rules break
-
హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ సంస్థల మాయాజాలం.. రెరా మొద్దు నిద్ర!
ఎంకేజీఆర్ ఎస్టేట్స్ హౌసింగ్ ఎల్ఎల్పీ కంపెనీ కేపీహెచ్బీలో 92 ఎకరాల్లో లేక్ వ్యూ మెగా టౌన్íÙప్ను నిర్మిస్తున్నామని ప్రచారం చేస్తుంది. ఇందులో అపార్ట్మెంట్లు, విల్లాలు, ఆఫీసు, కమర్షియల్ స్పేస్ అన్నీ ఉంటాయని చెబుతుంది. 30 ఎకరాలలో 33 అంతస్తులలో అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నామని ప్రీలాంచ్లో చ.అ.కు రూ.4,500 చొప్పున వసూలు చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఉన్న భూమికి టైటిలే లేకపోవటం గమనార్హం. ప్రణవ రియల్టర్స్ ఇండియా ఎల్ఎల్పీ కడ్తాల్‌లో టెంపుల్ టౌన్ వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నామని ఢంకా బజాయిస్తుంది. ఇందులో అన్నీ విల్లా ప్లాట్లేనని, గజం రూ.18,999లకు విక్రయిస్తుంది. ఇదే సంస్థ కాప్రాలో 60 వేల చ.అ.లలో జీ+4 అంతస్తులలో కమర్షియల్ కాంప్లెక్స్ కూడా నిరి్మస్తున్నామని చెబుతుంది. ఏ ప్రాజెక్టు కూడా రెరాలో నమోదు కాకపోవటమే కాదు నిర్మాణ అనుమతులూ లేకపోవటం విశేషం. సాక్షి, హైదరాబాద్: ఇలా ఒకటి రెండు కాదు నగరంలో రాత్రికి రాత్రే పుట్టగొడుగుల్లా నిర్మాణ సంస్థలు వెలుస్తున్నాయి. గృహ కొనుగోలుదారులకు ఆశ పెట్టి వారి కష్టార్జితాన్ని దోచేస్తున్నాయి. నిబంధనలను అతిక్రమించే డెవలపర్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కేవలం షోకాజ్ నోటీసుల జారీకే పరిమితం అవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కళ్లముందు వందలాది సంస్థలు ప్రీలాంచ్లో జనాలను నట్టేట ముంచేస్తుంటే మొద్దు నిద్రలో ఉందని డెవలపర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. బ్రోచర్ల మీదే ప్రాజెక్ట్‌లు.. రాత్రికి రాత్రే సంస్థలను పెట్టే నకిలీ బిల్డర్ల ప్రాజెక్ట్‌లన్నీ బ్రోచర్ల మీదనే ఉంటాయి. ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు, రెరాలో నమోదు ఏవీ ఉండవు. వంద శాతం సొమ్ము చెల్లిస్తే చాలు.. సొంతిల్లు సొంతమవుతుందని నమ్మించి నట్టేట ముంచేస్తున్నారు. సాహితీ, జయ గ్రూప్, భువన్‌తేజ వంటి నిర్మాణ సంస్థలు ఇప్పటికే వేలాది మంది కస్టమర్ల నుంచి రూ.కోట్లలో వసూలు చేసి కుచ్చుటోపి పెట్టిన ఘటనలనేకం. ఇటీవల కోకాపేట, ఖానామెట్ వేలంలో భూములు దక్కించుకున్న పలు నిర్మాణ సంస్థలు కూడా ప్రీలాంచ్లో సొమ్ము వసూలు చేయడం గమనార్హం. హ్యాపెనింగ్ ప్లేస్‌లలోనే ఎక్కువ.. అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో తక్కువ ధరకే ప్రాపర్టీ అంటే ఎవరైనా ఇట్టే ఆకర్షితులవుతారు. ఇదే ప్రీలాంచ్ మోసగాళ్ల మంత్రం. ప్రధానంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, కొల్లూరు, నార్సింగి, నిజాంపేట, ఎల్బీనగర్, కొల్లూరు, నార్సింగి, పుప్పాలగూడ, తెల్లాపూర్ వంటి ప్రాంతాలలో ఎక్కువగా ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారు. అంతా సోషల్ మీడియాలోనే.. ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌ల ప్రచారాలన్నీ సోషల్ మీడియా వేదికగానే సాగుతుంది. పెద్ద కంపెనీలేమో పాత కస్టమర్లకు అంతర్గత విక్రయాలు చేస్తుంటే.. కొన్ని కంపెనీలేమో తమ పేరు బయట పడకుండా ఏజెంట్ల ద్వారా వాట్సాప్, ట్విట్టర్లలో ప్రచారం చేయిస్తున్నాయి. పెద్ద మొత్తంలో కమీషన్ ఇస్తూ ఏజెంట్లను నియమించుకుంటున్నారు. దీంతో గ్రామాలు, పట్టణాలలో తిరుగుతూ వీకెండ్ వస్తే చాలు కార్లలో కస్టమర్లను తరలించి ప్రాజెక్ట్ విజిట్లు చేపిస్తున్నారు. గాలిలో మేడలు చూపిస్తూ కస్టమర్ల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. -
పోలీసోడివా.. అయితే ఏంటి? లైసెన్స్ తియ్యి
నేనో పోలీస్నయ్యా.. పని మీద వెళ్తున్నానంటే వినవేంటయ్యా.. అంటూ తనను వెంబడించి అడ్డగించిన పైస్థాయి అధికారికి ఆ పోలీస్ అధికారి బదులిచ్చాడు. అయితే ఏంటి? అలా బండి నడుపుతావా? లైసెన్స్ చూపించు అని నిలదీశాడు పైస్థాయి అధికారి. అయితే నిర్లక్ష్య ధోరణి ఉన్న ఆ అధికారి మాత్రం అదే పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అయ్యింది. కట్ చేస్తే.. రూల్స్ బ్రేక్ చేసిన ఆ అధికారి ఉద్యోగం ఊడింది. నిర్లక్ష్య ధోరణితో బండి నడపడంతో పాటు పలు రకాల కేసుల కింద అతనిపై కేసులు నమోదు కావడంతో అరెస్ట్ కూడా అయ్యాడు. చేసిన తప్పునకు అతనికి శిక్ష కఠినంగానే ఉండొచ్చని తెలుస్తోంది. ఫ్లోరిడాలో ఓర్లాండో నగరంలో గంటకు 45 మైళ్ల స్పీడ్‌తో వెళ్లాల్సిన చోట.. 80 మైళ్ల వేగంతో అధికారిక వాహనంలోనే దూసుకెళ్లిన ఓ పోలీసోడికే పడిన శిక్ష ఇది. అక్కడంతే.. చట్టాలు వెరీ పవర్ఫుల్. ఎవరికీ చుట్టంగా వ్యవహరించదు మరి!. “I am going into work" Speeding police officer pulled over by another officer https://t.co/NKV4xszcZq pic.twitter.com/mZtnZXmC4P — BBC News (World) (@BBCWorld) June 15, 2023 Video Credits: BBC News World ఇదీ చదవండి: బరువు తగ్గాలనుకుంటే.. మనిషే లేకుండా పోయాడు పాపం -
సికింద్రాబాద్ అగ్నిప్రమాదం: నిప్పుల్లో నిబంధనలు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని రూబీ ఎలక్ట్రికల్ స్కూటర్స్, రూబీ లాడ్జీలతో కూడిన భవనం నిబంధనల ఉల్లంఘనకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంది. ఫైర్ సేఫ్టీ మెజర్స్ అతిక్రమించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. భవనం ఏరియా సైతం ఉండాల్సిన విధంగా లేదు. ఈ కారణంగానే సోమవారం రాత్రి చోటు చేసుకున్న అగ్నిప్రమాదం ఎనిమిది మందిని పొట్టనపెట్టుకుంది. ఉల్లంఘనలు ఇలా.. ► భవనం సెల్లార్, గ్రౌండ్ ప్లస్ ఫోర్‌తో పాటు పెంట్ హౌస్‌తో కలిపి మొత్తం ఆరు అంతస్తులు ఉంది. సెల్లార్‌ను నిబంధనలకు విరుద్ధంగా ఈ–బైక్స్ షోరూమ్, సర్వీసింగ్ పాయింట్‌గా మార్చారు. ఈ మొత్తం విస్తీర్ణంలో కనీసం 1/3 వంతు ఖాళీ స్థలం ఉండాలి. ఇది మచ్చుకైనా లేదు. భవనం చుట్టూ ఫైరింజన్ స్వేచ్ఛగా తిరిగేలా ఖాళీ స్థలం ఉండాలి. అరకొర స్థలంలో నిర్మించిన ఈ భవనంలో తూర్పు వైపు రోడ్డు మినహామిస్తే మిగిలిన మూడు దిక్కులూ కనీసం నడిచే స్థలం కూడా లేదు. ► ప్రమాదం జరిగితే బయటపడానికి వెలుపల వైపు స్టెయిర్ కేస్ ఉండాలి. వెలుపల మాట అటుంచితే లోపల ఉన్న ఇంటర్నల్ స్టెయిర్ కేస్ మీటర్ వెడల్పు కూడా లేదు. అత్యవసర సమయంలో వెలిగించేందుకు ఎమర్జెన్సీ లైట్లు, ఆటో గ్లో సిస్టమ్ ఉండాలి. భవనంలో ఎమర్జెన్సీ లైట్లు తగిన సంఖ్యలో లేవు. గ్లో సిస్టమ్ లేనే లేదు. ప్రమాదం జరిగితే అగ్నిమాపక సిబ్బంది కోసం ప్రత్యేక లిఫ్ట్ ఉండాలి. ఇది ఎక్కడా కనిపించలేదు. స్టెయిర్ కేస్ వద్ద ఉన్నది కూడా లాడ్జిలో బస చేసిన వారికీ ఉపయుక్తంగా లేదు. ► మంటలార్పేందుకు ఈ భవనంలో ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, వాటర్ పైపులు, స్ప్రింక్లర్స్‌తో పాటు వెట్ రైజర్ తప్పనిసరి. ఇందులో వాటర్ పైపులు, స్ప్రింక్లర్స్ మాత్రం ఉన్నాయి. అవి ఎంత వరకు పని చేశాయన్నది తేలాల్సి ఉంది. విద్యుత్ ఫైర్ అలారం, మాన్యువల్ ఫైర్ అలారం తప్పనిసరి. ఈ రెండూ రూబీ లాడ్జిలో మచ్చుకైనా కనిపించలేదు. ప్రమాదాన్ని పసిగట్టి హెచ్చరించే ఆటోమేటిక్ వ్యవస్థ ఉండాలి. ఇలాంటిది ఎక్కడా కనిపించలేదని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. ► అగ్ని ప్రమాదాల్లో మాత్రమే వినియోగించడానికి ఉపకరించే అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ తప్పనిసరి. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ మాత్రమే ఉంది. దీన్ని సాధారణ వాడకానికి వినియోగిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. అగ్ని ప్రమాదాల సందర్భంలో నీటిని సరఫరా చేసేందుకు విద్యుత్, డీజిల్, జాకీ పంప్‌లు ప్రత్యేకంగా ఉండాలి. ఎంత వెతికినా ఇవి ఎక్కడా కనిపించలేదు. నిప్పుల్లో నిబంధనలు అగ్ని మాపక నిబంధనల్లో రూబీ లాడ్జీ యాజమాన్యం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపించింది. ఇలాంటి నిర్లక్ష్యపూరిత నిర్మాణాలు నగరంలో అనేకం ఉన్నాయి. వీటి విషయం అటు పాలకులు, ఇటు అధికారులు ఎవరికీ పట్టడంలేదు. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ఒకటి రెండు రోజులు హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత కథ షరామామూలే. అనుమతుల్లేని భవనాలు, పై అంతస్తులు నిర్మించుకోవడం, పైస్థాయిలో పైరవీలతో అనుమతులు తీసుకోవడమో, మేనేజ్ చేయడమో నగరంలో సాధారణంగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్ని నిబంధనలు పెట్టినా, చట్టాలు తీసుకువచ్చినా అవన్నీ కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. అన్ని శాఖలు మూకుమ్మడిగా అనుమతి నిరాకరించిన అనేక బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాలకు ప్రభుత్వమే వివిధ సందర్భాల్లో అనుమతులు మంజూరు చేసింది. వీటి విషయంలో న్యాయస్థానాలు సైతం పలుమార్లు మొట్టికాయలు వేసినా.. పటిష్ట చర్యలు తీసుకోవడానికి మాత్రం వెనుకడుగు వేస్తోంది. కోఠిలోని పుష్పాంజలి కాంప్లెక్స్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం ఈ విషయంలో అందరి కళ్లూ తెరిపించింది. ఆ తర్వాత మీనా జ్యువెలర్స్ ఉదంతంతో అధికార గణం మరింత అప్రమత్తమయ్యామంటూ ఊదరగొట్టింది. ఇవన్నీ కేవలం ఆరంభశూరత్వాలుగానే మిగిలిపోయాయి. ముఖ్యంగా నగరంలో ఉన్న అని భవనాలను సందర్శించి ఫైర్ సేఫ్టీ మెజర్స్ పరీక్షిస్తామని, నిబంధనల ప్రకారం లేని వాటి యజమానులను చైతన్య పరుస్తామని, ఆ తర్వాత కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు అనేక సందర్భాల్లో ప్రకటించారు. కొన్ని రోజులు గడిచాక ఈ విషయాలనే మర్చిపోతున్నారు. గతంలో అధికారులు నిర్వహించిన సర్వేలో ఇలాంటి భవనాలు నగరంలో వేల సంఖ్యలో ఉన్నాయని బయటపడింది. అయినా ఇప్పటికీ వీటిపై తీసుకున్న సరైన చర్యలు లేవు. అందుకే ఎక్కడపడితే అక్కడ అక్రమ భవనాలు వెలుస్తున్నాయి. సోమవారం నాటి రూబీ లాడ్జి అగ్ని ప్రమాదంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఇకనైనా అధికారులు కఠినంగా వ్యవహరించి సరైన చర్యలు తీసుకోకపోతే... అనేక మంది అమాయకుల ప్రాణాలు బలి కావాల్సిందే. (క్లిక్ చేయండి: చివరి నిమిషంలో రూబీ లాడ్జీలో దిగి.. మృత్యువు పిలిచినట్టు..) -
లాక్డౌన్ నిబంధనలు గాలికి
హొసపేటె: సెకెండ్ వేవ్ నియంత్రణకు ప్రభుత్వం నానా తంటాలు పడుతుంటే ప్రజలు మాత్రం నిర్లక్ష్యం వీడలేదు. బుధవారం లాక్డౌన్ సడలింపు వేళలో ఒక్కసారిగా వందల మంది మార్కెట్లకు వచ్చారు. భౌతిక దూరం పాటించకుండా తిరిగారు. పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు ప్రధాన వీధులు కిక్కిరిసిపోయాయి. కోవిడ్ నిబంధనలు తుంగలో తొక్కారు. రాయచూరు రూరల్: జిల్లాలో కరోనా కట్టడికి ఈనెల 24 వరకు సంపూర్ణ లాక్డౌన్ విధించారు. కఠినంగా ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించారు. బుధవారం ఉదయం కొంత విరామం ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి నిత్యావసరాలు కొనుగోలు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే అవకాశం కల్పించారు. ఇదే సమయంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. చదవండి: డేంజర్ జోన్లో 6 జిల్లాలు చదవండి: టీకా రక్ష.. అందని ద్రాక్ష? -
రూల్స్ బ్రేక్ చేసిన సీఎం కుమారుడు, భార్యతో కలిసి..
బెంగళూరు: దేశవ్యాప్తంగా కరోనా కట్టడి చర్యలు కొనసాగుతున్నాయి. చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కర్ఫ్యూ, లాక్డౌన్ అమలు చేస్తున్నారు. అయితే వాటిని కొందరు పట్టించుకోవడం లేదు. తాజాగా ముఖ్యమంత్రి యడియూరప్ప కుమారుడే స్వయంగా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు. సీఎం కుమారుడు, బీజేపీ కర్ణాటక ఉపాధ్యక్షుడు బీవై విజయేంద్ర తన భార్యతో కలిసి మైసూర్ జిల్లా నంజనగూడులోని కంఠేశ్వర స్వామి ఆలయాన్ని మంగళవారం ఉదయం సందర్శించారు. భార్యతో కలిసి గర్భ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అర్థగంటకు పైగా ఆ ప్రాంతంలో ఉన్నారు. ఆయన సందర్శన నేపథ్యంలో భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం తనయుడు కావడంతో ఆలయ అధికారులు కూడా కోవిడ్ నిబంధనల్ని పక్కన పెట్టేశారు. ఆయనకు వీఐపీ మర్యాదలన్నీ చేశారు. కాగా, బీవై విజయేంద్ర ఆలయ సందర్శన కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతోంది. సీఎం కుమారుడికి నిబంధనలు వర్తించవా? అని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా కర్ణాటకలో లాక్డౌన్ కొనసాగుతోంది. దీంతో ఆలయాలన్నీ మూసివేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన రూల్స్‌ను బ్రేక్ చేసిన విజయేంద్రపై చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రత్యేకంగా విజయేంద్ర ఆలయంలో పూజలు చేపట్టడం పలు విమర్శలకు దారితీసింది. సామాన్యులకు ఒక రూల్.. నాయకులకు ఒక నిబంధన ఉంటదా? అని స్థానికులూ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో విజయేంద్రపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: గొర్రెల ధర్నా: బర్త్ డే నాడు గవర్నర్‌కు చేదు అనుభవం -
కోవిడ్ రూల్స్ బ్రేక్: కాళ్లు మొక్కిన దళితులు
చెన్నె: అణగారిన వర్గాలపై ఇంకా వివక్ష కొనసాగుతోంది. అణగారిన వర్గాలను మరింత అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని దళితులతో కాళ్లు మొక్కించుకున్న ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మే 12వ తేదీన తిరువన్నెనల్లూరు సమీపంలోని ఒట్టనందల్ గ్రామంలో దళిత కుటుంబాలు గ్రామ దేవత ఉత్సవాలు నిర్వహించారు. అయితే కరోనా నేపథ్యంలో అనుమతి లేకుండా ఉత్సవాలు జరిపారు. ఈ వేడుకకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. దీనిపై గ్రామ పెద్దలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్వాహకులపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతరం కోర్టుకు వెళ్లారు. వారిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసి పంపించేసింది. అయితే పంచాయతీ పెద్దలు మాత్రం తమ ముందుకు హాజరుకావాలని ఆదేశించారు. పంచాయతీ కోర్టు గ్రామ పెద్దలను కలిసి వారి కాళ్లపై పడాలని ఆదేశించింది. ఈ తీర్పుతో దళితులు తిరుమల్, సంతానం, అరుముగం పంచాయతీ సభ్యుల కాళ్లపై పడి క్షమాపణలు తెలిపారు. ఈ ఘటనపై దళిత, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. -
లాక్డౌన్ ఉల్లంఘన: 2 వేల బైక్‌లు సీజ్
బరంపురం: నగరంలో లాక్డౌన్, షడ్‌డౌన్‌లతో పాటు నైట్ కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. గత పది రోజులుగా సుమారు 2వేలకు పైగా మోటార్ వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. 832 మందిపై కేసులు నోమోదు చేసి నోటీసులు జారీ చేసినట్లు ఎస్డీపీఓ బిష్ణుప్రసాద్ పాత్రో తెలిపారు. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావొద్దని, నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూ.41 వేల జరిమానా.. రాయగడ: కరోనా నియంత్రణలో భాగంగా అమలు చేస్తున్న వారాంతపు షట్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై కల్యాణసింగుపూర్ పోలీసులు కొరడా ఝులిపించారు. ఐఐసీ సుకుమా హంసద్ ఆధ్వర్యంలో పోలీసులు కల్యాణసింగుపూర్‌లో తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి రూ.41వేలు జరిమానా విధించినట్లు ఐఐసీ అధికారి తెలిపారు. ఏఎస్ఐ డీకే సాహు, సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. -
గెలుపు సంబరం.. పొంచి ఉన్న కరోనా విస్ఫోటనం
సాక్షి, హైదరాబాద్: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, అన్నాడీఎంకే, యూడీఎఫ్ కూటమితో పాటు బీజేపీ నాయకులు గెలుపు సంబరాలు చేసుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో విజయం సాధించడంతో ఆయా పార్టీల శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల మాటున కరోనా ఉందనే విషయాన్ని విస్మరించారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి, తెలుగు రాష్ట్రాల్లో నాగార్జునసాగర్, తిరుపతి ఉప ఎన్నికతో పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఆయా స్థానాల్లో గెలుపొందిన పార్టీలకు చెందిన శ్రేణులు విజయోత్సవాలు చేసుకున్నారు. ఫలితాల అనంతరం గెలుపు సంబరాలు చేసుకోవద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో విజయోత్సవాలపై ఈసీ నిషేధం విధించింది. అయితే గెలుపు ఆనందంలో పార్టీ శ్రేణులు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఆనందం వస్తే ఆపుకోలేమంటూ గుంపుగా తీన్మార్ డ్యాన్స్‌లు చేస్తూ.. రంగులు చల్లుకుంటూ బ్యాండ్‌భాజా మధ్య సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు గుమికూడి కరోనా నిబంధనలు ఉల్లంఘించారు. ఆధిక్యం భారీగా ఉండడంతో ఉదయం నుంచే పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగారు. పార్టీ కార్యాలయాల ఎదుట, ప్రధాన చౌరస్తాల్లో పటాసులు పేలుస్తూ.. మిఠాయిలు పంచుకుంటూ.. డ్యాన్స్‌లు చేస్తూ.. నినాదాలు చేస్తూ ఆనందోత్సాహాల మధ్య గడిపారు. అయితే ఈ సమయంలో మాస్క్‌లు ధరించడం.. భౌతిక దూరం పాటించడం.. శానిటైజర్ వినియోగం వంటివి మరిచారు. ఆనందోత్సాహాల మధ్య నిబంధనలు ఉల్లంఘించారు. దీన్ని గమనించిన ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే వారిపై కేసులు నమోదు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. మరి చూడాలి ఈ సంబరాలపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది. అయితే ప్రస్తుతం వీరు చేసిన చర్యలతో కొన్ని రోజుల్లో ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంది. కరోనా విస్ఫోటనం చెందే అవకాశాలు ఉన్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘం చేసిన విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకుని పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ సంబరాలకు దూరంగా ఉన్నారు. 'ఇది ప్రజల విజయం. సంబరాలు చేసుకునే సమయం కాదు. అందరూ మాస్క్‌లు ధరించండి' అంటూ రెండు ముక్కలు చెప్పి మమతా వెళ్లిపోయారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి ఉప ఎన్నికలో విజయంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా సంబరాలకు దూరంగా ఉంది. చదవండి: బీజేపీ కథేంటో మూడు ముక్కల్లో చెప్పిన శేఖర్ గుప్తా చదవండి: ఈ విజయం కేసీఆర్‌కు అంకితం..నోముల భగత్ -
కరోనా: వామ్మో రెండు లక్షల కేసులు
తమిళనాడు: కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు, నిబంధనలు పాటించడం లేదని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవగాహన కల్పిస్తూనే వినని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఆ విధంగా కరోనా నిబంధనలు పాటించని వారిపై తమిళనాడు పోలీసులు భారీగా కేసులు నమోదు చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించారని ఇప్పటివరకు రెండు లక్షల 36 వేల 119 కేసులు బుక్ చేశారు. మాస్క్ ధరించకపోవడం, భౌతిక దూరం విస్మరించడం, శానిటైజర్ వాడకపోవడం వంటి అంశాల వారీగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. మీ ఆరోగ్యం కోసమే నిబంధనలు ఉన్నాయని హెచ్చరిస్తున్నా ప్రజలు బేఖాతర్ చేస్తుండడంతో కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చెన్నె పోలీస్ కమిషనర్ మహేశ్‌కుమార్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ పై విషయాలు తెలిపారు. కరోనాను దత్తత తీసుకున్నట్లు ఉంది.. ప్రజలు ఈ విషయం గుర్తుంచుకోవాలి అని హెచ్చరించారు. అంటే కరోనాను మనకై మనమే నిర్లక్ష్యం వహించి తెచ్చుకున్నామని వివరించారు. ఎన్నికలు ముగియడంతో కరోనా నిబంధనలు పాటించేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ వాడడం వంటివి చేయడంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. అయితే కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. మాస్క్ ధరించని కేసులే 85,764 ఉన్నాయని, 117 కేసులు క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘన, ఇక భౌతిక దూరం పాటించని కేసులు ఏకంగా 1,50,318 ఉన్నాయని కమిషనర్ ప్రకటించారు. ఇలా కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మొత్తం 2,36,199 కేసులు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ మహేశ్‌కుమార్ అగర్వాల్ తెలిపారు. కరోనా నిబంధనలపై అవగాహన కల్పిస్తున్న చెన్నె పోలీస్ కమిషనర్ మహేశ్ కుమార్ అగర్వాల్ -
కరోనా నిబంధనలు బ్రేక్..నెటిజన్ల ట్రోల్స్
పూణె : కరోనా నిబంధనలు పాటించాలని కేంద్రం ఓ వైపు హెచ్చరికలు చేస్తున్నా సొంతపార్టీ నేతలే వాటిని బేఖాతరు చేస్తున్నట్లు కనిపిస్తోంది. సోలాపూర్‌లోని మల్షిరాస్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బిజెపి ఎమ్మెల్యే రామ్ సత్పుటే వివాహం సోమవారం పూణెలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు హాజరైన బీజేపీ అగ్రనేతలు చాలామంది కరోనా నిబంధనల్ని బ్రేక్ చేశారు. మాస్కులు ధరించకపోవడంతో పాటు కనీసం భౌతికదూరం కూడా పాటించలేదు. (‘భారత్‌లో జనవరి నుంచి కరోనా వ్యాక్సిన్’ ) అన్‌లాక్ మార్గదర్శకాల ప్రకారం, వివాహ వేడుకకు 50 మందికి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, వెయ్యి మందికి పైగా రిసెప్షన్‌కు హాజరయ్యారు. వీరిలో మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ సహా మరికొంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. నిబంధనల్ని తుంగలో తొక్కి గుంపులు, గుంపులుగా సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియలో వైరల్ కావడంతో నెటిజన్లు పలువురు నేతలను ట్రోల్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ కోవిడ్ నిబంధనలు పాటించకపోతే ఇక ప్రజలకేం చెబుతారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. (దారుణం: చూస్తుండగానే దడేల్, దడేల్! ) -
కలిసి...మెలిసి... అతిక్రమించారు!
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పర్యటన కోసం వచ్చిన వెస్టిండీస్ ఆటగాళ్లు కరోనా వైరస్ ప్రొటోకాల్‌ను విస్మరించారు. క్వారంటైన్లో ఉన్న ఆటగాళ్లు నిబంధనల్ని అతిక్రమించి ప్రవర్తించడం న్యూజిలాండ్ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. 14 రోజుల క్వారంటైన్లో ఉన్న ఆటగాళ్లు తాము బస చేసిన హోటల్లో ఏ మాత్రం భౌతిక దూరం పాటించలేదు. పైగా భోజనాల సమయంలో ఒకరి ప్లేట్లోని పదార్థాల్ని ఇంకొకరు పంచుకున్నారు. ఇవన్నీ హోటల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో రికార్డయ్యాయి. దీనిపై కివీస్ ఆరోగ్య శాఖ తీవ్రంగా స్పందించింది. ప్రస్తుతం 12 రోజుల క్వారంటైన్ పూర్తయినప్పటికీ... ఈ అతిక్రమణ వల్ల కరోన పరీక్షల్లో ఎవరికైనా పాజిటివ్ అని తేలితే ఐసోలేషన్ వ్యవధిని పొడిగిస్తారు. కరీబియన్ క్రికెటర్లు నిబంధనలకు విరుద్ధంగా కలిసిమెలిసి తిని తిరిగిన వీడియో ఫుటేజీలను విండీస్ బోర్డుకు పంపించామని కివీస్ ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ ఆష్లే బ్లూమ్‌ఫీల్డ్ తెలిపారు. -
కరోనా ఉందని మర్చేపోయాను!
లండన్: ఆరు నెలలు దాటిపోయినా ప్రపంచ ప్రజలకు నేటికింకా కరోనాకు భయపడటం పూర్తిగా అలవాటు కాలేదు! బ్రిటన్ దిగువసభలో ఎంపీగా ఉన్న 60 ఏళ్ల మార్గరెట్ ఫెరియర్ అనే ప్రపంచ పౌరురాలైతే మరీ నిర్భయంగా.. లండన్ నుంచి ఏడింబరో, ఏడింబరో నుంచి లండన్.. ప్రజా రవాణా వాహనాలలో పదిమందితో కలిసి ప్రయాణించి వచ్చి సభలో కూర్చున్నారు. అయితే ఆ సంగతి ఆమె మళ్లీ సభ నుంచి వెలుపలకి వచ్చి మరొకసారి పదిమందితో కలిసి ప్రయాణించినప్పుడు గానీ సభకు తెలియలేదు. కరోనా కాలంలో మార్గరెట్ నిర్భయంగా తిరగడం అన్నది ఆమెకు కరోనా లేనట్లయితే తప్పకుండా ఒక విశేషం అయి ఉండేదే. తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యాక కూడా ఆమె సభకు రావడం, మెట్రో రైళ్లలో రాకపోకలు సాగించడంతో అది నిర్భీతి కాక నిర్బాధ్యత అయింది. బ్రిటన్ చట్టం ఇలాంటి బాధ్యతా రాహిత్యాన్ని అస్సలు సహించదు. చట్టం సహించనప్పుడు చట్టసభ సహిస్తుందా?! స్పీకర్ ఆమెను సభ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది. ఆమెది స్కాటిష్ నేషనల్ పార్టీ. ఆ పార్టీ ఆమెను తన ఎంపీ పదవికి రాజీనామా చేయమని కూడా కోరింది! ‘సారీ’ చెప్పారు మార్గరెట్. సభకు, పార్టీకి, నియోజకవర్గ ప్రజలకీ. నాలుగు వేల పౌండ్ల అపరాధ రుసుము చెల్లించారు. ‘నేనిలా చేయకుండా ఉండాల్సింది. కరోనా ఉందని మర్చేపోయాను’ అన్నారు. ఇంతగా తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నా కూడా ఆమెపై కరోనా నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు అవకుండా ఏం పోలేదు. బ్రిటన్‌లో శిక్షలు మెత్తగా ఉన్నా శిక్షల అమలు కఠినంగా ఉంటుంది. మార్గరెట్ ఇప్పుడు ఆ కఠినత్వానికి, మృదుత్వానికీ మధ్య కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. -
అంతేగా.. అంతేగా!
సాక్షి, వరంగల్ : వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో ఇళ్లు కట్టుకోవాలని భావిస్తున్నారా? దీనికోసం అనుమతి తీసుకోవాలనే ఆలోచన వచ్చి ఉంటుంది. అయితే, కొందరు ఉద్యోగులను కలిస్తే అలాంటిదేమి లేకుండానే తమ చేయి తడిపితే చాలు అన్నట్లుగా అనుమతులు ఇస్తూ ఖజానాకు గండి కొడుతున్నారు. ఇక అన్ని రకాల అనుమతులు తీసుకున్నప్పటికీ రకరకాల కొర్రీలు పెడుతూ వసూలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. అక్రమ నిర్మాణాలను అరికట్టాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, సిబ్బంది వసూళ్లకు తెగబడగా.. తామేమి తక్కువ కాదంటూ కొందరు కార్పొరేటర్లు సైతం అందినకాడికి వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా మూడు అంతస్తుల భవనానికి అనుమతి తీసుకున్నా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతోందని బెదిరించి రూ.9వేల లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఓ టీపీబీఓ, చైన్‌మెన్ సస్పెన్షన్‌కు గురయ్యారు. అయితే, వీరిద్దరే దొరికినా దొరకని వారెందరో ఉన్నారని చెబుతున్నారు. నిబంధనలే సాకుగా.. వరంగల్ మహా నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. దీంతో కొత్త భవన నిర్మాణాలు జోరందుకున్నాయి. ఇదే అధికారులు, సిబ్బందితో పాటు కార్పొరేటర్లకు కలిసొస్తోంది. నిబంధనల పేరుతో బెదిరిస్తూ యజమానుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. అక్రమ భవన నిర్మాణమైనా, కొత్తగా అనుమతులు కావాలన్నా రూ.వేలల్లో ముట్టచెప్పనిదే పని జరగడం లేదు. లేదంటే ఇళ్లు కూల్చడమో, అనుమతులకు కొర్రీలు పెట్టడం గ్రేటర్లో సర్వసాధారణంగా మారింది. అపార్టుమెంట్ నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేస్తే స్థాయి ఆధారంగా రూ.2లక్షల నుంచి రూ.10లక్షల వరకు గుంజుతున్నారు. పెంట్ హౌస్ ఉంటే అదనంగా మరో రూ.లక్షగా ధర నిర్ణయించారని చెప్పుకుంటున్నారు. సిఫారసులతో వస్తే కొంచెం రిబేట్ కూడా ఇస్తారని సమాచారం. ఉద్యోగులు పెట్టే కొర్రీలను తట్టుకోలేక.. కార్యాలయం చుట్టూ తిరగలేక ఎంతో కొంత ముట్టచెప్పేస్తున్న నిర్మాణదారులు అనుమతులు తెచ్చుకుంటున్నారు. ఈ తతంగం ముగిశాక కొన్నిచోట్ల కార్పొరేటర్లు కూడా తమ పరిధిలో నిర్మాణం చేపడుతున్నందున ఎంతోకొంత ముట్టచెప్పాలని డిమాండ్ చేస్తున్నారనే ప్రచారమూ ఉంది. అంతా ఒక్కటై అక్రమ నిర్మాణాదారులకు కొందరు కార్పొరేటర్లు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. స్థానిక బిల్డింగ్ ఇన్స్పెక్టర్, చైన్‌మెన్, కార్పొరేటర్లు ఒక్కటై అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టే వారి నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. డివిజన్లలో జరిగే నిర్మాణాల విషయం పైస్థాయి అధికారుల వద్దకు వెళ్లకుండా కింది స్థాయిలోనే సెటిల్మెంట్లు చేస్తున్నారు. చిన్న షెడ్డు నిర్మించినా, ఇల్లు కట్టినా.. అపార్టుమెంట్ అయినా వాటా తప్పక చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వసూళ్లలో కొన్ని చోట్ల కార్పొరేటర్లదే కీలకపాత్ర అయినా ప్రైవేట్ లైసెన్స్ సర్వేయర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. గ్రేటర్ ఉన్నతాధికారులు ఇలాంటి నిర్మాణదారులు, వసూళ్లకు పాల్పడుతున్న ఉద్యోగులపై కొరఢా ఝులిపించకపోతే సర్కారు ఖజానాకు భారీగా గండి పడే అవకాశం లేకపోలేదు. -
బ్లూ టిక్‌పై ట్విట్టర్ తాజా హెచ్చరిక
శాన్ ఫ్రాన్సిస్కో: మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ మరోసారి వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలు పాటించని ట్విట్టర్ ఖాతా పేరు పక్కన ఉండే బ్లూ టిక్ తొలగించనున్నామని ప్రకటించింది. తమ వెరిఫికేషన్ సిస్టం రివ్యూలో భాగంగా నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే ఆయా ఖాతాదారుల వెరిఫికేషన్ బ్యాడ్జెస్‌ను తొలగిస్తామని ట్విట్టర్ ఒక ప్రకటనలో వెల్లడించింది. వెరిఫికేషన్ సిస్టంపై రివ్యూ చేపట్టిన సంస్థ కొత్త మార్గదర్శకాలను జారీ చేయనుంది. ఈ క్రమంలో వెరిఫైడ్ ఖాతాలను పునఃసమీక్షిస్తోంది. ఈ కొత్త మార్గదర్శకాలను పాటించని ఖాతాలపై తగిన విధంగా వ్యవహిరిస్తామనిపేర్కొంది. ఈ వెరిఫికేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నామని, నిబంధనలకు లోబడి ఉండకపోతే ఆయా ఖాతాల వెరిఫైడ్మార్క్ను తొలగిస్తామని ట్విట్టర్ తెలిపింది. అలాగే మొత్తం ఈ పద్ధతిపై రివ్యూచేపట్టామని, వెరిఫికేషన్ అంటే ఏమిటనే దానికి అధికారిక మార్గదర్శకాల్లో ఇప్పటికే మార్పులు చేసినట్టు తెలిపింది. దీనిపై కొత్త విధానాన్నిత్వరలోనే తీసుకురానున్నట్టు చెప్పింది. ఇటీవల ట్విట్టర్ ఖాతా పేరు పక్కన ఉండే బ్లూ టిక్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో వివాదం చెలరేగింది. దీంతో ఈ బ్లూటిక్ తొలగింపు విషయంలో వివరణ ఇచ్చింది. వ్యక్తుల వెరిఫైడ్ అకౌంట్ ట్విట్టర్ ధృవీకరించిన ఈ నీలిరంగు చెక్ మార్క్‌ను ప్రస్తుతం తొలగిస్తున్నట్టు ఇటీవల ట్విట్టర్ ప్రకటించింది. అయితే గత ఆగస్టు నెలలో వర్జీనియాలోని ఛార్లెట్స్విల్లే వెరిఫైడ్ చెక్ మార్క్ ఉండటం నెటిజన్ల ఆగ్రహానికి గురికావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు వికీలీక్స్ వ్యవస్థాపకుడు, వివాదాస్పదుడు జూలియస్ అసాంజే ట్విట్టర్ ఖాతారకు వెరిఫైడ్ చెక్ మార్క్‌ను తొలగించిన సంగతి తెలిసిందే. -
బ్రేకుల్లేని ట్రావెల్స్ దందా..
మాఫియా మాదిరి మారిన ప్రైవేట్ ట్రావెల్స్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తిరుగుతున్న బస్సులు అధికార పార్టీ నేతలే ట్రావెల్స్ యాజమాన్యాలు అందుకే పట్టించుకోని ప్రభుత్వం, రవాణా శాఖ అరుణాచల్ ప్రదేశ్, పుదుచ్చేరిల్లో రిజిస్ట్రేషన్ సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా ఆగడాలు రోజు రోజుకూ పెచ్చుమీరిపోతున్నాయి. ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టి ట్రావెల్స్ నిర్వాహకులు బస్సుల్ని తిప్పుతున్నా.. ప్రభుత్వం వారిపై చర్యలకు వెనుకాడుతోంది. ప్రైవేటు ట్రావెల్స్ నడుపుతోంది.. అధికార పార్టీకి చెందిన ఎంపీలే కావడమే దానికి కారణం. ఒకవేళ రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నా.. వారికి సర్కారు బదిలీల బహుమానం అందిస్తోంది. ఐదేళ్లుగా నిత్యం ఏదో ఒక చోట ప్రైవేటు ట్రావెల్స్ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఘోర ప్రమాదం జరిగి ప్రయాణికులు దుర్మరణం పాలయితే ఓ కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప ప్రైవేటు ట్రావెల్స్ దూకుడుకు అడ్డుకట్ట వేయడం లేదు. కాంట్రాక్టు క్యారేజీ అనుమతులతో.. కాంట్రాక్టు క్యారేజీ అనుమతులతో స్టేజి క్యారియర్లుగా ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా తెలుగు రాష్ట్రాల్లో బస్సుల్ని తిప్పుతోంది. ఇతర రాష్ట్రాల్లో ఆలిండియా పర్మిట్లు పొంది నిబంధనలకు విరుద్ధంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తిప్పుతున్నారు. మొత్తం 500 ప్రైవేటు బస్సులు ఇలా తిరుగుతున్నాయనేది అంచనా. కేంద్ర మోటారు వాహన చట్టం–1989 నిబంధనలను అతిక్రమించి తిప్పుతున్న ఈ బస్సుల జోలికి వెళ్లవద్దంటూ సాక్షాత్తూ ఓ మంత్రి రవాణా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణికుల భద్రతను సవాల్ చేస్తూ ప్రైవేటు ట్రావెల్స్ ఏకంగా టూ ప్లస్ వన్ బెర్తులతో తిప్పుతున్నా.. రవాణా శాఖ చోద్యం చూడటం మినహా ఏ ఒక్క బస్సును సీజ్ చేయట్లేదు. విజయవాడ బందరు రోడ్డు రవాణా శాఖ కమిషనర్ కార్యాలయానికి కూత వేటు దూరంలో.. మెయిన్ రోడ్డు మీదే దాదాపు 200 ట్రావెల్స్ బస్సులు నిలిపి స్టేజీ క్యారియర్లుగా ప్రయాణికులను ఎక్కించుకోవడం రోజూ కనిపించే దృశ్యం. అయినా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడానికి పైనుంచి వచ్చే ఒత్తిళ్లే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. పర్యాటక రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు టూరిజాన్ని ప్రోత్సహిస్తున్న అరుణాచల్ ప్రదేశ్, పాండిచ్చేరిలలో రవాణా శాఖ ట్యాక్స్‌లు చాలా తక్కువగా ఉంటాయి. ఏడాదికి ఒక బస్సుకు రూ. 17 వేలు చెల్లించి ఆలిండియా పర్మిట్ పొందవచ్చు. అదే తెలుగు రాష్ట్రాల్లో పర్మిట్లు పొందాలంటే మూడు నెలలకోసారి బస్సులో ఒక్కో సీటుకు ఏపీలో అయితే రూ. 3,750, తెలంగాణలో రూ. 3,675 చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు ట్రావెల్స్ తమ బస్సుల్ని అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. నిజానికి అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ చేయించి పర్మిట్ పొందాలంటే ఆ రాష్ట్రం మీదుగాకానీ, ఆ రాష్ట్రంలోగానీ బస్సులు తిరగాలి. కానీ ప్రైవేటు ట్రావెల్స్ ఆ పర్మిట్లతో ఏపీ, హైదరాబాద్‌ల నుంచి.. షిర్డీ, బెంగళూరు, చెన్నై, భువనేశ్వర్ తదితర ప్రాంతాలకు బస్సుల్ని తిప్పుతున్నారు. అక్రమ బస్సులపై ఎన్ఫోర్సుమెంట్ తనిఖీలు చేయాలని రవాణా శాఖను ఆదేశిస్తామని ఆశాఖ మంత్రి ప్రకటనలు దండగలా మారాయని ఆరోపణలు ఉన్నాయి. గత ఐదేళ్లులో ఘోర బస్సు ప్రమాదాలు.. 2017 ఫిబ్రవరి 28న భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళుతున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు కృష్ణా జిల్లా ముండ్లపాడు వద్ద ప్రమాదానికి గురై 10 మంది మృత్యువాత పడ్డారు. 2016 సెప్టెంబర్ 16న హైదరాబాద్ నుంచి షిర్డీ వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ స్లీపర్ బస్సు కర్ణాటక దగ్గర హుమ్నాబాద్ వద్ద తగులబడి పోయింది. ఈ మంటల్లో చిక్కుకుని తణుకు ప్రాంతానికి చెందిన మూడేళ్ల చిన్నారి విహాన్ సజీవ దహనమయ్యాడు. అనుమతి లేని, సురక్షితం కాని స్లీపర్ బస్సులో ప్రయాణించడం వల్లే ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు క్షతగాత్రులయ్యారు. 2013 అక్టోబర్ 30న బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలంలోని పాలెం గ్రామం వద్ద వోల్వో బస్సు ప్రమాదానికి గురై 45 మంది సజీవదహనమయ్యారు. 2012 జూన్ 16న షోలాపూర్–హైదరాబాద్ జాతీయ రహదారిపై షిర్డీ వెళుతున్న కాళేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడి 32 మంది భక్తులు మరణించారు.