ఓర్వకల్లు : మాతృమూర్తి సేవలు మరువలేనివని.. ప్రతి ఒక్కరూ తల్లులను గౌరవించాలని మండల విద్యాశాఖాధికారిణి ఫైజున్నిపాబేగం అన్నారు. వసంత పంచమి సందర్భంగా సోమవారం కన్నమడకల, పూడిచెర్ల, కేతవరం, శకునాల, హుసేనాపురం, లొద్దిపల్లె, ఉప్పలపాడు, ఉయ్యాలవాడ ఉన్నత పాఠశాలల్లో అమ్మకు వందనం కార్యక్రమం నిర్వహించారు. కన్నమడకల గ్రామంలో ఓ మహిళ మాట్లాడుతూ.. తాను చిన్నతనంలో ఉండగానే తల్లిని కోల్పోయానని, ఇలాంటి దుస్థితి ఎవరికీ రాకూడదని విలపించారు. ఓర్వకల్లు జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ఎంఈవో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎఈంతో మాట్లాడుతూ..తల్లితండ్రులు దేవుళ్లతో సమానమన్నారు. బిడ్డల పెంపకంలో తల్లి పాత్ర చాలా గొప్పదని పేర్కొన్నారు. అనంతరం పిల్లచేత తల్లులకు పాదాభివందనం చేయించారు.
అమ్మకు వందనం
పాణ్యం : వసంత పంచమిని పురస్కరించుకొని సోమవారం.. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అమ్మకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ అనురాధ మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులపైన గౌరవం పెంచుకొని క్రమశిక్షణతో మెలగాలన్నారు. అనంతరం విద్యార్థులు తల్లిదండ్రులకు పాదపూజ నిర్వహించి నిర్వహించారు. ఎంపీడీఓ చంద్రశేఖర్‌రావు, ఎంఈఓ కోటయ్య, పాఠశాల చైర్మన్ జయరాముడు, హెచ్‌ఎం జ్యోత్స్న పాల్గొన్నారు.
గడివేములలో...
గడివేములు : వసంత పంచమి సందర్భంగా మండలంలోని 50 పాఠశాలల్లో సోమవారం అమ్మకు వందనం, అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. రాజరాజేశ్వరి పాఠశాల కరస్పాండెంట్ రామేశ్వరరావు దంపతులు సరస్వతీ మాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా 22 మంది చిన్నారులతో అక్షరాభ్యాసాలు చేయించారు. మాతృమూర్తికి విద్యార్థులు పాదపూజ చేశారు.
మాతృమూర్తి సేవలు మరువలేనివి
Published Tue, Jan 23 2018 5:45 PM | Last Updated on Sat, Sep 15 2018 4:15 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment