ఎంకేజీఆర్ ఎస్టేట్స్ హౌసింగ్ ఎల్‌ఎల్‌పీ కంపెనీ కేపీహెచ్‌బీలో 92 ఎకరాల్లో లేక్ వ్యూ మెగా టౌన్íÙప్‌ను నిర్మిస్తున్నామని ప్రచారం చేస్తుంది. ఇందులో అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ఆఫీసు, కమర్షియల్ స్పేస్ అన్నీ ఉంటాయని చెబుతుంది. 30 ఎకరాలలో 33 అంతస్తులలో అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నామని ప్రీలాంచ్‌లో చ.అ.కు రూ.4,500 చొప్పున వసూలు చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఉన్న భూమికి టైటిలే లేకపోవటం గమనార్హం.
ప్రణవ రియల్టర్స్ ఇండియా ఎల్‌ఎల్‌పీ కడ్తాల్‌లో టెంపుల్ టౌన్ వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నామని ఢంకా బజాయిస్తుంది. ఇందులో అన్నీ విల్లా ప్లాట్లేనని, గజం రూ.18,999లకు విక్రయిస్తుంది. ఇదే సంస్థ కాప్రాలో 60 వేల చ.అ.లలో జీ+4 అంతస్తులలో కమర్షియల్ కాంప్లెక్స్ కూడా నిరి్మస్తున్నామని చెబుతుంది. ఏ ప్రాజెక్టు కూడా రెరాలో నమోదు కాకపోవటమే కాదు నిర్మాణ అనుమతులూ లేకపోవటం విశేషం.
సాక్షి, హైదరాబాద్: ఇలా ఒకటి రెండు కాదు నగరంలో రాత్రికి రాత్రే పుట్టగొడుగుల్లా నిర్మాణ సంస్థలు వెలుస్తున్నాయి. గృహ కొనుగోలుదారులకు ఆశ పెట్టి వారి కష్టార్జితాన్ని దోచేస్తున్నాయి. నిబంధనలను అతిక్రమించే డెవలపర్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కేవలం షోకాజ్ నోటీసుల జారీకే పరిమితం అవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కళ్లముందు వందలాది సంస్థలు ప్రీలాంచ్‌లో జనాలను నట్టేట ముంచేస్తుంటే మొద్దు నిద్రలో ఉందని డెవలపర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి.
బ్రోచర్ల మీదే ప్రాజెక్ట్‌లు..
రాత్రికి రాత్రే సంస్థలను పెట్టే నకిలీ బిల్డర్ల ప్రాజెక్ట్‌లన్నీ బ్రోచర్ల మీదనే ఉంటాయి. ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు, రెరాలో నమోదు ఏవీ ఉండవు. వంద శాతం సొమ్ము చెల్లిస్తే చాలు.. సొంతిల్లు సొంతమవుతుందని నమ్మించి నట్టేట ముంచేస్తున్నారు. సాహితీ, జయ గ్రూప్, భువన్‌తేజ వంటి నిర్మాణ సంస్థలు ఇప్పటికే వేలాది మంది కస్టమర్ల నుంచి రూ.కోట్లలో వసూలు చేసి కుచ్చుటోపి పెట్టిన ఘటనలనేకం. ఇటీవల కోకాపేట, ఖానామెట్ వేలంలో భూములు దక్కించుకున్న పలు నిర్మాణ సంస్థలు కూడా ప్రీలాంచ్‌లో సొమ్ము వసూలు చేయడం గమనార్హం.
హ్యాపెనింగ్ ప్లేస్‌లలోనే ఎక్కువ..
అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో తక్కువ ధరకే ప్రాపర్టీ అంటే ఎవరైనా ఇట్టే ఆకర్షితులవుతారు. ఇదే ప్రీలాంచ్ మోసగాళ్ల మంత్రం. ప్రధానంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, కొల్లూరు, నార్సింగి, నిజాంపేట, ఎల్బీనగర్, కొల్లూరు, నార్సింగి, పుప్పాలగూడ, తెల్లాపూర్ వంటి ప్రాంతాలలో ఎక్కువగా ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారు.
అంతా సోషల్ మీడియాలోనే..
ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌ల ప్రచారాలన్నీ సోషల్ మీడియా వేదికగానే సాగుతుంది. పెద్ద కంపెనీలేమో పాత కస్టమర్లకు అంతర్గత విక్రయాలు చేస్తుంటే.. కొన్ని కంపెనీలేమో తమ పేరు బయట పడకుండా ఏజెంట్ల ద్వారా వాట్సాప్, ట్విట్టర్‌లలో ప్రచారం చేయిస్తున్నాయి. పెద్ద మొత్తంలో కమీషన్ ఇస్తూ ఏజెంట్లను నియమించుకుంటున్నారు. దీంతో గ్రామాలు, పట్టణాలలో తిరుగుతూ వీకెండ్ వస్తే చాలు కార్లలో కస్టమర్లను తరలించి ప్రాజెక్ట్ విజిట్‌లు చేపిస్తున్నారు. గాలిలో మేడలు చూపిస్తూ కస్టమర్ల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment