పాఠశాలలో వార్షిక ప్రణాళికలు క్రమబద్ధంగా ఉండాలని డీఈఓ చంద్రమోహన్ పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం మండలంలోని అమ్మనబోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
నార్కట్‌పల్లి: పాఠశాలలో వార్షిక ప్రణాళికలు క్రమబద్ధంగా ఉండాలని డీఈఓ చంద్రమోహన్ పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం మండలంలోని అమ్మనబోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు రిజిస్టర్‌లను పరిశీలించి, హరితహారంలో నాటిన మొక్కలు, పాఠశాలలో మౌలిక వసతులు ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు సృజన కుమారిని అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట పీఆర్‌టీయూ మండల ప్రధాన కార్యదర్శి చింతకాయల పుల్లయ్య ఉన్నారు.