Ammaku vandanam
-
‘తల్లికి వందనం’ పథకానికి మంగళం.. ఈ ఏడాది లేనట్టే..
సాక్షి, విజయవాడ: తల్లికి వందనం పథకానికి కూటమి సర్కార్ మంగళం పాడేసింది. చంద్రబాబు కేబినెట్ విద్యార్థుల తల్లులకు షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది ఆలోచిద్దామంటూ కేబినెట్ చేతులు దులుపుకుంది. ఈ ఏడాది తల్లికి వందనం లేనట్టేనని తేలిపోయింది.అధికారంలోకి రాగానే పిల్లలందరికీ తల్లికి వందనం ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం ప్రభుత్వం అమలు చేయలేదు. తల్లికి వందనం పథకం అమలపై కేబినెట్ నిర్ణయం తీసుకోలేదు. ఏపీలో 80 లక్షల మందికి 15 వేలు చొప్పున తల్లికి వందనం ఇస్తామంటూ హామీ ఇవ్వగా, ఈ ఏడాది తల్లికి వందనం ఎగనామం పెట్టేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.కేబ్‌నెట్ భేటీ అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ, సూపర్ సిక్స్‌లో పథకాలపై చర్చించామన్నారు. తల్లికి వందనం వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు చేస్తామని తెలిపారు. ఈ అకడమిక్ సంవత్సరంలో అప్పుల కోసం ఆరా తీశాం. వచ్చే విద్యా సంవత్సరం లోపు తల్లికి వందనం చెల్లిస్తాం. రైతు భరోసా చెల్లింపుపై చర్చించాం. కేంద్రం ఇచ్చే షేర్ బట్టి రాష్ట్ర ప్రభుత్వం షేర్ రైతులకు ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడే ఇస్తాం. కేంద్రం నిర్ణయం బట్టి ఎంత చెల్లిస్తామో నిర్ణయిస్తాం’’ అని మంత్రి చెప్పారు.కాగా, ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికీ ‘తల్లికి వందనం’ పథకం వర్తింపజేస్తామంటూ మంత్రి నారా లోకేష్ ఊదరగొట్టారు. తల్లులు, పిల్లల డేటా సిద్ధంగా ఉన్నా.. విధివిధానాల రూపకల్పనలో జాప్యం జరుగుతోందని చెబుతూ.. ఇప్పట్లో పథకం అమలు చేయబోమని శాసన మండలిలో కూడా ప్రశ్నోత్తరాల సమయంలో పరోక్షంగా చెప్పిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: కిక్కే.. కిక్కుతల్లికి వందనం అమలుకు విధివిధానాలు రూపొందించడానికి కొంత సమయం కావాలని అడిగామని, దీనిపై మంత్రులందరితో చర్చిస్తున్నట్టు చెప్పారు. తాజాగా, కేబినెట్ కూడా చేతులెత్తేసింది. ఏపీలో కూటమి సర్కార్ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా ఎగ్గొట్టే పనిని ప్రారంభించింది. అయితే, తాజాగా తల్లికి వందనం విషయంలోనూ పిల్లిమొగ్గలు వేస్తుందనే చర్చ ప్రజల్లో మొదలైంది. -
అసత్యాలు చెబుతున్న షర్మిల.. ఇవిగో వాస్తవాలు
సాక్షి, అమరావతి: ‘అమ్మ ఒడి’ పథకం విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశారని ఏపీసీసీ చీఫ్ షర్మిల వ్యాఖ్యానించడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో చెప్పింది చెప్పినట్లు అమలు చేసి చూపిన చరిత్ర వైఎస్ జగన్‌ది. పిల్లలను బడికి పంపే తల్లులకు ఏటా రూ.15 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు మాట నిలుపుకున్నారు. జగన్ ప్రతి తల్లికి రూ.15 వేలు ఇచ్చారని, తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు సహా కూటమి నేతలంతా హామీ ఇచ్చారు.జగన్, చంద్రబాబు హామీ మధ్య తేడా ఇంత స్పష్టంగా కనిపిస్తోంటే ఎవరు మోసం చేసింది షర్మిలకు కనిపించడం లేదు కాబోలు. జగన్ కూడా ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఇస్తానని చెప్పారని ఇప్పుడు షర్మిల చెప్పడం.. ముమ్మాటికీ మాట తప్పిన చంద్రబాబును కాపాడటానికేనని స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా కనిపించే మూడు పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ అయితే.. కనిపించని నాలుగో పార్టీనే రాష్ట్ర కాంగ్రెస్ అన్నది షర్మిల మాటలను బట్టి మరోసారి నిరూపితమైంది. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను చూడకుండానే శుక్రవారం ఆమె విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో వైఎస్ జగన్‌పై ఆరోపణలు గుప్పించడం విస్తుగొలుపుతోంది. ప్రతిపక్ష పార్టీగా అధికార పక్ష హామీలపై నిలదీయాల్సింది పోయి.. జగన్‌ను తప్పు పట్టడం విస్తుగొలుపుతోంది. అసాధ్యమైన హామీలతో ప్రజల్ని మోసగించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మేనిఫెస్టో అమలు చేయలేక ఆత్మరక్షణలో పడగానే షర్మిల హఠాత్తుగా తెరపైకి వచ్చారు. తల్లికి వందనం పథకంపై చంద్రబాబు యూటర్న్ తీసుకోవడాన్ని ప్రశ్నిస్తారని అంతా భావించారు. సూపర్ సిక్స్ మేనిఫెస్టోను ఎప్పటి నుంచి అమలు చేస్తారని నిలదీస్తారనుకున్నారు. కానీ అందుకు విరుద్ధంగా షర్మిల చంద్రబాబుకు రాజకీయంగా వత్తాసు పలకడం ద్వారా చంద్రబాబు వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకేనని స్పష్టమైంది. చంద్రబాబు ‘తల్లికి వందనం’ పథకం అమలులో ప్రజలను మోసగించిన తీరును వివరిస్తూ సాక్షి పత్రిక ప్రచురించిన కథనాన్ని చూపిస్తూ షర్మిల వైఎస్సార్సీపీని విమర్శిస్తూ చంద్రబాబు స్క్రిప్‌్టను వినిపించడం విస్మయపరిచింది. జగనన్న అమ్మ ఒడితో విద్యా విప్లవం » ‘జగనన్న అమ్మ ఒడి పథకం’ దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. విద్యా రంగంలో విప్లవాన్ని తీసుకురావడమే కాకుండా సామాజిక, సాంఘిక సంస్కరణగా గుర్తింపు పొందింది. జగన్ కచ్చితమైన క్యాలండర్‌ను అనుసరిస్తూ ఈ పథకం కింద నాలుగేళ్లలో రూ.26,067.28 కోట్లు తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేశారు. » వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే అన్ని పథకాలు ఈపాటికి సక్రమంగా అమలయ్యేవని ప్రజలు ఇప్పటికే గుర్తించారు. ఇప్పటికే జగనన్న అమ్మ ఒడి పథకం రూ.6,500 కోట్లు తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అయ్యేవి. విద్యా దీవెన పథకం రెండు విడతల్లో రూ.1,400 కోట్లు ఖాతాల్లో వేసేవారు. వసతి దీవెన పథకం కింద రెండు విడతల కింద రూ.1,100 కోట్లు లబ్ధిదారులకు అందేవి. వైఎస్సార్ రైతు భరోసా మొదటి విడత కింద రూ.7 వేల కోట్లకుపైగా అన్నదాతలకు జమ చేసేవారు. మత్స్యకార భరోసా కింద రూ.130 కోట్లు మత్సకారులకు దక్కేవి. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం కింద రూ.1,400 కోట్లు అందేవి. » ఈ విషయాలన్నీ చెబుతూ షర్మిల చంద్రబాబును నిలదీయాలి. సూపర్ సిక్స్ పథకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారని ప్రశ్ని0చాలి. రైతులకు రూ.20 వేలు పెట్టుబడి సాయం, పిల్లలందరికీ రూ.15 వేలు, మత్స్యకార భరోసా, 1.85కోట్ల మంది మహిళలకు నెలకు రూ.1,500, 1.60 కోట్ల మంది నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం, ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు ఇస్తారని అడగాలి. బాబుకు మేలు చేసేందుకే ఆమె రాజకీయం చేస్తున్నారని ప్రజలు గమనించారు. అందుకే ఆమెకు కడప లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్ దక్కలేదు. రాష్ట్రంలో పేదల గొంతును వినిపించేది.. సంక్షేమం, అభివృద్ధి కోసం పోరాడేది వైఎస్సార్సీపీయేనని ప్రజలు గుర్తించారన్నది సుస్పష్టం. షర్మిల ఇకనైనా తెలుసుకో.. -
మాతృమూర్తి సేవలు మరువలేనివి
ఓర్వకల్లు : మాతృమూర్తి సేవలు మరువలేనివని.. ప్రతి ఒక్కరూ తల్లులను గౌరవించాలని మండల విద్యాశాఖాధికారిణి ఫైజున్నిపాబేగం అన్నారు. వసంత పంచమి సందర్భంగా సోమవారం కన్నమడకల, పూడిచెర్ల, కేతవరం, శకునాల, హుసేనాపురం, లొద్దిపల్లె, ఉప్పలపాడు, ఉయ్యాలవాడ ఉన్నత పాఠశాలల్లో అమ్మకు వందనం కార్యక్రమం నిర్వహించారు. కన్నమడకల గ్రామంలో ఓ మహిళ మాట్లాడుతూ.. తాను చిన్నతనంలో ఉండగానే తల్లిని కోల్పోయానని, ఇలాంటి దుస్థితి ఎవరికీ రాకూడదని విలపించారు. ఓర్వకల్లు జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ఎంఈవో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎఈంతో మాట్లాడుతూ..తల్లితండ్రులు దేవుళ్లతో సమానమన్నారు. బిడ్డల పెంపకంలో తల్లి పాత్ర చాలా గొప్పదని పేర్కొన్నారు. అనంతరం పిల్లచేత తల్లులకు పాదాభివందనం చేయించారు. అమ్మకు వందనం పాణ్యం : వసంత పంచమిని పురస్కరించుకొని సోమవారం.. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అమ్మకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ అనురాధ మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులపైన గౌరవం పెంచుకొని క్రమశిక్షణతో మెలగాలన్నారు. అనంతరం విద్యార్థులు తల్లిదండ్రులకు పాదపూజ నిర్వహించి నిర్వహించారు. ఎంపీడీఓ చంద్రశేఖర్‌రావు, ఎంఈఓ కోటయ్య, పాఠశాల చైర్మన్ జయరాముడు, హెచ్ఎం జ్యోత్స్న పాల్గొన్నారు. గడివేములలో... గడివేములు : వసంత పంచమి సందర్భంగా మండలంలోని 50 పాఠశాలల్లో సోమవారం అమ్మకు వందనం, అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. రాజరాజేశ్వరి పాఠశాల కరస్పాండెంట్ రామేశ్వరరావు దంపతులు సరస్వతీ మాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా 22 మంది చిన్నారులతో అక్షరాభ్యాసాలు చేయించారు. మాతృమూర్తికి విద్యార్థులు పాదపూజ చేశారు. -
‘అమ్మకు వందనం’ కోసం విరాళాల సేకరణ
► హెడ్మాస్టర్లు, టీచర్లకు సర్కారు ఆదేశం సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వింత నిర్ణయం తీసుకుంది. బడిలో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులకు కొత్త పని అప్పగించింది. విద్యాభ్యాసం చేయించాల్సిన వారికి విరాళాలు సేకరించాలని వింత ఆదేశం జారీచేసింది. వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో కొత్తగా చేపట్టనున్న ‘అమ్మకు వందనం’ కార్యక్రమం కోసం విరాళాలు సేకరించాలని ప్రభుత్వం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీచేసింది. దసరా సెలవులకు ముందే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని, తేదీని త్వరలోనే వెల్లడిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ కార్యక్రమానికి రూ.2.5 కోట్లు అవసరమవుతాయని, ప్రభుత్వం తరఫున రూ.1.25 కోట్లు అందజేస్తామని తెలిపారు. మిగతా మొత్తాన్ని హెడ్మాస్టర్లు, టీచర్లు విరాళాల రూపంలో సమీకరించుకోవాలని సూచించారు. పాఠశాలల్లో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమం కోసం ప్రజల నుంచి విరాళాలు సేకరించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల నుంచి విరాళాలు తీసుకోవాలని చెప్పడం సిగ్గుచేటని విద్యారంగ నిపుణులు దుయ్యబడుతున్నారు. గతంలోను అమరావతి నిర్మాణం కోసం ప్రతి విద్యార్థి నుంచి రూ.10 తక్కువ కాకుండా విరాళం తీసుకోవాలంటూ పాఠశాల విద్యాశాఖతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయించింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కుతీసుకుంది.