శాన్ ఫ్రాన్సిస్కో: మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ మరోసారి వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలు పాటించని ట్విట్టర్ ఖాతా పేరు పక్కన ఉండే బ్లూ టిక్ తొలగించనున్నామని ప్రకటించింది. తమ వెరిఫికేషన్ సిస్టం రివ్యూలో భాగంగా నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే ఆయా ఖాతాదారుల వెరిఫికేషన్ బ్యాడ్జెస్‌ను తొలగిస్తామని ట్విట్టర్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
వెరిఫికేషన్ సిస్టంపై రివ్యూ చేపట్టిన సంస్థ కొత్త మార్గదర్శకాలను జారీ చేయనుంది. ఈ క్రమంలో వెరిఫైడ్ ఖాతాలను పునఃసమీక్షిస్తోంది. ఈ కొత్త మార‍్గదర‍్శకాలను పాటించని ఖాతాలపై తగిన విధంగా వ్యవహిరిస్తామనిపేర్కొంది. ఈ వెరిఫికేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నామని, నిబంధనలకు లోబడి ఉండకపోతే ఆయా ఖాతాల వెరిఫైడ్‌మార్క్‌ను తొలగిస్తామని ట్విట్టర్ తెలిపింది. అలాగే మొత్తం ఈ పద్ధతిపై రివ్యూచేపట్టామని, వెరిఫికేషన్ అంటే ఏమిటనే దానికి అధికారిక మార్గదర్శకాల్లో ఇప్పటికే మార్పులు చేసినట్టు తెలిపింది. దీనిపై కొత్త విధానాన్నిత్వరలోనే తీసుకురానున్నట్టు చెప్పింది.
ఇటీవల ట్విట్టర్ ఖాతా పేరు పక్కన ఉండే బ్లూ టిక్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో వివాదం చెలరేగింది. దీంతో ఈ బ్లూటిక్ తొలగింపు విషయంలో వివరణ ఇచ్చింది. వ్యక్తుల వెరిఫైడ్ అకౌంట్ ట్విట్టర్ ధృవీకరించిన ఈ నీలిరంగు చెక్ మార్క్‌ను ప్రస్తుతం తొలగిస్తున్నట్టు ఇటీవల ట్విట్టర్ ప్రకటించింది. అయితే గత ఆగస్టు నెలలో వర్జీనియాలోని ఛార్లెట్స్‌విల్లే వెరిఫైడ్ చెక్ మార్క్ ఉండటం నెటిజన్ల ఆగ్రహానికి గురికావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు వికీలీక్స్ వ్యవస్థాపకుడు, వివాదాస్పదుడు జూలియస్ అసాంజే ట్విట్టర్ ఖాతారకు వెరిఫైడ్ చెక్ మార్క్‌ను తొలగించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment