సాక్షి, విజయవాడ: తల్లికి వందనం పథకానికి కూటమి సర్కార్ మంగళం పాడేసింది. చంద్రబాబు కేబినెట్ విద్యార్థుల తల్లులకు షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది ఆలోచిద్దామంటూ కేబినెట్ చేతులు దులుపుకుంది. ఈ ఏడాది తల్లికి వందనం లేనట్టేనని తేలిపోయింది.
అధికారంలోకి రాగానే పిల్లలందరికీ తల్లికి వందనం ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం ప్రభుత్వం అమలు చేయలేదు. తల్లికి వందనం పథకం అమలపై కేబినెట్ నిర్ణయం తీసుకోలేదు. ఏపీలో 80 లక్షల మందికి 15 వేలు చొప్పున తల్లికి వందనం ఇస్తామంటూ హామీ ఇవ్వగా, ఈ ఏడాది తల్లికి వందనం ఎగనామం పెట్టేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కేబ్‌నెట్ భేటీ అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ, సూపర్ సిక్స్‌లో పథకాలపై చర్చించామన్నారు. తల్లికి వందనం వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు చేస్తామని తెలిపారు. ఈ అకడమిక్ సంవత్సరంలో అప్పుల కోసం ఆరా తీశాం. వచ్చే విద్యా సంవత్సరం లోపు తల్లికి వందనం చెల్లిస్తాం. రైతు భరోసా చెల్లింపుపై చర్చించాం. కేంద్రం ఇచ్చే షేర్ బట్టి రాష్ట్ర ప్రభుత్వం షేర్ రైతులకు ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడే ఇస్తాం. కేంద్రం నిర్ణయం బట్టి ఎంత చెల్లిస్తామో నిర్ణయిస్తాం’’ అని మంత్రి చెప్పారు.
కాగా, ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికీ ‘తల్లికి వందనం’ పథకం వర్తింపజేస్తామంటూ మంత్రి నారా లోకేష్ ఊదరగొట్టారు. తల్లులు, పిల్లల డేటా సిద్ధంగా ఉన్నా.. విధివిధానాల రూపకల్పనలో జాప్యం జరుగుతోందని చెబుతూ.. ఇప్పట్లో పథకం అమలు చేయబోమని శాసన మండలిలో కూడా ప్రశ్నోత్తరాల సమయంలో పరోక్షంగా చెప్పిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: కిక్కే.. కిక్కు
తల్లికి వందనం అమలుకు విధివిధానాలు రూపొందించడానికి కొంత సమయం కావాలని అడిగామని, దీనిపై మంత్రులందరితో చర్చిస్తున్నట్టు చెప్పారు. తాజాగా, కేబినెట్ కూడా చేతులెత్తేసింది. ఏపీలో కూటమి సర్కార్ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా ఎగ్గొట్టే పనిని ప్రారంభించింది. అయితే, తాజాగా తల్లికి వందనం విషయంలోనూ పిల్లిమొగ్గలు వేస్తుందనే చర్చ ప్రజల్లో మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment