మినిగురుకుల పాఠశాలను తనిఖీ చేసిన డీఈఓ | School Checked by DEO | Sakshi
Sakshi News home page

మినిగురుకుల పాఠశాలను తనిఖీ చేసిన డీఈఓ

Published Sun, Sep 18 2016 12:33 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

మినిగురుకుల పాఠశాలను తనిఖీ చేసిన డీఈఓ - Sakshi

మినిగురుకుల పాఠశాలను తనిఖీ చేసిన డీఈఓ


చివ్వెంల:     మండల కేంద్రంలోని మినిగురుల పాఠశాలను జిల్లా విద్యాధికారి చంద్రమోహన్‌ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పాఠశాలలో విద్యార్థుల వసతులను, హజరుపట్టికను పరిశీలించారు.  సిబ్బంది వివరాలను ప్రిన్సిపల్‌ సుజాతను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందిచాలని, క్రమతప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించాలని సూచించారు. మూత్రశాలలలను, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, వాటర్‌ ట్యాంకులను బ్లీచింగ్‌ ఫౌడర్‌తో శుభ్రం చేయాలని సూచించారు. ఆయన వెంట మండల విద్యాధికారి కట్టా యల్లారెడ్డి తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement