verified
-
రిఫండ్ త్వరగా పొందాలంటే? వెరిఫై చేశారా..
డిపార్ట్మెంటు వారు జ్ఞాపకం చేస్తున్నారా లేదా భయపెడుతున్నారా? కాదు కాదు ఎందరో మరిచిపోయేవారిని దృష్టిలో ఉంచుకుని అందరికీ ఒక సందేశం.. రిమైండర్ పంపుతున్నారు. దాని సారాంశం ఏమిటంటే రిటర్ను దాఖలు చేసి ఊరుకోవద్దు. మరచిపోవద్దు. ఈ–ఫైలింగ్ ప్రాసెస్‌ని పూర్తి చేయండి. మీరు ఐటీఆర్‌ని 30 రోజుల్లోపల వెరిఫై చేయండి. గతంలో ఈ గడువు 120 రోజులు ఉండేది. అంటే నాలుగు నెలలు. కొత్త నిబంధనల ప్రకారం ఈ గడువుని 30 రోజులకు కుదించారు. గడువు తేదీలోగా వెరిఫై చేయకపోతే మీరు సకాలంలో రిటర్ను వేసినట్లు కాదు. మీరు దాఖలు చేసిన రిటర్ను ఇన్వాలిడ్ అయిపోతుంది. రద్దయిపోతుంది. వేసినట్లు కాదు. ఆలస్యమయింది కాబట్టి లేటు ఫీజు పడుతుంది. ఇది రూ. 5,00,000లోపు ఆదాయం ఉంటే రూ. 1,000 & రూ. 5,00,000 దాటితే రూ. 5,000 ఉంటుంది. ఈ–వెరిఫై చేయడం చాలా సులభం. త్వరగా కూడా పూర్తవుతుంది. ఈ–వెరిఫై వద్దనుకుంటే ఫారం– Vని 30 రోజుల్లోపల అందేలా స్పీడ్‌పోస్ట్‌లో పంపండి. పోర్టల్ ద్వారా చేయండి. ఆధార్ కార్డు ద్వారా ఓటీపీ వస్తుంది. లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. బ్యాంకు అకౌంట్ ద్వారా లేదా డీమ్యాట్ అకౌంటు, బ్యాంకు ఏటీఎం ద్వారానైనా చేయొచ్చు. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ ద్వారా చేస్తే కొంచెం ఖర్చవుతుంది. ఈ–ఫైలింగ్‌కి సంబంధించిన ప్రశ్నల్లో, తరచుగా మీకు సందేహాలొచ్చే వివిధ అంశాలు, పరిస్థితులు అన్నింటినీ పొందుపర్చారు. లేటయితే కూడా వెరిఫై చేయొచ్చు. కానీ, తగిన కారణం ఉండాలి. ఒప్పుకుంటే లేటుగా వేయవచ్చు. మీ తరఫున మీ ఆథరైజ్డ్ వ్యక్తి వేయొచ్చు. మొబైల్ నంబర్‌ను వెంటనే ఆధార్‌తో అప్డేట్ చేయడం తప్పనిసరి. మరిచిపోకండి. మీరు స్పీడ్‌పోస్ట్‌లో పంపించిన డాక్యుమెంట్ల వివరాలు భద్రపర్చుకోండి. రుజువులు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఒక్కొక్కప్పుడు అందలేదని డిపార్టుమెంటు వారు అంటే ఇవి రుజువులుగా పనికొస్తాయి. రిఫండ్ క్లెయిమ్ చేసిన వారయితే, వెరిఫై చేసిన తర్వాతే రిఫండును ఆశించాలి. జులై మొదటి వారంలో కొంత మందికి 48 గంటల్లో రిఫండు వచ్చింది. ఇప్పుడు రెండు వారాలు దాటిన తర్వాత రిఫండు ఇస్తున్నారు. గతంలో నెలరోజులు దాటేది. ఇప్పుడు ఇంకా త్వరితగతిన ఇద్దామని గట్టి ప్రయత్నం చేస్తూ, సమాయత్తం అవుతున్నారు.. డిపార్ట్మెంట్ వారు. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్‌కు పంపించగలరు. -
మెటా వెరిఫైడ్ సర్వీస్ ఆరంభం.. ఛార్జర్ ఎలా ఉన్నాయంటే?
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమ దిగ్గజం మెటా భారత్‌లో వెరిఫైడ్ అకౌంట్ సర్వీస్‌ను ప్రారంభించింది. మొబైల్ యాప్స్‌కు చందా నెలకు రూ.699. ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్లో కస్టమర్లు నేరుగా ఈ చందా చెల్లించవచ్చు. ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు ద్వారా ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ యూజర్లు తమ ఖాతాను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. కనీసం 18 ఏళ్లు ఉన్న క్రియాశీలక యూజర్లు ఇందుకు అర్హులు. దరఖాస్తుదారులు ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ ఖాతా ప్రొఫైల్ పేరు, ఫోటోతో సరిపోలే ప్రభుత్వ ఐడీని సమర్పించాలి. నెలకు రూ. 599 చందాతో వెబ్‌లో వెరిఫైడ్ సర్వీస్‌ను అందుబాటులోకి తేవాలని మెటా భావిస్తోంది. -
నీ బ్యాడ్జ్ బంగారం గానూ! ట్విటర్ గోల్డ్ టిక్ కావాలంటే అంతా?
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సంస్థ ట్విటర్.. వ్యాపార సంస్థల ఖాతాలకు ఇచ్చే వెరిఫైడ్ గోల్డ్ బ్యాడ్జ్ ద్వారా ఒక్కో దానిపై నెలకు 1,000 డాలర్లు (రూ.83,000) వసూలు చేయబోతోంది. దీనికి మరో 50 డాలర్లు (రూ.4,000) అదనం. ఇదీ చదవండి: Physics Wallah Viral Video: బోరుమన్న ఫిజిక్స్ వాలా మాజీ టీచర్లు! నాటకం బాగుందన్న నెటిజన్లు! ఏప్రిల్ 1 నుంచి ట్విటర్ కొత్త వెరిఫికేషన్ స్కీమును అమలు చేయబోతోంది. ఈ మేరకు తాజాగా కొత్త వెరిఫికేషన్ స్కీమును కంపెనీ ఆవిష్కరించింది. వ్యాపార సంస్థలకు ఇచ్చే గోల్డ్ బ్యాడ్జ్‌లకు సంబంధించిన ప్రణాళికను గత డిసెంబర్లోనే ట్విటర్ ప్రకటించింది. ఇదీ చదవండి: Get 1 Electric Scooter: రూ.38 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. భారీ డిస్కౌంట్! వెరిఫైడ్ సంస్థల ఉద్యోగులకు చెందిన వెరిఫైడ్ వ్యక్తిగత ఖాతాలు కొనసాగుతాయని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. సంస్థలకు సంబంధించిన ఖాతాల వెరిఫికేషన్ (గతంలో బ్లూ ఫర్ బిజినెస్ అనే పిలిచేవారు) ప్రక్రియను త్వరలో వెల్లడిస్తామన్నారు. ఇదీ చదవండి: ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకుంటున్నారా.. ఏమవుతుందో తెలుసా? -
Twitter: ఎలన్ మస్క్ క్షమాపణలు
శాన్ ఫ్రాన్సిస్కో(కాలిఫోర్నియా): ట్విటర్(ట్విట్టర్) కొత్త బాస్, ప్రపంచ అపర కుబేరుడు ఎలన్ మస్క్.. క్షమాపణలు చెప్పాడు. చాలా దేశాల్లో ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ పని తీరు నిదానించింది. ఈ సూపర్ స్లో పరిణామంపై ఆదివారం స్పందించిన మస్క్.. క్షమాపణలు తెలియజేశాడు. అంతకుముందు.. ‘ట్విట్టర్ మరింత సజీవంగా అనిపిస్తుంది’ అంటూ ఎలన్ మస్క్ ఓ ట్వీట్ చేశారు. ఇక ‘ఎనిదిమి డాలర్ల’ ట్విట్టర్ బ్లూ ప్రోగ్రామ్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపైనా ఆయన ఓ యూజర్‌కి రిప్లై ఇచ్చారు. అలాగే.. యూజర్లకు అందుబాటులోకి రాబోయే మరో కొత్త ఫీచర్‌ను ప్రకటించారాయన. సంస్థలకు సంబంధించి ఏ ఇతర ట్విటర్ ఖాతాలు వాటితో అనుబంధించబడి ఉన్నాయో గుర్తించడానికి వీలుగా సదరు సంస్థలకు అనుమతులు ఇవ్వబోతున్నట్లు ట్విటర్ తరపున ప్రకటించారాయన. Btw, I’d like to apologize for Twitter being super slow in many countries. App is doing >1000 poorly batched RPCs just to render a home timeline! — Elon Musk (@elonmusk) November 13, 2022 Twitter feels increasingly alive — Elon Musk (@elonmusk) November 13, 2022 Rolling out soon, Twitter will enable organizations to identify which other Twitter accounts are actually associated with them — Elon Musk (@elonmusk) November 13, 2022 ఇక నకిలీ ఖాతాలు పెరిగిపోవడంతో ‘బ్లూటిక్’ సబ్స్క్రిప్షన్ సదుపాయాన్ని నిలిపివేసింది కదా. దానిని ఎప్పుడు పునరుద్ధరిస్తారనే ప్రశ్నకు ట్విటర్ సీఈవో మస్క్ స్పందించారు. వచ్చేవారాంతంలోగా తిరిగి ట్విటర్ బ్లూ సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారాయన. ఇదీ చదవండి: 8 డాలర్ల స్కీమ్.. మస్క్ అనాలోచిత నిర్ణయం! -
ఐటీఆర్ దాఖలుతో పని పూర్తయినట్టు కాదు
ఆదాయపుపన్ను రిటర్నుల దాఖలు గడువు డిసెంబర్ 31 తో ముగిసింది. జూలైతోనే ముగిసిన గడువును.. కరోనా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ చివరి వరకు పొడిగించింది. దీంతో చాలా మంది డిసెంబర్లో రిటర్నులు దాఖలు చేశారు. రిటర్నులు దాఖలుతో బాధ్యత ముగిసిందని అనుకోవద్దు. ఆ తర్వాత తమ వైపు నుంచి దృష్టి పెట్టాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. చివరి నిమిషంలో వేయడం వల్ల అందులో తప్పులు దొర్లి ఉంటే వెంటనే రివైజ్డ్ రిటర్నులు వేసుకోవాలి. ఈ వెరిఫై చేస్తేనే వేసిన రిటర్నులు చెల్లుబాటు అవుతాయి. ఇలాంటి ముఖ్యమైన అంశాల గురించి వివరించే కథనమే ఇది.. ఈ ఫైలింగ్ పోర్టల్‌పై ఐటీఆర్ దాఖలు చేయడం ప్రాథమికంగా చేయాల్సిన పని. తర్వాత ఆ రిటర్నులను ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి మీరే దాఖలు చేశారనడానికి నిదర్శనం ఏమిటి? అందుకనే ధ్రువీకరణ ప్రక్రియ. దాంతో ఆ రిటర్నుల్లో పేర్కొన్న సమాచారానికి మీరు బాధ్యత వహిస్తున్నట్టు అవుతుంది. గతేడాది కొత్త ఈ ఫైలింగ్ పోర్టల్ తీసుకురావడం తెలిసిందే. ఎన్నో సాంకేతిక సమస్యలు వెక్కిరించడంతో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. డిసెంబర్ చివరి వారంలో హడావుడిగా రిటర్నులు వేసిన వారు కూడా ఉన్నారు. కనుక ఒకసారి రిటర్నులు ధ్రువీకరించినదీ, లేనిదీ చూసుకోవాలి. వెరిఫికేషన్ చేయని రిటర్నులు చెల్లవు. రిటర్నులు సమర్పించిన తేదీ నుంచి 120 రోజుల్లోపు ధ్రువీకరించేందుకు సమయం ఉంటుంది. అక్నాలెడ్జ్మెంట్ పత్రం లేదా ఫామ్–5 పత్రంపై (ఆదాయపన్ను శాఖ నుంచి డౌన్లోడ్ చేసుకుని) సంతకం చేసి ఆ కాపీని పోస్ట్ ద్వారా ఆదాయపన్ను శాఖ, బెంగళూరు కార్యాలయానికి పంపించాలి. కొరియర్ ద్వారా పంపకూడదు. భౌతికంగా చేసే ధ్రువీకరణ ఇది... ఇలా కాకుండా ఆన్లైన్లో ఈ వెరిఫై చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ నుంచి లేదంటే ఆధార్ ఓటీపీ ద్వారా, బ్యాంకు లేదా డీమ్యాట్ ఖాతా నంబర్ సాయంతోనూ వెరిఫై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. వీటిల్లో మీకు నచ్చిన ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అప్పుడు యూజర్ మొబైల్‌కు వన్‌టైమ్ పాస్వర్డ్ వస్తుంది. ఈ కోడ్ లేదా ఓటీపిని ఈఫైలింగ్ పోర్టల్‌పై ఎంటర్ చేసి, సబ్మిట్ కొట్టడంతో ఈ వెరిఫికేషన్ పూర్తవుతుంది. వెరిఫై చేసినట్టు సమాచారం కూడా వస్తుంది. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలను ఉపయోగించుకుని ఓటీపీ జనరేట్ చేసుకోవడం ద్వారా ఈవెరిఫై చేయవచ్చు. సదరు బ్యాంకులో ఖాతా ఉండి, ఖాతాకు పాన్ నంబర్ అనుసంధానించి ఉంటే సరిపోతుంది. సెక్షన్ 44ఏబీ కింద ఖాతాలను ఆడిట్ చేయాల్సి అవసరం ఉన్న వారు తప్పనిసరిగా రిటర్నులు దాఖలు చేసిన వెంటనే.. తమ డిజిటల్ సిగ్నేచర్‌ను ఉపయోగించి ధ్రువీకరించాల్సి ఉంటుంది. పన్ను రిటర్నులు వేసిన 120 రోజులకీ వెరిఫై చేయకపోతే ముందు ఈఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అయ్యి సరైన కారణాన్ని తెలియజేస్తూ జరిగిన ఆలస్యానికి క్షమాపణ తెలియజేయాలి. మీ అభ్యర్థనను ఆదాయపన్ను శాఖ మన్నిస్తే.. అప్పుడు రిటర్నులు ఈ వెరిఫై చేసుకునేందుకు అవకాశం తిరిగి లభిస్తుంది. లేదంటే మీ రిటర్నులను దాఖలు చేయనట్టుగా ఐటీ శాఖ భావిస్తుంది. అప్పుడు సకాలంలో రిటర్నులు వేయనందుకు చట్టప్రకారం అన్ని చర్యలకు బాధ్యత వహించాలి. ఆలస్యపు ఫీజు, చెల్లించాల్సిన పన్ను ఉంటే ఆ మొ త్తంపై నిర్ణీత గడువు తేదీ నుంచి వడ్డీ చెల్లించాలి. రిటర్నుల్లో తప్పులను గుర్తిస్తే..? ఐటీఆర్ దాఖలు చేశారు. ధ్రువీకరించడం కూడా ముగిసింది. కానీ ఆదాయం, మినహాయింపులను పేర్కొనడం మర్చిపోయారనుకోండి. అప్పుడు సవరించిన రిటర్నులు దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంది. అది కూడా రిటర్నులను ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేయక ముందే చేసుకోవాలి. ఇందుకు ప్రత్యేకంగా వేరొక ఫామ్ ఉండదు. ఈ ఫైలింగ్ పోర్టల్‌పై ఒరిజినల్, రివైజ్డ్ అనే ఆప్షన్లు ఉంటాయి. ‘రివైజ్డ్ రిటర్న్’ ఆప్షన్ ఎంపిక చేసుకుని, ముందు దాఖలు చేసిన మాదిరే మొదటి నుంచి ప్రక్రియ అనుసరించాలి. ఒరిజినల్ ఐటీఆర్ ఈ ఫైలింగ్ దాఖలు చేసిన తేదీ, అక్నాలెడ్జ్మెంట్ నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధిత అసెస్మెంట్ సంవత్సరం ముగియడానికి మూడు నెలల ముందుగానే రివైజ్డ్ రిటర్నుల ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. 2020–21 సంవత్సరానికి 2021–22 అసెస్మెంట్ సంవత్సరం అవుతుంది. కనుక 2021 డిసెంబర్ 31ని గడువుగా అర్థం చేసుకోవాలి. ఆలోపే ఐటీఆర్ అసెస్మెంట్ను ఆదాయపన్ను శాఖ పూర్తి చేస్తే గడువు ముగిసినట్టుగా అర్థం చేసుకోవాలి. ఈ రెండింటిలో ఏది ముందు అయితే అదే అమలవుతుంది. 2021–22 అసెస్మెంట్ సంవత్సరానికి సవరించిన రిటర్నుల దాఖలు గడువును ఆదాయపన్ను శాఖ 2022 మార్చి 31 వరకు పొడిగించిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఈ గడువులతో సంబంధం లేకుండా.. మీరు దాఖలు చేసిన రిటర్నులను ఐటీ శాఖ ప్రాసెస్ చేసి సెక్షన్ 143(1) కింద ఇంటిమేషన్ మెయిల్ పంపినట్టయితే గడువు ముగిసిపోయినట్టుగానే పరిగణించాలి. దాంతో రిటర్నులను సవరించుకోలేరు. సాధారణంగా రిటర్నులు దాఖలు చేసి, వెరిఫై చేసిన తర్వాత.. 10–30 రోజుల్లోపే ఆదాయపుపన్ను శాఖ ప్రాసెస్ చేసేస్తుంది. అందుకని రిటర్నులు దాఖలు చేసిన వారు ఆ తర్వాత వారం వ్యవధిలోపే మరొక్క సారి అన్నింటినీ క్షుణంగా సరిచూసుకోవడం మంచిది. రివైజ్డ్ రిటర్నులు వేసుకునేందుకు, ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేసుకునేందుకు సాధారణంగా డిసెంబర్ 31 గడువుగా ఉంటుంది. కనుక ఆలస్యంగా రిటర్నులు వేసే వారికి రివైజ్ చేసుకునేందుకు తగినంత వ్యవధి ఉండకపోవచ్చు. ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేయక ముందు ఎన్ని సార్లు అయినా రివైజ్డ్ రిటర్నులు ఫైల్ చేసుకోవచ్చు. తాజాగా దాఖలు చేసిన ఐటీఆర్‌ను ఐటీ శాఖ పరిగణనలోకి తీసుకుంటుంది. అవకాశం ఉంది కదా అని చాలా సార్లు రివైజ్డ్ రిటర్నులు వేశారనుకోండి.. అప్పుడు ఆదాయపన్ను శాఖ సందేహంతో మీ ఐటీఆర్‌ను స్క్రూటినీ చేయవచ్చు. రిఫండ్ సంగతిదీ.. ఆదాయపుపన్ను రిటర్నులను దాఖలు తర్వాత, ఐటీ శాఖ వాటిని ప్రాసెస్ చేసి 143 (1) ఇంటిమేషన్ ఇవ్వడం పూర్తయి, అందులో ఏ తప్పులూ లేకపోతే రిటర్నుల ప్రక్రియ సంపూర్ణంగా ముగిసినట్టే. చివరిగా ఒకవేళ చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ పన్ను చెల్లించి ఉంటే రిఫండ్‌కు అర్హత ఉంటుంది. రిఫండ్ స్టేటస్ ఏంటన్నది ఐటీ శాఖ ఈ ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డుపై కనిపిస్తుంది. అదనంగా ఎన్ఎస్డీఎల్ పోర్టల్లోనూ చెక్ చేసుకోవచ్చు. https://tin.tin. nsdl.com/oltas/refund-status.html. ఈ లింక్‌ను ఓపెన్ చేసి పాన్ వివరాలు ఇవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు. ఫేస్‌లెస్ ప్రాసెసింగ్ వచ్చిన తర్వాత రిఫండ్లు పన్ను చెల్లింపుదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. 143(1) ఇంటిమేషన్ వచ్చిన 15 రోజుల్లోపే రిఫండ్ కూడా వచ్చేస్తుంది. పలు కారణాల వల్ల ఆలస్యం అయితే, బ్యాంకు ఖాతా వివరాలు (అకౌంట్ నంబర్/ఐఎఫ్ఎస్ నంబర్ తదితర) సరిగా లేకపోవడం వల్ల పెండింగ్‌లో ఉంటే అప్పుడు నూతన ఈఫైలింగ్ పోర్టల్‌కు వెళ్లి సర్వీస్ రిక్వెస్ట్ ఆప్షన్ ద్వారా వివరాలను సరిచేసుకోవచ్చు. రిఫండ్లు ఆలస్యమైనా ఆందోళన చెందక్కర్లేదు. నిర్ణీత గడువు దాటిన తర్వాత నుంచి ఆ మొత్తంపై ప్రతీ నెలా 0.5 శాతం మేర వడ్డీని ఐటీ శాఖ చెల్లిస్తుంది. ఇలా అందుకునే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుందని మర్చిపోవద్దు. ఈ మొత్తాన్ని సంబంధిత ఆర్థిక సంవత్సరం ఆదాయం కింద రిటర్నుల్లో పేర్కొనాల్సి ఉంటుంది. పన్ను కోసం డిమాండ్ నోటీసు వస్తే? పన్ను రిటర్నుల్లో తప్పులు, పొరపాట్లు చేయవచ్చు. ఆదాయపన్ను శాఖ రిటర్నులను ప్రాసెస్ చేసే సమయంలో అందులోని సమాచారం మధ్య అంతరాలు, పోలికల్లేమిని గుర్తిస్తుంది. ఆ వివరాలను 143(1) ఇంటిమేషన్ నోటీసులో పేర్కొంటుంది. పన్ను చెల్లించాల్సి ఉంటే ఆ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. ఐటీ శాఖ పేర్కొన్న సమాచారంతో మీరు ఏకీభవిస్తే ఆ మేరకు పన్ను చెల్లించేస్తే సరిపోతుంది. అలా కాకుండా మీరు ఏదైనా మినహాయింపును పేర్కొనడం మర్చిపోయిన కారణంగా ఆ అంతరం తలెత్తి ఉంటే? అప్పుడు రెక్టిఫికేషన్ రిక్వెస్ట్ దాఖలు చేయాలి. ఆదాయపన్ను శాఖ లెక్కలతో ఏకీభవించడం లేదని లేదా రిటర్నుల్లో పొరపాటు చేశానంటూ అందులో పేర్కొనాలి. పన్ను అధికారులు ఆరు నెలల్లోగా స్పందిస్తారు. నాలుగు రకాల రెక్టిఫికేషన్ రిక్వెస్ట్‌లు ఉన్నాయి. రిటర్నుల్లో సరిపోలని సమాచారం అసలు ఏంటన్న దాని ఆధారంగా వీటిల్లో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. -
బ్లూ టిక్‌పై ట్విట్టర్ తాజా హెచ్చరిక
శాన్ ఫ్రాన్సిస్కో: మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ మరోసారి వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలు పాటించని ట్విట్టర్ ఖాతా పేరు పక్కన ఉండే బ్లూ టిక్ తొలగించనున్నామని ప్రకటించింది. తమ వెరిఫికేషన్ సిస్టం రివ్యూలో భాగంగా నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే ఆయా ఖాతాదారుల వెరిఫికేషన్ బ్యాడ్జెస్‌ను తొలగిస్తామని ట్విట్టర్ ఒక ప్రకటనలో వెల్లడించింది. వెరిఫికేషన్ సిస్టంపై రివ్యూ చేపట్టిన సంస్థ కొత్త మార్గదర్శకాలను జారీ చేయనుంది. ఈ క్రమంలో వెరిఫైడ్ ఖాతాలను పునఃసమీక్షిస్తోంది. ఈ కొత్త మార్గదర్శకాలను పాటించని ఖాతాలపై తగిన విధంగా వ్యవహిరిస్తామనిపేర్కొంది. ఈ వెరిఫికేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నామని, నిబంధనలకు లోబడి ఉండకపోతే ఆయా ఖాతాల వెరిఫైడ్మార్క్ను తొలగిస్తామని ట్విట్టర్ తెలిపింది. అలాగే మొత్తం ఈ పద్ధతిపై రివ్యూచేపట్టామని, వెరిఫికేషన్ అంటే ఏమిటనే దానికి అధికారిక మార్గదర్శకాల్లో ఇప్పటికే మార్పులు చేసినట్టు తెలిపింది. దీనిపై కొత్త విధానాన్నిత్వరలోనే తీసుకురానున్నట్టు చెప్పింది. ఇటీవల ట్విట్టర్ ఖాతా పేరు పక్కన ఉండే బ్లూ టిక్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో వివాదం చెలరేగింది. దీంతో ఈ బ్లూటిక్ తొలగింపు విషయంలో వివరణ ఇచ్చింది. వ్యక్తుల వెరిఫైడ్ అకౌంట్ ట్విట్టర్ ధృవీకరించిన ఈ నీలిరంగు చెక్ మార్క్‌ను ప్రస్తుతం తొలగిస్తున్నట్టు ఇటీవల ట్విట్టర్ ప్రకటించింది. అయితే గత ఆగస్టు నెలలో వర్జీనియాలోని ఛార్లెట్స్విల్లే వెరిఫైడ్ చెక్ మార్క్ ఉండటం నెటిజన్ల ఆగ్రహానికి గురికావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు వికీలీక్స్ వ్యవస్థాపకుడు, వివాదాస్పదుడు జూలియస్ అసాంజే ట్విట్టర్ ఖాతారకు వెరిఫైడ్ చెక్ మార్క్‌ను తొలగించిన సంగతి తెలిసిందే. -
అమ్మనబోలు హైస్కూల్ తనిఖీ చేసిన డీఈఓ
నార్కట్‌పల్లి: పాఠశాలలో వార్షిక ప్రణాళికలు క్రమబద్ధంగా ఉండాలని డీఈఓ చంద్రమోహన్ పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం మండలంలోని అమ్మనబోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు రిజిస్టర్లను పరిశీలించి, హరితహారంలో నాటిన మొక్కలు, పాఠశాలలో మౌలిక వసతులు ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు సృజన కుమారిని అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట పీఆర్టీయూ మండల ప్రధాన కార్యదర్శి చింతకాయల పుల్లయ్య ఉన్నారు.