Subscribe
-
టీవీ ఛానళ్ల సబ్స్క్రిప్షన్ రేట్లు పెంపు.. ఎంతంటే..
టీవీ ఛానళ్ల సబ్స్క్రిప్షన్ రేట్లు 5-8 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డిస్నీ స్టార్, వయాకామ్ 18, జీ ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా వంటి బ్రాడ్కాస్టర్లు తమ బొకే(ఛానళ్ల సమూహం) రేట్లు పెంచనున్నట్లు తెలిపాయి.కొత్త టారిఫ్ ఒప్పందాలపై సంతకం చేయని డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫామ్ ఆపరేటర్లకు (డీపీఓ) సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు సిగ్నళ్లను తొలగించకూడదని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) బ్రాడ్కాస్టర్లను ఆదేశించింది. దాంతో ఎన్నికలు ముగిసే వరకు కంపెనీలు ఈమేరకు చర్యలు తీసుకోలేదు. తాజాగా ఎన్నికల ఫలితాలు సైతం వెలువడడంతో తిరిగి సబ్స్క్రిప్షన్ రేట్ల పెంపు అంశం వెలుగులోకి వస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: జూన్ 14 తర్వాత ఆధార్ పనిచేయదా..? స్పష్టతనిచ్చిన యూఐడీఏఐజనవరిలో ప్రముఖ బ్రాడ్కాస్టర్లు తమ బేస్ బొకే రేట్లను సుమారు 10 శాతం పెంచారు. భారతీయ క్రికెట్ హక్కులను చేజిక్కించుకోవడంతో సాధారణ ఎంటర్టైన్మెంట్ ఛానెళ్ల కంటే వయోకామ్18 అత్యధికంగా 25 శాతం పైగా రేట్లును పెంచింది. అయితే పెరిగిన ధరలు ఫిబ్రవరి నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ట్రాయ్ నిబంధనల వల్ల వాటికి బ్రేక్ పడింది. -
యాప్‌ల కొనుగోళ్లకు కంపెనీల పన్నాగం.. ఎలా మోసం చేస్తున్నారంటే..
మొబైల్ అప్లికేషన్ స్టోర్స్ నుంచి యాప్‌లు లేదా ఇతరత్రా సాఫ్ట్వేర్లను కొనుగోలు చేస్తున్న వారిలో చాలా మంది సబ్‌స్కిప్షన్ వలలో చిక్కుకుంటున్నారు. ముందుగా చెప్పకుండా తర్వాత వడ్డించే ఛార్జీలతో (హిడెన్ చార్జీలు) నానా తంటాలు పడుతున్నారు. ఆన్లైన్ రీసెర్చ్ సంస్థ లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో సగం మంది పైగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. ఉచిత యాప్‌ను లేదా వన్–టైమ్ సర్వీస్‌ను ఎంచుకున్న వినియోగదారులు ఆ తర్వాత సబ్‌స్కిప్షన్ ఉచ్చులో పడుతున్న సందర్భాలు పెరుగుతున్న నేపథ్యంలో లోకల్‌సర్కిల్స్ సర్వే ప్రాధాన్యం సంతరించుకుంది. డార్క్ ప్యాటర్న్‌లను (మోసపూరితంగా కస్టమర్లను ఆకర్షించడం) నిషేధిస్తూ కేంద్రీయ వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) నవంబర్ 30న ఒక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 13 రకాల డార్క్ ప్యాటర్న్‌లను ప్రస్తావించింది. అప్పటికప్పుడు వెంటనే చర్యలు తీసుకునేలా తొందరపెట్టడం, సబ్‌స్కిప్షన్ వల వేయడం, విసిగించడం మొదలైనవి వీటిలో ఉన్నాయి. తాజాగా లోకల్‌సర్కిల్స్ సర్వేలో వెల్లడైన మరిన్ని విషయాలను చూస్తే.. యాప్ ప్లాట్‌ఫాంలు, ఎస్ఏఏఎస్ ప్లాట్‌ఫాంల ద్వారా వన్–టైమ్ సాఫ్ట్వేర్ లేదా సర్వీస్ అంటూ తమకు అంటగట్టిన వాటిల్లో చాలా మటుకు సబ్స్క్రిప్షన్ కోసం పన్నిన పన్నాగాలేనని సర్వేలో పాల్గొన్న వారిలో 67 శాతం మంది వినియోగదారులు తెలిపారు. కొనుగోలుకు సంబంధించి చెల్లింపులు జరిపేటప్పుడు ముందుగా చెప్పని బోలెడన్ని హిడెన్ చార్జీలు తెరపైకి వచ్చినట్లు 71 శాతం మంది పేర్కొన్నారు. యాప్ ప్లాట్‌ఫాంలు, ఎస్ఏఏఎస్ ప్లాట్‌ఫాంల ద్వారా తాము కొన్నది ఒకటైతే తమకు అందినది మరొకటని 50 శాతం మంది వినియోగదారులు తెలిపారు. యాప్ ప్లాట్‌ఫాంల ద్వారా తాము డౌన్లోడ్ చేసుకున్న కొన్ని యాప్‌లలో మాల్వేర్ ఉందని, ఫలితంగా తమ డివైజ్‌ల నుంచి ప్రైవేట్ సమాచారం చోరీకి గురైందని 25 శాతం మంది వినియోగదారులు వివరించారు. ఇదీ చదవండి: ఆన్లైన్ గేమ్‌ల కోసం ప్రభుత్వంతో ఒప్పందం.. ఎందుకంటే.. యాప్‌లు లేదా సాఫ్ట్వేర్ సర్వీసుల యూజర్లపై 2023 డిసెంబర్ 1 నుంచి 2024 జనవరి 30 వరకు 331 జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వేకు 44,000 పైచిలుకు సమాధానాలు వచ్చాయి. -
amazon prime : ప్రైమ్ యూజర్లకు భారీ షాక్!
ఓటీటీ లవర్స్‌కి అమెజాన్ ప్రైమ్ భారీ షాకిచ్చింది. త్వరలో ‘హైక్వాలిటీ’ పేరుతో యూజర్ల నుంచి డబ్బుల్ని వసూలు చేసేందుకు సిద్ధమైంది. అదే జరిగితే.. మిగిలిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సైతం అమెజాన్ ప్రైమ్‌ను ఫాలో అయ్యే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకుల అంచనా. కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్లు సగటు సినీ ప్రేక్షకుడు థియేటర్‌కి వెళ్లి ఎందుకు సినిమా చూడడం లేదనేదానికి అన్నే కారణాలు ఉన్నాయి. అయితే సినిమా, థియేటర్లు అనే అంశాలు కాసేపు అటుంచితే.. ప్రస్తుతం ఎంటర్టైన్ మెంట్ విభాగంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు మంచి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్‌నే క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. బొమ్మ ఫుల్ హెచ్డీలో కనబడాలంటే ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్, డిస్నీ, అమెజాన్ ప్రైమ్ వంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు ప్రస్తుతం తమ ఆదాయాన్ని, సబ్‌స్కైబర్ బేస్‌ను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందుకోసం పాస్ వర్డ్ షేరింగ్‌ను పరిమితం చేయడం, యాడ్ ఫ్రీ వ్యూయింగ్‌కు ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడం వంటి పలు మార్పులు చేస్తున్నాయి. తాజాగా, అమెజాన్ ప్రైమ్ ఇటీవల డాల్బీ విజన్ హెచ్ఆర్, డాల్బీ అట్మాస్ సరౌండ్ సౌండ్ ఫీచర్లను తన స్టాండర్డ్ సర్వీసుల నుండి తొలగించింది. ఇప్పుడు హైక్వాలిటీ ఆడియో,వీడియో స్ట్రీమింగ్ వీడియోల్ని వీక్షించాలంటే అదనపు ఛార్జీలు చెల్లించాలని యూజర్లను కోరుతుంది. ఎంత మొత్తం చెల్లించాలంటే? అమెజాన్ తన పెయిడ్ సబ్ స్క్రిప్షన్కు యాడ్స్ జోడించడమే కాకుండా హై క్వాలిటీ ఆడియో, వీడియో ఆప్షన్‌ను తొలగించింది. వినియోగదారులు ఇప్పుడు తమ అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ పై నెలకు 2.99 డాలర్లు చెల్లించి క్వాలిటీని తిరిగి పొందవచ్చు. యాడ్స్ నుంచి విముక్తి పొందవచ్చు. అయితే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు మార్పులు, చేర్పులు చేసే సమయంలో సబ్‌స్కైబర్లు భారీగా తగ్గిపోతున్నారు. ఇతర ప్లాట్‌ఫామ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. అమెజాన్ ప్రైమ్ తీసుకునే నిర్ణయం ఆ సంస్థపై ఎలాంటి ప్రతికూలా ప్రభావం చూపనుందో తెలియాల్సి ఉంది. చదవండి👉 Elon Musk: మూడు లక్షల కోట్లు తగలెట్టేశాడు -
ఒక్కప్లాన్‌తో 14 ఓటీటీ సబ్స్క్రిప్షన్లు.. జియో టీవీ బంపర్ ఆఫర్
ప్రముఖ టెలికామ్ దిగ్గజం 'రిలయన్స్ జియో' (Reliance Jio) ఇటవల తన సబ్స్క్రైబర్ల ఓ సరి కొత్త ప్లాన్స్ తీసుకువచ్చింది. ఈ కొత్త ప్లాన్స్ ప్రకారం ఏకంగా 14 ఓటీటీలను ఒకే ప్లాన్ తో పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొత్త ప్లాన్ల ధరలు రిలయన్స్ జియోటీవీ ప్రీమియం ప్లాన్లలో రూ.398, రూ.1198, రూ.4498 ధరలతో మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ఉన్నాయి. ఈ ప్లాన్స్ ఇప్పటికే (15 డిసెంబర్ 2023) అందుబాటులో ఉన్నాయి 👉రూ.398తో ప్రారంభమయ్యే ప్లాన్ రోజుకు 2GB డేటాతో 28 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. అంతే కాకుండా మీరు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకి 100 SMSలు వంటివి పొందవచ్చు. అయితే ఈ ప్లాన్ 12 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను మాత్రమే అందిస్తుంది. 👉రూ.1198తో ప్రారంభమయ్యే ప్లాన్ అనేది 84 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఇందులో రోజుకి 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకి 100 SMSలు, JioTV ప్రీమియం (14 ఓటీటీలు) వంటివి పొందవచ్చు. 👉రూ.4498తో ప్రారంభమయ్యే ప్లాన్ 365 రోజులు పాటు చెల్లుబాటు అవుతుంది. ఇందులో కూడా రోజుకి 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకి 100 SMSలు వంటివి లభిస్తాయి. పైగా 14 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను పొందవచ్చు. కంపెనీ ఈ ప్లాన్ కోసం ఈఎమ్ఐ వెసులుబాటుని కూడా అందిస్తుంది. జాబితాలోని రీజనల్ అండ్ గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు జియోసినిమా ప్రీమియం డిస్నీ+ హాట్‌స్టార్ జీ5 సోనీలైవ్ ప్రైమ్ వీడియో (మొబైల్) లయన్స్‌గేట్ ప్లే డిస్కవరీ+ డాక్యుబే హోఇచోయ్ SunNXT ప్లానెట్ మరాఠీ చౌపాల్ ఎపిక్ఆన్ కంచ లంక -
నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు భారీ షాక్!
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు భారీ షాక్ ఇవ్వనుంది. త్వరలో లేదంటే వచ్చే ఏడాది సబ్స్క్రిప్షన్ ధరల్ని పెంచుతుందంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది. గతంలో నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ధరల పెంపుపై వచ్చిన నివేదికల్ని ఊటంకిస్తూ అవి నిజమేనంటూ తన తాజా కథనంలో హైలెట్ చేసింది. సబ్‌స్కిప్షన్ మార్పులపై స్పష్టత లేనప్పటికి ముందుగా అమెరికా, కెనడా వంటి దేశాల్లో ముందుగా ‘ధరల పెంపు’ ఉంటుందని తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ నిర్ణయం భారత్‌కు వర్తిస్తుందా? లేదా? అని తెలియాల్సి ఉండగా.. గ్లోబుల్ మార్కెట్లో నెట్‌ఫ్లిక్స్ ధరల పెంపు ఉంటుందనేది పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, గత ఏడాది సబ్స్క్రిప్షన్ ధరల్ని పెంచిన నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు మరుసారి ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవడం పట్ల యూజర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఓటీటీ నెట్‌వర్క్‌లను వినియోగించేందుకు మొగ్గు చూపుతున్నారు. పాస్వర్డ్ షేరింగ్ అంటూ స్ట్రీమింగ్ దిగ్గజం పాస్వర్డ్ షేరింగ్ పేరుతో యూజర్ల నుంచి అదనపు వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎవరైనా స్నేహితులు, ఇతర కుటుంబసభ్యులకు నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేర్ చేస్తే అదనంగా కొంత మొత్తాన్ని చెల్లించాలని స్పష్టం చేసింది. అయితే, ఆ విధానానికి కొద్ది రోజులు స్వస్తి చెప్పినట్లే చెప్పి.. మళ్లీ యూజర్లకు పాస్వర్డ్ షేరింగ్ పేరుతో నోటిఫికేషన్లు పంపింది. పెరిగిన యూజర్లు పాస్వర్డ్ షేరింగ్‌కు స్వస్తి పలకడంతో నెట్‌ఫ్లిక్స్ యూజర్లు గణనీయంగా పెరిగారు. ఈ ఏడాది క్యూ2లో యూజర్లు దాదాపు 6 మిలియన్ వచ్చి చేరారు. ఇది దాదాపు 8 శాతం పెరుగుదలను చూపించింది. చదవండి👉 మెటాలో ఊడిన ఉద్యోగం.. ఆనందంలో తేలిపోయిన మేనేజర్ -
డిస్నీప్లస్ హాట్‌స్టార్ యూజర్లకు బంపర్ ఆఫర్.. ఇకపై ఫ్రీగా చూసేయండి!
భారత్‌లో క్రికెట్‌కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఐపీఎల్ వచ్చిన తర్వాత ఇది మరింత పెరిగిందనే చెప్పాలి. అందుకే ఓటీటీ ప్లాట్‌ఫాంలు ఈ రిచ్ లీగ్‌ను ప్రసార హక్కులు కోసం ఎగబడుతుంటాయి. ఈ ఏడాది ఐపీఎల్2023 స్ట్రీమింగ్ రైట్స్‌ను జియో సినిమా సొంత చేసుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు సంస్థ ప్రకటించడం, దాంతో పాటు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌ల కారణంగా జియో సినిమా రికార్డు స్థాయిలో వ్యూయర్షిప్ ( వీక్షకులు) సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా డిస్నీ+ హాట్‌స్టార్ తమ మొబైల్ వినియోగదారులు బంపర్ ఆఫర్ ప్రకటించింది. బంఫర్ ఆఫర్ ఈ పోటీ ప్రపంచంలో కార్పొరేట్ సంస్థలు హిట్ ఫార్ములాను అనుసరిస్తూ పోతుంటాయి. ఇటీవల ఐపీఎల్-2023 సీజన్‌ను రిలయన్స్ జియో ఆధీనంలోని ఓటీటీ ప్లాట్‌ఫామ్.. జియో సినిమాలో ఉచితంగా ప్రసారం చేయడం ద్వారా లక్షల మంది వీక్షకులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే బాటలో డిస్నీ హాట్‌స్టార్ కూడా నడవనుంది. ఈ ఏడాది జరిగే ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌లను మొబైల్ ఫోన్లలో ఉచితంగా స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా తమ యూజర్ల సంఖ్యను మరింత పెంచుకోవాలని భావిస్తోంది. ఇటీవల హాట్‌స్టార్ నుంచి ఐపీఎల్ ఇంటర్నెట్ ప్రసార హక్కులను సొంతం చేసుకున్న జియో..కేవలం యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు, రుసుము చెల్లించకుండా ప్రపంచ కప్ మ్యాచ్‌లను వీక్షించవచ్చని ప్రకటించింది. దీంతో ఐపీఎల్ టోర్నీ జరిగిన ఐదు వారాల్లో రికార్డు స్థాయిలో జియో సినిమా రికార్డు స్థాయిలో డిజిటల్ వీక్షకులను సొంతం చేసుకుంది. -
మెటా వెరిఫైడ్ సర్వీస్ ఆరంభం.. ఛార్జర్ ఎలా ఉన్నాయంటే?
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమ దిగ్గజం మెటా భారత్‌లో వెరిఫైడ్ అకౌంట్ సర్వీస్‌ను ప్రారంభించింది. మొబైల్ యాప్స్‌కు చందా నెలకు రూ.699. ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్లో కస్టమర్లు నేరుగా ఈ చందా చెల్లించవచ్చు. ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు ద్వారా ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ యూజర్లు తమ ఖాతాను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. కనీసం 18 ఏళ్లు ఉన్న క్రియాశీలక యూజర్లు ఇందుకు అర్హులు. దరఖాస్తుదారులు ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ ఖాతా ప్రొఫైల్ పేరు, ఫోటోతో సరిపోలే ప్రభుత్వ ఐడీని సమర్పించాలి. నెలకు రూ. 599 చందాతో వెబ్‌లో వెరిఫైడ్ సర్వీస్‌ను అందుబాటులోకి తేవాలని మెటా భావిస్తోంది. -
ట్విటర్ యూజర్లకు శుభవార్త!
ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల అధికారిక ట్విటర్ అకౌంట్లకు తొలగించిన ‘బ్లూటిక్’ వెరిఫికేషన్ మార్క్‌లను మళ్లీ పునరుద్దరించారు. ట్విటర్లో అధికారిక ఖాతాలకు ఇచ్చే బ్లూ టిక్కు ఛార్జీలు తీసుకొచ్చిన మస్క్..నిర్దేశించిన గడువులోగా డబ్బులు చెల్లించకపోతే వెరిఫికేషన్ మార్క్ తొలగిస్తామని చెప్పారు. అనుకున్నదే తడువుగా ప్రపంచ వ్యాప్తంగా ట్విటర్ ఖాతాల వెరిఫికేషన్ మార్క్‌ను తొలగించారు. ఫలితంగా ప్రజాప్రతినిధుల నుంచి సినీ ప్రముఖులు వరకు ట్విటర్ బ్లూ మార్క్‌ను కోల్పోయారు. అయితే ఈ నేపథ్యంలో బ్లూ మార్క్‌ను తొలగించిన అకౌంట్లకు మళ్లీ పునరుద్దరించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వాటిల్లో సబ్స్క్రిప్షన్ తీసుకోని అకౌంట్లు సైతం ఉన్నాయి. బ్లూటిక్ వెరిఫికేషన్ ఉన్న అకౌంట్లకు వన్ మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఖాతాలను మస్క్ రీస్టోర్ చేశారు. ఇదే ఫైనల్ ఫేక్ అకౌంట్లను గుర్తించేందుకు వీలుగా ట్విటర్ సంస్థ తొలిసారిగా 2009లో బ్లూ టిక్ ఖాతాలను ప్రవేశపెట్టింది. వాటిపై ఎలాంటి ఛార్జీలు విధించలేదు. కానీ 2022లో ట్విటర్ బాస్‌గా బాధ్యతలు చేపట్టిన మస్క్.. ట్విటర్ బ్లూ టిక్ అకౌంట్లకు ఛార్జీలు చెల్లించాలనే నిబంధన విధించారు. ఈ సబ్స్క్రిప్షన్ ఛార్జీలపై ఈ ఏడాది ఏప్రిల్ 11న మస్క్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోని అకౌంట్లకు ఏప్రిల్ 20 నుంచి వెరిఫికేషన్ బ్యాడ్జీలను తొలగిస్తామని పేర్కొన్నారు. Tomorrow, 4/20, we are removing legacy verified checkmarks. To remain verified on Twitter, individuals can sign up for Twitter Blue here: https://t.co/gzpCcwOXAX Organizations can sign up for Verified Organizations here: https://t.co/YtPVNYypHU — Twitter Verified (@verified) April 19, 2023 ‘బ్లూటిక్’ వెరిఫికేషన్ మార్క్‌ల పునరుద్దరణ ట్వీట్లో మస్క్ చెప్పినట్లుగానే వెరిఫికేషన్ బ్యాడ్జీలను డిలీట్ చేశారు. దీంతో సెలబ్రిటీ ట్విటర్ యూజర్లు మస్క్‌పై తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. బిగ్బిలాంటి వారు సైతం తాము ట్విటర్ బ్లూ కోసం డబ్బులు చెల్లించినా..బ్యాడ్జీని ఎందుకు తొలగించారంటూ మస్క్‌పై కామెంట్ల వర్షం కురిపించారు. తాజాగా అధికారిక అకౌంట్లకు బ్లూ చెక్ మార్క్‌లు ప్రత్యక్షమయ్యాయి. చదవండి👉 కేంద్రం కీలక నిర్ణయం.. డెలివరీ బాయ్స్ కష్టాలకు చెక్! -
ఓలా సరికొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్.. కస్టమర్ల కోసం అదిరిపోయే బెనిఫిట్స్
భారత్‌లో ఆటోమొబైల్ రంగం వృద్ది వైపు పరుగులు పెడుతోంది. కరోనా తర్వాత ఈ రంగంలో సేల్స్ ఆశాజనకంగా ఉన్నాయి. అంతేకాకుండా కాలుష్య నివారణ, ఇంధన వాడకం తగ్గించే క్రమంలో మార్కెట్లోకి వస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. ఈవీ మార్కెట్లో ఓలా సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ల సేల్స్‌లో దూసుకెళ్తోంది. తాజాగా తమ కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా రెండు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడం కోసం ఓలా కేర్, ఓలా కేర్+ ప్లాన్లను ప్రారంభించింది. ఈ ప్లాన్ల ధర వరుసగా రూ. 1,999, కేర్ ప్లస్ రూ. ₹2,999 ఓలా కేర్ బెనిఫిట్స్ ఇలా.. ఓలా కేర్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లలో భాగంగా, కస్టమర్లు ఉచిత హోమ్ సర్వీసింగ్ వంటి సేవలను అందిస్తోంది. ఇందులో ఉచిత హోమ్ పికప్, డ్రాప్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కూడా ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యజమానులు నాన్ యాక్సిడెంటల్, నాన్ ఇన్సూరెన్స్ కేసులకు రీప్లేస్మెంట్ల సేవలను ఉచింతంగా పొందవచ్చు. ఓలా కేర్ ప్లస్ ఇలా ప్రత్యేకంగా, ఓలా కేర్ ప్లస్‌లో.. ఒక సంవత్సరం పాటు స్కూటర్ ఇన్స్పెక్షన్, ఉచిత లేబర్ ఆన్ సర్వీస్, థెఫ్ట్ అసిస్టెన్స్, హెల్ప్‌లైన్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ఉన్నాయి. ఓలా కేర్ ప్లస్ (Ola Care+) ప్లాన్ వార్షిక సమగ్ర రోగనిర్ధారణ, ఉచిత హోమ్ సర్వీస్, పికప్/డ్రాప్ సౌకర్యంతో పాటు ఒకవేళ ప్రమాదం (యాక్సిడెంట్) జరిగితే 24×7 డాక్టర్, అంబులెన్స్ సర్వీసులను ఓలా కేర్ + ప్లాన్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్లినప్పుడు అర్ధాంతరంగా స్కూటర్ ఆగిపోతే, టోయింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఉచితంగా టాక్సీ రైడ్ సర్వీస్ పొందవచ్చు. నగరం వెలుపల బైక్ రిపేర్ వచ్చి ఆగిపోతే ఉచిత హోటల్ వసతి పొందవచ్చు. ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, “కస్టమర్లకు ఎల్లప్పుడూ మెరుగైన సేవలు అందించడమే మా లక్ష్యం. ‘ఓలా కేర్ సబ్స్క్రిప్షన్ ప్లాన్’ ద్వారా, మేము కస్టమర్ సర్వీస్ అనుభవాన్ని పూర్తిగా పునర్నిర్మిస్తున్నాం. సబ్స్క్రిప్షన్ ప్లాన్ కస్టమర్లకు మా సర్వీస్ నెట్‌వర్క్‌కు 360 డిగ్రీల యాక్సెస్‌ను అందిస్తుంది, ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ద్వారా కంపెనీ కస్టమర్లకు సర్వీస్‌లను వారి ఇంటి వద్ద లేదా సమీపంలోని ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లలో అందించనుందన్నారు. చదవండి: నమ్మలేకపోతున్నా.. ఇంటర్వ్యూ చేస్తుండగానే ఉద్యోగం ఊడింది -
ఓటీటీ యూజర్లకు జియో భారీషాక్!
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఓటీటీ యూజర్లకు భారీషాక్ ఇచ్చింది. ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భాగస్వామ్యంతో కొన్ని ఓటీటీ పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లను అందించింది. అయితే ఇప్పుడు ఆ ప్లాన్లను తొలగించినట్లు తెలుస్తోంది. ప్రీపెయిడ్ ప్లాన్లను అక్టోబర్‌లో తొలగించిన జియో.. తాజాగా రూ.1499, రూ.4199 ప్రీపెయిడ్ ప్లాన్లను సంబంధిత ప్లాట్ ఫామ్ అన్నింటి నుంచి తొలగించింది. ఇప్పటికే ఈ ప్లాన్లు యాక్టీవేట్ యూజర్లు వినియోగించుకోవచ్చు. కానీ కొత్తగా ఆ ప్లాన్లు తీసుకోవాలనుకునే వారికి అందుబాటులో ఉండవని ఓటీటీ నివేదికలు చెబుతున్నాయి. కాగా, జియో - డిస్నీప్లస్ హాట్ స్టార్ మధ్య కుదరిన ఓటీటీల ఒప్పందం నుంచి జియో ఎందుకు తొలగిందో చెబుతూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇన్నాళ్లు ఐపీఎల్ ప్రసార హక్కులను దక్కించుకుంటూ వచ్చిన డిస్నీ+హాట్‌స్టార్.. 2023 ఐపీఎల్ ప్రసార హక్కులను కోల్పోయింది. ఈసారి రిలయన్స్ గ్రూప్‌కే చెందిన వయాకామ్ 18 ఆ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే హాట్‌స్టార్ ప్లాన్లను జియో తొలగించినట్లు సమాచారం. -
ట్విటర్ యూజర్లకు షాక్: భారీ వడ్డన దిశగా మస్క్ ప్లాన్లు
న్యూఢిల్లీ: టెస్లా సీఈవో, బిలియనీర్ ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విటర్ కొనుగోలు చేసినప్పటినుంచి ప్రతీ రోజు ఏదో ఒక సెన్సేషన్తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. మస్క్ సరికొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నట్టు తాజాగా తెలుస్తోంది. బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ల ద్వారా ఆదాయం పెంచుకోవాలని యోచిస్తున్నన్నారన్న వార్త ట్రెండ్ అవుతోంది. ఇప్పటిదాకా బ్లూటిక్ అంటే గౌరవంగా, అఫీషియల్ ఖాతాగా భావించేవారు. ఇపుడిక వారికి నెలకు సుమారు రూ. 1640 భారంగా మారనుంది. ఈ వార్తలతో ‘ట్విటర్ బ్లూ’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. (Bluetick ట్విటర్ బ్లూటిక్ వివాదం: మండిపడుతున్న నెటిజన్లు) SOURCES: The new twitter blue verification feature will have 69 tiers, with the top tier giving you a crown icon and the power to ban any user. It will cost $420,000,000. Elon Musk told Twitter employees if they don’t finish it by Monday, he will blast Nickelback in the office. — Shibetoshi Nakamoto (@BillyM2k) October 31, 2022 44 బిలియన్ డాలర్లు వెచ్చించి ట్విటర్‌ను సొంతం చేసుకున్న మస్క్ ట్విటర్ యూజర్లకు గట్టి షాక్ ఇవ్వనున్నారట. ముఖ్యంగా ట్విటర్‌కు బాగా ఎడిక్ట్ అయిన బ్లూ టిక్ వెరిఫైడ్ అకౌంట్ యూజర్ల నుంచి సబ్స్క్రిప్షన్ ఛార్జీలను వసూలు చేయాలని ఎలన్ మస్క్ భావిస్తున్నారట. ది వెర్జ్ నివేదిక ప్రకారం బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ కోసం వినియోగ దారుల నుంచి నెలకు 20 డాలర్లు (19.99) వసూలు చేయనున్నారట. దీనిపై అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, బ్లూటిక్ ఉన్న యూజర్లు ఈ కొత్త నిబంధన ప్రకారం చెల్లింపు చేయాల్సిందే. ఇందుకుగాను యూజర్లకు 90 రోజులు గడువు ఇస్తారు. గడుపులోపు చెల్లించకపోతే సదరు యూజర్లు ట్విటర్ వెరిఫికేషన్ బ్యాడ్జ్‌ను కోల్పోతారు. అంతేకాదు ఈ ఫీచర్‌ను ప్రారంభించడానికి ఉద్యోగులకు నవంబర్ 7 వరకు గడువిచ్చారు. లేదంటే వారికి ఉద్వాసన తప్పదని కూడా హెచ్చరించినట్టు సమాచారం. Oh no, all our diabolical plans have been revealed!! — Elon Musk (@elonmusk) October 31, 2022 అయితే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో సబ్స్క్రిప్షన్ పద్దతి అమల్లో ఉంది. ప్రస్తుతం అమెరికాలో నెలకు 5 డాలర్లు వసూలు చేస్తోంది. మరోవైపు ఇప్పటికే ప్రీమియం, హెవ్వీ ట్వీటర్లను కోల్పోతోందన్న నివేదికల మధ్య ఈ సర్వీస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎలా అందుబాటులోకి తెచ్చేలా మొత్తం పేమెంట్ స్ట్రక్చర్ప్లాన్ను ఎలా మారుస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. -
" లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్ " మూవీ టీంతో చిట్ చాట్
-
ఎంత అమానుషం!.. చందా ఇవ్వలేదని కుల బహిష్కరణ
సాక్షి, ఖమ్మం: దేవుడి ఉత్సవానికి చందా ఇవ్వలేదనే కారణంతో ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసిన ఘటన కూసుమంచి మండలంలోని నేలపట్లలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని దళిత వాడలో పది రోజుల క్రితం బంగారు మైసమ్మ ఉత్సవ నిర్వహణ కోసం ఉత్సవ కమిటీ సభ్యులు, కులపెద్దలు చందాలు వసూలు చేశారు. కులస్తులంతా ఇంటికి రూ.1,500 చొప్పున వేసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో కలకొండ వీరబాబు అనే వ్యక్తి ఇంటికి వెళ్లి చందా అడగగా, తాను కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నానని, చందా ఇవ్వలేనని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన కులపెద్దలు వీరబాబుకు కులస్తులు ఎవరూ సహాయం చేయవద్దని హుకుం జారీ చేశారు. దీంతో కులానికి చెందిన వారు ఎవరూ సహకరించకుండా ఉండడంతో వీరబాబు, అతడి తల్లి సుగుణమ్మ కులపెద్దల వద్దకు వెళ్లి రూ.1,500 ఇస్తామని చెప్పగా.. తాము అడిగినప్పుడు ఇవ్వనందున ఇప్పుడు రూ.10 వేలు ఇవ్వాలని కులపెద్దలు అన్నారు. దీంతో చేసేదేమీలేక వీరబాబు కుటుంబసభ్యులు మిన్నకుండి పోయారు. అప్పటి నుంచి ఆ కుటుంబానికి కిరాణ సరుకులు అమ్మకపోవటం, వీరబాబు భార్య వీరకుమారికి నలతగా ఉంటే మందుల కోసం అదే కులానికి చెందిన ఆశ కార్యకర్త వద్దకు వెళ్లినా ఇవ్వకపోవడంతో తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. ఈ విషయమై వీరబాబు, అతడి భార్య పోలీసులను ఆశ్రయించారు. చదవండి: కోట్ల అక్రమ ఆస్తులు.. శంషాబాద్ మాజీ పంచాయతీ అధికారి అరెస్ట్ -
ఎల్ఐసీలో షేర్లు కావాలా? అయితే త్వరపడండి
న్యూఢిల్లీ: ఎల్ఐసీ ఐపీవోకి వస్తున్న స్పందనను చూసి శని, ఆదివారాలు సైతం రిటైలర్లు దరఖాస్తు చేసుకునేందుకు ఎక్సేంజీలు, ఆర్బీఐ అనుమతించాయి. ఐపీవో దరఖాస్తుకు వీలుగా బ్యాంకుల అస్బా (ఏఎస్బీఏ) బ్రాంచీలు పనిచేయనున్నాయి. ఐపీవో ధరలో ఎల్ఐసీ పాలసీదారులకు రూ. 60, ఉద్యోగులు, రిటైలర్లకు రూ. 45 చొప్పున రాయితీని ప్రకటించిన విషయం విదితమే. ఇష్యూ ద్వారా 3.5 శాతం వాటాను విక్రయిస్తున్న ప్రభుత్వం రూ. 20,600 కోట్లవరకూ సమీకరించే యోచనలో ఉంది. 1:4 నిష్పత్తిలో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ మూడో రోజు శుక్రవారాని(6)కల్లా పూర్తిగా సబ్స్క్రయిబ్ అయ్యింది. కంపెనీ దాదాపు 16.21 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 22.37 కోట్ల షేర్లవరకూ బిడ్స్ దాఖలయ్యాయి. వెరసి 1.4 రెట్లు అధిక స్పందన లభించింది. షేరుకి రూ. 902–949 ధరలో చేపట్టిన ఇష్యూ సోమవారం(9న) ముగియనుంది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 1.23 రెట్లు అధికంగా స్పందన నమోదైంది. అంటే 6.9 కోట్ల షేర్లకుగాను 8.53 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. ఇక పాలసీదారుల నుంచి 4 రెట్లు, ఉద్యోగుల నుంచి 3 రెట్లు అధికంగా స్పందన లభించింది. అయితే క్విబ్ విభాగంలో 76 శాతం, నాన్‌ఇన్‌స్టిట్యూషనల్ కోటాలో 56% చొప్పున మాత్రమే బిడ్స్ దాఖలయ్యాయి. చదవండి: ఐపీవో.. సరికొత్త రికార్డ్‌కు తెరతీయనున్న ఎల్ఐసీ! -
జియోకు లభించే ఆదరణ ఏ రేంజ్ లో ఉందంటే...
న్యూఢిల్లీ : ఉచిత ఆఫర్లతో ఇన్ని రోజులు వినియోగదారులను మైమరిపించిన రిలయన్స్ జియో ఛార్జీల బాదుడుకు సిద్ధమవుతోంది. 2017 ఏప్రిల్ నుంచి టారిఫ్ ప్లాన్స్ అమలు చేయనున్నట్టు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. అయితే ఛార్జీల వసూల తర్వాత నుంచి చాలామంది జియో సిమ్ సబ్‌స్క్రైబింగ్ ను ఆపివేస్తారంటూ పలు రూమర్లు మార్కెట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇదెంత నిజమో తెలుసుకోవడం కోసం బ్రోకరేజ్ సంస్థ బెర్న్ స్టెయిన్ ఓ రీసెర్చ్ నిర్వహించింది. ఈ రీసెర్చ్ లో ట్రెండ్ రివర్స్ గా నమోదైంది. కస్టమర్ మన్ననలను పొందడంలో రిలయన్స్ జియో అత్యధిక స్కోర్ నమోదుచేసిందని, ఇంక్యుబెంట్లను మించి కస్టమర్ సర్వీసు, అనుకూలత, డేటా కవరేజ్, డేటా స్పీడ్, హ్యాండ్ సెట్ ఛాయిస్ లో ఇది మంచి పేరును సంపాదించుకుంటుందని వెల్లడైంది. జియో ఉచిత ఆఫర్లను చాలామంది మెచ్చుకుంటారని కానీ వాయిస్ క్వాలిటీ, ఛార్జీల బాదుడు విషయంతో చాలామంది తమ ప్రైమరీ ఆపరేటర్ కు వెళ్తారని చెప్తారేమో అనుకున్నామని బెర్న్ స్టెయిన్ తెలిపింది. కానీ రీసెర్చ్ లో ట్రెండ్ రివర్స్ గా నమోదైనట్టు పేర్కొంది. వాయిస్ క్వాలిటీ, వాయిస్ కవరేజ్ లో వొడాఫోన్, ఐడియాలను మించి జియో మంచి ప్రదర్శనను కనబర్చిందని రీసెర్చ్ వెల్లడించింది. నెలకు రూ.303 ఛార్జీ వసూల చేయడం ప్రారంభించిన తర్వాత కూడా 67 శాతం మంది యూజర్లు తాము కలిగిన ఉన్న జియో సెకండరీ సిమ్ ను అలాగే వాడుతామని పేర్కొన్నారు. వారిలో 63శాతం మంది కొత్త ప్రైమరీ ఆపరేటర్ గా తమ జియోను మార్చుకోవాలనేది ప్లాన్ అని చెప్పారు. మిగతా 28 శాతం మంది సెకండ్ సిమ్ గానే జియోను కొనసాగిస్తామని పేర్కొన్నారు. కేవలం 2 శాతం మంది జియో యూజర్లు మాత్రమే తమ సిమ్ వాడకాన్ని నిలిపివేస్తామని తెలిపారు. అది కూడా జియోకు సమానంగా మార్కెట్లో ఉన్న ఇతర టెల్కోలు ఆఫర్లిస్తే వాటిని వాడతామని చెప్పారు. జియో ఛార్జీల వసూల బాదుడు తర్వాత ఎంత మంది ఆ సిమ్ ను వాడతారనే దానిపైనే ఈ రీసెర్చ్ ఎక్కువగా ఫోకస్ చేసింది. ఈ రీసెర్చ్ లో కూడా ఉచిత ఆఫర్లను ఇవ్వకపోయినా కస్టమర్ల మన్ననలను జియోకు అలాగే ఉంటాయని వెల్లడైంది. మొత్తం వెయ్యిమంది శాంపుల్స్ డేటాతో బెర్న్ స్టెయిన్ ఈ రీసెర్చ్ ను చేపట్టింది. రీసెర్చ్ లో పాల్గొన్న వారిలో 40 శాతం మంది మెట్రో సిటీలకు చెందిన వారు కాగ, 30 శాతం మంది ఏ-సర్కిల్స్, 20 శాతం మంది బి-సర్కిల్స్, 10 శాతం మంది సీ-సర్కిల్స్ కు చెందిన వారు. -
బీఎస్ఈ ఐపీవోకి తొలి రోజు 50% సబ్స్క్రిప్షన్
దాదాపు రూ. 1,243 కోట్ల సమీకరణ కోసం బీఎస్ఈ తలపెట్టిన ఇనీషియల్ పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ఆఫర్ తొలి రోజున 50 శాతం సబ్స్క్రయిబ్ అయ్యింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) గణాంకాల ప్రకారం 54,30,204 షేర్లకు బిడ్స్ వచ్చాయి. జనవరి 25న ఐపీవో ముగియనుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్లలో 86 శాతానికి, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ (క్యూఐబీ) విభాగానికి 17 శాతం, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగానికి 12 శాతం బిడ్లు దాఖలయ్యాయి. బీఎస్ఈ ఐపీవో ధరల శ్రేణి రూ. 805–806గా ఉంది. రూ. 2 ముఖ విలువ గల 1.54 కోట్ల షేర్లను సంస్థ విక్రయిస్తోంది. ఈ షేర్లు ఎన్ఎస్ఈలో లిస్ట్ కానున్నాయి. -
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఐపీవో..
తొలిరోజు 16% సబ్స్క్రిప్షన్ న్యూఢిల్లీ: ప్రముఖ ప్రైవేటు బీమా కంపెనీ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ప్రారంభమైన సోమవారం 16 శాతం సబ్స్క్రయిబ్ అయ్యింది. దేశంలో పబ్లిక్ ఇష్యూ జారీచేసిన తొలి బీమా కంపెనీ ఇదే. రూ. 6,057 కోట్ల సమీకరణకు 13.24 కోట్ల షేర్లు ఈ మెగా ఐపీఓ ద్వారా జారీచేస్తుండగా, సోమవారం సాయంత్రానికి 2.09 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన కోటాలో 6 శాతం, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల కోటాలో 4 శాతం సబ్‌స్క్రయిబ్‌కాగా, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఇప్పటివరకూ వారి కోటాలో 25 శాతం వాటాకు బిడ్స్ వచ్చాయి. ఈ ఐపీఓ బుధవారం ముగుస్తుంది. రూ. 300-334 ప్రైస్‌బ్యాండ్‌తో ఈ ఆఫర్ జారీఅయ్యింది. -
ఈక్విటాస్ ఐపీఓకు 17 రెట్లు సబ్స్క్రిప్షన్
ముంబై: చిన్న ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి లెసైన్సు కలిగిన ఈక్విటాస్ హోల్డింగ్స్ ఐపీఓకు భారీ స్పందన లభిం చింది. ఐపీఓ చివరిరోజైన గురువారంనాటికి 17.21 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది. రూ. 109-110 ప్రైస్‌బ్యాండ్‌తో 13.91 కోట్ల షేర్లను జారీచేస్తుండగా, 239 కోట్ల షేర్లకు రూ. 37,000 కోట్ల విలువైన బిడ్స్ రావడం విశేషం. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 1.31 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయ్యింది.