ఈ సర్వీసును విస్తరించినట్లు ప్రకటించింది. ఔరా రియల్టీ, విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్, ఎలిగెంట్ ఇన్ఫ్రా, అపర్ణ కన్స్ట్రక్షన్స్ వంటి ప్రముఖ సంస్థలతో సహా 100కు పైగా డెవలపర్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆరునెలల్లో 120కి పైగా ప్రాజెక్టుల్లో 8,200 కంటే ఎక్కువ సైట్ సందర్శనలను అందించినట్లు తెలిపింది. వినియోగదారులు సగటున రూ.1.25 కోట్లతో 450 కంటే ఎక్కువ విలువైన ఇళ్లు బుక్ చేసుకున్నట్లు వివరించింది.ఇదీ చదవండి: పది పాసైన మహిళలకు ఎల్ఐసీ ఉపాధి అవకాశంఈ కార్యక్రమానికి సంబంధించి మ్యాజిక్ బ్రిక్స్ సీఈఓ సుధీర్ పాయ్ మాట్లాడుతూ..‘సాధారణంగా పండగ సీజన్ తరువాత డిసెంబరులో నివాస కొనుగోళ్లు తగ్గుతాయి. అయితే గత 2-3 సంవత్సరాలుగా ఇంటి యజమానుల ఆకాంక్ష మేరకు డిమాండ్ బలంగానే ఉంటుంది. ఇళ్లు కొనాలని ఆసక్తి ఉన్నవారు పండగలు, ప్రత్యేక రోజులకు అతీతంగా కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రాపర్టీ విజిట్ ఫెస్ట్‌కు మంచి స్పందన ఉంది. కొంతమంది కొనుగోలుదారులతో ఒకే రోజులో 4-5 ప్రాపర్టీలను సందర్శించడం వల్ల నిర్ణయాలు తీసుకునే సమయాన్ని దాదాపు 50% తగ్గించేందుకు వీలవుతుంది. రియల్టీ రంగంలో టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలకు అందిస్తూ మెరుగైన సేవలు అందుబాటులో ఉంచుతున్నాం’ అన్నారు. -
హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు డౌన్.. కారణం ఏంటో తెలుసా?
న్యూఢిల్లీ: సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల మార్కెట్ కొంత నీరసించింది. హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 19 శాతం క్షీణించగా, దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో సగటున 5 శాతం మేర విక్రయాలు తగ్గాయి. ఎనిమిది పట్టణాల్లో 96,544 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 1,01,221 యూనిట్లుగా ఉన్నాయి. కొత్త ఇళ్ల ఆవిష్కరణలు (తాజా సరఫరా) సెప్టెంబర్ త్రైమాసికంలో 25 శాతం తక్కువగా 91,863 యూనిట్లుగానే ఉన్నాయి. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్ విడుదల చేసింది. నూతన ఇళ్ల సరఫరా తగ్గడానికి తోడు, ధరలు పెరగడం విక్రయాలు క్షీణించడానికి కారణమని ఈ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా ఎనిమిది పట్టణాల్లో ఇళ్ల ధరలు 20 శాతం పెరగడంతో ధరల అందుబాటుపై ప్రభావం చూపించినట్టు వివరించింది. పట్టణాల వారీగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ కాలంలో హైదరాబాద్‌లో 11,564 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 14,191 యూనిట్లుగా ఉండడం గమనార్హం. అంటే 19 శాతం క్షీణత కనిపిస్తోంది. బెంగళూరులోనూ 11% తక్కువగా 11,160 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. చెన్నైలో 8 శాతం తక్కువగా 3,560 యూనిట్లు అమ్ముడయ్యాయి. కోల్‌కతాలో అమ్మకాలు 2,796 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలం అమ్మకాలతో పోల్చి చూస్తే 22 శాతం తగ్గాయి. చదవండి: ఇల్లు పూర్తయినా.. ఈ అనుభవం మీకూ ఎదురైందా?ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో అమ్మకాలు ఒక శాతం తక్కువగా 30,010 యూనిట్లుగా నమోదయ్యాయి. పుణెలోనూ విక్రయాలు 3 శాతం తగ్గి 18,004 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో మాత్రం ఇళ్ల అమ్మ కాలు 29% పెరిగాయి. 10,098 యూనిట్ల విక్రయాలు జరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 7,800 యూనిట్లుగా ఉన్నాయి. అహ్మదాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 9 శాతం క్షీణించి 9,352 యూనిట్లుగా నమోదయ్యాయి.పండుగల సీజన్‌తో అమ్మకాలకు ఊతం ‘‘వార్షికంగా చూస్తే సెపె్టంబర్ క్వార్టర్లో ఇళ్ల అమ్మకాలు, కొత్త ఇళ్ల ఆవిష్కరణలు తగ్గడం ధరల పెరుగుదలకు స్పందనగా కనిపిస్తోంది. మార్కెట్ కార్యకలాపాలు మోస్తరు స్థాయికి చేరడం చూస్తున్నాం. ఇది స్థిరమైన వృద్ధిని తీసుకొస్తుంది. అంతిమంగా వినియోగదారులకు మేలు చేస్తుంది. గడిచిన కొన్ని త్రైమాసికాల్లో ఇళ్ల ధరలు కొన్ని ప్రాంతాల్లో 3 శాతం నుంచి 50 శాతం వరకూ పెరిగాయి. ఇది తక్షణ ఇళ్ల కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపిస్తోంది’’ అని ప్రాప్‌టైగర్ బిజినెస్ హెడ్ వికాస్ వాధ్వాన్ వివరించారు. కొత్త ధరలకు వినియోగదారులు సర్దుకోవడానికి కొంత సమయం పడుతుందన్నారు. దేవీ నవరాత్రులతో పండుగల సీజన్ ఊపందుకుందని, అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్, పుణె మార్కెట్లో డెవలపర్లు డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా వ్యూహాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. -
2030 నాటికి రూ.2 లక్షల కోట్లు!.. జేఎల్ఎల్ రిపోర్ట్
ముంబై రెసిడెన్షియల్ మార్కెట్ 2030 నాటికి రూ. 2 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించగలదని రియల్ ఎస్టేట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ జేఎల్ఎల్ ఒక నివేదికలో వెల్లడించింది. 2023లో సిటీ రెసిడెన్షియల్ విక్రయాల విలువ రూ. 1 లక్ష కోట్లను అధిగమించింది. 2024లో ఇది రూ.1.35 లక్షల కోట్లను అధిగమించే అవకాశం ఉందని చెబుతోంది.ముంబైలో రియర్ ఎస్టేట్ రంగం గణనీయంగా ముందుకు దూసుకెళుతోంది. దీనికి కారణం ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL), నవీ ముంబై సబర్బన్ రైల్, మెట్రో లైన్ల కనెక్టివిటీ పెరగటం అని తెలుస్తోంది. 2030 నాటికి మల్టీమోడల్ కనెక్టివిటీని పెంపొందించే లక్ష్యంతో కొనసాగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లు కొత్త రెసిడెన్షియల్ హబ్‌లను ప్రోత్సహిస్తాయని జేఎల్ఎల్ నివేదికలో వెల్లడించింది.2024 మొదటి అర్ధభాగంలో ముంబై రెసిడెన్షియల్ మార్కెట్ భారీగా వృద్ధి చెందింది. ఈ అమ్మకాలు 2023లో నమోదైన మొత్తం సేల్స్ కంటే కూడా 57 శాతం ఎక్కువని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే 2030 నాటికి తప్పకుండా 2 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించగలదని స్పష్టంగా అర్థమవుతోంది. -
హైదరాబాద్‌లో పెరిగిన రెసిడెన్షియల్ సేల్స్.. వీటికే డిమాండ్!
నైట్‌ఫ్రాంక్ ఇండియా తాజాగా విడుదల చేసిన డేటాలో హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ సేల్స్ వృద్ధి గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. జూన్ 2024లో రూ. 4288 కోట్ల విలువైన గృహాలు అమ్ముడైనట్లు నివేదిక ద్వారా తెలిసింది. అమ్మకాల పరంగా వార్షిక వృద్ధి 48 శాతం కాగా, నెలవారీ వృద్ధి 14 శాతంగా నమోదైంది.హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో ఇళ్ల విక్రయాలు భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. 2024 జనవరి నుంచి హైదరాబాద్‌లో మొత్తం 39220 రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇది 2023 మొదటి ఆరు నెలల్లో పోలిస్తే 15 శాతం ఎక్కువ.జూన్ 2024లో 50 లక్షల రూపాయలకంటే తక్కువ ధర కలిగిన కేటగిరీలో ఎక్కువ రిజిస్ట్రేషన్స్ జరిగాయి. ఈ అమ్మకాలు 2023 కంటే 10 శాతం తక్కువ. రూ. 1 కోటి, అంతకంటే ఎక్కువ ధర కలిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు జూన్ 2024లో 14 శాతం పెరిగాయి. ఇందులో గృహాల కొనుగోలు కాకుండా.. ఆస్తుల కొనుగోలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.జూన్ 2024లో, హైదరాబాద్‌లో నమోదైన ఆస్తులలో ఎక్కువ భాగం 1,000 నుంచి 2,000 చదరపు అడుగుల కేటగిరి ఉంది. ఈ అమ్మకాలు కూడా 2023 కంటే తక్కువ. అయితే 2000 చదరపు అడుగుల ఆస్తుల విక్రయాలు పెరిగాయి. వీటికి డిమాండ్ భారీగా పెరిగింది. వీటి రిజిస్ట్రేషన్స్ 2024లో 14 శాతంగా నమోదయ్యాయి. -
హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ తన జోరు కొనసాగిస్తోంది. జూన్ త్రైమాసికంలో బలమైన పనితీరు చూపించింది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. జూన్ క్వార్టర్లో హైదరాబాద్ మార్కెట్లో 15,085 ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్ముడుపోయిన ఇళ్లు 13,565 యూనిట్లతో పోల్చి చూస్తే 11 శాతం వృద్ధి కనిపించింది. కానీ, ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికం అమ్మకాలు 19,660 యూనిట్లతో పోల్చి చూసినప్పుడు 23 శాతం క్షీణత నెలకొంది. ఇక దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లోనూ ఇదే ధోరణి కనిపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ కాలంలో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చినప్పుడు 5 శాతం పెరిగి 1,20,340 యూనిట్లుగా ఉన్నాయి. కానీ, ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో విక్రయాలు 1,30,170 యూనిట్లతో పోల్చిచూస్తే 8 శాతం తగ్గాయి. ‘‘క్రితం త్రైమాసికంలో అధిక విక్రయాల బేస్ ఏర్పడినప్పడు తర్వాతి త్రైమాసికంలో అమ్మకాలు తగ్గడం సాధారణమే. అంతేకాదు ఈ స్థాయిలో విక్రయాలు తగ్గడానికి గడిచిన ఏడాది కాలంలో గణనీయంగా పెరిగిపోయిన ప్రాపర్టీ ధరల ప్రభావం కూడా కారణమే. దీంతో కొంత మంది ఇన్వెస్టర్లను వెనక్కి తగ్గేలా చేసింది’’ అని అనరాక్ చైర్మన్ అనుజ్‌పురి తెలిపారు. వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు హైదరాబాద్, పుణె, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ఇళ్ల అమ్మకాలు పెరగ్గా, చెన్నై, కోల్‌కతాలో తగ్గాయి. మార్చి త్రైమాసికంతో పోల్చిచూస్తే ఒక్క ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోనే అమ్మకాలు అధికంగా నమోదయ్యాయి.పట్టణాల వారీగా.. » ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో జూన్ త్రైమాసికంలో 16,550 యూనిట్ల ఇళ్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు ఒక శాతం పెరగ్గా, మార్చి త్రైమాసికం నుంచి ఆరు శాతం వృద్ధి చెందాయి. » ఎంఎంఆర్‌లో 9 శాతం వృద్ధితో 41,540 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. » బెంగళూరులో 16,360 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరిగాయి. క్రితం ఏడాది జూన్ త్రైమాసికంతో పోల్చి చూస్తే 9 శాతం అధికంగా నమోదయ్యాయి. » పుణె మార్కెట్లోనూ 2 శాతం వృద్ధితో ఇళ్ల అమ్మకాలు 21,145 యూనిట్లుగా ఉన్నాయి. » చెన్నైలో 5,020 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది జూన్ త్రైమాసికం గణాంకాలతో పోల్చి చూస్తే 9 శాతం తక్కువ. » కోల్‌కతాలో 20 క్షీణతతో ఇళ్ల అమ్మకాలు 4,640 యూనిట్లకు పరిమితమయ్యాయి.ఆల్‌టైమ్ గరిష్టానికి డిమాండ్ ఇళ్లకు డిమాండ్ అసాధారణ స్థాయిలో ఉన్నట్టు డీఎల్ఎఫ్ హోమ్స్ జాయింట్ ఎండీ, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆకాశ్ ఓహ్రి తెలిపారు. ముఖ్యంగా కరోనా తర్వాత గడిచిన రెండేళ్లలో డిమాండ్ ఆల్‌టైమ్ గరిష్టానికి చేరినట్టు చెప్పారు. ‘‘ఇంటి యాజమాన్యం విషయంలో ప్రజల ఆలోచనా ధోరణిలో వచ్చిన నిర్మాణాత్మక మార్పు ఇది. ఒక స్థలాన్ని కలిగి ఉండడం పట్ల విలువ ఇంతకముందెన్నడూ లేని స్థాయికి చేరింది. ఇల్లు వినియోగానికే కాకుండా, ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనంగా అవతరించింది. ముఖ్యంగా లగ్జరీ ఇళ్లపై రాబడులు పెట్టుబడుల డిమాండ్‌ను పెంచింది’’అని ఆకాశ్ ఓహ్రి వివరించారు. -
ప్రపంచంలో ఎత్తైన రెసిడెన్షియల్.. ఫిదా చేస్తున్న వీడియో
దుబాయ్ అనగానే చాలామందికి ప్రపంచంలో ఎత్తైన భవనంగా కీర్తి గడిస్తున్న 'బుర్జ్ ఖలీఫా' గుర్తొస్తుంది. అయితే త్వరలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్ అందుబాటులోకి రానుంది. నగరంలోని మెరీనా జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఈ రెసిడెన్షియల్ మొత్తం 122 అంతస్తులుగా నిర్మించనున్నారు.'సిక్స్ సెన్సెస్ రెసిడెన్సెస్' పేరుతో నిర్మిస్తున్న ఈ భవనం 517 మీటర్లు లేదా 1696 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తైన రెసిడెన్షియల్‌గా.. న్యూయార్క్ నగరంలోని 'సెంట్రల్ పార్క్ టవర్' (474 మీటర్లు లేదా 1550 అడుగులు) కంటే చాలా పొడవుగా ఉంటుంది.సిక్స్ సెన్సెస్ రెసిడెన్సెస్‌ను వుడ్స్ బాగోట్ అండ్ డబ్ల్యుఎస్పీ మిడిల్ ఈస్ట్ రూపొందించారు. ఇది గుండ్రంగా మెరుస్తున్న టవర్ మాదిరిగా ఉంటుంది. బాల్కనీలను, టెర్రస్ వంటి వాటిని కలుపుతూ చివరి బిందువు మాదిరిగా పూర్తయ్యి ఉంటుంది. ఇంటీరియర్ డిజైన్ మొత్తం మిచెల్ & ఈడెస్ పూర్తి చేస్తుంది. కాబట్టి ఇందులో అరబ్ యువరాజుకు సరిపోయే హై-ఎండ్ యాక్సెసరీస్, మెటీరియల్‌లను ఉపయోగించినట్లు సమాచారం.సిక్స్ సెన్సెస్ రెసిడెన్సెస్‌లో అత్యాధునిక ఫిట్నెస్ సౌకర్యాలు ఫంక్షనల్ జిమ్‌లు, వర్చువల్ సైక్లింగ్, బాక్సింగ్ స్టూడియోలు, ఇన్ఫినిటీ పూల్, ఐస్ బాత్‌లు, సాల్ట్ రూమ్, బయో, సౌండ్ హీలింగ్ రూమ్, మసాజ్ సూట్లు, ఇండోర్ అండ్ అవుట్డోర్ సినిమాస్ వంటి ఎన్నో ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి.సిక్స్ సెన్సెస్ రెసిడెన్సెస్ దుబాయ్ మెరీనాకు కొంత చరిత్ర కూడా ఉంది. ఇది 2007లో పెంటోమినియం టవర్గా ప్రారంభమైంది. తరువాత ఆనతి కాలంలోనే ప్రపంచ ఆర్ధిక సంక్షోభం కారణంగా నిర్మాణం నిలిచిపోయింది. ఇటీవలే సెలెక్ట్ గ్రూప్ అసంపూర్తిగా ఉన్న ఈ భవనాన్ని 100 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం నిర్మాణం 25 శాతం పూర్తయింది. ఇది 2028 చివరి నాటికి పూర్తవుతుందని సమాచారం. -
రియల్ఎస్టేట్ కింగ్ హైదరాబాద్! రికార్డ్‌స్థాయిలో అమ్ముడుపోయిన ఇళ్లు
రియల్ఎస్టేట్లో హైదరాబాద్ సత్తా చాటింది. గతేడాది నగరంలో ఇళ్ల అమ్మకాలు రికార్డ్ స్థాయిలో జరిగాయి. 2023లో భాగ్యనగరంలో ఇళ్ల అమ్మకాలు ఆల్‌టైమ్ గరిష్టాన్ని నమోదు చేసినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదికలో వెల్లడైంది. ఆల్‌టైమ్ హై నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన ఇండియా రియల్ ఎస్టేట్ - రెసిడెన్షియల్, ఆఫీస్ మార్కెట్ రిపోర్ట్ ప్రకారం.. 2023లో హైదరాబాద్‌లో చరిత్రాత్మక గరిష్ట స్థాయిలో 32,880 హౌసింగ్ యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇవి అంతకుముందు ఏడాది కంటే 6 శాతం పెరిగాయి. ఇక హౌసింగ్ యూనిట్ల ప్రారంభంలోనూ కొత్త రికార్డును నెలకొల్పుతూ, నగరంలో రెసిడెన్షియల్ లాంచ్‌లు 2023లో 7 శాతం పెరిగి 46,985 యూనిట్లకు చేరుకున్నాయి. గృహ కొనుగోలుదారులు జీవనశైలి అప్‌గ్రేడ్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం, సౌకర్యాలు అధికంగా ఉండే కమ్యూనిటీలవైపు మొగ్గు చూపడం వంటివి ఈ పెరుగుదలకు కారణాలుగా నైట్‌ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. ఇక ఇళ్ల బలమైన డిమాండ్-సరఫరా, ఖరీదైన ఇళ్లకు కొనుగోలుదారుల ప్రాధాన్యత పెరగడం వంటి కారణాలు ఇళ్ల ధరల్లోనూ గణనీయమైన పెరుగుదలకు దారితీశాయి. ఖరీదువారీగా చూస్తే.. రూ.కోటికి మించి ఖరీదైన ఇళ్ల అమ్మకాలు ఐదేళ్లలో రెట్టింపయ్యాయి. 2018లో మొత్తం అమ్మకాల్లో ఇవి 21 శాతం ఉండగా 2023లో 49 శాతానికి పెరిగింది. 2022తో 11,632 యూనిట్లతో పోలిస్తే 2023లో 16,086 యూనిట్లకు పెరిగాయి. రూ.50 లక్షల లోపు విలువైన ఇళ్ల విక్రయాలు 2018లో 26 శాతం నుంచి 2023లో 11 శాతాకి సగానికి పైగా తగ్గింది. 2022లో 5,630 యూనిట్ల నుంచి 2023లో 3,674 యూనిట్లకు తగ్గిపోయాయి. రూ.50 లక్షల నుంచి రూ.కోటి లోపు ధర ఉన్న ఇళ్ల అమ్మకాలు 2018లో 52 శాతం నుంచి 2023లో 40 శాతానికి క్షీణించాయి. ఈ ధర విభాగంలో 2023లో దాదాపు 13,120 రెసిడెన్షియల్ యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022లో 13,784 యూనిట్లతో పోల్చితే 5 శాతం తగ్గాయి. భారీగా పెరిగిన ధరలు నగరంలో ఇళ్ల ధరలు 2023లో భారీగా పెరిగాయి. పెరిగిన డిమాండ్ ఫలితంగా ఇళ్ల సగటు ధరలో 11 శాతం పెరుగుదల నమోదైంది. నగరంలోని వెస్ట్, సౌత్ రీజియన్లలో పెరుగుదల ఎక్కువగా ఉంది. ప్రాంతాలవారీగా తీసుకుంటే వెస్ట్ రీజియన్‌లోని కోకాపేటలో అత్యధికంగా 39 శాతం పెరుగుదల ఉంది. 28 శాతం పెరుగుదలతో మణికొండ ఆ తర్వాత స్థానంలో ఉంది. దీనికి విరుద్ధంగా నార్త్ రీజియన్‌లోని సైనిక్‌పురిలో 2 శాతం ధరలు తగ్గిపోవడం గమనార్హం. ఆఫీస్ మార్కట్లోనూ.. ఆఫీస్ మార్కట్లోనూ హైదరాబాద్ గణనీయమైన పెరుగుదలను నమోదు చేసినట్లు నైట్ ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (జీసీసీలు) ముఖ్యంగా తమ ఐటీ, బ్యాక్-ఆఫీస్ కార్యకలాపాలను నగరానికి విస్తరించడంతో 2023లో హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్లో వార్షిక లావాదేవీల్లో 32 శాతం పెరుగుదల నమోదైంది. ఇక ఆఫీస్ లీజింగ్ కార్యకలాపాలు 2023లో 52 శాతం, 4.1 మిలియన్ చదరపు అడుగులకు పెరిగాయి. నగరంలో 2022లో 6.7 మిలియన్ చదరపు అడుగుల మేర ఆఫీస్ లావాదేవీల జరగ్గా 2023 సంవత్సరంలో 8.8 మిలియన్ చదరపు అడుగుల ట్రాన్సాక్షన్లు నమోదు చేసింది. మరో వైపు నగరంలో 6.5 మిలియన్ చదరపు అడుగుల కొత్త ఆఫీస్‌ల సరఫరా నమోదైంది. -
ఢిల్లీలో కేసీఆర్ అధికారిక నివాసం ఖాళీ
సాక్షి, న్యూఢిల్లీ: రెండు దశాబ్దాలపాటు దేశ రాజధాని ఢిల్లీలో కేసీఆర్‌కు అధికారిక నివాసంగా కొనసాగిన తుగ్లక్ రోడ్‌లోని 3వ నంబరు ఇల్లును ఖాళీ చేస్తున్నారు. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హస్తినలోని కేసీఆర్ అధికారిక నివాసాన్ని ఇక్కడి సిబ్బంది ఖాళీ చేస్తున్నారు. ఇప్పటికే కొంత సామాను తరలించిన సిబ్బంది.. రెండు మూడు రోజుల్లో ఈ ఇంటిని పూర్తిగా ఖాళీ చేయనున్నారు. లోక్‌సభ సభ్యుడిగా ఉన్న సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం చంద్రశేఖర్‌రావుకు ఈ బంగ్లాను కేటాయించింది. అప్పటి నుంచి ఆయనకు ఇది అధికారిక నివాసంగా మారింది. ఈ ఇంటి నుంచే హస్తినలో ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట సాధన ఉద్యమాన్ని నడిపించారు. రాష్ట్ర సాధన అనంతరం రెండు పర్యాయాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. సీఎం హోదాలో హస్తినకు ఎప్పుడు వచ్చినా ఇదే ఇంట్లో ఆయన బస చేసేవారు. అధికారం కోల్పోయిన ఏ ప్రజా ప్రతినిధి అయినా.. అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడానికి నెల రోజుల సమయం ఉంటుంది. కానీ.. కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ ఇంటిని రెండు మూడు రోజుల్లోనే పూర్తిగా ఖాళీ చేయనున్నారు. ఆ ఇల్లు ఖాళీ అయితే రెండు దశాబ్దాలుగా కేసీఆర్‌కు ఈ ఇంటితో ఉన్న బంధం తెగిపోనుంది. -
Vestian: హౌసింగ్‌లో భారీగా సంస్థాగత పెట్టుబడులు
న్యూఢిల్లీ: నివాస రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో సంస్థాగత ఇన్వెస్టర్ల (ఇనిస్టిట్యూషనల్) పెట్టుబడులు సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో భారీగా పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన పెట్టుబడులు 174 మిలియన్ డాలర్లు (రూ.1,444 కోట్లు)తో పోల్చి చూస్తే, 71 శాతం వృద్ధితో 298 మిలియన్ డాలర్లు (రూ.2,473కోట్లు)గా నమోదయ్యాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. భారత రియల్ ఎస్టేట్ పరిశ్రమ మొత్తం మీద సెపె్టంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 679.9 మిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులను ఆకర్షించినట్టు ఈ నివేదిక వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వచి్చన 374 మిలియన్ డాలర్లతో పోల్చి చూసినప్పుడు 82 శాతం వృద్ధి నమోదైంది. అగ్రగామి సంస్థలు ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని కోరుతున్నాయని వెస్టియన్ సీఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఇది ఆఫీస్ వసతులకు డిమాండ్‌ను పెంచుతుందన్నారు. ఫలితంగా రానున్న త్రైమాసికాల్లో పెట్టుబడులు పెరగొచ్చని అంచనా వేశారు. సెపె్టంబర్ త్రైమాసికంలో వచ్చిన సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో 71 శాతం దేశీ ఇన్వెస్టర్లు సమకూర్చినవి. విదేశీ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి 27 శాతం పెట్టుబడులు వచ్చాయి. సెపె్టంబర్ క్వార్టర్లో అత్యధికంగా ఇనిస్టిట్యూషనల్ పెట్టుబడులను నివాస ప్రాజెక్టులే దక్కించుకున్నాయి. వీటి వాటా 44 శాతంగా ఉంది. వాణిజ్య రియల్ ఎస్టేట్ ఆస్తుల్లోకి 24 శాతం పెట్టుబడులు వెళ్లాయి. ఆఫీస్ ఆస్తులు 164 మిలియన్ డాలర్లు, ఇండ్రస్టియల్ వేర్‌హౌసింగ్ ఆస్తులు 190 మిలియన్ డాలర్ల చొప్పున సంస్థాగత పెట్టుబడులను ఆకర్షించాయి. -
హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ సంస్థల మాయాజాలం.. రెరా మొద్దు నిద్ర!
ఎంకేజీఆర్ ఎస్టేట్స్ హౌసింగ్ ఎల్ఎల్పీ కంపెనీ కేపీహెచ్బీలో 92 ఎకరాల్లో లేక్ వ్యూ మెగా టౌన్íÙప్ను నిర్మిస్తున్నామని ప్రచారం చేస్తుంది. ఇందులో అపార్ట్మెంట్లు, విల్లాలు, ఆఫీసు, కమర్షియల్ స్పేస్ అన్నీ ఉంటాయని చెబుతుంది. 30 ఎకరాలలో 33 అంతస్తులలో అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నామని ప్రీలాంచ్లో చ.అ.కు రూ.4,500 చొప్పున వసూలు చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఉన్న భూమికి టైటిలే లేకపోవటం గమనార్హం. ప్రణవ రియల్టర్స్ ఇండియా ఎల్ఎల్పీ కడ్తాల్‌లో టెంపుల్ టౌన్ వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నామని ఢంకా బజాయిస్తుంది. ఇందులో అన్నీ విల్లా ప్లాట్లేనని, గజం రూ.18,999లకు విక్రయిస్తుంది. ఇదే సంస్థ కాప్రాలో 60 వేల చ.అ.లలో జీ+4 అంతస్తులలో కమర్షియల్ కాంప్లెక్స్ కూడా నిరి్మస్తున్నామని చెబుతుంది. ఏ ప్రాజెక్టు కూడా రెరాలో నమోదు కాకపోవటమే కాదు నిర్మాణ అనుమతులూ లేకపోవటం విశేషం. సాక్షి, హైదరాబాద్: ఇలా ఒకటి రెండు కాదు నగరంలో రాత్రికి రాత్రే పుట్టగొడుగుల్లా నిర్మాణ సంస్థలు వెలుస్తున్నాయి. గృహ కొనుగోలుదారులకు ఆశ పెట్టి వారి కష్టార్జితాన్ని దోచేస్తున్నాయి. నిబంధనలను అతిక్రమించే డెవలపర్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కేవలం షోకాజ్ నోటీసుల జారీకే పరిమితం అవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కళ్లముందు వందలాది సంస్థలు ప్రీలాంచ్లో జనాలను నట్టేట ముంచేస్తుంటే మొద్దు నిద్రలో ఉందని డెవలపర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. బ్రోచర్ల మీదే ప్రాజెక్ట్‌లు.. రాత్రికి రాత్రే సంస్థలను పెట్టే నకిలీ బిల్డర్ల ప్రాజెక్ట్‌లన్నీ బ్రోచర్ల మీదనే ఉంటాయి. ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు, రెరాలో నమోదు ఏవీ ఉండవు. వంద శాతం సొమ్ము చెల్లిస్తే చాలు.. సొంతిల్లు సొంతమవుతుందని నమ్మించి నట్టేట ముంచేస్తున్నారు. సాహితీ, జయ గ్రూప్, భువన్‌తేజ వంటి నిర్మాణ సంస్థలు ఇప్పటికే వేలాది మంది కస్టమర్ల నుంచి రూ.కోట్లలో వసూలు చేసి కుచ్చుటోపి పెట్టిన ఘటనలనేకం. ఇటీవల కోకాపేట, ఖానామెట్ వేలంలో భూములు దక్కించుకున్న పలు నిర్మాణ సంస్థలు కూడా ప్రీలాంచ్లో సొమ్ము వసూలు చేయడం గమనార్హం. హ్యాపెనింగ్ ప్లేస్‌లలోనే ఎక్కువ.. అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో తక్కువ ధరకే ప్రాపర్టీ అంటే ఎవరైనా ఇట్టే ఆకర్షితులవుతారు. ఇదే ప్రీలాంచ్ మోసగాళ్ల మంత్రం. ప్రధానంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, కొల్లూరు, నార్సింగి, నిజాంపేట, ఎల్బీనగర్, కొల్లూరు, నార్సింగి, పుప్పాలగూడ, తెల్లాపూర్ వంటి ప్రాంతాలలో ఎక్కువగా ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారు. అంతా సోషల్ మీడియాలోనే.. ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌ల ప్రచారాలన్నీ సోషల్ మీడియా వేదికగానే సాగుతుంది. పెద్ద కంపెనీలేమో పాత కస్టమర్లకు అంతర్గత విక్రయాలు చేస్తుంటే.. కొన్ని కంపెనీలేమో తమ పేరు బయట పడకుండా ఏజెంట్ల ద్వారా వాట్సాప్, ట్విట్టర్లలో ప్రచారం చేయిస్తున్నాయి. పెద్ద మొత్తంలో కమీషన్ ఇస్తూ ఏజెంట్లను నియమించుకుంటున్నారు. దీంతో గ్రామాలు, పట్టణాలలో తిరుగుతూ వీకెండ్ వస్తే చాలు కార్లలో కస్టమర్లను తరలించి ప్రాజెక్ట్ విజిట్లు చేపిస్తున్నారు. గాలిలో మేడలు చూపిస్తూ కస్టమర్ల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. -
‘రియల్టీ’కే మగువల ఓటు
మహిళలు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 69 శాతం మంది ఎంపిక రియల్ ఎస్టేట్ కాగా, అందులోనూ నివాస గృహాలకు వారు మక్కువ చూపిస్తున్నారు. నోబ్రోకర్ సంస్థ 9,000 మంది మహిళలపై ఒక సర్వే నిర్వహించి, వివరాలు విడుదల చేసింది. ► 94 శాతం మంది ఇంటిపై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటుంటే, 6 శాతం మంది వాణిజ్య ఆస్తులపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్టు చెప్పారు. ► 80 శాతం మంది వినియోగం కోసమే ఇంటిని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. ► 73 శాతం మహిళలు రూ.40–75 లక్షల బడ్జెట్లోని ఇంటిని కొనాలనుకుంటున్నారు. ► 20 శాతం మంది రూ.75లక్షల నుంచి రూ.కోటి బడ్జెట్లోని ఇళ్ల పట్ల సుముఖంగా ఉన్నారు. మిగిలిన 7 శాతం మహిళలు రూ.కోటికి పైన ఉన్న ఇళ్ల కోసం చూస్తున్నారు. ► 63 శాతం మంది వినియోగానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు కోరుకుంటున్నారు. ► హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ–ఎన్సీఆర్, చెన్నై, ముంబై, పుణె నగరాలకు చెందిన మహిళలు ఈ సర్వేలో అభిప్రాయాలు వెల్లడించారు. ► గోద్రేజ్ హౌసింగ్ ఫైనాన్స్ నిర్వహించిన సర్వే సైతం.. ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరు గడిచిన ఏడాది కాలంలో ఆస్తుల నిర్మాణం, పెట్టుబడుల దృష్ట్యా ప్రాపర్టీ కొనుగోలుకు ప్రాధాన్యం ఇచ్చి నట్టు తెలిపింది. 34 శాతం మహిళలు కొత్త ఇల్లు కొనుగోలు మంచి పెట్టుబడి సాధనంగా భావిస్తున్నారని, 52 శాతం మంది కొత్త ఇంటికి అన్వేషణ మొదలు పెట్టినట్టు వెల్లడించింది. ► పెట్టుబడులకు సంబంధించి స్క్రిప్‌బాక్స్ కూడా ఒక సర్వే నిర్వహించింది. డబ్బు అంశాలను మహిళలు స్వయంగా చూస్తున్నారని, ఆర్థిక నిర్ణయాల్లో 70 శాతం మహిళలు పాలుపంచుకుంటున్నారని తెలిపింది. కరోనా విపత్తులోనూ ప్రతి ఐదుగురిలో ఒక మహిళ మొదటి సారి పెట్టుబడులను ఆరంభించినట్టు పేర్కొంది. -
జనావాసాల్లో మద్యం దుకాణాలొద్దు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: నివాస ప్రాంతాల్లో, ఆస్పత్రులు, మతపరమైన ప్రార్థనా మందిరాలు, పాఠశాలల సమీపంలో మద్యం దుకాణాలు, పర్మిట్ రూంలు, బార్లు ఉండటానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. పర్మిట్ రూంలు, బార్లలో మినహా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. తెలంగాణ ఎక్సైజ్ (గ్రాంట్ ఆఫ్ లైసెన్స్ ఆఫ్ సెల్లింగ్ బై షాప్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ లైసెన్స్) నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని తేల్చి చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలకు రెండు నెలల్లో ఆడిట్ నిర్వహించాలని, నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఉంటే వాటిని రెండు నెలల్లోగా తొలగించాలని, తీసుకున్న చర్యలను వివరిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ టి.తుకారాంజీల ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాలతోపాటు పర్మిట్ రూంలకు అనుమతి ఇస్తున్నారని, దీంతో చిన్నారులు, మహిళలు వేధింపులకు గురవుతున్నారంటూ న్యాయవాది మహేందర్‌రాజు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారణ చేసింది. -
తెలంగాణ: చౌకగా ఇంటి, వాహన గ్యాస్..
హైదరాబాద్: టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఆ టెక్నాలజీని అభివృద్ధి చేసి కొత్త పుంతలు తొక్కిస్తోంది. పటిష్టమైన ప్రణాళికతో ఎలాంటి వ్యయ ప్రయాసలు లేకుండా నేరుగా పైపుల ద్వారా గృహ, వాణిజ్య అవసరాలకు మేఘా గ్యాస్‌ను సరఫరా చేస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికి నేరుగా గ్యాస్‌ను సరఫరా చేయడంతో పాటు వాహన అవసరాలకు ఇంధనాన్ని అందిస్తోంది. ఈ మేఘా టెక్నాలజీతో సమయం ఆదాతో పాటు వినియోగదారులకు సులభంగా, సురక్షితంగా గ్యాస్ అందిస్తోంది. ఒక వైపు ఆకాశాన్నంటిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. మరో వైపు పరుగులు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లతో పేద, మధ్యతరగతి గృహ వినియోగదారులు భారం మోయలేకపోతున్నారు. ఆ భారాన్ని తగ్గించి వారికి ఊరటనివ్వడానికి మేఘా ఇంజనీరింగ్ సంస్థ కృషి చేస్తోంది. పక్కా ప్రణాళికతో శరవేగంగా సీజీడీ, సీఎన్జీ గ్యాస్ స్టేషన్లను నిర్మించి మధ్యతరగతి ప్రజలకు భారం తగ్గిస్తోంది. ఎల్పీజీ సిలిండర్ ధరలతో పోలిస్తే 40 శాతం తక్కువ రేటుకు మేఘా గ్యాస్‌ను ఎంఈఐఎల్ అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ర్టాల్లో ఇప్పటికే గ్యాస్ ను సరఫరా చేస్తున్న ఎంఈఐఎల్ సంస్థ ఇప్పుడు తెలంగాణాలో తన సేవలను విస్తరిస్తోంది. అందులో భాగంగా నల్గొండ జిల్లాలో సేవలను ఇటీవలనే ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ ఇంటికి వాణిజ్య పరంగా వంటగ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశ్యంతో తీసుకువచ్చిన సీజీడీ (City Gas Distribution) ప్రాజెక్ట్‌లో భాగంగా మేఘా ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక ప్రాంతాల్లో పనులను పూర్తి చేసి మేఘా గ్యాస్ కింద గ్యాస్ సరఫరా సేవలను చౌకదరలకు అందిస్తోంది. 5000 కోట్లతో ఈ మూడు రాష్ర్టాలలో కలిపి మొత్తం 11 లక్షల గ్రహాలకు గ్యాస్ సరఫరా కనెక్షన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ సిజిడి వ్యవస్థ ద్వారా దాదాపు 4 వేల మంది ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఉపాధి పొందనున్నారు. నల్గొండ జిల్లాలో తొలిసారిగా గ్యాస్ పైప్ లైన్, సిటీ గేట్ స్టేషన్, పనులను గడువులోగా పూర్తి చేసి నల్గొండ ప్రజలకు 'మేఘా గ్యాస్' కింద చౌక ధరలకు గ్యాస్ సరఫరా చేస్తోంది. సీజీడీ - నల్గొండ ప్రాజెక్ట్ లో భాగంగా నల్గొండ జిల్లాలోని వెలిగొండ మండలం, సుంకిషాల గ్రామంలో సహజవాయువు సరఫరా లో కీలకమైన సిటీ గేట్ స్టేషన్ (CGS), మదర్ స్టేషన్ ను ప్రారంభించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్యాస్ సరఫరా సేవలను అందిస్తోంది మేఘా సంస్థ. వ్యయ ప్రయాసలు తగ్గించి సులభంగా ఇంటింటికి గ్యాస్ అందే విధంగా ‘మేఘా గ్యాస్’ పటిష్టమైన ప్రణాళికతో మౌళిక వసతులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ర్టాల్లోని వివిధ జిల్లాలో అమలు చేస్తున్నట్లు మేఘా గ్యాస్ బిజినెస్ హెడ్ పలింపాటి వెంకటేశ్ తెలిపారు. ప్రజల అవసరాల దృష్ట్యా గ్యాస్ సిటీ గేట్ స్టేషన్ ద్వారా PNG ( piped natural gas) గృహ, పారిశ్రామిక అవసరాలకు, అలాగే మదర్ స్టేషన్ ద్వారా సీఎన్జీ (compressed Natural Gas) ని వాహన అవసరాల కోసం అందుబాటులోకి తీసుకురావడం ఎంతో గర్వకారణమన్నారు. దీనితో నల్గొండ జిల్లాలో మరో 10 స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఇప్పటికే 32 km స్టీల్ పైప్ లైన్ వేయగా, మరో 80 కి.మీ పైప్ లైన్ పనులు కొనసాగుతున్నాయి. 40,000 కుటుంబాలకు, పరిశ్రమలకు గ్యాస్ సరఫరా చేసే ఉద్దేశ్యం తో ఇంకా 500 కి.మీ పొడవు గల ఎండీపీఈ పైప్ లైన్ నిర్మాణము చేపడుతోంది. అంతే కాకుండా మేఘా సంస్థ నల్గొండ జిల్లాలో బిబినగర్, భువనగిరి, చౌటుప్పల్, చిట్యాల, నల్గొండ, నకిరేకల్, మిర్యాలగూడ, మల్లేపల్లి, సూర్యాపేట మరియు కోదాడ లలో 10 సీఎన్జీ స్టేషన్లు నిర్మిస్తున్నారు. సిజిడి ప్రాజెక్ట్‌లో భాగంగా ఇంటింటికి గ్యాస్ సరఫరా చేయడానికి ఉమ్మడి నల్గొండతో పాటు రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పైప్ లైన్ నిర్మాణంతో పాటు 20 సిఎన్జి స్టేషన్లను త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నారు. ఎంఈఐఎల్ ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, కర్నాటకలోని తూంకూరు - బెల్గాం జిల్లాలలో గ్యాస్ సరఫరాను ఇప్పటికే ప్రారంభించింది. కృష్ణా జిల్లాలోని నున్న సమీపంలో సిటి గ్యేట్ స్టేషన్ ద్వారా, అలాగే తూంకూరు - బెల్గాం జిల్లాల్లోనూ గ్యాస్ ప్రాజెక్ట్ ను ప్రారంభించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహ - వాణిజ్య అవసరాలకు నేరుగా గ్యాస్ సరఫరా చేయటం ద్వారా ఏకో ఫ్రెండ్లీ పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు అవసరమైన గ్యాస్‌ను ఓఎన్జీసీ - గెయిల్ నుంచి పొందనుంది. మేఘా గ్యాస్ ‘ఇట్స్ స్మార్ట్ - ఇట్స్ గుడ్’ అనే ట్యాగ్ లైన్ తో తన సేవలను విస్తరిస్తున్న మేఘా గ్యాస్ గృహాలు - వాణిజ్య సంస్థలు - పారిశ్రామిక సంస్థలతో పాటు రవాణా వాహనాలకు సహజ వాయువును సరసమైన ధరకు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని ఆగిరిపల్లిలో ఏర్పాటు చేసిన మదర్ స్టేషన్ నుంచి గ్యాస్‌ను వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేందుకు స్టీల్ - ఎండిపీ ఈ పైప్‌లను 722 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసారు కర్ణాటకలోని తూంకూరు జిల్లాలో కూడా ఇంటింటికి గ్యాస్ సరఫరా చేస్తోంది. వక్కోడి - హెగ్గేరి - గోళ్లహళ్లి - గొల్లరహతి - కుప్పూరు - దసముద్దేప్యా - సిరగతే - దిబ్బుర్ - గుళురు - సంతపేట - మరురూర్ దీన్నే - శేట్టిహళ్లి - జయనగర్ - గోకుల్ ఎక్స్ టెన్షన్ - ఖ్యాతిసాండ్రా - హీరేహళ్లి ఏరియా - మంచికల్ కుప్పె - బట్వాడీ - హనుమంతపురలో 595 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ ఏర్పాటు చేసింది. అలాగే బెల్గామ్ జిల్లాలో బసవన్న కోళ్ల - ఆటోనగర్ - రాంతీర్థనగర్ - అశోక సర్కిల్ - ఆజాద్ నగర్ - చెన్నమ్మ సర్కిల్ - మారుతీ నగర్ - సదాశివ నగర్ తదితర ప్రాంతాల్లో 460 కిలోమీటర్ల మేర స్టీల్ - ఎండిపీ ఈ పైప్ లైన్ వేశారు. చదవండి: వీధి కుక్కలంటే అందరికి భయం.. కానీ ఆమెకు కాదు! ప్రముఖ హిప్నాటిస్ట్ కమలాకర్ కన్నుమూత -
అపోలో ‘సొసైటీ క్లినిక్స్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న అపోలో క్లినిక్ భారీ నివాస సముదాయాల్లో సొసైటీ క్లినిక్స్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ సేవల్లో ఉన్న అప్నా కాంప్లెక్స్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. హైదరాబాద్ సహా బెంగళూరు, పుణే, చెన్నైలో వీటిని నెలకొల్పుతారు. ఈ క్లినిక్స్‌లో వైద్యుల కన్సల్టేషన్, రక్తపరీక్షల కోసం నమూనాల సేకరణ, హెల్త్ చెక్ ప్యాక్స్, ప్రాథమిక వైద్య పరీక్షలు, వైద్య చికిత్సలు, వ్యాక్సినేషన్ సేవలు అందుబాటులో ఉంటాయి. మూడేళ్లలో హైదరాబాద్‌లో ఇటువంటి కేంద్రాలు 75 దాకా ఏర్పాటు చేస్తామని అపోలో క్లినిక్ సీవోవో ఆనంద్ వెల్లడించారు. మరో ఎనిమిది నగరాలకు విస్తరించడం ద్వారా 2021 నాటికి 500 కేంద్రాల స్థాయికి తీసుకువెళతామని చెప్పారు. -
పెట్టుబడికి సరైన ప్రాంతం త్రిబుల్ ఆర్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ చుట్టూ 158 కి.మీ.లు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ఉంది. దీని చుట్టూ సుమారు 330 కి.మీ. మేర రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్– త్రిబుల్ ఆర్) ఉంటుంది. ఓఆర్ఆర్కు, త్రిబుల్ ఆర్కు మధ్య 20–30 కి.మీ. దూరం ఉంటుంది. భువనగిరి, చౌటుప్పల్, యాచారం, కందుకూరు, షాద్‌నగర్, కంది, సంగారెడ్డి, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, జగ్దేవ్పూర్ మీదుగా త్రిబుల్ ఆర్ నిర్మాణం ఉంటుంది. ఓఆర్ఆర్తో పాటూ నగరంలోని 10 ప్రధాన రహదారులు త్రిబుల్ ఆర్తో అనుసంధానమై ఉంటాయి. త్రిబుల్ ఆర్ ఎలా ఉండాలంటే? రీజినల్ రింగ్ రోడ్డులో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్స్, వేర్‌హౌస్‌లను అభివృద్ధి చేయాలి. దీంతో నివాస గృహాలతో పాటూ కార్యాలయాలు, విద్యా సంస్థలు, వినోద కేంద్రాలు, రిటైల్, షాపింగ్ మాల్స్ వస్తాయి. ఒక్కముక్కలో చెప్పాలంటే కొత్త హైదరాబాద్ అభివృద్ధి అంతా త్రిబుల్ ఆర్ కేంద్రంగానే ఉంటుంది. దీంతో ప్రధాన నగరం మీద ఒత్తిడి తగ్గుతుంది. త్రిబుల్ ఆర్కు సమీపంలో ఉన్న జిల్లా కేంద్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తే ఆయా జిల్లాల అభివృద్ధితో పాటూ హైదరాబాద్‌కు వలసలు తగ్గుతాయి. దీంతో నగరంలో కాలు ష్యం, మౌలిక వసతుల వినియోగం తగ్గుతుంది. ► ఇప్పటికే త్రిబుల్ ఆర్ ప్రాంతాల్లో మానవ నిర్మిత అడవుల (మ్యాన్ మేడ్ ఫారెస్ట్) ప్రాజెక్ట్ కల్చర్ ప్రారంభమైందని ఓ డెవలపర్ తెలిపారు. ఇదేంటంటే.. సెలబ్రిటీలు, వ్యాపారస్తులు వాళ్ల పిల్లలకు పుట్టిన రోజు లేదా ఇతరత్రా ప్రత్యేక సంద ర్భాల్లో శివారు ప్రాం తాల్లో మ్యాన్ మేడ్ ఫారెస్ట్‌లను బహు మతిగా ఇస్తుంటారు. అహ్మదాబాద్, బెంగళూరు నగరాల్లో ఈ ట్రెండ్ ప్రారంభమైందని.. ఒక్కో ఫారెస్ట్ సుమారు వెయ్యి చ.అ.ల్లో ఉంటుం దని ఆయన తెలిపారు. అభివృద్ధి ఎక్కడ ఉంటుందంటే... త్రిబుల్ ఆర్తో రియల్ అభివృద్ధి మూడు మార్గాల్లో కేంద్రీకృతమై ఉంటుంది. ► ఓఆర్ఆర్, త్రిబుల్ ఆర్ మధ్య ఉండే 20–30 కి.మీ. మార్గం ► త్రిబుల్ ఆర్ ఉన్న రాష్ట్ర, జాతీయ రహదారులకు రెండు వైపులా 5 కి.మీ. వరకు ► త్రిబుల్ ఆర్కు సమీపంలో ఉన్న జిల్లా కేంద్రంలో అభివృద్ధి ఉంటుంది. ఎకరం రూ.20 లక్షలు.. ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన సమయంలో స్థలాలు కొనలేదని నిరాశ చెందిన పెట్టుబ డిదారులకు ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు రూపంలో మరొక అవకాశం వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. త్రిబుల్ ఆర్ పరిధిలో ఎకరం ప్రారంభ ధర రూ.20 లక్షలుంది. వరంగల్, బెంగళూరు జాతీయ రహదారిలో ఇప్పటికే త్రిబుల్ ఆర్ వరకూ రియల్ వెంచర్లు, గృహాలతో అభివృద్ధి కనిపిస్తుంది. దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని త్రిబుల్ ఆర్‌లో స్థలాలను కొనుగోలు చేయాలని, మంచి ఆదాయ వనరుగా మారుతుందని గిరిధారి కన్స్ట్రక్షన్స్ సీఎండీ ఇంద్రసేనా రెడ్డి అభిప్రాయపడ్డారు. క్లియర్ టైటిల్, నీటి వనరులు, రహదారి కనెక్టివిటీ ఉండాలే చూసుకోవాలని సూచించారు. 300 ఎకరాల్లో గోల్ఫ్ కోర్స్ త్రిబుల్ ఆర్ రహదారికి చేరువలో తూఫ్రాన్‌లో నగరానికి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ గోల్ఫ్ కోర్స్‌ను నిర్మించేందుకు ప్రణాళిక చేస్తోంది. 300 ఎకరాల్లో రానున్న ఈ ప్రాజెక్ట్‌ను ఏడాదిలో ప్రారంభిస్తామని కంపెనీ ప్రతినిధి ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. జాయింట్ వెంచర్‌గా చేయనున్న ఈ ప్రాజెక్ట్‌కు ఆస్ట్రేలియా కన్సల్టెన్సీ డిజైన్స్‌ను అభివృద్ధి చేస్తోంది. శ్రీ సిటీలా అభివృద్ధి చేయాలి త్రిబుల్ ఆర్ ప్రాంతా ల్లోని స్థలాలను ఇండస్ట్రియల్, రెసిడెన్షియల్, ఎడ్యుకేషనల్, కమర్షియల్, రిక్రియేషనల్.. ఇలా బహుళ వినియోగ జోన్లుగా ప్రకటించాలి. అప్పుడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో రాష్ట్రమంతా సమాంతర పట్టణీకరణ అభివృద్ధి జరుగుతుంది. ఉదాహరణకు.. ప్రత్యేక జోన్ల కేటాయింపుతో శ్రీ సిటీలోకి విదేశీ కంపెనీలు వచ్చాయి. పైగా శ్రీ సిటీ నిర్వహణ బాధ్యత కూడా ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీది. మౌలిక వసతుల అభివృద్ధి మాత్రమే కాకుండా నాణ్యమైన పనివాళ్ల సమీకరణ కూడా దీనిదే. 6 రాష్ట్రాలను కలుపుతూ నిర్మించిన ఢిల్లీ–ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ కూడా అంతే! వీటిని ఆదర్శంగా తీసుకొని ఓఆర్ఆర్, త్రిబుల్ ఆర్, జిల్లా కేంద్రాలను వినియోగించుకోవాలి. – సి. శేఖర్‌రెడ్డి, క్రెడాయ్ మాజీ జాతీయ అధ్యక్షుడు -
పెట్టుబడికి ఏది సరి?
నివాసమా.. వాణిజ్య సముదాయమా? దేన్లో అధిక రాబడి సాక్షి, హైదరాబాద్: ఫ్లాటా? ప్లాటా? లేక వాణిజ్య సముదాయంలో స్థలమా? దేన్లో పెట్టుబడి భవిష్యత్తులో పెడితే ధర పెరుగుతుంది? నివసించడం కోసం ఇల్లు కొనేవారు కొందరైతే.. పెట్టుబడి కోణంలో ఆలోచించి అడుగు వేసేవారు మరికొందరు. అయితే మనలో చాలా మంది పెట్టుబడి అనే సరికి నివాస గృహాలపైనే దృష్టి సారిస్తారు. కానీ, వాస్తవానికి వాణిజ్య సముదాయాల్లోనే అధిక రాబడి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.అయితే విస్తీర్ణం తక్కువ గల స్థలంలో పెట్టుబడి చేయడానికి కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారని వారంటున్నారు. ⇔ ప్రాజెక్ట్ ఏదైనా అందుబాటులో ఉన్న ప్రాంతంలో నిర్మాణాల్ని చేపడితే కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తారు. అందుకే మాదాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్, మదీనాగూడ, గచ్చిబౌలి, మణికొండ, నానక్‌రాంగూడ, కేపీహెచ్‌బీ కాలనీ వంటి ప్రాంతాల్లో నిర్మాణ సంస్థలు పెద్ద సంఖ్యలో వాణిజ్య సముదాయాల్ని నిర్మిస్తున్నాయి. వాణిజ్యమే బెటర్.. పెట్టుబడి కోణంలో చూసేవారు మంచి రాబడిని అందుకోవడానికి రెండోసారి ఇల్లు కొనడం బదులు వాణిజ్య లేదా ఆఫీసు సముదాయాల్లో పెట్టుబడి పెట్టడమే మేలని నిపుణుల సూచన. మొదటిసారి ఇల్లు కొనేటప్పుడు లభించే పన్ను రాయితీలు రెండోసారి దొరకకపోవటమే ఇందుకు కారణం. గృహ రుణాలతో పోల్చితే వాణిజ్య సముదాయాల రుణాల వడ్డీ కూడా 2–4 శాతం దాకా అధికంగా ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. నివాస సముదాయాలతో పోల్చితే వాణిజ్య సముదాయాల్లో నెలసరి అద్దె రెండు రెట్లు ఎక్కువగా గిట్టుబాటవుతుంది కూడా. అయితే నివాసంతో పోల్చితే వాణిజ్య భవనాల్లో కొనుగోలు ధర మాత్రం యాభై శాతం అధికంగా ఉంటుంది. ఉదాహరణకు నివాస సముదాయాల ధర చదరపు అడుగుకి రూ. 3,500 ఉందనుకోండి.. వాణిజ్య సముదాయాల్లో రూ. 5,250 దాకా పెట్టాల్సి ఉంటుంది. ⇔ అయితే ప్రమోటర్లే స్వయంగా నిర్వహించే వాణిజ్య సముదాయాలకు ప్రాధాన్యమివ్వాలి. ఏటా కొంత మొత్తాన్ని సేవా రుసుముగా తీసుకొని ప్రాపర్టీ మేనేజ్మెంట్ సేవల్ని అందించే వాటిని ఎంచుకోవటం మేలు. వీటితో అందుబాటులో ఉన్న స్థలానికి తగ్గట్టుగా అద్దెదారుల్ని ఎంపిక చేయడం, వారు కోరుకున్న సైజుల్లో స్థలాన్ని సమకూర్చడం, దస్తావేజుల్ని సిద్ధం చేయడం, క్రమం తప్పకుండా అద్దెలను వసూలు చేయడం, ఆయా సొమ్మును పెట్టుబడిదారుడికి ఖాతాలో జమ చేయడం.. ఇలా ప్రతి అంశాన్ని ప్రాపర్టీ మేనేజర్లే దగ్గరుండి పర్యవేక్షిస్తారు. దీని వల్ల పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫస్ట్ అయితే నివాసమే ఉత్తమం.. మొదటిసారి ఇల్లు కొనాలని భావించేవారెవరైనా సరే నివాస సముదాయాన్ని కొనుగోలు చేయడమే ఉత్తమం. ఆరంభంలో ఇరవై శాతం సొమ్ము కడితే చాలు 80 శాతం వరకూ బ్యాంకు నుంచి గృహæరుణం లభిస్తుంది. అంటే తక్కువ సొమ్ముతో సొంతింటి కల తీరుతుంది. అప్పు తీసుకున్న కొన్నాళ్లకే తీర్చక్కర్లేదు. ఇరవై, పాతికేళ్ల వరకూ నెలసరి వాయిదాల్ని కట్టే వెసులుబాటు ఉంటుంది. గృహరుణం తీసుకున్నాక.. చేతిలో సొమ్ము ఉన్నప్పుడల్లా.. విడతలవారీగా రుణాల్ని తిరిగి కట్టొచ్చు. వడ్డీ, అసలుపై ఆదాయ పన్ను రాయితీ లభిస్తుందని తెలిసిందే. అయితే ఆయా ప్రాజెక్ట్‌కు అనుమతులున్నాయా లేవా తెలుసుకోవాలి. అభివృద్ధి చెందే ప్రాంతంలో, టైటిల్ క్లియర్‌గా ఉండి, నిర్వహణ సక్రమంగా ఉన్న వాటి విలువనే పెరుగుతాయని మరవొద్దు. స్థిరాస్తులకు సంబంధించి మీ సందేçహాలు మాకు రాయండి.realty@sakshi.com -
నాణ్యమైన భోజనం అందించాలి
కోటగిరి : మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆ సంస్థ రాష్ట్ర కార్యదర్శి షఫీఉల్లా అన్నారు. బుధవారం సాయంత్రం కోటగిరి మండలకేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాల భవనంలో చేపట్టిన మరమ్మత్తు పనులను త్వరలో పూర్తిచేయాలని అధ్యాపకులకు సూచించారు. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న మూత్రశాలలు, పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. పాఠశాలలో మౌళిక వసతులు కల్పించాలని నిర్వాహకులకు ఆదేశించారు. ఏ క్షణంలోనైనా వస్తానని, లోటుపాట్లు కనిపిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట పలువురు నాయకులు,ప్రజాప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు. -
ఆరు, ఏడు తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలోని కాల్వబుగ్గ, పత్తికొండ, కర్నూలు మైనార్టీ బాలురు, బనవాసి కర్నూలు మైనార్టీ బాలికల పాఠశాలల్లో ఆరు,ఏడు తరగతుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్ ప్రిన్సిపాల్ ఉబేదుల్లా మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. దరఖాస్తులను సమీపంలోని గురుకుల పాఠశాలలో పొందవచ్చని, పూరించిన దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాలను జతపరచి ఈ నెల 30వ తేదీలోపు కర్నూలులోని ఏపీ ఉర్దూ గురుకుల పాఠశాలలో అందజేయాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఆగస్టు 10వ తేదీఉదయం పది గంటలకు ఏపీ ఉర్దూ గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఖాళీల వివరాలు : 6వ తరగతి బాలురు–ఓసీ–6, బీసీఏ–3, బీసీబీ–2, బీసీడీ–4, బీసీఈ–1, ఎస్సీ–7,ఎస్టీ–4. సైనికోద్యోగుల పిల్లలు–2, అనాథలు–2 6వ తరగతి బాలికలు : ఓసీ–2, ఎస్సీ–8 7వ తరగతి బాలురు : ఓసీ–2, బీసీబీ–1, ఎస్సీ–2 7వ తరగతి బాలికలు : ఓసీ–1, ఎస్సీ–3 -
ఆ ఐదూ నకిలీనే!
► డీఈఓ కార్యాలయూనికి చేరిన ఐదుగురి బధిరుల ధ్రువీకరణ పత్రాలపై నివేదికలు ► కుల ధ్రువీకరణపై నాన్చుడి ధోరణి ► తహశీల్దార్ కార్యాలయాల గడప దాటని నివేదికలు ► ఆందోళన చెందుతున్న అభ్యర్థులు అనంతపురం ఎడ్యుకేషన్ : డీఎస్సీ-14 ఎంపిక జాబితాలోని ‘నకిలీల’ పుట్ట పగులుతోంది. ఇటీవలే 14 మందిని నకిలీలుగా తేల్చిన అధికారులు.. వారిని ఎంపిక జాబితా నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో తాజాగా మరో ఎనిమిది మంది చేరారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల 8 మంది బోగస్ స్టడీ సర్టిఫికెట్లు, నలుగురు మాజీ సైనిక కోటా కింద, ఒకరు స్థానిక, మరొకరిని విద్యార్హత ధ్రువీకరణలో తేడా వల్ల తొలగించారు. ఐదూ నకిలీనే... బధిరుల కోటా కింద ఎంపికైన అభ్యర్థుల విషయం మరోసారి చర్చనీయాంశం కానుంది. 2008 డీఎస్సీని నకిలీ బధిరులు కుదిపేశారు. ఈసారీ అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బధిరుల కోటా కింద ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ కోఠిలోని ఈఎన్టీ ఆస్పత్రి నుంచి ధ్రువీకరణ పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. అదికూడా వైకల్యం 70 శాతానికి పైబడిన అభ్యర్థులే అర్హులు. ఈ డీఎస్సీలో సుమారు 20 మంది బధిరుల కోటా కింద ఎంపికయ్యారు. ధ్రువీకరణ పత్రాలపై నివేదికలు ఒక్కొక్కటిగా డీఈఓ కార్యాలయానికి వస్తున్నాయి. ఇప్పటిదాకా ఐదుగురు అభ్యర్థుల ధ్రువీకరణపత్రాలు వచ్చాయి. ఈ ఐదుగురూ అనర్హులుగా తేలింది. వీరికి 30-50 శాతం మాత్రమే వైకల్యమున్నట్లు తెలిసింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తహశీల్దార్లు కుల ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన నివేదికలు తహశీల్దార్ కార్యాలయాల గడప దాటడం లేదు. నాన్చుడు ధోరణి అవలంబిస్తుండటంతో విద్యాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గుత్తి నుంచి ఇద్దరు అభ్యర్థులు రెసిడెన్షియల్, యల్లనూరు నుంచి ఒకరు, బుక్కపట్నం నుంచి మరో అభ్యర్థి కుల ధ్రువీకరణ, అనంతపురం నుంచి ఒక అభ్యర్థి స్టడీ సర్టిఫికెట్‌పై నివేదికలు కోరుతూ విద్యాశాఖ అధికారులు లేఖలు రాశారు. వీటిలో గుత్తి నుంచి రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు వచ్చాయి. ఇవి అర్హత కల్గినవిగా తెలిసింది. అనంతపురం నుంచి ఓ అభ్యర్థి స్టడీ సర్టిఫికెట్ బోగస్ అని నివేదిక వచ్చింది. ఇక యల్లనూరు, బుక్కపట్నం తహశీల్దార్ కార్యాలయాల నుంచి కుల ధ్రువీకరణపత్రాల నివేదికలు రావాల్సి ఉంది. ఈ రెండింటిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖ అధికారులు వెంట పడుతున్నా.. రెవెన్యూ అధికారులు నాన్చుడి ధోరణి అవలంబిస్తున్నారు. దీంతో జాబితాలో తర్వాత స్థానంలో ఉన్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అనర్హులను తొలగిస్తే తమకు అవకాశం వస్తుందనే ఆశతో రోజూ డీఈఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఇప్పటిదాకా మొత్తం 22 మంది బోగస్ బోగస్ అభ్యర్థుల జాబితా 22కు చేరింది. ఇటీవల 14 మంది జాబితాను అధికారులు ప్రకటించారు. తాజాగా మరో ఎనిమిది బోగస్‌గా తేలింది. ఐదుగురు బధిరుల సర్టిఫికెట్లు, ఒకరు బోగస్ స్టడీ సర్టిఫికెట్, ఇద్దరు బోగస్ కుల ధ్రువీకరణపత్రాలు జత చేసినట్లు తెలిసింది. అయితే.. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారులు అధికారంగా వెల్లడించాల్సి ఉంది. -
రూ. 9 లక్షలు ఆదాయం.. సొంతిల్లు సొంతం!
► స్థిరాస్తి కొనడానికైనా.. అద్దెకైనా భాగ్యనగరమే బెస్ట్ ► నాలుగేళ్లుగా నగరంలో 6.3 శాతం పెరిగిన కమర్షియల్ ధరలు ► 10.46 శాతం మేర పడిపోయిన రెసిడెన్షియల్ అద్దెలు ► అర్థయంత్ర బై వర్సెస్ రెంట్ నివేదిక వెల్లడి భాగ్యనగరంలో సొంతిల్లు.. మోస్తారుగా ఉన్నోళ్లకు మాత్రం దక్కే అదృష్టమనేది నిన్నటి మాట. కానీ, నేడది ఏడాదికి రూ.9 లక్షల ఆదాయమున్న ప్రతీ ఒక్కరికీ సొంతం! దీనర్థం నేటికీ భాగ్యనగరంలో స్థిరాస్తి ధరలు అందుబాటులో ఉన్నాయని!! కొనడానికే కాదు అద్దెకుండేందుకైనా చారిత్రక నగరి దగ్గరిదారేనట!!! ఈ వరుసలో అహ్మదాబాద్‌కూ చోటుందని అర్థయంత్ర యాన్యువల్ బై వర్సెస్ రెంట్ (ఏబీఆర్ఎస్) నివేదిక వెల్లడించింది. ఇటీవల అర్థయంత్ర సంస్థ దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలైన అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కత్తా, ముంబై, పుణెల్లో ‘‘స్థిరాస్తి కొనుగోలు.. అద్దెలు’’ అంశంపై సర్వే చేసింది. ఇందులో పలు ఆసక్తికర వివరాలివిగో.. - సాక్షి, హైదరాబాద్ హైదరాబాద్ నగరంలో స్థిరాస్తి కొనేందుకైనా, అద్దెకుండేందుకైనా ధరలు అందుబాటులోనే ఉన్నాయి. నాలుగేళ్లుగా వాణిజ్య సముదాయాల అద్దె ధరలు 6.3 శాతం పెరిగాయి. ఆదే సమయంలో నివాస సముదాయాల ధరలు 10.46 శాతం మేర పడిపోయాయి. ఏడాదికి రూ.9 లక్షల ఆదాయం సంపాదించేవారు ఇక్కడ నివాస సముదాయాన్ని కొనుగోలు చేయవచ్చు. బెంగళూరు ఐటీ, స్టార్టప్ హబ్ పేరొందిన గార్డెన్ సిటీ.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండటంతో ఇక్కడ నివాస, వాణిజ్య సముదాయాల అద్దెలకు గిరాకీ బాగా ఉంది. గతేడాదితో పోల్చితే ఇక్కడి అద్దెలు 10.08 శాతం మేర పెరిగాయి. ఇదే సమయంలో స్థిరాస్తి ధరలు మాత్రం 2.55 శాతం మేర పడిపోయాయి. ఇక్కడ స్థిరాస్తిని కొనుగోలు చేయాలంటే ఏడాదికి కనీసం రూ.15 లక్షల ఆదాయం ఉండాల్సిందే. చెన్నై దేశంలో స్థిరాస్తి ధరలు ప్రియంగా ఉన్న నగరాల్లో చెన్నైది మూడో స్థానం. తొలి రెండు స్థానాలు ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లవి. గతేడాదితో పోల్చితే చెన్నైలో ధరలు 8.78 శాతం పెరిగాయి. ఆసక్తికరంగా అద్దెలు మాత్రం 1.7 శాతం మేర పడిపోయాయి. ఏడాదికి రూ.20 లక్షల ఆదాయం గడించేవారు మాత్రంమే చెన్నైలో స్థిరాస్తి సొంతమవుతుంది. ఢిల్లీ-ఎన్సీఆర్ దేశ రాజధానిలో స్థిరాస్తి ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. నివాస సముదాయాల ధరల విషయంలో ఢిల్లీది రెండో స్థానం. గత నాలుగే ళ్లుగా రాజధానిలో నివాస, వాణిజ్య సముదాయాల అద్దెలు 20 శాతం పెరిగాయి. ఇదే సమయంలో స్థిరాస్తి కొనుగోలు ధరలైతే 9.1 శాతం మేర పెరిగాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో స్థిరాస్తిని కొనుగోలు చేయాలంటే ఏటా ఆదాయం కనీసం రూ.25 లక్షలకు పైగానే ఆర్జించాలి మరి. కోల్కత్తా స్థిరాస్తి కొనుగోలుకైనా, అద్దె విషయంలోనైనా కోల్కత్తా సమాంతరంగా వృద్ధి చెందుతుంది. ఏడాదికాలంగా ఇక్కడ స్థిరాస్తి ధరలు 11.27 శాతం, అద్దెలు 11.48 శాతం మేర పెరిగాయి. ఏటా ఆదాయం రూ.15 లక్షలుంటే కోల్‌కత్తాలో ప్రాపర్టీ కొనుగోలు చేయవచ్చు. అహ్మదాబాద్ హైదరాబాద్ తర్వాత స్థిరాస్తి కొనుగోలుకైనా, అద్దెకైనా సామాన్యులకు అందుబాటులో ఉన్న నగరమేదైనా ఉందంటే అది అహ్మదాబాదే. ఏటా ఆదాయం రూ.10 లక్షలుంటే చాలు ఇక్కడ సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు. పిల్లల గదుల్లో రంగులు, అలంకరణ వారికి ఆహ్లాదం కలిగించేలా ఉండాలి. గదంతా కార్టూన్లతో నింపకుండా ఒక వైపు గోడను మాత్రమే కార్టూన్లకు కేటాయిస్తే సరిపోతుంది. చిన్నారుల కోసం ఫర్నీచర్, మంచం లాంటివి కొనేప్పుడు అందంతో పాటు పిల్లల భద్రత, సౌకర్యాలకు కూడా ప్రాధాన్యమివ్వాలి. -
మైనారిటీలకు 60 కొత్త స్కూళ్లు
-
31న గురుకులాల రౌండ్‌టేబుల్ సమావేశం
హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లోని సమస్యలపై అన్ని సంఘాలు కలసి గురుకులాల సమాఖ్యగా ఏర్పడి ఈ నెల 31న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నా యి. ‘గురుకుల వ్యవస్థ బలోపేతం-సమస్యలు-పరిష్కారం’ అనే అంశంపై ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ సంఘాల నాయకులు రామలక్ష్మణ్, దయానంద్, రవిచందర్, సీతామనోహర్, అర్జున వెంకట్‌రెడ్డి, యాదయ్య, బాలరాజు, పరంధాములు ఒక ప్రకటనలో తెలిపారు. -
నివాసయోగ్యమైన నగరాల్లో హైదరాబాద్..
జాతీయం వారణాసి - ఖాట్మండు బస్ సర్వీస్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మార్చి 4న వారణాసి నుంచి నేపాల్ రాజధాని ఖాట్మండుకు బస్ సర్వీసును ప్రారంభించారు. భారత్ - నేపాల్ మైత్రి బస్ సేవ పేరుతో దీన్ని ఆరంభించారు. కేంద్రమంత్రి దాన్వే రాజీనామా కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి రావు సాహెబ్ దాదారావు దాన్వే మార్చి5న పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న దాన్వే ఒక వ్యక్తికి ఒకే పదవి అనే పార్టీ నియమావళికి అనుగుణంగా పదవి నుంచి తప్పుకున్నారు. రెపో రేటు 0.25 శాతం తగ్గింపు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా విధాన సమీక్షతో సంబంధం లేకుండా మార్చి 4న రెపోరేటును 0.25 శాతం తగ్గించింది. దీంతో ఇది 7.75 నుంచి 7.5 శాతానికి తగ్గింది. రెపో రేటుతో ముడిపడిన రివర్స రెపో రేటు కూడా 6.5 శాతానికి తగ్గింది. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని యథాతథంగా 4 శాతం వద్ద కొనసాగించింది. రెపో రేటు తగ్గడం వల్ల గృహ, వాహన, రిటైల్ రుణాలపై నెలవారీ వాయిదాల చెల్లింపు (ఈఎంఐ) తగ్గనుంది. నివాసయోగ్యమైన నగరాల్లో హైదరాబాద్ అమెరికా కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్ మార్చి 3న విడుదల చేసిన ప్రపంచవ్యాప్తంగా నివాసయోగ్యమైన నగరాల జాబితా ‘క్వాలిటీ ఆఫ్ లివింగ్ రిపోర్ట - 2015’లో హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 138వ స్థానంలో ఉంది. 440 నగరాల్లో జీవన ప్రమాణాలను పరిశీలించి 230 నగరాలకు ర్యాంకులు కేటాయించారు. ఆస్ట్రియా రాజధాని వియన్నా అగ్రస్థానంలో, జూరిచ్ (స్విట్జర్లాండ్) రెండో స్థానంలో, ఆక్లాండ్ (న్యూజిలాండ్) మూడో స్థానంలో ఉన్నాయి. పుణే 145, బెంగళూరు 146, చెన్నై 151, ముంబై 152, న్యూఢిల్లీ 154, కోల్‌కతా 160 స్థానాల్లో నిలిచాయి. అమెరికాలో భారత రాయబారిగా అరుణ్‌సింగ్ అమెరికాలో భారత రాయబారిగా అరుణ్‌కుమార్ సింగ్‌ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ మార్చి 8న నియమించింది. 1979 ఐఎఫ్ఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం ఫ్రాన్‌సలో భారత రాయబారిగా పనిచేస్తున్నారు. 2015 జనవరిలో ఎస్.జయశంకర్ విదేశాంగ కార్యదర్శిగా నియమితులవడంతో ఈ స్థానానికి అరుణ్ కుమార్ సింగ్‌ను ఎంపిక చేశారు. 1200 దాటిన స్వైన్ ఫ్లూ మరణాలు దేశంలో 2015 మార్చి 4 నాటికి స్వైన్ ఫ్లూ వల్ల మరణించిన వారి సంఖ్య 1239కి చేరుకుంది. వ్యాధి సోకిన వారి సంఖ్య 23,153కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అత్యధికంగా గుజరాత్లో 300, రాజస్థాన్‌లో 295, మహారాష్ట్రలో 178, మధ్యప్రదేశ్‌లో 174 మంది మరణించారు. తెలంగాణలో 60, ఆంధ్రప్రదేశ్‌లో 14 మంది మరణించారు. ముస్లిం కోటాను రద్దు చేసిన మహారాష్ట్ర ముస్లింలకు విద్యా సంస్థల్లో కల్పించిన 5 శాతం రిజర్వేషన్లను మహారాష్ట్ర ప్రభుత్వం మార్చి 5న రద్దు చేసింది. ఇప్పటికే విద్యా సంస్థల్లో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందిన వారికి అవి వర్తిస్తాయని పేర్కొంది. 2014 అక్టోబర్‌లో జరిగిన ఎన్నికలకు ముందు అప్పటి ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా సంస్థల్లో, ఉద్యోగాల్లో మరాఠాలకు 16 శాతం, ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు ప్రకటించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టులో అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. కోర్టు మరాఠా రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేసి, ముస్లింలకు విద్యా సంస్థల్లో అనుమతినిచ్చింది. జర్నలిస్టు వినోద్ మెహతా మృతి ప్రముఖ జర్నలిస్టు, రచయిత వినోద్ మెహతా (73) అనారోగ్యంతో న్యూఢిల్లీలో మార్చి 8న మరణించారు. ఔట్లుక్ మేగజీన్ వ్యవస్థాపక సంపాదకుడైన మెహతా సండే అబ్జర్వర్, ఇండియన్ పోస్ట్, ది ఇండిపెండెంట్, ది పయనీర్ లాంటి పత్రిక, మేగజీన్లను నడిపారు. 1995లో ప్రారంభించిన ఔట్లుక్ మేగజీన్‌కు 17 ఏళ్లపాటు ప్రధాన సంపాదకుడుగా పనిచేసి 2012లో రిటైరయ్యారు. ‘లక్నోబాయ్’ పేరుతో 2011లో స్వీయ చరిత్రను ప్రచురించారు. అవార్డులు వీరప్ప మొయిలీకి సరస్వతీ సమ్మాన్ అవార్డు కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ 2014 సంవత్సరానికి ప్రతిష్టాత్మక సరస్వతీ సమ్మాన్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన రచించిన రామాయణ మహాన్వేషణనకుగాను ఈ అవార్డు దక్కింది. 2007లో తొలిసారి కన్నడ భాషలో ఈ పద్య రచన ప్రచురితమైంది. తర్వాత ఇది ఆంగ్లం, హిందీ, తెలుగు, తమిళం తదితర భాషల్లోకి అనువాదమైంది. 1991 నుంచి కేకే. బిర్లా ఫౌండేషన్ ఏటా ఈ అవార్డును అందజేస్తుంది. దీని కింద ప్రశంసా పత్రంతో పాటు రూ. 10 లక్షల నగదు బహూకరిస్తారు. సినారెకు సాహిత్య అకాడమీ ఫెలో పురస్కారం ప్రముఖ కవి, రచయిత డాక్టర్ సి. నారాయణరెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలో పురస్కారం లభించింది. ప్రముఖ రచయితలకు అత్యున్నత ఫెలో పురస్కారాన్ని సాహిత్య అకాడమీ ప్రకటిస్తుంది. 1970లో విశ్వనాథ సత్యనారాయణకు, 1999లో గుంటూరు శేషేంద్రశర్మకు, 2004లో భద్రిరాజు కృష్ణమూర్తికి ఈ పురస్కారం దక్కింది. ఆర్.శాంతకుమారికి అనువాద పురస్కారం రచయిత్రి ఆర్. శాంతకుమారికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం ప్రకటించింది. ఈమె ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కమార్తె. ప్రేమ్‌చంద్ (హిందీ రచయిత) ఆత్మకథను తెలుగులోకి అనువదించినందుకుగాను ఈమెకు ఈ పురస్కారం లభించింది. క్రీడలు మానవ్‌జిత్‌కు ప్రపంచ షాట్‌గన్ టోర్నీలో కాంస్యం అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య నిర్వహించే ప్రపంచకప్ షాట్‌గన్ టోర్నమెంట్లో భారత షూటర్ మానవ్‌జిత్ కాంస్య పతకం సాధించాడు. మార్చి 3న మెక్సికోలో జరిగిన ట్రాప్ ఈవెంట్ ఫైనల్లో మానవ్‌జిత్ మొదటి స్థానంలో నిలిచి ఉంటే రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హత దక్కేది. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సైనా నెహ్వాల్ ఓటమి చెందినప్పటికీ ఈ స్థాయికి చేరిన తొలి భారత క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. మార్చి 8న బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఫైనల్లో సైనా నెహ్వాల్‌ను కరోలినా ఆరీన్ (ఫ్రాన్స) ఓడించింది. గతంలో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను భారత్‌కు చెందిన ప్రకాశ్ పదుకొనే (1980), పుల్లెల గోపీచంద్ (2001) గెలుచుకున్నారు. మహిళల డబుల్స్ టైటిల్‌ను బావో యిక్సిన్, టాంగ్ యుయాంటింగ్ (చైనా) గెలుచుకున్నారు. వీరు ఫైనల్లో వాంగ్ గ్జియోలీ, యుయాంగ్ (చైనా)లను ఓడించారు. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను జాన్ జోర్గెన్సన్ (డెన్మార్క)ను ఓడించి చెన్‌లాంగ్ (చైనా) గెలుచుకున్నాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను మాథియాస్ బోయి, కార్‌సటన్ మొగెన్సన్ (డెన్మార్క) గెలుచుకున్నారు. వీరు ఫైనల్లో ఫు హైఫెంగ్, జాంగ్నన్ (చైనా)ను ఓడించారు. మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను జాంగ్నన్, జావో యున్లీ (చైనా) గెలుచుకున్నారు. వీరు ఫైనల్లో టోంటోవీ అహ్మద్, లియానా నస్టిర్ (ఇండోనేషియా)ను ఓడించారు. రాష్ట్రీయం తెలంగాణలో నేర బాధితుల పరిహార పథకం రాష్ట్రంలో నేరాల వల్ల నష్టపోయినవారికి, వారిపై ఆధారపడిన కుటుంబాలకు పరిహారం అందించడానికి ఉద్దేశించిన నిధిని ఏర్పాటు చేస్తూ మార్చి 7న తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేర బాధితుల పరిహార పథకం- 2015 పేరుతో ఏర్పాటు చేసే ఈ ప్రత్యేక నిధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. 2008లో కేంద్రం తెచ్చిన చట్టం ప్రకారం నేర ఘటనల బాధితులకు పరిహారం చెల్లించేందుకు అన్ని రాష్ట్రాలు ఒక పథకాన్ని అమలు చేయాల్సి ఉంది. సంవత్సరానికి రూ. 4.5 లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లింపు దారులకు వర్తించదు. ఈ పథకం కింద ప్రాణ నష్టం జరిగితే వయసును బట్టి రూ.1 లక్ష నుంచి రూ. 3 లక్షలు, శాశ్వత వైక్యలం కలిగితే రూ. 50 వేల నుంచి 2 లక్షల వరకు, పాక్షిక వైకల్యానికి రూ. 25 వేల నుంచి లక్ష వరకు, యాసిడ్ దాడిలో వైకల్యానికి రూ. 3 లక్షలు, అత్యాచారం జరిగితే రూ. 2 లక్షలు, వేధింపులు, మనుషుల అక్రమ రవాణా, కిడ్నాప్ తదితర ఘటనల బాధితులకు రూ. 50 వేలు చెల్లిస్తారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర శాసనసభ, శాసన మండలిని ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ మార్చి 7న ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగానూ ఆ రాష్ట్ర శాసనసభ, శాసన మండలిని ఉద్దేశించి అదే రోజు ప్రసంగించారు. అంతర్జాతీయం చట్టసభల్లో రెండింతలైన మహిళల ప్రాతినిధ్యం ప్రపంచవ్యాప్తంగా చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం 20 ఏళ్లలో రెండింతలు పెరిగిందని ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ) మార్చి 5న తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు 22.1 శాతం పార్లమెంటరీ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పేర్కొంది. ఇది 1995 లో 11.3 శాతంగా ఉండేది. సబ్ - సహారా ఆఫ్రికన్ దేశాల సభల్లో అధికంగా మహిళలు ఉన్నారు. రువాండాలో అత్యధికంగా 3.8 శాతం మంది ఉన్నారు. తర్వాత స్థానాల్లో బొలీవియా, అండోర్రా ఉన్నాయి. స్వీడన్ ఆరో స్థానంలో ఉంది. కోటా విధానం వల్ల మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని, ఇది 120 దేశాల్లో అమలవుతోందని ఐపీయూ పేర్కొంది. ఎలక్ట్ట్రిక్ కమ్యూనికేషన్ ఉపగ్రహాలు ప్రపంచంలో తొలిసారిగా పూర్తిగా ఎలక్ట్ట్రిక్‌తో పనిచేసే కమ్యూనికేషన్ ఉపగ్రహాలను కాలిఫోర్నియాలోని కేప్ కెనరావల్ నుంచి మార్చి 1న ప్రయోగించారు. అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ (స్పేస్ ఎక్స్) ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాలను ప్రయోగించింది. వీటిని కక్ష్యలోకి చేర్చడానికి రాకెట్ థ్రస్టర్ల బదులుగా ఎలక్ట్ట్రిక్ ఇంజన్లను ఉపయోగించారు. ఇవి రెండు దశాబ్దాలపాటు పనిచేస్తాయి. తక్కువ బరువు ఉండటం వల్ల ఈ రెండు ఇంజన్లను ఒకేసారి ప్రయోగించడానికి వీలుంటుంది. ఇవి భూస్థిర కక్ష్యలోకి చేరేందుకు కొన్ని నెలలు పడుతుంది. వీటిని బోయింగ్ సంస్థ ఫ్రాన్‌సలోని ఇయుటెల్‌శాట్, ఆసియా బ్రాడ్ కాస్ట్ శాటిలైట్ల కోసం నిర్మించింది. భారత్ -స్పెయిన్ రక్షణ ఒప్పందం రక్షణ రంగంలో సహకారాన్ని విస్తరించుకునేందుకు భారత్, స్పెయిన్ మధ్య న్యూఢిల్లీలో మార్చి 5న సంతకాలు జరిగాయి. స్పెయిన్ రక్షణ మంత్రి పెడ్రో మోరెమ్స్, భారత్ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సమక్షంలో ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. భారత్ ఆరు జలాంతర్గాముల నిర్మాణానికి నిర్దేశించిన పి-751 ప్రాజెక్టులో భాగం పంచుకోవడానికి స్పెయిన్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. నాలుగు నక్షత్రాల గ్రహం గుర్తింపు అమెరికన్ శాస్త్రవేత్తలు నాలుగు నక్షత్రాల వ్యవస్థలో భారీ గ్రహాన్ని కనుగొన్నారు. ఇది భూమికి 136 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ నక్షత్రాల వ్యవస్థ పేరు 30 అరి. ఇందులోని వాయుగ్రహం గురు గ్రహం కంటే 10 రెట్లు పెద్దగా ఉంది. శాన్ డిగోలో పాలోమార్ అబ్జర్వేటరీలోని టెలిస్కోప్ ద్వారా ఈ వ్యవస్థను గుర్తించారు. సాధారణంగా ఒక్కో గ్రహ వ్యవస్థకు ఒకే మాతృ నక్షత్రం ఉంటుంది. నాలుగు నక్షత్రాల గ్రహాన్ని కనుగొనడం ఇది రెండోసారి. మొదట గుర్తించిన గ్రహాన్ని కేఐసీ 4862625 పేరుతో పిలుస్తున్నారు. -
హాస్టళ్లకు సరుకులు ఫుల్
ప్రైవేటు మార్కెట్లో కొనుగోళ్లపై ఆంక్షలు అక్రమాల నిరోధానికి అధికారుల చర్యలు పాడేరు: పాడేరు ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పూర్తిస్థాయి నిత్యవసర సరుకులను అందుబాటులో ఉంచుతున్నారు. టెండర్లు పొందిన వ్యాపారులు జీసీసీకి సక్రమంగా సరుకులను సరఫరా చేయకపోవడం, అక్కడ నుంచి జీసీసీ ద్వారా ఆశ్రమాలకు పూర్తిస్థాయిలో పంపిణీ జరగడం లేదనే ఆరోపణలు అధికంగా ఉన్నాయి. హాస్టల్ వార్డెన్లు కూడా నెలకు సరిపడా పూర్తిస్థాయి సరుకులకు ఇండెంట్లను జీసీసీకి పంపడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో పూర్తిస్థాయిలో సరుకుల నిల్వలకు ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్, గిరిజన సంక్షేమశాఖ డీడీ బి.మల్లికార్జునరెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు భోజన అవసరాలకు సంబంధించిన అన్ని నిత్యవసర సరుకులను జీసీసీ నుంచే పంపిణీ చేయాలని, ప్రైవేటు మార్కెట్లో కొనుగోళ్లు తగ్గించాలని ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీంతో అక్రమాలకు చెక్ పడింది. టెండరుదారులంతా జీసీసీ ఇండెంట్ల ప్రకారం సరుకులను సరఫరా చేస్తున్నారు. అక్కడ నుంచి విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా సరుకులు పూర్తిస్థాయిలో ఆశ్రమ పాఠశాలలకు చేరుతున్నాయి. గతంలో వార్డెన్లు కొద్ది మొత్తంలోనే సరుకులను పొందేవారు. కొంత మంది వార్డెన్లు బయట ప్రైవేటు మార్కెట్లో కొనుగోలు చేస్తున్నామంటూ బిల్లులు పెట్టేవారు. దీనివల్ల అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఆంక్షలు విధించారు. సరుకులు పక్కదారి పట్టకుండా ఏటీడబ్ల్యుఓల పర్యవేక్షణలోనే అన్ని సరుకులను ఆశ్రమ పాఠశాలలకు పంపిణీ చేస్తున్నారు. దీనికితోడు రోజువారీ సరుకుల నిల్వల రికార్డుల తనిఖీ బాధ్యత కూడా ఏటీడబ్ల్యుఓలకే అప్పగించారు. ఆశ్రమ పాఠశాలల్లో రోజువారీ విద్యార్థుల సంఖ్యను కూడా ఆన్లైన్ చేయాలనే నిబంధనలు కూడా ఆశ్రమాల్లో అక్రమాలకు చెక్ పెట్టేదిగా ఉంది. విద్యార్థులు సెలవు దినాల్లో ఇళ్లకు పోయినా రోజు వారీ నివేదికను గిరిజన సంక్షేమ అధికారులు సేకరిస్తున్నారు. -
ఆణిముత్యాలకు కష్టాలు
అనంతపురం ఎడ్యుకేషన్ : అనంత ఆణిముత్యాలు.. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ విద్యార్థులకు కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో రెసిడెన్షియల్ సదుపాయంతో ఉచితంగా చదివించడం ఈ పథకం లక్ష్యం. దీనికి 2006లో అప్పటి కలెక్టర్ శ్రీధర్ ‘అనంత ఆణిముత్యాలు’గా నామకరణం చేశారు. ఒక్కో జిల్లాలో ఒక్కో పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. కులాలు, పాఠశాలల ఆధారంగా రిజర్వేషన్ ఉంటుంది. మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. గత విద్యా సంవత్సరం నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రవేశ పెట్టారు. ఈ ఏడాది జూనియర్ కళాశాలలు పునఃప్రారంభమై పక్షం రోజులవుతున్నా ఇప్పటి వరకు కనీసం దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేదు. ఫలితంగా పథకం అమలుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ముందుగా ఈనెల 5 నుంచి 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారులు ఓ వెబ్సైట్ (apepass.cgg.gov.in) ఇచ్చారు. అందులోకి వెళ్తే దరఖాస్తు కన్పించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో టెక్నికల్ సమస్యలు వచ్చాయని గ్రహించి తిరిగి ఈనెల 13 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు సూచించారు. ఈ ప్రకటన వచ్చి నాలుగు రోజులు గడిచినా ఇప్పటి కీ వెబ్సైట్లో దరఖాస్తు సాఫ్ట్వేర్ జాడ కన్పించడం లేదు. దాన్ని పొందుపరచక పోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు రోజూ ఇంటర్నెట్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుల కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. హార్ట్‌కాపీలు తీసుకుంటారనే ఆశతో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని ధర్మవరం పట్టణానికి చెందిన రంగయ్య సోమవారం ‘సాక్షి’తో వాపోయారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ హార్డ్‌కాపీలు తీసుకోమని, ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలంటూ అధికారులు తేల్చి చెబుతున్నారు. అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సాఫ్ట్వేర్ ఎప్పుడు పొందు పరుస్తారో ఇక్కడి అధికారులకు కూడా సరైన సమాచారం లేదు. దీంతో వారుకూడా ఈ రోజు.. రేపు అంటున్నారు తప్ప ఖచ్చితమైన సమయం చెప్పడం లేదు. డోలాయమానంలో విద్యార్థులు అనంత ఆణిముత్యాలు పథకానికి నిరుపేద విద్యార్థులే దరఖాస్తు చేసుకుంటారు. అయితే ఇప్పటిదాకా కనీసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడంతో చాలామంది ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కళాశాలలు ప్రారంభమై తరగతులు జరుగుతుంటే వీరంతా ఎదురుచూస్తున్నారు. పోనీ కళాశాలల్లో చేరేద్దామంటే ఆర్థికభారం. అలాగని వేచిచూద్దామంటే ఈ ఎంపిక ప్రక్రియ ఎప్పుడు ప్రారంభవుతుందో తెలీదు. చాలామంది విద్యార్థులు దిక్కుతెలీక డోలాయమానంలో పడ్డారు. వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.