కాలంతో పాటు టెక్నాలజీలను అందిపుచ్చుకోకపోతే దిగ్గజ కంపెనీలైన కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ యాజమాన్యంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) ప్రముఖ టెక్ దిగ్గజం 'ఇన్ఫోసిస్'తో చేతులు కలిపింది.
ఇన్ఫోసిస్ కంపెనీ డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ వాల్యూ ఎన్‌హాన్స్‌మెంట్ అనే డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ చొరవకు నాయకత్వం వహించడానికి భారతదేశంలో అతిపెద్ద లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీకు తన సహకారాన్ని ప్రకటించింది. కంపెనీ త్వరలోనే నెక్స్ట్‌జెన్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించడాన్ని ప్రారంభిస్తుంది. ఇది ఎల్‌ఐసీ కస్టమర్‌లు, ఏజెంట్లు, ఉద్యోగులకు ఓమ్నిచానెల్ ఎంగేజ్‌మెంట్, డేటా ఆధారిత హైపర్ పర్సనలైజ్డ్ అనుభవాలను అందించడంపై దృష్టి పెడుతుంది.
భారీ స్థాయి డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్ట్‌లను అమలు చేయడంలో దాని విస్తృత అనుభవం, బ్యాంకింగ్, ఫైనాన్షియల్.. ఇన్సూరెన్స్ రంగాలలో మరింత నైపుణ్యం పెంచుకోవడానికి ఎల్ఐసీ కంపెనీ ఇన్ఫోసిస్‌ను ఎంపిక చేసింది. కాబట్టి త్వరలోనే ఎల్ఐసీ రూపురేఖలు మారే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: హోండా బైకులకు రీకాల్: జాబితాలోని మోడల్స్ ఇవే..
ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్), క్లౌడ్ నైపుణ్యాలను ఇన్ఫోసిస్ ఎల్ఐసీలో కూడా ప్రవేశపెట్టనుంది. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ సలీల్ పరేఖ్ వెల్లడించారు. ఇది తప్పకుండా ఎల్ఐసీ అభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఇన్ఫోసిస్ సహకారం.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పరివర్తనను మరింత మెరుగుపరుస్తుందని.. కస్టమర్లు, ఏజెంట్లు, ఉద్యోగులు అందరూ కూడా లేటెస్ట్ టెక్నాలజీ అనుభవాలను పొందవచ్చని ఎల్ఐసి సీఈఓ అండ్ ఎండీ సిద్దార్థ మొహంతి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment