న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమ దిగ్గజం మెటా భారత్‌లో వెరిఫైడ్ అకౌంట్ సర్వీస్‌ను ప్రారంభించింది. మొబైల్ యాప్స్‌కు చందా నెలకు రూ.699. ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌లో కస్టమర్లు నేరుగా ఈ చందా చెల్లించవచ్చు. ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు ద్వారా ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్ యూజర్లు తమ ఖాతాను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. కనీసం 18 ఏళ్లు ఉన్న క్రియాశీలక యూజర్లు ఇందుకు అర్హులు. దరఖాస్తుదారులు ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్ ఖాతా ప్రొఫైల్ పేరు, ఫోటోతో సరిపోలే ప్రభుత్వ ఐడీని సమర్పించాలి. నెలకు రూ. 599 చందాతో వెబ్‌లో వెరిఫైడ్ సర్వీస్‌ను అందుబాటులోకి తేవాలని మెటా భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment